విజయనగరం కాలేజీ ఏర్పాటుతోనే ఎంబీబీఎస్ సీటు
కొత్త కాలేజీల ఏర్పాటు వల్లే మా కల సాకారం
నేను విజయనగరం జిల్లా సంగివలసకు చెందిన చిరు వ్యాపారిని. మాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హారికను అందరూ డాక్టర్ అని పిలవాలని మా కోరిక. ఆమె తెల్ల కోటు వేసుకుని తిరుగుతుంటే చూడాలన్నది మా కల. అయితే మా ఆర్థిక స్తోమత ఆ కలకు అడ్డంకి అని బాధ పడుతుండేవాళ్లం. ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వస్తే తప్ప మా కల నెరవేదని తెలుసు. ఆ తరుణంలో ఆ దేవుడు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో వచ్చి మా కోరికను తీర్చాడు.
మా అమ్మాయి కోసమే విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిరి్మంచాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే సీటు రావాలని మా అమ్మాయి కష్టపడి చదివింది. తొలి కౌన్సెలింగ్‌లో ప్రైవేట్ కాలేజ్‌లో అడ్మిషన్ వచ్చింది. ఇక ఆశలు వదిలేసుకున్నాం. అయితే ఇదే ఏడాది విజయనగరంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభం కావడంతో రెండో కౌన్సెలింగ్‌లో ఇక్కడే సీటు వచ్చింది.

మా కుమార్తె ఇప్పుడు ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతోంది. కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకపోతే.. మాలాంటి వారి పరిస్థితి ఏంటని తలుచుకుంటేనే భయమేస్తోంది. ఇంకో రెండేళ్లలో డాక్టర్ పట్టా పుచ్చుకుంటుంది. ఈ క్రెడిట్ జగనన్నకే దక్కుతుంది. హ్యాపీ బర్త్‌డే జగనన్నా.. – పీతల వెంకట అప్పారావు, శ్రీదేవి దంపతులు
జగనన్న పుట్టినరోజుకు మాకే బహుమతి ఇచ్చారు
నేను ఇప్పుడు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ప్రైవేటు కళాశాలలో సీటు వస్తే చదివించే స్తోమత మా కుటుంబానికి లేదు. తక్కువ కాలేజీలు ఉన్నందున ప్రభుత్వ కాలేజీలో సీటు రావాలంటే చాలా కష్టం. అందునా మాకు దగ్గరగా ఉండే కళాశాలలో సీటు రావాలంటే ఇంకా కష్టం. జగనన్న కొత్తగా 17 మెడికల్ కాలేజీలను నిర్మించబట్టే నాలాంటి విద్యార్థులు ఎంతో మంది ఇవాళ ఎంబీబీఎస్ చదువుతున్నారు. హ్యాట్సాఫ్ జగనన్నా.. – పీతల హారిక


