నేడు ఏపీవ్యాప్తంగా పల్స్‌ పోలియో | Pulse polio across the state today | Sakshi
Sakshi News home page

నేడు ఏపీవ్యాప్తంగా పల్స్‌ పోలియో

Dec 21 2025 4:55 AM | Updated on Dec 21 2025 6:40 AM

Pulse polio across the state today

సాక్షి, అమరావతి: జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా ఇవాళ(ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. మొత్తం 54.08 లక్షల మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 98.99 లక్షల డోస్‌లు సిద్ధం చేసినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జి.వీరపాండియన్‌ తెలి­పా­రు.

ఈనెల 21 నుంచి 23 వరకు ట్రాన్సిట్‌ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయని చె­ప్పా­రు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 38,267 బూత్‌­లలో ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. పలు కారణాలతో వేయించుకోలేని చిన్నారులను 22, 23 తేదీల్లో ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement