నేడే ‘చలో పోతిరెడ్డిపాడు’
నగరి : తాగు, సాగునీటి అంశంలో రాయలసీమకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహాన్ని తిప్పికొట్టే ఉద్దేశంతో గురువారం చేపట్టిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఆర్కేరోజా పిలుపునిచ్చారు. బుధవారం ఆమె మాట్లాడుతూ హెడ్ రెగ్యులేటర్ అంశంలో రాయలసీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ‘చలో పోతిరెడ్డిపాడు’ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, వైఎస్‌ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తెన పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


