
విదేశీ ట్రెండు నుంచి సీజనల్‌గా వచ్చే పండు దాకా కాదేదీ మిక్సింగ్‌కు అనర్హం అంటున్నారు నగర నలభీములు. అసలే మామిడి సీజన్ అందులోనూ వెరైటీలు కోరుకునే నగరవాసులు.. ఇంకేం ఉంది.. నగరంలోని రెస్టారెంట్స్, కేఫ్స్, పార్లర్స్.. మ్యాంగో మానియాతో ఊగిపోతున్నాయి. పోటా పోటీగా మామిడిని రకరకాల వంటకాలకు జతచేస్తూ మెనూలను రూపొందిస్తున్నాయి. ఆ విశేషాలు ఇవిగో..
జూబ్లీ హిల్స్‌లోని లిల్లీస్ – ది బోహో కేఫ్ మామిడి ఆధారిత డెజర్ట్స్‌ను అందిస్తోంది. అలాగే కొబ్బరి పాలు, తాజా మామిడి ముక్కలు, హోమ్‌మేడ్ గ్రానోలాతో మామిడి చియా పుడ్డింగ్‌ను వడ్డిస్తోంది. బ్రియోష్ బ్రెడ్, మామిడి కంపోట్, కొబ్బరి క్రీమ్‌తో మామిడి ఫ్రెంచ్ టోస్ట్‌తో నోరూరిస్తోంది. అరటి, ఖర్జూరాలతో తయారు చేసిన మామిడి స్మూతీ బౌల్, మామిడి ఫ్రాప్పే, మామిడి ప్యాషన్, ఫ్రూట్ కూలర్ వంటి పానీయాలు కూడా అందుబాటులోకి తెచ్చింది.
పదుల సంఖ్యలో..
బంజారా హిల్స్‌లోని ఖండానీ రాజధాని ‘ఆమ్లీíÙయస్’ పేరిట అందిస్తున్న ఫుడ్ ఫెస్టివల్‌లో పదుల సంఖ్యలో మామిడి వంటకాలు కొలువుదీరాయి. కైరీ చనా దాల్ ధోక్లా, మామిడి కోఫ్తా పులావ్, మలబారి మామిడి కఢీ, మామిడి పచ్చడి, మామిడి రైతాలతో పాటుగా మామిడి జిలేబి, మామిడి బాసుందీ వంటి డెజర్ట్స్ కూడా ఇందులో భాగమే.
నాన్‌వెజ్ స్టార్టర్స్‌లో..
గచ్చిబౌలోని 3.63 డిగ్రీస్ సమర్పిస్తున్న ‘మామిడి మానియా’ ఫెస్టివల్‌లో మామిడి చికెన్ వింగ్స్, మామిడి ల్యాంబ్ చాప్స్, మామిడి క్రిస్పీ ఫిష్ వంటి స్టార్టర్లు. మామిడి దాల్, మామిడి అనాస పులావ్, మామిడి చికెన్ కర్రీ వంటి వాటితో మెయిన్ కోర్సులు, ఆమ్రస్ ఫౌంటెన్తో కూడిన డెజర్ట్స్ అందిస్తోంది.
డెజర్ట్స్, మెయిన్ కోర్సులు..
జూబ్లీహిల్స్‌లోని ప్యూర్ వెజిటేరియన్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ తత్వాలో.. ఆమ్రఖండ్, మామిడి మిలే ఫ్యూయిల్, మామిడి కులీ్ఫ, మామిడి టార్ట్ వంటి తీపి రుచులను అందిస్తున్నారు.
మాధాపూర్‌లోని వెస్టిన్ హోటల్ అందిస్తున్న ‘మామిడి బ్రంచ్’లో మామిడి గిలాఫీ, మాహీ అండ్ కచ్చే, మామిడి సుషీ, మామిడి చికెన్ సౌవ్లాకీ వంటి స్టార్టర్లు. మామిడి క్రేప్స్, దసేరి ఆమ్, ముర్గ్ కే పసందే, మామిడి చికెన్ సౌవ్లాకీ వంటి మెయిన్ కోర్స్‌లు ఉన్నాయి. అలాగే మామిడి స్రూ్టడెల్, మామిడి గటో, మామిడి శ్రీఖండ్, మామిడి పాయసం వంటి డెజర్ట్స్..ను సర్వ్ చేస్తోంది.
డియరెస్ట్..డెజర్ట్స్..
మెయిన్ కోర్సు పూర్తయ్యాక డెజర్ట్స్ తినడం అలవాటుగా మారింది. మామిడిని మేళవిస్తూ అనేక డెజర్ట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చారి్మనార్ ప్రాంతంలోని మిలన్ జ్యూస్ సెంటర్‌లో రుచికరమైన మ్యాంగో మలాయ్, కోఠిలోని జోకొలెట్ కొత్తగా పరిచయం చేసిన మ్యాంగో డెజర్ట్, జూబ్లీహిల్స్‌లోని టారో రెస్టారెంట్‌లో శాఫ్రోన్ మ్యాంగో స్టిక్కీ రైస్, జూబ్లీహిల్స్‌లోని స్పైసీ వెన్యూ అందిస్తున్న మంగమ్మ మామిడి పుడ్డింగ్, టెగర్ లిల్లీ కేఫ్ బిస్ట్రో అందిస్తున్న మామిడి రసమలై ఫ్రెంచ్ టోస్ట్, బంజారాహిల్స్‌లోని ఫెరానోజ్‌లో మామిడి క్రోసెంట్ ఫ్రెంచ్ టోస్ట్.. ఇలా నగరం నలుమూలలా మామిడి తియ్యదనం పరుచుకుని దిల్ మ్యాంగో మోర్ అనిపిస్తోంది.
ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో అంతో ఇంతో వంటకాలకు కలపడం సాధారణమే కానీ.. మ్యాంగో సీజన్‌లో భోజన ప్రియుల అభిరుచికి అనుగుణంగా మామిడి ఆధారిత వంటకాలను కలిగి ఉన్న ప్రత్యేక మెనూలను సిటీ వంటశాలలు తయారు చేస్తున్నాయి. స్టార్టర్స్‌తో మొదలుపెట్టి మెయిన్ కోర్స్, డిజర్ట్స్ దాకా.. ఆఖరికి సలాడ్‌లు కూడా వైవిధ్యభరిత వంటకాలెన్నో సిటీ రెస్టారెంట్స్‌లో సందడి చేయడం ఈ సారి విశేషంగా చెప్పొచ్చు.
(చదవండి: కనుమరుగవుతున్న మామిడి వెరైటీలు ఇవే..! దొరికితే ఆస్వాదించేయండి..)