సంప్రదాయాల విలువలు పెంచండి
నారాయణవనం: భవిషత్తుకు దారి చూపే వృత్తి విద్యలతో సమానంగా కుటుంబ, దేశ సంప్రదాయాలకు విలువలు పెంచేలా యువ ఇంజినీర్లు కృషి చేయాలని అశోకరాజు అన్నారు. సిద్ధార్ధ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా బుధవారం ట్రెడిషనల్(సంప్రదాయ) డే నిర్వహించారు. చైర్మన్ నుంచి విద్యార్థులు వరకు భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో కళాశాలకు విచ్చేశారు. అధ్యాపకులకు విద్యార్థులకు తంబోల, ఫొటో కాంపిటీషన్, మిస్టర్ అండ్ మిసెస్ పోటీలను నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి షీల్డ్‌లు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాలల చైర్మన్ అశోకరాజు మాట్లాడుతూ పూర్వం మన పెద్దలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించారని తెలిపారు. ఆధునిక, పాశ్చాత్య దేశాల పోకడలతో సంప్రదాయాల విలువలు తగ్గుముఖం పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక, నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


