ప్రపంచంలోనే తొలి త్రీవే హైబ్రీడ్ సజ్జ | CRISAT Announce Release of the World First Three way Pearl Millet Hybrid | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే తొలి త్రీవే హైబ్రీడ్ సజ్జ

Jan 21 2026 7:10 PM | Updated on Jan 21 2026 7:20 PM

CRISAT Announce Release of the World First Three way Pearl Millet Hybrid

అభివృద్ధి చేసిన ఇక్రిసాట్

కరువు పీడిత ప్రాంతాల్లో అధిక దిగుబడిని ఇస్తుంది. 

400 మి.మీల లోటు వర్షపాతాన్నీ తట్టుకునేలా

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఉన్న అం ర్జాతీయ పరిశోధన సంస్థ ఇక్రిసాట్ ప్రపంచం కోనే మొట్టమొదటి త్రీవే హైబ్రీడ్ సజ్జ రకం. రాచీ 273ని అభివృద్ధి చేసింది. ఈ చిరు కాన్యం కరువు పీడిత ప్రాంతాల్లో 400 ఏ.మీ.ల లోటు వర్షపాతాన్ని సైతం తట్టుకుని అధిక దిగుబడి ఇస్తుంది. అత్యంత కరువు పరిస్థి టలుండే ఉష్ణ మండలాల్లో పంటలు సాగు చేసే తులకు ఇలాంటి హైబ్రీడ్ రకం ఎంతో ప్రయో నకరంగా ఉంటుందని ఇక్రిసాట్ మంగళ కారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపిం ). ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక రల్ రీసెర్చ్). ఆర్ఎఏఆర్ ఐ (రాజస్థాన్‌ వ్యవసాయ పరిశోధన సంస్థ)ల సహకారంతో ఈ సజ్జ విత్తనాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సాధారణంగా ద్విముఖ సంకర జాతితో రూపొందే సజ్జల కంటే భిన్నంగా, త్రిముఖ జాతి లక్షణాలను కలబోసిన సంకర జాతి కావ డం దీని ప్రత్యేకత. అధిక దిగుబడి, ఎండ సహనశక్తి, మంచి మేత నాణ్యత వంటి లక్ష ణాలు ఒకేసారి లభిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల విడుదల చేసినట్లు ప్రక టించిన వాటిల్లో ఆరోచీ 273 ఒకటి. రాజ స్థాన్, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లోని అత్యంత లోటు వర్షపాతాలు ఉండే 30 ప్రదే శాల్లో 3 సంవత్సరాలుగా ఈ రకాన్ని పరీక్షలు చేసింది. ఇది హెక్టారుకు 2,230 కిలోల దిగు బడిని ఇచ్చినట్లు తెలిపింది. ప్రాంతీయ రకాల కంటే సుమారు 13 నుంచి 27% అధిక దిగుబడి ఇచ్చినట్లు గుర్తించింది. డౌనీ బూజు, బ్లాస్ట్, స్మట్ వంటి కీలక వ్యాధి నిరోధకత కూడా ఈ రకం అందిపుచ్చుకున్నట్లు తెలిపింది. పశు గ్రాసం కొరతకు కూడా ఈ రకం పరిష్కారం చూపుతుందని భావిస్తున్నారు. ఆసియా, ఆఫ్రి కాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు చిరుధా న్యాలు ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా సజ్జలు అధిక ఉష్ణోగ్రతలను, తక్కువ నీటి లభ్య తను తట్టుకోగల సామర్ధ్యానికి ప్రసిద్ధి చెం దాయని ఐక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి త్రీ వే సజ్జ రకం ఇక్రిసాట్ పరిశోధనల్లో మరో మెలురాయిగా నిలుస్తుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement