హోల్‌స్టీన్ ఫ్రైసియన్, సాహివాల్ జాతుల కలయికతో రూపొందిన సంకరజాతి కొత్త ఆవుల జాతి ‘ఫ్రైస్వాల్’ (Frieswal). ఇప్పటికి ఉన్న గోజాతులన్నిటికన్నా అత్యధికంగా ఒక ఈత కాలంలో 4 వేల కిలోల పాల దిగుబడినివ్వటం దీని ప్రత్యేకత. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్)కు అనుబంధంగా మీరట్‌లోని కేంద్రీయ పశు పరిశోధనా సంస్థ (సీఐఆర్‌సీ) మిలటరీ ఫామ్స్ సర్వీస్ సంయుక్తంగా ఈ కొత్త పాడి పశుజాతిని రూపొందించాయి. ఇందులో హెచ్.ఎఫ్. గుణాలు 62.5%, సాహివాల్ గుణాలు 37.5% ఉంటాయి. అధిక పాల దిగుబడినిచ్చే హెచ్.ఎఫ్. గుణాలతో పాటు దేశంలోని వివిధ వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు తట్టుకొని మంచి ఫలితాలను ఇవ్వగలిగిన దేశీ గోజాతి సాహివాల్ లక్షణాలను ఫ్రైస్వాల్ పుణికిపుచ్చుకుంది. ఈనిన తర్వాత 300 రోజుల్లో 4% కొవ్వు కలిగిన 4 వేల లీటర్ల పాల దిగుబడిని ఫ్రైస్వాల్ ఆవు ఇస్తుందని ఐసీఏఆర్ ప్రకటించింది.
పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచే లక్ష్యంతో ఫ్రైస్వాల్ జాతి అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా 42 మిలటరీ ఫామ్స్‌లో పరిశోధనలు జరిగాయి. సైనికులకు మేలైన పాలను అందించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటైన మిలటరీ డెయిరీ ఫామ్స్ సరికొత్త సంకరజాతి గోజాతుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. కొత్త పశు జాతిని అభివృద్ధి చెయ్యటం కోసం శాస్త్రవేత్తలు సుమారు 4 దశాబ్దాల పాటు శ్రమించారు. 1984 సెప్టెంబర్ 4న ప్రారంభమైన ఫ్రైస్వాల్ పరిశోధనలు కొద్ది నెలల క్రితమే పూర్తయ్యాయి. ఈ పరిశోధన ప్రాజెక్టు కోసం రూ. 800 కోట్లు ఖర్చయ్యాయి. ఈ బ్రీడ్ ఆవులు తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. చాలా సంవత్సరాల నుంచి ‘హెచ్‌ఎఫ్ సాహివాల్’ అనే పేరుతో ఈ ఆవులు రైతులకు అందుబాటులో వున్నాయి. అయితే ఈ బ్రీడ్‌కు కొత్తగా ‘ప్రైస్వాల్’ అని పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఇదీ చదవండి: పొట్టి ఆవులు గట్టి మేలు!
20 ఏళ్ల స్టార్‌డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం


