
దక్షిణాఫ్రికాలోని కల్లినన్ ప్రాంత రైతు సంఘం ప్రతి ఏటా గుమ్మడికాయల పోటీ పెడుతుంటుంది. కార్నెలి బెస్టర్ అనే రైతు ఈ ఏడాది 445 కిలోల గుమ్మడి ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నారు. ఈ అవార్డు ఆయనకు కొత్త కాదు. గత ఏడాది ఏకంగా 730 కిలోల గుమ్మడితో ఆయనే ఫస్ట్ ప్రైజ్ గెల్చుకోవటం విశేషం.
ఏడాదిలో అతిపెద్ద గుమ్మడి సైజు అంత ఎందుకు తగ్గిందో తెలీదు. బహుశా భూతాపోన్నతి కావచ్చు. అదలా ఉంచితే, 2023లో ఇంకా బరువైన గుమ్మడి కాయను పండించిన వైకస్ లాంప్రెచ్ట్ విజేతగా నిలిచారు. ఆయన గుమ్మడి కాయ బరువెంతో తెలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది.. 890 కిలోలు!
వ్యవసాయం పట్ట మక్కువను పెంపొందించే లక్ష్యం తోపాటు నిధుల సమీకరణ కోసం కల్లినన్ రైతు సంఘం ఈ వార్షిక ΄ోటీలు పెడుతుంటుంది. అట్లాంటిక్ జెయింట్ గుమ్మడితో సంకపరచిన వంగడంతో సాగు చేసిన కాయలనే ఇక్కడ పోటీలో ఉంచుతారు. పోటీ ముగిసిన తర్వాత ప్రిటోరియా నగరంలో పేదలకు ఈ గుమ్మడి కాయలను పంచుతారు!
(చదవండి: దిల్ మ్యాంగో మోర్..! నోరూరించే వెరైటీ మ్యాంగ్ డెజర్ట్స్..)