
తెలుగు రాష్ట్రాల్లో 20 లోపే..
జీఐ గుర్తింపు పొందిన తెలంగాణ ఉత్పత్తులు: 17 ఉత్పత్తుల్లో 1 వ్యవసాయం, 1 ఆహారోత్పత్తి, 15 హస్తకళాకృతులు ఉన్నాయి. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిల్‌గ్రీ, నిర్మల్ బొమ్మల – క్రాఫ్ట్, నిర్మల్ ఫర్చీచర్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హలీం, చేర్యాల పెయింటింగ్స్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, సిద్ధిపేట గొల్లభామ చేనేత చీరలు, నారాయణపేట చేనేత చీరలు, బనగానపల్లె మామిడి, ఆదిలాబాద్ డోక్ర, వరంగల్ దుర్రీస్, తాండూరు కంది.2004వ సంవత్సరంలో 3 భౌగోళిక గుర్తింపులతో భారత్ జీఐ ట్యాగ్‌ల నమోదు ప్రారరంభ మైంది. 2024లో ఇది 643కు చేరింది. 2023–24లో అత్యధికంగా జీఐ పొందిన హస్తకళాకృతులు 85 కాగా, వ్యవసాయ ఉత్పత్తుల సంఖ్య 48. ఆహారోత్పత్తులు 19 మాత్రమే.
ఆంధ్రప్రదేశ్ జీఐ ఉత్పత్తులు: 19 ఉత్పత్తుల్లో 4 వ్యవసాయం, 1 ఆహారోత్పత్తి, 11 హస్తకళాకృతులు, 3 మానుఫ్యాక్చర్డ్–నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. శ్రీకాళహస్తి కలంకారీ, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారీ, బుడితి బెల్ – బ్రాస్ క్రాఫ్ట్, ఏపీ లెదర్ పప్పెట్రీ, ఉప్పాడ జాందాని చీరలు, తిరుపతి లడ్డు, గుంటూరు సన్న మిరప, వెంకటగిరి చీరలు, బొబ్బిలి వీణ, మంగళగిరి చీరలు–వస్త్రాలు, ధర్మవరం చేనేత పట్టు చీరలు– పాపడాలు, బందరు లడ్డు, ఉదయగిరి వుడెన్ కట్లెరీ, బనగానపల్లి మామిడి, దుర్గి స్టోన్ కార్వింగ్స్, ఏటికొప్పాక బొమ్మలు, ఆళ్లగడ్డ స్టోన్ కార్వింగ్స్, అరకు వ్యాలీ అరబిక కాఫీ.
643 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు
2004–2024 మధ్యకాలంలో జీఐ గుర్తింపు పొందిన వాటిలో హస్తకళాకృతులు 54%, వ్యవసాయ ఉత్పత్తులు 31%, తయారీ, సహజ వస్తువులు 8%, ఆహారోత్పత్తులు 7% ఉన్నాయి. ఉత్తర భారత దేశానికి చెందిన జీఐ గుర్తింపు ఉన్న బాస్మతి బియ్యానికి అధిక ధర వస్తుంది, సాధారణ బాస్మతి బియ్యంతో పోల్చితే. అదేవిధంగా కేరళలో జీఐ గుర్తింపు ΄పొందిన దేశీ బియ్యం రకాల సాగుదారులకు అధికాదాయం వస్తోంది. మన దేశంలో గత 20 ఏళ్లలో మొత్తం 643 ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపులు పొందగా, అందులో 200 వ్యవసాయోత్పత్తులే. ఆహారోత్పత్తులు 47, హస్తకళాకృతులు 343, మానుఫ్యాక్చర్డ్, నేచురల్ గూడ్స్ 53 ఉన్నాయి. అత్యధిక జీఐలు పొందిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 74 (11.51%). ఇందులో ఎక్కువ భాగం హస్తకళాకృతులే. తమిళనాడులో జీఐ పొందిన 59 (9.18%) ఉత్పత్తుల్లో హస్తకళాకృతులు, ఆహారోత్పత్తులే ఎక్కువ. మహారాష్ట్రలో 49 (7.62%), కర్ణాటకలో 44 (6.84%), కేరళలో 35 (5.44%) వస్తువులకు 2024లో జీఐ లభించింది. గత 20 ఏళ్లలో దేశంలో 2024 నాటికి 643 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 19, తెలంగాణలో17 ఉత్పత్తులకు మాత్రమే జీఐ గుర్తింపు దక్కింది.
ప్రపంచవ్యాప్తంగా 8,86,708 ఉత్పత్తులకు
జీఐ2017–23 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 8,86,708 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. 2017లో అత్యధికంగా జీఐల నమోదు జరిగింది. ఆ తర్వాత కాలంలో హస్తకళాకృతులు, వైన్స్, స్పిరిట్స్, సేవలు, తదితర అన్ని విభాగాల్లోనూ తగ్గుదల నమోదైంది. అయితే, వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల సంఖ్య మాత్రం 2017–2023 మధ్య 23.9% పెరిగింది. ఈ కాలంలో జీఐ గుర్తింపు ΄÷ందిన వైన్స్, స్పిరిట్స్ 59.64% (5,28,832) ఉండగా, వ్యవసాయ ఉత్పత్తులు 3,37,008 (38.01%) ఉన్నాయి. హస్తకళాకృతులు 11,538 (1.3%) ఉన్నాయి. 2023లో అత్యధికంగా చైనా 9,785 జీఐలతో అగ్రస్థానంలో ఉండగా, అమెరికా 763తో 49వ స్థానంలో, భారత్ 530తో 52వ స్థానంలో ఉంది.
నిర్వహణ : పంతంగి రాంబాబు, సాక్షి, సాగుడి డెస్క్.