'మిట్టి దీదీ': విషరహిత విత్తనాల కోసం..! | Nirmal Dist DRDO Vijayalakshmi Collector Abhilasha Abhinav Designed New Program. | Sakshi
Sakshi News home page

'మిట్టి దీదీ': విషరహిత విత్తనాల కోసం..!

Mar 21 2025 10:02 AM | Updated on Mar 21 2025 10:02 AM

Nirmal Dist DRDO Vijayalakshmi Collector Abhilasha Abhinav Designed New Program.

బిడ్డ ఎదుగుదలకు తోడ్పడే పోషకాలన్నీ కలిపి అమ్మచేతి గోరుముద్ద రూపంలో బుజ్జాయి బొజ్జలోకి వెళ్తాయి. అలాంటి అమ్మ చేతి ముద్దలో ఉండే ఆహారం రసాయనాలతో నిండితే.. భవిష్యత్తు తరం ఏమవుతుందోనన్న ఆలోచనే ఓ వినూత్న కార్యక్రమానికి పురుడు పోసింది. ఒకప్పటి విష రహిత దేశీ విత్తనాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాలన్న లక్ష్యంతో నిర్మల్‌ జిల్లాలో డీఆర్డీఓ విజయలక్ష్మి తమ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సహకారంతో సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. గురువారం నిర్మల్‌ కలెక్టరేట్‌లో మహిళా అధికారులు, మహిళా రైతులు, మహిళా సంఘాల సభ్యులు అందరూ కలిసి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వాక్‌ ఫర్‌ దేశీ సీడ్‌...
‘మన విత్తనం – మన భవిష్యత్తు‘ అన్న ట్యాగ్‌ లైన్‌తో ‘వాక్‌ ఫర్‌ దేశీ సీడ్‌‘ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురాతన దేశీ విత్తనాలను సేకరించి, వాటిని భవిష్యత్‌ తరాలకు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం జిల్లా అధికారులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో ఇప్పటికీ సాగులో ఉన్న దేశీ విత్తనాలను సేకరించారు. 

వరి, పప్పు దినుసులతో పాటు కూరగాయలలోనూ అందుబాటులో ఉన్న దేశీ సీడ్‌ రకాలను తెప్పించారు. బహురూపి వంటి అరుదైన రకాలను సేకరించారు. జిల్లాలో ఆరువేల మంది సభ్యులుగా  ఉన్న ‘మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ‘లో ఆధ్వర్యంలో వీటిని సాగు చేయించడం మరో ప్రత్యేకత. ముందుగా 20ఎకరాలలో 200 మంది మహిళ రైతులతో దేశీ విత్తనాలతో సాగు చేయించాలని నిర్ణయించారు. ఇలా సాగుచేసిన పంటలను సైతం తిరిగి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ కొనుగోలు చేస్తాయి. పెరటి తోటల పెంపకంపై ఆసక్తి గల వారికి సైతం దేశీ విత్తనాలు అందిస్తామని చెబుతున్నారు.

మిట్టి దీదీ...
ఎంతటి విత్తనమైనా మట్టి బాగుంటేనే బతికి బట్ట కడుతుంది. అందుకే ఈ మహిళా అధికారులు కేవలం దేశీ విత్తనాలనే కాకుండా.. మట్టిని సైతం పరీక్షించిన తర్వాతే సాగు చేయాలన్న మరో లక్ష్యాన్ని ముందుకు తీసుకొచ్చారు. ‘భూసార పరీక్ష – నేలతల్లికి రక్ష‘ ట్యాగ్‌ లైన్‌ తో ‘మిట్టి దీదీ‘ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. 

ఇందులో ఏఐ టెక్నాలజీ కలిగిన ఫార్మోసిస్‌ యంత్రంతో భూసార పరీక్షలను చేసి అప్పటికప్పుడే అక్కడ ఎలాంటి పంటలు పండిస్తే బాగుంటాయో చెప్పేస్తారు. ఇలా భూసార పరీక్షలు చేయడం కూడా మహిళ రైతు ఉత్పత్తిదారుల సంఘాలే చేయనుండటం విశేషం.
– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్‌

దేశీ విత్తనాలు కాపాడుకోవాలని...
ప్రస్తుత పరిస్థితులలో ఆర్గానిక్‌ ఆహారం పైన చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అధిక ధరలు ఉండటంతో ΄ాటు తక్కువ మొత్తంలో లభ్యమవుతుండటం ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో మహిళా రైతులను ్ర΄ోత్సహించడంతో΄ాటు మనవైన దేశీ విత్తనాలను ముందు తరాలకు అందించాలన్న ఉద్దేశంతో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ గారి సహకారంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. 
– విజయలక్ష్మి, డీఆర్డీఓ, నిర్మల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement