సామాజిక మాధ్యమాల్లో సెలబ్రేషన్ ఫొటోలను షేర్ చేసిన ఎన్‌ఆర్‌ఐలు
‘హ్యాపీ బర్త్ డే జగనన్నా’ హ్యాష్‌ట్యాగ్ వైరల్
వైఎస్ జగన్ పాలనలో ముఖ్యఘట్టాల ప్రత్యేక ఆడియో విజువల్ ప్రదర్శన
సాక్షి, అమరావతి / నెట్‌వర్క్ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సంబరాలు విశ్వవ్యాప్తంగా పలుచోట్ల ఘనంగా జరిగాయి. వైఎస్ జగన్ అభిమానులు, వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడిక్కడ కేక్‌లు కట్ చేసి సంబరాలు జరిపారు. అనేకమంది వర్చువల్ విధానంలో సెలబ్రేషన్స్ నిర్వహించగా.. మరికొందరు జూమ్ కాలింగ్ వంటి విధానాల ద్వారా పుట్టిన రోజు వేడుకలతో సందడి చేశారు.
పలుచోట్ల వైఎస్ జగన్ పాలనలో ముఖ్యఘట్టాల ప్రత్యేక ఆడియో విజువల్ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యూఎస్), అమెరికా ఆగ్నేయ ప్రాంతంలోని నార్త్ కరోలినా, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, కువైట్, న్యూజిలాండ్ తదితర దేశాల్లో అభిమానులు కేక్‌లు కట్‌చేసి, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
యూకేలో వేడుకలు
వైఎస్సార్‌సీపీ యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కమిటీ, వైఎస్సార్‌సీపీ మిడిల్స్‌బరో యూత్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ జనరల్ సెక్రటరీ(ఎన్‌ఆర్‌ఐ అఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా, వైఎస్సార్‌సీపీ యూకే కన్వీనర్ ఓబుల్‌రెడ్డి పాతకోట ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను మూడు యూకే నగరాలైన కోవెంట్రీ , మిడిల్స్‌బరో, షెఫీల్డ్‌లలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాలకు యూకే నలుమూలల నుండి జగన్ అభిమానులు హాజరయ్యారు. యూకేలోని ఎన్నారైలు శంతన్‌రెడ్డి, జానీ, వంశీ, రాజారెడ్డి, అనిల్, ఉదయ్, మధు, మిత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
ఫీనిక్స్, ఆరిజోనాలో..
వైఎస్సార్‌సీపీ ఫీనిక్స్ ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో ఫీనిక్స్, అరిజోనాలలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివరెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు.
కేక్ కటింగ్ చేసి.. వైఎస్ జగన్ పాలనలో ముఖ్యఘట్టాల ప్రత్యేక ఆడియో విజువల్ విధానంలో ప్రదర్శించారు. కార్యక్రమాల్ని సోమశేఖర్‌రెడ్డి యర్రాపురెడ్డి, వంశీ ఎరువారం, చెన్నారెడ్డి మద్దూరి, ధీరజ్ పోలా, గురు, లక్ష్మి, శ్రీనివాస్‌గుప్తా, శ్రీధర్ లక్కిరెడ్డి, రుక్మన్, రమేష్, శ్రీనివాస్ మొల్లాల, అంజిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ మామిడి, విఘ్నేష్, కొండారెడ్డి, జగన్, రోహిత్ చెరుకుమిల్లి, జ్ఞానదీప్, అనుష, భవిష్య పర్యవేక్షించారు.
న్యూజిలాండ్‌లోనూ..
వైఎస్సార్‌సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం ఫిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం రాత్రి జరిగిన వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి ఎన్నారైలు పెద్దఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ జూమ్ కాల్ ద్వారా ఏపీ వైఎస్సార్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ న్యూజిలాండ్ కమిటీ సభ్యులు ఆనంద్ ఎద్దుల, సమంత్ డేగపూడి, రమేష్ పానాటి, రాజారెడ్డి, గీతారెడ్డి, విజయ్ అల్లా, బాలశౌర్య, సంకీర్త్‌రెడ్డి, పార్థ పిల్ల, అమర్ ముదిమి, బాల బీరం, కృష్ణారెడ్డి, రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యూరప్ దేశాల్లో సందడి
నెదర్లాండ్‌లోని వైఎస్సార్‌సీపీ యూరప్ యూనిట్ సభ్యులు, జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్ దేశాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఆదివారం సందడిగా సాగాయి. ఎయిండోవెన్‌లో వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, యూరప్ కన్వీనర్ కార్తిక్ యల్లాప్రగడ, యూరప్ కోర్ టీమ్ ప్రతినిధులు సారథిరెడ్డి వంగా, కృష్ణతేజరెడ్డి గడ్డం, శ్రీనివాస్‌రెడ్డి సానికొమ్ము పాల్గొన్నారు. వేడుకలు నిర్వహించిన ప్రదేశాలన్నీ జైజగన్ నినాదాలతో మార్మోగాయి.
సింగపూర్‌లో జగన్ వైబ్స్
సింగపూర్‌లో వైఎస్సార్‌సీపీ సింగపూర్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం నిర్వహించారు. జై జగన్ నినాదాల నడుమ కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు ఇవ్వాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ సింగపూర్ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణ నేతృత్వం వహించగా.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నారై కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. సింగపూర్ ఎన్‌ఆర్‌ఐ అడ్వైజర్ కొమ్మిరెడ్డి కోటిరెడ్డి, మలేషియా కన్వీనర్ విజయభాస్కర్‌రెడ్డి, మేడపాటి సందీప్, రామ్‌రెడ్డి, చంద్ర, సుహాస్, కిరణ్, సుధీర్, భాస్కర్, ప్రసాద్, పవన్, కుమార్, దొర హాజరయ్యారు.
ఆస్ట్రేలియాలో..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆస్ట్రేలియాలో సందడిగా సాగాయి. ఆస్ట్రేలియా ఎన్‌ఆర్‌ఐ వింగ్ ఆర్గనైజర్‌గా కిరణ్‌సాయి ప్రసన్ననాయుడు అక్కడి ఎన్‌ఆర్‌ఐ సహచరులతో కలిసి వైఎస్ జగన్ జన్మదిన కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
అరబ్ దేశాల్లోనూ సంబరాలు
అరబ్ దేశాలైన ఖతర్, కువైట్‌లలో ఆదివారం ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి సంబరాలు జరిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఖతర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. రక్తదానం చేసిన అందరికీ జగనన్న సంతకంతో ప్రశంసా పత్రాలను సాంబశివారెడ్డి అందజేశారు.
కార్యక్రమంలో గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కో–కన్వీనర్లు, అడ్వైజర్లు హాజరయ్యారు. కువైట్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం షర్క్ బెనైదాల్ గార్ పిస్తా హౌస్ పక్కనున్న బ్లూమ్ హోటల్ బేస్‌మెంట్‌లో 600 మంది కువైట్ కమిటీ సభ్యుల నడుమ వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కన్వీనర్ ఎ.సాంబశివారెడ్డి కేక్ కట్‌చేశారు. వైఎస్ జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్ ముమ్మడి బాలిరెడ్డి, గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో–కన్వీన్లు రమణ యాదవ్, మర్రి కళ్యాణ్, షా హుస్సేన్, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేషష్‌రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.లక్ష్మీప్రసాద్ యాదవ్, షేక్ రహంతుల్లా, షేక్ అప్సర్ అలీ, షేక్ యాసి, గల్ఫ్ అడ్వైజర్ ఎన్.మహేశ్వర్‌రెడ్డి, కో–కన్వీనర్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


