నల్ల తామర డిజిటల్‌ అరెస్ట్‌! | Digital Tools to Control Black Thrips in Chilli Crops | Expert Guide in Telugu | Sakshi
Sakshi News home page

Black Thrips నల్ల తామర డిజిటల్‌ అరెస్ట్‌!

Oct 1 2025 10:21 AM | Updated on Oct 1 2025 11:24 AM

Sagubadi Chilli black thrips management How to control

మిరప పంటకు నల్ల తామర పురుగుల బెడద చాలా ఎక్కువ. మిరపతోపాటు, పత్తి, మిర్చి, కంది,మినుములు, మామిడి, పుచ్చకాయ, తదితర పంటలను దెబ్బతీస్తుంది. అతి చిన్నగా ఉండే నల్ల తామర రైతులను విపరీతంగా  నష్టాల ఇవీ డిజిటల్‌ సాధనాలు  పాలు చేస్తోంది. అయితే,ఆధునిక డిజిటల్‌ ఉపకరణాల సహాయంతో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ మిరప పంటను ఆశించే తామర పురుగును జీవన పురుగు మందులతో కట్టడి చేసే పద్ధతులపై యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల నిపుణులు  ప్రచారోద్యమం చేపట్టారు. విశేషం  ఏమిటంటే...  డిజిటల్‌ సమాచారం అంతా తెలుగులోనే అందించటం.  సుస్థిర వ్యవసాయ కేంద్రం  సీనియర్‌ శాస్త్రవేత్త  డా. జి. చంద్రశేఖర్‌ అందించిన సమగ్ర సమాచారం  ఇక్కడ పొందుపరుస్తున్నాం...

మరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొదటి స్థానంలో.. తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుంటూరు మిర్చి యార్డ్‌ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్‌. ఇది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మిర్చి ధరలను ప్రభావితం చేస్తుంది. 2021లో ఆంధ్రప్రదేశ్‌లో మిరప పంటను తీవ్రంగా నష్టపరిచే కొత్త నల్ల తామర (బ్లాక్‌ త్రిప్స్‌-Black Thrips) జాతి పురుగులు వెలుగులోకి వచ్చాయి. దీని శాస్త్రీయనామం ‘త్రిప్స్‌ పార్విస్పినస్‌. దీన్ని సాధారణంగా ‘చిల్లీ బ్లాక్‌ త్రిప్స్‌’ అని పిలుస్తారు. అతి తక్కువ సంవత్సరాల్లోనే దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇది విస్తరించింది. ఆగ్నేయాసియా నుంచి ఉద్భవించిన  చీల్చి రసం పీల్చే పురుగు ఇది. 

2015 నాటికి అనేక రాష్ట్రాలకు పాకింది. ఈ పురుగులు కణజాలాలను తినే ముందు లేత ఆకులు, పువ్వులను చీల్చివేస్తాయి. ముఖ్యంగా పువ్వు చీలికలు, పండ్ల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. విషయానికి వస్తే, ఇది  పాలిఫాగస్‌ పురుగు. అంటే, ఇది వివిధ రకాల వృక్ష జాతులను ఆహారంగా తీసుకోగలదు. మిరపతో పాటు, పత్తి, మిర్చి, కంది, మినుములు, మామిడి, పుచ్చకాయ, తదితర పంటలను దెబ్బతీస్తుంది.

పంట నష్టం 85 నుంచి 100 వరకు!
2022లో ఆరు దక్షిణాది రాష్ట్రాల్లో మిరప పంటను గణనీయంగా దెబ్బతీసింది. తీవ్రంగా ప్రభావితమైన ్ర΄ాంతాల్లో అంచనా నష్టాలు 85 నుండి 100% వరకు ఉన్నాయి. ఊహించని విధంగా నష్టాన్ని కలిగిస్తున్న కారణంగా రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి రసాయన పురుగుమందులను ప్రయోగించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా, తదనంతరం నిరుపయోగంగా మారింది. అదనంగా, నల్లతామర ఆశించిన మిరప కాయలకు మార్కెట్‌లో తక్కువ ధరలు రావటంతో చాలా మంది రైతులు నష్టాల పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన సెంటర్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బయోసైన్సెస్‌ ఇంటర్నేషనల్‌ (సీఏబీఐ) అనే సంస్థ హైదరాబాద్‌లోని సుస్థిర వ్యవసాయ కేంద్రంతో కలిసి తెలంగాణలో మిరపని ఆశించే నల్ల తామర పురుగులపై సీఏబీఐ డిజిటల్‌ టూల్స్‌ ఉపయోగించడం ద్వారా మిరపలో నల్ల తామర పురుగును నివారించడానికి ఒక ప్రచారోద్యమం మొదలు పెట్టింది.  

జయశంకర్‌ భూమిరప పంటకు నల్ల తామర పురుగుల బెడదచాలా ఎక్కువ. మిరపతోపాటు, పత్తి, మిర్చి, కంది,మినుములు, మామిడి, పుచ్చకాయ, తదితర పంటలను దెబ్బతీస్తుంది. అతి చిన్నగా ఉండే నల్ల తామర రైతులను విపరీతంగా  నష్టాల ఇవీ డిజిటల్‌ సాధనాలు  పాలు చేస్తోంది. అయితే,ఆధునిక డిజిటల్‌ ఉపకరణాల సహాయంతో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ మిరప పంటను ఆశించే తామర పురుగును జీవన పురుగు మందులతో కట్టడి చేసే పద్ధతులపై యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల నిపుణులు  ప్రచారోద్యమం చేపట్టారు. 

విశేషం  ఏమిటంటే...  డిజిటల్‌ సమాచారం అంతా తెలుగులోనే అందించటం.  సుస్థిర వ్యవసాయ కేంద్రం  సీనియర్‌ శాస్త్రవేత్త  డా. జి. చంద్రశేఖర్‌ అందించిన సమగ్ర సమాచారం  ఇక్కడ పొందుపరుస్తున్నాం...లపల్లి, జోగుళాంబ గద్వాల్, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో మిరప పండించే కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని వేలాది మంది రైతులకు సేవలందించే లక్ష్యంతో ఈ ఖరీఫ్‌ కాలంలో ప్రచారోద్యమం జరుగుతోంది. దీనిలో భాగంగా జులై 9న హైదరాబాద్‌ హబ్సిగుడాలో మిరప పంట పండిస్తున్న రైతులు, శాస్త్రవేత్తలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, స్పైసెస్‌ బోర్డు ప్రతినిధి, అపెడా ప్రతినిధి, నాబార్డ్‌ ప్రతినిధి, శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం ప్రతినిధి, యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌– రాయచూరు ప్రతినిధి, డి డి ఎస్‌ కృషి విజ్ఞాన కేంద్రం– జహీరాబాద్‌ ప్రతినిధి, బయో పెస్టిసైడ్స్‌ తాయారీదారులు, ్ర΄÷ఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా విశ్వవిద్యాలయ బయో కంట్రోల్‌ యూనిట్‌ ప్రతినిధి, సీఏబీఐ ప్రతినిధులతో వర్క్‌షాప్‌ జరిగింది. 

గత సంవత్సరం రాయచూరులోని యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు గత సంవత్సరం మిరపలో నల్లతామరపై తాము నిర్వహించిన ప్రచారోద్యమంతో రైతులకు కలిగిన ప్రయోజనాలను వివరించారు. ఉద్యానవనశాఖ నిర్దేశకులు బాబు మాట్లాడుతూ నల్లతామరను నివారించే మార్గాలు వివరించారు. ఈ క్యాంపెయిన్‌కు ఉద్యాన శాఖ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రచారోద్యమం 
ఈ క్యాంపెయిన్‌ ద్వారా 1000 ఎకరాలలో మిర్చి పండించే 2000 మంది రైతులు ఈ పద్ధతులకు సలహాలు అందిస్తున్నారు. రైతుల ప్రదర్శన క్షేత్రాలను చూసే మిగతా రైతులు కూడా ఈ పద్ధతులు ΄ాటించే అవకాశం ఉంటుంది. అలాగే ΄ోస్టర్స్, మీడియా ద్వారా ఎక్కువ మందికి ఈ క్యాంపెయిన్‌ ద్వారా చైతన్యం కలిగిస్తున్నారు. 

చదవండి: సెంటర్‌స్టోన్‌ డైమండ్‌రింగ్‌, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?

పంటలకు మేలు చేసేవి కూడా..!
తామర పురుగులు (త్రిప్స్‌) రెక్కలు కలిగిన చిన్న కీటకాలు. తామర పురుగులలో అనేక జాతులు ఉన్నాయి. నల్ల తామర పురుగులు ఉల్లి, టమోటో, స్ట్రాబెర్రీ, ద్రాక్ష సహా వివిధ పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. మరికొన్ని త్రిప్స్‌ జాతులు ఇతర పురుగులను తినటం ద్వారా వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుస్తాయి కూడా! 

