డిసెంబర్ 3, 4 తేదీల్లో కన్హా శాంతి వనంలో మహా కిసాన్ మేళా
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని ప్రసిద్ధ హార్ట్‌ఫుల్‌నెస్ సెంటర్ కన్హా శాంతి వనంలో డిసెంబర్ 3–4 తేదీల్లో మహా కిసాన్ మేళా జరగనుంది. సుస్థిర వ్యవసాయాభివృద్ధి కోసం కృషి చేసే లాభాపేక్ష లేని శాస్త్రీయ సంస్థ ఆసియన్ పీజీపీఆర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మహా కిసాన్ మేళా జరుగుతోంది.
దేశంలో ఎప్పుడూ లేని రీతిలో అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంలో జరుగుతున్న ఈ మహోత్సవంలో వేలాది మంది రైతు ప్రతినిధులు పాల్గొంటారని ఆసియన్ పీజీíపీఆర్‌ఆర్ సొసైటీ (ఇండియా చాప్టర్) అధ్యక్షులు డా. శామారావ్ తెలిపారు. ఇక్రిశాట్ ఆవరణలో గత నెలలో నిర్వహించాలని తొలుత తలపెట్టినప్పటికీ భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే ఈ కిసాన్ మేళాలో ప్రతినిధులుగా పాల్గొనేందుకు అర్హులు. ఈ నెల 20 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ (ఫీజు: రూ. వంద) సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఇదీ చదవండి: అరగంటలో రూ. 10 లక్షలు : సేల్స్‌మేన్‌కు దిమ్మ తిరిగింది
డా. నితేష్ – 98440 94168
డా. శామారావ్ జహగీర్దార్ 97406 41068.
రిజిస్ట్రేషన్, వసతి రిజర్వేషన్ నమోదు లింక్: https://eventform.in/view/apgpr


