
అధిక సాంద్రత పద్ధతిలో విత్తనోత్పత్తి చేసిరైతులకు ఇస్తున్నరాస్ కేవీకే
నీరు నిలవని ఇసుక గల ఒండ్రు నేలల్లో మునగ మంచి దిగుబడినిస్తుంది
కరువు వంటి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోవటానికి మునగ సాగు దోహద పడుతుంది. మెట్ట ప్రాంతాల్లో పండించుకోవచ్చు. మునగ కాయలతో పాటు ఆకుల పొడి, గింజల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. గొప్ప రోగ నిరోధక, ఔషధ లక్షణాల కారణంగా మునగ ఉత్పత్తులకు ఔషధ పరిశ్రమలో అధిక డిమాండ్ ఉంది. మునగ ఆకును పొడి రూపంలో లేదా గుళికలు లేదా మాత్రలుగా విక్రయిస్తారు. దీని గింజల నుండి తీసిన నూనెలను ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాల తయారీకి, వివిధ యంత్ర నూనెల తయారీకి ఉపయోగిస్తారు. 3 సంవత్సరాలలోపు ఆయిల్΄ామ్ తోటల్లో అంతర పంటగా కూడా మునగను సాగు చేసుకోవచ్చు. తిరుపతి జిల్లాలోని రాస్ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డా. ఎస్. శ్రీనివాసులు మునగ సాగుపై అందించిన వివరాలు...
మునగ (మోరింగ ఒలిఫెరా-Moringa oleifera) కరువును తట్టుకునే చెట్టు. మునగ కాయలు, ఆకులు, పువ్వులకు అధిక పోషక విలువలకు నిలయం . మునగ ఆకులు, గింజలు లేదా పండ్లు, పువ్వులు, వేర్లలో విటమిన్లు ఎ, సి, కాల్షియంతో పాటు మానవ ఆరోగ్యానికి ముఖ్యమైన అన్ని ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మునగ ఆకుల్లో నారింజలో లభించే విటమిన్ సి కంటే 7 రెట్లు ఎక్కువ,పాలలో లభించే కాల్షియం కంటే 4 రెట్లు, అరటి పండ్లలో లభించే ΄÷టాషియం కంటే 3 రెట్లుపాలలో లభించే ప్రోటీన్ కంటే 2 రెట్లు ఎక్కువ.
నీరు నిలవని నేలలు అనుకూలం
మునగ వేడి, ఉష్ణ మండల, సమశీతోష్ణ మండల ్ర΄ాంతాల్లో బాగా పెరుగుతుంది. 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత మునగ పూత రావడానికి అనుకూలం. వేడి, ΄÷డి వాతావరణం దీనికి బాగా సరి΄ోతుంది. ఈ పంట వివిధ రకాల నేలలకు అనుగుణంగా ఉంటుంది. కానీ 6.5–8.0 పీహెచ్ కలిగిన, బాగా ఇసుక గల ఒండ్రు నేలల్లో మంచి పంటనిస్తుంది. నీరు నిలవని తేలికపాటి ఇసుక లేదా లోతైన ఒండ్రు నేలలు అనుకూలం. నీరు బాగా ఇంకే నేలలు అనుకూలం. నేలను చాలాసార్లు బాగా దున్నాలి. వార్షిక రకాలకు 45“45“45 సెం.మీ. కొలతలు గల గుంతలు తవ్వాలి. ప్రతి గుంతకు 10 కిలోల కంపోస్ట్ లేదా పశువుల ఎరువు వేసి, నాటడానికి ముందు పై మట్టితో కలిపి నింపుకోవాలి. హెక్టారు భూమికి దాదాపు 1200–1500 మొక్కలను పెంచవచ్చు. వర్షాకాలంలో మొక్కలు నాటాలి. విత్తడానికి ఇది సరైన సమయం.
మన దేశంలో అనేక మునగ రకాలు ఉన్నాయి. చాలా రకాలు కాయల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి, కొన్ని కొన్ని మాత్రమే మంచి ఆకు ఉత్పత్తిని ఇస్తాయి. అధిక దిగుబడినిచ్చే వార్షిక రకాలు వాణిజ్య సాగు ఎంపిక అనుకూలం. మునగ మొక్కలను విత్తనాలు లేదా కాండపు కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. ఏక వార్షిక రకాలను విత్తన ప్రవర్ధనం చేయటం వలన బలమైన వేర్ల వ్యవస్థ అభివృద్ధి చెంది, మొక్కలు కరువును బాగా తట్టుకుంటాయి. అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన విత్తనం కోసం విశ్వసనీయ నర్సరీలను (లేదా) వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను సంప్రదించాలి. రాస్ – కేవీకే 2013–14 నుంచి అరెకరంలో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తున్న మునగ తోటలో విత్తనోత్పత్తి చేస్తోంది. రైతులకు మునగ విత్తనాలు, నారును అందిస్తోంది.
రకాన్ని బట్టి నాటే దూరం
జూలై–అక్టోబర్ మధ్య నాటవచ్చు. పూత సమయంలో వర్షాలు లేకుండా విత్తే సమయం నిర్ణయించుకోవాలి. హెక్టారుకు సుమారు 500–625 గ్రా. విత్తనాలు అవసరం. విత్తనాలను 2.5–3 సెం.మీ. లోతులో విత్తవచ్చు. మొక్కలు బాగా నిలదొక్కుకోవడం కోసం, నాటడానికి ముందు 35–40 రోజులు పాలీబ్యాగ్‌లలో 70–90 సెం.మీ. ఎత్తుకు పెంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. సాగుదారులు ఎకరానికి 1000–1250 విత్తనాలను ఒక గుంతలో 2 విత్తనాల చొప్పున ఉపయోగించవచ్చు. రకం, సాగు పద్ధతిని బట్టి నాటే దూరం మారుతూ ఉంటుంది. ఏక వార్షిక రకాల మొక్కలను 2.5“2.5 మీ. దూరంలో నాటవచ్చు. పి.కె.ఎం–1 వంటి రకం 1.5“1.0 మీ. దూరంతో అధిక సాంద్రత పద్ధతిలో నాటవచ్చు. బహువార్షిక రకాల మొక్కలను 6“6 మీటర్ల దూరంలో నాటుకోవాలి.
రెండు నెలలు విధిగా నీరు
ముఖ్యంగా పొడి పరిస్థితులలో మొదటి రెండు నెలలు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. మునగ చెట్లు కరువును తట్టుకుంటాయి, కానీ, పొడి కాలంలో ప్రతి 10–15 రోజులకు నీరు పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బిందు సేద్యం దిగుబడిని గణనీయంగా పెంచుతుంది. పూత రాలిపోకుండా ఉండాలంటే ఫిబ్రవరి–మార్చి నెలల్లో నీటిని తగ్గించాలి. కానీ, నీటి ఎద్దడిని నివారించడానికి తగినంత తేమను వుండేలా చూడాలి.
ఇదీ చదవండి: Black Thrips నల్ల తామర డిజిటల్ అరెస్ట్!
కొమ్మ చివర్లను తుంచాలి
మునగ మొక్కలు 75 సెం.మీ. ఎత్తు ఉన్నప్పుడు పెరుగుతున్న చివర్లను తుంచి వేయాలి. తద్వారా పక్క కొమ్మలు పెరుగుతాయి. ఆ పక్క కొమ్మలు 40–60 సెం.మీ పొడవుకు చేరుకున్నప్పుడు, వాటి పైభాగాన్ని తుంచి వేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతాయి. ఎక్కువ కాయలతో దిగుబడి పెరుగుతుంది. బహువార్షిక రకాల్లో ప్రతి పంట తర్వాత కొమ్మలను కత్తిరించడం వలన కొత్త కొమ్మలు వచ్చి దిగుబడి పెరుగుతుంది. ఏక వార్షిక రకాల మొదటి పంట తర్వాత, కొత్త పంటను ప్రోత్సహించడానికి చెట్లను నేల నుండి ఒక మీటరు వరకు కత్తిరించాలి. ముఖ్యంగా మొక్కలు పెరిగే ్ర΄ారంభ దశల్లో క్రమం తప్పకుండా కలుపు తీయటం చాలా అవసరం. మొక్కలు పూర్తి స్థాయిలో పెరిగి దిగుబడినిచ్చే వరకు, తక్కువ కాలవ్యవధి గల కూరగాయలతో అంతర పంటలు వేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పద్ధతి కలుపు మొక్కల నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
(మిల్లెట్స్ స్నాక్స్ ..మఖానా.. మజాకా!)
సస్యరక్షణ
కాయ తొలిచే పురుగు లేత కాయలపై గుడ్లు పెట్టి కుళ్ళిపోయేలా చేస్తుంది. కాయలను తొలచి లోపలి గుజ్జును తినేస్తుంది. గొంగళి పురుగుల వల్ల పూత, మొగ్గలు ముందుగానే రాలిపోతాయి. సోకిన మొగ్గలను సేకరించి నాశనం చేయాలి. గొంగళి పురుగు
లార్వా ఆకులను గుంపుగా తిని ఆకులు రాల్చుతాయి. బెరడు తొలచే పురుగు కాండం బెరడును తొలచి మొక్కను బలహీనపరుస్తుంది. ఆకు తినే పురుగు లార్వా మొక్కల ఆకులను తిని వాటి పెరుగుదలకు హాని కలిగిస్తుంది. తామర పురుగుల వల్ల కాయల మీద మచ్చలు ఏర్పడి నాణ్యత తగ్గుతుంది. వేరు, కాండం కుళ్లు వర్షాకాలంలో మురుగు నీరు ΄ోయే సౌకర్యం లేని నేలలో ఎక్కువగా ఆశిస్తుంది. వీటి నిర్వహణకు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం పురుగుమందులను వాడాలి.
రకం, నిర్వహణను బట్టి దిగుబడి
సాధారణంగా మొక్కలు నాటిన 6–8 నెలల్లో మొదటి పంటను పొందవచ్చు. మొక్కలకు బదులు నేరుగా విత్తనాలు వేసుకుంటే తొలి పంటకు ఒక సంవత్సరం పడుతుంది. సంవత్సరానికి రెండుసార్లు రెండు పంటలు (జూలై–సెప్టెంబర్) మరియు (మార్చి–ఏప్రిల్) వస్తాయి ప్రారంభంలో మొదటి రెండు సంవత్సరాలలో, మొక్కలు 250–300 కాయలను దిగుబడినివ్వ గలవు. తర్వాత సంవత్సరాలలో 500 వరకు పెరుగుతుంది. సంవత్సరానికి హెక్టారుకు 31 టన్నుల కాయలను ఉత్పత్తి చేయవచ్చు. అనేక హైబ్రిడ్ జాతులు సంవత్సరానికి ఒక మొక్కకు 800–1000 కాయల దిగుబడిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రకం, నిర్వహణ ఆధారంగా దిగుబడి గణనీయంగా మారుతుంది. వార్షిక రకాలు హెక్టారుకు 50–55 టన్నులను ఉత్పత్తి చేయగలవు.
– డా. ఎస్. శ్రీనివాసులు (79810 70420),
సీనియర్ సైంటిస్ట్–హెడ్, రాస్ కృషి విజ్ఞాన కేంద్రంతిరుపతి. rasskvk@gmail.com
నిర్వహణ: పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి డెస్క్