వైద్య విద్య కల సాకారం చేసుకున్న నాయీబ్రాహ్మణుడి కుమార్తె
వైఎస్ జగన్ కొత్త కాలేజీ కట్టడం వల్లే పేద తల్లిదండ్రుల కల సాకారం
మాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు జయతేజ్, కుమార్తె ఎదు నందిని. మా ఊరు బందరులో శ్రీ సాయిరాఘవేంద్ర హెయిర్ అండ్ బ్యూటీకేర్ సెంటర్ (సెలూన్) నిర్వహిస్తూ జీవిస్తున్నాను. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మా కుటుంబానిది. మా అమ్మాయి నందిని మచిలీపట్నం మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతోంది. జగన్ కొత్తగా మెడికల్ కళాశాలలు కట్టకపోతే మా అమ్మాయికి మచిలీపట్నంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చేది కాదు.
మాది బయట ప్రైవేటు కళాశాలలో, హాస్టల్‌లో డబ్బులు కట్టి చదివించే స్థితి కాదు. ఫ్రీ సీటు రావటంతో ఆనందంగా కూతుర్ని చదివించుకుంటున్నాం. సొంత ఊరిలో ప్రశాంతంగా పైసా ఖర్చు లేకుండా మా అమ్మాయి కాలేజీలో చదువుకుంటోంది. వేరే చోటుకు పంపాలంటే వెళ్లటం, రావటం గురించి ఆందోళన ఉండేది. ఇప్పుడు ఆ బాధ లేదు. కేవలం రూ.15 వేలు మాత్రమే ఫీజు కట్టాను. వేరే చోట అయితే హాస్టల్‌లో ఉంచాలంటే లక్షలు ఖర్చు అయ్యేవి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయటం వల్లే మా కల నెరవేరింది. ఆయనకు కృతజ్ఞతలు. హ్యపీ బర్త్‌డే టు జగనన్న. – వక్కలగడ్డ నాగేంద్రరావు, నాగమాధవి దంపతులు

జగనన్నకు కృతజ్ఞతలు
మా సొంత ఊరైన బందరు వైద్య కళాశాలలో నాకు ఎంబీబీఎస్ ఫ్రీ సీటు వచ్చింది. ఇప్పుడు ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచి్చన ప్రభుత్వ వైద్య కళాశాలల వల్లే నా కల నెరవేరింది. మా ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.
బయట సీటు వస్తే హాస్టల్ ఫీజులు భరించడం మా కుటుంబానికి ఎంతో భారం. ఇప్పుడు సొంత ఊరిలోనే ఎంబీబీఎస్ చదువుతున్నా. ఇంటి నుంచే రోజూ కాలేజీకి వెళ్లి వస్తున్నా. జగనన్న మా ఊళ్లో కాలేజీ కట్టి ఉండకపోతే నా కల నెరవేరేది కాదు. – వక్కలగడ్డ ఎదు నందిని