తామర పురుగులు మొక్కల బయటి  పొరను చీల్చుకుని అందులోని పదార్థాలను తినడం ద్వారా మొక్కలను దెబ్బతీస్తాయి. త్రిప్స్‌ జాతులు చూడటానికి  భిన్నంగా ఉంటాయి. జాతిని బట్టి, జీవిత దశను బట్టి ఇవి వివిధ రంగుల్లో లభిస్తాయి. పిల్ల పురుగు(లార్వా)లు సాధారణంగా పారదర్శకంగా, పెద్దవాటి కంటే చిన్నవిగా ఉంటాయి. చాలావరకు పెద్ద తామర పురుగులు పొడవాటి, సన్నని రెక్కలతో, అంచులలో చిన్న వెంట్రుకలను కలిగి ఉంటాయి. గుడ్లు సాధారణంగా  పొడుగ్గా ఉంటాయి. మూత్రపిండాల ఆకారంలో కనిపిస్తాయి. ఉష్ణమండలంలో నివసించే త్రిప్‌ జాతులు సాధారణంగా సమశీతోష్ణ వాతావరణంలో కంటే పెద్దవిగా పెరుగుతాయి. 

జాతిని, వాతావరణ అనుకూలతను బట్టి తామర పురుగులు వేగంగా సంతానోత్పత్తి చెయ్యగలవు. సంవత్సరానికి ఎనిమిది తరాల వరకు వీటి సంతతి పెరుగుతుంది. ఆడ త్రిప్స్‌ అతిథేయ (హోస్ట్‌) మొక్కల ఆకులపై గుడ్లు పెడతాయి. లార్వా  పొదిగిన తర్వాత ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తుంది. లార్వా పెద్దది పురుగు కావడానికి నాలుగు దశల్లో పురోగమిస్తుంది. వెచ్చని వాతావరణంలో యుక్త వయస్సు వరకు పురోగతి వేగంగా ఉంటుంది. శీతాకాలంలో వీటి సంఖ్య సాధారణంగా తగ్గుతుంది. మొక్కల లోపల ద్రవాలను పీల్చుకోడానికి లోపలికి చొచ్చుకుపోతాయి. పండ్లు, ఆకులు, రెమ్మలను ఆశిస్తాయి. త్రిప్స్‌ పెద్ద మొత్తంలో పంటని ఆశించినప్పుడు, పంట పెరుగుదల, దిగుబడి తగ్గి΄ోతుంది. ఇవి చాలా పెద్ద చెట్ల జాతులపై కూడా దాడి చేయగలవు. ఐతే సాధారణంగా పండ్లు, కూరగాయల చెట్లు వీటి తాకిడికి తట్టుకోలేవు. పెద్ద చెట్లు కొంత వరకు తట్టుకుంటాయి. తామరపురుగులు వేరుశనగలో మొవ్వు కుళ్ళు (బడ్‌ నెక్రోసిస్‌), టొమాటో–స్పాటెడ్‌ విల్ట్‌ కలిగించే వైరస్‌లను వ్యాపింపజేస్తాయి.

ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌ : ఐశ్వర్యా డాజ్లింగ్‌ లుక్‌ వెనుకున్న సీక్రెట్‌ ఇదే!

నల్లతామర యాజమాన్య పద్ధతులు:

  • తామర పురుగులు నేలపై పడ్డ వ్యర్ధపదార్ధాల్లో జీవిస్తూ పంటలను ఆశిస్తుంటాయి. కాబట్టి పంట వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తీసేయడం మంచిది. 

  • సూర్యకాంతి పరావర్తనం చెందే మల్చింగ్‌ షీట్‌లను బెడ్స్‌ మీద వాడటం ఉపయోగకరం.
    నీలం రంగు జిగురు అట్టలను ఏకరానికి 20 వరకు ఏర్పాటు చేసుకోవాలి. ఇవి పురుగులతో నిండగానే ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. 

  • సహజ శత్రువులైన అల్లిక రెక్కల పురుగు(లేస్‌ వింగ్‌ బగ్స్‌)లు, అతిచిన్న పైరేట్‌ బగ్స్, పరాన్న భుక్కు నల్లులు (ప్రిడేటరీ మైట్స్‌)ను రక్షించుకోవడం అవసరం.

  • వేప నూనె 3% తామర పురుగులకు వికర్షణను కలిగిస్తుంది. పునరుత్పత్తి చక్రాలకు అంతరాయం కలిగిస్తుంది.  

  • బ్యువేరియా బ్యాసియానా, మెటార్హిజియం అనిసోప్లియె అనే శిలీంద్రాలు తామరపురుగులకు రోగాన్ని కలుగజేయటం ద్వారా పంటలను రక్షిస్తాయి. ఇవి బజారులో దొరుకుతున్నాయి.

మొబైలు ఫోన్‌  ద్వారా సమాచారం
ఈ డిజిటల్‌ యుగంలో అనేక సంస్థలు డిజిటల్‌ సలహాలను, సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నాయి. వీటివల్ల రైతులకు సరైన సలహాలు సరైన సమయంలో మొబైల్‌ ఫోన్‌ ద్వారా అందుబాటులో ఉండటం వల్ల తన దైనందిన కార్యక్రమాలకు అంతరాయం లేకుండా రైతు సమాచారాన్ని  పొందుతున్నారు. ఇటువంటి డిజిటల్‌ సాధనాల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన సెంటర్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బయోసైన్సెస్‌ ఇంటర్నేషనల్‌ (సీఏబీఐ) అందుబాటులోకి తెచ్చిన డిజిటల్‌ సాధనాలు 27 దేశాలలో సేవలు అందిస్తున్నాయి. సీఏబీఐ అంతర్జాతీయ లాభాపేక్ష లేని, వంద సంవత్సరాలకు పైగా చీడపీడల యాజమాన్యంలో అనుభవమున్న సంస్థ. ఈ డిజిటల్‌ సాధనాలు మనదేశంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది హైదరాబాద్‌ లో గల సుస్థిర వ్యవసాయ కేంద్రంతోపాటు అనేక వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ జ్ఞానాన్ని రైతులకు అందిస్తున్నారు. ఈ డిజిటల్‌ సాధనాలను రైతులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. విజ్ఞాన పరంగా పరీక్షించి, నిరూపించబడిన, బజారులో లభ్యమౌతున్న ఉత్పత్తుల వివరాలు లభ్యమౌతాయి.  ఇతర వివరాలకు... www.cabi.org 

ఇవీ డిజిటల్‌ సాధనాలు
సీఏబీఐ వివిధ భాగస్వాములతో కలిసి పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ డెసిషన్‌ గైడ్‌ (పీఎండీజీ) అభివృద్ధి చేసింది, ఇది త్రిప్స్‌  పార్విస్‌పినస్‌ను గుర్తించడం, సురక్షితమైన యాజమాన్యంపై సలహాలను అందిస్తుంది. దేశంలో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న అనేక బయోపెస్టిసైడ్స్‌ను సూచిస్తున్నారు. పీఎండీజీ ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం భాషలలో రైతులకు, విస్తరణ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాయి. విస్తరణ అధికారులు, విద్యార్ధులు, శిక్షకులు, రైతులు, పరిశోధకులు ఈ కింది సీఏబీఐ డిజిటల్‌ సాధనాలను ఉపయోగించి డిజిటల్‌ సలహాలు తెలుసుకుంటున్నారు. వీటిని సమర్థవంతంగా, ఉపయోగించడం ద్వారా నల్ల తామర పురుగును అరికట్టే మార్గాలపై సమాచారాన్ని ఎవరైనా పొందదవచ్చు.

బయో ప్రొటెక్షన్‌  పోర్టల్‌...: తెగులును నిర్వహించడానికి స్థానికంగా లభించే బయోపెస్టిసైడ్స్‌ గురించి సమాచారం కోసం ఇక్కడ స్కాన్‌ చేయండి.


క్రాప్‌ స్ప్రేయర్‌ యాప్‌...: స్ప్రేయర్‌ పరిమాణాన్ని బట్టి పురుగు మందు/ బయోపెస్టిసైడ్‌ మోతాదు ఎంత వాడాలి అన్నది తెలుసుకోవడం కోసం ఇక్కడ స్కాన్‌ చేయండి 

.
ఫ్యాక్ట్‌షీట్‌ యాప్‌/నాలెడ్జ్‌ బ్యాంక్‌...  సమర్థవంతంగా చీడపీడల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి సమాచారాన్ని ఇక్కడ స్కాన్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవటం ద్వారా తెలుగు తదితర భాషల్లోనూ ΄ పొందవచ్చు.  

నిర్వహణ: పంతంగి రాంబాబు 
సాక్షి సాగుబడి డెస్క్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement