breaking news
Amaravati
-
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంబంధించిన విషయాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజారంజక పాలన అందించారని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, అలాగే రైతన్నలకు అండగా నిలిచారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. సీఎంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందినప్పటికీ, ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమి చవిచూడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అన్ని సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్ ఎందుకు ఓడిపోయారు? ఏపీలో అసలు ఏం జరిగిందనే అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు.ఎన్నికల సంఘం పాత్రపై చర్చగత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం వ్యవహారశైలేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలైనప్పటికీ, ఎన్నికల సరళి, ఫలితాల మధ్య పొంతన లేకపోవడం వెనుక వ్యవస్థల ప్రభావం ఉందనే కోణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చేశారు. -
తొలి రోజే ఫ్లాప్ షో
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని దుర్గ గుడిలో దసరా ఉత్సవాల నిర్వహణలో తొలి రోజే రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మైసూర్ తర్వాత ఇక్కడే అత్యంత అద్భుతంగా చేస్తున్నామంటూ నెల రోజుల నుంచి ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు. రాష్ట్రపతి, 11 మంది ముఖ్యమంత్రులు, పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. ఎంత మంది వీఐపీలు వచ్చినా, భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తామని చెప్పారు. అయితే తీరా.. పదే పదే విజనరీగా చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఇంటికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను నిర్వహించడంలో తొలి రోజే విఫలమయ్యారు.భక్తులకు అవససరమైన ఏర్పాట్లు చేయడంలో దుర్గగుడి అధికారులతో పాటు పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు చేతులెత్తేశారు. ఉత్సవాలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే భక్తులకు క్యూలైన్లోనే అధికారులు చుక్కలు చూపించారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి, ఎండకు తట్టుకోలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తొలి రోజు ఆదివారం కావడం, ఈ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఊదరగొట్టడంతో భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ దర్శనానికి తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు క్యూలో వేచి ఉన్నారు. వారికి దర్శనం అయ్యే సరికి మధ్యాహ్నం 12 గంటలు దాటింది. అంతే ఏకంగా 10 గంటలు పట్టింది. తర్వాత కూడా సరైన నిర్వహణ లేకపోవడంతో అమ్మవారి దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటలు పట్టిందంటే నిర్వహణ ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ‘ఉదయం ఐదు గంటల నుంచి క్యూలో ఉన్నాం. ఇప్పుడు 10 గంటలైంది. ఇంకా కొండ దగ్గరకు రాలేదు. మంచి నీళ్లు లేవు.. బయటకు వెళ్లటానికి వీలు లేదు.. టాబ్లెట్ వేసుకోవాలన్నా అవకాశం లేదు.. ఇలాగైతే ఎలా.. మా లాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి?’ అంటూ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఒక భక్తురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దసరా ఉత్సవాలకు 25 లక్షల మంది వస్తారని పదేపదే ప్రకటనలు గుప్పించిన అధికారులు.. తొలి రోజే అనేక విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. తొలి రోజు ఎంత మంది భక్తులు వస్తారు.. సెలవు రోజైతే పరిస్థితి ఏమిటి.. అనే అంశాలపై ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోక పోవటంతో మొదటి రోజు భక్తులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.టీడీపీ ఎంపీని నిలదీసిన భక్తులుదసరా ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని భక్తులు నిలదీశారు. ఇవేం ఏర్పాట్లయ్యా.. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే స్పందించేందుకు అధికార యంత్రాంగం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని చెప్పినా ఎవరూ క్యూలైన్లలో ఉన్న భక్తుల విషయం పట్టించుకోలేదు. కేవలం వీఐపీల సేవలో తరించడానికే తమ శక్తియుక్తులను ధారపోశారు. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, ఎక్కడైనా సమస్య ఉందని సమాచారం అందిస్తే యుద్ధ ప్రాతిపదికన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉదయం నుంచి క్యూఆర్ కోడ్, ఐవీఆర్‌ఎస్‌కు భక్తుల నుంచి సదుపాయాల కల్పనలో వైఫల్యం చెందారంటూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అయినా తూతూ మంత్రంగా తాత్కాలిక చర్యలు తీసుకున్నారే తప్ప చిత్తశుద్ధి కనిపించ లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోరుగా వీఐపీ దర్శనాలుఈ ఏడాది ఉత్సవాల్లో ఎటువంటి వీఐపీ దర్శనాలు ఉండవని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు చెప్పినా, అమలు మాత్రం మరిచారు. ఉదయం దర్శనం ప్రారంభమైనప్పటి నుంచే ప్రముఖులు, రాజకీయ నాయకులకు తోడు పోలీసు, రెవెన్యూ శాఖకు చెందిన వారు క్యూ కట్టారు. కొండపైకి పరిమిత సంఖ్యలోనే వాహనాలను అనుమతించేలా పాసులను జారీ చేశామని చెబుతున్న దేవస్థానం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఇందుకు ఆదివారం కొండపై ఉన్న వాహనాలే నిదర్శనం. మొత్తంగా ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతన లేకుండా పోయింది.మీడియా ప్రతినిధుల ధర్నావన్టౌన్/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాత్రికేయులను దూరంగా ఉంచి ఇన్‌ఫ్లుయెన్సర్లకే ఎక్కువ పాస్‌లు ఇవ్వడాన్ని నిరసిస్తూ పత్రికల ప్రతినిధులు ఆదివారం ధర్నా చేశారు. పెద్ద మీడియా సంస్థలకు అరకొరగా పాస్‌లు జారీచేసిన అధికారులు చిన్నపత్రికలు, లోకల్ చానళ్లు, సీనియర్ జర్నలిస్టులు తదితరులకు పాస్‌లు నిరాకరించారు. దీంతో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు వారి వద్దకు వచ్చి పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రచారం చేసే బాధ్యతను వందమందికిపైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అప్పగించినట్లు తెలిసింది.సర్కారు తప్పిదానికి సీఎఫ్ఓ మూల్యంవన్టౌన్ (విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించడంలో చంద్రబాబు ప్రభుత్వం తొలి రోజే విఫలమవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సర్కారు.. తన తప్పిదాన్ని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ ఆజాద్పైకి నెట్టేసింది. ఈ క్రమంలో ఆ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది. ఆయన స్థానంలో ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథ్‌ను నియమించింది. ఇబ్బందులు ఇలా» హోల్డింగ్ పాయింట్లలో, క్యూలైన్లో మంచి నీటి సదుపాయం కల్పించలేదు. ఫలితంగా మహిళలు, చిన్న పిల్లలు అల్లాడిపోయారు. » భక్తులకు ఏ సమయానికి అమ్మవారి దర్శనం అవుతుందనే విషయాన్ని డిస్ ప్లే చేస్తామని చెప్పి.. చేయలేదు.» వాటర్ బబుల్స్ విధానం పూర్తిగా విఫలమైంది. » క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు ఉక్కపోతతో అల్లాడారు. కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయలేదు. » క్యూలైన్లలో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు.» భక్తులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సెల్ఫోన్ల ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రభుత్వం సాయంత్రం గానీ స్పందించ లేదు. » గంటల తరబడి లైన్లలో ఉన్న వారికి కనీసం అన్న ప్రసాదాలు కూడా అందజేయలేకపోయారు.» భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో సాయంత్రం తర్వాత ఓం టర్నింగ్ వద్ద పాలు, బిస్కెట్లు అందించారు. » పోలీసు, రెవెన్యూ, ఆలయ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలియలేదు.కొందామన్నా మంచి నీళ్లు లేవుక్యూలైన్లో ఎక్కడా మంచి నీళ్లు లేవు. గంటల కొద్దీ సమయం పట్టినప్పుడు అధికారులు కనీసం మంచి నీళ్లయినా అందించాలి. కనీసం డబ్బులు పెట్టి కొనుగోలు చేద్దామన్నా క్యూలైన్ల దగ్గరలో అమ్మడం లేదు. నీళ్లు లేక దాహంతో అందరం చాలా ఇబ్బంది పడ్డాం. ఉత్సవాలను ఘనంగా చేస్తున్నామంటూనే ఇన్ని ఇబ్బందులా? – సుబ్బారావు, భక్తుడు, విజయవాడమాలాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి?క్యూలైన్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంతసేపు ఇలా వదిలేస్తే మాలాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి? ఐదు గంటలకు పైగా క్యూలైన్లో ఉన్నాం. ఇంకా దర్శనం కాలేదు. ఇలా అయితే ఎలా? ప్రభుత్వం నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలి. – 70 ఏళ్ల వృద్ధురాలు, విజయవాడ -
హెచ్ఆర్సీ నియామకాల్లో ఇంత హడావుడి ఎందుకు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (ఏపీ హెచ్ఆర్సీ) చైర్పర్సన్, సభ్యుల ఎంపిక ప్రక్రియను హడావుడిగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపిక ప్రక్రియను సోమవారం చేపట్టాలని భావించినప్పుడు, తనకు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తగినంత సమయం ఇవ్వకుండా చివరి నిమిషంలో ఆహ్వానం పంపడం వల్ల తాను ఈ సమావేశానికి రాలేకపోతున్నట్లు సీఎం చంద్రబాబుకు బొత్స లేఖ రాశారు. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ ప్రతిని ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్), సాధారణ పరిపాలన శాఖకు కూడా బొత్స పంపారు. ‘అక్టోబర్ 12న ఉదయం 11.30 గంటలకు ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్, మొదటి అంతస్తులో జరగనున్న ఎంపిక కమిటీ సమావేశానికి హాజరు కావాలని నాకు అక్టోబర్ 11న సాయంత్రం 4.59 గంటలకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందింది. సమావేశానికి హాజరు కావడానికి 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం నేను విజయనగరంలో ఉన్నాను. ఇంత తక్కువ సమయంలో విజయనగరం నుంచి రాలేను’ అని బొత్స లేఖలో పేర్కొన్నారు. కీలక నియామకంపై ఇంత నిర్లక్ష్యమా?‘మానవ హక్కుల కమిషన్ నియామకం వంటి కీలక అంశంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. ఇది ఏ మాత్రం సమంజసం కాదు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఎంపిక కమిటీ సభ్యులకు అభ్యర్థుల అర్హతలు, నేపథ్యాన్ని పరిశీలించడానికి చాలా తక్కువ సమయం ఇవ్వడం సరికాదు. అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడానికి సమయం అవసరం. మానవ హక్కుల పరిరక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించే కమిషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియలో కచ్చితత్వం, జాగ్రత్త, పూర్తి స్థాయి పరిశీలన అవసరం. తగిన చర్చ, లోతైన పరిశీలన లేకుండా హడావుడిగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం సహేతుకంగా లేదు. ఈ కారణాలతో అక్టోబర్ 12న జరగనున్న ఎంపిక కమిటీ సమావేశానికి హాజరు కాలేను. సమావేశానికి హాజరు కావడం నాకు ఇష్టం లేదు’ అని కూడా లేఖలో బొత్స స్పష్టంచేశారు. -
ఎస్పీ గన్‌మేన్ ఆత్మహత్య
వేటపాలెం: క్రికెట్ బెట్టింగుల్లో నష్టపోయి అప్పులపాలై చివరకు ఆర్థిక ఇబ్బందులతో బాపట్ల జిల్లా ఎస్పీ గన్‌మేన్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ రామానగర్‌లో ఉంటున్న లేళ్ల వీరన్న (47) ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎస్పీ గన్‌మేన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూ బాపట్ల వెళ్లి డ్యూటీ చేసి ఇంటికి వస్తుంటాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనశ్శాంతి కోల్పోయి రెండు రోజుల కిందట తాను ఆత్మహత్య చేసుకుంటానని భార్యకు చెప్పాడు. ఆమె వద్దని నచ్చజెప్పిందని సమాచారం. ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బయటకు వచ్చిన వీరన్న రామన్నపేట పంచాయతీ శివారు కనక నాగవరపమ్మ దేవస్థానికి వెళ్లే మార్గంలో గ్రామ పంచాయతీ మంచినీటి బావుల వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మార్గం గుండా వెళ్లే వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి ఎస్పీ గన్‌మేన్‌గా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా రూ.లక్షల్లో అప్పులు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. అప్పులు తీర్చలేనని మనోవ్యథతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుబారా బాబు.. డిజిటల్ డాబు
సాక్షి, అమరావతి: ‘మింగ మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా వ్యవహరిస్తోంది చంద్రబాబు సర్కారు. పంటలకు సాగునీరు అందక అన్నదాతలు అల్లాడుతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని పూర్తిగా గాలికొదిలేసింది. పంటల్ని కాపాడేందుకు కనీస చర్యలు కూడా చేపట్టని ప్రభుత్వం ఉద్యాన రైతులను ఉద్దరిస్తున్నట్టు డప్పు కొట్టుకుంటూ డిజిటల్ సేవల పేరిట రూ.కోట్లను దుబారా చేస్తోంది. వ్యవసాయ శాఖ ఇప్పటికే ఏకీకృత డిజిటల్ వ్యవస్థ ‘ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీ ఎయిమ్స్) 2.0’ అనే డిజిటల్ వ్యవస్థ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఉద్యాన శాఖలో డిజిటల్ సేవల కోసం ప్రత్యేకంగా ఏపీ ఉద్యాన సమాచార, నిర్వహణ వ్యవస్థ (ఏపీహెచ్ఐఎంఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.20.62 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధుల మంజూరుకు పరిపాలన ఆమోదం ఇస్తూ డిజిటల్ వ్యవస్థ ఏర్పాటుకు విధివిధానాలతో ఆదివారం వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరేళ్ల ఒప్పందం.. ఏడాదిలో సేవలు డిజిటల్ రూపంలో ఉద్యాన సమాచార వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి, అమలు, నిర్వహణ బాధ్యతలను వాసర్ ల్యాబ్స్ ఐటీ సొల్యూషన్స్‌కు అప్పగిస్తున్నారు. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.11.77 కోట్లు, ఐదేళ్లపాటు నిర్వహణ కోసం మరో రూ.8.85 కోట్లు కేటాయించారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలోగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకుని రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఐదేళ్ల పాటు ఈ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రాజెక్టును నాలుగు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఎయిమ్స్ 2.0 ఉన్నా.. ఇప్పటికే వ్యవసాయ శాఖకు ‘ఏపీ ఎయిమ్స్ 2.0’ అనే డిజిటల్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దీనికి అనుబంధంగా ఉద్యాన పంటలకు సంబంధించిన సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తే సరిపోతుందని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పేర్కొంటున్నారు. ఉద్యాన శాఖ కోసం ప్రత్యేక డిజిటల్ సేవల పేరుతో నిధులు స్వాహా చేసేందుకే ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.20.62 కోట్లను ప్రభుత్వం అప్పనంగా దోచిపెట్టేందుకే ఉద్యాన శాఖ పేరిట ప్రత్యేకంగా డిజిటల్ సేవలను తీసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కుదరదు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన జారీ చేసిన జీవోను సవరిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలు ఆదివారం మరో జీవో జారీ చేశాయి. గ్రామ పంచాయతీ, మండల జిల్లా పరిషత్‌లకు జరిగే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కేటగిరీలకు కల్పించే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఆ ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వం ఆమోదించిన బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను నిర్ణయించాలని పేర్కొంది. రిజర్వేషన్ల గణన, కేటాయింపునకు సంబంధించిన వివరణాత్మక విధానం.. స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్లు, పదవుల నిర్ధారణ, కేటాయింపు, రోటేషన్‌పై కొత్త విధివిధానాలతో వేరుగా ఆదేశాలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు భారీగా కోత పడే అవకాశం ఉంది. జెడ్పీ చైర్మన్ పదవులతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవుల్లో దాదాపు పది శాతం చొప్పున తగ్గిపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మభ్యపెట్టి లబ్ధి పొందేలా స్కెచ్ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాట కూడదని తెలిసినా బీసీలను మభ్యపెట్టడానికి స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు సర్కారు తొలుత వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. పార్లమెంట్లో చట్ట సవరణ చేయకుండా జారీ చేసిన జీవోలు చెల్లవని తెలిసినా కపట నాటకం ఆడింది. ఈ జీవోలను హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో) రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం ఆదివారం 251 జీవో జారీ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి కల్పించే రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలతోపాటు మేయర్, చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లను తాజా ఉత్తర్వుల ప్రకారం ఖరారు చేయాలని స్పష్టం చేసింది. ఫలితంగా రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఆయా యూఎల్బీని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కాగా.. మిగిలిన శాతం సీట్లు బీసీలకు దక్కనున్నాయి. అయితే మొత్తం రిజర్వేషన్లు మాత్రం 50 శాతానికే పరిమితమవుతాయి. మరోవైపు వార్డుల పునర్విభజన జరిగిన నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్లు నూతనంగా ఖరారు చేయనున్నారు. మేయర్లు, చైర్పర్సన్లకు మాత్రం 2021 ఎన్నికల్లో రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.నేడు రిజర్వేషన్ల ఖరారు కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్, నగర పంచాయతీల చైర్పర్సన్ల రిజర్వేషన్లు సోమవారం ఖరారు కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే తొలి దశలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్లు మాత్రం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఖరారు చేయనున్నారు. -
చెత్తతోనూ 'దోపిడీ పంట'!
సాక్షి, అమరావతి: కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు.. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, మద్యం అన్నిటిలోనూ వేల కోట్లు దోచేస్తున్నారు.. అమరావతి నిర్మాణాల పేరుచెప్పి ప్రపంచంలోనే ఎక్కడా లేనంత స్థాయిలో ఎస్ఎఫ్టీకి రూ.20 వేలు చొప్పున నొక్కేస్తున్నారు. అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా భూములు అప్పగించేస్తున్నారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చేసి వాటిలో కమీషన్లు కొట్టేస్తున్నారు. అయినా చంద్రబాబు ఆకలి తీరడం లేదు. చివరకు చెత్తనూ వదలడం లేదు. చెత్త నిల్వల లెక్కలను కాగితాలపై పెంచేసి కాగితాలపైనే క్లియర్ చేసేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ వాటిలో కమీషన్లు కాజేస్తున్న విషయం బయటపడింది. చెత్తతోనూ ‘దోపిడీ పంట’ పండించవచ్చన్న విజనరీ చంద్రబాబు పాలనలో చెత్త కుంభకోణం విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అధికారంలోకి రాగానే ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలు, మంత్రి నారాయణ ప్రకటనలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు చూస్తే ఈ చెత్త లెక్కలను ఎలా పెంచుకుంటూ పోయారో తెలుస్తుంది. కాంట్రాక్టర్లు పనిచేయకపోయినా డబ్బులు చెల్లించడం, చెత్తను తరలించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికక్కడ తగలబెడుతుండడం చూస్తే కమీషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో అర్థమౌతుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న పొగ లెక్కలు పెంచేసి.. కాగితాలపై క్లియర్ చేసి.. రూ.కోట్లు స్వాహా.. గత ప్రభుత్వ హయాంలో 123 మున్సిపాలిటీలలో లెగసీ చెత్త (దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త) 85 లక్షల టన్నులకు గానూ 4.10 లక్షల టన్నులను క్లియర్ చేసినట్లు తేల్చారు. ఆ విషయాన్ని 2024 జులై 11న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచారు. కానీ 2025 మార్చి 16న ఎన్జీటీకి సమర్పించిన మరో అఫిడవిట్లో లెగసీ చెత్తను మళ్లీ 85 లక్షల టన్నులుగా చూపించారు. అందులో 50 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేశామని చెప్పారు. మళ్లీ 2025 సెప్టెంబర్ 23న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో లెగసీ చెత్త 84 లక్షల టన్నులున్నట్లు చూపించారు. అందులో 82 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేశామని చెప్పారు. 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో లెగసీ చెత్త 1.53 కోట్ల టన్నులుగా చూపించారు. అందులో 1.08 కోట్ల టన్నులను ప్రాసెస్ చేసినట్లు చూపించారు. ఇదే ఏడాది జులై 31 నాటికి లెగసీ చెత్త మొత్తాన్ని 1.58 కోట్ల టన్నులకు పెంచేశారు. అందులో 1.34 కోట్ల టన్నులను ప్రాసెస్ చేశామని చూపించారు. లెగసీ చెత్త లెక్కలను ఇలా ఎందుకు పెంచుతున్నారో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. చెత్త లెక్కను కాగితాలపై పెంచుతున్నారు. చెత్తను క్లియర్ చేసేశామని కాగితాలపైనే చెబుతున్నారు. కానీ ఏమీ చేయకుండా టన్నుకు రూ.800 చొప్పున దాదాపు రూ. 1200 కోట్లకు పైగా నొక్కేయడానికి స్కెచ్ వేశారు. క్లియర్ చేసిన చెత్త కన్నా మొత్తం చెత్త తక్కువట.. లెక్కకు మించిన చెత్త మెక్కేయడంతో చంద్రబాబు సర్కారుకు మెదడు మొద్దు బారిపోయినట్లుంది. సుమారు 20 మున్సిపాలిటీలలో మొదట సమర్పించిన అఫిడవిట్లలో క్లియర్ చేసిన చెత్త కంటే... మొత్తం చెత్త తక్కువ అని తదుపరి అఫిడవిట్లో తెలియజేశారు. అంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజమహేంద్రవరంలో మూడు అఫిడవిట్లలో 5.12 లక్షల టన్నుల చెత్త ఉందని అందులో 5.11 లక్షల టన్నులు క్లియర్ చేశామని చూపించారు. అంటే 5.11 లక్షల టన్నులకు బిల్లులు పెట్టుకుని తినేసినట్లే కదా.. కానీ మూడు నెలల తర్వాత సమర్పించిన అఫిడవిట్లో మొత్తం చెత్త 2.78లక్షల టన్నులని చూపించారు. తాడిపత్రిలో 1.27 లక్షల టన్నుల చెత్త ఉందని, అందులో 1.16 లక్షల టన్నులు క్లియర్ చేశామని చూపించి మూడు నెలల తర్వాత 4వ అఫిడవిట్లో మొత్తం చెత్త 22 వేల టన్నులు అని తెలియజేశారు. అవకతవకలు ఈస్థాయిలో జరిగిన నేపథ్యంలో దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపితే తప్ప నిజాలు బయటపడవు. నచ్చిన కంపెనీలకే పనులు.. కాంట్రాక్టర్లపై చర్యల్లేవ్.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు మొదలు మొత్తం ప్రక్రియనంతటినీ అస్తవ్యస్తంగా మార్చేసింది. 2025 మార్చిలో సౌరాష్ట్ర కంపెనీకి కర్నూలు, పరిసరాల్లోని 11 డంపింగ్ యార్డులను కట్టబెట్టారు. మిగిలిన చోట్ల వేర్వేరు కంపెనీలకు పనులు అప్పగించారు. చెత్త మొత్తాన్ని 2025 అక్టోబర్ 2 నాటికి క్లియర్ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం గడువులోగా పూర్తి చేస్తే 10శాతం అదనపు ప్రోత్సాహకం, విఫలమైతే 20శాతం పెనాల్టీ విధించాలి. అయితే 2025 గడువు ముగిసి, 2026 నాటికి కూడా పనులు పూర్తికాకపోయినా కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా క్లియర్ చేస్తున్నట్లు ఎన్జీటీకి తప్పుడు నివేదికలు సమర్పించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు పూర్తి బిల్లులు చెల్లిస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. వేలాది ఇళ్లకు కనీసం ఇంటింటికీ చెత్త సేకరణ కూడా చేయడం లేదు. డంపింగ్ యార్డులలో అవినీతి కప్పిపుచ్చుకోవడానికి నిబంధనల ప్రకారం పెట్టాల్సిన సీసీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో కూటమి ప్రభుత్వం చేసిన పర్యావరణ వినాశనం వర్ణనాతీతం. చెత్తను శాస్త్రీయంగా విడదీసి, బయో–మైనింగ్ ద్వారా భూమిని పునరుద్ధరించాల్సి ఉండగా, ఇక్కడ బిల్లులు మింగేయడానికి అడ్డదారి తొక్కారు. చెత్తను మట్టితో పూడ్చారు. టన్నుకు రూ.800 చొప్పున కోట్లాది రూపాయల బిల్లులు డ్రా చేసుకున్నారు. కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కయి చెత్తను ప్రాసెస్ చేయకుండానే భారీ ఎత్తున మట్టిలో పూడ్చిపెట్టారు. ఎన్జీటీ నిబంధనల ప్రకారం.. చెత్తను మట్టితో కప్పివేయడం వల్ల (కేపింగ్) వ్యర్థాల నుంచి అత్యంత ప్రమాదకరమైన విష ద్రావకం విడుదలై భూగర్భ జలాల్లోకి చేరుతుంది. ఇది చుట్టుపక్కల ప్రాంతాల తాగునీటిని పూర్తిగా విషపూరితంగా మారుస్తుంది. పర్యావరణానికి ఇంతటి ద్రోహం జరుగుతున్నా, పచ్చ చొక్కాల జేబులు నిండటమే లక్ష్యంగా ఈ దారుణాన్ని సాగనిచ్చారు.వైఎస్సార్సీపీ ‘క్లాప్’ విజయంకూటమి ‘చెత్త’ వైఫల్యంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2021 అక్టోబర్ 2న ప్రారంభించిన క్లాప్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పారిశుధ్య వ్యవస్థ రూపురేఖలను మార్చింది. నాడు కేంద్రం నిధులతో సంబంధం లేకుండా సొంత బడ్జెట్‌తో ప్రతి ఇంటికీ ఉచితంగా 1.2 కోట్ల డస్ట్బిన్లు పంపిణీ చేసి, 4,097 గార్బేజ్ ఆటోలను జీపీఎస్ ట్రాకింగ్‌తో నడిపింది. నిల్వ చెత్తను పర్యావరణ హితంగా క్లియర్ చేసింది. ఇంటింటి చెత్త సేకరణను తూతూ మంత్రంగా మార్చేసిన చంద్రబాబు సర్కారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన క్లాప్ వాహనాలనూ డంపింగ్‌యార్డులకు పరిమితం చేసింది. విజయవాడతో పాటు పలు మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో వాహనాలు మూలకు చేరాయి.100కుపైగా డంపింగ్ యార్డుల్లో చెత్తకు నిప్పునిబంధనల ప్రకారం పనులు చేయకపోగా, చెత్త పరిమాణాన్ని తగ్గించి చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంచుకున్న మరో అడ్డదారి చెత్తను తగలబెట్టడం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో దాదాపు 100 పైగా డంపింగ్ యార్డులలో రాత్రికి రాత్రే చెత్త కుప్పలకు నిప్పు పెట్టారు. దీనివల్ల వాతావరణంలోకి పీఎం2.5, పీఎం10, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, డయాక్సిన్లు, బెంజీన్ వంటి అత్యంత క్యాన్సర్ కారక రసాయనాలతో పాటు విషవాయువులు విడుదలయ్యాయి. చుట్టుపక్కల నివసించే ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతుంటే, మూగజీవాలు ఊపిరాడక మరణిస్తున్నాయి. చెత్త కాలి బూడిదవుతుంటే, ఆ బూడిదను కూడా క్లియర్ చేసినట్లు కాగితాలపై దొంగ లెక్కలు రాసి రూ.కోట్లు స్వాహా చేశారు. ప్రకాశం జిల్లా కొప్పోలులో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్త కడపలో కుమ్మేశారుకడప నగరంలో లెగసీ చెత్త లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఎన్జీటీకి సమర్పించిన మొదటి మూడు అఫిడవిట్లలో 1.08 లక్షల టన్నుల చెత్త ఉందని 100శాతం ప్రాసెస్ చేసేశామని చెప్పారు. మూడు నెలల తర్వాత సమర్పించిన నాల్గవ అఫిడవిట్లో లెగసీ చెత్త 8.41 లక్షల టన్నులుందని, అందులో 5.5 లక్షల టన్నుల చెత్త క్లియర్ చేశామని చెప్పారు. లెగసీ చెత్త 100శాతం క్లియర్ అయ్యిందని చెప్పిన తర్వాత 800శాతం చెత్త పెరగడం ఎలా సాధ్యం? పైగా మూడు నెలల వ్యవధిలో 4.5 లక్షల టన్నుల చెత్తను అదనంగా ప్రాసెస్ చేశామనడం ఎలా సాధ్యం? దోపిడీకి ఇది ప్రబల సాక్ష్యం.ప్రొద్దుటూరులో పిండేశారుమూడు అఫిడవిట్లలో 2.06 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని చెప్పి మొత్తం 2.06 లక్షల టన్నులూ క్లియర్ చేసేశామని చూపించారు. తర్వాత మూడు నెలలకు ఏకంగా 5.05లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్లో ప్రకటించారు. డంపింగ్ యార్డులో క్లియర్ అయిన చెత్త ఒక్కసారిగా అలా ఎలా పెరిగింది?కర్నూలులో కొట్టేశారు..కర్నూలులో 1.5 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని, మొత్తం క్లియర్ చేసేశామని మూడు అఫిడవిట్లలో చెప్పారు. మూడు నెలల తర్వాత 7.61 లక్షల టన్నుల చెత్త ఉందని చూపించారు. చెత్తను పెంచి క్లియర్ చేసి కొట్టేశారన్నమాట..అనంతపురంలో అడ్డగోలు లెక్క..మూడు అఫిడవిట్లలో 3.32 లక్షల టన్నుల చెత్త ఉందని చెప్పారు. మొత్తం క్లియర్ చేసి 12 ఎకరాల డంపింగ్ యార్డ్ స్థలాన్ని కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందని చెప్పారు. కానీ 2026 జనవరి నాటికి 7.10 లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్ ఇచ్చారు. ఇంతకన్నా అడ్డగోలు లెక్క ఎక్కడైనా ఉంటుందా?తిరుపతిలోనూ తినేశారు..మొదటి మూడు అఫిడవిట్లలో 2.04 లక్షల టన్నుల చెత్త ఉందని చెప్పారు. పూర్తిగా తొలగించామని చూపించారు. 12 ఎకరాల డంపింగ్ యార్డును కూడా స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. 4వ అఫిడవిట్లో ఏకంగా 6.26 లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్ ఇచ్చారు. అంటే ఎంత తినేశారో అర్థం కావడం లేదూ?వైజాగ్‌లో దోచేశారు..మొత్తం 9.6 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని మూడు అఫిడవిట్లలోనూ చెప్పి మొత్తం క్లియర్ చేసినట్లు చూపించారు. మూడు నెలల తర్వాత 17.84లక్షల టన్నులకు చెత్తను పెంచేశారు. అంటే దోపిడీ ఏ స్థాయిలో చేశారో తెలుస్తూనే ఉంది కదా..?గత ప్రభుత్వం క్లియర్ చేసిన చెత్తను కూడా కలిపేసి...మున్సిపాలిటీల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ చెత్తకు గాను గత ప్రభుత్వం 41.10 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేసిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీకి) 2024 జులై 11న సమర్పించిన అఫిడవిట్లో చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. కానీ 2025 మార్చి 16న 85 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందంటూ మరో అఫిడవిట్ ఇచ్చింది. అందులో 50 లక్షల టన్నులు క్లియర్ చేశామంది. 2025 సెప్టెంబర్ 23న మరో అఫిడవిట్లో 84 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని చెప్పింది. అందులో 82 లక్షల టన్నులు క్లియర్ చేశామంది.అంతా క్లియర్ చేసేశాం మంత్రి నారాయణ గత ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేసింది. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు చెత్త తొలగింపును 2025 నాటికి పూర్తి చేయమన్నారు. ఇప్పటికే 84లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించాం. అక్టోబర్ 2 నాటికి 85 లక్షలు పూర్తి చేస్తాం’ అని శాసన మండలి సాక్షిగా మంత్రి నారాయణ 2025 సెప్టెంబర్ 19న ప్రకటించారు.నాలుగో అఫిడవిట్లో 1.53 కోట్ల టన్నుల చెత్తఐదునెలలు తిరక్కుండానే కోట్ల టన్నులకు లెగసీ చెత్త పెరిగిపోయింది. లెగసీ చెత్త 1.53 కోట్ల టన్నులంటూ 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో చంద్రబాబు సర్కార్ పేర్కొంది. ఐదో అఫిడవిట్లో 1.58 కోట్ల టన్నుల చెత్తమరో నాలుగునెలలయ్యేసరికి లెగసీ చెత్త లెక్క 1.58 కోట్ల టన్నులకు చేరుకుంది. 2026 జులై 31న ఎన్జీటీకి సమర్పించిన మరో అఫిడవిట్లో చంద్రబాబు సర్కార్ ఈ కొత్త లెక్క చెప్పింది.1.05 కోట్ల టన్నుల చెత్త చంద్రబాబు‘గత ప్రభుత్వం 1.05 కోట్ల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణాల్లో వదిలేసి వెళ్లిపోయింది.’ అని 2026 జనవరి 24న సీఎం చంద్రబాబు చెప్పారు.ఏమిటీ చెత్త మర్మం?లెగసీ చెత్త 85 లక్షల టన్నుల్లో గత ప్రభుత్వం 41.10 లక్షల టన్నులు క్లియర్ చేసిందని అఫిడవిట్లో చెప్పిన చంద్రబాబు 2026 జనవరి 24 నాటికి 1.05 కోట్ల టన్నుల చెత్త ఉందని ఎందుకు మార్చి చెప్పినట్లు? ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో చెత్త నిల్వలను ఏకంగా 1.53 కోట్ల టన్నులకు ఎందుకు పెంచేసినట్లు? జులై 31 నాటికి ఈ లెక్కను 1.58 కోట్ల టన్నులకు పెంచి మరో అఫిడవిట్ ఎందుకు వేసినట్లు? ఈ ఐదు అఫిడవిట్లలోనూ కోట్ల టన్నులు క్లియర్ చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. వీటన్నిటి వెనక ఏదో ‘దోపిడీ మర్మం’ ఉందని అర్థం కావడం లేదూ? -
నేటి నుంచి స్పెషల్ టెట్
సాక్షి, అమరావతి: ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష–2026(స్పెషల్ టెట్) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పెషల్ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 32 పేపర్లకు సీబీటీ విధానంలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఏపీలో 64, తెలంగాణలో 3, చెన్నైలో 2, బెంగళూరులో 2, బరంపురం (ఒడిశా)లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని వివరించారు. హాల్‌టికెట్లను cse.ap.gov.in లేదా tet2dsc.apcfss.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా, ఇన్ సర్వీస్ టెట్ కోసం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 68,420మంది ఉపాధ్యాయులు 83,015 దరఖాస్తులు సమర్పించారు. -
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లు కొలువుదీరిన బెజవాడ ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలు 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉత్సవాలలో తొలిరోజైన ఆదివారం దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అనంతరం స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం.. ఉ.8 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. మొదటిరోజు ఆదివారం కావడంతో పెద్దఎత్తున భక్తులు విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుద్దీపాల ధగధగలు..ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మహా మండపం, మల్లేశ్వర స్వామివారి ఆలయం, రాజగోపురం, ఘాట్‌రోడ్డుతో పాటు చైనావాల్, కొండ దిగువన కనకదుర్గనగర్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ఏర్పాటుచేశారు. రద్దీ అధికమైతే వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటుచేసిన కంపార్టుమెంట్లలోకి భక్తులను తరలిస్తారు. ఇక హైదరాబాద్, తెలంగాణ వైపు నుంచి విచ్చేసే భక్తుల కోసం ఈ ఏడాది కుమ్మరిపాలెం వరకు క్యూలైన్లు ఏర్పాటుచేసింది. వీవీఐపీలు, ప్రముఖుల రాక..ఈ ఏడాది దసరా ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు, ప్రముఖులు విచ్చేస్తున్న నేపథ్యంలో పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటుచేస్తున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో విచ్చేస్తారు. దీంతో.. నగరానికి విచ్చేసే భక్తుల భద్రత దృష్ట్యా సుమారు 3,130 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పోలీసు బందోబస్తును ఏర్పాటుచేస్తున్నారు. బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్స్ ఏర్పాటు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం 30 డ్యాష్బోర్డులతో అధునాతన కంట్రోల్ రూమ్, క్యూలైన్లలో భక్తుల కదలికలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, రైల్వే ప్రయాణికుల రద్దీని ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఏఎన్పీఆర్ సిస్టమ్, డిజిటల్ ట్విన్స్ పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షిస్తారు. మొత్తం టెంపుల్ పరిసర ప్రాంతాల్లో 40 పార్కింగ్ పాయింట్లను ఏర్పాట్లుచేశారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం కొండపైన ఓం టర్నింగ్ వద్ద వాహనాల పార్కింగ్‌కు అనుమతి ఇవ్వడంలేదు. పాస్ ఉన్న వాహనాలు ఓం టర్నింగ్ వరకు వెళ్లి అక్కడ డ్రాప్ చేసిన అనంతరం కిందకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు.నేటి అలంకారం శ్రీబాలా త్రిపుర సుందరీదేవి..శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా మంత్రం సమస్త దేవి మంత్రాల్లో ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహా త్రిపుర సుందరీదేవి నిత్యం కొలువై ఉండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీబాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే శ్రీమహా త్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. -
జనంపై పుకార్ల ‘పంజా’..!
సాక్షి, అమరావతి: ‘అదిగో పులి అంటే..ఇదిగో తోక’ అన్నట్లుంది సామాజిక మాధ్యమాల్లో కొందరి వైఖరి. రాష్ట్రంలో ఎక్కడో పులి కనిపించిందనే సమాచారం వస్తే చాలు.. క్షణాల్లో వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, హెచ్చరికల సందేశాలు వైరల్ అవుతున్నాయి. ఏ సమాచారం వాస్తవం? ఏది పుకారు? అనే గందరగోళం జనంలో ఏర్పడుతోంది. ఆరు నెలలుగా సంచారం కేంద్ర ప్రభుత్వం 2022 పులుల గణన ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌లో 63 పులులు ఉన్నట్లు అంచనా. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 3,682కు చేరింది. మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి ఓ పెద్దపులి ఈ ఏడాది ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లాలో కనిపించింది. ఫిబ్రవరి 7న అటవీశాఖ అధికారులు బంధించి, పాపికొండల జాతీయ పార్కులో విడిచిపెట్టారు. ఆగస్టులోనూ గోదావరి ప్రాంతంలో పులి సంచారంపై వార్తలు వెలువడ్డాయి. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పశువులపై పులి దాడులు చేస్తోందనే సమాచారంతో అటవీశాఖ అప్రమత్తమైంది. గోపాలపురం మండలం నందిగూడెం, టోకిరెడ్డిగూడెం పరిసరాల్లో పులి అడుగుజాడలు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. మళ్లీ కలకలం తాజాగా ఈనెల 9 నుంచి గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలలో పులి సంచారంపై ప్రచారం జోరుగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి, కల్ధరి గ్రామాల మధ్య పొలాల్లో పులి కదలికలను గుర్తించారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం, చాగల్లు మండలం చిక్కాలపాలెం, అమ్మిగుంట, నిడదవోలు ప్రాంతాల్లోనూ పులి కనిపించిందనే ప్రచారం కలకలం రేపింది. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల్లో శనివారం పులి సంచారం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. కొందరు తమ పంట చేలో పులి తారసపడిందని సమాచారం ఇవ్వడంతో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు రామన్నగూడెం చేరుకుని తనిఖీలు చేపట్టారు. పుకార్లు..షికార్లు వివిధ గ్రామాల పేర్లతో వస్తున్న సమాచారాన్ని బట్టి ప్రతి చోటా పులి కనిపించిందనడానికి లేదు. ఫిబ్రవరిలో పాపికొండల అటవీ ప్రాంతంలో పులిని విడిచిపెట్టిన తర్వాత, అదే పులి మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందంటూ కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వైరల్ అయిన ఓ వీడియోలో కనిపించిన పులి అది కాదని అటవీశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు: » పులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయకూడదు. » రాత్రివేళ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. » పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. » పులి సంచారంపై సమాచారం ఉంటే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలి. » పాత వీడియోలు, ధ్రువీకరించని సందేశాలను ఇతరులకు పంపకూడదు. » అటవీశాఖ జారీ చేసే అధికారిక హెచ్చరికలను పాటించాలి. -
‘లోక్‌భవన్ ముట్టడి’పై పోలీసు ప్రతాపం
సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, ఓటు హక్కును పరిరక్షించాలని కోరుతూ కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు శనివారం విజయవాడలో నిర్వహించిన లోక్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఈ కార్యక్రమానికి అనుమతిలేదంటూ శుక్రవారం అర్థరాత్రి నుంచే విజయవాడ, తాడేపల్లి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని వామపక్ష నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. లోక్‌భవన్‌కు వెళ్లే అన్ని దారులను బారికేడ్లు, ఇనుప కంచెలతో మూసివేశారు. లెనిన్ సెంటర్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యాలయాలను పోలీసులు దిగ్బంధించారు. వందలాది మంది పోలీసులు మోహరించి పెద్ద సంఖ్యలో వాహనాలు తీసుకొచ్చి అరెస్టులు చేశారు. దీంతో.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా వామపక్షాలు, కాంగ్రెస్, ఇతర ప్రజాసంఘాలు చేపట్టిన ‘ఛలో లోక్‌భవన్’ కార్యక్రమంతో విజయవాడ నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల దాడిలో విద్యార్థి సంఘాల కార్యకర్తలు ముగ్గురు గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. వీరిని పోలీసులు కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. గాయపడ్డ వారిలో తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షురాలు జ్యోతి çస్పృహ తప్పిపడిపోగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకుడు వంశీ, ఏలూరు జిల్లా కార్యకర్త మాధవ్‌ను పోలీసులు గుండెపై తన్నటం, తోపులాటలో గాయపడ్డారు. వేర్వేరు పోలీసుస్టేషన్లకు నేతల తరలింపు.. ఇక విజయవాడ లెనిన్ సెంటర్లో ఆందోళనకు దిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, వి. ఉమామహేశ్వరరావు, వి. రాంభూపాల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పి. ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఎం.రామకృష్ణ, ఎంసీపీఐయు నాయకులు ఖాదర్‌బాషా, ఎస్యుసీఐసీ నాయకులు కె. సుధీర్, కాంగ్రెస్ ఏపీ ఇన్చార్జి వి.మోహన్, ఆ పార్టీ నేతలు గిడుగు రుద్రరాజులతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేశారు. వీరందరినీ ఇబ్రహీంపట్నం, భవానీపురం, కొత్తపేట టూటౌన్, సింగ్‌నగర్, నున్న, సత్యనారాయణపురం, కృష్ణలంక పోలీసుస్టేషన్లకు తరలించారు. కార్యక్రమానికి మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభానాద్రీశ్వరరావు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారు ఎస్ఎల్ విల్లాస్‌లో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన చలో లోక్‌భవన్ నేపథ్యంలో ఆమెను నిర్బంధించారు. -
పాతకు కోత.. కొత్తకు బాట
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పెనుమార్పులకు నాంది పలకనుంది. రానున్న దశాబ్దంలో ఉద్యోగ అవకాశాలను విప్లవాత్మక రీతిలో ప్రభావితం చేయనుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యోగాల అవసరం భారీగా తగ్గిపోనుంది. అదే సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలకు తలుపులు తెరచుకుంటున్నాయి. వెరసి శరవేగంగా మారుతున్న సమాచార, సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే ఉద్యోగ భరోసా అన్నది స్పష్టమవుతోందని అమెరికాలోని ప్రముఖ సాంకేతిక సంస్థ ‘మెక్ కిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్’ కుండబద్దలు కొట్టింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఏఐ ప్రభావంపై ఆ సంస్థ అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 రంగాల్లో 3.60 కోట్ల ఉద్యోగాలకు కోత పడనుందని ఆ నివేదిక వెల్లడించింది. కొత్తగా 4 కోట్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మార్కెట్లోకి వస్తాయని భరోసా ఇచ్చింది. నివేదిక ఏం చెబుతోందంటే.. » ఏఐ, ఆటోమేషన్ టూల్స్ విస్తృతితో రానున్న పదేళ్లలో 21 శాతం ఉద్యోగాలకు కోత పడుతుంది. » దశాబ్దాలుగా కొనసాగుతున్న వాటిలో దాదాపు 3.6 కోట్ల ఉద్యోగాల అవసరం ఇక ఉండదు. వీరు ఇతర ఉద్యోగ, ఉపాధి రంగాలకు మారాల్సి ఉంటుంది. » 2.5 కోట్ల ఉద్యోగులు మాత్రం నైపుణ్యాలను మెరుగుపర్చుకుని తమ ఉద్యోగాల్లో కొనసాగుతారు. » ఏఐ ప్రభావంతో కొత్తగా 4 కోట్ల ఉద్యోగాలు ఏర్పడతాయి. ఇప్పటివరకు లేని కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి.» అంటే, ఏఐ ఉన్న ఉద్యోగాలను తుడిచిపెట్టేయడం కంటే.. ఉన్నవాటి కంటే ఎక్కువ ఉద్యోగాలనే సృష్టిస్తుంది. » ఏఐ వల్ల ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, రిటైల్ సేల్స్, కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లోని కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతారు. » ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్), నిర్వహణ, నిర్మాణం (మేన్‌జ్‌మెంట్, కనస్ట్రక్షన్), సాంకేతిక (టెక్నాలజీ) విభాగాల్లో ఉద్యోగాల డిమాండ్ భారీగా పెరుగుతుంది. -
బాబు సర్కార్ నిర్వాకం.. రైతుకు శాపం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం రాష్ట్ర రైతులకు శాపంగా తయారైంది. మార్కెట్లో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తుల సేకరణకు ఆర్థిక చేయూత కోసం పంపే ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రాల వారీగా నిధులు కేటాయిస్తుంది. కానీ రెండున్నరేళ్లుగా ఏపీ విషయంలో మాత్రం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నా.. చంద్రబాబు సర్కారు నోరు మెదపడం లేదు. ఓ వైపు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో లక్షలాది ఎకరాలు సాగుకు దూరమయ్యాయి. సాగైన ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఎంత మేర దిగుబడులు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సంక్షోభ సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తోంది. పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026–27లో పంటల కొనుగోళ్ల కోసం ఏపీ పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు కేంద్రం మొండిచేయి చూపింది. ఈ సీజన్లో కనీస మద్దతు ధరకు పప్పు ధాన్యాలు, నూనెగింజలను కొనుగోలుకు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం భారీగా ఆర్థిక చేయూత ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా రూ.5,547.99 కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. కానీ ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రం కనిపించకపోవడం గమనార్హం.పొరుగున్న కర్ణాటక, తెలంగాణకు ఆర్థిక చేయూత...రాష్ట్రాల వారీగా కేటాయించిన కొనుగోళ్ల విలువను పరిశీలిస్తే కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో 4.66 లక్షల టన్నుల కందులు సేకరణకు రూ.3,937.70 కోట్లు, 6,250 టన్నుల పెసలు కొనుగోళ్లకు రూ.54.87 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కర్ణాటకకు 1.16 లక్షల టన్నుల సోయాబీన్ సేకరణకు రూ.659.27 కోట్లు, 38 వేల టన్నుల పెసలు సేకరణకు రూ.335.83 కోట్లు, 13 వేల టన్నుల పొద్దుతిరుగుడు సేకరణకు రూ.111.90 కోట్లు ఇలా ఈ రాష్ట్రంలో 1.67 లక్షల టన్నుల పంట ఉత్పత్తుల సేకరణకు రూ.1,107 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణలో 62 వేల టన్నుల సోయాబీన్ సేకరణకు రూ.353.90 కోట్లు, 11 వేల టన్నుల పెసల సేకరణకు రూ.94.52 కోట్లు కలిపి 73 వేల టన్నులు పంట ఉత్పత్తుల సేకరణకు రూ.448.42 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మరి ఇదే సమయంలో దేశంలోనే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న ఏపీలో రైతులకు పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఆర్ధిక చేయూత ప్రకటించకపోవడమే ఆందోళనకు గురిచేస్తుంది. రెండేళ్లుగా ఏ పంటకు దక్కని మద్దతు ధర..గడిచిన రెండున్నరేళ్ల గా రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదు. ప్రభుత్వ ఏజెన్సీలను రంగంలోకి దింపి రైతుల నుంచి వారు పండించిన పంట ఉత్పత్తులను మద్దతు ధరలు కొనుగోలు చేసిన దాఖలాలూ లేవు. కనీసం కేంద్రానికి సకాలంలో ప్రతిపాదనలు పంపడం, ఆ మేరకు నిధులను రాబట్టి ధరలు పతనమైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి ఉపశమన చర్యలు చేపట్టకపోవడంతో రెండున్నరేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుత సీజన్లో కందులు, పెసలు వంటి పప్పు ధాన్యాలతో పాటు మొక్కజొన్న పంటలే ఈ కాస్త సాగయ్యాయి. కనీసం వాటికైనా మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం వద్ద ఎలాంటి కార్యాచరణ లేదు. కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరికి అద్దం పడుతుంది. ఈ సీజన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన సమయంలో ప్రతిపాదనలు పంపకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఏపీ రైతుల గోడు పట్టదా?ఖరీఫ్ సీజన్లో వర్షాభావం, సాగునీటి కొరత, పెరిగిన పెట్టుబడుల ఖర్చులు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగు, ఎదుగుదల, దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడింది. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులకు పంట చేతికొచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లభించక పోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంటల కొనుగోళ్లకు కేంద్రం మద్దతు ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగకపోతే అయినకాడకి అమ్ముకొని మరింత నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అవసరమైన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, కోతలకు ముందుగానే పంట కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
బాసులు సేఫ్.. చార్జిషీటే ప్రూఫ్!
ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి, కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌లు పోలీస్ శాఖకు కళ్లు, చెవులు, ముక్కుగా పని చేస్తాయి. రాజకీయ నేతల కదలికల నుంచి శాంతిభద్రతల సమస్య వరకు.. తీవ్రవాద కార్యకలాపాల నుంచి తీవ్రమైన సమస్యల వరకు చీమ చిటుక్కుమంటే పోలీస్ బాస్‌లకు చేరవేస్తారు. మరి కాపు యువకుడు గాదె సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ టీమ్ పట్టుకొచ్చిన దగ్గర్నుంచి.. పోలీసులే కొట్టి చంపి కాల్చి బూడిద చేసే వరకు పోలీస్ బాస్‌లకు తెలియదంటే నమ్మాలా? సాయికృష్ణది ముమ్మాటీకి రాజ్య హత్య. ఇందుకు బాధ్యులైన బాసులను తప్పించేందుకు పౌర హక్కులను హననం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షి, అమరావతి : చంద్రబాబు రెడ్‌బుక్ పాలనలో నాన్ బెయిల్‌బుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) ఉందనే కారణంతో పట్టుకొచ్చిన కాపు యువకుడు గాదె సాయికృష్ణను చట్ట ప్రకారం కోర్టుకు హాజరు పరచకుండా, రోజుల తరబడి లాకప్‌లోనే నిర్బంధించి పోలీసులే కొట్టి చంపేసిన దారుణ ఘటన వెనుక ఉన్న బాసులను రక్షించేందుకు సిట్ పడరానిపాట్లు పడుతోంది. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడంతో డైవర్షన్ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దాని వెనుక ఉన్న బాసులను కాపాడేలా స్కెచ్ వేసింది. ఈ కేసులో కోర్టుకు సిట్ సమర్పించిన 263 డాక్యుమెంట్లతో పాటు 86 పేజీల ఛార్జిషీట్‌ను నిశితంగా గమనిస్తే.. అనేక అనుమానాలు, ఆధారాలన్నీ బాసుల వైపే వేళ్లు చూపిస్తున్నాయి. సాయికృష్ణను పట్టుకొచ్చి కొట్టి చంపే వరకు జరిగిన పోలీస్ టార్చర్ గురించి సిట్ చార్జిషీట్లో వివరించిన తీరు క్రైమ్ థిల్లర్‌ను తలపిస్తోంది. విజయవాడకు చెందిన టాస్క్‌ఫోర్స్ టీమ్ సాయికృçష్ణను మే 6న తీసుకొచ్చింది. ఆపై సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో వేలాడదీసి తీవ్రంగా కొట్టారు. లాకప్‌లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి దారుణంగా చిత్రవధకు గురిచేశారు. పోలీసులు దారుణంగా కొట్టడంతో కిడ్నీలు పగిలిపోయాయి. మర్మాంగం నుంచి రక్తస్రావం అయ్యింది. అతని పరిస్థితి విషమించడంతో ఒక పాత భవనంలోకి తీసుకెళ్లి నిర్బంధించారు. చివరకు పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక మే 12న చనిపోయాడు. అప్పటికి కూడా పోలీసులు ఈ ప్రక్రియకు ముగింపు పలకలేదు. సాయికృష్ణ మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి శ్మశానంలోకి తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు.ఈ కస్టోడియల్ టార్చర్‌పై పూసగుచ్చినట్టు చార్జిషీట్లో పేర్కొన్న సిట్.. దీని వెనుక ఏం జరిగిందన్నది మాత్రం వివరించక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పోలీస్ బాస్‌ల ప్రమేయం లేకుండానే ఇంత జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ దారుణంలో అసలు దోషులను తప్పించేందుకు పక్కా స్కెచ్ వేసిన చంద్రబాబు ప్రభుత్వం.. సిట్ ద్వారా కథ నడిపించింది. నేరం మొత్తాన్ని సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుతోపాటు మరో ఆరుగురికి పరిమితం చేసి.. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, డీజీపీ హరీష్ కుమార్గుప్తాలను మాత్రం సురక్షితంగా పక్కకు తప్పించే ప్రయత్నం చేసింది. అంతా తెలిసినా.. సీపీ మౌనం సాయికృష్ణ ఘటనపై సీపీ మౌనం వహించడం దేనికి సంకేతం అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి డీజీపీ, సీపీ, ఏసీపీలకు ఏమి తెలియదన్నట్టు కథ నడిపిస్తున్నప్పటికీ.. సిట్ చార్జిషీట్లో ప్రస్తావించిన కొన్ని విషయాలు సీపీ ప్రమేయం ఉందనేది చెప్పకనే చెబుతున్నాయి. సీపీ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ టీమ్ సాయికృష్ణను పట్టుకొచ్చింది. అతని అరెస్టు సైతం సీపీ రిజిస్టర్లో నమోదైందని చెబుతున్నారు. విజయవాడ నగరంలోని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంది. అయినా.. ఆరు వారాలపాటు కమిషనరేట్ మొత్తానికి తెలిసినా మౌనం వహించారు. తన కుమారుడు సాయికృష్ణను పోలీసులు పట్టుకొచ్చారని, ఆ తర్వాత కన్పించకుండా పోయాడని అతని తల్లి నేరుగా సీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ కేసులో తమకేమీ తెలియదని న్యాయస్థానానికి పోలీసులు అబద్ధాలు చెప్పారు. సిట్ దర్యాప్తు చేపట్టిన నిందితుల జాబితాలో సీపీ పేరు లేదు. కనీసం 120 మంది సాక్షుల జాబితాలోనూ ఆయనను ఏం జరిగిందో అడగలేదు. ఇదీ చంద్రబాబు సర్కారు నిర్వాకం. సిట్ చార్జిషీట్లోని అంశాలపై అనుమానాలెన్నో » ఈ ఏడాది మే 6వ తేదీ తెల్లవారుజామున మార్కాపురంలోని అద్దె ఇంట్లో సాయికృష్ణను విజయవాడ సీపీ పర్యవేక్షణలోని టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకొచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించింది. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ పంపిన ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని అదే రోజున ఉదయం ఏడు గంటలకు కృష్ణలంక స్టేషన్లో అప్పగించి రశీదు తీసుకుని, ఫొటో దిగారు. » ఆ అరెస్టు కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్–2026లో 194, 195 పేజీల్లో నమోదైనట్టు సిట్ చార్జిషీట్ స్పష్టం చేసింది. అంటే తొలిరోజే సాయికృష్ణ అరెస్టు సీపీ పేరిట ఉన్న రికార్డుల్లోకి ఎక్కింది. మరి అతను కోర్టుకు వెళ్లాడా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? » మే 11న ఏడీసీపీ అధికారిక టాస్క్‌ఫోర్స్ వాట్సాప్ గ్రూపులో సాయికృష్ణ గురించి ఆరా తీశారు. ‘ఇంకా స్టేషన్లోనే ఉన్నాడు’ అని సమాధానం వచ్చింది. ఇది సాక్షుల వాంగ్మూలంగా చార్జిషీట్‌లోనే నమోదైంది. » ఎన్బీడబ్ల్యూలో 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ఉండాల్సిన వ్యక్తి ఐదు రోజులుగా స్టేషన్లోనే మగ్గుతున్నాడని సీపీ కింది అధికారికి తెలిసింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమాచారం సీపీ వరకు వెళ్లిందా? వెళ్తే ఆయన ఏం చేశారు? సిట్ ఈ ప్రశ్న అడగనే లేదు. సాయికృష్ణ స్టేషన్లో ఉన్న విషయం కమిషనరేట్‌కు సమాచారం చేరిందని చార్జిషీటే చెబుతోంది. » మే 8 తెల్లవారుజామున లాకప్ రిపోర్ట్ (డీఎస్ఆర్) కోసం ఏసీపీ సౌత్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. సెంట్రీ కానిస్టేబుల్ సాయికృష్ణ పేరు రాసి వాట్సాప్‌లో పంపాడు. ఏసీపీ ఆఫీసు దాన్ని డీఎస్‌ఆర్‌లో ఎక్కించింది. ఆ తర్వాత ఆ రిపోర్టులు ’నిల్’గా మారిపోయాయి. కమిషనరేట్ పరిధిలోని ఏసీపీ ఆఫీసు రికార్డులనే తారుమారు చేశారు. ఎవరు చేశారు.. ఎవరి అండతో చేశారు.. అనే ప్రశ్నలకు చార్జిషీట్లో జవాబు లేదు. » స్పెషల్ బ్రాంచ్ డీఎస్ఆర్లోనూ సాయికృష్ణ లాకప్‌లో ఉన్నట్టు ఎంట్రీలు ఉన్నాయని సిట్ పేర్కొంది. స్పెషల్ బ్రాంచ్ నివేదికలు నేరుగా సీపీ టేబుల్‌కే వెళ్తాయి. టాస్క్‌ఫోర్స్, ఏసీపీ ఆఫీసు, స్పెషల్ బ్రాంచ్ అనే మూడు దారుల్లోనూ సమాచారం కమిషనరేట్‌కు చేరింది. అయినా సీపీకి తెలియదంటే నమ్మేదెవరు? » కృష్ణలంక స్టేషన్ ముందున్న రెండు సీసీ కెమెరాలను విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిరంతరం పర్యవేక్షిస్తుందని చార్జిషీటే రాసింది. ఆ కమాండ్ కంట్రోల్ సీపీ ఆధీనంలోనిదే. జూన్ 14 రాత్రి ఆ రెండు కెమెరాలనూ పీకేశారు. ఎన్వీఆర్లోని నాలుగు ఒరిజినల్ హార్డ్ డిస్క్‌లు తీసేసి కొత్తవి బిగించారు. మే 1 నుంచి జూన్ 1 వరకు నెల రోజుల ఫుటేజీ మాయమైంది. సీపీ కమాండ్ కంట్రోల్ కళ్ల ముందే కెమెరాలు ఆగిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేరం మాత్రం ఒక హోంగార్డు, ఒక హెడ్ కానిస్టేబుల్ నెత్తిన పడింది. ఒరిజినల్ హార్డ్‌డిస్క్‌లు ఇప్పటికీ దొరకలేదని చార్జిషీటే ఒప్పుకుంది. కళ్లెదుటే సాక్ష్యాల తొలగింపు » కొడుకు కనిపించకపోవడంతో తల్లి గాదె విజయలక్ష్మి మే 28న సీపీకి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జూన్ 5న ఉన్నతాధికారులందరికీ రిజిస్టర్డ్ పోస్ట్‌లో వినతులు పంపారు. అయినా సీపీ పట్టించుకోలేదు. హైకోర్టు ఒత్తిడి పెరిగాక జూన్ 19న ఆమె నేరుగా కలిస్తేనే కేసు నమోదుకు ఆదేశించారు. ఆ 22 రోజుల్లోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ రూమ్ గోడలపై ఉన్న రక్తపు మరకలను కత్తితో రుద్దేసి.. తొలగించి రంగులు వేశారు. మృతుడి ఫోన్‌ను గోవాకు పంపి ‘బతికే ఉన్నాడు’ అనే నాటకం ఆడారు. సీసీ కెమెరాలు పీకేశారు. ఈ సాక్ష్యాల ధ్వంసం అంతా ఆ 22 రోజుల్లోనే జరిగిందని చార్జిషీట్ చెబుతోంది. సీపీ సకాలంలో స్పందించి ఉంటే ఈ సాక్ష్యాలన్నీ మిగిలేవి కావా? » సాయికృష్ణ తల్లి వేసిన హేబియస్ కార్పస్ పిటిషన్లో ప్రతివాదులు డీజీపీ, సీపీ. వారి తరఫున జూన్ 4న, మళ్లీ జూన్ 15న ‘సాయికృష్ణ మా కస్టడీలో లేడు’ అని హైకోర్టుకు సమాచారం వెళ్లింది. ‘మూడు ప్రత్యేక బృందాలు వేశాం. మార్కాపురం సహా పలుచోట్ల గాలించాం. 74 మందిని విచారించాం’ అంటూ న్యాయ స్థానానికే కట్టుకథ వినిపించారు. మూడు ప్రత్యేక బృందాలు వేసే అధికారం సీఐకి ఎక్కడిది? అది కమిషనరేట్ స్థాయి నిర్ణయం. అయినా ఈ అబద్ధానికి సీఐ ఒక్కడే బాధ్యుడని సిట్ తేల్చేసింది. » జూన్ 15న సీఐని వీఆర్‌కు పంపారు. అంటే ఆ రోజుకే పెద్దలకు అనుమానం వచ్చింది. అదే రోజు ‘కస్టడీలో లేడు’ అనే అబద్ధం సీపీ ప్రతివాదిగా ఉన్న కేసులో హైకోర్టుకు చేరింది. దాన్ని ఆమోదించిన అధికారి ఎవరో సిట్ కనీసం ఆరా తీయలేదు. » చార్జిషీట్లోని 120 మంది సాక్షుల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డులు, పెయింటర్, పెయింట్ షాపు యజమాని, హోటల్ సిబ్బంది ఉన్నారు. కానీ ఈ వ్యవస్థకు అధిపతి అయిన సీపీ పేరు మాత్రం లేదు. సీసీ టీవీ రికార్డుల కోసం ఆయనకు ఒక నోటీసు పంపి, ఆయన కార్యాలయం ఇచ్చిన జవాబుతో సిట్ సరిపెట్టుకుంది. సీఐ వాడిన రెండు ఫోన్లు ఇప్పటికీ దొరకలేదు. ‘ఎక్కడ పెట్టానో గుర్తులేదు’ అని సీఐ చెబితే సిట్ అదే రాసుకుని వదిలేసింది. ఆ ఫోన్లు బయట పడితే మే 6 నుంచి జూన్ 15 వరకు సీఐకి పై నుంచి ఎవరెవరు ఫోన్లు చేశారో బయట పడుతుంది. అందుకే ఆ ఫోన్ల జోలికి వెళ్లలేదా?కీలక పరిణామాలిలా..1) సాయికృష్ణపై రెండు కేసుల్లో వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.2) మే 6 తెల్లవారుజామున సీపీ టాస్క్‌ఫోర్స్ బృందం మార్కాపురంలో అతన్ని పట్టుకుంది. 3) అదే రోజు ఉదయం 7 గంటలకు కృష్ణలంక స్టేషన్లో అప్పగించారు. 4) మే 6 నుంచి 9 వరకు నాలుగు రోజులు లాకప్‌లోనే ఉంచారు. 5) గంజాయి సమాచారం కోసం స్టేషన్ పై అంతస్తులోని క్రైమ్ రూమ్‌లో చేతులు హుక్కు వేలాడదీసి కొట్టారు. 6) దెబ్బలకు మోకాళ్లు వాచిపోయాయి. నడవలేకపోయాడు. మూత్రంలో రక్తం వచ్చింది. 7) మే 8న ఆర్ఎంపీ డాక్టర్‌ను స్టేషన్‌కు పిలిపించి ఇంజెక్షన్లు ఇప్పించారు. 8) అదే రోజు ఆ స్థితిలోనే గుణదల ప్రాంతంతోపాటు, ఒక హోటల్‌కు తిప్పారు. 9) మే 9న పరిస్థితి విషమించడంతో రాణిగారితోటలోని పాడుబడిన భవనానికి తరలించారు. 10) మే 12 మధ్యాహ్నం అక్కడే చనిపోయాడు. 11) అదే రోజు రాత్రి బైక్‌పై శవాన్ని స్వర్గపురి శ్మశానానికి తీసుకెళ్లారు. అప్పటికే కాలుతున్న ఓ చితిపై సాయికృష్ణ శవాన్ని వేసి కాల్చేశారు.12) మే 18న మళ్లీ వెళ్లి అవశేషాలు ఏమైనా మిగిలాయేమో చూసి వచ్చారు. 13) తుదకు లాకప్ రిజిస్టర్లలో సాయికృష్ణ పేరే లేకుండా చేశారు. రిపోర్టుల్లో ‘నిల్’ అని రాశారు. 14) సాయి కృష్ణ తల్లి మే 28న సీపీకి ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది జూన్ 19న.సీఐ దగ్గరే ఆగిన చార్జిషీట్» హైకోర్టు కేసులో డీజీపీ కూడా ప్రతివాది. తల్లి వినతులు డీజీపీకీ వెళ్లాయి. సిట్ ఏర్పాటైంది డీజీపీ ఉత్తర్వులతోనే. దర్యాప్తు చేసింది ఆయన కింద పనిచేసే ఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీలు. తమ బాసే ప్రతివాదిగా ఉన్న కేసులో సొంత సీపీ పాత్రను వారు ఎలా విచారిస్తారు? అందుకే చార్జిషీట్ సీఐ దగ్గరే ఆగిపోయింది. » డీజీపీ, సీపీ, ఏసీపీల పాత్రపై విచారణ కోరుతూ విజయవాడ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. ఆ విచారణ ముందుకు కదలకుండా ఏసీపీ మానస హైకోర్టుకు వెళ్లి ఆగస్టు 13న స్టే తెచ్చుకున్నారు. తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకు? » చివరికి సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. దర్యాప్తును తానే నేరుగా పర్యవేక్షిస్తానని ప్రకటించింది. సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరు పరచలేదు.. ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైంది.. సీసీటీవీ ఫుటేజీ ఏమైంది.. మృతదేహం ఎందుకు దొరకలేదు.. అని ధర్మాసనమే నిలదీసింది. ఆ ప్రశ్నలన్నీ వేలెత్తి చూపిస్తున్నది పోలీస్ కమిషనరేట్ వైపే. » సీఐకి డిఫాల్ట్ బెయిల్ గడువు ముంచుకొస్తుండటంతో రెండు రోజుల ముందు హడావుడిగా చార్జిషీట్ వేశారు. బూడిద, ఎముకల ఎఫ్ఎస్ఎల్ నివేదిక, తల్లి రక్త నమూనాతో డీఎన్ఏ పోలిక, ఎన్వీఆర్ లాగ్స్, 15 మెమరీ కార్డులు, 6 హార్డ్‌డిస్క్‌ల డేటా అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని చార్జిషీటే ఒప్పుకుంది. పోస్టుమార్టం లేదు. శవ దహనం కథ అంతా ఒక నిందితుడి వాంగ్మూలంపైనే నిలబడింది. పెద్దల జోలికి వెళ్లకుండా, సగం ఆధారాలు కూడా లేకుండా వేసిన ఈ చార్జిషీట్ కోర్టులో ఎంత వరకు నిలుస్తుందన్నది ప్రశ్నార్థకమే. -
ఈ–కేవైసీ 28 శాతమే పూర్తి
సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదులో భాగంగా రైతుల ఈ–కేవైసీ 28 శాతమే పూర్తయిందని వ్యవసాయ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు జి.బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. ‘ఈ–పంట నమోదులో రైతుల అగచాట్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై శనివారం ఆయన ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 2.75 కోట్ల భూమి విస్తీర్ణపు నమోదులకు గాను 2.70 కోట్ల నమోదులు (98 శాతం) పూర్తయ్యాయని చెప్పారు. అయితే 88,03,057 మంది రైతులకు గాను ఇప్పటివరకు 24,25,455 మందికే ఈ–కేవైసీ పూర్తయిందని, ఇది 28 శాతమేనని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగిస్తున్నామన్నారు. అప్లోడ్ చేసిన ఫొటోలను కృత్రిమ మేధతో పరిశీలించి 98 శాతం ఖచ్చితత్వం సాధిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
సంక్షోభంలో ప్రజారోగ్యం
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగం సంక్షోభంలో పడుతోంది. 2030 నాటికి 1.11 కోట్ల మంది వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. హెల్త్ వర్క్‌ఫోర్స్ లెవెల్స్, ట్రెండ్స్–2026 నివేదికను డబ్ల్యూహెచ్ఓ తాజాగా ప్రచురించింది. భారత్ సహా 122 దేశాల వైద్యుల డేటాను విశ్లేషించింది. ఈ నేపథ్యంలో వైద్యుల్లో 25 శాతం మంది 55 ఏళ్లు, ఆ పైన వయసులో ఉన్నట్లు తెలిపింది. వీరంతా వచ్చే దశాబ్ద కాలంలో రిటైరైతే వైద్యుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇలా ప్రపంచానికే వైద్యుల కొరత గండం పొంచి ఉన్న పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించకుండా రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలిపీఠం ఎక్కిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువలో ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల కల్పన, ఎక్కువమంది వైద్యులను తయారుచేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలను గత వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. వీటిలో 10 కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు అక్కడ తరగతులు ప్రారంభించకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది. ఫలితంగా మన పేద విద్యార్థుల వైద్యవిద్య కల చెదిరిపోవడమే కాకుండా, రాష్ట్రానికి కొత్తగా వైద్యులు సమకూరే అవకాశాలు లేకుండాపోతున్నాయి. అనుమతులు వచ్చినా ప్రారంభించకుండా..ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతీ 10 వేల జనాభాకు 45 మంది వైద్యులు, నర్సులు ఉండాలి. కానీ, మన దేశంలో వీరు ఈ అవసరాలకు తగ్గట్లుగా లేరు. దీన్ని అధిగమించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2014 నుంచి దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపునకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అయితే, 2014–19 మధ్య కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేయకుండా చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం తలపెట్టారు. ఆ తర్వాత 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వ వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లా చేయడంతో పాటు, ప్రతీ జిల్లాలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒకేసారి 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చేపట్టడమే కాకుండా వందేళ్ల రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2023–24లో ఏకంగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు. 2024–25లో మరో ఐదు కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా సార్వత్రిక ఎన్నికల నాటికే అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే, ఆ ఏడాది అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం కళాశాలలన్నీ ప్రైవేట్‌కు ఇచ్చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పులివెందుల వైద్య కళాశాలను ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అనుమతులిచ్చినా మాకు కళాశాల వద్దని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా లేఖ రాసి అనుమతులు రద్దుచేయించింది. ఇలా 2024–25లో నాలుగు, 2025–26లో ఆరు వైద్య కళాశాలలు చొప్పున 10 వైద్య కళాశాలలు ప్రారంభించకుండా చంద్రబాబు గాలికొదిలేశారు. తీవ్రంగా నష్టపోతున్న పేద విద్యార్థులుప్రైవేట్ మోజులో చంద్రబాబు కుట్రల కారణంగా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి విద్యార్థులు పెద్దఎత్తున ఎంబీబీఎస్, పీజీ సీట్లను కోల్పోతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో 700, 2025–26లో 1,750 చొప్పున రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరంలోనూ కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కాకపోవడంతో మరో వెయ్యి సీట్లను మన విద్యార్థులు కోల్పోతున్నారు. ఈ లెక్కన మూడేళ్లలో ఏకంగా 3,500 మంది విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రచించిన ప్రణాళిక ప్రకారం 10 వైద్య కళాశాలలు ప్రారంభమై ఉంటే.. మొదటి బ్యాచ్ విద్యార్థులందరూ 2030 నుంచి వైద్య పట్టభద్రులుగా బయటకు వచ్చేవారు. 2030లో 700 మంది, ఆ తర్వాతి ఏడాది నుంచి ఏటా 1,750 మంది వైద్య పట్టభద్రులు రాష్ట్రానికి సమకూరేవారు. అంతేకాక.. ప్రతీ కాలేజీలో 20 వరకూ పీజీ సీట్లు సమకూరి భవిష్యత్తులో ఏటా 200 మంది కొత్త స్పెషలిస్ట్ వైద్యులు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది. -
బీసీలకు వెన్నుపోటు అడ్డంగా దొరికినా బుకాయింపే
సాక్షి, అమరావతి : పార్లమెంట్ చట్టం ద్వారా తప్ప కేవలం జీవోలతో సాధ్యం కాని బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు సగం జనాభా ఉండే వెనుకబడిన తరగతి ప్రజలను మభ్యపెడుతోంది. ఈ క్రమంలో ఆడిన రాజకీయ డ్రామాలో అడ్డంగా దొరికి పోయినా, సీఎం చంద్రబాబు.. మంత్రులు మాత్రం ఇంకా బుకాయించడం మానుకోలేదు. బీసీలకు వెన్నుపోటు పొడవడం అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్నా, దాన్ని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పైకి నెట్టేసి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర హైకోర్టులో గానీ, సుప్రీంకోర్టులో గానీ పిటీషన్ దాఖలు చేయకపోయినా, నింద మోపాలని చూస్తున్నారు. మరో వైపు 2020–21లో జరిగిన గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అప్పటి జగన్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో అధికారుల స్థాయిలో ఏ స్థానంలో, ఏ సామాజిక వర్గ అభ్యర్థి పోటీ చేయాలనే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటిని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోర్టులో నిలబడదని తెలిసీ కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ జీవో ఇచ్చింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాక కేబినేట్ తీర్మానం పేరుతో మరో డ్రామాకు తెరతీసింది. టీడీపీ నేత ద్వారా కోర్టుకు వెళ్లి అడ్డగింత2020–21లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీన జీవో 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 59 శాతం రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ బిర్రు ప్రతాప్ రెడ్డి అనే టీడీపీ నేత సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఈ నేతను ఉపాధి హామీ పథకం అమలు తీరును పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్ (ఎపీఎస్ఈజీసీ)లో సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9వ తేదీన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో 96 జారీ చేసింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నా, మంత్రులు మాత్రం తాజాగా శనివారం (అక్టోబరు 10న) కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందలేయడం దారుణం అని సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఆ రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు 2020 జనవరిలో రాష్ట్ర హైకోర్టు కూడా ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. అప్పట్లో జనవరి 17వ తేదీన పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడానికి అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసుకోగా, అప్పటి జగన్ ప్రభుత్వం తీసుకున్న 59 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత బిర్రు పత్రాప్‌రెడ్డి 2020 జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు స్టే ఇచ్చి.. తిరిగి ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర హైకోర్టులో నిర్ణయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా 2020 జనవరి–ఫిబ్రవరి నెలల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఐదేళ్ల కిత్రం ఎన్నికల్లోనే బీసీలకు 34 శాతం పదవులు 2020–21లో జరిగిన మున్సిపల్ ఎన్నికలప్పుడు రాష్ట్ర హైకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని ఆదేశాల అనంతరం కూడా అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు దాదాపు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. అప్పటికి రాష్ట్రంలో మొత్తం 103 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా, వాటిలో 34 మున్సిపల్ చైర్మన్ పదవులను బీసీలకే కేటాయిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు 2020 మార్చి 7వ తేదీన గెజిట్ నెంబరు 4 జారీ చేసింది. అప్పటికి ఉన్న 16 నగర కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు 5 పదవులు కట్టబెట్టింది. అయితే ప్రస్తుత వెన్నుపోటు ప్రభుత్వం.. ఇదివరకెన్నడూ లేని విధంగా బీసీలకు 34 శాతం పార్టీ పరంగా ఇవ్వనున్నామని చెప్పుకోవడంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. -
ఈడీ.. ఎల్లో కేడీ!
సాక్షి, అమరావతి, హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం పరిధిలో పనిచేసే దర్యాప్తు సంస్థ. ప్రధానంగా మనీలాండరింగ్, విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేయడం దీని బాధ్యత. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాస్తా ‘ఎల్లో ఫోర్స్ డైరెక్టరేట్’గా రూపాంతరం చెందింది. బాధ్యతలను గాలికొదిలేసింది. చట్టాలను, కోర్టులను చట్టుబండలను చేసేసింది. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఆడమన్నట్టల్లా ఆడడం. ఏది చెబితే అది చేయడం... ఈడీ ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ అనుకుంటే చంద్రబాబు జేబు సంస్థ అయిపోయిందని విమర్శకులంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతరులపై నమోదైన మనీలాండరింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలని, వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సంధించిన ప్రశ్నలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్ధమౌతుంది. ఇప్పటికే రెగ్యులర్ విచారణ జరుగుతూ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న వ్యవహారంపై మళ్లీ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరమేమిటని ధర్మాసనం ప్రశ్నించింది, ఆర్థికల్ 21 ప్రస్తావనపై సందేహాలు వ్యక్తం చేసింది. మరోవైపు, వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు, వాటిపై ముందుగానే ఎల్లో మీడియా లో కథనాలు, ఈడీ ప్రెస్‌నోట్, పొలిటికల్ పార్టీ తరహాలో చేసిన ట్వీట్ చూస్తే ఈడీ ఏ స్థాయికి ‘ఎల్లో ఫోర్స్’గా దిగజారిందో తేటతెల్లమవుతుంది. పలు కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు, దిగువ కోర్టులు పలు మార్లు మొట్టికాయలు వేసినా ఈడీ తీరు మారడం లేదు.అవినాష్‌కు నోటీసు.. ముందే ఎల్లో మీడియాలో..వివేకా హత్య కేసుతో ఎలాంటి సంబంధమూ లేని అవినాష్ రెడ్డిపై ఆరోపణలు, సీబీఐ దర్యాప్తు, చార్జిషీట్లు, అనుబంధ చార్జిషీట్లు అన్నీ ముగిసి కోర్టులో విచారణ కూడా కొలిక్కి వచ్చిన తర్వాత చంద్రబాబుకు మళ్లీ ఏడేళ్ల తర్వాత అవినాష్ అవసరమొచ్చాడు. వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. చంద్రబాబు చెప్పినట్టుగానే.. చెప్పిన సమయంలోనే ఓ నోటీసు ఇచ్చేసింది. ఇక్కడ విశేషమేమిటంటే.. అవినాష్ కు అక్టోబర్ 3న నోటీసు ఇస్తే.. నోటీసు ఇవ్వబోతున్న విషయం చంద్రబాబుకు సన్నిహితులైన ఎల్లో మీడియా అధినేతలకు మూడు రోజులు ముందే తెలిసిపోయింది. అక్టోబర్ 1నే ఈ నోటీసు విషయాన్ని ఎల్లో పత్రికలు, చానళ్లు ప్రముఖంగా ప్రచురించేసాయి.. ప్రసారం చేసేశాయి.అంటే అర్ధం కావడం లేదూ ఈడీ ఏం చేస్తుందో.. ఎవరి తరఫున పనిచేస్తుందో... ఒక్క అవినాషే కాదు.. చంద్రబాబు వేలు ఎవరివైపు తిరిగితే వాళ్లను వేధించడం ఈడీ ప్రధాన బాధ్యత అన్నట్టు అయిపోయింది. మిధున్‌రెడ్డి అయినా, కారుమూరి నాగేశ్వరరావైనా, సునీలైనా, అంబటి రాంబాబైనా.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అయినా.. విక్రాంత్‌రెడ్డి అయినా.. నోటీసులు, అరెస్టులు, వేధింపులు మామూలే. చంద్రబాబుకు అవసరమొచ్చినపుడు వెంటనే ఈడీ వాలిపోతోంది. బాబు ప్రత్యర్థులకు.. అంటే వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు.. జనం దృష్టిని మళ్లించడం మామూలైపోయింది. అంటే చంద్రబాబు రాజకీయ అవసరాలను తీర్చే ఒక పనిముట్టులా ఈడీ మారిపోయింది. టార్గెట్ జగన్... ఈడీ కొత్త మిషన్..ఈడీకి చంద్రబాబు ఇప్పుడు ఓ కొత్త మిషన్ అప్పగించారు. అదే టార్గెట్ జగన్. అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ తమ వాణి వినిపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రజాక్షేత్రం నుంచి తప్పించి కోర్టుల చుట్టూ తిప్పాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందులో భాగంగానే వేగవంతమైన విచారణ పేరుతో వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ హైకోర్టును అభ్యర్థించడం. అంటే చంద్రబాబు కోసం పనిచేయడం తప్ప ఇందులో ఈడీ చట్టబద్ధంగా చేస్తున్న డ్యూటీ ఏదీ లేదు. ఎందుకంటే సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై ఇప్పటికే రోజువారీ ట్రయల్ నడుస్తోంది. జగన్ తరఫున న్యాయవాదులు హాజరై తమ వాదనలను కూడా వినిపిస్తున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా వ్యక్తిగతంగా జగన్ హాజరు కావాలంటూ ఈడీ పిటిషన్ వేయడం కచ్చితంగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం జరుగుతున్న దురుద్దేశ చర్య మాత్రమేనని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది. చంద్రబాబు వేస్తున్న సొంత సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)లు ఆయన క్షేమం కోసం, ఆయన చెప్పినట్లు దర్యాప్తు చేయడం కోసం పరుగులు పెడుతుంటాయి. ఇపుడు ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ అనే గౌరవాన్ని కోల్పోయిందని, చంద్రబాబు సిట్‌కు ఎక్స్టెన్షన్ ఆఫీసులా మారిపోయిందని న్యాయవర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.కోర్టులెన్ని మొట్టికాయలు వేసినా..ఆల్రెడీ సీబీఐ కోర్టులో రెగ్యులర్‌గా విచారణ జరగడం, హైకోర్టుకు ఎప్పటికప్పుడు రిపోర్టులు సబ్మిట్ చేయడం జరుగుతున్నాయి. అయినా తుత్తర ఆగక ఈడీ అడిగినట్టుగానే కొద్దికాలం క్రితం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు వేగవంతమైన విచారణ జరగాలంటూ కేసు వేస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిన సంగతి తెల్సిందే. అలాగే మరో రెండు కేసుల విచారణ సందర్భంగానూ కోర్టులు స్పష్టమైన తీర్పులిచ్చాయి. తెలంగాణ హైకోర్టులో జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తూ 2022 సెప్టెంబర్8న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం అతి ముఖ్యమైన తీర్పునిచ్చింది. ఈడీ కేసులో తుది తీర్పును సీబీఐ ప్రధాన కేసులో తీర్పు వెలువడే వరకు వాయిదా వేయాలని ధర్మాసనం పేర్కొంది. సీబీఐ కేసులో తీర్పు ముందుగా రావడం న్యాయ ప్రయోజనాలకు అనుకూలమని పేర్కొంది. నేరం ద్వారా ఆదాయం వచ్చిందని నిర్ధారించే ముందు, అసలు ఆ వ్యక్తి సంబంధిత నేరానికి పాల్పడ్డాడా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అలాగే విజయ్ మదన్‌లాల్ చౌదరి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో 2022 జులై 27న సుప్రీంకోర్టు కూడా ఇదే విధమైన తీర్పు ఇచ్చింది. అసలు నేరం జరిగిందా? ఎవరి పాత్ర ఎంత అనే విషయాలను సీబీఐ తేల్చాల్సి ఉందని, ఆ తర్వాతే నేరం ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనే విషయాలను ఈడీ తేల్చ వచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. మరి జగన్ కేసుల విషయంలో ఈడీ ఎందుకు తొందర పడుతోంది? వాస్తవమేమిటో తేలకుండా తొందరపాటులో ఔచిత్యమేమిటి? ఎవరు చెబితే ఇలా నిబంధనలకు, న్యాయస్థానాలకు విరుద్ధంగా ఈడీ తొందరపడుతోంది...?తప్పుడు కేసులు.. త్వరగా ముగియాలనే..నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. అంటే కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారని అర్ధం కావడం లేదూ? పొలిటికల్ ప్రెస్‌నోట్.. ట్వీట్..కొత్తగా కేసులు నమోదైనప్పుడో, లేదా ఒక కేసుకు సంబంధించి రికవరీలు ఉన్నప్పుడో ఈడీ ప్రెస్నోట్లు విడుదలచేయడం సహజంగా జరుగుతుంటుంది. కాని, అకస్మాత్తుగా ఏ పరిణామం లేకుండానే, కొనసాగుతున్న కేసులగురించి, అందులోనూ కోర్టుల్లో ట్రయల్ నడుస్తున్న కేసులగురించి ఈడీ ప్రెస్‌నోట్ రిలీజ్చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈడీ ప్రెస్ నోట్ చూస్తే అందులో అది దర్యాప్తు సంస్థ ప్రెస్‌నోట్ మాదిరిగా కాకుండా, పూర్తిగా రాజకీయ అంశాలతో ముడిపడినట్టుగా స్పష్టంగా ఉంది. ఈడీ ప్రకటన వెలువడిన వెంటనే ఎల్లో మీడియా మరింత శివాలెత్తిపోయింది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని అర్ధం కావడం లేదూ? అయినా ఓ రాజకీయ పార్టీ ట్వీట్ చేసినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ ట్వీట్ చేయడం చూస్తే ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర దాగి ఉందో తెలుస్తూనే ఉంది.ఈడీ బరితెగింపును బట్టబయలు చేసిన హైకోర్టు..జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా మోపిన కేసుల విచారణకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఈడీపై కీలక ప్రశ్నలు సంధించింది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే హైకోర్టు పర్యవేక్షిస్తోందని, ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలు కూడా ఇచ్చినప్పుడు మళ్లీ పిటిషన్ దాఖలు చేయడంలో ఈడీ ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. సంబంధిత కేసుల విచారణలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులు తమకు తెలుసని వ్యాఖ్యానించింది. జగన్‌తో పాటు ఇతరులపై నమోదైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కేసుల్లో రోజువారీ విచారణ జరిపించి, త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషి, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసినప్పుడు, మరో పిటిషన్ దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణ కొనసాగుతున్నప్పుడు, మళ్లీ ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమిటన్న అంశాన్ని ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని గుర్తుచేస్తూ, ఈడీ తన పిటిషన్లో ఆ నిబంధనను ఎలా ప్రస్తావిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, తాజా పిటిషన్ విచారణార్హతపైనా సందేహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్), సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నమోదైన సుమోటో కేసులతో కలిపి ప్రస్తుత పిటిషన్‌ను విచారణకు జాబితా చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. -
కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్స్.. రియాలిటీ వీక్: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో ముగ్గురు సీఎంల ముచ్చట నడుస్తోందని.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కేవలం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసమే రూ.109 కోట్ల ప్రజాధనాన్ని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మంచినీళ్లలా ఖర్చుచేసిందని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోయినా కేవలం ప్రచార ఆర్భాటాలతో పబ్లిసిటీ పీక్, విషయం మాత్రం వీక్ అన్న చందంగా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ లు ముగ్గురు ముఖ్యమంత్రుల్లా వ్యవహరిస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో కోసం జరుగుతున్న ఖర్చును గణాంకాలతో సహా నిలదీశారు.గతంలో వైఎస్ జగన్ అందించిన 38 సంక్షేమ పథకాల్లో 34 పథకాలను అడ్డగోలుగా ఎత్తేసిన కూటమి ప్రభుత్వం, మిగిలిన అరకొర పథకాలనే ప్రతి నెలా జిల్లాల వారీగా పదే పదే ప్రారంభిస్తూ ప్రజల సొమ్ముతో ప్రచార ఈవెంట్లు నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు.రాజకీయాల్లో చంద్రబాబును మించిన బూటకపు స్టార్ లేడుసినిమాల్లో వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నటులు ఉన్నారు. వాళ్లది నటన వృత్తి. కానీ రాజకీయాల్లో ప్రజాసేవ చేయాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఒక మాయల మరాఠీగా మారారు. నటనలో, డ్రామాల్లో, బూటకాల్లో చంద్రబాబును మించిన స్టార్ దేశంలోనే లేడు. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తెస్తే వివరాలు చెప్పడం ఆనవాయితీ. కానీ 'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ' అన్నట్లు ఒకే పథకాన్ని ప్రతి నెలా ఒక్కో జిల్లాలో మళ్లీ మళ్లీ ప్రారంభిస్తూ చంద్రబాబు ఈవెంట్ మేనేజర్‌గా మారారు. నిన్న ప్రకాశం జిల్లాలో జరిగింది కూడా అదే తతంగం. కేడర్‌ను ఉత్తేజపరచడానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు.ఆత్మస్తుతి.. పరనింద.. జగనన్న జపం..ప్రపంచ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి వింత జీవిని ఎక్కడా చూసి ఉండం. వేదిక ఏదైనా ఆయన నోట వినిపించేది మూడే విషయాలు. ఒకటి ఆత్మస్తుతి, రెండు పరనింద, మూడు జగనన్న జపం. 45 ఏళ్ల అనుభవం ఉందని సొంత డబ్బా కొట్టుకోవడం ఆత్మస్తుతి అయితే, ప్రసంగంలో 70 శాతం వైఎస్ జగన్‌ని విమర్శించడమే పరనింద. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల బుర్రల నిండా వైఎస్ జగనే ఉన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్ జగన్ స్థానాన్ని చెరిపివేయలేక వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. వర్షాభావం, కరువు, రైతాంగ సమస్యలపై మాట్లాడకుండా పదే పదే గత ప్రభుత్వంపై బురద చల్లడం వీరి దిగజారుడుతనానికి నిదర్శనం.చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మీరు, మీ ప్రసంగాల్లో వైఎస్ జగన్ పేరునే పదేపదే ప్రస్తావిస్తున్నారు? మీ ఆలోచనల్లో, మీ రాజకీయాల్లో జగన్‌గారే కనిపిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. వైఎస్ జగన్‌ని విమర్శించడం, ఆయన కుటుంబంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారం చేయడం మానేసి, మీ పాలన గురించి మాట్లాడండి. 28 నెలల పాలనలో ఏం సాధించారో, సూపర్ సిక్స్ హామీల పరిస్థితి ఏమిటో, సూపర్ సెవెన్ గురించి ఏం చెబుతారో ప్రజలకు వివరించండి.మద్యం కేసు, వివేకానందరెడ్డి కేసు వంటి అంశాలను పదేపదే ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని మళ్లించడం కాకుండా, మీ ప్రభుత్వ పరిధిలోని బాధ్యతలపై సమాధానం చెప్పండి. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై దృష్టి పెట్టి, వారికి ఎంత పరిహారం ఇస్తారో ప్రకటించండి. జగన్‌గారిని విమర్శించడం కాదు.. మీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పమని సవాల్ చేస్తున్నా.ముగ్గురు సీఎంలు.. హెలికాప్టర్లకే మంచినీళ్లలా రూ.109 కోట్లు ఖర్చుచంద్రబాబు తాను లక్ష కోట్ల అధిపతి ఎలా అయ్యారో ప్రజలకు టెక్నిక్ చెప్పాలి. హెరిటేజ్ దుకాణాలతో, రెండు ఎకరాలతో లక్ష కోట్లు ఎలా వచ్చాయి? ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. కరకట్ట ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు హెలికాప్టర్, అక్కడి నుంచి ప్రత్యేక విమానం, గమ్యస్థానంలో మళ్లీ హెలికాప్టర్.. ఇలా ఒక్క పర్యటనకే మూడు వాహనాలు వాడుతున్నారు. ఈయనతో పాటు అబ్బాయి లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి ఉంటే, ఇక్కడ ముగ్గురు సీఎంలు ఉన్నట్లుగా దోపిడీ సాగుతోంది.2024-25లో విమాన ప్రయాణాలకు రూ. 54.41 కోట్లు, 2025-26లో రూ. 54.63 కోట్లు.. మొత్తంగా 28 నెలల కాలంలో కేవలం విమానాలు, హెలికాప్టర్ల కోసమే రూ. 109.04 కోట్లు తగలేశారు. 2026-27 బడ్జెట్ కేటాయింపుల్లో ఇప్పటికే రూ. 31 కోట్లు ఖర్చు చేసేశారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ కల్యాణానికి వెళ్తే టీటీడీ లెక్కల్లో రూ. 35 లక్షల ఖర్చు చూపించారు. లేస్తే ఖర్చు, కూర్చుంటే ఖర్చు అన్నట్లుగా ప్రజాధనాన్ని దోచేస్తున్నారు.సభా వేదికలు, టెంట్లు, కుర్చీలు, మైకులు, విద్యుత్, ఎల్ఈడీ తెరలు, హెలిప్యాడ్లు, ప్రజల తరలింపునకు బస్సులు, ఇతర వాహనాలు, స్వాగత ఏర్పాట్లు, బ్యానర్లు, ప్రచార సామగ్రి, అధికారుల ద్వారా చెల్లించే బిల్లులు—వీటి ఖర్చులు ఇంకా అదనం. ఇవన్నీ ప్రజల సొమ్ము కాదా? ముఖ్యమంత్రి పర్యటనల పేరుతో ఇంత ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు, ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా పర్యటనలకే ఇంత ఖర్చు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ఈవెంట్ మేనేజ్మెంట్ పాలన - ప్రచార ఖర్చు రూ.44.62 కోట్లురాష్ట్రంలో పరిపాలన సాగడం లేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కుటుంబాలను కలవడం, టీ బంకుల వద్దకు వెళ్లడం, మర్మరాల వ్యాపారిణితో మాట్లాడటం వంటి కార్యక్రమాలను ప్రచార ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్టు ప్రకారం ప్రశ్నలు, సమాధానాలతో సాగిన ఈ కార్యక్రమం కోసం రూ.44.62 కోట్లు ఖర్చు చేశారు. రోజుకు వందల మందికి మర్మరాలు అమ్ముతూ వేలల్లో ఆదాయం వస్తోందని చెప్పిన వ్యాపారినికి ముఖ్యమంత్రి అక్కడికక్కడే పెన్షన్ మంజూరు చేసినట్లు ప్రకటించడం కూడా ప్రచారానికే పరిమితమైంది. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాల్సిన ప్రభుత్వం, ప్రచార కార్యక్రమాలకే ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నాం.ఒకే పథకానికి పదే పదే ప్రారంభోత్సవాలు..కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ పీక్స్.. రియాలిటీ వీక్ అన్నట్లుగా ఉంది. జగన్ హయాంలో 38 పథకాలు ఉంటే, బాబు వచ్చాక 34 పథకాలను పీకేశారు. ఇచ్చే అరకొర పథకాలకే వందల కోట్ల ప్రచారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతో ఇప్పటివరకు 28 సార్లు వేర్వేరు జిల్లాల్లో ప్రారంభోత్సవాలు చేశారు. మీ భూమి-మీ హక్కు పేరుతో 9 సార్లు సభలు పెట్టారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పేరుతో 21 సార్లు, సంజీవని ఆరోగ్య కార్యక్రమం పేరిట 4 సార్లు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఒకే పథకాన్ని ఇన్నిసార్లు ప్రారంభిస్తూ ప్రజల పన్నుల సొమ్ముతో సభలు, ఫ్లెక్సీలు, డీజేలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటు.దోపిడీ కోసమే పల్లె పండుగ.. ప్రాజెక్టుల వద్ద క్రెడిట్ చోరీ..పల్లె పండుగ పేరిట కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ నిధులతో రొటీన్‌గా జరిగే పనులను తెచ్చి రూ. 11 వేల కోట్ల నిధులు తమ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. గతంలో సీ-ప్లేన్ అంటూ పెద్ద డ్రామా ఆడారు, ఇప్పుడది ఎక్కడుందో తెలియదు. వెలుగొండ ప్రాజెక్టును 85 శాతం పూర్తి చేసింది వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి గారే. కానీ చంద్రబాబు అక్కడికి వెళ్లి బొక్కబోర్లా పడుకుని దండాలు పెడుతూ క్రెడిట్ చోరీ డ్రామాలు ఆడుతున్నారు. అనకాపల్లి జిల్లా జిల్లాకు గోదావరి జలాలు తరలింపు అంశంలో కూడా సేమ్ డ్రోన్లు, కెమెరాలు, బొక్కబోర్లా పడుకోవడం, అప్పటికే ఉన్న లిఫ్ట్ ద్వారా నీరు తరలించి పోలవరం కాలువ ద్వారా గోదావరి నీటిని అనకాపల్లి తీసుకొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తూ చంద్రబాబు హంగామా చేశాడు. అక్కడ కూడా చంద్రబాబు బొక్కబోర్లా పడుకుని దండాలు పెట్టాడు. కెమెరా అనగానే చంద్రబాబులోకి పది మంది ఎన్టీఆర్‌లు, చిరంజీవులు పూనినట్లు నటిస్తారు.పాస్ పుస్తకాలపై రంగుల మార్పు.. కమిషన్ల దందా..ప్రకాశం జిల్లా కొండేపికి వెళ్లి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు... వైఎస్ జగన్ ఇచ్చిన పాస్ పుస్తకాలకు కేవలం రంగు మార్చి ఇస్తున్నారని.. అయితే అందులో కూడా పేర్లు, సర్వే నంబర్లలో తప్పులతో ఉన్నాయని సుధాకర్ బాబు మండిపడ్డారు. గతంలో రూ. 55.79 పైసలకే అత్యాధునిక క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్‌తో పుస్తకాలు ఇస్తే.. నేడు వాటి ధరను రూ. 76 చేసి.. ఒక్కో పుస్తకంపై పెంచిన రూ. 20 కమిషన్ ఎవరి జేబుల్లోకి వెళ్తోందని నిలదీశారు? వైఎస్ జగన్ హయాం కంటే ఒక్క విషయంలోనైనా మెరుగ్గా పరిపాలించానని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఒక్క ఎస్సీలకే రూ.70 వేల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా అందించారని.. ఆయన పెట్టిన అమ్మ ఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, ఇళ్ల పట్టాలు అన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని సుధాకర్ బాబు నిలదీశారు.ఇదీ చదవండి: పార్టీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలి: సజ్జల -
దసరా ఉత్సవాలకు సిద్ధమైన బెజవాడ దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు బెజవాడ దుర్గమ్మ దేవాలయం సిద్ధమైంది. ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 11 నుంచి 20 వరకూ దసరా మహోత్సవాలు జరగనున్నాయి. స్నపనాభిషేకం అనంతరం రేపు(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. దాంతో పది రోజుల పాటు రోజుకో అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది.దసరా మహోత్సవాల్లో అమ్మవారి అలంకారాలుఅక్టోబర్ 11 వ తేదీ బాలా త్రిపురసుందరీ దేవిఅక్టోబర్ 12 వ తేదీ గాయత్రీ దేవిఅక్టోబర్ 13 వ తేదీ అన్నపూర్ణాదేవిఅక్టోబర్ 14 వ తేదీ మహాచండీ దేవిఅక్టోబర్ 15 వ తేదీ లలితా త్రిపుర సుందరీ దేవి అక్టోబర్ 16 వ తేదీ సరస్వతి దేవి (మూలానక్షత్రం)అక్టోబర్ 17 వ తేదీ మహాలక్ష్మీ దేవిఅక్టోబర్ 18 వ తేదీ దుర్గాదేవి ( దుర్గాష్టమి)అక్టోబర్ 19వ తేదీ మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి)అక్టోబర్ 20వ తేదీ రాజరాజేశ్వరి దేవి (విజయదశమి)ఇదీ చదవండి: విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం -
ఈసీకి వైఎస్సార్సీపీ కీలక లేఖ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 2026 జూలై 15వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటరు జాబితాలో చట్టబద్ధంగా నమోదైన అర్హులైన పౌరులందరినీ స్థానిక ఓటర్ల జాబితాలో చేర్చి, వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను (ఎస్ఈసీ) కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఒక లేఖ రాశారు.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2026 ఫిబ్రవరి 5వ తేదీ నాటి పాత ఓటరు జాబితాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే, ఆ తర్వాత జూలై 15 వరకు నియమనిబంధనల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్న వేలాది మంది అర్హులైన ఓటర్లు తమ ప్రాథమిక హక్కును కోల్పోతారని ఆ లేఖలో లేళ్ల అప్పిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం కల్పించేలా, సంబంధిత అనుబంధ మార్పులతో కూడిన తాజా జాబితాను తగినంత ముందుగానే ప్రచురించాలని ఆయన ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఇంకా లేఖలో ఏయే అంశాలు ప్రస్తావించారంటే..జూలై 15 వరకు నమోదైన ఓటర్లను పరిగణనలోకి తీసుకోవాలి: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం, 2026 జూలై 15వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాలో నమోదైన అర్హులైన ఓటర్లందరినీ స్థానిక సంస్థల ఎన్నికల జాబితాలో చేర్చాలని కోరుతున్నాను. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రారంభమైన తేదీగా పేర్కొన్న 2026 జూలై 15వ తేదీ తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ నిలిపివేయబడినట్లు భావిస్తున్నాం. కాబట్టి ఆ తేదీ వరకు నమోదైన వారిని తప్పనిసరిగా చేర్చాలి.ఫిబ్రవరి 5 నాటి పాత జాబితాతో అన్యాయం: ఈ ఎన్నికల కోసం కేవలం 2026 ఫిబ్రవరి 5వ తేదీ నాటి ఓటరు జాబితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తేదీ వరకే జాబితాను పరిమితం చేయడం వల్ల, 2026 జూలై 15 వరకు భారత ఎన్నికల సంఘం రికార్డుల్లో చట్టబద్ధంగా పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత జాబితాలో చేరిన పౌరులందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు.ప్రజాస్వామ్య హక్కును కాలరాయవద్దు: ఈ ఓటర్లందరూ నిర్దేశిత నమోదు ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేశారు. వారి పేర్లు ఇప్పటికే అధికారిక ఓటరు రికార్డుల్లో నమోదై ఉన్నాయి. తదనంతరం ఆమోదించబడిన చేర్పులను పరిగణనలోకి తీసుకోకుండా, పాత ఓటరు జాబితాతోనే ముందుకు వెళ్లడం వల్ల అర్హులైన పౌరులు తమ ప్రాథమిక ఓటు హక్కును కోల్పోవలసి వస్తుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే సమాన అవకాశం ప్రతి అర్హుడైన ఓటరుకూ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి, జాబితాను ముందే ప్రచురించాలి: ఈ నేపధ్యంలో 2026 జూలై 15వ తేదీ వరకు నవీకరించబడిన ఓటరు జాబితాలను, సంబంధిత అనుబంధంగా ఆమోదించబడిన మార్పులతో సహా వెంటనే స్వీకరించాలి. క్షేత్రస్థాయి అధికారులకు ఈ అంశంపై స్పష్టమైన, ఏకరూప మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు, నవీకరించిన స్థానిక సంస్థల ఓటరు జాబితాలను తగినంత ముందుగానే ప్రచురించాలి. తద్వారా ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవడంతో పాటు, ఏవైనా పేర్లు గల్లంతై ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం లభిస్తుందని లేళ్ల అప్పిరెడ్డి ఆ లేఖలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: AP: స్థానిక ఎన్నికలు.. ఎస్ఈసీ కీలక ప్రకటన -
సీపీఎం నేత గఫూర్ కుమారుడి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సీపీఎం నేత గఫూర్ కుమారుడు కిరణ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించి.. కాలిఫోర్నియాలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తూ.. మంచి భవిష్యత్తు కలిగిన కిరణ్ అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు.కన్నకొడుకును కోల్పోయిన ఎం.ఎ. అబ్దుల్ గఫూర్, పి. నిర్మల గార్ల దుఃఖం వర్ణనాతీతం. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి, కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలన్న వైఎస్ జగన్.. కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కిరణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఇదీ చదవండి: ఈసీకి వైఎస్సార్సీపీ 3 కీలక లేఖలు -
పార్టీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా, అవసరమైనప్పుడు న్యాయపరమైన ఆయుధంలా నిలవాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ లీగల్ సెల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పూడి శ్రీహరి, లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైన దశలోకి వెళ్తున్నాయని, పార్టీ లీగల్ సెల్ ఇక సాధారణ అనుబంధ విభాగంగా కాకుండా ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని న్యాయపరంగా పర్యవేక్షించే వ్యవస్థగా పనిచేయాలని అన్నారు.రాష్ట్రంలో చట్టాలు, నిబంధనలు, ఎన్నికల వ్యవస్థలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా అమలవడం లేదని ఆయన అన్నారు. 2024 ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు, దాడులు, వేధింపులు జరిగాయని, అలాంటి పరిస్థితుల్లో లీగల్ సెల్ కార్యకర్తలకు అండగా నిలిచిందని అభినందించారు.ఎస్ఐఆర్ పూర్తయ్యేలోపే ఎన్నికలకు ఎందుకు తొందర?ఎస్ఐఆర్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో చనిపోయినవారి, డూప్లికేట్, అనర్హ ఓట్లు తొలగిస్తున్న పరిస్థితుల్లో, కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తొందరపడుతోందని సజ్జల అన్నారు. ఎస్ఐఆర్ ఫైనల్ జాబితా త్వరలోనే రావాల్సి ఉన్నప్పుడు, దానికి ముందే నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రయత్నం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా ఓటు హక్కు పొందినవారిని జాబితాలో చేర్చకుండా ఎన్నికలు నిర్వహిస్తే వారి రాజ్యాంగబద్ధ హక్కు దెబ్బతింటుందని అన్నారు.బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలిబీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను ప్రజలకు అందుబాటులో పెట్టకుండా శాతం నిర్ణయించడం ఏ ప్రాతిపదికన జరిగిందో వెల్లడించాలని సజ్జల డిమాండ్ చేశారు. కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆధారాలు వెల్లడించాలని అన్నారు.నామినేషన్ దశ నుంచే అప్రమత్తంగా ఉండాలిస్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు పోరాటం నామినేషన్ దశ నుంచే ప్రారంభమవుతుందని సజ్జల అన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీలు, ఇతర అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా అభ్యర్థులకు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని, అందువల్ల ముందుగానే అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేయించాలని సూచించారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత నామినేషన్లకు చాలా తక్కువ సమయం ఉండే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు, ప్రత్యామ్నాయ అభ్యర్థులు, అవసరమైన లీగల్ టీమ్‌లను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని చెప్పారు.గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు లీగల్ నెట్వర్క్ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో అందుబాటులో ఉండే న్యాయవాదులను మ్యాపింగ్ చేసి, వారి కాంటాక్ట్ వివరాలను కంప్యూటరైజ్ చేయాలని సజ్జల సూచించారు. గ్రామ స్థాయి అభ్యర్థికి కూడా తనకు అవసరమైనప్పుడు ఏ న్యాయవాదిని సంప్రదించాలో ముందుగానే తెలిసేలా వ్యవస్థ ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో లీగల్ వార్‌రూమ్, నియోజకవర్గ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు, రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే జిల్లా నుంచి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం చేరి, అవసరమైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్, కోర్టులను ఆశ్రయించేలా వ్యవస్థ పనిచేయాలని చెప్పారు. సెన్సిటివ్ ప్రాంతాలు, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను ముందుగానే గుర్తించి, అక్కడి పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.ప్రతి అక్రమాన్ని రికార్డు చేయాలిఎన్నికల సమయంలో అధికారులు, పోలీసులు లేదా ఇతరులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే వాటిని ఆధారాలతో నమోదు చేయాలని సజ్జల చెప్పారు. ప్రతి ఫిర్యాదు, ప్రతి ఘటన, ప్రతి అధికారిపై వచ్చిన ఆరోపణను డిజిటల్‌గా రికార్డు చేసి, అవసరమైతే లీగల్ చర్యలకు ఉపయోగించాలన్నారు. ఫీల్డ్ స్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని మీడియా, సోషల్ మీడియా, లీగల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా నిలిచింది: పొన్నవోలువైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొన్న కేసులు, అరెస్టులు, వేధింపుల సమయంలో లీగల్ సెల్ వారికి భరోసాగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన, పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టిన సందర్భాల్లో లీగల్ సెల్ వీధుల్లోనూ, కోర్టుల్లోనూ పోరాడిందన్నారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేస్తున్న ప్రతి న్యాయవాదిని భవిష్యత్తులో పార్టీ గుర్తిస్తుందని, వారికి తగిన గౌరవం లభించేలా చూడాలని కోరారు.అభ్యర్థులకు న్యాయవాదులు వెన్నుముకగా నిలవాలి: చెవిరెడ్డివైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి లీగల్ సెల్ కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. కొత్తగా పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు, నామినేషన్ ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండకపోవచ్చని, అందువల్ల న్యాయవాదులు వారికి ప్రతి దశలో మార్గనిర్దేశం చేయాలని సూచించారు.నామినేషన్ పత్రాలు నింపడం నుంచి దాఖలు చేయడం వరకు, కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాలు పొందడం వరకు లీగల్ సెల్ పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఏ అభ్యర్థి నామినేషన్ కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురికాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నామినేషన్‌కు సమర్పించిన పత్రాలన్నింటినీ స్కాన్ చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు డిజిటల్ రూపంలో కూడా పంపితే, తర్వాత పత్రాలు లేవని చెప్పి తిరస్కరించే పరిస్థితుల్లో ఆధారంగా ఉపయోగపడుతుందని సూచించారు. నామినేషన్ తిరస్కరణ జరిగితే వెంటనే న్యాయపరంగా స్పందించి అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని చెప్పారు.ప్రతి నియోజకవర్గంలో న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. పార్టీ అభ్యర్థులకు కేసులు, అరెస్టులతో భయపెట్టే ప్రయత్నాలు జరిగినా వారికి ధైర్యం చెప్పి, చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత లీగల్ సెల్‌పై ఉందన్నారు. తాను కూడా అనేక కేసులు, జైలు జీవితం ఎదుర్కొన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ, కష్టాలను భయపడకుండా గట్టిగా నిలబడటం ద్వారానే రాజకీయంగా ఎదగగలమని పేర్కొన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే నాయకులే భవిష్యత్తులో మరింత ఉన్నత బాధ్యతలకు ఎదగగలరని అన్నారు. అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా దాఖలు కావడం నుంచి వారి గెలుపు వరకు న్యాయవాదులు వెన్నుముకగా నిలవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో లీగల్ సెల్ ప్రధాన పాత్ర పోషించాలి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యం: మనోహర్రెడ్డిలీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సమావేశం సాధారణ పార్టీ సమావేశం కాదని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించే బాధ్యతతో ఏర్పాటు చేసిన సమావేశం అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, పోలీస్ స్టేషన్లలో ఎదురయ్యే సమస్యలు, రౌడీ షీట్లు, బైండ్ ఓవర్ కేసులు తదితర అంశాల్లో న్యాయవాదులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.నియోజకవర్గ కమిటీలను వెంటనే పూర్తి చేసి, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అవసరమైన న్యాయసహాయం 24 గంటలు అందుబాటులో ఉండేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. లీగల్ సెల్లో నిజాయితీగా, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని ప్రోత్సహించాలని, అవకాశవాదులను దూరంగా ఉంచాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశలో పార్టీ అభ్యర్థులకు పూర్తి న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు లీగల్ సెల్ రాష్ట్రవ్యాప్తంగా సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.ఇదీ చదవండి: AP: స్థానిక ఎన్నికలు.. ఎస్ఈసీ కీలక ప్రకటన -
AP: స్థానిక ఎన్నికలు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక వివరాలు వెల్లడించింది. గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒక దశలోనే నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించేందుకు పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.నోటిఫికేషన్ విడుదల చేసిన సమయం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లోనే పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. 15 రోజుల్లో పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు జరగనున్నాయి. రెండు రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 16 రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. రెండు రోజుల తర్వాత ఫలితాలు రానున్నాయి.పంచాయతీలకు మాత్రం పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 16 రోజుల్లో పూర్తి చేయనున్నారు. పోలింగ్ పూర్తయిన రెండు రోజుల తరువాత వీటిలో ఓట్లు లెక్కించనున్నారు.పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా.. మిగిలినవన్నీ పార్టీ పరంగా నిర్వహిస్తారు. నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ ఏది ముందు వెలువడితే.. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికలకు మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. తెలంగాణ నుంచి 17,650 బాక్సులు తెప్పించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ ప్రకటించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్ఈసీ మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు మెటీరియల్ సిద్ధం చేశాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించాలన్న సూచనలు పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఎన్నికల హామీని గంగలో కలిపేసిన బాబు సర్కార్ -
ఎన్నికల హామీని గంగలో కలిపేసిన బాబు సర్కార్
సాక్షి, విజయవాడ: బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మేనిఫెస్టోలో హామీకి చంద్రబాబు మంగళం పాడేశారు. 34 శాతం రిజర్వేషన్ హామీకి చంద్రబాబు ఎగనామం పెట్టారు. స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల హామీని చంద్రబాబు ప్రభుత్వం గంగలో కలిపేసింది.బీసీ రిజర్వేషన్ల చట్టం చేయడంపై కనీసం చర్చించని చంద్రబాబు కేబినెట్.. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కనీసం ప్రయత్నించలేదు. కేంద్రాన్ని 34 శాతం రిజర్వేషన్ కోరుతూ కనీసం తీర్మానం చేయని కేబినెట్.. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌కి ఆమోదం తెలిపింది. మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు భారీ కోత పెట్టింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించామని మంత్రులు వెల్లడించారు.ఆ జనాభా ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చామన్న మంత్రి అచ్చెన్నాయుడు.. 26.73 శాతం పంచాయతీ వార్డు మెంబర్లకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు. సర్పంచ్ లు 27.95 శాతం, ఎంపీటీసీలు 25.55, ఎంపీపీలు 24.60, జడ్పీటీసీలు 24.60, జడ్పీ ఛైర్మన్ లు 23.08 శాతం ఇస్తాం. అర్బన్ వార్డు మెంబర్లు 32.78శాతం రిజర్వేషన్లు ఇస్తాం. మున్సిపల్ చైర్ పర్సన్లు 33.02, మేయర్లు 35.29 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు తీరని ద్రోహం జరిగింది. 2014-19 మధ్యలోనూ బీసీలకు ద్రోహం చేసిన చంద్రబాబు.. స్థానిక ఎన్నికలు పెట్టకుండా బీసీ నాయకత్వాన్ని తగ్గించేశారు. గతంలో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. బిర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు అడ్డుకున్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలి -
ఈ–పంట నమోదులో అన్నదాతలకు అగచాట్లు
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా అమలైన ఈ–క్రాప్ నమోదును చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఈ–పంట నమోదులో ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం కీలకమైన ఈ–పంట నమోదులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. సీజన్ ముగిసినప్పటికీ ఈ–పంట నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. స్వీయ నమోదు, ప్రైవేటు సర్వేయర్ల నియామకం, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు.. ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితాలు మాత్రం శూన్యమే. మరో రెండు వారాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న తరుణంలో రైతుల ఈ–పంట నమోదు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు కరువు బారిన పడిన రైతులు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పొందాలన్నా, పంటల బీమా పరిహారానికి అర్హత పొందాలన్నా ఈ–కేవైసీ కీలకం. సీజన్ ముగిసి పదిరోజులు కావొస్తున్నా ఈ–కైవేసీ నమోదు మాత్రం 19 శాతానికి పరిమితమైంది. స్వీయ నమోదుకు స్పందన శూన్యం..ఈ–పంట నమోదులో 2024 ఖరీఫ్ సీజన్లో రైతులకు మొదలైన కష్టాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తీవ్రరూపం దాల్చాయి. సీజన్ ప్రారంభమైన 20 రోజుల్లో ఈ–పంట నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ రెండున్నరేళ్లుగా ఏ ఒక్క సీజన్లోనూ అలా జరగలేదు. అప్లోడ్ చేసిన పంట ఫొటోలను కృత్రిమ మేధతో విశ్లేషణ చేస్తామని, ఈ పంట నమోదుతో పాటు ఈ–కేవైసీ సమాంతరంగా చేస్తామని బాబు ప్రభుత్వం డబ్బాలు కొట్టింది. కానీ, క్షేత్రస్థాయిలో ఘోరంగా విఫలమైంది.లక్ష్యానికి ఆమడ దూరంలో..డిజిటల్ ఈ–క్రాప్ సర్వేలో ల్యాండ్ పార్శిళ్లతో పాటు రైతుల ఈ–కేవైసీ 100 శాతం పూర్తి చేయాలి. అప్పుడే కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు మంజూరవుతాయి. రాష్ట్రంలో 2.76కోట్ల ల్యాండ్ పార్శిళ్లు ఉండగా, దాదాపు రెండు నెలల పాటు నమోదు ప్రక్రియ నత్తనడకనే సాగింది. చివరికి ప్రైవేటు సర్వేయర్లను నియమించడం, ఆర్బీకే సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించడంతో దాదాపు 2.62 కోట్ల ల్యాండ్ పార్శిళ్లలో సాగు వివరాలను నమోదు చేయగలిగారు. కానీ కీలకమైన రైతుల ఈ–కేవైసీ నమోదు ఘోరంగా సాగుతోంది. ఈ సీజన్లో 84.34 లక్షల మంది రైతుల ఈ–కేవైసీ నమోదు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించారు. మొబైల్ యాప్‌లోనే ఈ–పంట/ఈ–కేవైసీ పూర్తి చేసే ఏర్పాటు చేశారు. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. అయినా పని ఒత్తిడి సాకుతో వారు ఈ–కేవైసీ నమోదు జోలికి పోవడం లేదు.ఆర్బీకే సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించినప్పటికీ వ్యవసాయేతర పనుల కారణంగా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా ఈ–కైవేసీ నమోదు ముందుకు సాగడం లేదు. ఓ వైపు ఈ నెల 26 నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలవుతున్నాయి. ఇతర పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్నాయి. మరోవైపు పంటల బీమా కోసం ప్రీమియం నమోదు చేసిన రైతుల వివరాలను బీమా కంపెనీలకు పంపాల్సిన సమయం ముంచుకొస్తోంది. కానీ రైతుల ఈ–కేవైసీ మాత్రం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉంది. వారానికి నాలుగైదు సార్లు వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేస్తున్నా ఫలితం మాత్రం కన్పించడం లేదు. దీంతో ఈ–కేవైసీ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. -
ఆలోచనశక్తికి ఏఐ వైరస్
సాక్షి, అమరావతి: సైన్స్ ప్రాజెక్టా? కృత్రిమ మేధ సిద్ధంగా ఉంది. వ్యాసం రాయాలా? ఏఐ సెకన్లలో రాసిచ్చేస్తుంది. కోడింగ్ ఎర్రరా? టూల్ సరిచేస్తుంది. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం విద్యారంగాన్ని పరుగులు పెట్టించడం నిజమే అయినా.. దానికి సమాంతరంగా విద్యార్థుల స్వతంత్ర ఆలోచనశక్తికి గండికొడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల చేతికి వచ్చిన సరికొత్త ‘కాగ్నిటివ్ ఆఫ్–లోడింగ్’ (మెదడు చేయాల్సిన ఆలోచనను మెషీన్‌కు అప్పగించే ధోరణి) యువతరాన్ని ఆలోచనశక్తి హీనులుగా మార్చేస్తోందంటున్నారు. ఇది భవిష్యత్ తరాలను వేగంగా ప్రమాదంలోకి నెడుతోందని ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న అధ్యయనాలు, సర్వేలు హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యాసంస్థలు, డిజిటల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డీఈసీ–సింగపూర్), చీగ్ గ్లోబల్ (యూఎస్ఏ) నివేదికల ప్రకారం ఉన్నతవిద్య విద్యార్థుల్లో జనరేటివ్ ఏఐ సాధనాల వినియోగం శరవేగంగా పెరిగింది. మనదేశంలోను ఇంజినీరింగ్ విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 50 శాతం మంది విఫలమవడానికి కారణం ఏఐపై అధికంగా ఆధారపడడమేనని చెబుతున్నారు. మెదడును శ్రమపెట్టే విద్యార్థే భవిష్యత్తులో సాంకేతికతను నడిపిస్తాడని, లేదంటే సాంకేతికతే ఆ విద్యార్థిని నడిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల ఏఐ వినియోగం కొత్తగా అరచేతిలోకి వచ్చిన కృత్రిమ మేధ మనుషుల మేధస్సును తుస్సుమనిపిస్తోంది. ముఖ్యంగా విద్యార్థుల్లో తమ మెదడుకు పనిచెప్పకుండా, ఆలోచనకు పదును పెట్టకుండా సులభంగా పనిపూర్తయ్యే మార్గాల కోసం ఏఐని ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతున్నట్టు డీఈసీ సర్వేలో వెల్లడైంది. హోంవర్క్ చేసేందుకు, ప్రాజెక్టుల కోసం, అసైన్మెంట్లు, అనువాదాలు, పరీక్షల సన్నద్ధత, అకడమిక్ పేపర్ల ఎనాలసిస్.. ఇలా ఒకటేంటి అన్నింటికీ జనరేటివ్ ఏఐ సాధనాలపై ఆధారపడుతున్నట్టు గుర్తించారు. ఈ విధానం ఎక్కువగా, యూకే, లాటిన్ అమెరికా, భారత్, యూఎస్ఏ, యూరప్ దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుసలో యునైటెడ్ కింగ్డమ్ 92–95 శాతంతో మొదటిస్థానంలో ఉండగా మనదేశం 86–89 శాతంతో మూడోస్థానంలో ఉంది. యూకేలో అసైన్మెంట్లు, రీసెర్చ్ సారాంశాలు, కాన్సెప్ట్ క్లారిటీ కోసం, బ్రెజిల్, మెక్సికో వంటి లాటిన్ అమెరికా దేశాల్లో ప్రాజెక్టులు, అనువాదాలు, హోంవర్క్ కోసం ఏఐని వాడుతుండగా, భారతదేశంలో కోడింగ్ సమస్యలు, పరీక్షల సన్నద్ధత, ప్రాజెక్టుల కోసం, అమెరికాలో వ్యాసాలు, బ్రెయిన్ స్టార్టింగ్, క్విజ్ ప్రిపరేషన్ కోసం, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరప్ దేశాల్లో థీసిస్ రీసెర్చ్, అకడమిక్ పేపర్ల తయారీకి వాడుతున్నారు.శాతాల పరంగా బ్రిటన్ మొదటిస్థానంలో ఉన్నప్పటికీ.. సంఖ్యాపరంగా చూస్తే భారతదేశమే ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. దేశంలో ఉన్న సుమారు 4.3 కోట్లమంది ఉన్నతవిద్య విద్యార్థుల్లో ఏకంగా 3.5 కోట్ల మందికిపైగా రోజూ లేదా వారానికి పలుమార్లు ఏఐని వాడుతున్నట్టు తేలింది. యూఎస్‌లో ఈ సంఖ్య 1.4 కోట్లు ఉండగా, యూకేలో సుమారు 20 లక్షల వద్ద ఉంది. ఆలోచన శూన్యం.. క్యాంపస్‌లలో వైఫల్యాలు: జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యార్థుల్లో స్వంతంగా శోధించి నేర్చుకునే సంస్కృతి తగ్గిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇది మానవ మేధస్సును నాశనం చేస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. విషయ పరిజ్ఞానం పెంచుకోకుండా కాపీ–పేస్ట్ సంస్కృతి విస్తరిస్తోందంటున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనాల ప్రకారం ప్రతి పదిమంది విద్యార్థుల్లో ఆరుగురు (60 శాతం) ఏఐ ఇచ్చిన ఫలితాలను క్రాస్‌చెక్ చేయకుండా నేరుగా సబ్మిట్ చేస్తున్నారు. విద్యార్థులు స్వయంగా గ్రంథాలయాలు, పుస్తకాల్లో చదివి పరిశోధన చేసే సమయం గతంతో పోలిస్తే సుమారు 45 శాతం తగ్గింది. » కాగ్నిటివ్ ఇంపాక్ట్ స్టడీస్ ప్రకారం.. నిరంతరం ఏఐ టూల్స్‌పై ఆధారపడే విద్యార్థుల్లో సమస్య పరిష్కార సామర్థ్యం, సమాచారాన్ని నిలుపుకొనే జ్ఞాపకశక్తి సాధారణ విద్యార్థుల కంటే 20–25% తగ్గుముఖం పడుతోంది. » కార్పొరేట్ హెచ్ఆర్ సర్వేల ప్రకారం, దేశవ్యాప్తంగా క్యాంపస్ డ్రైవ్‌లలో పాల్గొనే భారతీయ ఐటీ, ఇంజినీరింగ్ విద్యార్థుల్లో 40–50 శాతం మంది ముఖాముఖి ఇంటర్వ్యూలలో ప్రాథమిక లాజిక్, మాన్యువల్ కోడింగ్ రాయడంలో విఫలమవుతున్నారు. కాలేజీల్లో ఆటోమేటెడ్ కోడ్ జెనరేషన్ టూల్స్ వాడటం వల్ల, మొదటి నుంచి సొంతంగా లాజిక్ నిర్మించే ఆలోచన విద్యార్థుల్లో లోపిస్తోందని, దీంతో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇంటర్వ్యూలలో తేలిపోతున్నారని చెబుతున్నారు. » ఏఐ టూల్స్ కొన్నిసార్లు ఉనికిలో లేని తప్పుడు సమాచారాన్ని (ఏఐ హాలూసినేషన్) కూడా సరైనదేనన్నట్లు భ్రమింపజేస్తాయని, సర్వేల ప్రకారం 55 శాతం మంది విద్యార్థులు ఆ ఆధారాలను ధ్రువీకరించుకోకుండానే తమ ప్రాజెక్టుల్లో జోడిస్తున్నారని గుర్తించారు. భారత విద్యావ్యవస్థకు సవాళ్లు యూకే, యూఎస్ వంటి దేశాల్లో ఏఐ అకాడమిక్ ఎథిక్స్, డిటెక్షన్ సాఫ్ట్వేర్ల వినియోగం ఇప్పటికే మొదలైంది. భారత్‌లో సీబీఎస్ఈ, యూజీసీ వంటి విద్యామండళ్లు మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తీవ్ర అంతరాలున్నాయి. విద్యార్థులకు ఇచ్చిన హోంవర్క్, అసైన్మెంట్లు నిమిషాల్లో పూర్తవుతుండటంతో అసలైన ప్రతిభను గుర్తించడం అధ్యాపకులకు పెద్ద సవాలుగా మారింది. దేశంలోని 80 శాతం విద్యాసంస్థల్లో సరైన ఏఐ–డిటెక్షన్ వ్యవస్థలు అందుబాటులో లేవు. పాశ్చాత్య దేశాల్లో విద్యార్థులు ఆలోచనలకు మెరుగులు దిద్దుకోవడానికి ఏఐని వాడితే, భారత్‌లో ఇంకా చాలామంది విద్యార్థులు శ్రమను తప్పించుకునే ‘షార్ట్‌కట్’గా మాత్రమే చూస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని పరిష్కారమార్గాలను అనుసరిస్తే విద్యార్థిని ‘మాస్టర్’గా నిలబెట్టవచ్చని పేర్కొంటున్నారు. » ప్రాజెక్ట్ పేపర్లను మాత్రమే చూసి మార్కులు వేసే విధానానికి స్వస్తి పలకాలి. విద్యార్థి సమస్యను ఎలా పరిష్కరించాడు, ఏయే దశల్లో ఆలోచించాడు అనే దానిపై తరగతి గదిలో ప్రెజెంటేషన్లు, లైవ్ వైవా తప్పనిసరి చేయాలి. » తరగతి గదిలోనే ఏఐని వాడటానికి అనుమతినిస్తూ.. ఆ టూల్ ఇచ్చిన సమాధానంలో ఉన్న తప్పులు, లోపాలు, హాలూసినేషన్లను గుర్తించమని (రివర్స్–లెర్నింగ్ ) విద్యార్థులకు టాస్్కలు ఇవ్వాలి. దీనివల్ల వారి విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్ థింకింగ్) మేల్కొంటుంది. » వారానికి కనీసం 2–3 గంటలు ఎలాంటి డిజిటల్ పరికరాలు లేకుండా పెన్ను, పేపర్‌తో ఆలోచించడం, గ్రూప్ డిస్కషన్లు నిర్వహించడాన్ని విద్యాసంస్థలు తప్పనిసరి చేయాలి. అలా అని సాంకేతికతను నిషేధించడం దీనికి పరిష్కారం కాదని.. అలాగే అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదన్న వాస్తవాన్ని కూడా పాఠశాల దశలోనే తెలియజేయాలని చెబుతున్నారు. ఏఐని ఒక సహాయకుడిగా మాత్రమే చూడాలన్న స్పృహను విద్యార్థుల్లో కలిగించాలని సూచిస్తున్నారు. -
సాయికృష్ణ మర్మాంగంపై దారుణంగా కొట్టారు
సాక్షి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ మరణానికి కారణాన్ని సిట్ అధికారులు కోర్టు ముందు బయటపెట్టారు. కృష్టలంక స్టేషన్ అప్పటి సీఐ నాగరాజు.. సాయికృష్ణ మర్మాంగంపై దారుణంగా కొట్టడం వల్లే అతను చనిపోయాడని సిట్ అధికారులు విజయవాడ కోర్టుకు నివేదించారు. సీఐ నాగరాజుతో పాటు మరో ఆరుగురు నిందితులపై విజయవాడ కోర్టులో అభియోగ పత్రం (ఛార్జిషీట్) దాఖలు చేశారు. ఓ ఉన్నతాధికారి ఆమోదంతోనే సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు తెచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ఛార్జిషీట్లో తెలిపింది. అప్పటినుంచి చనిపోయేవరకు సీఐ నాగరాజు, మరికొందరి చేతిలో సాయికృష్ణ దారుణ హింసకు గురయ్యాడని తెలిపింది. 86 పేజీల ఛార్జిషీట్‌తో పాటు 263 డాక్యుమెంట్లను కోర్టుకు సిట్ సమర్పించింది. 120 మంది సాక్షులను విచారించినట్లు అందులో పేర్కొంది. ఇందులో ఇప్పటివరకు తెలియని పలు కీలక విషయాలున్నాయి. ఉన్నతాధికారి ఆమోదంతో సాయికృష్ణను తెచ్చారు ‘మే 5న నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న వారిని తీసుకు వచ్చేందుకు అదనపు సిబ్బంది కావాలని సీఐ నాగరాజు కీలక స్థానంలో ఉన్న ఉన్నతాధికారిని కోరారు. ఆ అధికారి అనుమతినివ్వడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదే రోజు రాత్రి పది గంటలకు బయలుదేరి తెల్లవారుజాము 3.30 గంటలకు మార్కాపురం చేరుకున్నారు. అక్కడ పెయింటింగ్ పనిచేస్తూ బతుకుతున్న సాయికృష్ణను పట్టుకొచ్చి ఉదయం 8 గంటలకు కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని టాస్‌్కఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్లో కూడా నమోదు చేశారు. కృష్ణలంక సీఐ నాగరాజు, మరికొందరు కానిస్టేబుళ్లు కలిసి సాయికృష్ణను స్టేషన్ లోని రెండో అంతస్తుకు తీసుకువెళ్లి అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో అతను పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హెడ్‌కానిస్టేబుల్ తీశారు’ అని సిట్ అధికారులు చార్జిషీట్లో స్పష్టం చేశారు. మూడు రోజుల తరువాత కూడా హింసను ఆపలేదు ‘కృష్ణలంకలోని ఆర్ఎంపీ వైద్యుడిని తీసుకొచ్చి చికిత్స చేయించారు. మూడు రోజుల తర్వాత గుణదలలో గంజాయి విక్రేతలను పట్టుకునేందుకు సాయికృష్ణను సీఐ నాగరాజు తదితరులు వారి వెంట తీసుకెళ్లారు. అయితే ఈ లాకప్ డైరీ, జనరల్ డైరీ, సెంట్రీ బుక్‌లో సాయి కృష్ణకు సంబంధించిన వివరాలను ఎక్కడా నమోదు చేయలేదు. ఆ తరువాత కూడా నాగరాజు తదితరులు సాయికృష్ణపై హింసను ఆపలేదు. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టడంతో రక్తస్రావం జరిగి సాయికృష్ణ మృతిచెందాడు. అనంతరం కృష్ణలంక స్టేషన్లో సీసీ ఫుటేజ్ మొత్తం మాయం చేశారు. స్టేషన్లో ఎక్కడా ఎలాంటి మరకలు లేకుండా పెయింట్లు వేయించారు. లాకప్‌లో సాయికృష్ణ ఆనవాళ్ళు లేకుండా కడిగేశారు’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. దుప్పట్లో చుట్టి.. దహనం చేశారు... ‘కస్టోడియల్ టార్చర్ తరువాత పోలీసుస్టేషన్లో సాయికృష్ణ ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని ఓ పాత భవనానికి తరలించారు. అక్కడ సాయికృష్ణ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి దహనం చేశారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చిన నాటి నుంచి చనిపోయేంత వరకు కృష్ణలంక స్టేషన్లో ఉన్న కీలక ఆధారాలన్నీ ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో సీఐ నాగరాజుతో పాటు మొత్తం ఏడుగురు కీలకంగా వ్యవహరించారు. ఇందులో సీఐ సహా ఆరుగురు పోలీసులు కాగా ఒకరు సీఐ స్నేహితుడు సురేష్. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.’ అని అధికారులు వివరించారు. చంపిన తరువాత సెల్‌ఫోన్‌ను గోవా పంపి ఫోన్లు చేయించారు.. ‘కృష్ణలంక పోలీసుస్టేషన్ లోపల, బయట కలిపి 10 సీసీ కెమేరాలు ఉన్నాయి. 18 నెలలపాటు స్టోరేజి ఉండేలా నాలుగు 8 టీబీ హార్డుడిస్కులు ఉన్నాయి. వీటిల్లోని ఆధారాలను సీఐ నాగరాజు ఆదేశాలతో చెరిపివేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇక సాయికృష్ణ చనిపోయిన తర్వాత అతని సెల్‌ఫోన్‌ను ఒక వ్యక్తికి ఇచ్చి గోవాకు పంపారు. అక్కడి నుంచి ఫోన్ కాల్స్ చేయించారు. తద్వారా సాయికృష్ణ ఇంకా బతికే ఉన్నాడనే అభిప్రాయం కల్పించే ప్రయత్నం చేసినట్లు కూడా మా దర్యాప్తులో తేలింది’ అని పేర్కొన్నారు. అన్ని ఆధారాలు సేకరించాం.. ‘2026 మే 23న విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ వద్ద లభించిన రెండు గుర్తు తెలియని మృతదేహాల వ్యవహారాన్ని కూడా విచారించాం. ఆ మృత దేహాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా స్వర్గపురి శ్మశానవాటికకు తరలించారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ వ్యవస్థకు సంబంధించిన డీవీఆర్, ఎన్వీఆర్, హార్డ్డిసు్కలు, మెమొరీ కార్డులు, మొబైల్ ఫోన్లు, పోలీస్‌స్టేషన్ రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ సిబ్బంది కూడా నేర స్థలాన్ని పరిశీలించి నివేదికలు సమర్పించింది. పోలీస్‌స్టేషన్‌లో సాయికృష్ణ ఉన్నట్లు తెలిపిన వ్యక్తులు, ఆయనతో సంబంధం ఉన్నవారు, సాంకేతిక ఆధారాలకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశాం’ అని సిట్ అధికారులు చార్జిషీట్లో తేల్చి చెప్పారు. నమోదు చేసిన సెక్షన్లు ఇవే.. బీఎన్ఎస్ సెక్షన్ 103(1), 127(4), 127(6), 238, 305, 316(5), 61(2) రెడ్ విత్ 3(5)తో పాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంస నిరోధక చట్టం – 1984లోని సెక్షన్ 3, సమాచార సాంకేతిక చట్టం – 2000లోని 65, 66 సెక్షన్లను కూడా చేర్చారు. సాయికృష్ణను పోలీసుల అదుపులోకి తీసుకున్న పరిస్థితులు, కస్టడీలో ఆయనకు జరిగినట్లు ఆరోపిస్తున్న చిత్రహింసలు, లాకప్ రికార్డుల నిర్వహణ, మొబైల్ ఫోన్ వినియోగం, సీసీ టీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ నివేదికలు ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ ఛార్జిషీట్లో పూర్తిగా సీఐ నాగరాజు అతని సిబ్బందిని ఇరికించే విధంగా ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ప్రమేయాన్ని కప్పి పుచ్చేందుకే, పాడుబడిన భవనంలో సాయికృష్ణ చనిపోయినట్లు సిట్ పేర్కొన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. -
ఎన్ని వేధింపులున్నా వెనక్కి తగ్గం
సాక్షి, అమరావతి: సమస్యలు పరిష్కరించకపోగా తమపై ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎన్ని వేధింపులకు పాల్పడ్డా ఏ మాత్రం వెనక్కు తగ్గబోమని ప్రభుత్వానికి తెగేసి చెప్పారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడే సమ్మెలోకి వెళ్లామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె నాలుగో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. జీజీహెచ్‌లు, ధర్నా చౌక్‌ల్లోని నిరసన శిబిరాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున చేరి ఆందోళనలు చేపట్టారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వేల సంఖ్యలో ఉద్యోగులు అత్యవసర సేవలు బహిష్కరించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు.చంటి బిడ్డతో నిరసనవైద్యశాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన ఉధృతంగా కొనసాగుతోంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా తిరుపతి రుయా ప్రాంగణంలో కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన మౌనదీక్షలో గీత అనే స్టాఫ్‌నర్స్ తన చంటిబిడ్డతో కలసి పాల్గొన్నారు. ఆ చంటి బిడ్డ అమ్మఒడిలో నిద్రిస్తుండగా.. తల్లి మౌన దీక్షను కొనసాగించారు. – తిరుపతి తుడా -
అభాసుపాలయ్యాం..
సాక్షి, అమరావతి: బీసీల ఓట్ల కోసం చంద్రబాబు ఆడిన రిజర్వేషన్ల నాటకం సుప్రీంకోర్టు తీర్పుతో బట్టబయలవడంతో టీడీపీ శ్రేణులు తలెత్తుకోలేక లోలోన మథనపడుతున్నాయి. తాజా పరిణామంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీడీపీ పిటిషన్ కోర్టులో నిలవదని న్యాయ నిపుణులు ముందే హెచ్చరించినా పట్టించుకోకుండా ఇప్పుడు గ్రామాల్లో బీసీలకు ముఖం చూపించలేని పరిస్థితి తెచ్చిపెట్టారని సీనియర్ నేతలు వాపోతున్నట్లు సమాచారం. అసాధ్యమని తెలిసీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి అనవసరంగా అభాసుపాలయ్యామన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామంటూ సభల్లో గొప్పలు చెప్పుకున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జిలు ఇప్పుడు బీసీల దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని తలపట్టుకుంటున్నారు. 34 శాతం ఇవ్వలేమని తెలిసి కూడా చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసం జీవోలు ఇచ్చి పార్టీని అభాసుపాల్జేశారని నేతలు మండిపడుతున్నారు. నిజానికి.. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటితే కోర్టులు అంగీకరించవన్నది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. 2020లో 59 శాతం రిజర్వేషన్లతో ఇచ్చిన జీవోనే హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులోనూ అప్పట్లో ఊరట దక్కలేదు. గతేడాది తెలంగాణ పెట్టిన బీసీ కోటాకు ‘సుప్రీం’లో పట్టిన గతి ఆయన కళ్ల ముందే ఉంది. అలాగే, గత పదిహేనేళ్లలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లలోనూ ఇదే కారణంతో బీసీ కోటాలు కోర్టుల్లో వీగిపోయాయి. ఇవన్నీ తెలిసీ 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బాబు ఎలా ప్రకటించారని పార్టీ సీనియర్ నేతలే ప్రశ్నిస్తున్నారు.రాజ్యాంగ సవరణకు అడగని బాబు..బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఆ సవరణ కోసం కనీసం అడగలేకపోవడం చంద్రబాబు బలహీనతను బయటపెట్టిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. మోదీని అడిగే ధైర్యంలేక చెల్లుబాటు కాని జీవోలతో నాటకాలు ఆడామన్న విషయం బహిర్గతమైందని, బీసీల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోందని వారు అంటున్నారు. శాశ్వత పరిష్కారం ఢిల్లీలో ఉంటే, ఓడిపోయే కేసు కోసం ‘సుప్రీం’ మెట్లెక్కడం వెనుక ఉద్దేశం కేవలం ఎన్నికల ముందు హడావుడి చేయడమేనని మనమే బయటపెట్టుకున్నామని వారు చెబుతున్నారు. మరోవైపు.. పార్టీలో ఇంత అసహనం వ్యక్తమవుతున్నా చంద్రబాబు మాత్రం తన తప్పు ఒప్పుకోవడంలేదు. హైకోర్టు తీర్పు రాగానే ప్రతిపక్షమే కోర్టుకెళ్లి అడ్డుకుందంటూ నెపాన్ని వైఎస్సార్సీపీ పైకి నెట్టేశారు. అదే మాట అందరూ చెప్పాలంటూ పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు. కోర్టులో నిలవని హామీ ఇచ్చాక ఇప్పుడు పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లిస్తామంటే ప్రజలు నమ్ముతారా అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.పొత్తులపైనా ఆందోళన..ఇక కూటమిలో పొత్తుల లెక్కలపైనా టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఏ కార్పొరేషన్ ఎవరికి, ఏ మున్సిపాలిటీ ఎవరికి అన్నది ఇప్పటికీ తేల్చకపోతే క్షేత్రస్థాయిలో తామెలా పనిచేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. అధినేతల స్థాయిలో ఇంకా భేటీలు, సమాలోచనల గందరగోళం కొనసాగుతుండగానే వైఎస్సార్సీపీ దూకుడు పెంచి నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. అధికారంలో ఉండి కూడా ఇంతవరకూ ఏమీ తేల్చుకోలేక సతమతమవుతుంటే, వైఎస్సార్సీపీ మాత్రం స్థానిక ఎన్నికల వ్యూహాలను వేగంగా అమలుచేస్తుండడం టీడీపీ నేతలకు మింగుడుపడటంలేదు. -
స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అభ్యర్థులకు తగినంత భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు భయం, బెదిరింపులు లేకుండా తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, రసీదుల జారీ, సంబంధిత అధికారులకు పత్రాల బదిలీ ప్రక్రియలో స్పష్టమైన విధానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. లేఖల్లోని ముఖ్యాంశాలు..ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, దాడులు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలి. కేంద్ర బలగాల మోహరింపు ఎన్నికల సంఘం సమర్థవంతమైన పర్యవేక్షణలో జరగాలి. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల భద్రత బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తే నిష్పక్షపాత వాతావరణం ఉంటుందన్న విశ్వాసం మాకు లేదు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, అధికార యంత్రాంగాన్ని లేదా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలి. నామినేషన్లనూ అడ్డుకునే అవకాశం కూటమి పాలనలో ప్రతిపక్ష అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, రాజకీయ ప్రేరేపిత పోలీసు చర్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఇవి మరింత తీవ్రమై, ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడం, ప్రచారాన్ని నిరోధించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు. పోలింగ్ రోజు మాత్రమే భద్రత కల్పించడం సరిపోదు. నామినేషన్ల ప్రారంభానికి ముందే కేంద్ర బలగాలను మోహరించి, ఫలితాలు ప్రకటించే వరకు కొనసాగించాలి. ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు వివక్ష లేకుండా అనుమతులు ఇవ్వాలి.∙ప్రతిపక్ష అభ్యర్థులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు తమ చట్టబద్ధమైన ఎన్నికల బాధ్యతలను నిర్వహించకుండా అడ్డుకోవడానికి పోలీసు అధికారాలను ఉపయోగించకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. -
దసరా ఉత్సవాల తొలి 3 రోజులకు వీఐపీ టికెట్లు విడుదల
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో తొలి మూడు రోజులకు వీఐపీ టికెట్లను ఆలయ ఈవో శీనానాయక్ శుక్రవారం విడుదల చేశారు. రూ.వెయ్యిపై వీఐపీలకు బంగారు వాకిలి దర్శనం కల్పించనున్నారు. మహామండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్లో ఈవో శీనానాయక్, ఈఈ ఎల్.రమా, ఆలయ టెక్నికల్ సిబ్బంది హరీష్ ఈ టికెట్లను విడుదల చేశారు. దసరా ఉత్సవాల్లో ఎటువంటి సిఫార్సులు లేకుండా భక్తులు జగన్మాత దివ్య దర్శనానికి సంబంధించి 11, 12, 13వ తేదీలకు రూ.1,000 టికెట్లను జారీ చేశామని, ఈ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు వీఐపీ క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చునన్నారు. మన మిత్ర యాప్ ద్వారా భక్తులు ఈ టికెట్లను పొందవచ్చునని తెలిపారు. మూలా నక్షత్రం మినహా అన్ని రోజులకు విడతల వారీగా టికెట్లు విడుదల చేస్తామన్నారు. టికెట్లు పొందిన భక్తులు కుమ్మరి పాలెంలోని టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా కొండపైకి చేరుకుంటారని, దర్శనం అనంతరం మల్లికార్జున స్వామి వారి ఆలయం మీదగా కొండ దిగువనకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, ఆలయ సిబ్బందికి ప్రత్యేక డ్యూటీ పాస్‌లను జారీ చేశారు. -
నూతన జెడ్పీలకు దిక్కెవరు?
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రంలో 15 నూతన జిల్లా పరిషత్‌లు ఏర్పడి రెండువారాలు గడిచినా ఇప్పటికీ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల(సీఈవో)ను నియమించలేదు. జెడ్పీ మొత్తం పర్యవేక్షించే ఉన్నతాధికారులు లేకపోవడంతో కీలక పనులపై దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్లతోపాటు జెడ్పీ సీఈవోలదే కీలక పాత్ర. అసలే కొత్త జిల్లా పరిషత్‌లు కావడంతో పలు రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటికి అదనంగా ఇన్చార్జిలుగా కొనసాగుతున్న సీఈవోలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాల అమలులో తీవ్ర కాలయాపన జరుగుతోందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో క్షేత్ర స్థాయి వరకు ముందస్తు ఎన్నికల ఏర్పాట్లను జెడ్పీ సీఈవోలే పర్యవేక్షించాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కీలక ఎన్నికల సమయంలోనూ మొత్తం 28 జిల్లాలకు సగానికి పైగా జిల్లాల్లో జెడ్పీ సీఈవోలు లేకపోవడంతో సాధారణ పాలనా వ్యవహారాలతోపాటు ఎన్నికల కార్యక్రమాల అమలులో ఇబ్బందులు తలెత్తున్నట్టు చెబుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీలోనూ చర్చ స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై గురువారం అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ కొత్త జిల్లాల్లో జెడ్పీ సీఈవోలను నియమించకపోవడంపై చర్చకు వచి్చంది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎలక్షన్ నోటిఫికేషన్‌కు ముందే 15 జిల్లాల జెడ్పీ సీఈవోలను నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. -
హైకోర్టుకు ‘తణుకు’ జనసంద్రం
సాక్షి, అమరావతి: మోసపోయిన చిట్టీల డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో తణుకుసహా పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు మండలాల ప్రజలు వందల సంఖ్యలో హైకోర్టుకు పోటెత్తిన ఘటన శుక్రవారం చర్చనీయాంశంగా మారింది. తణుకుకు చెందిన గోలి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు గోలి బాల భవానీ శంకర్ ‘శ్రీ దుర్గ భవాని చిట్స్ అండ్ ఫైనాన్స్’ పేరుతో చిట్టీలు నిర్వహిస్తూ వచ్చారు. ఏజెంట్లను ఏర్పాటు చేసి తణుకు, ఇరగవరం, పెనుమంత్ర, అత్తిలి మండలాల్లో సామాన్యుల నుంచి రూ.42 కోట్లు వసూలు చేసి బోర్డ్ తిప్పేశారు. దీనిపై తణుకు టౌన్ పోలీస్ స్టేషన్లో ఆగస్టు 13న కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో నిందితులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా, ఫిర్యాదుదారులకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని నిందితుల తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు అటు నిందితులను, ఇటు ఫిర్యాదుదారులను తదుపరి విచారణ సమయంలో తమ ముందు హాజరుపరచాలని తణుకు పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులనోటీసుల మేరకు దాదాపు 300 మంది బాధితులు చిట్టీల చెల్లింపులకు సంబంధించిన రసీదులను, కంపెనీ ఇచ్చిన పుస్తకాలు పట్టుకుని సొంత ఖర్చులతో బస్సులు, వ్యాన్లలో హైకోర్టుకు తరలివచ్చారు. ఇంత మంది ఒక్కసారిగా హైకోర్టు వద్దకు రావడంతో స్థానిక న్యాయవాదులకు, పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. హైకోర్టు ప్రాంగణం, క్యాంటీన్ అంతా వీరితో నిండిపోయింది.ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ సాధ్యం కాదని న్యాయమూర్తి తేల్చి చెప్పడంతో నిందితులు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి ‘సగం తణుకు ఇక్కడే ఉన్నట్లుంది’ అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా కోర్టు వెలుపల నిందితుల కారును బాధితులు చుట్టుముట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు అర్థ గంట సేపు హైకోర్టు ప్రాంగణం ఆరుపులు, కేకలతో మార్మోగింది. జనాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో హైకోర్టు ఎస్పీఎఫ్ సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం, విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో తుళ్లూరు పోలీసులు హుటాహుటిన హైకోర్టుకు చేరుకున్నారు. అనంతరం బాధితులను అతి కష్టం మీద అక్కడి నుంచి పంపి, నిందితులను తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
భూముల రీ సర్వే చేసింది నేనే
కొండపి (ప్రకాశం జిల్లా): రాష్ట్రంలో భూ వివాదాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో హక్కులను పరిరక్షించేందుకు భూముల రీ సర్వే ప్రక్రియను తానే చేపట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొన్నారు. రీసర్వే 2.0 అనంతరం రాజముద్రతో కూడిన పటిష్టమైన భద్రతా ఫీచర్లతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా అందిస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నర్సింగోలులో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ గ్రామ సభలో ఆయన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో భూములపై వివాదాలు సృష్టించారని, అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. గతంలో రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నవారి భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 16.48 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించామన్నారు. వివాదాల్లో ఉన్న 41 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాల్లోని 2,315 ఎకరాల గర్భ కండ్రిక భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని అన్నారు. అక్టోబరులోనే 790 గ్రామాల్లో 4 లక్షలకు పైగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందించామని తెలిపారు. బీసీలకు పెద్ద పీట వేసింది తానే అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
శాశ్వత న్యాయమూర్తులకు సన్మానం
సాక్షి, అమరావతి: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. శుక్రవారం హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో వీరిని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. బీసీలకు క్షమాపణ చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలు పచ్చి బూటకమని, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయన నయవంచన పూర్తిగా బట్టబయలైందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడంలో ఆయన 420 అని మరోమారు స్పష్టమైందన్నారు. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోసకారి అని మరోసారి తేలిపోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట మీరు ఇచ్చిన హామీలు మోసం. గతంలో మా ప్రభుత్వంలో వారికి వచ్చే పథకాలు రద్దు చేయడం మరొక మోసం. విద్యా దీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9 వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం. 143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే’’ అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. -
హామీ ఇచ్చి డ్రామా!
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో దాదాపు సగం జనాబా ఉండే బీసీలకు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలక హామీ డ్రామాగా ముగిసింది. చంద్రబాబు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల హామీ, జీవో కథ అమలుకు నోచుకోకుండానే తెర పడింది. చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవోతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని... రాజ్యాంగ సవరణతోనే అది సాకారం అవుతుందని న్యాయ నిపుణులు, రాజకీయవేత్తలు మొదటి నుంచి చెబుతున్నా చంద్రబాబు తన నాటకాన్ని ముగించలేదు. బలహీన వర్గాలను ఓట్లు కోసం పావులుగా వాడుకుంటూ తన రాజకీయ డ్రామాను కొనసాగించారు. గత ఐదారేళ్లలో దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఒడిశా తదితర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భాల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టంగా కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ... 40 ఏళ్లకు పైబడి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ‘బీసీలకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు స్థానిక సంస్థల పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు’ అంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఏడాది క్రితం తెలంగాణ ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కూడా.. ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించాయంటూ, మొదలైన ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఎన్నికల కమిషన్ లేదా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఏదైనా ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తే సాధారణంగా కోర్టులు ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోవు. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించుతున్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయడం లాంటి అసాధారణ రీతిలో కోర్టు తీర్పులు వెలువడ్డ ఉదంతాలున్నాయి. ఇవన్నీ తెలిసినా చంద్రబాబు సర్కారు మభ్యపుచ్చేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించేలా బీసీలకు 34 శాతం అంటూ ఆగస్టులో ఉత్తుత్తి జీవోతో డ్రామాకు తెర తీసింది.న్యాయపరంగా చెల్లవని తెలిసినా రోజుకో డ్రామాసుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్న బీసీ రిజర్వేషన్ల జీవోతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదని తెలిసీ సీఎం చంద్రబాబు తన డ్రామాను రోజుకో రకంగా రక్తి కట్టించారు. జీవో ఇచ్చిన వెంటనే చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ, మిత్రపక్ష కూటమి నేతలు అది అమలుకు నోచుకోకముందే అమలైనట్లుగా ‘జయహో బీసీ’ అంటూ సంబరాలు నిర్వహించారు. పార్టీ నేతలతో పాలాభిషేకాలు చేయించుకున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో జీవో అమలు సాధ్యం కాదని చర్చించుకుంటూనే గత నెలన్నర రోజులకుపైగా గంభీరమైన ప్రకటనలు ఇస్తూ వచ్చారు. హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దంగా ఉన్నాయంటూ కొట్టివేసినా.. అత్యున్నత న్యాయస్థానానికి వెళతామంటూ ఇంకో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు. అందరూ ఊహించినట్టే సుప్రీంకోర్టు సైతం ఆ జీవో చెల్లుబాటు కాదని తీర్పు ఇవ్వడం గమనార్హం. పార్లమెంట్లో చట్టబద్ధతతో అవకాశం ఉన్నా చిత్తశుద్ధి శూన్యంసుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన తర్వాత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే అందుకు పార్లమెంట్లో రాజ్యంగబద్ధంగా చట్టబద్ధత కల్పించడం మినహా మరో మార్గం లేదని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగించడంలో టీడీపీ కూటమి పార్టీల మద్దతు కీలకం. ఇంత అవకాశం ఉన్నా బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రెండున్నరేళ్లుగా చంద్రబాబు తీసుకున్న చర్యలు శూన్యం. కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. బీసీల రాజకీయ సాధికారతపై చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నారని బీసీ సంఘాలు, రాజకీయ వేత్తలు, రాజ్యాంగ నిపుణులు, ప్రతిపక్షాలు తేల్చి చెబుతున్నాయి.తనకు అలవాటైన రీతిలో దుష్ప్రచారం..బీసీలను మభ్యపెడుతూ రాజకీయ డ్రామాకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో విపక్షంపై నిందలు మోపుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వైఎస్సార్సీపీకి ఆపాదించే దుస్సాహసానికి బరి తెగించారు. ఐదేళ్ల క్రితం అడ్డుకుంది బాబు అండ్ కో నే... 2020, 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీన జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 59 శాతం రిజర్వేషన్ల అమలుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. దీన్ని తప్పుబడుతూ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయంటూ టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా చంద్రబాబు కోర్టులో కేసులు దాఖలు చేయించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు తగ్గించాలంటూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ప్రతాప్‌రెడ్డికి 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నామినేటెడ్ పదవిని కూడా కట్టబెట్టడం గమనార్హం. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని హైకోర్టు తీర్పు వెలువరించడంతో... న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవిసూ్తనే పార్టీ పరంగా బీసీలకు 34 శాతానికి మించి అవకాశం కల్పించి మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధిని చాటుకోవడం గమనార్హం.బీసీ రిజర్వేషన్లపై ఇలా...2020 జనవరి 8..పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ, బీసీలకు మొత్తం 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం. స్థానిక ఎన్నికల నిర్వహణపై అంతకు ముందే దాఖలైన పిటిషన్లపై తక్షణమే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు తీర్పు. 2020 జనవరి 10స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్ల 50 శాతం దాటాయంటూ 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి పొందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు. 2020 జనవరి 1559 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే. రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై హైకోర్టులోనే తిరిగి విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలని ఆదేశం.2020 మార్చి2సుప్రీంకోర్టు సూచనతో తిరిగి హైకోర్టులో టీడీపీ నేత కేసు దాఖలు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఎన్నికలు పూర్తి.2024 ఎన్నికల ముందు..మన రాష్ట్రంతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లోని కోర్టులు స్థానిక ఎన్నికల నిర్వహణలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని స్పష్టమైన తీర్పులు వెలువరించిన తర్వాత కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ద్వారా దీన్ని అమలు చేసేందుకు అవకాశం ఉన్నా మూడేళ్లుగా మభ్యపెడుతూ బాబు డ్రామాలు. 2026 ఆగస్టు...స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని గతంలోనే స్పష్టంగా తీర్పులు వెలువరించిన న్యాయస్థానాలు. చట్టపరంగా చెల్లదని తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు సర్కారు జీవోలు. 2026 అక్టోబరు 1బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు.సుప్రీంలో... హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటన. 2026 అక్టోబరు 3: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు.2026 అక్టోబరు 9: హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నాయని పేర్కొంటూ చంద్రబాబు సర్కారు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. -
బాబు కపట నాటకానికి కోర్టులో తెర
ప్రభుత్వం నిర్వహించిన సర్వే (సమగ్ర కుటుంబ సర్వే), డేటాను ఆ కమిషన్ ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? ఈ సర్వేను ఏ చట్టం కింద చేశారు? ఆ చట్టం ఏమిటో మాకు చూపించండి. ఆ సర్వే ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు చెప్పడంలో తప్పేముంది? – సుప్రీం ధర్మాసనంసాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ఎన్నికల మోసాలు, కపట నాటకం, మాయ వేషాలు సుప్రీంకోర్టు సాక్షిగా మరోసారి తేలిపోయాయి! బీసీ రిజర్వేషన్లపై బాబు దొంగాటకు నిమిషాల వ్యవధిలోనే అత్యున్నత న్యాయస్థానంలో తెర పడింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు వైఖరి అంతా బూటకమని బహిర్గతమైంది. చంద్రబాబు మోసపూరిత తీరును సాక్షాత్తూ సుప్రీంకోర్టు 1.42 నిమిషాల్లోనే బయటపెట్టింది. చంద్రబాబు సర్కారు చెల్లని డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం.. ఆ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించకుండా కట్టడి చేయడం.. ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే దానికి అందించి దాని ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామనడం.. జీవోలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. కమిషన్ నివేదిక పెండింగ్‌లో ఉందా లేదా? అలాంటప్పుడు దేని ఆధారంగా జీవోలిచ్చారని నిలదీసింది. ప్రభుత్వం చేసిన సర్వే (సమగ్ర కుటుంబ సర్వే), డేటాను ఆ కమిషన్ ఎలా పరిగణనలోకి తీసుకుంటుందని విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాక ఈ సర్వేను ఏ చట్టం కింద చేశారు? ఆ చట్టం ఏమిటో మాకు చూపించండి.. అంటూ సూటిగా చంద్రబాబు సర్కారును నిలదీసింది. ఈ విషయంలో హైకోర్టు సరైన వైఖరినే తీసుకుందని స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న గత తీర్పులను ఉద్దేశపూర్వకంగా బేఖాతర్ చేస్తూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బాబు సర్కారు ఇచ్చిన జీవోలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం కోర్టు సమర్థించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం తప్పుబట్టింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను (ఎస్ఎల్పీ) కొట్టి వేసింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా గ్రామ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని ఎన్నికల, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చట్టపరంగా చెల్లదని తెలిసీ చంద్రబాబు బూటకపు జీవోలతో ఈ డ్రామాను నడిపినట్లు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి స్పష్టమైంది. గతేడాది తెలంగాణ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటడంతో అప్పటికే నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ఎన్నికల ప్రక్రియను నిలిపి వేయాలంటూ అక్కడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. గతంలో చాలా రాష్ట్రాల్లోనూ ఇదే జరిగింది. రిజర్వేషన్లు 50% దాటకూడదంటూ కోర్టులు స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. కోర్టులో న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసి కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ పార్టీ నేతలతో చంద్రబాబు పాలాభిషేకాలు చేయించుకున్నారు. అనుకూల ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంతో మభ్యపుచ్చే యత్నం చేశారు.ప్రభుత్వ సర్వే ఆధారంగా కమిషన్ నివేదిక ఇచ్చిందని హైకోర్టు తేల్చిందిగా..?: సుప్రీంహైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు రాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చా లేదా? అనే ప్రశ్న చాలాకాలంగా ఉత్పన్నమవుతోందన్నారు. స్థానిక సంస్థల వారీగా ప్రభుత్వం సేకరించిన ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ (సమగ్ర కుటుంబ సర్వే) డేటాను హైకోర్టు విశ్వసించకపోవడానికి ఎలాంటి కారణం లేదని రోహత్గి వాదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆ సర్వే ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించింది. అంతేకాక రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి అవసరమైన శాస్త్రీయ డేటా ఏదీ కమిషన్ వద్ద లేదని, అందువల్ల దాన్ని పరిగణనలోకి తీసుకోలేమని కూడా హైకోర్టు చెప్పిందిగా? అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నియామకాన్ని ఎవరూ సవాలు చేయకపోవడంతో తాము ఆ కమిషన్ చట్టబద్ధత జోలికి వెళ్లడం లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొందని, ఇది చాలా సహేతుకమైన వైఖరి అని తెలిపింది.అసలు ఏ చట్టం కింద ఆ సర్వే చేశారు?కమిషన్ తన నివేదికను సమర్పించినప్పటికీ, ప్రభుత్వం దానిని ఆమోదించని విషయాన్ని హైకోర్టు స్పష్టంగా పేర్కొందని సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది. ఈ సమయంలో రోహత్గీ జోక్యం చేసుకుంటూ, ఆ నివేదిక ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన డేటాపై ఆధారపడిందని, దానిని తాము పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని ధర్మాసనం స్పష్టం చేసింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కమిషన్ నివేదిక ఇచ్చిందని రోహత్గీ నివేదించగా... ‘అసలు ఈ సమగ్ర కుటుంబ సర్వేను ఏ చట్టం కింద చేపట్టారు? ముందు మాకు ఆ చట్టాన్ని చూపండి’ అని ధర్మాసనం పేర్కొంది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేయాలని రోహత్గీ కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. ఇది 57 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన కేసు అని రోహత్గీ ప్రస్తావించగా.. సారీ.. డిస్మిస్ అంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. మరోసారి రోహత్గీ జోక్యం చేసుకుంటూ.. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇక్కడే ఉందని, దానిని పరిశీలించాలని కోరగా, హైకోర్టు చాలా సహేతుకమైన వైఖరితో తీర్పునిచ్చిందని సుప్రీం ధర్మాసనంస్పష్టం చేసింది. డమ్మీ కమిషన్..డెడికేటెడ్ కమిషన్ నివేదిక విషయంలో చంద్రబాబు సర్కారు తీరుపై ఆది నుంచి సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కమిషన్ నివేదికను బహిర్గతం చేయకపోవడాన్ని ఇప్పటికే హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కమిషన్ నివేదికను ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని ఒకపక్క ప్రభుత్వం చెబుతోంది. మరి పట్టించుకోని కమిషన్ ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించినట్లు? డమ్మీ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని చంద్రబాబుకు తెలియదా? ఇదే విషయాలను హైకోర్టు సైతం ప్రస్తావించింది.అయితే హైకోర్టు తీర్పు తరువాత కూడా చంద్రబాబు బీసీలను మోసం చేయడం మానలేదు. అదొక డమ్మీ కమిషన్ అని హైకోర్టు తేల్చినా చంద్రబాబు ఆ కమిషన్‌ను మరికొంత కాలం పాటు పొడిగించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా డెడికేటెడ్ కమిషన్ విషయంలో హైకోర్టు తీర్పును సమర్థించింది. అంతే కాదు.. చంద్రబాబు ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించాలన్న వినతిని సైతం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. తద్వారా ఆ కమిషన్ నివేదికకు ఏమాత్రం విలువ లేనే లేదని చెప్పినట్లయింది. చట్టం తెలియదా బాబూ? అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబుకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు పార్లమెంట్లో చట్టం చేయకుండా సాధ్యం కాదన్న సంగతి స్పష్టంగా తెలుసు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని తరచూ చెప్పుకునే చంద్రబాబుకు చట్టం తెలియదంటే ఎవరు నమ్ముతారు? అన్నీ తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. హామీ ఇద్దాం.. ఎలాగూ కోర్టులు దాన్ని కొట్టేస్తాయి.. ఆ నెపాన్ని న్యాయస్థానాలపై నెట్టేయవచ్చునన్న రీతిలో బాబు వ్యవహరించారు. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు తనకు సన్నిహితుడైన బిర్రు ప్రతాప్‌రెడ్డిని రంగంలోకి దించారు. వైఎస్ జగన్ కల్పించిన రిజర్వేషన్లను హైకోర్టులో సవాలు చేయించి అక్కడ కొట్టేయించారు. సుప్రీంకోర్టులో కూడా కొట్టేసేలా చేశారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉన్న టీడీపీ నేతలు నాడు వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేశారు. 34 శాతం రిజర్వేషన్లు తాము అమలు చేసి చూపిస్తామంటూ నమ్మబలికారు. 50 శాతం పరిమితి దాటిన రిజర్వేషన్లు..రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఏడాది ఆగస్టు 20న చంద్రబాబు సర్కారు జీవో ఎంఎస్ నంబర్ 105 జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆగస్టు 19న జీవో ఆర్టీ నంబర్ 1065 తీసుకొచ్చింది. అయితే గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు ఏకంగా 61.08 శాతానికి చేరుకున్నాయి. ఇది ఇందిరా సహానీ, డాక్టర్ కె.కృష్ణమూర్తి, వికాస్ కిషన్ రావ్ గవాలీ కేసుల్లో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం గరిష్ట పరిమితిని ఉల్లంఘించడమే. సరైన శాస్త్రీయ అధ్యయనం లేకుండా, రిజర్వేషన్ల వర్గీకరణను (ఏ,బీ,సీ,డీ,ఈ) అమలు చేయకుండా కేవలం కుటుంబ సర్వే ఆధారంగా ఒకే బ్లాక్‌గా రిజర్వేషన్లు కల్పించడాన్ని హైకోర్టులో పిటిషనర్లు సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్ల జీవోలను ఈ నెల 1న కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. తీర్పునిచ్చిన నాటి నుంచి ఆరు వారాల్లోపు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు పెద్ద మోసకారి.. మరోసారి తేలిపోయింది
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలన్న ఆయన.. రిజర్వేషన్ల పేరుతో మోసం చేయటంపై మండిపడ్డారు. ‘‘స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోసకారని మరోసారి తేలిపోయింది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘చంద్రబాబూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట మీరు ఇచ్చిన హామీలు మోసం. గతంలో మా ప్రభుత్వంలో వారికి వచ్చే పథకాలు రద్దుచేయడం మరొక మోసం. విద్యా దీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం. 143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే. చంద్రబాబూ.. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: బీసీలకు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా?.@ncbn గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి! https://t.co/vbSjVEa2zf https://t.co/qA2PPsi4ga— YS Jagan Mohan Reddy (@ysjagan) October 9, 2026 -
స్థానిక ఎన్నికలు.. ఈసీకి వైఎస్సార్సీపీ 3 కీలక లేఖలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అభ్యర్ధులకు తగినంత భద్రత ఇవ్వాలని, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. అలాగే వీటి కాపీల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మోహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.కేంద్ర సాయుధ పోలీసు బలగాలను తగిన సంఖ్యలో మోహరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర బలగాల మోహరింపు ఎన్నికల సంఘం సమర్థవంతమైన పర్యవేక్షణలో జరగాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల భద్రత బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తే నిష్పక్షపాత వాతావరణం ఉంటుందన్న నమ్మకం తమకు లేదన్నారు. కూటమి పాలనలో ప్రతిపక్ష అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, రాజకీయ ప్రేరేపిత పోలీసు చర్యలు, రాజకీయ కార్యకలాపాలకు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని లేఖలో వెల్లడించారు.ఈ పరిస్థితులు ఎన్నికల సమయంలో మరింత తీవ్రమై, ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడం, ప్రచారాన్ని నిరోధించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క పోలింగ్ రోజు మాత్రమే భద్రత కల్పించడం సరిపోదని, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే కేంద్ర బలగాలను మోహరించి, ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, ప్రతిపాదకులు, మద్దతుదారులపై ఒత్తిళ్లు తీసుకురావడం ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని లేళ్ల అప్పిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాలు, వార్డుల వంటి సన్నిహిత సమాజాల్లో బెదిరింపులు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతిపక్ష అభ్యర్థులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు తమ చట్టబద్ధమైన ఎన్నికల బాధ్యతలను నిర్వహించకుండా పోలీసు అధికారాలను ఉపయోగించకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.ఎన్నికల్లో ఎవరు పాల్గొనాలి, ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశాలను అధికార పార్టీ ప్రభావం లేదా ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం నిర్ణయించకూడదని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి దృశ్యాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి కోరారు.సున్నితమైన ప్రాంతాల్లో స్వతంత్ర పరిశీలకులు, మొబైల్ పర్యవేక్షణ బృందాలను నియమించాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు వివక్ష లేకుండా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, అధికార యంత్రాంగాన్ని లేదా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అభ్యర్థులు భయం, బెదిరింపులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యామ్నాయ సదుపాయం కల్పించాలని కోరారు. నామినేషన్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, రసీదుల జారీ, సంబంధిత అధికారులకు పత్రాల బదిలీ ప్రక్రియలో స్పష్టమైన విధానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ -
బాబు పాలనంతా అబద్ధాలు.. ప్రచారాలు.. నాటకాలు..!
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనంతా అబద్ధాలు, ప్రచారాలు, రాజకీయ నాటకాలేనని.. చేసిందే మళ్లీ మళ్లీ చేస్తూ.. చెప్పిందే పదే పదే చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఒకే పెన్షన్ పథకాన్ని 22 సార్లు ప్రారంభించడం చంద్రబాబు ప్రచార పిచ్చికి నిదర్శనం. కొత్తగా ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేశారా?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేశారా?. స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసమే 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు కొత్త నాటకం. న్యాయస్థానాల్లో నిలబడని బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించడం దుర్మార్గం. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాజకీయంగా సామాజికంగా పెద్దపీట వేసింది వైఎస్ జగన్’’ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.‘‘భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో వైఎస్ జగన్ చేసిన కృషిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన పనులకు పేర్లు మార్చి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలనే చంద్రబాబు ఐదుసార్లు పంపిణీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. పాసు పుస్తకాలపై వైఎస్ జగన్ ఫొటో ఉందని దుష్ప్రచారం చేసినవాళ్లే ఇప్పుడు వాటిని పంపిణీ చేస్తున్నారు...రాయలసీమలో కరువు విలయ తాండవం చేస్తుంటే చంద్రబాబుకు ప్రచారం చేసుకుంటున్నారు. రాయలసీమలో పంటలు ఎండిపోతుంటే రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాయలసీమకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్న చంద్రబాబు.. బడ్జెట్లో ఎంత కేటాయించారో చెప్పాలి. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో సమాధానం చెప్పాలి...రైతులకు సాగునీరు, గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం సిగ్గుచేటు. టమాటా, మిర్చి, పొగాకు రైతుల కష్టాలు చంద్రబాబుకు కనిపించడం లేదా?. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల్లో ఎన్నింటిని పూర్తిగా అమలు చేశారో చంద్రబాబు చెప్పాలి. డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను, రైతులను, పెన్షనర్లను చంద్రబాబు మోసం చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఆసరా, చేయూత పథకాలతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారిపై కేసులు పెడుతున్నారు...డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి పాలనలో ప్రతిపక్షాలను ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించినా కేసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నా హోంమంత్రి స్పందించడం లేదు. రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయి.. సామాన్యుల ఆస్తులకు రక్షణ కరవైంది. ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపునకు దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...ముఖ్యమంత్రి, మంత్రుల ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ప్రయాణాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. వైఎస్ జగన్ స్వర్ణ పాలనపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?. వైఎస్ జగన్ పాలన విధ్వంసమని ఆరోపిస్తున్న చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమంలో ఎవరి పాలనలో ఏం జరిగిందో చర్చిద్దాం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల కంటే రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. చంద్రబాబు రాజకీయ నాటకాలను, అబద్ధపు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారు.’’ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ -
ఎన్డీయేలో ఉండి ఏం లాభం బాబు?
సాక్షి, ఢిల్లీ/అమరావతి: వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. మాములు పొలిటికల్ డ్రామాలాడలేదు. ‘చెల్లని’ జీవోలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకున్నారు. అయితే బాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేయగా, ఆ తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో నారా పొలిటికల్ డ్రామాపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబు కూడా ఇటీవల రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయినా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రాన్ని ఒప్పించేందుకు కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలిసినా చంద్రబాబు ఈ దిశగా ఎందుకు ప్రయత్నించలేదని నిలదీస్తున్నాయి. అసలు ప్రధానితో చంద్రబాబు కనీసం దీని గురించి మాటైనా ప్రస్తావించారా? అని అంటున్నాయి. షెడ్యూల్-9 డిమాండ్ ఉందిగా..బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని కేంద్రం ద్వారా పరిష్కరించాలని, ఇందుకోసం సంబంధిత చట్టాన్ని తీసుకొచ్చి షెడ్యూల్-9లో చేర్చాలని బీసీ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై చట్టపరమైన పరిమితులు ఉన్నాయని తెలిసి కూడా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారా? సాధ్యం కాదని తెలిసినా చెల్లని జీవోలతో నాటకమాడారా? అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.గతంలోనూ ఇదే తీరంటూ ఆగ్రహంబీసీల రిజర్వేషన్ల విషయంలో టీడీపీ గతంలోనూ అడ్డంకులు సృష్టించడం.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఆనాడు టీడీపీ నేత ప్రతాప్‌తో పిటిషన్లు వేయించి రిజర్వేషన్లను అడ్డుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చట్టం దిశగా అడుగులేయకుండా చెల్లని జీవోలు ఇచ్చారని మండిపడుతున్నారు.బీసీలను మరోసారి మోసం చేశారని, చంద్రబాబు తీరు వెన్నుపోటు లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై ప్రధానితో చంద్రబాబు చర్చించారా? కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారా? అని నిలదీస్తున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేకపోతే ఆ కూటమిలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు చేసిన రాజకీయ నాటకమేనని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ సర్వేను తప్పుబట్టిన సుప్రీం కోర్టు -
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీసీల రిజర్వేషన్లపై దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం డిస్మిస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను(జీవోలను) హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతోపాటు పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ జీఓ 105ను, పురపాలక శాఖ జీఓ 1065ను జారీ చేసింది.అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాటిని కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎస్ఎల్పీ దాఖలుహైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం 2026లో కొత్తగా చేపట్టిన అధ్యయనాన్ని హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం తన వాదనలో పేర్కొంది. హైకోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఉపశమనాన్ని నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఊరట లభించలేదు.ఏపీ ప్రభుత్వ సర్వేను తప్పుబట్టిన సుప్రీం కోర్టుకేవలం సమగ్ర కుటుంబ సర్వేను ఎలా పరిగణలోకి తీసుకుంటాం?ప్రభుత్వ గణాంకాలు శాస్త్రీయంగా లేవన్న ధర్మాసనం.. ఏపీ హైకోర్టు తీర్పు సహేతుకంగా ఉంది.. పిటిషన్ డిస్మిస్ఎన్నికలకు లైన్ క్లియర్!ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ నేపథ్యంలో.. హైకోర్టు ఇచ్చిన గడవులోపు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఇవాళ కోర్టుకు తెలిపింది. అయితే సర్ ప్రక్రియ పూర్తి కాకపోతే పాత జాబితాతో.. పూర్తయితే కొత్త జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, నోటిఫికేషన్ నాటికి ఏ జాబితా పూర్తయితే ఆ జాబితాను తీసుకోవాలని కోర్టు ఈసీకి సూచించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆరు వారాల గడువులోపు నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.ఇదీ చదవండి: ఇదేం కవరింగ్ బాబూ! -
AP: రేపటి నుంచే స్కూళ్లకు సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 10వ తేదీ (శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ 2026–27 విద్యా సంవత్సరం కేలండర్ ప్రకారం దసరా సెలవులు ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు ప్రకటించారు. అయితే, ఈనెల 10న రెండో శనివారం, మరుసటిరోజు ఆదివారం కావడంతో రెండురోజులు ముందే సెలవులు వచ్చినట్టయింది. పాఠశాలలు అక్టోబర్ 22న పునఃప్రారంభం అవుతాయి. -
మున్సిపల్ టెండర్లలో గోల్మాల్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రహదారులు, డ్రైన్లు, విద్యుత్ దీపాలు, రోడ్డు సెంట్రల్ లైటింగ్, పార్కుల అభివృద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రెండు దశల్లో నిర్వహించిన టెండర్లలో గోల్మాల్ జరిగింది. రెండున్నరేళ్ల పాటు మున్సిపాలిటీల ప్రగతిని పట్టించుకోని సర్కారు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎత్తుగడ వేస్తూనే.. అభివృద్ధి పనుల పేరుతో దోచుకోవడానికి సిద్ధమైంది. ఈ పనుల్లో చిన్న కాంట్రాక్టర్లకు చోటులేకుండా చేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) విధానాన్ని తెరపైకి తెచ్చి ఎల్–1గా నిలిచారని చూపుతూ అస్మదీయులకు చెందిన నాలుగు కాంట్రాక్టు సంస్థలకు అధిక ధరలకు పనులు కట్టబెట్టింది. ప్రతి ప్యాకేజీలోనూ సరాసరిన 4.67 శాతం అధిక ధరలకు పనులు అప్పగించింది. తద్వారా కాంట్రాక్టర్లకు రాష్ట్ర ఖజానాను దోచిపెట్టి ‘నీకింత.. నాకింత’ అని పంచుకు తినేందుకు స్కెచ్ వేశారు. తొలిదశలో 106 పట్టణాలు/నగరాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి 16 ప్యాకేజీల కింద రూ.2,994.73 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు వేర్వేరుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం ప్రజారోగ్య విభాగం సర్కిళ్ల ద్వారా టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో సగటున 4.67 శాతం అధిక ధరలకు కోట్ చేసిన నాలుగు కాంట్రాక్టు సంస్థలు పనులు దక్కించుకున్నాయి. మొత్తం 16 ప్యాకేజీల పనులను రూ.3,134.70 కోట్లతో చేపట్టేందుకు ముందుకొచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.139.88 కోట్ల భారం పడనుంది. తాజాగా గురువారం నెల్లూరు సర్కిల్ పరిధిలోని తిరుపతి, చిత్తూరు జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో రూ.272.42కోట్ల విలువైన పనులను మేఘా సంస్థకే అప్పగించారు. అంచనా వ్యయం కంటే 4.74 శాతం అధికంగా రూ.285.34 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు.ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వ ఖజానాపై అధికంగా 12.92 కోట్ల భారం పడనుంది. అస్మదీయులకే పనుల అప్పగింత మున్సిపాలిటీల్లో చేపట్టనున్న పనులను సైతం చంద్రబాబు తన అస్మదీయ సంస్థలకే కట్టబెట్టారు. ఎన్సీసీ సంస్థకు రూ.767.10 కోట్ల విలువైన 4 ప్యాకేజీలు, మేఘా సంస్థకు తాజాగా కేటాయించిన వాటితో రూ.1,589.57 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఇక సివెట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు రూ.491.16 కోట్ల విలువైన మూడు ప్యాకేజీలు, ఎంపీ సీఎం రమే‹Ùకు చెందిన జేడబ్ల్యూఐఎల్ ఇన్ఫ్రా–రిత్విక్ ప్రాజెక్ట్స్ (జాయింట్ వెంచర్)కు రెండు, రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు ఒక ప్యాకేజీ చొప్పున రూ.572.19 కోట్లవిలువైన మూడు ప్యాకేజీల పనులు కట్టబెట్టారు. కౌన్సిళ్లు గడువు ముగిశాక.. ప్రభుత్వం ఖరారు చేసిన పనులకు ఆమోదం తెలుపుతూ ఆయా మున్సిపల్ కౌన్సిళ్లు తీర్మానాలు చేయాలి. అయితే.. ఎన్నికైన పాలక మండళ్ల గడువు ముగిసిన సమయంలో ఈ విధానాన్ని తెరపైకి తేవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు కావాల్సిన సంస్థలకు పనులు కట్టబెట్టేందుకు ప్రత్యేకాధికారులపై ఒత్తిడి తెచ్చి, తీర్మానాలు చేయించుకోవడానికి ప్రభుత్వం హడావుడిగా ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైబ్రిడ్ యాన్యుటీతో చెల్లింపులు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో నిర్మాణ సమయంలోనే 40 శాతం నిధులను పనులు జరిగే మున్సిపాలిటీలే చెల్లించాలి. మిగిలిన 60 శాతం నిధులను 40 త్రైమాసిక వాయిదాల్లో ఆయా మున్సిపాలిటీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఎంపికైన సంస్థలు పనులు పూర్తి చేసిన తర్వాత కూడా మున్సిపాలిటీలపై దీర్ఘకాలిక చెల్లింపు బాధ్యత కొనసాగుతుంది. దీంతో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పనులు చేసే అవకాశం కూడా ఆయా మున్సిపాలిటీలకు ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.5,500 కోట్లే కానీ.. మొత్తం పనులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.7,469.46 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. అయితే ఇందులో రూ.5,500 కోట్లు అసలు ప్రాజెక్టు వ్యయం కాగా, మరో రూ.1,969.46 కోట్లు పదేళ్ల కాలానికి వడ్డీగా చూపించింది. ప్రాజెక్టు వ్యయంతో పోలిస్తే వడ్డీ మొత్తం సుమారు 35.8 శాతం మేర ఉంటుంది. రూ.5,500 కోట్ల అసలు ప్రాజెక్టు వ్యయానికి అదనంగా రూ.1,969.46 కోట్ల వడ్డీ చెల్లించాలి. మరోవైపు యాన్యుటీల చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతాకు నిధులు సమకూర్చే బాధ్యతను పట్టణ, గ్రామ ప్రణాళిక విభాగానికి అప్పగించింది. -
వెబ్‌ల్యాండ్ హ్యాక్‌పై సర్కారు కవరింగులు
సాక్షి, అమరావతి: వెబ్‌ల్యాండ్ హ్యాక్ అయిన విషయాన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు ప్రభుత్వం దాని కవరింగ్ కోసం నానా తంటాలు పడుతోంది. ‘వెబ్‌ల్యాండ్ హ్యాక్’ పేరుతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఇచ్చిన వివరణలోనే వారి తప్పులన్నీ బయటపడ్డాయి. వెబ్‌ల్యాండ్ హ్యాక్ అవలేదని కేవలం రొటీన్ మెయింటెనెన్స్ కోసం 6వ తేదీ నుంచి రెండ్రోజులపాటు తామే సర్వర్లు నిలిపివేశామని తెలిపింది. అయితే, నిర్వహణ పేరుతో గతంలో ఎప్పుడూ వెబ్‌ల్యాండ్‌ను డౌన్ చేసిన సందర్భాలు లేవు. ప్రజలకు సంబంధించిన వివరాలు, సేవలతో ముడిపడి ఉన్న పోర్టల్స్‌ను మెయింటెనెన్స్, ఇతర కారణాలతో నిలిపివేస్తే ఆ విషయాన్ని ముందుగా ప్రజలకు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో సమాచారం ఇస్తారు. కానీ, ఇప్పుడు వెబ్‌ల్యాండ్ డౌన్ చేస్తే ముందే ఎందుకు ప్రకటించలేదు? ఏ కార్యాలయానికీ సర్క్యులర్ ఎందుకు పంపలేదు? ఇలాంటివి రాత్రి, సెలవు రోజుల్లో కాకుండా పని దినాల్లో, కార్యాలయాల పనివేళల్లో ఎందుకు ఆపేశారు? ఈ రెండ్రోజులు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగవని ఎందుకు ముందస్తుగా ప్రజలకు చెప్పలేదనే దానికి ప్రభుత్వం నుంచి సమాధానంలేదు.అయితే, రిజిస్ట్రేషన్లు ఎందుకు చేయడంలేదని క్రయవిక్రయాల కోసం వచ్చిన వారు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అడిగితే వెబ్‌ల్యాండ్ పనిచేయడంలేదని, ఆగిపోయిందని చేతులు దులుపుకున్నారు. నిర్వహణ కోసం నిలిచిపోయినట్లు ఎవ్వరూ చెప్పలేదు. అసలు మెయింట్‌నెన్స్ కోసం వెబ్‌ల్యాండ్ ఆగడం ఎప్పుడూ చూడలేదని రెవెన్యూ శాఖాధికారులే చెబుతున్నారు. అంటే.. ప్రభుత్వం ఇచ్చిన వివరణ కవరింగేనని స్పష్టమవుతోంది. ఊరూ, పేరు లేకుండా గుడ్డిగా వివరణ.. చివరికి.. సమాచార శాఖ ఇచ్చిన ఈ వివరణలో కనీసం ఏ శాఖ, ఏ అధికారి వివరణ పంపారో కూడా లేకపోవడం గమనార్హం. ఊరూ, పేరు లేకుండా కనీసం ఎక్కడ నుంచి వివరణ వచ్చిందో కూడా లేకుండా గుడ్డిగా రిజాయిండర్ పంపడాన్ని బట్టి ప్రభుత్వం, రెవెన్యూ శాఖలు ఎంత లోపభూయిష్టంగా పనిచేస్తున్నాయో అర్థంచేసుకోవచ్చు. సర్కారు డొల్లతనం బయటపడుతుందని.. ఇక వెబ్‌ల్యాండ్ హ్యాక్ అయిన విషయం నిజమే అయినా దాన్ని అంగీకరిస్తే భూ రికార్డుల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుందని తప్పును సమర్థించుకుంటున్నారు. పోర్టల్‌ను ఓపెన్ చేస్తే గురువారం రాత్రి వరకూ హ్యాక్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా హ్యాక్ కాలేదని సర్కారు బుకాయిస్తోంది. అలాగే, ప్రైవేటు వ్యక్తులకు లాగిన్లు ఇవ్వలేదని చెబుతూనే ఎన్ఐసీ ద్వారా నియమించిన రిసోర్స్ పర్సన్లకు వెబ్‌ల్యాండ్ లాగిన్లు ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది. అన్నింటికీ మించి.. కీలకమైన భూముల వ్యవహారాలు, రైతుల రుణాలు, ఈ–క్రాప్ వ్యవస్థకు ప్రత్యామ్నాయ సర్వర్ కూడా లేకపోవడం మరో వైఫల్యమేనని ఒప్పుకున్నట్లైంది. బ్లాక్‌చెయిన్, ఐటీ వంటి గొప్పలు చెప్పే ప్రభుత్వం కనీసం బ్యాకప్ కూడా సిద్ధంచేయలేకపోవడం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రభుత్వ వైద్యంపై ప్రైవేట్ పడగ!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగం స్వయం సమృద్ధిని తుంగలో తొక్కి పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) ప్రాజెక్ట్‌ల రూపంలో ముక్కలు ముక్కలుగా చంద్రబాబు సర్కారు అమ్మేస్తోంది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్‌కు, పేదల ఆపద్భాందవి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు, పక్క రాష్ట్రాల్లో విఫలమైన డింక్ (డిజిటల్ నెర్వ్ సెంటర్) కార్యక్రమాన్ని సంజీవని పేరిట ప్రజల నెత్తిన రుద్దడం ద్వారా ఖజానాకు ప్రభుత్వం పెద్దఎత్తున గండికొడుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రేడియాలజీ (సీటీ స్కాన్, ఎంఆర్ఐ) సేవలను మరో పదేళ్లపాటు పీపీపీకి ఇవ్వడానికి చంద్రబాబు సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 2014–19 మధ్య రేడియాలజీ సేవలను పదేళ్లకు పచ్చ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) ఇలా అన్ని ఆస్పత్రుల్లోని రేడియాలజీ సేవలను హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌కు కట్టబెట్టడం కోసం వైద్య శాఖలో పైళ్లు వేగంగా కదులుతున్నాయని విస్తృత ప్రచారం నడుస్తోంది. తొలుత హెచ్‌ఎల్‌ఎల్‌కు సేవలన్నీ కట్టబెట్టి.. ఆ సంస్థ నుంచి ప్రభుత్వ పెద్దల అస్మదీయులకు సబ్ కాంట్రాక్ట్‌లు అప్పగించేలా పావులు కదుపుతున్నారని సమాచారం. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించేలా..వైద్యరంగంలో బయటి సంస్థల దోపిడీకి క్రమంగా అడ్డుకట్టవేసి ప్రభుత్వ రంగంలోనే అన్నిరకాల సేవలను బలోపేతం చేయడం కోసం గత వైఎస్ జగన్ సర్కారు అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్యసేవల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)లో డయగ్నోస్టిక్స్ విభాగం అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ నుంచి ఆస్పత్రులకు సీటీ, ఎంఆర్ఐ, క్యాథల్యాబ్స్ వంటి సౌకర్యాలు కల్పించి ఎంఎస్ఐడీసీ ద్వారా వాటిని నిర్వహించేలా అడుగులు వేశారు.ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప జీజీహెచ్లల్లో ప్రభుత్వమే సీటీ స్కాన్ యంత్రాలను సమకూర్చింది. ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించి, వాటిని నిర్వహిస్తోంది. మిగిలిన చోట్ల పీపీపీ కాంట్రాక్టర్ల కాలపరిమితి ముగిసినప్పుడు కొత్తగా పీపీపీకి ఇవ్వకుండా ప్రభుత్వమే యంత్రాలు సమకూర్చి నిర్వహించేలా ప్రణాళికలు రచించారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు, ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి అడ్డుకట్టకు వీలుండేది. కమీషన్ల కోసం ఖజానాకు గండి..ప్రస్తుతం పీపీపీ రేడియాలజీ సేవల కోసం ప్రభుత్వం ఏటా రూ.60 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. భవిష్యత్‌లో ఇది రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ రంగంలోనే పరికరాలు కొని ఆస్పత్రులను మరింత స్వయం సమృద్ధి చేసేలా గత ప్రభుత్వంలో అడుగులు వేశారు. ఆ విధానం ప్రకారం ప్రభుత్వమే పరికరాలను కొనుగోలు చేస్తే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు చేయడం ద్వారా వచ్చే డబ్బుతో పరికరాలకు ఈఎంఐ చెల్లించడంతో పాటు సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వడానికి వీలుంటుంది. ఇలా కొన్నేళ్లకు ఈఎంఐలు పూర్తయ్యాక పరికరాలన్నీ పూర్తిగా ప్రభుత్వానికి మిగిలిపోతాయి. ఈ ఉత్తమమైన విధానాన్ని గాలికొదిలేసి కమీషన్ల కోసం పీపీపీ ప్రాజెక్ట్‌లను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఖజానాకు ప్రభుత్వ పెద్దలు గండికొడుతున్నారు.‘ముఖ్య’నేత సతీమణి సిఫార్సు.. ప్రభుత్వ యంత్రాలు ప్రైవేట్‌కు..ప్రస్తుతం పీపీపీ సేవలు నిర్వహిస్తున్న సంస్థలు లాభాపేక్షతో ఒకే స్కాన్, ఎంఆర్ఐను రెండు, మూడు రకాలుగా విభజించి దొంగ బిల్లులు పెట్టుకోవడం, ఫేక్ రెఫరల్ స్లిప్స్‌తో స్కాన్లు చేసినట్టుగా చూపించడం.. అవసరం లేకున్నా రోగులకు ఒకటి కంటే ఎక్కువ స్కాన్లు నిర్వహించడం ద్వారా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా 2019–24 మధ్య ప్రభుత్వం ఆధ్వర్యంలో సేవల నిర్వహణ కోసం కొనుగోలు చేసిన యంత్రాలను సైతం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) సాకుతో ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నారు.కాకినాడ జీజీహెచ్‌లో గుండె సంబంధిత చికిత్సల కోసం గత ప్రభుత్వంలో రూ.7 కోట్లతో క్యాథల్యాబ్‌ను సమకూర్చారు. ఇప్పుడు ‘ముఖ్య’నేత సిఫార్సుతో ఈ అధునాతన పరికరాన్ని ఓఅండ్ఎం కింద ప్రైవేట్‌కు అప్పగించేశారు. ఏకంగా సింగిల్ బిడ్ వచ్చినా ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు ఇదే కాంట్రాక్టర్ అనంతపురం, ఒంగోలు జీజీహెచ్ల్లోని క్యాథ్‌ల్యాబ్‌లను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే డీఎంఈ నుంచి ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలుస్తోంది. -
మూడోరోజూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు)/తిరుపతి తుడా: రాష్ట్రంలో వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె మూడో రోజు గురువారం కొనసాగింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగులు అత్యవసర సేవలనూ బహిష్కరించి నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల వారీగా అన్ని ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేసి, 234 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని గడువు పెట్టినట్లు చెప్పారు. అయితే ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కు తగ్గబోమని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. నేడు మౌన దీక్షలు..సమ్మె నేపథ్యంలో ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎమర్జెన్సీ, ఓపీ, ఐపీ వార్డులతో పాటు, రేడియాలజీ, పాథాలజీ, డయాలసిస్, ఇతర సేవలపై ప్రభావం పడుతోందని పలువురు సూపరింటెండెంట్లు వెల్లడించారు. స్టాఫ్ నర్సులు పెద్ద ఎత్తున సమ్మెలోకి వెళ్లడంతో నర్సింగ్, జీఎన్ఎం విద్యార్థులను, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను ప్రత్యామ్నాయంగా వైద్య శాఖ నియమించింది. అయితే రోగుల అవసరాలకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వినూత్న నిరసనల్లో భాగంగా శుక్రవారం మౌన దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్టు ఏపీ వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.‘రుయా’లో 180 మందికి నోటీసులుఇక తిరుపతి రుయా ఆస్పత్రిలో విధులకు హాజరుకాలేదని అధికారులు గురువారం సుమారు 180 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్నేళ్లుగా పేద రోగులకు సేవ చేస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరడం నేరమా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా పోరాటం చేస్తుంటే షోకాజ్ నోటీసులతో అణచివేయాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. -
ఒకే దశ పోలింగ్ వద్దు
సాక్షి, అమరావతి: శాంతిభద్రతల సమస్యలతో పాటు ఎన్నికల ఏర్పాట్లలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అన్ని మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లకు ఒకేరోజు పోలింగ్ కాకుండా రెండు దశల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సూచించారు. అదే మాదిరిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా రెండు దశల్లో నిర్వహించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో పాటు జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, నగర మున్సిపల్ కమిషనర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్‌కుమార్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పిన కలెక్టర్లు, ఎస్పీలు.. ఒక్క దశలోనే ఎన్ని కలు నిర్వహిస్తే వచ్చే ఇబ్బందులను వివరించారు. రెండు దశల్లో 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు జరపండిరాష్ట్రంలో 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు ఉండగా.. ప్రస్తుతం 13 కార్పొరేషన్లతో పాటు 87 మున్సిపాలిటీల్లోనే కొత్తగా వార్డుల విభజన జరిగి ఓటర్ల జాబితాలు, పోలీసు కేంద్రాల గుర్తింపు వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిగిలిన 23 చోట్ల కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడ్డాయి. అయితే, వాటిలోని 20 చోట్ల కోర్టు ఇబ్బందులు తొలగడంతో వాటిల్లో కూడా ఈనెల 17 కల్లా వార్డుల విభజన ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు పూర్తయిన వంద మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించి, మిగిలిన 20 చోట్ల రెండు నెలల తర్వాత మరో విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణ రెండు దశల్లో జరపాలని కొందరు కలెక్టర్లు గురువారం నాటి సమావేశంలో కోరారు. ఎందుకంటే.. ఇతర అన్ని జిల్లాల కన్నా వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా కార్పొరేషన్, మున్సిపాలిటీలన్నీ కలిపి మొత్తం తొమ్మిది వరకు ఉండడంతో ఒకేరోజు ఎన్నికతో శాంతిభద్రతల సమస్యతో పాటు ఏర్పాట్లలో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వారు ఎన్నికల కమిషనర్‌కు ఉదహరించారు. అలాగే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ శాంతిభద్రతల ఇబ్బందులు తలెత్తకుండా ప్రతీ జిల్లాలో రెండో దశల్లో ఎన్నికలు జరపాలని ఐదు జిల్లాల ఎస్పీలు కోరారు. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు మరోవైపు.. గ్రామ పంచాయతీల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీంతో.. గతంలో ఒక రెవిన్యూ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీలన్నింటికీ ఒకరోజు నిర్వహించేలా కాకుండా.. మండలం మొత్తానికి ఒకరోజు ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అన్ని మండలాలను మూడుగా వర్గీకరించి కలెక్టర్లు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోరారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 15వ రోజు పోలింగ్ పూర్తిచేసి, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎన్నికలను 25వ రోజుకల్లా పూర్తికి ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్ఈసీ సూచించారు. అలాగే, మండల పరిషత్ అధ్యక్ష, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలను నోటిఫికేషన్ జారీచేసిన 26 రోజుల్లోపు.. సర్పంచి ఎన్నికలను నోటిఫికేషన్ తర్వాత 15 రోజుల్లో పూర్తిచేయనున్నట్లు ఎస్ఈసీ ఆయా జిల్లాల జెడ్పీ సీఈఓ, డీపీఓలకు తెలిపారు. -
సాక్షి సోషల్ మీడియా ఖాతాలను ఎందుకు నిలిపేశారు?
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా సాక్షి సోషల్ మీడియా ఖాతాలు, కంటెంట్ నిలిపివేత చర్యలకు కారణం ఏమిటో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెటా ప్లాట్‌ఫామ్స్, గూగుల్ ఇండియాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏ కారణాలతో సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశారో స్పష్టంగా చెప్పాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. సోషల్ మీడియా ఖాతాల నిలిపివేతకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పలు తీర్పులు స్పష్టంగా ఉన్నాయని ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. సాక్షి న్యూస్, సాక్షి డిజిటల్ టీవీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను, సాక్షి టీవీ ఫేస్బుక్ పేజీని దేశవ్యాప్తంగా నిలిపివేయడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ (సాక్షి) డైరెక్టర్ వి.మురళి, ఇందిరా టెలివిజన్ (సాక్షి టీవీ) డైరెక్టర్ బీవీ రమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షి సోషల్ మీడియా ఖాతాలు, పోస్ట్‌లను తొలగించడానికి, నిలిపివేయడానికి ఇచ్చిన నోటీసులు, అభ్యర్థనలు, ఇతర వివరాలకు సంబంధించిన కాపీలను తమకు అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, మెటా ప్లాట్‌ఫామ్స్, ఫేస్బుక్ ఇండియాలను ఆదేశించాలని హైకోర్టును సాక్షి తన పిటిషన్లో అభ్యచ్చిచింది. నిలిపేసిన సాక్షి సోషల్ మీడియా ఖాతాలను తక్షణమే పునరుద్ధరించడంతో పాటు భవిష్యత్తులోనూ అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని కోరింది. తమ సోషల్ మీడియా ఖాతాల్లో చంద్రబాబు, లోకేశ్, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఉన్న మొత్తం కంటెంట్‌ను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల న్యాయవాది చింతల సుమన్ ధర్మాసనాన్ని కోరారు. జగన్ కనెక్ట్స్, జగన్ వారియర్, వైఎస్సార్ కుటుంబ ఖాతాల నిలిపివేతపైనా నోటీసులు సాక్షి యాజమాన్యంతోపాటు జగన్ కనెక్ట్స్, వైఎస్సార్ కుటుంబం, వారియర్ జగన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీలను తక్షణమే పునరుద్దరించేలా ఆదేశించాలంటూ పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు ధర్మాసనం గురువారం నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై పార్టీ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా గురువారం విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదావేసింది. ఇప్పటికే దీనిపై కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కరువుపై కాకి లెక్కలు!
సాక్షి, అమరావతి: కరువు విలయంపై ముందుగానే సమాచారం ఉన్నా కప్పిపుచ్చి రైతన్నలను దారుణంగా వంచించిన చంద్రబాబు సర్కారు మొక్కుబడిగా పంట నష్టం అంచనాలకు సిద్ధమైంది. వేలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా నష్టపోగా కేవలం పొలాల్లో ఉన్న పంటల నష్టం పరిశీలనకే ఉపక్రమించింది. మిగతా రైతులను గాలికి వదిలేసింది. చంద్రబాబు పుణ్యమాని ఈ ఏడాది రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోంది. లక్షలాది ఎకరాలు ఖాళీగా నెర్రలు చాస్తున్నాయి. సాగైన చోట తీవ్రమైన వర్షాభావంతో పంటలు ఎండిపోయాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు నేలపాలయ్యాయి. అప్పులు మాత్రం మిగిలాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలవాలి. యుద్ధప్రాతిపదికన నష్టాన్ని లెక్కించి పరిహారం అందించి మేమున్నామనే భరోసా కల్పించాలి. కానీ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కరువు మండలాలను ప్రకటించడంతోనే తమ బాధ్యత పూర్తయినట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడుతున్నారు. కర్ణాటకను చూసి సిగ్గు తెచ్చుకోవాలి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కర్నాటకలో 30 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా ఏపీలో ఏకంగా 53.4 శాతంగా నమోదైంది. జాతీయస్థాయిలో చూస్తే మిజోరాం 58 శాతం లోటుతో ప్రథమ స్థానంలో ఉండగా ఏపీ రెండో స్థానంలో ఉంది. వాత్సవానికి ఏపీతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రంలో కరువు ప్రభావం తక్కువనే చెప్పాలి. అయినా అక్కడి ప్రభుత్వం కరువుతో అల్లాడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు స్పందిస్తున్న తీరు ఆదర్శంగా నిలుస్తోంది. ఏపీ కంటే ముందుగానే కర్ణాటకలో 217 తాలూకాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి ప్రకటన చేశారు. మరో 1,520 తాలూకాలను కరువు జాబితాలో చేర్చే అవకాశం ఉందని ప్రకటించింది. ప్రాథమికంగా దాదాపు రూ.60 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది. ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు కనీసం రూ.11 వేల కోట్ల తక్షణ సాయం ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. కర్ణాటక ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష బృందంతో ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని సాయం కోరేందుకు సిద్ధమవుతున్నారు. మరొక వైపు కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,250 కోట్లను తొలివిడత సాయంగా కర్ణాటక విడుదల చేసింది. అర్హులైన రైతులకు రూ.2,500 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. తాగునీటి కోసం రూ.306 కోట్లు, అత్యవసర ఖర్చుల కోసం కలెక్టర్లకు రూ.329 కోట్లు, పశుగ్రాసం కోసం రూ.25 కోట్లు విడుదల చేసింది. ఢిల్లీ పర్యటనలో రైతుల కష్టాలు పట్టని బాబు చంద్రబాబు నిర్వాకం వల్ల కరువు తీవ్రత అధికంగా ఉన్న ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. సీజన్ ఆరంభం నుంచి సమీక్షలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతులను ఆదుకునే విషయంలో ఇవ్వడం లేదు. ఏపీలో సాధారణం కంటే ఈ ఏడాది దాదాపు 12 లక్షల ఎకరాల్లో సేద్యమే చేయలేదు. 13.15% మేర వరి నాట్లు పడలేదు. గతేడాదితో పోలిస్తే 29.7% ధాన్యం ఉత్పత్తి తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే మొక్కజొన్న 61.9%, జొన్న 69.2 %, చిరుధాన్యాలు 37.8% మేర ఉత్పత్తి తగ్గుతుందని లెక్క తేల్చారు. తొలుత రాష్ట్రంలోని 688 మండలాల్లో 550 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. చివర కు సీజన్ ముగిసిన తర్వాత 388 మండలాలకు పరిమితం చేసింది. 283 మండలాల్లో తీవ్ర కరువు, 105 మండలాల్లో మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. కానీ కరువు సాయం ఊసెత్తడం లేదు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడంలేదు. కరువు తీవ్రతను కేంద్రానికి వివరించి ఎన్డీఆర్ఎఫ్ నిధులు రాబట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం చంద్రబాబు బృందం ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్నప్పటికీ ఆ ఊసే మరిచి సొంత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకునేందుకు కరువు నిధులను రాబట్టే దిశగా కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. కనీసం రాష్ట్రంలో జరిగిన పంట నష్టం గురించి ప్రాథమికంగా వివరించే ప్రయత్నం చేసిన దాఖలాలే లేవు. కాకి లెక్కలతో సరి! కరువు మండలాల ప్రకటన తర్వాత ప్రభుత్వం చేయాల్సిన అసలు పని మొదలవుతుంది. ప్రతి గ్రామంలో పంట నష్టాన్ని శాస్త్రీయంగా నమోదు చేయాలి. రైతువారీగా వివరాలు సేకరించాలి. సాగు పెట్టుబడి నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తక్షణ ఆర్థిక సాయం అందించాలి. పశుగ్రాసం, తాగునీటి ఏర్పాట్లు చేయాలి. రుణాల విషయంలో ఉపశమనం కల్పించాలి. ఇవేమీ చేయకుండా కరువు మండలాల జాబితా ప్రకటించి చేతులు దులుపుకొంటే కాకి లెక్కలుగానే మిగులుతాయని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సవాలక్ష షరతులతో అంచనాలు సీజన్ ముగిసిన తర్వాత మొక్కుబడిగా పంట నష్టం అంచనాలకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. పైగా బుధవారం (7వ తేదీ) రాత్రి ఆదేశాలిచ్చి.. 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జాబితా ప్రకారం కేంద్రానికి నష్టం అంచనాలు పంíపిస్తామని చెబుతున్నారు. వాస్తవంగా తుపానులు, వరదలు, భారీ వర్షాలు లాంటి వైపరీత్యాల సందర్భంలో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఈ ఏడాది వర్షాలు పడలేదు. పంటలు సాగవ్వ లేదు. సాగైన చోట వర్షాభావంతో ఎండిపోయాయి. ఆరు తడులకు నీళ్లులేక, పెట్టుబడులు పెట్టలేక పంటను మేత కొదిలేయగా మరికొంతమంది దున్నేశారు. ఇవేమీ పట్టించు కోకుండా ప్రభుత్వం ఎప్పటిలాగే ఇన్పుట్ సబ్సిడీ కోసం పొలంలో ఉన్న పంటను మాత్రమే అదీ కూడా 33 శాతానికిపైగా దెబ్బతిన్న పంట నష్టాన్ని మాత్రమే జాబితాలో చేర్చాలని ఆదేశించడంపై రైతులు మండిపడుతున్నారు. పైగా పంట నష్టం ఒక్కో రైతుకు గరిష్టంగా ఐదెకరాలకు మించకూడదని షరతు విధించడం గమనార్హం. ఇలాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో ఉదారంగా స్పందించాల్సింది పోయి ఇలా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఖాళీగా ఉన్న పొలాలు, ఎండిపోయిన, దున్నేసిన పొలాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. పంట ఉన్న పొలాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తమ గతేమిటని తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం పైసా సాయం చేయలేదు 5 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. ఎకరానికి రూ. 20 వేల వరకు ఖర్చు చేశా. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం పైసా కూడా సాయం చేయలేదు. – శ్రీనివాసులు, నక్కలదిన్నెవడ్డిపల్లె, అన్నమయ్య జిల్లాపశువులకు మేతగా వదిలేశాఐదెకరాల్లో పత్తి సాగు చేశా. ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టా. చేసేదేమీ లేక పంటను మేతగా పశువులకు వదిలేశా. 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఇలాంటి నష్టం ఎప్పుడూ జరగలేదు. – గాదిలింగ, నిత్రపట్టి, కర్నూలు జిల్లా ఎకరాకు కనీసం రూ.25 వేలివ్వాలి చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు, కాటకాలు సాధారణం. రైతులను ఉదారంగా ఆదుకోవడంలో దారుణంగా విఫలం. లోటు వర్షపాతంలో దేశంలోనే నెం.2లో ఉన్న ఏపీలో దాదాపు 550 మండలాల్లో కరువు ఉన్నట్టు తేలినా ప్రభుత్వం చివరికి 388 మండలాలకు కుదించింది. కనీసం కరువు ప్యాకేజీ అయినా ప్రకటించిందా అంటే అదీ లేదు. కరువు తీవ్రత పెద్దగా లేని కర్నాటకలో తక్షణ కరువు సాయం ప్రకటిస్తే ఏపీలో మాత్రం ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎకరాకు రూ.25 వేలకు తక్కువ కాకుండా సాయం అందించాలి. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం వ్యవసాయ ఎమర్జెన్సీగా ప్రకటించాలి చరిత్రలో ముందెన్నడూలేని రీతిలో తీవ్ర దుర్భిక్షంలో రాష్ట్ర వ్యవసాయ రంగం ఉంది. రాష్ట్రంలోని రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఇంతటి సంక్షోభంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి. రైతులకు ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీని ప్రకటించాలి – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
ఇంటి దొంగలపై వేటు!
సాక్షి, అమరావతి: డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(డా.ఎన్టీటీపీఎస్ –వీటీపీఎస్) ఉద్యోగులు, వినియోగదారుల సహకార సంఘం(ఆఫీసర్స్ కన్జ్యూమర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ) స్టోర్స్‌లో సొమ్ములు కాజేసిన ఇంటి దొంగలపై ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్(ఏపీ జెన్కో) చర్యలు చేపట్టింది. స్టోర్స్ నిర్వహణ, వ్యవహారాల్లో అవకతవకలు జరిగినట్లు సహకార శాఖ నిర్వహించిన విచారణలో తేలింది. వీటికి బాధ్యులైన స్టోర్స్ మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ జెన్కో ఎండీ ఎస్.నాగలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్యదర్శి కె.వెంకటరమణను కూడా సస్పెండ్ చేసినట్లు ఉద్యోగులు చెబుతున్నప్పటికీ అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇవీ అవకతవకలు.. ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ ప్రాంగణంలో వీటీపీఎస్ ఆఫీసర్స్ కన్జ్యూమర్స్ కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ పనిచేస్తోంది. శ్రీనివాస్ గతంలో ఎన్టీపీఎస్‌లో ఏఈఈగా పనిచేశారు. అనంతరం వీటీపీఎస్ ఆఫీసర్స్ కన్జ్యూమర్స్ కో–ఆపరేటివ్ స్టోర్స్ మేనేజింగ్ కమిటీలో సభ్యుడిగా, అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీ వద్ద మెకానికల్ డీవైఈఈగా పనిచేస్తున్నారు. కాగా, స్టోర్స్, పెట్రోల్ బంక్ నిర్వహణలో అవకతవకలను ‘సాక్షి’ జూలై 13, 30న వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో వార్షిక ఆడిట్ నిర్వహించకుండా కాలం గడిపారనే విషయాన్ని బట్టబయలు చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్.. ఆటో కేర్ సెంటర్‌కు సంబంధించి రూ.1,05,80,886.49 నగదు లోటు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. 9 అవకతవకల్లో 4 అంశాలకు శ్రీనివాస్ బాధ్యుడిగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అయినా 4 నెలల్లో నివేదిక ఇవ్వకపోవడాన్ని ‘సాక్షి’ ప్రశ్నించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి అధ్యక్షుడు, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి పదోన్నతులు ఇచ్చి మరో విద్యుత్ కేంద్రానికి బదిలీ చేయడాన్ని నిలదీసింది.ఈ నేపథ్యంలో బాధ్యులపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని సహకార శాఖ విచారణ అధికారి సిఫారసు చేశారు. సంబంధిత వ్యక్తుల ఆస్తులను నిబంధనల ప్రకారం షరతులతో జప్తు చేయాలని కూడా సూచించారు. ఇటీవలే దీర్ఘకాలిక సెలవు ముగించుకుని విధుల్లో చేరిన ఏపీ జెన్కో ఎండీ నాగలక్ష్మి అక్రమార్కులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సస్పెన్షన్.. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో శ్రీనివాస్ డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీ హెడ్‌క్వార్టర్స్‌ను ముందస్తు అనుమతి లేకుండా విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు. -
నాడు 243.. నేడు 29 పోస్టులే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌష్టికాహార లోపం నివారణ, మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని పర్యవేక్షించాల్సిన కీలకమైన మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీపై తీవ్ర గందరగోళం నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన 243 పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం కేవలం 29 పోస్టులకే పరిమితం చేస్తూ జీవో జారీ చేయడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏకంగా 214 పోస్టులను గాల్లో కలిపేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేయడమేనని అభ్యర్థులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీల పర్యవేక్షణ, బాలింతలు, గర్భిణులకు పోషకాహార పంపిణీ బాధ్యతలను చూసే పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పరిస్థితిని సమీక్షించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 243 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 61 సీడీపీవో/ఏసీడీపీవో, 161 గ్రేడ్–1 సూపర్వైజర్, 21 చి్రల్డన్స్ హోమ్స్ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. 2023లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీఎస్) సాధనకు 243 పోస్టులు అవసరమైతే, 2026 నాటికి ఆ ఉద్యోగాల సంఖ్య 450కిపైగా ఉన్నట్టు సమాచారం. ఆ మేరకు పోస్టులు పెంచాల్సింది పోయి ఉన్నవాటిని కుదించడమేంటని అభ్యర్థులు బాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వయోపరిమితి దాటిపోతున్న అభ్యర్థులు హోంసైన్స్, సోషల్ వర్క్, న్యూట్రిషన్ వంటి ప్రత్యేక కోర్సులు పూర్తిచేసి, నోటిఫికేషన్ వస్తుందని ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటి తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఉద్యోగాల కల్పనపై పెద్దఎత్తున హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక ఉన్న పోస్టులకే కోత పెట్టడం వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆమోదం పొందిన మొత్తం 243 పోస్టులతో పాటు ఇప్పటి వరకు ఉన్న ఖాళీల భర్తీకి తక్షణమే పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు. -
14న దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రపతి ముర్ము 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. సుమారు 20 నిమిషాలు దుర్గగుడిలో గడుపుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో 14న అమ్మవారికి జరిగే వైదిక కార్యక్రమాలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేవస్థాన వైదిక కమిటీ సమావేశమై చర్చించింది. -
ఫీడ్.. దోపిడీ!
సాక్షి, అమరావతి: ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అనుమతి లేదు.. రొయ్య రైతుల ఏకాభిప్రాయం లేదు.. అసలు రైతుల అభిప్రాయాన్ని అడిగినవాడే లేడు. అయినా రొయ్య ఫీడ్ ధరలను టన్నుకు మరో రూ.11వేలకు పెంచడానికి రంగం సిద్ధమయ్యింది. నేడో రేపో పెంచిన ధరలను అమలు చేయబోతున్నారు. ఫీడ్ కంపెనీలు ఇప్పటికే రెండు విడతల్లో టన్నుకు రూ. 16వేలు పెంచాయి. ఇప్పుడు మరో రూ.11 వేలు. ఇలా 8 నెలల వ్యవధిలో టన్నుకు ఏకంగా రూ.27వేల మేర ఫీడ్ ధరలు పెరగడమంటే మాటలా.. తమ జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని రైతులు వాపోతున్నారు. ఫీడ్ ధరలే కాదు, సీడ్ ధరలదీ అదే దారి. ఆక్వాసాగులో ఉపయోగించే పరికరాలదీ అదే దారి. ఎడాపెడా పెరుగుతున్న ధరలు రొయ్యరైతులను నిలువునా ముంచుతున్నాయి. ఆక్వాఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు అనుయాయులవే. అందుకే వాళ్లు ఎలా కావాలంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్, ఫీడ్ ధరలను వాళ్లే నిర్ణయిస్తున్నారు. అష్టకష్టాలు పడి, అధికధరలను భరించి ఆక్వా సాగు చేసి రొయ్యపంట చేతికొచ్చేసరికి వ్యాపారులంతా సిండికేట్‌గా తయారయ్యి రేట్లు పడిపోయేలా చేస్తున్నారు. రైతులను ఆదుకోవలసిన చంద్రబాబు సర్కార్ ఈ సిండికేట్‌కు వంతపాడుతుండడాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా పెంపుఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్సడా చట్టంతో పాటు ఫీడ్, సీడ్ «చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రైతుల పక్షాన నిలవాల్సిన రాష్ట్రప్రభుత్వం ఫీడ్కంపెనీల అడుగులకు మడుగులొత్తడంతో అవి ఇష్టారాజ్యంగా ధరలను పెంచేస్తున్నాయి. రైతుల ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా ఫిబ్రవరిలో రూ.4వేలు, జూన్‌లో రూ.12వేల చొప్పున పెంచేశాయి. రైతుల ఆందోళనలతో రూ.2వేలు తగ్గించినట్టు నాటకాలాడిన కంపెనీలు 15 రోజులు తిరక్కుండానే దొడ్డిదారిన రూ.2వేలు పెంచి ఆ మేరకు రైతులపై భారం మోపాయి. 45 రోజులకోసారి ధరలపెంపును సమీక్షించుకునేందుకు కంపెనీలకు అవకాశం కల్పించారు.ప్రత్యేకంగా ఫీడ్ ధరల సమీక్ష కోసం రైతులు, ప్రాసెసింగ్, ఎగుమతిదారులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కమిటీలో ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులు సిఫార్సు చేసిన ప్రభుత్వ అనుకూల రైతులకే చోటు కల్పించారు. వీరు ఫీడ్ కంపెనీలకు వంతపాడడం మొదలు పెట్టారు. ఈ దశలో అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలను సాకుగా చూపి టన్నుకు రూ.37 వేలు తక్కువకాకుండా పెంచితే కానీ తమకు గిట్టుబాటు కాదని చెబుతూ కనీసం రూ.15 వేలు తక్కువకాకుండా పెంచేందుకు అనుమతినివ్వాలని ప్రతిపాదించాయి. ఈ మేరకు సబ్ కమిటీ ఆమోదం తెలపడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచే పెంపును అమలులోకి తీసుకొచ్చాయి. కంపెనీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వతీరును నిరసిస్తూ ఆక్వారైతులు హైకోర్టును ఆశ్రయించారు.రైతుల ఏకాభిప్రాయం లేకుండా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడాన్ని హైకోర్టు సైతం తప్పుబట్టింది. రైతులతో చర్చించి, వారి ఆమోదంతోనే ధరలను సవరించాలని సూచించింది. అప్పటివరకు పెంపును నిలిపి వేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. తాజాగా సబ్ కమిటీ ఆమోదంతో దొడ్డిదారిన టన్నుకు రూ.11వేలు పెంచేందుకు సిద్ధపడ్డాయి. ఈ పెంపును ఒకటి రెండు రోజుల్లో అమలులోకి తీసుకువచ్చేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఫీడ్ ధరల సబ్ కమిటీలో సభ్యులైన రైతుప్రతినిధులు కంపెనీలు ప్రతిపాదించిన ధరల పెంపు విషయమై ఆక్వా సాగయ్యే జిల్లా సంఘాల నేతలతో కానీ, రాష్ట్ర రైతు సంఘాలతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ఆమోదం తెలపడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మేత ధరల భారమిలా2024 ఏప్రిల్‌లో టన్నుకు వెనామీ రొయ్యల మేత ధర రూ.82 వేలు, టైగర్ రొయ్యల మేత రూ.92 వేల మధ్య ఉండగా ప్రస్తుతం వెనామీ మేత రూ.1.18 లక్షలకు, టైగర్ మేత రూ.1.34 లక్షలకు చేరింది. అంటే రెండున్నరేళ్లలో టన్నుకు వెనామీ రైతులపై రూ.36 వేలు, టైగర్ రైతులపై రూ.42 వేల మేర భారం పడినట్టవుతుంది. మేత ధరల భారంతో కిలో రొయ్యల ఉత్పత్తికి వెనామీకి రూ.300కు, టైగర్‌కు రూ.450 ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. ఫీడ్ ధరలను తరచూ పెంచే విధానాన్ని నిలిపివేయాలని ఆక్వా రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కంపెనీలు ఏడాది లేదా ఆరు నెలలకు సరిపడా ముడిసరుకులను ఒకేసారి ఇండెంట్ పెట్టి దిగుమతి చేసుకుంటాయే తప్ప నెలకోసారి దిగుమతి చేసుకోవని రైతు సంఘాలు చెబుతున్నాయి. ప్రతీ ఏటా నవంబర్ లేదా డిసెంబర్లో ధరల సమీక్ష చేయాలే తప్ప ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రైతుల అంగీకారంలేకుండా, వారి అనుమతి తీసుకోకుండా ఇష్టానుసారం ధరలు పెంచుకుంటూ పోతే తాము ఎలా సాగు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా ధరల పెంపుపై నియంత్రణ లేకపోవడం వల్ల పెట్టుబడి వ్యయం పెరిగిపోతోందని, అదేసమయంలో కౌంట్ ధరలు మాత్రం ఇష్టానుసారంగా కోతలు పెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడుతున్నారు. నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలు, లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న హేచరీలపై చర్యలు తీసుకోకుండా వారికి ప్రభుత్వం వంతపాడడం సరికాదంటున్నారు.ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద రొయ్యల కొనుగోలు ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయని వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టుబడి ఆధారంగా కౌంట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తూ దోపిడికి గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. మరొక వైపు ఆక్వాసాగులో ఉపయోగించే పరికరాల ధరలు కంపెనీలు ఇటీవలే భారీగా పెంచేశాయి. ఒక్కో ఏరియేటర్ సెట్‌పై రూ.3 వేలు, సాధారణ, ప్రీమియం మోటార్లపై రూ.1000కు పైగా పెంచారు. ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్స్, మోటార్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది.మేత ధరల పెంపును నిరసిస్తున్నాంతాజాగా టన్నుకు రూ.11వేల మేర మేత ధరలు పెంచాలన్న ప్రతిపాదనలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.16వేల మేర భారం మోపారు. మేత కంపెనీలు, ప్రాసెసింగ్ నిర్వాహకులకు సిఫార్సులతో కూటమి ప్రభుత్వం నియమించిన ఫీడ్ ధరల రైతుల సబ్ కమిటీ సభ్యులతీరు వల్లే మాకీ పరిస్థితి ఏర్పడింది. 45 రోజుల కోసారి ఫీడ్ ధరలు సమీక్షించే విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వతీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. – దుగ్గినేని గోపీనాథ్, కన్వీనర్, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య జగన్ హయాం.. ఆక్వా రైతుకు స్వర్ణయుగం.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.309.95 కోట్ల బకాయిలను సైతం చెల్లించింది. అస్తవ్యస్తంగా ఉన్న ఆక్వా జోన్స్‌ను చక్కదిద్దింది. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీని వర్తింపచేసింది. ఆక్వాకు సంబందించిన విద్యుత్ సర్వీసుల్లో దాదాపు 90 శాతం కనెక్షన్లకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేయగా, దాదాపు 95 శాతం మంది రైతులు లబ్ధి పొందారు. పాత బకాయిలతో సహా 2019–24 మధ్య ఐదేళ్లలో ఆక్వా సబ్సిడీ రూపంలో రూ.3804 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం భరించింది. పైగా ఆక్వా రైతులకు రక్షణ కోసం అప్సడా, ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్టులను తీసుకొచ్చింది. పెంచిన ఫిష్ ఫీడ్ ధరలను మూడు సార్లు కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ ఉపసంహరింపచేయడంతో టన్నుపై రూ.8,600 మేర ఆదా అయ్యింది. పైగా 15 రోజులకోసారి రొయ్య ధరలను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేశారు.దొంగల్లా మేత కంపెనీలు200 ఎకరాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆక్వా సాగు చేస్తున్నాం. మేత కంపెనీలు దొంగల్లా తయారయ్యారు. తాజా పెంపుదలతో 8 నెలల వ్యవధిలో ఏకంగా రూ.27వేలు పెంచినట్టవుతోంది. మరొక వైపు కౌంట్ ధరలకు సైతం ఎడాపెడా కోతలేస్తూ ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు రైతులను దోచుకుంటున్నారు. విద్యుత్ సబ్సిడీ వర్తించడం లేదు. ఓవర్ లోడ్ పేరిట ప్రతి నెలా రూ.12వేల వరకు అదనపు భారం పడుతోంది. జనరేటర్లతోనే ఆక్వా సాగు చేస్తే మేలన్నట్టుగా కన్పిస్తోంది. వైరస్లు, తెగుళ్ల కంటే చంద్రబాబు (సీబీ) వైరస్ వలనే ఆక్వా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. – వేగేశ్న వెంకటరాజు, చిన్నకాపురం, పశ్చిమగోదావరి జిల్లాఎకరాకు రూ.72వేల అదనపు భారంనేను 35 ఎకరాలు సాగు చేస్తున్నా. ఇప్పటికే టన్నుకు రూ.16వేల మేర పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.11వేల మేర పెంచనుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పెంపుతో ఎకరాకు రూ.72వేల మేర అదనంగా భారం పడుతోంది. కౌంట్ ధరల మధ్య వ్యత్యాసం రూ.30–50 నుంచి రూ.10–30కు తగ్గించేశారు. విద్యుత్ సబ్సిడీ వస్తుందని ఎదురు చూసాం. కానీ అమలుకు నోచుకోవడంలేదు. సర్దుబాటు చార్జీల పేరిట అదనపు భారం మోపుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆక్వా రైతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. – అల్లూరి కృష్ణంరాజు, ఖాతాల మెరక, పశ్చిమగోదావరి జిల్లావిద్యుత్ సబ్సిడీకీ ఎగనామంజోన్, నాన్‌జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ çసరఫరా చేస్తామంటూ ఇచ్చిన హామీని రెండున్నరేళ్లుగా అటకెక్కించేశారు. మరొక వైపు సర్‌చార్జీ, సర్దుబాటు చార్జీలంటూ ఎడాపెడా బాదడంతో యూనిట్ రూ.1.50కే విద్యుత్ పొందే రైతు భూతద్దం పెట్టి వెతికినా కన్పించని పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ హయాంలో సబ్సిడీకి అర్హత పొందిన రైతులు తప్ప ఈ రెండున్నరేళ్లలో కొత్తగా ఏ ఒక్క రైతు ఈ రెండేళ్లలో విద్యుత్ సబ్సిడీ పొందలేని దుస్థితి నెలకొంది. సబ్సిడీ పొందే రైతులు సైతం అదనపు చార్జీల పేరిట యూనిట్ రూ.2.50కుపైగా చెల్లిస్తున్నారు. అదే సబ్సిడీ వర్తించని రైతులకు వాస్తవంగా యూనిట్ రూ.3.85 పైసలకే విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, యూనిట్‌కు రూ.5కు తక్కువ కాకుండా బిల్లులొస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ లోడ్, అదనపు ఛార్జీల పేరిట ఒక్కో సర్వీసుకు రూ.8వేల నుంచి రూ.12వేల వరకు అదనపు భారం పడుతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. -
సునీత దంపతులు చంద్రబాబును కలవడానికి కారణం ఏంటి?
సాక్షి, తాడేపల్లి: వివేకా హత్య కేసుతో చంద్రబాబు రాజకీయ చదరంగం ఆడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. వివేకా కేసులో న్యాయం జరగాలా? లేక చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు నెరవేరాలా?. సునీత దంపతులు చంద్రబాబును కలవటానికి కారణం ఏంటి?. అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసుల వార్తలు వచ్చిన వెంటనే సునీత దంపతులు.. చంద్రబాబును ఎందుకు కలిశారు’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘వివేకా హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని చంద్రబాబును కలిశారా?. లేక కడప జెడ్పీ చైర్మన్ పదవి కోసం చర్చించారా?. సునీత కుటుంబానికి రాజకీయ పదవుల విషయంలో చంద్రబాబు ఏమైనా హామీలు ఇచ్చారా? ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడినప్పుడల్లా పాత కేసులకు కొత్త స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. ప్రజలు సమాధానాలు అడిగితే క్రైమ్ థ్రిల్లర్ వినిపిస్తున్నారు. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంది చంద్రబాబూ.. కానీ ఎడిటింగ్‌లోనే మీ రాజకీయ వ్యూహం బయటపడుతోంది’’ అంటూ శైలజానాథ్ చురకలు అంటించారు.‘‘గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారు.. మరి వెన్నుపోటు పార్టీ చరిత్రను ప్రజలు మర్చిపోతారా?. వివేకా హత్య కేసులో నిందితులు చంద్రబాబు దగ్గరకు ఎందుకు వస్తున్నారు?. టీడీపీ కార్యాలయానికి దస్తగిరి కుటుంబం వచ్చారన్న వార్తలపై చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదు?. వివేకా హత్య కేసులో నిందితులకు రాష్ట్ర మంత్రులు మద్దతుగా తెలపడం వెనుక కారణమేంటి?. సునీత ఏనాడైనా తన తండ్రి కేసును త్వరగా ముగించాలని ఎందుకు కోరటం లేదు?. వివేకా హత్య కేసులో రాజకీయ ఆరోపణలు మానుకోవాలి..ఈడీ స్వతంత్రంగా వ్యవహరిస్తోందా? లేక చంద్రబాబు ప్రభుత్వ సిట్ కథనాన్నే కొనసాగిస్తోందా?. రాష్ట్రంలో కరువు, రైతుల కష్టాలు, డీఎస్సీ అక్రమాలపై సమాధానం లేదు. చంద్రబాబుకు గొడ్డలి రాజకీయాలు తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే వివేకానందరెడ్డి గుర్తుకొస్తారా?. ఆయన మరణానికి న్యాయం జరగాల్సిన అవసరం మిగతా రోజుల్లో ఉండదా?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.ఇదీ చదవండి: చంద్రబాబుతో సునీత దంపతుల భేటీ! -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్
సాక్షి,అమరావతి: ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినె విరూపాక్షికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.గత 68 రోజులుగా జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి విడుదల కోసం ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదోనిలో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం వాదోపవాదాలు ముగిశాయి.ఎమ్మెల్యే తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌సింగ్, లక్ష్మీకాంత్ వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం తీర్పును గురువారానికి రిజర్వ్ చేసింది.ఇరువర్గాల వాదనలు, న్యాయస్థానం పరిశీలన అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోనూ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటికే కొన్ని కేసుల్లో ఊరట పొందగా, ఇప్పుడు అట్రాసిటీ కేసులోనూ బెయిల్ రావడంపట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 68 రోజుల రిమాండ్ అనంతరం ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.ఇదీ చదవండి : ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం -
ఈనెల 16న విశాఖలో వైఎస్సార్సీపీ బీసీ గర్జన సభ
సాక్షి,విశాఖ: ఉత్తరాంధ్రలో బీసీల గొంతుకను వినిపించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీన విశాఖలో ప్రతి ష్టాత్మకంగా ‘ఉత్తరాంధ్ర బీసీ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా ప్రధానంగా రెండు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు.రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు బీసీ వర్గాలను చేస్తున్న మోసాలు, వంచనలను ప్రజల ముందుంచనున్నారు. రాష్ట్రంలో బీసీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలు, భౌతిక దాడులపై ఈ వేదిక ద్వారా తీవ్రంగా గళమెత్తనున్నారు. ఈ గర్జన సభ ద్వారా బీసీ వర్గాలకు అండగా నిలుస్తూ, వారి హక్కుల సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణను వైఎస్సార్సీపీ ప్రకటించే అవకాశం ఉంది.ఇదీ చదవండి : ‘స్థితప్రజ్ఞుడు’ వైఎస్ జగన్ -
వంగలపూడి అనిత సవాల్ ఏమైంది?: శ్యామల
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం.. యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామన్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పట్టుబడుతున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపామంటూ సీఎం చంద్రబాబు సినిమా డైలాగులు చెబుతున్నారు. హోంమంత్రి వంగలపూడి అనితకు టీవీ షోల టీఆర్పీలపై ఉన్న శ్రద్ధ గంజాయి కేసులను అరికట్టడంపై లేదు. రాష్ట్రంలో ఆడబిడ్డల ఆర్తనాదాలు హోంమంత్రి అనితకు ఏమాత్రం వినిపించడం లేదు. డేగ కన్నులంటూ ప్రచారం చేసుకుంటున్న ఈగల్ విభాగం సాధించిన వాస్తవ ఫలితాలేంటో స్పష్టం చేయాలి’’ అంటూ శ్యామల నిలదీశారు.‘‘అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గంజాయిని లేకుండా చేస్తామన్న హోంమంత్రి సవాల్ ఏమైంది? కూటమి నేతలు ఆడుతున్నది స్ట్రెయిట్ గేమ్ కాదు, యువత భవిష్యత్తును నాశనం చేసే టాక్సిక్ గేమ్. ప్రకాశం జిల్లాలో పోలీసుల కారులోనే గంజాయి, మద్యం బాటిళ్లు దొరకడం అత్యంత సిగ్గుచేటు. గంజాయి రవాణాలో పోలీసుల పాత్రపై ప్రజలు నిలదీస్తున్నా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో గంజాయి, లిక్విడ్ గంజాయి, యాష్ ఆయిల్, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.’’ అని శ్యామల ధ్వజమెత్తారు.‘‘హోంమంత్రి చెప్పిన మూడు నెలల డెడ్‌లైన్ తర్వాతే రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆగస్టు 27న గోకవరంలో 75 లక్షల విలువైన 6 లీటర్ల లిక్విడ్ గంజాయి పట్టుబడింది. సెప్టెంబర్ 2న విజయవాడ శివారులో గంజాయి ముఠా దాడిలో కానిస్టేబుల్ గాయపడ్డారు. సెప్టెంబర్ 4న అనకాపల్లిలో 3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 17న విశాఖ పెదగంట్యాడ వద్ద బెంగళూరు నుంచి తెచ్చిన ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడ్డాయి. సెప్టెంబర్ 27న అల్లూరి జిల్లా పెద్దబయలు వద్ద 1.34 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయిని పట్టుకున్నారు. సెప్టెంబర్ 28న అనకాపల్లి జిల్లా కోడూరు జంక్షన్ వద్ద 5.5 కోట్ల విలువైన 43 లీటర్ల యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.,,ఈ రోజు విశాఖపట్నంలో 50 గ్రాముల ఎండీఎంఏ, లీటర్ యాష్ ఆయిల్ దొరకడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. హోంమంత్రి సొంత జిల్లాలోనే కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడుతున్నా స్పందించడం లేదు. ఈగల్ వెబ్సైట్ లెక్కల ప్రకారమే 2,444 కేసులు, 6,332 అరెస్టులు, 6 లక్షల కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. రాష్ట్రంలో గంజాయే లేదని ప్రచారం చేస్తూ వెబ్సైట్లో వేల కేసులు ఎలా చూపిస్తున్నారు. ఆపరేషన్ చైతన్య, ఆపరేషన్ గరుడ, సేఫ్ క్యాంపస్ వంటి కార్యక్రమాల వల్ల ఒరిగింది శూన్యం.జగనన్న ప్రభుత్వంలో ఆపరేషన్ పరివర్తన ద్వారా 90 శాతం గంజాయి సాగును సమూలంగా నిర్మూలించాం. నాడు గంజాయి సాగుదారులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందించి ప్రభుత్వం ఆదుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో అనకాపల్లి కోడూరులో 2 లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేశాం. పరారీలో ఉన్న 712 మంది నిందితుల్లో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. పట్టుబడుతున్న డ్రగ్స్ వెనుక ఉన్న ప్రధాన ఫైనాన్షియర్లు, సూత్రధారులను ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోంది. విద్యాసంస్థలు, హాస్టళ్ల సమీపంలో డ్రగ్స్ విక్రయాలపై నమోదైన కేసుల వివరాలను జిల్లాలవారీగా వెల్లడించాలి.రాష్ట్ర యువతకు కావాల్సింది టీవీ షోల వినోదం కాదు, డ్రగ్స్ ముప్పు నుంచి సంపూర్ణ రక్షణ. డ్రగ్స్‌పై కంటితుడుపు ప్రచారాలు కాదు, పూర్తిస్థాయి సరఫరా నెట్వర్క్ నిర్మూలన కావాలి. మంగళగిరి పార్టీ ఆఫీస్ ఆదేశాలను పాటిస్తూ హోంమంత్రి అనిత కేవలం కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు. విపక్ష నాయకులపై నిందలు వేయడం మాని హోంమంత్రి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డ్రగ్స్ సమస్యను మరింత దిగజార్చింది’’ అని శ్యామల దుయ్యబట్టారు.ఇదీ చదవండి: తాతా.. ఈ వయసులో పార్టీ మారి ఏం లాభం? -
వెబ్‌ల్యాండ్ హ్యాక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భూముల వివరాలు, రైతుల యాజమాన్య హక్కుల రికార్డుల వివరాలున్న వెబ్‌ల్యాండ్ పోర్టల్ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో భూపరిపాలనకు గుండెకాయ వంటి ఈ వ్యవస్థ కుప్పకూలింది. ఫలితంగా రెండురోజుల నుంచి ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. క్రయవిక్రయాలు పూర్తిగా స్తంభించాయి. పంటరుణాలు, ఈ–క్రాప్ నమోదు, ఎరువుల పంపిణీపైనా ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని చిన్న సాంకేతిక సమస్య అని చెబుతోంది. వెబ్‌ల్యాండ్ హ్యాక్ అయి రెండురోజులు అయినా వాస్తవం బయటకు రాకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని కోట్లాది సర్వే నంబర్లు, ఎల్పీఎం నంబర్లు, భూయజమానుల పేర్లు, వారి ఆధార్ అనుసంధాన వివరాలు, అడంగల్, 1–బీ, మ్యుటేషన్ల చరిత్ర.. మొత్తం రాష్ట్ర భూసంపద వివరాలన్నీ వెబ్‌ల్యాండ్‌లోనే ఉంటాయి. అలాంటి వ్యవస్థ మొత్తం హ్యాక్ అవడంతో ప్రజల భూములు మొత్తం ప్రమాదంలో పడినట్లేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క క్లిక్‌తో యజమాని పేరు మారిపోయే ప్రమాదం నెలకొందని నిపుణులు చెబుతున్నారు. హెచ్చరికలు వచ్చినా నిద్రపోయిన సర్కారు రాష్ట్రంలో భూముల డేటా అంతా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ఆధ్వర్యంలోని వెబ్‌ల్యాండ్ పోర్టళ్లలో ఉంటుంది. రీసర్వే పూర్తయిన గ్రామాలకు వెబ్‌ల్యాండ్–2, రీసర్వే కాని గ్రామాలకు పాత వెబ్‌ల్యాండ్ పనిచేస్తాయి. ప్రజలు తమ భూమి వివరాలు చూసుకునేందుకు మీభూమి పోర్టల్ ఉంది. పదిరోజులుగా ఈ పోర్టళ్లలో తరచు సమస్యలు వస్తున్నాయి. వారం కిందటే మీభూమి పోర్టల్ పూర్తిగా ఆగిపోయింది. అయినా ప్రభుత్వం కళ్లు తెరవలేదు. ఫలితంగా రెండురోజుల కిందట మొత్తం వెబ్‌ల్యాండ్ వ్యవస్థే కుప్పకూలింది. వెబ్‌ల్యాండ్ నిర్వహణ అధికారికంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఐసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు లాగిన్ ఐడీలు, ఇతర కీలక యాక్సెస్‌లు విచ్చలవిడిగా ఇచ్చారని రెవెన్యూవర్గాల సమాచారం. భూరికార్డులను మార్చే అధికారం అధికారుల నుంచి ప్రైవేటు ఏజెన్సీలు, కార్పొరేట్సంస్థలు, వ్యక్తులకు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. బ్లాక్‌చెయిన్ పేరుతో డేటా మొత్తం బయటకు ఇచ్చిన యాక్సెస్‌లు చాలవన్నట్లు ప్రభుత్వం ఇప్పుడు వెబ్‌ల్యాండ్ డేటా, రిజిస్ట్రేషన్ల డేటా, సర్వే డేటా మొత్తాన్ని ఒకేచోటకు చేర్చి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పోర్టళ్లను పూర్తిగా మార్చే పనిలో పడింది. ఈ ఏడాది జూలైలో చంద్రబాబు మీభూమి–బ్లాక్‌చెయిన్ పైలెట్ ప్రాజెక్టును ఆర్భాటంగా ప్రారంభించారు. చివరికి మొత్తం భూరికార్డుల వ్యవస్థనే అస్థవ్యస్థంగా మార్చి కుప్పకూలేలా చేశారు. డేటా మైగ్రేషన్ పేరుతో మొత్తం భూముల సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పగించడమే ఈ ప్రాజెక్టు వెనుక అసలు ఉద్దేశమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూములు మార్చేందుకేనా ఈ హ్యాకింగ్? ఈ హ్యాకింగ్ యాదృచ్ఛికంగా జరిగింది కాదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా భూరికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఇది జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రూ.కోట్ల విలువ చేసే భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, 22–ఏ నిషేధిత జాబితాలోని భూములపై కన్నేసినవారే దీనివెనుక ఉన్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆధార్ వివరాలకు ముప్పు వెబ్‌ల్యాండ్‌లో భూయజమానుల ఆధార్ నంబర్లు, మొబైల్ నంబర్లు అనుసంధానమై ఉన్నాయి. హ్యాకర్ల చేతికి ఈ వివరాలు చేరితే సైబర్ మోసాలు, నకిలీ దస్తావేజుల సృష్టికి అవకాశం ఏర్పడుతుంది. స్తంభించిన క్రయవిక్రయాలు రోజుకు సుమారు ఐదువేల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో రాష్ట్రంలో భూలావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందే అడ్వాన్సులు ఇచ్చి రిజిస్ట్రేషన్ తేదీలు ఖరారు చేసుకున్నవారు ఆందోళనలో ఉన్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్య ఖర్చులు, అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముకోవాలనుకున్న రైతులు డబ్బు చేతికి అందక అల్లాడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. రిజిస్ట్రేషన్ల రూపంలో రోజూ రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఆదాయం కూడా ఆగిపోయి ఖజానాకు భారీనష్టం వాటిల్లుతోంది. మ్యుటేషన్లు, వారసత్వ బదిలీలు కూడా ఆగిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో దేశానికే ఆదర్శం గత వైఎస్ జగన్ ప్రభుత్వం వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ రీసర్వేకి శ్రీకారం చుట్టింది. డ్రోన్లు, కార్స్ నెట్వర్క్ వంటి ఆధునిక సాంకేతికతతో ప్రతి భూకమతాన్ని కొలిచి, ప్రతి పార్సిల్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించింది. రైతులకు శాశ్వత భూహక్కులు కల్పించి, సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాలన్నది లక్ష్యం. వేలాది గ్రామాల్లో రీసర్వే పూర్తిచేసి కొత్త రికార్డులు రూపొందించింది. ఇక్కడ రీసర్వే జరుగుతున్న ఈ విధానాన్ని చూసి ఇతర రాష్ట్రాలు, కేంద్రప్రభుత్వ సంస్థలు కూడా అధ్యయనం చేశాయి. భూరికార్డుల ఆధునికీకరణలో ఏపీ దేశానికే మోడల్‌గా నిలిచింది. రీసర్వేని సక్రమంగా చేయలేకపోతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ వ్యవస్థను కూడా సమర్థంగా నిర్వహించలేక కుప్పకూల్చింది. వైఎస్ జగన్ హయాంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం.. చంద్రబాబు పాలనలో భూరికార్డులు హ్యాక్ అయిన రాష్ట్రంగా అప్రతిష్ట మూటగట్టుకుంది. -
నష్టాల ఊబిలో ఎస్డీఎస్టీపీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో కీలకమైన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్) ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2,400 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌కు సుమారు రూ.7,500 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిలు, నష్టాలు ఉన్నట్టు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించిన నివేదికలో వెల్లడైంది. మరమ్మతులు, నిర్వహణకు కేటాయించే నిధులు కూడా తగ్గుతున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని నిర్వహించే ఏపీ పవర్ డెవలప్మెంట్ కంపెనీ (ఏపీపీడీసీఎల్) బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి, బూడిద రవాణా, వేతన సవరణల పేరుతో రూ.302.04 కోట్ల ట్రూ అప్‌కు అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్సీని కోరింది. ఇందులో ఏపీఈఆర్సీ రూ.236.20 కోట్లకు అనుమతించింది. అంటే క్లెయిమ్ చేసిన మొత్తంలో రూ.65.84 కోట్లను తిరస్కరించింది. ఈ మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రజల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసి ఏపీపీడీసీఎల్కు చెల్లించాల్సి ఉంటుంది. వేతన క్లెయిమ్‌కు చుక్కెదురు.. వేతన సవరణ పేరుతో ఏపీపీడీసీఎల్ రూ.46.98 కోట్లు కోరింది. కానీ రూ.1,523.98 కోట్ల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) వ్యయానికి అనుమతి ఉండగా.. వాస్తవ ఖర్చు రూ.972.03 కోట్లు మాత్రమే జరిగింది. అంటే రూ.551.95 కోట్లు ఖర్చు కాలేదు. దీంతో రూ.46.98 కోట్లు అదనంగా అవసరం లేదని ఏపీఈఆర్సీ తేల్చి చెప్పింది. అయితే ప్లాంట్ పనితీరును మెరుగుపరిచేందుకు 2024–25 వేతన సవరణలోని రూ.16.28 కోట్లను ప్రత్యేక కేసుగా ఆమోదించింది. ఆ మొత్తాన్ని 2026–27లో అదనంగా మరమ్మతులు, నిర్వహణ పనులకే ఖర్చు చేయాలని ఆదేశించింది. ఉద్యోగుల తప్పనిసరి ఖర్చుల తర్వాత మరమ్మతులు, నిర్వహణకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారని, దీంతో ప్లాంట్ పనితీరు మరింత దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మొత్తంగా రూ.వేల కోట్ల నష్టాలు, పెరుగుతున్న ఇంధన వ్యయం, తక్కువ ప్లాంట్ అందుబాటు, నిర్వహణకు తగ్గుతున్న నిధులు.. ఇవన్నీ ఎస్డీఎస్టీపీఎస్ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ భద్రతకు కీలకమైన ఈ ప్లాంట్ పనితీరు మెరుగుపడకపోతే భవిష్యత్తులో ఆర్థిక భారం మరింత పెరగడంతో పాటు విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఇంధన రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బొగ్గు ఖర్చే పెద్ద భారం.. ప్లాంట్ ఖర్చులు పెరగడానికి బొగ్గు ధరలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. దేశీయ బొగ్గు ధర టన్నుకు రూ.4,700 నుంచి రూ.5,308కు పెరిగింది. 2024–25లో ప్లాంట్ ఇంధన వినియోగంలో సుమారు 24 శాతం ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ బొగ్గు, దిగుమతి బొగ్గు కలిపి వాడారు. 2024–25లో స్టేజ్–2 వేరియబుల్ కాస్ట్ యూనిట్‌కు రూ.3.20గా అనుమతించగా, వాస్తవ ఇంధన ధరల సర్దుబాటు (ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్–ఎఫ్సీఏ) లెక్కల్లో అది రూ.3.41కు చేరింది. దీంతో ఒక్క ఏడాదికే స్టేజ్–2కు రూ.104.76 కోట్ల ట్రూ–అప్ అనుమతించాల్సి వచి్చంది. ఇక బూడిదను తరలించడానికే 2024–25లో రూ.14.56 కోట్లు ఖర్చయ్యాయి. అయితే బూడిద అమ్మకం ద్వారా రూ.10.17 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఆదాయాన్ని తీసివేసిన తర్వాత రూ.4.40 కోట్లను వసూలు చేసుకోవడానికి ఏపీఈఆర్సీ అనుమతించింది. -
పోలవరం ఇష్టారాజ్యం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర జీవనాడి పోలవరం జాతీయ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందా? ఇష్టారాజ్యంగా పనులు చేస్తుండటం వల్ల ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందా? డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం నిర్మాణం కోసం అనుసరిస్తున్న సాంకేతిక నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవా? అంటే అవుననే సమాధానం చెబుతోంది విదేశీ నిపుణుల కమిటీ ఏడో నివేదిక. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అమెరికా, కెనడాలకు చెందిన సి.రిచర్డ్ డొన్నెళ్లి, గియాన్ ఫ్రాంకో డీ సిస్కో, డేవిడ్ పాల్, సీన్ హించ్బెర్జర్లతో నిపుణుల కమిటీ(పీవోఈ)ని 2024లో కేంద్ర జల్ శక్తి శాఖ నియమించింది. ఇప్పటిదాకా ఏడు సార్లు విదేశీ నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి.. సాంకేతిక సలహాలు అందించారు. ఈ ఏడాది మే 27–28న విదేశీ నిపుణుల బృందంలో ఒకరైన హించ్ బెర్గర్ మాత్రమే పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిగతా ముగ్గురు నిపుణులు ఈ పర్యటనకు ఎందుకు దూరంగా ఉన్నారో అధికారికంగా అటు పీపీఏ గానీ, ఇటు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు గానీ అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. మిగిలిన ముగ్గురు నిపుణులతో సంప్రదించి.. పనులు సాగుతున్న పరిస్థితి, లోపాలను ఎత్తిచూపి వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలు, నాణ్యంగా పనులు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆగస్టు 28న ఏడో నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)లకు హించ్ బెర్గర్ అందజేశారు. ప్రాజెక్టు భద్రతకు అత్యంత కీలకమైన సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్, ఎన్విరాన్మెంటల్ ప్లాన్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్లాన్ల కాపీలను తమకు అందజేయలేదని, అసలు అవి ఉన్నాయో లేదో కూడా తెలియదని నిపుణుల కమిటీ నివేదికలో ఎత్తిచూపింది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ...గ్రేడింగ్ చేసిన రాళ్లెక్కడ?డయాఫ్రం వాల్‌కు ఇరు వైపులా బంకమట్టి (నల్లరేగడి మట్టి–క్లే)ను పోసి, దాని పక్కన ఇసుక, గ్రేడింగ్ చేసిన రాళ్లు వేసి ప్రధాన డ్యాంను నిర్మించాలి. ప్రధాన డ్యాంకు ఎగువన, దిగువన ఊట నీటికి అడ్డుకట్ట వేయడానికి, కోతకు గురి కాకుండా చేసేందుకు ఫిల్టర్ (గ్రేడింగ్ చేసిన చిన్న చిన్న రాళ్లను సమాంతరంగా ఏకరీతిగా పోసి, దాని పక్కన ఇసుక పొర, దానికి పక్కన గ్రేడింగ్ చేసిన రాళ్లతో మరో పొర వేస్తారు) వేయాలి. ప్రధాన డ్యాం గ్యాప్–2లో ఫిల్టర్ పనుల్లో పెద్ద పెద్ద రాళ్లను వేస్తున్నారని.. కాంట్రాక్టర్ భారీ బండరాళ్లను తెచ్చి, హో ర్యామ్స్ యంత్రాలతో వాటిని పగులగొట్టడం తాను కళ్లారా చూడటాన్ని విదేశీ నిపుణుడు హించ్ బెర్గర్ నివేదికలో ప్రస్తావించారు. గ్రేడింగ్ చేసిన రాళ్లను కాకుండా పెద్ద పెద్ద రాళ్లతో ఫిల్టర్ నిర్మిస్తే.. రాళ్ల మధ్య సందుల నుంచి ఊట నీరు ప్రవహించడంతోపాటు నదీ గర్భం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని.. ఇది ప్రధాన డ్యాంకు గండ్లు పడేందుకు దోహదం చేస్తుందని.. ఇది ప్రధాన డ్యాం భద్రతకే సవాల్‌గా మారుతుందని నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. స్కారిఫికేషన్ యంత్రాలెక్కడ?ప్రధాన డ్యాం నిర్మాణంలో రాతి, మట్టితో ఒక పొర వేసి దాన్ని భారీ రోలర్లతో గట్టిపరిచి.. దానిపై మరో పొర వేస్తూ సముద్రమట్టానికి 53 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించాలి. దిగువన ప్రధాన డ్యాం వెడల్పు దాదాపు 300 మీటర్లు ఉంటే.. పైభాగానికి వచ్చే సరికి 15 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇలా పొరలు పొరలుగా రాళ్లు, మట్టిని వేసి నిర్మించాలి. ఒక పొరను వేశాక దానిపై మరొక పొర వేసే ముందు కింది పొరను గీకి, రఫ్‌గా(స్కారిఫికేషన్) చేయాలి. అప్పుడు రెండు పొరలు బాగా అతుక్కుపోతాయి. కానీ.. స్కారిఫికేషన్ చేయడానికి యంత్రాలు లేకపోవడంపై విదేశీ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా పక్కనే ఉన్న పొలాల నుంచి ట్రాక్టర్ టిల్లర్లతో స్కారిఫికేషన్ చేస్తున్న వైనాన్ని విదేశీ నిపుణులు నివేదికలో ప్రస్తావించారు. స్కారిఫికేషన్ సక్రమంగా చేయకపోతే రెండు పొరలు సరిగ్గా అతుక్కోవని.. ఇది డ్యాం స్థిరత్వానికి, భద్రతకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.డయాఫ్రంవాల్ను 1.5 మీటర్ల మందంతో నిర్మించాలి.. కానీ దాన్ని నిర్మించడానికి తవ్వే కట్టర్ మందం 1.5 మీటర్లని.. లోతుకు వెళ్లే కొద్దీ కట్టర్ పక్కకు జరగడం లేదా తిరగడం వల్ల, ఒక ప్యానల్ మరో ప్యాన్లతో ఓవర్ ల్యాప్ అయినప్పుడు ఆ జాయింట్లలో మందం తగ్గిందా లేదా అన్నది తేల్చాలని నివేదికలో సూచించిన నిపుణుల కమిటీ బంకమట్టిలో తేమ ఏది?డయాఫ్రం వాల్‌కు ఇరు వైపులా నల్లరేగడి–బంకమట్టిని వేయాలి. ఈ బంకమట్టిలో తగినంత తేమ ఉండాలి. అప్పుడే తగినంత మేర బంకమట్టి సాగి డయాఫ్రం వాల్‌కు రక్షణగా నిలుస్తుంది. కానీ.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్‌కు ఇరు వైపులా పోస్తున్న బంకమట్టిలో తగినంత తేమ లేక ఎండిపోయి ఉందని.. దీనికి సాగే గుణం ఉండదని.. దీని వల్ల డ్యాం నిర్మాణంలో అంతర్గతంగా పగుళ్లు ఏర్పడతాయని.. ఇది డ్యాం భద్రతను ప్రమాదంలోకి నెడుతుందని హెచ్చరించింది. పూర్తి రికార్డులు లేకుండా అంచనా ఎలా?ప్రధాన డ్యాం గ్యాప్–1 వద్ద లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి కర్టెన్ గ్రౌటింగ్(బోరు వేసి అధిక ఒత్తిడితో సిమెంటు కాంక్రీట్‌ను పంపడం ద్వారా భూగర్భంలో చీలికలను మూసేయడం) చేయాలి. కానీ.. 2026, మే 25 నాటికి 242 గ్రౌటింగ్ హోల్స్కుగానూ 213.. 46 కర్టన్ గ్రౌటింగ్ హోల్స్కుగానూ 42 పూర్తి చేశారని.. వాటికి సంబంధించి ప్రైమరీ చెక్హోల్స్ ఫలితాలు మాత్రమే ఇచ్చారని.. సెకండరీ, టెర్షియరీ హోల్స్‌కు సంబంధించి పూర్తి రికార్డులు ఇవ్వకపోవడం వల్ల లీకేజీ నివారణ సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయలేమని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్యానళ్లను సరిగా దించలేదు..డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం కట్టర్లు, గ్రాబర్లతో భూమిని తవ్వుతూ ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని పంపుతూ.. రాతిపొరలోకి రెండు మీటర్ల లోతు వరకూ ప్యానళ్లను దించే వరకూ తవ్వుతారు. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం వెలుపలికి వస్తుంది. కొంత బెంటనైట్ మిశ్రమం కాంక్రీట్ మిశ్రమంతో కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్‌గా ఏర్పడి.. పెద్ద గోడగా మారుతుంది. అదే డయాఫ్రం వాల్. కానీ.. డయాఫ్రం వాల్ నిర్మాణంలో ప్యానళ్లను కఠిన శిలలోకి రెండు మీటర్ల లోతు వరకూ దించే విధాన్ని అత్యంత లోపభూయిష్టంగా చేశారని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. కఠిన రాతి శిల పైపొర ప్యానల్‌కు తగిలినప్పటి నుంచి ఐదు నిముషాల వరకూ నిరంతరాయంగా రాతి ముక్కలు బయటకు వచ్చినప్పుడే రాతి పొరలోకి రెండు మీటర్ల లోతు వరకూ ప్యానల్‌ను దించినట్లుగా లెక్కించాలని స్పష్టం చేసింది.మరమ్మతుల పత్రాలివ్వలేదు..డయాఫ్రం వాల్ పైభాగాన్ని ట్రిమ్ చేసిన తర్వాత పరిశీలిస్తే.. ప్యానెళ్ల జాయింట్లు వద్ద, అలైన్మెంట్ వ్యత్యాసాలు, కాంక్రీట్ లోపాలు బయటపడ్డాయని నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. వాటిలో కొన్నింటికి మరమ్మతులు చేశారని గుర్తించింది. ఎంత లోతు వరకూ మరమ్మతులు చేశారు.. అందులో వినియోగించిన పదార్థాలు ఏమిటి? అధికారికంగా పీపీఏ తనిఖీ చేసి, నాణ్యత ధ్రువీకరణ పత్రాలు ఏవీ తమకు ఇవ్వలేదని విదేశీ నిపుణులు నివేదికలో ఎత్తిచూపారు.మందాన్ని ధ్రువీకరించలేదు..డయాఫ్రం వాల్‌ను 1.5 మీటర్ల మందంతో నిర్మించాలి. ఆ మేరకు నిర్మించామని కాంట్రాక్టర్ పేర్కొన్నారు. కానీ.. దాన్ని నిర్మించేందుకు వినియోగించిన కట్టర్ యంత్రం మందం 1.5 మీటర్లు.. అది డయాఫ్రం వాల్ మందాన్ని ధ్రువీకరించలేదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. భూమి లోపలకు వెళ్లే కొద్దీ కట్టర్ యంత్రం పక్కకు జరగడం లేదా తిరగడం.. ఒక ప్యానల్ మరో ప్యానల్‌తో జతచేసినప్పుడు(ఓవర్ ల్యాప్) డయాఫ్రం వాల్ వైశాల్యం మారిపోతుందని.. ఎక్కువ లోతుకు వెళ్లినప్పుడు గోడ మందం తగ్గిపోయే ప్రమాదం ఉందని.. అది 0.9 మీటర్లకు కూడా చేరే అవకాశం ఉందని గతంలోనూ తాజాగానూ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. డయాఫ్రం వాల్ మందం ఏకరీతిగా ఉందా లేదా తెలుసుకోవడానికి కట్టర్, కోడెన్ సర్వే డేటాలను కలిపి పూర్తి స్థాయి నివేదికను తయారుచేయాలని సూచించింది. ప్రధాన డ్యాం నిర్మాణ పనుల్లో ఒక పొరపై మరొకటి వేసేటప్పుడు కింది పొరను రఫ్ చేయడానికి స్కారిఫికేషన్ చేయడానికి యంత్రాలు లేవని.. సమీపంలోని పొలాల్లో ట్రాక్టర్ టిల్లర్లతో స్కారిఫికేషన్ చేస్తున్నారంటూ ఫొటో సాక్ష్యాలతో నివేదికలో పేర్కొన్న నిపుణుల కమిటీ ప్యానళ్లలో నీటిబుడగలున్నాయి..డయాఫ్రం వాల్ నిర్మాణానికి వినియోగించిన 365 ప్యానళ్లలో 38 ప్యానళ్లలో నీటి బుడగలు (నీటి ఊట లేదా బ్లీడింగ్) కన్పించింది. కాంక్రీట్ మిశ్రమంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల సిమెంటు, ఇసుక, బెంటనైట్, కంకర విడిపోవడం(సెగ్రిగేట్) వల్ల బ్లీడింగ్ అయినట్లు గతంలో విదేశీ నిపుణులు ఎత్తిచూపారు. ఇది సీపేజీకి దారి తీస్తుందని పేర్కొన్నారు. కానీ.. అడ్డంగా తీసిన కోర్(సిమెంటు కాంక్రీట్) నమూనాలను పరీక్షించిన ఫలితాలు చూస్తే అవన్నీ బాగానే ఉన్నట్లు హించ్ బెర్గర్ పేర్కొన్నారు. కాగా ప్రధాన డ్యాంతోపాటు డయాఫ్రం వాల్ నిర్మాణానికి అనుసరిస్తున్న సాంకేతిక ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ ఆక్షేపిస్తూనే.. డయాఫ్రం వాల్ పటిష్ఠంగా ఉందని.. సమర్థవంతంగా ఊట నీటిని అడ్డుకుంటుందంటూ నివేదికలో హించ్ బెర్గర్ పేర్కొనడం గమనార్హం!ప్రధాన డ్యాం పనుల్లో ఇంత నిర్లక్ష్యమా?పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రదేశంలో భూభౌగోళిక పరిస్థితుల ఆధారంగా నదికి అడ్డంగా నీటిని నిల్వ చేసేలా ప్రధాన డ్యాం, నదీ తీరానికి కుడి వైపున రాతి నేలపై వరదను మళ్లించేలా స్పిల్ వేను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. ఈ డిజైన్ ప్రకారం గోదావరి నదీ గర్భంలో గ్యాప్–1లో 564 మీటర్ల పొడవున, గ్యాప్–2లో 1750 మీటర్ల పొడవున రాళ్లు, మట్టితో ప్రధాన డ్యాంను నిర్మించాలి. నదీ గర్భంలో ఊట(సీపేజీ) నీటిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి ప్రధాన డ్యాంకు పునాదిగా డయాఫ్రం వాల్‌ను నిర్మించాలని సీడబ్ల్యూసీ సూచించింది. కానీ ప్రధాన డ్యాం పనుల్లో అంతులేని నిర్లక్ష్యాన్ని హించ్ బెర్గర్ గుర్తించారు.డయాఫ్రం వాల్ నిర్మాణంలోనూ లోపాలుగోదావరి నదీ ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్‌ను 2016–18 మధ్య నిర్మించి సీఎం చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని ఇంజినీరింగ్ నిపుణులు ఆది నుంచి ఎత్తిచూపుతున్నారు. దీనివలన గోదావరి ప్రవాహ ఉద్ధృతికి ఆ డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. దాంతో ఆ దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మించాలని విదేశీ నిపుణులు చేసిన సూచనను సీడబ్ల్యూసీ ఆమోదించింది. 1,372.6 మీటర్ల పొడవున 1.5 మీటర్ల మందంతో గరిష్ఠంగా 97.6 మీటర్ల లోతు నుంచి డయాఫ్రం వాల్‌ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. 365 ప్యానళ్లతో 67,147.9 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ పనులు చేయాలి. డయాఫ్రం వాల్ పనులను 2025, జనవరి 18న ప్రారంభించి.. 2026, ఏప్రిల్ 2 నాటికి అంటే 439 రోజుల్లో పూర్తి చేశారు. డయాఫ్రం వాల్ పనులు చేస్తున్న క్రమంలో విదేశీ నిపుణులు సందర్శించి.. పలు లోపాలను ఎత్తిచూపి.. వాటిని సరిచేయాలని సూచించారు. పనులు పూర్తయ్యాక ఏడో సారి సందర్శించినప్పుడూ అదే కథ. -
పెళ్లైనా పాత బంధాన్ని వదల్లేక కిరాతకం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): మరో వివాహిత మోజులో పడి పెళ్లైనా భార్యతో సరిగా గడపలేకపోయాడు ఆ ప్రబుద్ధుడు. నిత్యం నువ్వే గుర్తుకొస్తున్నావంటూ పాత బంధాన్ని కొనసాగించాలని ప్రియురాలిని వేధించాడు. దీనికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా వెళ్లి గొంతు కోసి కసిదీరా పొడిచి హత్య చేశాడు. అనంతరం తానూ గాయాలు చేసుకుని కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యారావుపేట సీఐ చవాన్ కథనం ప్రకారం.. విజయవాడ అరండల్‌పేటకు చెందిన మహిళ (33)కు పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈమె కుటుంబం మూడేళ్ల పాటు అరండల్‌పేటలోని నాగరాజు ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఆ సమయంలో నాగరాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నాగరాజుకు పెళ్లి కుదరడంతో ఆమె కుటుంబం మూడు నెలల కిందటే పక్క ఇంట్లోని రెండో అంతస్తుకు మారింది. నాగరాజుకు పెళ్లైనా భార్యతో సరిగా ఉండడం లేదు. తనతో సంబంధం కొనసాగించాలని మహిళను తీవ్రంగా వేధిస్తున్నాడు. మళ్లీ తమ ఇంట్లోకి అద్దెకు రావాలని ఆమెతో పాటు, భర్తను అడుగుతున్నాడు. దీనికి మహిళ నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ తరుణంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో నాగరాజు కత్తి తీసుకుని వెళ్లి దాడి చేశాడు. గొంతుకోసి శరీరంపై కసిదీరా పొడిచి చంపేశాడు. శరీరంపై 15 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అనంతరం తానూ చనిపోవాలని భావించి పొట్టపై, గొంతుపై గాయం చేసుకున్నాడు. భవనంపై నుంచి దిగివచ్చి పక్కన ఉన్న కాలువలో దూకాడు. స్థానికులు గమనించి నాగరాజును ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే తనకు చేతబడి చేయడం వల్లే ఆమెను మరిచిపోలేకపోతున్నానని, అందుకే చంపేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు మహిళ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
దివ్యాంగుల ఫాస్టాగ్ నిబంధనల్లో సవరణలు
సాక్షి, అమరావతి: దివ్యాంగ లబ్ధిదారులకు జాతీయ రహదారి టోలింగ్ వ్యవస్థను మరింత అందుబాటులోకి తెచ్చేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) కొత్త మార్గదర్శకాల్లో సవరణ చేసింది. దివ్యాంగులు రాయితీ పొందిన ఫాస్టాగ్ జారీ, పునరుద్ధరణలో మార్పు తీసుకొచ్చింది. శారీరక వైకల్యం కలిగిన వ్యక్తుల వినియోగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలకు, ‘దివ్యాంగజన్’ యాజమాన్యం కింద నమోదు చేసిన వాహనాలకు రాయితీ ఫాస్టాగ్ జారీ చేస్తారు. వైకల్య ధ్రువీకరణ పత్రం, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు, సంబంధిత రికార్డుల మేరకు వైకల్య శాతం ఆధారంగా రాయితీ ఫాస్టాగ్‌లు ఇస్తారు. వీటిని ఏడాదికోసారి రెన్యువల్ చేసుకోవాలనే నిబంధనను సవరించడంతో.. 70శాతం నుంచి నూరు శాతం వైకల్యం ఉన్న వ్యక్తులకు ఐదేళ్లపాటు, 40శాతం నుంచి 70శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వ్యక్తులకు మూడేళ్లపాటు చెల్లుబాటులో ఉంటాయి. గడువు ముగిసిన తర్వాత మళ్లీ అర్హత ధ్రువపత్రాలతో జాతీయ రహదారుల ఫీజు నియమాలు–2008లకు లోబడి మళ్లీ రాయితీ ఫాస్టాగ్‌ను పునరుద్ధరించుకోవచ్చు. -
ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ‘ఓటీపీఆర్’ కష్టాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సర్వీస్ కమిషన్ చుక్కలు చూపిస్తోంది. ఓటీపీఆర్ (వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్)లో చేసిన తాజా మార్పులు వారి పాలిట సమస్యగా మారాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం ప్రభుత్వం జిల్లాల పునర్ విభజనతో పాటు మల్టీ జోనల్ విధానం తీసుకొచ్చింది. మారిన పరిస్థితుల రీత్యా అభ్యర్థులు స్థానికతను నిర్ధారించేందుకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ క్రమంలో సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ విద్యాభ్యాసం వరుస క్రమంలో ఏపీపీఎస్సీ వెబ్సైట్లో నమోదు చేయాలి. వాస్తవానికి రాష్ట్ర విద్యావిధానంలో ప్రతి తరగతి తప్పనిసరిగా చదవాలనే నిబంధన లేకపోవడంతో గతంలో కొంతమంది విద్యార్థులను వారి ప్రతిభ, వయసు ఆధారంగా కొన్ని తరగతులు చదవకుండానే నేరుగా మూడు, నాలుగు లేదా ఐదో తరగతుల్లో చేర్పించారు. దీంతో వారు కొన్ని తరగతులు చదవకుండానే డిగ్రీ, పీజీలు కూడా పూర్తిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఓటీపీఆర్ నమోదులో మాత్రం ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు వరుస క్రమంలో తప్పనిసరిగా నమోదు చేస్తేనే అప్డేట్ అయ్యేలా మార్పులు చేశారు. దీంతో ఒకటి నుంచి ఏడో తరగతి మధ్యలో ఒకటి రెండు తరగతులు చదవకుండా నేరుగా పైతరగతి చదివినా.. అలాంటి అభ్యర్థులు తమ ఓటీపీఆర్ వివరాలు నమోదు చేస్తే అప్డేట్ కావడం లేదు.ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరుస క్రమంలో ‘టైప్ ఆఫ్ స్టడీ, జిల్లా, మండలం, గ్రామం/పట్టణం/నగరం, పాసైన సంవత్సరం, పాఠశాల పేరు’ వివరాలు నమోదు చేస్తేనే వెబ్సైట్లో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం కల్పించారు. దీంతో మధ్యలో కొన్ని తరగతులు చదవలేని వారి వివరాలు తీసుకోవడంలేదు. అలాగే, 7వ తరగతి వరకు చదవకుండా, నేరుగా ఓపెన్ స్కూలింగ్ విధానంలో పది, ఇంటర్, దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఓటీపీఆర్ అప్డేట్ అవడం లేదు. ఈ విధానం మార్చాలని, లేకుంటే వేలాది మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు, ప్రతిభతో పైతరగతులు చదివిన అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
రాజధానిలో మరో భూ మోసం
తాడికొండ: అమరావతి రాజధానిలో మరో భూ మోసం వెలుగు చూసింది. ఇటీవల బతికున్న మనిషిని చనిపోయినట్లు పత్రాలు సృష్టించి తాడికొండకు చెందిన హనుమంతు సుబ్రహ్మణ్యశాస్త్రికి చెందిన పదెకరాల భూమికి ఆన్లైన్లో పేరు మార్చిన కేసులో తహసీల్దార్, ఆర్ఐ, ఇద్దరు వీఆర్వోలు సస్పెన్షన్‌కు గురైనా నిందితుడు ఎవరో తేలకముందే రాజధాని ప్రాంతమైన తాడికొండ మండలం పెదపరిమిలో మరో భూ మోసం వెలుగు చూసింది. పెదపరిమికి చెందిన బాధిత రైతు నర్రా మల్లేశ్వరరావు బుధవారం తాడికొండలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. రూ.4 కోట్ల విలువైన తన 89 సెంట్ల భూమిని తమ గ్రామంలో టీడీపీకి చెందిన భాష్యం సురేష్‌చౌదరి రూ.1 కోటి 11 లక్షల 25 వేలకు కొనుగోలు చేసినట్లు ఈ ఏడాది జూన్ రెండోతేదీ అగ్రిమెంట్ సృష్టించారని మల్లేశ్వరరావు చెప్పారు. 60 రోజుల అనంతరం తాను రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ సురేష్ కోర్టు నోటీసులిచ్చారని తెలిపారు. అసలు అమ్మకం, కొనుగోలు జరగనప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని సురేష్ బాబాయిని తాను అడిగినట్లు తెలిపారు. సురేష్ బాబాయి లాయర్‌కి ఫోన్‌చేసి కొనుగోలు చేయకుండా ఇలా నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే లాయరు సమాధానం చెప్పలేదన్నారు. సురేష్ తనకు తెలియదని, తాను ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. తన ఆస్తి కాజేయాలన్న ఈ కుట్ర వెనుక తమ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నూతలపాటి రామారావు, భాష్యం హనుమయ్య, గార్లపాడుకు చెందిన ఘట్టమనేని వాసు, పుట్టి హనుమంతరావు ఉన్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పారు. తనకు అన్యాయం జరిగిందని చీటింగ్ కేసు నమోదు చేయమని సెపె్టంబర్ 21న జిల్లా ఎస్పీని కోరితే తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని సూచించారని తెలిపారు. తుళ్లూరు డీఎస్పీ, సీఐలను కలవగా సివిల్ కేసు అంటూ కేసు నమోదు చేయకుండా పక్కన పడేశారని ఆరోపించారు. తన భూమి వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు, ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదు పంపానన్నారు. -
అంతర్జాతీయ, ప్రైవేట్ వర్సిటీల కోసం పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్ధలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తెచ్చేందుకు ఏపీ విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ప్రోత్సాహక విధానం–2026కు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, భారతీయ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు అర్హత ప్రమాణాలు, ప్రోత్సాహకాలు వంటి అంశాలను పొందుపరిచారు. ప్రభుత్వం ఎంపిక చేసిన అకడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కూడా క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ఈ విధానం అమలు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి మీడియాకు వివరించారు. ఆ వివరాలు.. » రాష్ట్ర విద్యా వ్యవస్థ నిబంధనల్లో మార్పుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం–1982లోని పలు సెక్షన్లను సవరించేందుకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేసి, నోటిఫికేషన్ ఇచ్చి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు. » ఇళ్ల స్థలాల సమస్యను 45 రోజుల్లో పరిష్కరించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, మరో మంత్రి సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలు, లబ్దిదారులు వదిలేసిన రిజిస్టర్డు స్థలాల రిజి్రస్టేషన్ రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించే అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. » విధుల్లో ఉండగానే మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనంగా గ్రాట్యుటీ ఇస్తారు. సేవలో ఉన్న పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి రూ.5,000 చొప్పున, గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ఆమోదం. » 2026–27 విద్యా సంవత్సరంలో తల్లికి వందనం అమలు కోసం జారీ చేసిన జీవోకు ఆమోదం. » సంక్షేమ వసతి గృహాలు, గురు కులాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు అందించే నెలవారీ డైట్ ఛార్జీలను పెంచే జీవోకు ఆమోదం. » గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు నాణ్యమైన శిక్షణ అందించడానికి విశాఖపట్నంలోని మారికవలస ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు జీవోకు ఆమోదం. కేబినెట్ సమావేశానికి నలుగురు డుమ్మా రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి నలుగురు మంత్రులు డుమ్మా కొట్టారు. టీజీ భరత్, బీసీ జనార్ధన్‌రెడ్డి, సత్యకుమార్, కందుల దుర్గేష్ బుధవారం జరిగిన సమావేశానికి హాజరుకాలేదు. కార్యక్రమాలు ఉన్నాయని ముగ్గురు, విదేశాల్లో ఉండడంతో ఒకరు గైర్హాజరయ్యారు. చంద్రబాబు కేబినెట్ సమావేశాలను సైతం సమీక్షా సమావేశాల తరహాలో నిర్వహిస్తుండడంతో మంత్రులు వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రతి సమావేశానికి ఇద్దరు, ముగ్గురు మంత్రులు గైర్హాజరుకావడం పరిపాటిగా మారింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో వరుసగా మూడు కేబినెట్ సమావేశాలకు హాజరు కాలేదు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలపై నిర్ణయం తీసుకోవాల్సిన మంత్రులు అసలు వాటి గురించే పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఏడాదైనా కౌంటర్ దాఖలు చేయరా?
సాక్షి, అమరావతి: రోజూ జనాలకు సుద్దులు చెబుతూ కథనాలు వండివార్చే ఈనాడు దినపత్రిక యజమాని కిరణ్ సమీప బంధువుకు చెందిన కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఐపీఎల్) భూ అక్రమాలకు సంబంధించిన వ్యాజ్యంలో ఏడాదైనా చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మిగిలిన ప్రతివాదులందరూ కౌంటర్ దాఖలు చేయగా, ప్రభుత్వం ఒక్కటే కౌంటర్ దాఖలు చేయలేదని, కౌంటర్ దాఖలుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీసింది. ఏడాదిగా కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7వేలు ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని కౌంటర్ దాఖలులో అలసత్వం ప్రదర్శించిన అధికారి జేబు నుంచి వసూలు చేసి, దాన్ని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని తేల్చి చెప్పింది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన అప్పీళ్లతో పాటు ఇతర వ్యాజ్యాలు ఏవైనా ఉంటే, వాటన్నింటినీ ఈ పిల్‌కు జత చేయాలని, అన్నింటినీ కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెజ్ కోసం రైతుల నుంచి తీసి ఇచ్చిన భూములను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కి తెలియకుండానే కేఐపీఎల్ అమ్మేసుకుంటున్నా బాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు. తమ అక్రమాలను కప్పిపుచ్చుతూ, ప్రతిపక్షంపై బురదజల్లుతూ అన్ని రకాలుగా ఈనాడు పత్రిక సహకరిస్తుండటంతో బాబు సర్కార్ చోద్యం చూస్తోంది. బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి (ఎంపీఎస్ఈజెడ్) ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల పరిధిలోని 4,731 ఎకరాల భూమిని తీసుకున్న కేఐపీఎల్, ఆ భూముల్లో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయకుండా ఆ భూములను థర్డ్ పార్టీ కంపెనీలకు అమ్మేసుకోవడం, ఏపీఐఐసీకి తెలియకుండా రుణాలు తీసుకుంటున్నా ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలుకు బాబు ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోంది. సీబీఐ దర్యాప్తు కోరుతూ పిల్ ఎస్ఈజెడ్ ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల పరిధిలోని 4,731 ఎకరాల భూమిని తీసుకున్న కేఐపీఎల్ అక్కడ ఎలాంటి సెజ్ ఏర్పాటు చేయలేదని, దీని పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నెల్లూరు జిల్లా, గూడూరుకు చెందిన నాను మునీంద్రరెడ్డి 2025 సెప్టెంబర్ లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన అప్పటి సీజే ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, కేఐపీఎల్ తదితరులకు కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. భూ కేటాయింపులే పెద్ద మోసం కేఐపీఎల్కు భూ కేటాయింపులు భారీ మోసం. ఇంతకు మించిన మోసం దేశంలో ఎక్కడా జరగలేదు. బహుళ ఉత్పత్తుల ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పి, రైతులకు చెందిన 4,731 ఎకరాల భూమిని పొందిన కేఐపీఎల్ ఇప్పటి వరకు అక్కడ ఏమీ చేయలేదు. చిన్నపాటి రోడ్డూ వేయలేదు. ఈ 17 ఏళ్లలో చిన్న నిర్మాణం కూడా చేయలేదు. భూములు అమ్మేసుకుంటోంది ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయాల్సింది పోయి, తీసుకున్న భూములను ఇతరులకు అమ్ముకుంటోంది. అంతేకాక కొన్ని భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని, ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఇలా రూ.1,650 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం ఎస్ఈజెడ్ పేరుతో తీసుకున్న భూముల్లో రూ.30 వేల కోట్ల విలువ చేసే సిలికా శాండ్ ఉంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.4,500 కోట్లు రాయల్టీ వస్తుంది. కేటాయించిన భూముల్లో కేఐపీఎల్ ఏమీ చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఈ ఆదాయాన్ని కూడా కోల్పోతోంది. రూ.1,500 కోట్ల పన్ను మినహాయింపు కేఐపీఎల్ ఇన్ని అక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం కిక్కురుమనడం లేదు. పైపెచ్చు ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల మేర పన్ను మినహాయింపులు ఇచ్చింది. మోసాల్లోకెల్లా ఇది అతిపెద్ద మోసం. ఇంత జరుగుతున్నా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. – సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు వాదనలు -
తొలగించిన ఓటర్లపై నేడు ఇంటింటి సర్వే
సాక్షి, అమరావతి: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్)పై వివాదం తీవ్రమవుతున్న తరుణంలో రాష్ట్రంలో తొలగించిన ఓటర్లను మరోసారి పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలని, అలాగే అర్హత లేని వారికి ఓటు హక్కు ఉండకూడదన్నది కేంద్ర ఎన్నికల సంఘ నినాదమని, ఇందులో భాగంగా సర్‌లో తొలగించిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా మరోసారి పరిశీలించాలని ఆదేశించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సర్ ఇంటింటి సర్వేలో ఆచూకీ దొరకని 44,89,512 మంది ఓటర్లను తొలగించడం జరిగిందని, అలాగే వివరాలు సరిగా లేవని నోటీసులు జారీచేసి విచారణ తర్వాత మరో 1,73,071 మంది కలిపి మొత్తం 46,62,583 మంది ఓటర్లను తొలగించడం జరిగిందన్నారు. ఈ తొలగించిన ఓటర్ల ఇళ్లకు గురువారం బీఎల్వోలు వెళ్లి ప్రత్యేక సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.ఫారం–6 ద్వారా తిరిగి నమోదుఈ సర్వేలో ఎవరి ఓటు అయినా తొలగించినట్లు గుర్తిస్తే, తిరిగి ఫారం 6 ద్వారా నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 16న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని, వచ్చే ఏడాది జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హత ఉందన్నారు. ఒకవేళ తుది ఓటర్ల జాబితా విడుదలలో వీరి పేర్లు లేకపోతే ఫారం–6 ద్వారా ఎప్పుడైనా ఓటరుగా నమోదు చేసుకునే హక్కు ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని సీఈవో పేర్కొన్నారు. -
చిరుద్యోగులపై చంద్రబాబు సర్కార్ ప్రతాపం
సాక్షి, అమరావతి: హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న చిరుద్యోగులపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రతాపం చూపుతోంది. ఏకంగా ఉద్యోగాలు ఊడగొట్టి రోడ్డున పడేస్తామని బెదిరిస్తోంది. సర్వీస్ రెగ్యులరైజేషన్, ఆ ప్రక్రియ అయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ అమలు సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యూనియన్ నాయకుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు దిగుతోంది. ఇంటెలిజెన్స్ పోలీసులు నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఆందోళనలు విరమించకపోతే ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తుందని కుటుంబసభ్యులను హెచ్చరిస్తున్నట్టు వెల్లడైంది. 30 మందికిపైగా నోటీసులు సమస్యలు పరిష్కరించాలని రెండు నెలలుగా వివిధ రూపాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు.. ఇలా వివిధ విభాగాల్లోని 14 వేలమందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. మంగళవారం నుంచి సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు వైద్యశాఖ షోకాజ్ నోటీసులు ఇస్తోంది.అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు సమ్మెకు నేతృత్వం వహిస్తున్న వివిధ సంఘాలకు చెందిన 30 మందికిపైగా ప్రతినిధులను ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. వీరందరికీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేసిన వైద్యశాఖ.. గురు, శుక్రవారాల్లో ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వెనక్కి తగ్గంసమ్మెలో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అత్యవసర సేవలను బహిష్కరించారు. జీజీహెచ్‌లు, ఇతర ప్రదేశాల్లో పెద్ద ఎత్తున చేరి నిరసనలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కు తగ్గబోమని తేల్చి చెప్పారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడింది.తక్షణమే రెగ్యులర్ చేయమని కోరడం లేదు కోవిడ్ వ్యాప్తి సమయంలో మేమంతా ప్రాణాలకు తెగించి పోరాడాం. కొన్నేళ్లుగా పనిచేస్తున్న మా సేవలను గుర్తించి రెగ్యులర్ చేయాలని మేం కోరుతున్నాం. వెంటనే రెగ్యులర్ చేయాలని కూడా మేం డిమాండ్ చేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో ఎప్పటిలోగా రెగ్యులర్ చేస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరుతున్నాం. ఆ ప్రక్రియ అయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని అడుగుతున్నాం. న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తుంటే పోలీసులు మా నాయకుల ఇళ్ల దగ్గరకు వెళ్తున్నారు. ఉద్యోగాలు పోతాయని కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు. నిరసన తెలపడం భారత రాజ్యాంగం మాకిచ్చిన హక్కు. ఎన్ని బెదిరింపులకు దిగినా మేం బెదరం. – అజయ్‌కుమార్, కన్వీనర్, వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగసంఘాల జేఏసీ అన్ని సౌకర్యాలు కల్పించాలి వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు బుధవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంఘ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతనాల చెల్లింపుల్లో వీరు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. చట్ట ప్రకారం వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలి: చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ప్రజారోగ్య రంగానికి వెన్నెముకగా నిలిచిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పట్ల ప్రభుత్వ వైఖరి అత్యంత అమానుషంగా ఉందని, ప్రభుత్వ తీరువల్ల ఉద్యోగులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన వారిని సైతం రోడ్డు మీదకు ఈడ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరు వల్ల వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న దాదాపు 14,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆక్షేపించారు.ఎన్నికల సమయంలో ఉద్యోగులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. నేడు ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తీవ్ర మోసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి కనీస చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ న్యాయబద్ధంగా రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు జీవో ఆర్టీ నెం:459 ప్రకారం 100 శాతం గ్రాస్ శాలరీతో పాటు, డీఏ, హెచ్ఆర్ఏ వెంటనే చెల్లించాలని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 14,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు న్యాయం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పించింది. రెండు నెలలుగా ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్లు సేవలందించిన ఉద్యోగుల సేవలను ప్రభుత్వం మర్చిపోయింది.అర్హత ఉన్న ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజేషన్‌కు సమయం పడితే జీవో ఆర్టీ నెం: 459 ప్రకారం 100 శాతం గ్రాస్ శాలరీతో పాటు పే, డీఏ, హెచ్ఆర్ఏ వెంటనే చెల్లించాలి. ప్రస్తుతం మినిమం టైమ్ స్కేల్‌తో పని చేస్తున్న స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, రేడియోగ్రాఫర్లు, ఈసీజీ, అనస్తీషియా టెక్నీషియన్లకు న్యాయం చేయాలి. 14,600 మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉద్యోగుల కడుపు కొట్టడం తప్ప, మేలు చేసే కార్యక్రమం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశాం. దాదాపు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అప్పట్లో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏళ్ల తరబడి ప్రభుత్వ సేవల్లో కొనసాగుతూ కష్టపడి పని చేస్తున్నారని, వారిని గుర్తించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వర్తించేలా చర్యలు తీసుకున్నాం.అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను అన్ని శాఖల్లో గుర్తించి రెగ్యులరైజ్ చేయడానికి చట్టపరమైన చర్యలు కూడా చేపట్టాం. 2023లో ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాక్ట్‌ను కూడా తీసుకొచ్చాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారి కడుపు కొట్టడం తప్ప, మేలు చేసే కార్యక్రమం చేయడం లేదు.ఉద్యోగులకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. మంచి పీఆర్సీ, ఐఆర్, డీఏలు ఇస్తామని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పింది. మెడికల్ ఉద్యోగులతో పాటు అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, ఉపాధ్యాయులు, సీహెచ్‌వోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సహకార బ్యాంకు ఉద్యోగులు ఇలా అనేక వర్గాలు తమ సమస్యల కోసం రోడ్డెక్కుతున్నాయి.రిటైర్ అయిన అధికారులకు పదేపదే రీ–అపాయింట్మెంట్లు ఇవ్వడం ఆపి, కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కర్నూలు, నంద్యాల జిల్లాల కో-ఆర్డినేటరుగా భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్.వెంకటగౌడ, తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా భూమన అభినయరెడ్డి నియమితులయ్యారు.పార్టీ సీఈసీ సభ్యునిగా రంగాలి జగన్నాథం (విశాఖపట్నం నార్త్), ఎస్ఈసీ సభ్యులుగా పరిస వెంకటనారాయణ (విశాఖపట్నం ఈస్ట్), గుండుబోగుల నాగేశ్వరరావు(తాడేపల్లిగూడెం), సమంతలపూడి బాలసూర్యనారాయణ రాజు (పోలవరం), ఓ.ఎం.పి మధుసూదన్ రావు (చిత్తూరు) నియమితులయ్యారు.ఇదీ చదవండి: ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ లేఖ -
నిజంగా విచారణ జరుగుతోందా?: ఎంపీ గురుమూర్తి
సాక్షి, తాడేపల్లి: ఈడీ వ్యవహార శైలిపై ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ఈడీ స్వతంత్ర సంస్థానా..? చంద్రబాబు జేబు సంస్థా? అంటూ ట్వీట్ చేశారు. పలు వార్తా సంస్థలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన గురుమూర్తి.. ఈడీ అనేది దర్యాప్తు సంస్థా? చంద్రబాబు ప్రభుత్వ ‘సిట్’కు పొడిగింపుగా మారిందా? అంటూ ప్రశ్నించారు.‘‘ఈడీ వ్యవహార శైలి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నోటీసులు, దాడులకు సంబంధించిన వివరాలు ముందుగా ఎల్లో మీడియాలో ఎలా వస్తున్నాయి?. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అదే ప్రకారం ఈడీ చర్యలు ఉంటున్నాయి. అక్రమ మద్యం కేసుతో పాటు అనేక చంద్రబాబు ప్రభుత్వ ‘సిట్’ రూపొందించిన కథనాన్నే ఈడీ ముందుకు తీసుకెళ్తోంది. వైఎస్సార్సీపీ పార్టీయే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తారా?..ఒక దర్యాప్తు సంస్థ స్వతంత్ర వ్యవస్థలా పని చేయాలి. అలా కుండా రాజకీయ కక్ష సాధింపు కోసమే పని చేస్తే ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతాయి. అసలు ఇక్కడ నిజంగా విచారణ జరుగుతోందా? కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు కొనసాగుతోందా?. దర్యాప్తు సంస్థలపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడాలంటే అవి స్వతంత్రంగా, పారదర్శకంగా పని చేయాలి. విచారణ ప్రక్రియ స్థానంలో రాజకీయంగా తయారైన స్క్రిప్టులు అమలవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే.. ముందుగా దెబ్బ తినేది ఆయా సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే’’ అంటూ గురుమూర్తి ట్వీట్ చేశారు.Is the ED @dir_ed still an independent central agency, or has it become an extension of @ncbn 's coalition government’s SIT? The pattern is brazen and deeply troubling: details of notices and raids surface first as “exclusive” scoops in Yellow Media, and then, almost on cue, the ED follows the same script hours later. The ED is dancing to Chandrababu Naidu’s tunes in the foisted liquor and other cases, carrying forward his government’s SIT narrative and targeting YSRCP to serve his political interests and settle scores with the opposition. If an investigative agency starts looking less like an independent institution and more like an instrument of political vendetta, the public is left with a serious question: are we witnessing an investigation or state-sponsored theatre? Institutions earn public trust through independence, transparency, and due process. Once they are replaced by political scripts, that trust is the first casualty. @ndtv @IndiaToday @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @thewire_in @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic— Maddila Gurumoorthy (@GuruMYSRCP) October 7, 2026ఇదీ చదవండి: ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ లేఖ -
ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ లేఖ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియపై స్పష్టత కోసం అత్యవసరంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు లేఖలు రాశారు.ఎన్నికల సన్నాహక చర్యలు, ఏర్పాట్లపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లకు స్పష్టమైన, ఏకరీతి సమాచారం అవసరమని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా అవసరమైన సర్టిఫికెట్ల జారీ ఆలస్యం, వార్డుల డీలిమిటేషన్, ఓటర్ల జాబితాలు, అధికార యంత్రాంగం ద్వారా బెదిరింపులు లేదా దుర్వినియోగం జరుగుతుందన్న ఆందోళనలపై సకాలంలో చర్చ జరగాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల్ని కోరారు.అలాగే కుల/కమ్యూనిటీ, నో-డ్యూస్/ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీకి రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ సమస్యలను కారణంగా చూపుతూ ఎదురవుతున్న అడ్డంకులపై చర్చించాలని వైఎస్సార్సీపీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కోరింది. సీనియర్ గ్రామ, వార్డు సచివాలయ అధికారుల పాత్రపై నిష్పాక్షిక విచారణ జరపాలని, సంబంధిత న్యాయ ఆదేశాలకు లోబడి చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసింది.అలాగే రిజర్వేషన్లు, సీట్ల రొటేషన్, ఎన్నికల షెడ్యూల్, దశలవారీగా ఎన్నికల నిర్వహణ, నామినేషన్లు, పరిశీలన ప్రక్రియ, మేయర్లు-చైర్పర్సన్ల ఎన్నిక, ఓటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అధికారుల తటస్థత, పోలింగ్-కౌంటింగ్ సమయంలో భద్రత, ఫిర్యాదుల సకాలంలో పరిష్కారం వంటి అంశాలను అఖిలపక్ష సమావేశంలో చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీని, ఈసీఐని కోరింది.ప్రతి అర్హత కలిగిన అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి ఓటరు ఎన్నికల్లో పాల్గొనే హక్కును పరిరక్షించేందుకు సమగ్ర సంప్రదింపులు అవసరమని లేఖలో పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందే, చట్టపరమైన, న్యాయపరమైన గడువులకు అనుగుణంగా వీలైనంత త్వరగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.ఈ సమావేశానికి ముందుగానే అజెండాను అన్ని పార్టీలకు పంపించాలని, సమావేశం అనంతరం స్పష్టమైన లిఖితపూర్వక మార్గదర్శకాలు జారీ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ఏకరీతిగా అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కోరింది.ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూకుడు.. తొలి అభ్యర్థి ప్రకటన -
రేపు స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ కీలక భేటీ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మరింత ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్రపునేఠ ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ నగర పోలీసు కమిషనర్లతో పాటు ఆయా జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, నగర, పట్టణ మున్సిపల్ కమిషనర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. బుధవారమే ఈ సమావేశం నిర్వహణకు ఏర్పాటు చేయగా, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా సమావేశం మరుసటి రోజుకు వాయిదా పడింది. -
సమ్మెలోకి వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలన్నింటినీ స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సహాయ సిబ్బంది బహిష్కరించారు. 28 జిల్లాల్లో జీజీహెచ్.. ఇతర ఆస్పత్రుల్లో ఆందోళనలు చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. డిమాండ్లు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఏపీ వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో రాష్ట్రవ్యాప్తంగా 14 వేల మందికిపైగా ఉద్యోగులు భాగస్వామ్యమయ్యారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు, సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సర్వీస్ రెగ్యులర్ చేసే వరకూ 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని కోరారు. వీరి సమ్మెతో వైద్య సేవలు స్తంభించిపోయి రోగులు అవస్థలు పడ్డారు. సెకండరీ హెల్త్, డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులపై ఉద్యోగుల సమ్మె తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించాలని నిర్ణయించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో సమ్మెను తీవ్రతరం చేస్తామని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, కన్వీనర్ అజయ్ ప్రకటించారు. -
కొత్త మార్పులతో గ్రూప్–1
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 166 గ్రూప్–1 సర్వీసు పోస్టులతో పాటు ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో 40 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్స్, ఉద్యాన శాఖలో 37 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అభ్యర్థులు ఈ నెల 27వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 24న ఆఫ్‌లైన్ (ఓఎంఆర్) పద్ధతిలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఓటీపీఆర్ అప్డేట్కు అవకాశం కల్పించిన సర్వీస్ కమిషన్.. తాజా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలిసారి డీఈవో పోస్టుల భర్తీ పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే మొదటిసారిగా 14 జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పోస్టులను తాజా గ్రూప్–1 ద్వారా నేరుగా భర్తీ చేస్తున్నారు. గతంలో డీఈవో పోస్టులను కేవలం డిప్యూటీ డీఈవో లేదా సమాన కేడర్ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతి కల్పించి నియమించేవారు. తాజాగా సర్వీస్ నిబంధనలను సవరించి మొత్తం డీఈవో పోస్టుల్లో 50% గ్రూప్–1 ద్వారా నేరుగా, మిగిలిన 50% పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. 95 శాతం లోకల్ రిజర్వేషన్.. డిజిటల్ మూల్యాంకనం రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 అమలులో భాగంగా లోకల్ రిజర్వేషన్ విధానాన్ని ఈ నోటిఫికేషన్ నుంచే అమల్లోకి తెచ్చారు. ఇందులో భాగంగా 95% పోస్టులను స్థానిక (లోకల్) అభ్యర్థులకు, కేవలం 5% పోస్టులను మాత్రమే ఓపెన్ (నాన్–లోకల్/ఓపెన్ కాంపిటీషన్) కోటా కింద కేటాయించారు. గతంలో ఉన్న మహిళల వర్టికల్ రిజర్వేషన్ విధానంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో తాజాగా 33 1/3 శాతం రిజర్వేషన్‌ను ఎలాంటి రోస్టర్ పాయింట్లు లేకుండా సమాంతరంగా (హారిజాంటల్ ఇంటర్ లాకింగ్) అమలు చేయనున్నారు. క్రీడాకారులకు 3 శాతం కోటాను వర్తింపజేశారు. సుప్రీంకోర్టు తీర్పు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3గా విభజిస్తూ తొలిసారి రోస్టర్ పాయింట్లతో ఖాళీలను కేటాయించారు. సంప్రదాయ పద్ధతితో పాటు డిజిటల్ ఎవాల్యుయేషన్ విధానాన్ని పరిశీలించే నిబంధనను పొందుపరిచారు. స్థానికతపై ఆందోళన తాజా నోటిఫికేషన్లో స్థానికత నిర్ధారణకు పాఠశాల విద్యను ప్రాతిపదికగా తీసుకున్నారు. మొదటి నిబంధన ప్రకారం 7వ తరగతితో కలిపి అంతకుముందు వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే స్థానికత. మొదటి నిబంధన వర్తించకపోతే, 1 నుంచి 7 తరగతుల మధ్య ఎక్కువ కాలం ఎక్కడ చదివితే ఆ ప్రాంతం పరిగణనలోకి వస్తుంది. సమాన కాలమైతే చివరిగా చదివిన ప్రాంతం వర్తిస్తుంది. రెగ్యులర్ స్కూలింగ్ లేనివారు నివసించిన ప్రాంతం ఆధారంగా, నేరుగా ఓపెన్ ద్వారా డిగ్రీ చేసినవారు రెసిడెన్స్ సరి్టఫికెట్ ఆధారంగా స్థానికులుగా అర్హులు. కమిషన్ ఆదేశాల మేరకు అభ్యర్థులు వన్–టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) వివరాలు అప్డేట్ చేస్తుండగా.. వెబ్సైట్లో తప్పనిసరిగా 1వ తరగతి వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. దీంతో 7వ తరగతి వరకు బడికి వెళ్లకుండా నేరుగా ఓపెన్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు ఓటీపీఆర్ అప్డేట్ కాక ఆందోళన చెందుతున్నారు.వివిధ విభాగాలలో పోస్టుల ఖాళీలు ఇలా.. గ్రూప్–1 సర్వీసెస్‌లో 166, ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులు 41, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 37, ఏపీ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఇంజనీరింగ్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 8 ఉన్నాయి. పూర్తి వివరాలకు సర్వీస్ కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov. in లో చూడవచ్చు. -
సంజీవని ముసుగులో మరో రూ.200 కోట్ల దందా?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసి ప్రతి గ్రామంలోనూ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి ప్రజలందరికీ వారి ఇంటి వద్దే అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించారు. వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి వారిని పరీక్షించి అన్ని రకాల మందులను ఉచితంగా అందించేవారు. అలాంటి వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నేడు భ్రష్టుపట్టించింది. కమీషన్ల కోసం.. డిజిటల్ హెల్త్ సేవలు అందిస్తామంటూ సంజీవని పేరుతో ఇప్పటికే రూ.415 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ ప్రభుత్వ పెద్దలు ఇది చాలదన్నట్టు మరో రూ.200 కోట్ల స్కామ్‌కు తెరలేపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీలు), విలేజ్ క్లినిక్‌లలో సంజీవని సేవల అమలు కోసం ప్రభుత్వం పిలిచిన రూ.415 కోట్ల టెండర్ పరిధిలో లేని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) ఆస్పత్రుల రోగుల రికార్డుల నిర్వహణను సైతం ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వేలాది మంది రోగుల వ్యక్తిగత, వైద్య సమాచారాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో డీఎంఈ, డీఎస్‌హెచ్ ఆస్పత్రుల్లో రోగుల రికార్డుల నిర్వహణను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించారు. అత్యంత భద్రతతో కూడిన ఈ వ్యవస్థను పక్కనపెట్టి ప్రైవేట్ సంస్థకు రోగుల డేటాను అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీహెచ్సీ, యూపీహెచ్సీ, విలేజ్ క్లినిక్‌ల కోసం ఉద్దేశించిన రూ.415 కోట్ల సంజీవని టెండర్లో డీఎంఈ, డీఎస్‌హెచ్ ఆస్పత్రుల రికార్డుల నిర్వహణ అంశం లేకపోయినా.. ఆ పనిని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడం ద్వారా మరో రూ.200 కోట్ల స్కామ్‌కు తెరలేచిందనే చర్చ వైద్య శాఖ వర్గాల్లో సాగుతోంది. కర్ణాటకలో ఘోరంగా విఫలమైన డిజిటల్ నెర్వ్ సెంటర్(డీఐఎన్సీ–డింక్)కు సంజీవని పేరు పెట్టి ఓ ప్రైవేట్ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచిపెడుతోందంటూ ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాలతో వైద్య శాఖ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో సంజీవని అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఆగస్టు నెలలో వైద్య శాఖ సమీక్షలో ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీఎస్‌హెచ్, డీఎంఈ ఆస్పత్రుల్లో రోగుల రికార్డుల నిర్వహణను ఆ సంస్థకే అప్పగించాలని ఇటీవల వైద్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్ఐసీ స్వయంగా రూపొందించిన నెక్టŠస్ జెన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా డీఎస్‌హెచ్, డీఎంఈ ఆస్పత్రుల్లో రోగుల రికార్డుల నిర్వహణను అమలులోకి తెచ్చారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఇవే ప్లాట్‌ఫామ్స్ ద్వారా రోగుల సమాచారాన్ని భద్రంగా ఉండేలా చూస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదయ్యే రోగుల వివరాలన్నీ ఎన్ఐసీ ఆధ్వర్యంలోని నేషనల్ డేటా సెంటర్లో అత్యంత పటిష్టమైన ఫైర్‌వాల్స్, నిఘా నీడన భద్రపరచబడతాయి. ప్రైవేట్ క్లౌడ్ సర్వర్ మాదిరిగా డేటా లీకేజీ, వాణిజ్యపరమైన దుర్వినియోగం జరిగే అవకాశం ఉండదు. ఇంత పటిష్టమైన వ్యవస్థను పక్కన పెట్టి అడ్డదారుల్లో ప్రైవేట్ సంస్థ చేతుల్లో డీఎస్‌హెచ్, డీఎంఈ ఆస్పత్రుల రికార్డులను, డేటాను చంద్రబాబు ప్రభుత్వం పెడుతోంది. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి ప్రాథమిక వైద్య రంగం కోసం రూపొందించిన టెండరును, అంతకంటే ఎన్నో రెట్లు పెద్దవైన బోధనాసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రులకు వర్తింపజేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేల సంఖ్యలో పడకలుండే పెద్ద ఆసుపత్రులలో రోగుల సమాచార నిర్వహణ చాలా పెద్ద బాధ్యత. దీనికి కొత్తగా బహిరంగ టెండరు పిలవకుండా, గుట్టుచప్పుడు కాకుండా ఓ సంస్థకు అప్పగించడం ఆ సంస్థకు భారీ లబ్ధి చేకూర్చడం కిందకే వస్తుందని అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో, ఎంతో భద్రతతో కూడిన ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేసి, ప్రైవేటు సంస్థకు పెద్ద ఆసుపత్రులను సైతం ధారాదత్తం చేయడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమని విమర్శకులంటున్నారు. ఈ అడ్డగోలు నిర్ణయంతో ఖజానాలో రూ. వందల కోట్లు లూటీ అవ్వడంతో పాటు, ప్రజల సున్నితమైన సమాచారానికి ముప్పు వాటిల్లుంతుందని వైద్య రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నిబంధనలకు ‘సెల్లు’చీటి
సాక్షి, అమరావతి: కంచె చేను మేసిన చందంగా చంద్రబాబు పాలనలో హెల్త్ వర్సిటీ తీరు తయారైంది. వైద్య విద్య పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన వర్సిటీలోని ముఖ్య అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తుండటంతో అరాచకాలు శ్రుతిమించిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో నంద్యాల మెడికల్ కాలేజీలో కొందరు వైద్య విద్యార్థులను ప్రత్యేక గదుల్లో కూర్చోబెట్టి సెల్ఫోన్లు సమకూర్చి కాపీ కొట్టించిన ఘటనను ఇటీవలే ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ఈ వ్యవహారంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుండగా సోమవారం అదే నంద్యాల మెడికల్ కాలేజీలో మరో ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాల కాలేజీ వర్గాలిచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సోమవారం ఎంబీబీఎస్ విద్యార్థులకు నిర్వహించిన పాథాలజీ ప్రాక్టికల్ పరీక్షల్లో సెల్ఫోన్లు దగ్గర పెట్టుకుని మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఐదుగురు విద్యార్థులను ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పరీక్షలు నిర్వహించలేమంటూ వెళ్లిపోయిన ఎగ్జామినర్ సెల్ఫోన్లలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా విద్యార్థులు పట్టుబడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కళాశాలలోని కొందరు వైద్యులు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌పై ఒత్తిడి తెచ్చినట్టు వెల్లడైంది. ఇందుకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ససేమిరా అనడంతో బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. ఏకంగా విద్యార్థులను సెల్ఫోన్లతో ఎగ్జామ్ హాళ్లలోకి అనుమతించడం, దీన్ని తప్పుబడితే బెదిరింపులకు దిగడంతో ఈ కాలేజీలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేవని ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ లేఖ రాసి వెళ్లిపోయినట్టు కళాశాల వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఆగస్టు నెలలోనూ 150 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా సీసీ కెమెరాలను ఆఫ్ చేసి కొందరు విద్యార్థులను వేరే గదిలోకి తరలించి నంద్యాల కళాశాల ఫ్యాకల్టీ కాపీ కొట్టించారు. బరితెగింపు కాపీయింగ్‌ను పట్టుకున్న స్పెషల్ అబ్జర్వర్‌ను బెదిరించడమే కాకుండా పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే కాపీ కొట్టిస్తున్నామని జవాబిచ్చారు. హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ మావాడే పైకి ఫిర్యాదు చేసినా మాకేం కాదంటూ ధీమా వ్యక్తం చేశారు. వీరు చెప్పినట్టే స్పెషల్ అబ్జర్వర్ వర్సిటీకి ఫిర్యాదు చేసినా బరితెగించిన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ కమిటీలో రిజిస్ట్రార్ నంద్యాల మెడికల్ కాలేజీలో ఆగస్టులో చోటు చేసుకున్న బరితెగింపు కాపీయింగ్ వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యలకు దిగింది. ఈ ఘటనపై విచారణ కోసం ముగ్గురు అధికారులతో ఓ కమిటీని వేసినట్టు తెలిసింది. ఆ కమిటీలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ ను ఓ విచారణ అధికారిగా నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారితో విచారణ చేపడితే వాస్తవాలు ఎలా వెలుగులోకి వస్తాయని నంద్యాల మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ ప్రశ్నిస్తున్నారు. వైద్య శాఖ ఉన్నతాధికారులే తూతూ మంత్రం విచారణతో సరిపెట్టాలని చూస్తుండటంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని వైద్య విద్య వర్గాల్లోనే విమర్శలు వస్తున్నాయి. -
మత్స్యకార సొసైటీ ఎన్నిక వాయిదాపై ఆందోళన
నక్కపల్లి: పెదతీనార్ల మత్స్యకార సొసైటీ ఎన్నికను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మత్స్యకారులు, గ్రామస్తులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఓడిపోతామనే భయంతోనే పెదతీనార్ల మత్స్యకార సొసైటీ ఎన్నికను వాయిదా వేయించారంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై గ్రామస్తులు మండిపడ్డారు. దాదాపు మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పెదతీనార్ల మెరైన్ ఫిషర్మెన్న్సొసైటీకి ప్రభుత్వం మంగళవారం ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో 547 మంది సభ్యులు ఉన్నారు. వైఎస్సార్సీపీ మద్దతుతో మైలపలి జాన్ అధ్యక్షుడిగా బరిలోకి దిగారు. సొసైటీ సభ్యులంతా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు వైపే ఉన్నారు. చేతులెత్తే పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో కూటమి బలపరిచిన అభ్యర్థులు ఓడిపోతారనే భయం ఉంది. ఈ పరిస్థితిని గమనించిన హోంమంత్రి వంగలపూడి అనిత ఓటమి భయంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి గంట ముందు ఎన్నికను వాయిదా వేయించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆరోపించారు. మంత్రి అండదండలతో కూటమి నాయకులు ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారన్నారు. వాయిదా విషయం తెలుసుకున్న ఆయన, గ్రామంలోకి వెళ్లి వందలాది మంది మత్స్యకారులతో కలిసి ధర్నాకు దిగారు. రోడ్డుపై మూడు గంటల పాటు బైఠాయించారు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ఎన్నిక వాయిదా వేసినట్లు నోటీసులో పేర్కొన్నారన్నారు. ముందుగా తెలియపరచకుండా అప్పటికప్పుడు వాయిదా వేయడం సిగ్గుచేటన్నారు. ఒక గ్రామంలో శాంతి భద్రతలను అదుపుచేయలేని స్థితిలో హోంమంత్రి ఉండటం దారుణమన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మత్స్యకారుల సత్తా చూపిస్తామన్నారు. ఆందోళనలో అభ్యర్థి జాన్, నాయకులు, ముసలయ్య, కొర్లయ్య, తాతారావు పాల్గొన్నారు. త్వరలోనే ఎన్నిక నిర్వహించేందుకు కృషి చేస్తామని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
గర్భిణుల్లో గగుర్పాటు
సాక్షి, అమరావతి: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గర్భిణులు, గర్భస్థ శిశువులు, నవజాత శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధిక వేడి కారణంగా మహిళలు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముందస్తు ప్రసవాలు జరగడం, శిశువు ఎదుగుదలలో లోపాలు వంటివి ఉత్పన్నమవుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బ్రిటన్‌కు చెందిన వెల్కమ్ అనే అంతర్జాతీయ ఆరోగ్య పరిశోధన సంస్థ భారత్, ఆ్రస్టేలియా, బ్రెజిల్, బ్రిటన్, జింబాబ్వే దేశాల్లో ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికను తాజాగా వెల్లడించింది. సర్వేలో మొత్తం వెయ్యి మంది మాతా, శిశు, ఆరోగ్య నిపుణులు పాల్గొన్నట్టు తెలిపింది. సర్వే వివరాలు ఇలా.. గర్భిణుల్లో వేడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు గత ఐదేళ్లలో పెరిగాయని 73 శాతం మంది వైద్య నిపుణులు చెప్పారని వెల్లడించింది. మరో 76 శాతం మంది వైద్యులు గర్భస్థ శిశువులు, నవజాత శిశువుల ఆరోగ్యంపై వేడి ప్రభావం పెరిగిందని తెలిపారని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వైద్య నిపుణుల్లో 98 శాతం మంది తీవ్ర వేడి కారణంగా ఆరోగ్యం దెబ్బతిన్న గర్భిణులకు చికిత్స అందించినట్లు తెలిపారని పేర్కొంది. 99 శాతం మంది వేడి ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న శిశువులను కూడా చూసినట్టు చెప్పారని వెల్లడించింది. గుర్తించిన సమస్యలు ఇవీ అధిక ఉష్ణోగ్రతల కారణంగా మహిళల్లో గర్భధారణ సమస్యలను గుర్తించినట్టు సర్వేలో పాల్గొన్న 23 శాతం మంది నిపుణులు వెల్లడించారు. తక్కువ బరువుతో శిశు జననాలు, శిశువు ఎదుగుదలలో లోపాలు, ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు మరో 34 శాతం మంది నిపుణులు తెలిపారు. ఇక నవజాత శిశువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 36 శాతం మంది వైద్యులు డీహైడ్రేషన్, వేడి కారణంగా అనారోగ్యానికి గురైన శిశువులను చూసినట్టు వెల్లడించారు. మరో 33 శాతం మంది శిశువులు పాలు తాగడంలో, శ్వాస తీసుకోవడంలో, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడంలో ఇబ్బందులు కనిపించాయని తెలిపారు. వైద్యం చేయించుకోవడమూ గగనమే అధిక ఉష్ణోగ్రతల కారణంగా వైద్య సేవలు పొందడం కూడా కష్టమవుతోందని 27 శాతం మంది వైద్య నిపుణులు తెలిపారు. మరో 29 శాతం మంది అత్యవసర వైద్య సేవలను ఆశ్రయించే కేసులు పెరిగాయని చెప్పారు. ప్రతి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలతో ముందస్తు ప్రసవం జరిగే అవకాశాలు సుమారు 5 శాతం పెరుగుతున్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత ముప్పు తీవ్ర వేడి ప్రభావం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 81 శాతం మంది నిపుణులు వచ్చే ఐదేళ్లలో గర్భిణులు, గర్భస్థ శిశువులు, నవజాత శిశువుల ఆరోగ్యానికి తీవ్రమైన వేడి పెద్ద ముప్పుగా మారుతుందని అభిప్రాయపడ్డారు.సూచనలు ఇవీగర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులను జాతీయ వాతావరణ–ఆరోగ్య ప్రణాళికల్లో ప్రత్యేకంగా చేర్చాలని ‘వెల్కమ్’ సంస్థ కోరింది. వేడి తీవ్రతను ముందుగానే హెచ్చరించే వ్యవస్థలు, చల్లటి వాతావరణం కల్పించే సదుపాయాలు, మెరుగైన వైద్య పర్యవేక్షణను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. అలాగే గర్భధారణ, ప్రసవానంతర కాలంలో తీవ్ర వేడి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక వైద్య మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) రూపొందించాలని కోరింది. -
సచివాలయాల సేవలకు కోత
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై కక్షగట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాటి ద్వారా ప్రజలకందే సేవల్లో కోతలు మొదలుపెట్టింది. విద్యార్థులు, రైతులకు ఎక్కువ అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పట్టదారు పాస్‌పుస్తకాలు, నీటితీరువా చెల్లింపు సేవల్ని సచివాలయాల నుంచి దూరం చేసింది. రెవెన్యూశాఖకు సంబంధించి కీలకమైన ఈ నాలుగు సేవలు ప్రజలకు ఎంతో అవసరం. గతంలో ప్రభుత్వాఫీసుల్లో చిన్నపని పడినా గ్రామీణ ప్రాంత ప్రజలు తమ రోజువారీ పనులన్నీ మానుకుని మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రజలకు ఈ ఇబ్బందుల్ని తప్పించి వారి గ్రామాల్లోనే, ఇళ్లవద్దే సేవలు అందించేందుకు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 540కి పైగా ప్రభుత్వ సేవల్ని ఈ సచివాలయాల్లో అందుబాటులో తీసుకొచ్చింది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు దాదాపు 10 కోట్ల సేవలను పొందారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ప్రజలకు ప్రతి సందర్భంలోను ఎక్కువ అవసరం పడే కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల పునఃజారీ (రీ ఇష్యూ), పట్టాదారు పాస్‌బుక్ పునఃముద్రణ (రీ ప్రింట్), రైతుల నీటితీరువా పన్ను చెల్లింపు సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా నిలిపేసింది. సచివాలయాలతోపాటు మీ–సేవ కేంద్రాల్లోను ఆ సేవలు లేకుండా చేసింది. విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలు చదువులకు, ఉద్యోగాలకు, పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు.. గతంలో తమకు మంజూరైన కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల పునఃజారీకి సచివాలయాల్లో దరఖాస్తు చేసి మళ్లీ తీసుకుంటారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఆ సేవల్ని దూరం చేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఊళ్లోనే ప్రజలకు సేవలందించే వ్యవస్థను కనుమరుగు చేసేందుకేనా? ప్రజలకు సొంత ఊళ్లలోనే ఆయా సేవలను అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను క్రమంగా కనుమరుగు చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. అందుకే రెండేళ్లుగా సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు, మంత్రులు విషం చిమ్ముతున్నారన్న విమర్శలున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం గత ప్రభుత్వం ఒకేసారి 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడాన్ని అనవసరంగా చేసినట్లు చంద్రబాబు, మంత్రులు నిందలు వేస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రేషనలైజేషన్ పేరిట ఒక్కో సచివాలయంలో ఉండే ఉద్యోగుల సంఖ్యను కుదించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందే ప్రభుత్వ సేవలను కూడా దూరం చేస్తున్నారు. ఇలా ఒక్కో సేవను దూరం చేస్తూ.. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. చివరికి ఈ వ్యవస్థనే పూర్తిగా నిర్మూలించేదిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న విమర్శలున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు సచివాలయాల్లో అందే ప్రభుత్వ సేవల్లో కోతలు విధించిందన్న చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు సచివాలయ ఉద్యోగులను ఇంటింటి ప్రభుత్వ సర్వేలకు, అధికార పార్టీలకు ఉపయోగపడే ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే రాజకీయ ప్రచార కార్యక్రమాలకే ఎక్కువగా ఉపయోగించుకుంటున్న తీరును ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతూ ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదు
సాక్షి, అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడినే వాడుకొని, తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు అండ్ కో చేసిన కుట్రలు మరోసారి పటాపంచలయ్యాయి. చంద్రబాబు నీచ రాజకీయాల కోసం తిరుమల శ్రీవారినీ వాడుకోవాలన్న కుతంత్రాలకు తెరపడింది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయంటూ నానా రాద్ధాంతం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నం చేసిన చంద్రబాబు, ఆయన బృందం ఆరోపణలన్నీ అవాస్తవాలేనని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి తేటతెల్లం చేసింది. చంద్రబాబు అండ్ కో ఆరోపించిన విధంగా శ్రీవారి లడ్డూలో పంది కొవ్వు, ఇతర జంతువుల కొవ్వులు లేవని నెల్లూరు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ప్రధాన ఛార్జిషీట్లో చెప్పిన సీబీఐ.. ఇదే కోర్టుకు తాజాగా సమర్పించిన అనుబంధ ఛార్జిషీట్‌లోనూ ఇదే విషయం మరోమారు విస్పష్టంగా చెప్పింది. చంద్రబాబు అండ్ కో వైఎస్ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన బురద జల్లేందుకు గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) నివేదిక ఆధారమంటూ చేసిన ప్రచారమంతా అబద్ధమని మరొకసారి సిట్ తేల్చింది. నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ నివేదిక తేటతెల్లం చేసినట్లు అనుబంధ ఛార్జిషీట్లో తేల్చి చెప్పింది.ఏఆర్ డెయిరీకి చెందిన నాలుగు నెయ్యి ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలపై హరియాణాలోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ) ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో కూడా జంతు కొవ్వులేవీ లేవని తేలిందని నివేదించింది. అంతే కాక మైసూర్ సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్‌లో పరీక్షించిన బోలే బాబా డెయిరీ నెయ్యి నమూనాల్లో కూడా జంతు కొవ్వులు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్ సేకరించిన వివరాలతో నెల్లూరు ఏసీబీ కోర్టులో అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో పేర్కొన్న ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్టు జంతువుల కొవ్వు లేదని మైసూరులోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు ప్రధాన చార్జిషీట్లోనూ ఇదే మాట... గతంలో కూడా సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రధాన ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో కూడా లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వులు లేవని తేల్చింది. ఈ వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వులేవి కలవలేదని స్పష్టంగా చెప్పింది.ఎన్డీబీబీ నివేదిక అంటూ చంద్రబాబు రాద్దాంతంచంద్రబాబు, ఆయన గణం.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బురద జల్లేందుకు తిరుమల శ్రీవారినే వాడుకొన్నారు. చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డూలో పంది, ఇతర జంతువుల కొవ్వు కలిపారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. ఇందుకోసం గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) నివేదిక ఆధారం అంటూ ప్రజలను మభ్య పెట్టారు. అయితే అదే ఎన్డీడీబీ 2025లో ఇచ్చిన నివేదికలో లడ్డూ నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని విస్పష్టంగా చెప్పింది. ఈ నివేదికను కూడా సిట్ తన తాజా అనుబంధ ఛార్జిషీట్లో జత చేసి కోర్టు ముందుంచింది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు చేసిన ఆరోపణలన్నీ తప్పుడువేనని, వారంతా చేసింది దుష్ప్రచారమేనని తేలిపోయింది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పన్నిన రాజకీయ కుట్రలో భాగంగా శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని స్పష్టమైంది. -
రోడ్డు నిర్మాణానికి భూములిస్తే మొత్తం భూములు లాక్కుంటారా?
తాడేపల్లి రూరల్: రైతులంతా నష్టపోతున్నప్పటికీ ఉండవల్లి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి భూములిచ్చారని.. ఇప్పుడు ఉండవల్లిలో ఉన్న మిగిలిన భూములను కూడా లాక్కునేందుకు ప్రయత్నిస్తూ ప్రభుత్వం భూ సేకరణ నోటీసులు అందజేసిందని గుంటూరు జిల్లా ఉండవల్లి ప్రాంత రైతులు మండిపడ్డారు. మంగళవారం రాత్రి ఉండవల్లి సెంటర్లో రైతులంతా సమావేశమయ్యారు. అనంతరం రైతు ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనూ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ అధికారులు సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములిస్తే మిగిలిన భూములు వదిలేస్తామని చెప్పారని గుర్తు చేశారు. దీంతో తామంతా నష్టపోతున్నప్పటికీ రోడ్డు నిర్మాణానికి సహకరించి భూములిచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు అదే మంత్రి ఉండవల్లిలో మిగిలిన భూములను కూడా లాక్కునేందుకు ప్రయత్నిస్తూ భూసేకరణ నోటీసులు అందజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉండవల్లిలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎల్ఎఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రిటర్నబుల్ ప్లాట్లు, పంపింగ్ స్కీమ్‌కు భూములు కావాలని చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఉండవల్లి ప్రాంతంలో సారవంతమైన భూములున్నాయని ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములనే కాంక్రీట్ జంగిల్ చేయడానికి ప్రయత్నించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడి రైతులకు 10 సెంట్ల నుంచి అర ఎకరంలోపు భూములున్నాయని చెప్పారు. రాజధాని రాకముందే ఉండవల్లి–పెనుమాక భూముల ధర రూ.కోట్లు పలికాయని, అప్పుడే రైతులెవరూ భూములు అమ్ముకోలేదని చెప్పారు. ఈ భూముల్నే నమ్ముకుని రైతులంతా తమ కుటుంబాలను ఎంతో గౌరవంగా బతికించుకుంటున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి బలవంతపు భూసేకరణ జరిపేందుకు యత్నిస్తూ రైతులను భయభ్రాంతుల్ని చేయడం నిలిపివేయాలన్నారు. గ్రామంలో ఇప్పటివరకు ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదని, పెద్దపెద్ద రోడ్లు వేస్తామంటూ భూ సేకరణకు వెళ్తామని బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే న్యాయస్ధానాన్ని ఆశ్రయించడంతో పాటు ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ నెల 23న ఉండవల్లిలో జరిగే గ్రామసభకు మంత్రి నారా లోకేశ్ హాజరై తమ కష్టాలను వినాలని రైతులు కోరారు. కార్యక్రమంలో మున్నంగి వీర శ్రీధర్‌రెడ్డి, రాజధాని రైతు సంఘం అధ్యక్షుడు కొర్రప్రోలు ఈశ్వర్‌రెడ్డి, రైతు నేతలు దండమూడి సాంబశివరావు, జొన్న శ్రీను, శిగిరిశెట్టి అనంత శివరావు, పల్లపోలు అశోక్‌రెడ్డి, ఆళ్ల శివాంజనేయులు, బుర్రముక్కు పద్మారెడ్డి, గుదిబండ శివశంకర్‌రెడ్డి, పోలిశెట్టి మాణిక్యాలరావు, మున్నంగి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు, పవన్ భేటీ
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఏ ప్రాతిపదికన కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను పంచుకోవాలో చర్చించినట్లు సమాచారం. విశాఖ, విజయవాడ, తిరుపతి కార్పొరేషన్లలో ఎవరు పోటీ చేయాలో కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.తిరుపతి అసెంబ్లీ జనసేన చేతిలో ఉండడంతో ఆ కార్పొరేషన్‌ను కూడా అదే పార్టీకి కేటాయించాలా లేక వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా అనే విషయంపై మంతనాలు జరిపినట్లు సమాచారం. తాము కోరుకుంటున్న కార్పొరేషన్లు, మున్సిపాల్టీల జాబితాను చంద్రబాబుకు పవన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రెండు పార్టీల మధ్య క్షేత్ర స్థాయిలో విభేదాలు పెరుగుతుండడం, స్థానిక ఎన్నికల్లో అవి ఇంకా ముదిరి గొడవలు జరిగే ఆస్కారం ఉండడంతో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అనే విషయంపైనా సమాలోచనలు చేసినట్టు తెలిసింది. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కొంత ఇబ్బంది నెలకొన్నట్లు ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ దూకుడుగా వెళ్లడంతో కూటమి వ్యూహం బయటపడిపోయిందని, దాన్ని సరిదిద్దుకునేందుకు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలిసింది. -
వైఎస్ జగన్‌కు ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకం బహుకరణ
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రచయిత కొత్తపల్లి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని బహుకరించారు.వైఎస్ జగన్ రాజకీయ జీవనయానం, ఆయన ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, నాయకత్వ లక్షణాలను సమగ్రంగా వివరిస్తూ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో రచయితతో పాటు ఆయన సతీమణి లక్ష్మీ రాధ, ఎంవీఎస్ నాగిరెడ్డి, రమేష్, కొవ్వూరి త్రినాథరెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ -
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోకస్ పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఇవాళ(మంగళవారం) సమీక్ష చేపట్టారు. వాటి పరిధిలోని నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, పలు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు హాజరయ్యారు.ఇదీ చదవండి: నాడు గెలిచింది బాబు కాదు.. జగనే -
బంగాళాఖాతంలో మృత సముద్రం
సాక్షి, అమరావతి: అంతులేని సంపదతో లక్షలాది మత్స్యకార కుటుంబాలకు అన్నం పెట్టే బంగాళాఖాతంలో ఒక నిశ్శబ్ద ప్రమాదం ముంచుకొస్తోంది. సముద్ర గర్భంలో ఆక్సిజన్ వేగంగా తగ్గిపోతోంది. కొన్నిచోట్ల అది జీవులు బతకలేని స్థాయికి పడిపోయింది. శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రాంతాలను డెడ్ జోన్‌గా (మృత మండలం) పిలుస్తారు. అలాంటి డెడ్ జోన్ దేశంలోనే తొలిసారి మన రాష్ట్ర తీరంలో బయటపడింది. కేంద్ర భూవిజ్ఞాన శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ (సీఎంఎల్ఆర్ఈ) శాస్త్రవేత్తలు సాగర్ సంపద పరిశోధన నౌక ద్వారా పశి్చమ బంగాళాఖాతాన్ని కొద్ది నెలల క్రితం సర్వే చేశారు. 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద, 300 నుంచి 500 మీటర్ల లోతులో వల వేశారు. అక్కడ ఒక్క చేప కూడా పడలేదు. ఈ ప్రాంతం సరిగ్గా విశాఖపట్నం, కాకినాడ తీరాలకు ఎదురుగా ఉంది. భారత జలాల్లో డెడ్ జోన్ నమోదవడం ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు ప్రకటించారు. గోదావరి ముఖద్వారం వద్ద ఊపిరాడని సముద్రం హైదరాబాద్ విశ్వవిద్యాలయం, విశాఖలోని జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్ఐఓ) శాస్త్రవేత్తలు మరో ఆందోళనకర విషయాన్ని కూడా కనుగొన్నారు. సాధారణంగా బంగాళాఖాతంలో ఆక్సిజన్ కొరత 200 మీటర్ల లోతు దాటిన తర్వాతే ఉంటుంది. కానీ గోదావరి సముద్రంలో కలిసే చోట అక్టోబర్‌లో కేవలం 40 మీటర్ల లోతు నుంచే ఈ పరిస్థితి మొదలవుతోంది. అక్కడ మే నెలలో లీటర్ నీటికి 3 మిల్లీలీటర్లుగా ఉన్న ఆక్సిజన్, అక్టోబర్ నాటికి 0.1 మిల్లీలీటర్లకు పడిపోతోంది. అంటే దాదాపు సున్నా. డెడ్ జోన్ ఎలా ఏర్పడుతుందంటే.. సముద్ర ఉపరితలానికి గాలి నుంచి ఆక్సిజన్ అందుతుంది. అలలు, గాలుల వల్ల అది లోతుల్లోకి చేరుతుంది. కానీ బంగాళాఖాతంలోకి గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల నుంచి భారీగా మంచినీరు వస్తుంది. ఈ నీరు ఉప్పునీటి కంటే తేలికగా ఉండటంతో పైనే నిలిచిపోతుంది. దీంతో పైనున్న ఆక్సిజన్ కింది పొరల్లోకి చేరడం లేదు. నదులు మోసుకొచ్చే పోషకాలతో సముద్రంపై పాచి (నాచు) విపరీతంగా పెరుగుతుంది. అది చనిపోయి అడుగుకు చేరుతుంది. దాన్ని కుళ్లబెట్టే బ్యాక్టీరియా అక్కడ మిగిలిన కొద్దిపాటి ఆక్సిజన్‌ను కూడా పీల్చేస్తుంది. దీనికి తోడు సముద్రం వేడెక్కుతోంది. వేడి నీటిలో ఆక్సిజన్ తక్కువగా కరుగుతుంది. ఇవన్నీ కలిసి సముద్ర గర్భాన్ని ఊపిరాడని ప్రాంతంగా మారుస్తున్నాయి. ఎరువులు, ఆక్వా వ్యర్థాలతో ముప్పు రెట్టింపు గోదావరి, కృష్ణా డెల్టాల్లో లక్షలాది ఎకరాల్లో వరి పొలాలు, ఆక్వా చెరువులు ఉన్నాయి. వాటిలో వాడే రసాయన ఎరువులు, చెరువుల వ్యర్థాలు కాల్వలు, నదుల ద్వారా చివరికి సముద్రంలోకే చేరుతున్నాయి. ఇవన్నీ పాచిని విపరీతంగా పెంచుతాయి. కాకినాడ బే ఇప్పటికే కాలుష్యం, అధిక పోషకాలతో దెబ్బతిన్నట్లు కోరింగ మడ అడవులపై జరిగిన పరిశోధనలు తేల్చాయి. సముద్రంలోకి ఎరువుల ప్రవాహం పెరిగితే అడుగున ఆక్సిజన్ మరింత తగ్గుతుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ప్రపంచంలో మూడో అతిపెద్దది బంగాళాఖాతంలో సుమారు 60 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆక్సిజన్ అతి తక్కువగా ఉన్న మండలం ఉందని 2016లో జర్మనీకి చెందిన మ్యాక్స్ ప్లాంక్ సంస్థ, మన ఎన్ఐఓ సంయుక్త అధ్యయనం గుర్తించింది. అది 100 నుంచి 400 మీటర్ల లోతులో ఉంది. అక్కడి ఆక్సిజన్ సముద్ర ఉపరితలం కంటే 10 వేల రెట్లు తక్కువ. ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆక్సిజన్ కొరత మండలం. అయితే ఇంకా కొద్దిగా ఆక్సిజన్ మిగిలి ఉంది. సముద్రంలోని సుడిగుండాలు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ను నింపుతున్నాయని, అందువల్ల ఇది శాశ్వత మృత మండలంగా మారకపోవచ్చని ఎన్ఐఓ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మత్స్యకారులకు దెబ్బ.. ఆక్సిజన్ లేని చోట చేపలు బతకలేవు. అవి ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోతాయి. లేదా ఆక్సిజన్ ఉన్న పై పొరలకే పరిమితమవుతాయి. దీంతో చేపలు బతికే ప్రాంతం కుంచించుకుపోతుంది. సంప్రదాయ వేట ప్రాంతాల్లో చేపలు దొరక్క మత్స్యకారులు మరింత దూరం వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల డీజిల్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సముద్ర చేపల దిగుబడి ఏటా పడిపోతోంది. చేపలు దొరకని ప్రాంతాలు పెరుగుతుంటే తీర ప్రాంత ఆరి్థక వ్యవస్థే కుదేలయ్యే ప్రమాదం ఉంది.వాతావరణానికీ ముప్పే.. ఆక్సిజన్ పూర్తిగా అయిపోయిన సముద్ర మండలాల్లో నైట్రస్ ఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే దాదాపు 273 రెట్లు ఎక్కువ వేడిని పట్టి ఉంచుతుంది. అరేబియా సముద్రంలో ఇప్పటికే ఇది జరుగుతోంది. బంగాళాఖాతం ఆ అంచున ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నదుల ప్రక్షాళన, ఆక్వా వ్యర్థాలపై నిఘా, ప్రకృతి వ్యవసాయం, సముద్ర ఆరోగ్య పర్యవేక్షణ, సముద్ర తీరాన్ని పంచుకుంటున్న దేశాలు సమన్వయంతో కదిలితేనే ఈ ముప్పును ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. -
కొత్త కమిషనరేట్లకు కష్టాలెన్నో..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ వాటి ఏర్పాటు, నిర్వహణలో సవాళ్లు తప్పవని పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ వర్గాల అభిప్రాయం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరంలో కొత్త కమిషనరేట్లకు ప్రధానంగా సిబ్బంది కొరత, నిధుల సమస్య అవరోధంగా మారనుంది. ఈ కమిషనరేట్లకు సంబంధించి ఐజీ, డీఐజీ స్థాయి అధికారులకు పోలీస్ కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 14 (6) ప్రకారం పోలీస్ కమిషనర్లకు ఎగ్జిక్యూటివ్ మేజిస్టీరియల్ అధికారాలు కల్పించాలని నిర్ణయించింది. వాటి పరిధిలో ప్రస్తుతం ఉన్న సిబ్బందినే పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకోవడంతోపాటు మౌలిక వసతులు, నిర్వహణకు నిధులు కేటాయింపు అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఖాకీలకు విధులు కత్తిమీద సాముగా మారే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు. సిబ్బందిపై తీవ్ర పని ఒత్తిడి కొత్త కమిషనరేట్లలో ప్రత్యేక నేర పరిశోధన విభాగాలు, ట్రాఫిక్ విభాగాలు, మహిళా పోలీస్ స్టేషన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఐటీ విభాగాలు, క్లూస్ టీమ్‌లు, వేలిముద్రల విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే వీటికి అవసరమైన అదనపు పోస్టుల మంజూరు ప్రతిపాదన లేదు. ప్రస్తుతం ఉన్న పోలీసు సిబ్బందిని కొత్త విభాగాలకు కేటాయించి సర్ధుబాటు చేయాలని ప్రతిపాదించారు. అలాంటప్పుడు పోలీస్ స్టేషన్లలో రోజువారీ విధులు, పెట్రోలింగ్, నేరాల దర్యాప్తు, కోర్టు విధులు, బందోబస్తు వంటి బాధ్యతలను నిర్వర్తించేందుకు తగినంత మంది అందుబాటులో లేక... ప్రస్తుత సిబ్బంది తీవ్ర ఒత్తిడితో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రత్యేక విభాగాలకు సిబ్బందిని కేటాయించడంతోపాటు సాధారణ పోలీసింగ్ సామర్థ్యం తగ్గకుండా చూడటం కొత్త కమిషనరేట్ల ముందున్న ప్రధాన సవాలు. అదనపు నిధులు లేకుండా ఆధునికీకరణ ఎలా? కొత్త కమిషనరేట్ల ఏర్పాటుకు అదనపు ఆర్థిక భారం ఉండదని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బడ్జెట్ కేటాయింపులతోనే పరిపాలనా మార్పులు చేపట్టాలని సూచించారు. అదనపు నిధులు లేకుండా కమిషనరేట్ల ఆధునికీకరణ ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఐటీ విభాగాలు, నేర పరిశోధనకు అవసరమైన సాంకేతిక సదుపాయాలను ఏ విధంగా సమకూరుస్తారనే వివరాలు ప్రతిపాదనల్లో స్పష్టంగా లేకపోవడం శోచనీయం. ఇప్పటికే అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించడం ద్వారా ఎంతవరకు అవసరాలను తీర్చవచ్చు? కొత్తగా అవసరమయ్యే పరికరాలు, శిక్షణ, నిర్వహణ వ్యయాలకు ఏ బడ్జెట్ నుంచి నిధులు కేటాయిస్తారు? వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కర్నూలులో సైబర్ నేరాల ఉధృతి కట్టడి ఎలా? కొత్త కమిషనరేట్ల ఏర్పాటుకు సమర్పించిన నివేదికలో కర్నూలు సైబర్ నేరాల గణాంకాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. 2022లో 118 సైబర్ కేసులు మాత్రమే నమోదుకాగా, 2025 నాటికి ఈ సంఖ్య ఏకంగా 2,729కు చేరింది. ఇంత భారీ స్థాయిలో సైబర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు విభాగాలు, సాంకేతిక నిపుణులు, డిజిటల్ ఫోరెన్సిక్ సదుపాయాల ప్రస్తావన లేకుండానే కర్నూలు కమిషనరేట్ పరిధిలో మొత్తం 38 పోలీస్ స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు ఖరారు చేయడం గమనార్హం. తిరుమల నుంచి శ్రీసిటీ వరకు విభిన్న సవాళ్లు తిరుపతి కమిషనరేట్ పరిధిలో నాలుగు జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదన ప్రకారం మొత్తం 49 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. తిరుమల భక్తుల భద్రత, తిరుపతి నగర ట్రాఫిక్, రేణిగుంట విమానాశ్రయం, శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతం వంటి విభిన్న అవసరాలను ఒకే కమిషనరేట్ పరిధిలో సమన్వయం చేయడం అత్యంత క్లిష్టంగా మారనుంది. 2025లో ఈ ప్రాంతంలో 10,094 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మహిళలపై నేరాలు 725 కేసులు, రోడ్డు ప్రమాదాలు 1,196 కేసులు నమోదైనట్లు పోలీస్ నివేదికలో వెల్లడించడం గమనార్హం.రాజధాని ప్రత్యేక జోన్‌గా భద్రతా బలగాలేవి? గుంటూరు కమిషనరేట్‌లో అమరావతి రాజధాని ప్రాంతానికి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు నగరం, గ్రామీణ ప్రాంతం, అమరావతి, తెనాలి కేంద్రాలుగా నాలుగు జోన్లు ఉంటాయి. గుంటూరు ప్రతిపాదిత కమిషనరేట్ పరిధిలో 2025లో 11,214 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. హత్య కేసులు 2022లో 37 ఉండగా 2025లో 55కు పెరిగాయి. ఆర్థిక నేరాలు 2024లో 49 ఉండగా 2025లో 207కు పెరిగాయి.ఈ నేపథ్యంలో భద్రతా బలగాల కొరతపై చర్చ సాగుతోంది. రాజమహేంద్రవరం పరిధిలో రోడ్డు ప్రమాదాలపై దృష్టి ఏది? రాజమహేంద్రవరం కమిషనరేట్ పరిధిలో మూడు జోన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదనల్లో మొత్తం 30 పోలీసు స్టేషన్లను చేర్చారు. కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, మండపేట తదితర ప్రాంతాలు ఈ వ్యవస్థ పరిధిలో ఉంటాయి. 2025లో ఈ ప్రాంతంలో 7,685 ఎఫ్ఐఆర్లు, 802 మహిళలపై నేరాల కేసులు, 914 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం పరిధిలో ఎక్కువగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే అంశాన్ని విస్మరించారు. -
‘జల’జలా అబద్ధాలు
సాక్షి, అమరావతి: ధారాళంగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు తనకు తానే సాటి అన్నది జగమెరిగిన సత్యం. తాజాగా జల్‌జీవన్–అమరజీవి జలధార పనుల ప్రారంభం సందర్భంగా సోమవారం ప్రొద్దుటూరులోనూ ఆయన అన్నీ అసత్యాలే వల్లెవేశారు. గత ప్రభుత్వంలో ‘నీళ్లు లేవు.. రోడ్లు లేవు’ అంటూ నిజాలకు పాతరేశారు. వాస్తవానికి రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఎప్పటి నుంచో రక్షిత మంచినీటి పథకాలు, ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి రక్షిత నీటి సరఫరా జరుగుతోంది. అయినా చంద్రబాబు తాను వచ్చిన తర్వాతే గ్రామాల్లో తాగునీటి పథకాలు నిర్మిస్తున్నట్టు గొప్పలుపోవడంపై అధికారులతోపాటు ప్రజలూ విస్తుపోయారు.గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 95 లక్షల ఇళ్లు ఉండగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో 39.34 లక్షల ఇళ్లకు కొత్తగా మంచినీటి కుళాయిలు అమర్చింది. అంతకు ముందు 60 ఏళ్ల కాలంలో 30 లక్షల ఇళ్లకు కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి 27 లక్షల ఇళ్లకు నీటి కుళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, గత రెండేళ్ల నాలుగు నెలల కాలంలో కేవలం 2.70 లక్షల ఇళ్లకూ నీటి కుళాయిలను చంద్రబాబు సమకూర్చలేదు. తాజాగా ‘జల్‌జీవన్‌మిషన్–అమరజీవి జలధార’ కార్యకమానికి రాబోయే రెండేళ్లలో రూ.30,156 కోట్లను ఖర్చు పెట్టి ఇంటింటికీ తాగునీరు అందించే బాధ్యత తనదంటూ కోతలు కోసి నవ్వులపాలయ్యారు. వాస్తవానికి గతంలోనే రాష్ట్రంలోని గ్రామాల్లో ఉండే ప్రతి వ్యక్తికి రోజుకు గరిష్టంగా 40 లీటర్ల చొప్పున నీళ్లు అందించేలా రక్షిత తాగునీటి పథకాల నిర్మాణం జరిగితే, 2019లో కేంద్రం జలజీవన్‌మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున నీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.26,823 కోట్ల పాత పథకాలకు అదనంగా అవసరమైన చోట కొత్త పథకాల నిర్మాణంతోపాటు ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆయా పథకాలకు వేసవిలోనూ నీరు పుష్కలంగా సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టింది. అప్పటికి ఉన్న 13 జిల్లాల్లో ఉద్దానం సహా 9 జిల్లాల్లో నదీ రిజర్వాయర్ల నుంచి నేరుగా నీరు సరఫరా అయ్యేలా సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకూ రూపకల్పన చేసింది.అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం రూ.84 వేల కోట్లతో కొత్త జిల్లాల ప్రాతిపదికన 64 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను చేపడతామంటూ ప్రగల్భాలుపలికింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో దాదాపు సగానికి పైగా రద్దు చేసింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత రూ.84 వేల కోట్ల ప్రతి పాదనలను పక్కనబెట్టి గతంలో రద్దుచేసిన పథకాల స్థానంలో కొత్తగా మంజూరు చేసినట్టు చూపించి వాటితో కలిపి మొత్తం కేవలం రూ.30,156 కోట్లతో పథకాల నిర్మాణానికి పరిమితమైంది. దీంతో చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చంద్రబాబు చెప్పిన మరికొన్ని అబద్ధాలు ఇలా..చంద్రబాబు: కల్తీలేని మద్యం అమ్ముతున్నాం. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా. మాములు ఎమ్మార్పీ కన్నా ఒక్క పైసా ఎక్కువ ఇవ్వొద్దు. ఎవరైనా అడిగితే కొరడా తీసుకునే బాధ్యత నాది. వాస్తవం: ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి తూట్లు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో ఊరూవాడా మద్యాన్ని ఏరులా పారిస్తోంది. మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి, ఎమ్మార్పీ కన్నా అధికంగా అమ్మకాలు సాగిస్తోంది. ఊరూరా ప్రతికాలనీలోనూ బెల్టుషాపుల ద్వారా తీవ్ర దోపిడీకి తెగబడుతోంది. చివరకు సీఎం ప్రొద్దుటూరు సభకు వచ్చే జనాలకూ బస్సులో మద్యం సీసాలు పంచి అభాసుపాలైంది. చంద్రబాబు: ఎవరైనా ఇసుకలో ఇన్వాల్వ్ అయితే, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. ఉచిత ఇసుక మీ హక్కు.. దానికి విఘాతం కల్పిస్తే చర్యలు తీసుకుంటాం. వాస్తవం: ఉచిత ఇసుక ముసుగులో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు నదులను చెరబట్టి అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉన్న ఉండవల్లిలోని అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలోనే ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తూ ప్రజలను దోచేస్తున్నారు. ఇసుక స్మగ్లర్ల ఆగడాలపై ఎన్జీటీలో రైతులు, ప్రజలు అనేక కేసులు వేయడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు: సేవలన్నీ ఫోన్ ద్వారానే అందిస్తున్నాం వాస్తవం: వాస్తవానికి ఫోన్ ద్వారా సేవలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీజం పడింది. పథకాలను ప్రజల గడపవద్దకే వలంటీర్ల ద్వారా చేర్చింది. ఏ సమస్య ఉన్నా.. సత్వర పరిష్కారం చూపింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడింది. పథకాల దరఖాస్తుకు ప్రజలు నానా ఇబ్బందులు పడేలా చేసింది. రెండేళ్ల మూడు నెలల వరకు పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించకుండా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఉసురుపోసుకుంది. ఇటీవలే పింఛన్ల దరఖాస్తుకు అనుమతిచ్చినట్టే ఇచ్చి వెబ్ పోర్టల్‌ను 9 రోజుల్లోనే నిలిపివేసింది. దరఖాస్తు కోసం సచివాలయాల చుట్టూ తిరిగిన అవ్వాతాతలు, ఇతర లబి్ధదారులు గంటల తరబడి క్యూలో నిలబడి అవస్థలు పడ్డారు. చివరకు చాలామంది దరఖాస్తు చేసుకోలేక తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. చంద్రబాబు: రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు ఖర్చు చేశాం. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం చేసి జలహారతి ఇచ్చాం. వాస్తవం: సాగునీటి ప్రాజెక్టు పనుల్లో అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఈ అవినీతికి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశ కాలువ లైనింగ్, పోలవరం ఎడమ కాలువలో మిగిలిన పనులు, వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులే నిదర్శనం. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, కుప్పం బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.3,850 కోట్లు వ్యయం చేశామని బాబు గొప్పలు చెబుతున్నారు.కానీ.. లైనింగ్ పనులు అత్యంత నాసిరకంగా చేయడం వల్ల 2025లో లైనింగ్ దెబ్బతిని కొట్టుకుపోయింది. లైనింగ్ పనుల వల్ల లబ్ధి జరిగింది ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘు(ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్), సీఎం రమేష్(రితి్వక్ ప్రాజెక్ట్స్), కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని, సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు, రంగరాజు ఎండీగా ఉన్న ఎన్సీసీ మాత్రమే. లైనింగ్ వల్ల భూగర్బజలాలు అడుగంటిపోయి వేలాది బోర్లు ఎండిపోవడంతో రైతులు జీవనాధారం కోల్పోయిన దుస్థితి నెలకొంది. -
వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెబాట
సాక్షి, అమరావతి: వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె బాటలోకి వెళ్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించలేమని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో సమ్మె చేయాలని వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) నిర్ణయించింది. దీనిలో భాగంగా వైద్యశాఖ పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారామెడికల్ సిబ్బంది మంగళవారం సాధారణ వైద్య సేవలను బహిష్కరించి నిరసన తెలుపనున్నారు. ఇక బుధవారం నుంచి అత్యవసర సేవలనూ బహిష్కరించి సమ్మె చేయనున్నట్టు జేఏసీ ప్రకటించింది.సమ్మె కార్యాచరణలో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ధర్నా చౌక్‌లలో టెంట్లు వేసి ఆందోళనలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వైద్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్, సెకండరీ హెల్త్, డీఎంఈ పరిధిలో మొత్తం 14,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. సమస్యల పరిష్కారం వీలుపడదు ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీస్ ఇవ్వడంతో సోమవారం సచివాలయంలో వైద్యశాఖ కార్యదర్శి వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ చక్రధర్‌బాబు, ఇతర అధికారులు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు విఫలమైనట్టు జేఏసీ అధ్యక్షుడు కోటేశ్వరరావు, కన్వీనర్ అజయ్‌కుమార్ తెలిపారు. దీంతో సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించే పరిస్థితి లేదని చర్చల సందర్భంగా అధికారులు చెప్పినట్టు సమాచారం.కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవి..⇒ అర్హులైన ఉద్యోగుల సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేయాలి. ⇒ రెగ్యులరైజ్ చేసే వరకు పే+డీఏ+హెచ్ఆర్ఏ కలిపి వంద శాతం గ్రాస్ వేతనం పునరుద్ధరించాలి. ⇒ అమలులోకి వచ్చిన వేతన తగ్గింపును సమీక్షించాలి. ⇒ భవిష్యత్‌లో వైద్య శాఖలో ఏర్పడే ఖాళీలను రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. ⇒ పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, నిర్థిష్ట కాలపరిమితిలో నిర్ణయం తీసుకోవాలి.⇒ విధుల్లో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం అందించాలి. ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ⇒ పరస్పర, స్పౌజ్ కోటా బదిలీలకు అవకాశం కల్పించాలి. ⇒ శాశ్వత ఉద్యోగులకు ఇచ్చినట్లే కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెయిడ్ సిక్ లీవ్స్, ఈహెచ్ఎస్ కార్డులు మంజూరు చేయాలి. -
సీఎం చంద్రబాబు ఈవెంట్స్‌కు మరో రూ.10.59 కోట్లు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ పనులకు భారీగా ఖర్చు చేస్తున్నారు. జిల్లాల్లో సీఎం కార్యక్రమాలను మాన్ డెకరేటర్స్ నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.44.62 కోట్లు ఖర్చయిందని, ఇందులో 50 శాతం బకాయిలను చెల్లించాలని ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఆర్థిక శాఖ రూ.22.31 కోట్ల అదనపు నిధులను విడుదల చేసింది. ఇందులో గత నెలలో అయిన ఖర్చు రూ.11.71 కోట్లు చెల్లించేందుకు పరిపాలన అనుమతి ఇస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది.మరో రూ.10.59 కోట్లు చెల్లించేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. దీంతో సీఎం ఈవెంట్లకు ఇప్పటివరకు రూ.22.31 కోట్లు చెల్లించారు. ఈ ఖర్చును ప్రముఖుల ప్రోటోకాల్ వ్యయం ఖాతా కింద విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ చెల్లింపులు ‘షెడ్యూల్ ఆఫ్ రేట్స్’ ఖరారు, చర్చలకు లోబడి జరగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.డీడీవోలందరూ ఆర్థిక శాఖ సూచనల ప్రకారం అడ్వాన్సులు ఇచ్చి ఉంటే వాటిని ధృవీకరించుకుని, మాన్ డెకరేటర్లకు మంజూరైన బడ్జెట్‌ను రూపొందించి, పంపిణీకి అనుమతించాలని పేర్కొన్నారు. పొరపాటున అదనంగా విడుదల చేసిన మొత్తాలంటే, వాటిని ఎటువంటి నోటీసు లేకుండా ఏజెన్సీకి చెల్లించవలసిన మిగిలిన మొత్తాల నుంచి వసూలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
చట్టం చేస్తారా లేదా?
తమిళనాడు రాష్ట్రం మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ 31బీ ప్రకారం సంబంధిత చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈ నెల 28వ తేదీ డెడ్‌లైన్.. ఇదే చివరి అవకాశం. ఆ లోగా చెప్పాల్సిందే. – చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: బీసీలకు దక్కాల్సిన న్యాయమైన రిజర్వేషన్లను కేవలం కాగితాలకే పరిమితం చేస్తూ చట్టం ముందు చెల్లుబాటు కాని జీవోలను తెచ్చి బీసీలను వంచిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. తమిళనాడు రాష్ట్రం మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ 31బీ ప్రకారం సంబంధిత చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఏపీ విభాగం గౌరవాధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు 2025లో దాఖలు చేసిన పిటిషన్లో ఏడాదికాలంగా సమాధానం ఇవ్వకుండా వాయిదాలు కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తోంది. కానీ ఇక జీవోలతో కాలయాపన కాకుండా.. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తారా? లేదా? అన్నది తేల్చాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీనిపై కౌంటర్ దాఖలుకు ఈనెల 28 వరకు హైకోర్టు డెడ్‌లైన్ విధించింది. కౌంటర్ దాఖలుకు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పేసింది. దీంతో ప్రభుత్వం ఖంగుతిన్నది. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తాజా ఆదేశం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఇక సుప్రీంకోర్టులో పోరాటం పేరుతో తప్పించుకోవడం సాధ్యం కాదు. బీసీలకు శాశ్వత రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకొస్తారా? లేదా? అన్నది తేల్చాల్సిందే. బీసీలు అడుగుతున్నట్లు జీవోలు కాదు.. చట్టం కావాలి. హామీలు కాదు.. రాజ్యాంగ రక్షణ కావాలి. చట్టం చేస్తారా లేదా చెప్పాల్సిందే.. ఇంతకాలం ఈ కీలక అంశానికి సమాధానం ఇవ్వకుండా అటు బీసీలను, ఇటు కోర్టును తప్పుదోవ పట్టిస్తూ, చెల్లని జీవోలతో 34 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం శరాఘాతమనే చెప్పాలి. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు తన వైఖరిని బయటపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం తెస్తారా? లేదా? అన్న దానిపై స్పష్టతనివ్వాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచి్చన జీవోలను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు తాజా ఆదేశం ఊహించని పరిణామమే. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడం ఖాయమని తెలిసినా న్యాయ పోరాటం అంటూ బాబు డ్రామాను రక్తికట్టిస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం ఇష్టం లేని బాబు చట్టం తెచ్చే అవకాశమే లేదని టీడీపీలోని బీసీ నేతలే ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారు. తూతూ మంత్రంగా కమిషన్.. రహస్యంగా నివేదికబీసీల కోసం ఏదో చేస్తున్నామనే రీతిలో రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇక్కడే తన వక్రబుద్ధిని బయటపెట్టింది. సమగ్ర కుటుంబ సర్వే చేయించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా అంతర్గతంగా కమిషన్‌ను అడ్డుకుంది. ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు సేకరించి, వాటి ఆధారంగా బీసీ జనాభా, వెనుకబాటుతనాన్ని లెక్కించాల్సిన కమిషన్... ఆ పని చేయకుండా, ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ప్రణాళిక విభాగం సేకరించిన గణాంకాలపై ఆధారపడింది.ఆ గణాంకాలనే తీసుకుని, తామే క్షేత్రస్థాయిలో వాటిని సేకరించినట్లు కలరింగ్ ఇచ్చింది. సమగ్ర సర్వే ఏదీ చేయకపోయినా కూడా ఏదో చేసినట్లు ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచింది. ఈ నివేదికను రహస్యంగా ఉంచింది. దానిని హైకోర్టు అడిగినా బహిర్గతం చేయలేదు. అందులో రహస్యం ఏముందని నిలదీయడంతో హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చింది. రహస్యంగా ఉంచడంతో ప్రభుత్వంపై ప్రజలకు పలు అనుమానాలొచ్చాయి. క్యాబినెట్ ఆమోదించని నివేదికతో బీసీ రిజర్వేషన్లా? విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం కీలక ప్రశ్నను సంధించింది. అసలు రాజీవ్ రంజన్ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకునే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించారా? అని ప్రశి్నంచింది. కమిషన్ మొత్తం నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని, కొంత భాగాన్నే తీసుకున్నామని ప్రభుత్వం చెప్పింది. పైపెచ్చు సదరు కమిషన్ నివేదికను ఇంకా ఆమోదించలేదని చెప్పింది. మరి మొత్తం నివేదికను కాకుండా కొంత నివేదికనే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు? క్యాబినెట్ ఆమోదించని నివేదిక ఆధారంగా బీసీలకు చాలీచాలని రిజర్వేషన్లు ఎందుకు ఇచి్చనట్లు? దీనికి ప్రభుత్వం వద్ద సమాధానమే లేదు. డొల్ల కమిషన్ అని తేల్చిన ధర్మాసనంబీసీల సాధికారిత విషయంలో చిత్తశుద్ది ఉంటే, చంద్రబాబు ఆ కమిషన్ నివేదికను బహిర్గతం చేసి, దానిపై మేధావుల నుంచి అభిప్రాయాలను తీసుకుని ఉండేవారు. కమిషన్ నివేదిక ఆధారంగా చట్టం చేసి కేంద్రానికి పంపేవారు. కేంద్రంలో తనకున్న పలుకుబడితో దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి ఉండేవారు. అయితే చంద్రబాబు ఇదేమీ చేయకుండా చెల్లని జీవోలను తెచ్చి బీసీలను వంచించారు. అంతే కాదు, బీసీ రిజర్వేషన్ల కల్పనకు రాజీవ్ రంజన్ కమిషన్ వద్ద ఎలాంటి డేటా లేదని హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో తేల్చి చెప్పింది. దీంతో ఆ కమిషన్ డొల్ల కమిషన్ అని తేలిపోయింది. హైకోర్టు ఆక్షేపించినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ డొల్ల కమిషన్ గడువును మళ్లీ పొడిగించింది. ప్రభుత్వం సాంకేతిక అభ్యంతరాలుబీసీ రిజర్వేషన్ల విషయంలో వాస్తవాలు కోర్టు ముందుంచేందుకు పిటిషన్లు దాఖలు చేసిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఎదురు దాడి చేసింది. బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టపరంగా ఇప్పటి వరకు ఏం చేస్తున్నారన్న దానిపై హైకోర్టు ఎక్కడ ప్రశి్నస్తుందో.. అందుకు తామెక్కడ వాస్తవం చెప్పాల్సి వస్తుందోనన్న ఉద్దేశంతో పిటిషనర్ల అర్హతలపై ప్రభుత్వం సాంకేతిక అభ్యంతరాలను లేవనెత్తింది. ముఖ్యంగా చట్టపరమైన ఇబ్బందులను అధిగమించి బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా కల్పించాలన్న దానిపై హైకోర్టుకు సహకరించేందుకు వచ్చిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, జాతీయ బీసీ కమిషన్ పూర్వ చైర్మన్, ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగల ఈశ్వరయ్యను లక్ష్యంగా చేసుకుంది.సామాజిక–ఆర్థిక సంక్షేమ చర్యల కోసం సామాజికంగా వెనుకబడిన తరగతుల జాబితాను రూపొందించి నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఏపీ విభాగం గౌరవాధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు 2025లో దాఖలు చేసిన వ్యాజ్యంలో తనను రెండో పిటిషనర్‌గా చేర్చుకుని వాదనలు వినాలని హైకోర్టును ఈశ్వరయ్య కోరితే, దాన్ని ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అనుబంధ పిటిషన్ దాఖలుపై ఈశ్వరయ్య అర్హతలు ప్రశి్నంచిన ప్రభుత్వం, ఆయన పిటిషనర్‌గా చేరితే తమకు వచి్చన నష్టం ఏంటో కోర్టుకు చెప్పలేదు. బీసీల విషయంలో జాతీయ స్థాయిలో పోరాటాలు చేస్తున్న ఈశ్వరయ్య తాను కోర్టు ముందు వాస్తవాలను ఉంచేందుకే వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు. బాబు మోసాలను బయటపెడతారనే.. గత విచారణ సమయంలో ఈశ్వరయ్యపై ఓ ప్రభుత్వ న్యాయవాది దురుసుగా మాట్లాడారు. బీసీల విషయంలో చంద్రబాబు మోసాలను బయటపెడుతున్న ఈశ్వరయ్య కోర్టులో కూడా ఎక్కడ వాటిని బయటపెడతారోనని భయపడుతోంది. అయితే పలు అంశాలపై న్యాయస్థానం లేవనెత్తిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. దీంతో చివరకు న్యాయస్థానం ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ దాఖలు చేసిన వ్యాజ్యంలో జోక్యానికి సముఖత వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్రం మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ 31బీ ప్రకారం సంబంధిత చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కీలక ఉత్తర్వులిచ్చింది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లకు ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తమిళనాడు తరహాలోనే స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి అవకాశాల్లో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అందుకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా తెలియచేయాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే ఆరుసార్లు సమయం తీసుకున్న నేపథ్యంలో కౌంటర్ దాఖలుకు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. ఆర్టీకల్ 342ఏ(3)ను అమలుచేయాలి రాజ్యాంగంలోని ఆర్టీకల్ 342ఏ(3) ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర సామాజిక–ఆర్థిక సంక్షేమ చర్యల కోసం సామాజికంగా వెనుకబడిన తరగతుల జాబితాను రూపొందించి నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఏపీ విభాగం గౌరవాధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023లో ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేను వెంటనే పూర్తి చేసి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఆ సర్వే ఫలితాలను వీలైనంత త్వరగా ప్రచురించాలని ఆయన తన వ్యాజ్యంలో కోర్టును కోరారు.అంతేకాక తమిళనాడు మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ ఆర్టీకల్ 31బి ప్రకారం సంబంధిత చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడానికి సత్వర చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే.కాగా, ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, అఖిల భారత వెనుకబడిన తరగతుల ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగల ఈశ్వరయ్య ఇటీవల ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. బీసీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేస్తోందని పేర్కొన్నారు. అయితే ఈ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తాజాగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఇదేనా సర్కార్ చిత్తశుద్ధి ‘‘కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే కోర్టు ఆరుసార్లు సమయం ఇచ్చింది. ,అయినా కూడా ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదు. బీసీల విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇది తెలియచేస్తోంది. మేము దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈశ్వరయ్య రెండో పిటిషనర్‌గా చేరితే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. అయినా కూడా ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం విస్మయపరుస్తోంది’’. – పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలుచట్టం చేయడం మినహా మరో మార్గం లేదుబీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు దక్కాలంటే చట్టం చేయడం మినహా మరో మార్గం లేదు. చట్టాలు చేసేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం ఎప్పుడో వెసులుబాటునిచ్చింది. ఇటీవలి ధర్మాసనం ఉమ్మడి తీర్పు కేవలం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకే పరిమితమైంది. ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలకు, నా ఈ వ్యాజ్యానికి ఏ మాత్రం సంబంధం లేదు. కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మాత్రమే కోరడం లేదు. విద్యా, ఉపాధి అవకాశాల్లో కూడా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కోరుతున్నాం. అంతేకాక ప్రభుత్వం ఏర్పాటుచేసిన డెడికేటెడ్ కమిషన్ వద్ద ఎలాంటి డేటా లేదని ఇటీవలి ఉమ్మడి తీర్పులో ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.అసలు డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. బీసీల వెనుకబాటుతనంపై అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించకుండా చట్ట ప్రకారం చెల్లని విధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇంటింటికెళ్లి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తేనే బీసీ లెక్కలు తేలతాయి. తెలంగాణలో కూడా ఇలాగే చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. నేను జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా మూడేళ్ల పాటు పనిచేశాను.బీసీల వెనుకబాటుతనం, స్థితిగతులతో పాటు చట్టపరమైన అంశాలపై చాలా అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో కోర్టుకు వాస్తవాలు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యంలో రెండో పిటిషనర్‌గా చేరాలని నిర్ణయించుకున్నాను. దీనిని కూడా ప్రభుత్వం వ్యతిరేకించడం దురదృష్టకరం. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు. బీసీల సంక్షేమ కోసమే పోరాటం చేస్తున్నాను. చట్టం చేసి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఓబీసీలకు తమిళనాడు తరహాలోనే స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి అవకాశాల్లో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నాం. చట్టం చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందో అర్థం కావడం లేదు. – సీనియర్ న్యాయవాది వంగల ఈశ్వరయ్య వాదనలు -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఆధారంగా చేసుకుని సీనియర్ రచయిత కొత్తపల్లి శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ‘స్థితప్రజ్ఞుడు’ పేరుతో వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో అభినందనీయం. రాజకీయ నాయకుడిగా ఆయన ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రజలతో ఏర్పరచుకున్న విడదీయరాని అనుబంధాన్ని భావితరాలకు అందించేందుకు ఈ పుస్తకం దోహదపడుతుంది.రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురైనప్పటికీ, వాటన్నింటిని ఎదుర్కొంటూ వైఎస్ జగన్ స్థిర చిత్తంతో ముందుకు సాగిన తీరు అద్భుతం. ఆయన రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలను ఒకేచోట చేర్చి పాఠకులకు అందించిన రచయిత ప్రయత్నం ప్రశంసనీయమని సజ్జల కొనియాడారు. ఇదీ చదవండి: పార్టీని వీడిన వారికి ప్రజలే బుద్ది చెబుతారు: వైఎస్సార్సీపీ నేతలు -
ముద్రగడ అంత్యక్రియల వివాదం.. అంబటి రాంబాబుపై కేసు
సాక్షి,విజయవాడ: దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వివాదం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8వ తేదీన కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు వచ్చి విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు.ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులు అధికార లాంఛనాలు వద్దని ముందే స్పష్టం చేశారు. అయినప్పటికీ, పోలీసులు నిబంధనల పేరుతో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు.పోలీసుల తీరును మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు ముద్రగడ అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించి, వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై అంబటి రాంబాబుతో పాటు మరికొందరు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ల ‘సామూహిక’ ధర్నాతో విజయవాడలో హైటెన్షన్
సాక్షి, విజయవాడ: సామూహిక రాయబారం పేరుతో విజయవాడ పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నాకు దిగారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో విజయవాడకు తరలివస్తున్నారు. దీంతో పంచాయతీ కమిషనర్ కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సామూహికంగా తరలివచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, తమ వేతనాలను పెంచాలని వారు కోరుతున్నారు. అలాగే ఉద్యోగ భద్రతకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ప్రాంతాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు విజయవాడకు చేరుకుంటుండటంతో కార్యాలయం పరిసరాల్లో సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ఒకే చోటకు చేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ధర్నాకు అనుమతులు, ఆందోళనకారుల రాకపోకలు, కార్యాలయం వద్ద పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు.పెండింగ్ బకాయిల విడుదల, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత.. మూడు ప్రధాన డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకోవడంతో పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉత్కంఠగా మారింది. పోలీసుల భారీ మోహరింపుతో అక్కడ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.ఇదీ చదవండి: బుర్రిపాలెంలో అసత్య హరి‘చంద్రుడు’ -
'బుర్రిపాలెం'లో బాబు బుర్రకథలు!
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లె వేశారు. సూపర్ సిక్స్‌లు, ఇతర హామీలు అమలు చేయకుండా తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పచ్చి అబద్ధాలను నిత్యం ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా బుర్రిపాలెం వేదికగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ పథకాన్ని భ్రషు్టపట్టించారంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓసారి పరిశీలిస్తే చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని స్పష్టం అవుతుంది. బాబు: వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య గృహ నిర్మాణ పథకాన్ని భ్రష్టుపట్టించారు. వాస్తవం: రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడం కోసం వైఎస్సార్సీపీ హయాంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఏకంగా 31 లక్షల మందికిపైగా మహిళల పేరిట ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. నాడు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువే రూ.76 వేల కోట్లకు పైగా ఉంటుంది. ఇలా రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా గృహ నిర్మాణ పథకంలో నూతన శకాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. బాబు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 5.5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చాం. వాస్తవం: గత ప్రభుత్వంలో పేదలకు 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పాటు 21 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేశారు. 2024 ఎన్నికల నాటికే 9 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చేశారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కాగా, ఆ ఇళ్లనే తాను నిర్మించి పేదలకు ఇచ్చినట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. బాబు: 2029 నాటికి పేదలందరికీ ఇళ్లు సమకూరుస్తాం వాస్తవం: పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు ఇచ్చి, ఇళ్లు కూడా నిర్మిస్తామని చంద్రబాబు 2024 ఎన్నికల్లో మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు. గద్దెనెక్కి రెండున్నరేళ్లు కావస్తున్నా నేటికీ పేదలకు గజం స్థలం కూడా మంజూరు చేయలేదు. గజం స్థలం సేకరించి పేదలకు పంపిణీ చేయకుండానే ఏకంగా రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు ఇచ్చేశామంటూ చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. విశాఖ, విజయవాడ, మంగళగిరి మరికొన్ని ప్రాంతాలలో కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించి దాన్నే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. -
అందరికీ ఇళ్లు ఇస్తాం
తెనాలి/సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ నాయకత్వంలో తాను, పవన్‌కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గ్రామీణ్ 2.0 పథకం కింద రాష్ట్రంలో చేపట్టే ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా సీఎం ప్రారంభించారు. 175 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పేదలకు పట్టాభిషేకం పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. 60–70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పేదల సమస్యలను పరిష్కరిస్తున్నామని విశాఖ, విజయవాడ, మంగళగిరిల్లో పైసా ఖర్చు లేకుండా 60 వేలమంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చామని చెప్పారు. వీటి విలువ రూ.52 వేల కోట్లుగా ఉంటుందని, ప్రతి పేదవాడికి రూ.కోటి విలువైన ఇంటి జాగా ఇచ్చి కోటీశ్వరులను చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పారు. నిబంధనల ప్రకారం రాష్ట్రానికి 75 వేల ఇళ్లు మంజూరైతే అడిగిన వెంటనే కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మూడు లక్షల ఇళ్లను ఇచ్చారన్నారు. రాబోయే ఆరు నెలల్లో మరో మూడు లక్షల ఇళ్లను, వచ్చే సంవత్సరం మరో మూడు లక్షల ఇళ్లను ఇస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2029 లోపు నూటికి నూరుశాతం అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. మార్చి నాటికి భూముల సర్వే పూర్తి 2019–24 మధ్య రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం జరిగిందని, పేదలకిచ్చిన ఆరు లక్షల ఇళ్లను రద్దు చేశారని చంద్రబాబు ఆరోపించారు. భూసేకరణలో పెద్దఎత్తున అవినీతి చేశారన్నారు. పేదలకిచి్చన ఇళ్లు నివాసయోగ్యం కాదన్నారు. 2014–19లో తాము 17 లక్షల ఇళ్లు శాంక్షన్ చేసి 8 లక్షలు పూర్తి చేశామన్నారు. భూముల రీ సర్వే మార్చి నాటికి పూర్తిచేసి భూ వివాదాలు లేని రాష్ట్రంగా చేస్తామని చంద్రబాబు చెప్పారు. సూపర్ సిక్స్ ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చంద్రబాబు చెప్పారు. సమయం, వ్యయం తగ్గుతుంది: చౌహాన్ 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణ సమయం, వ్యయం తగ్గుతుందని తక్కువ మానవ వనరులతో పూర్తి చేయవచ్చన్నారు. ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి సాగును మోదీ ప్రోత్సహిస్తున్నారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధాని లక్ష్యాలకు అనుగుణంగా ఏపీలో ప్రకృతి సాగు జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో జానకిరామ్ అనే రైతుకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్రమంత్రి చౌహాన్ సందర్శించారు. ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పంటలు సాగు చేస్తున్న రైతును అభినందించారు. కాగా.. అంతకుముందు సీఎం చంద్రబాబును ఉండవలిల్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రి కలిశారు. ఈ సందర్భంగా రెండు వేర్వేరు లేఖలను చంద్రబాబు అందించారు. రైతులను ఆదుకునేందుకు, పేదల ఇళ్ల నిర్మాణానికి అదనపు నిధులు ఇవ్వాలని ఆ లేఖల్లో సీఎం కోరారు. ఖరీఫ్–2026కి సంబంధించి పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. -
‘గూడు’ పుఠాణి!
సాక్షి, అమరావతి: ‘నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం’ వంటి సూపర్ సిక్స్‌తోపాటు ఇతర హామీలకు దిక్కు మొక్కు లేకున్నా.. హామీలన్ని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఊదరగొడుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో నిరుపేదలకు పక్కా గూడు కల్పనలోనూ దొంగ లెక్కలతో వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం బురిడీ కొట్టించేస్తోంది. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం మంజూరు, పక్కా ఇళ్ల నిర్మాణం అంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు హామీలు ఇచ్చారు. గద్దెనెక్కి రెండేళ్లయినా పేదలకు గజం స్థలం మంజూరు చేసిన పాపాన పోలేదు. పక్కా గృహాల మంజూరు తూతూ మంత్రంగా ఉంది. తానిచ్చిన హామీలను అమలు చేయకపోగా, గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం విషయంలోనూ పేదలను నిలువునా దగా చేసేస్తున్నారు. ఏకంగా 1.70 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే చేసేసినట్టు దొంగ లెక్కలు చూపిస్తూ ఏకంగా ప్రభుత్వమే 420 వేషాలు వేస్తోంది. ఈ అంశం గత కొద్ది నెలలుగా గృహ నిర్మాణ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాకి లెక్కలతో షో చంద్రబాబు ప్రభుత్వం గతేడాది నవంబర్, ఈ ఏడాది మార్చిలో రెండు పర్యాయాలు సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం పేరిట హడావుడి చేసింది. రెండు విడతల్లో 5.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందించినట్టు డబ్బా కొట్టుకుంది. ఈ క్రమంలో వాస్తవాలు పరిశీలిస్తే ఆ ఇళ్లన్నీ కూడా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేసి, నిర్మించినవే. సీఎం చంద్రబాబు పేదలకు పంపిణీ చేసిన ఇంటి ధ్రువీకరణ పత్రాల్లోనూ 2019–24 మధ్య ఆ ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో బాబు సర్కార్ నవ్వులపాలైంది. ఇదిలా ఉండగా, గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లను తన ఖాతాలో వేసుకునే క్రమంలో వాస్తవ లెక్కలను సైతం చంద్రబాబు సర్కారు కప్పెట్టేసినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు రెండేళ్లలో నిరి్మంచినట్టు ప్రచారం చేసుకున్న 5.50 లక్షల ఇళ్లు గత ప్రభుత్వంలో వైఎస్సార్, జగనన్న కాలనీల్లో మంజూరు చేసినవే. వీటిలో 1.70 లక్షలకు పైగా ఇంకా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అరకొర నిర్మాణంలో ఉన్న ఇళ్లను సైతం పూర్తి చేసినట్టు కాకి లెక్కలు చూపి సామూహిక గృహ ప్రవేశాల పేరిట చంద్రబాబు రాష్ట్రంలో పెద్ద షో చేశారు. బాబు చేసింది శూన్యం రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు కల్పనే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఉచితంగా మహిళల పేరిట పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. కాగా, ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబి్ధదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలి కొదిలేశారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం నిర్మాణం పూర్తవ్వని ఇళ్లను సైతం పూర్తి చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. -
ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థుల్లో 93 శాతం మందికి ప్లేస్‌మెంట్స్
సాక్షి, అమరావతి: దేశంలో ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్), ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), ఎన్ఐటీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ల్లో చదివిన విద్యార్థుల్లో 93 శాతం మందికి ప్లేస్మెంట్ లభిస్తోంది. వీరి వార్షిక వేతనాలు పదేళ్లలో రెట్టింపయ్యాయి. జాతీయ ప్రాముఖ్యతగల ఉన్నత విద్యాసంస్ధలు.. ప్రధానంగా ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐటీల పనితీరుపై ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ విద్యాసంస్థల పనితీరు ఎంతో ఆకట్టుకునేలా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. అధునాతన పరిశోధన నైపుణ్యాలను పొందడం, ప్రపంచస్థాయి కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో నైపుణ్యాన్ని సాధించడం కోసం విద్యార్థులు ఈ విద్యాసంస్థల్ని ఎంచుకుంటున్నారు. 2023–24 నుండి రికార్డు స్థాయిలో ప్రవేశాలు2023–24 విద్యా సంవత్సరంలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఉన్నతవిద్యలో ప్రవేశం పొందినవారి సంఖ్య రికార్డుస్థాయికి చేరింది. 2013–14లో ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీల సంఖ్య 59. వీటిసంఖ్య 2025–26 నాటికి 76కు పెరిగింది. 2013–14 నుంచి 2025–26 మధ్య ఏడు ఐఐటీలు, తొమ్మిది ఐఐఎంలు, ఒక ఎన్ఐటీ ఏర్పాటయ్యాయి. 2017–18లో ఐఐటీ, ఎన్ఐటీల్లో మొత్తం విద్యార్థులు 1.62 లక్షల మంది ఉండగా.. ఈ సంఖ్య 27 శాతం వృద్ధితో 2023–24 విద్యాసంవత్సరానికి 2.44 లక్షలకు పెరిగింది. ఐఐఎంలలో విద్యార్థుల సంఖ్య 2017–18లో 9,298 ఉండగా.. 2023–24 నాటికి 18,243కు పెరిగింది. ఐఐఎం పీజీ ప్రోగ్రామ్‌లలో 2017–18లో 26.3 శాతం ఉన్న విద్యార్థినుల సంఖ్య 2023–24లో 37.7 శాతానికి పెరిగింది. ఐఐటీ, ఎన్ఐటీల్లో విద్యార్థినుల వాటా సుమారు 20 శాతం. అంటే 2023–24లో ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ఒక విద్యార్థిని, ఐఐఎంలలో ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒక విద్యార్థిని ఉన్నారు. వేతనాలు రెట్టింపుఐఐఎంలలో ప్లేస్మెంట్ల సంఖ్య 2015–16లో సుమారు 7,500 ఉండగా 2023–24లో ఈ సంఖ్య 13,700కి పెరిగింది. ఇదేకాలంలో ఐఐటీల్లో ఈ సంఖ్య 9,500 నుంచి 17,500కి పెరిగింది. ఎన్ఐటీల్లో కూడా ఇదేకాలంలో ప్లేస్మెంట్లు సుమారు 18 వేల నుంచి 29 వేలకు చేరింది. మొత్తం విద్యార్థుల్లో 93 శాతం మందికి ప్లేస్మెంట్లు లభించాయి. ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐటీలు అన్నింటిలోను 2025–26తో పోలిస్తే 2023–24 నాటికి ఉద్యోగాలు పొందినవారిలో సగం మందికిపైగా వేతనం 105 శాతం పెరిగింది. ఐఐఎంలలో చదువుకుని ఉద్యోగాలు పొందివారిలో సగం మందికిపైగా వేతనం 2023–24లో రూ.40 లక్షల మార్కును దాటింది. గత తొమ్మిదేళ్లలో ఐఐటీలు, ఎన్ఐటీల్లో చదువుకుని ఉద్యోగాలు పొందినవారిలో సగం మందికిపైగా వేతనం రెట్టింపు అయింది. -
తాగునీటిపై నీటి మూటలు
సాక్షి, అమరావతి: ఒకవైపు వ్యవసాయానికి సాగునీటిపై రైతులను మభ్యపుచ్చి నిండా ముంచేసిన చంద్రబాబు సర్కారు స్థానిక ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిపైనా మరో డ్రామాకు సిద్ధమైంది! రెండున్నరేళ్లుగా రక్షిత మంచినీటి సరఫరా పథకాల ఊసెత్తకుండా హడావుడిగా సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో ‘జేజేఎం–అమరజీవి జలధార’ పనుల శంకుస్థాపనకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2019–24 మధ్య మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్రంలో 39,34,701 ఇళ్లకు కొత్తగా తాగునీటి కొళాయిలు ఏర్పాటుచేయగా చంద్రబాబు సర్కారు కేవలం 2,69,735 ఇళ్లకు మాత్రమే అందించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్దానం లాంటి తీవ్ర సమస్యాత్మక ప్రాంతంలో రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తిచేస్తే చంద్రబాబు సర్కారు అలాంటిది ఒక్కటంటే ఒక్క పథకాన్ని ఇప్పటివరకు పూర్తిచేయలేదు. పులివెందుల పరిధిలోని ఏడు మండలాల్లో గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ. 480 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం నిర్మాణ పనులు వైఎస్సార్సీపీ హయాంలోనే 80 శాతానికి పైగా పూర్తవగా మిగిలిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ప్రొద్దుటూరు వేదికగా ‘జేజేఎం–అమరజీవి జలధార’ పనుల శంకుస్థాపన పేరుతో మరో నాటకానికి తెర తీసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన పనులను రద్దు చేసిన చంద్రబాబు సర్కారు వాటిలో కొన్నింటిని ఇప్పుడు తిరిగి తెరపైకి తేవడం మినహా కొత్తగా చేసిందేమీ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్రం జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2028 వరకు దేశమంతటా పొడిగించగా దానినీ సీఎం చంద్రబాబు తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు.గత ప్రభుత్వంలోనే దాదాపుగా పూర్తి.. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా జల జీవన్ మిషన్‌లో భాగంగా రూ. 26,823 కోట్లతో రక్షిత సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణాలతో పాటు మరో 77,917 గ్రామ స్థాయి రక్షిత మంచినీటి పథకాలు, తాగునీటి కొళాయిల ఏర్పాటు పనులను మంజూరు చేసింది. ఉద్దానం లాంటి పథకాలు పూర్తికాగా పులివెందుల, డోన్ వంటి సమగ్ర రక్షిత పథక నిర్మాణ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మూడో వంతుకు పైగా ఇళ్లకు గత ప్రభుత్వంలోనే తాగునీటి కొళాయిల ఏర్పాటు పూర్తవగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ‘ఇంటింటికీ రక్షిత తాగునీరు– ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్’ ఏర్పాటు చేస్తామంటూ సూపర్ సిక్స్ 2.0 హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక 25 శాతానికి లోపే పనులు జరిగాయనే సాకుతో రూ.10.680.50 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిన 44,194 చిన్న పనులతో పాటు రూ. 750 కోట్ల సమగ్ర రక్షిత మంచినీటి పథకం పనులను సైతం రద్దు చేశారు. రెండేళ్లకుపైగా కాలయాపన చేసి గతంలో రద్దు చేసిన పనుల స్థానంలో జల జీవన్ మిషన్ కార్యక్రమాలను మంజూరు చేసింది. వీటిని ఇప్పడే కొత్తగా మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు హడావుడి చేస్తోంది.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన తాగునీటి పథకాల పనులను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేసి.. కేంద్రం చుట్టూ ప్రదక్షిణ2024 డిసెంబరు 21న రద్దు చేసిన 44 వేల పనుల నిధులతో కేవలం బడా కాంట్రాక్టర్లు మాత్రమే చేపట్టే ఏడు సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్మాణ పనులకు చంద్రబాబు సర్కారు పచ్చ జెండా ఊపింది. మొత్తం రూ. 9,355 కోట్లతో ఏడు సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు ఈ ఏడాది మార్చి 26న ఆదేశాలిచ్చింది. తర్వాత వీటినే పది మంచి నీటి పథకాలుగా మార్పు చేస్తూ 2026 జులై 22న మరో జీవో జారీ చేసింది. వీటి టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఒకసారి రద్దు చేసి మళ్లీ మంజూరు చేసిన పనులకు 50 శాతం వాటా నిధులు పొందాలంటే వాటికి కేంద్రం ఆమోదం తీసుకోవాలి. ఈ అనుమతులు ఇప్పటికి కేంద్రం మంజూరు చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం రాలేదు. కేంద్రం నుంచి అనుమతి రాకుండానే శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రభుత్వం సిద్ధమైందని అధికారులు పేర్కొంటున్నారు. కార్పొరేషన్ పేరుతో రుణాలు..జల్ జీవన్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ పేరుతో చంద్రబాబు సర్కారు రూ.13,650 కోట్ల రుణ సమీకరణకు అనుమతి ఇచ్చింది . ఇప్పటికి రూ. 1,600 కోట్లు అప్పులు చేసినా గ్రామాల్లో మంచినీటి నిర్మాణ పనుల పురోగతి లేదు. కోవిడ్‌లోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకాల కోసం రుణాలు తీసుకోకుండా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల బాధిత ప్రాంతం ఉద్దానంలో రూ. 700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకం మొదలు పెట్టి పూర్తి చేయడం గమనార్హం. మరో రూ. 750 కోట్లతో పులివెందుల, డోన్ నియోజకవర్గాల్లో పనులను దాదాపు పూర్తి చేసింది. పైగా 2014–19 మధ్య టీడీపీ హయాంలో మంచినీటి పథకాల పేరిట తెచ్చిన అప్పుల్లో రూ. 300 కోట్ల మేర వైఎస్ జగన్ ప్రభుత్వం వడ్డీతో సహా తీర్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు మంచినీటి పథకాల పేరిట ఇటీవల తెచ్చిన అప్పులో దాదాపు రూ. 200 కోట్లు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొందరు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో చెల్లించారనే విమర్శలున్నాయి. -
కంచె చేను మేసింది
ద్వారకానగర్: విశాఖపట్నం కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ‘క్యూవీఎస్‌ఈ’ (క్వాంట్ వెస్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్) నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ దారుణానికి పాల్పడిన సైబర్ నేరగాళ్లకు కొమ్ముకాస్తూ కమీషన్ల కక్కుర్తితో ప్రజలను నిండా ముంచింది స్వయంగా రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులు, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ఆర్టీసీ అధికారులేనన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సదరు అధికారులు మోసపూరిత నెట్‌వర్క్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. కెన్యా నుంచి ఆపరేట్ అవుతున్నట్లుగా భావిస్తున్న ఈ సైబర్ ముఠా తెలుగు రాష్ట్రాల్లో సామాన్య ప్రజల నుంచి రూ. 100 కోట్ల వరకు డిపాజిట్ల రూపంలో కొల్లగొట్టింది. లక్షల సంపాదనే లక్ష్యంగా అధికారుల అక్రమంఅందుతున్న సమాచారం ప్రకారం ఒక ఎస్ఐ తన హోదాను అడ్డుపెట్టుకుని దాదాపు 200 మందిని ఈ చైన్ మార్కెటింగ్ వలలోకి లాగారు. ద్వారకానగర్, కంచరపాలెం, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలువురు అధికారులు, కానిస్టేబుళ్లు ఈ యాప్‌ను ప్రమోట్ చేశారు. ఒకరిని చేర్పిస్తే వచ్చే డైరెక్ట్ కమీషన్‌తో పాటు, కింద ఎక్కువ మంది చేరే కొద్దీ ’గోల్డ్ మెంబర్’, ’మెగా మెంబర్’ స్థాయిలకు ఎదిగి నెలకు లక్షలాది రూపాయల అక్రమ ఆదాయం పొందారు. ఒక పోలీస్ అధికారి కేవలం కమీషన్ల రూపంలోనే ఏకంగా రూ. 80 లక్షల వరకు పొందారు.డ్యూటీ వేళల్లో స్టేషన్లో ఉండాల్సిన సదరు అధికారులు, రోజంతా ఫోన్లలో యాప్‌లను పరిశీలించడం, బాధితులను పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహించడానికే ఎక్కువ సమయం కేటాయించారు. కొందరు పోలీసు అధికారులు ఒకవైపు ట్రేడింగ్ యాప్ ద్వారా కోట్లు దండుకుంటూనే, మరోవైపు తమ పరిధిలోని స్పా సెంటర్లు, బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాల నుంచి బెదిరింపులకు పాల్పడి భారీగా మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఆర్టీసీ డైరెక్టర్ స్థాయి అధికారి ఈ యాప్‌లో ‘మెగా మెంబర్’ హోదా సాధించే స్థాయికి వెళ్లి, తమ శాఖలో పనిచేసే సిబ్బందిని, కింది స్థాయి ఉద్యోగులను ఈ యాప్‌లోకి భారీగా చేర్పించారు. విజయనగరం నుంచి విజయవాడ వరకు ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను టార్గెట్ చేసి కోట్ల రూపాయలు డిపాజిట్లు చేయించారు. ఈ క్రమంలో సదరు ఆర్టీసీ అధికారికి రూ. కోటి వరకు కేవలం కమీషన్ రూపంలోనే దక్కినట్లు తెలుస్తోంది.రాజకీయ జోక్యం ఆరోపణలుద్వారకానగర్ పరిధిలో నమోదైన ఓ దోపిడీ కేసుకు, ఈ క్యూవీఎస్‌ఈ యాప్ మోసానికి సంబంధం ఉండగా, పట్టుబడిన ప్రధాన నిందితుడిని కూటమికి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు రాత్రికి రాత్రే తప్పించారనే వార్తలు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు తమపైనే ఎదురు కేసులు పెట్టి వేధిస్తారేమోనన్న భయంతో చాలామంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేకపోతున్నారు. రూ. లక్ష డిపాజిట్‌కు నెలకు రూ.20,000!సామాన్యులు తమ కష్టార్జితాన్ని, పొదుపు చేసుకున్న సొమ్మును ఈ నకిలీ యాప్‌లో కుమ్మరించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి» రూ. లక్ష డిపాజిట్ చేస్తే నెల రోజుల్లో రూ. 20,000 లాభం ఇస్తామని సైబర్ నేరగాళ్లు ఎర వేశారు. యాప్‌లో డబ్బులు చెల్లిస్తే అవి డాలర్లలోకి మారి క్రెడిట్ అవుతాయని నమ్మించారు. మొదటి కొన్ని రోజులు చిన్న మొత్తంలో విత్‌డ్రాలు ఇచ్చి నమ్మకం కలిగించడంతో, చాలామంది తమ బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి మరీ రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టారు.» ఇక రెండవది సమాజంలో హోదా ఉన్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు స్వయంగా వచ్చి ‘మేము కూడా పెట్టాం, మాకు లాభాలు వస్తున్నాయి’ అని చెప్పడంతో సామాన్యులు, బంధువులు, స్నేహితులు కళ్లు మూసుకుని ఈ బోనులో చిక్కుకున్నారు.» ఆగస్టు, సెప్టెంబర్లలో ఈ యాప్ అసలు రంగు బయటపడింది. బాధితులు తమ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, అకౌంట్లను నేరగాళ్లు బ్లాక్ చేశారు. బ్లాక్ అయిన ఖాతాలను అన్‌బ్లాక్ చేయాలంటే ‘మరింత డబ్బు చెల్లించాలి’ అని డిమాండ్ చేస్తూ అదనంగా దండుకున్నారు. చివరకు యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను పూర్తిగా మూసివేసి, కస్టమర్ కేర్ నంబర్లను స్విచ్ ఆఫ్ చేసి సైబర్ నేరగాళ్లు పరారయ్యారు. » తమ డబ్బులు రాకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు నిలదీయడం ప్రారంభించడంతో వారిని ఈ నెట్‌వర్క్‌లో చేర్పించిన అధికారులు సమాధానం చెప్పలేక సిక్ లీవ్‌ల పేరుతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. -
టోల్‌ప్లాజా వద్ద చింతమనేని టిప్పర్ డ్రైవర్ల వీరంగం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెదురుపావులూరు శివారు వెస్ట్ బైపాస్ టోల్‌ప్లాజా వద్ద దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చెందిన టిప్పర్ లారీ డ్రైవర్లు ఆదివారం వీరంగం సృష్టించారు. ఏలూరు నుంచి కొండపల్లి వైపు టిప్పర్లతో వెళ్తున్న డ్రైవర్లు టోల్ ఫీజు కట్టకుండా సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన టిప్పర్లకు టోల్‌ఫీజు ఎందుకు కట్టాలంటూ సిబ్బందిపై చిందులు తొక్కుతూ రెచ్చిపోయారు. కొన్ని వాహనాలు ఫీజు చెల్లించకుండానే టోల్‌గేట్‌ను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాయి. మిగిలిన వాహనాలను సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటనతో వెస్ట్ బైపాస్‌పై కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెట్‌మిక్స్ కోసం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి చెందిన 18 టిప్పర్లు దెందులూరు నుంచి దొనబండకు బయలుదేరాయి. ఉదయం 10 గంటలకు వెస్ట్ బైపాస్‌లోని టోల్‌ప్లాజా వద్దకు రాగానే టోల్‌ఫీజు కోసం సిబ్బంది లారీలను ఆపారు. చింతమనేనికి చెందిన వాహనాలకు టోల్‌ఫీజు కట్టాల్సిన పనిలేదని డ్రైవర్లు అక్కడి సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో డ్రైవర్లకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టోల్ ఫీజు కట్టకుండా పంపించబోమని సిబ్బంది తేల్చిచెప్పడంతో మధ్యాహ్నం నుంచి డ్రైవర్లు టిప్పర్లను టోల్‌గేట్‌కు అడ్డంగా పెట్టి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో సుమారు 4 కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. నాలుగు అంబులెన్స్‌లు కూడా చిక్కుకుపోవడంతో సిబ్బంది స్పందించి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పంపించారు. చివరికి.. టోల్‌ప్లాజా సిబ్బంది ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రశాంతి సిబ్బందితో అక్కడికి చేరుకుని అడ్డుగా పెట్టిన టిప్పర్లను పక్కకు తీయాలని హెచ్చరించినా డ్రైవర్లు లెక్కచేయలేదు. అంతేకాకుండా పది టిప్పర్ లారీలు టోల్‌గేట్‌ను ఢీకొట్టుకుంటూ గొల్లపూడి వైపు వేగంగా వెళ్లిపోయాయి. మరో 8 టిప్పర్లను పోలీసులు అడ్డుకుని పక్కన పెట్టించారు. కొద్దిసేపటికి సీఐ బీవీ శివప్రసాద్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఒక టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనం రికార్డులు చూపించాలని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు లారీ దిగమని చెప్పినా పట్టించుకోకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేసిన డ్రైవర్‌పై సీఐ ఆగ్రహం వ్యక్తంచేసి అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
అమ్మకానికి ఆర్టీసీ!
సాక్షి, అమరావతి: దేన్నైనా ప్రైవేటుపరం చేయడమంటే ఆయనకు ఇష్టం. ప్రైవేటు కంపెనీలంటే మహా ఇష్టం. ఎందుకంటే అందులోనే అస్మదీయులుంటారు.. అడిగిందల్లా అప్పనంగా ఇచ్చేయవచ్చు. అడిగినంత దోచిపెట్టవచ్చు. ప్రభుత్వరంగంలో వ్యవస్థలను నడపాలన్నా, నియామకాలు జరపాలన్నా ఆయనకు మహా చెడ్డ చిరాకు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ‘మనసులో మాట’ పుస్తకంలో కూడా రాసుకున్నారు. ఆయనెవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా..ఆయనే సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను, పోర్టులను ప్రైవేటీకరిస్తూ ప్రజాధనాన్ని దారుణంగా లూటీ చేస్తున్న చంద్రబాబు ఇపుడు ఆర్టీసీ ప్రైవేటీకరణకు నడుం బిగించారు. ఆ మధ్య విజయవాడలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయించిన చంద్రబాబు కార్మికుల ఉద్యమంతో తోకముడిచిన సంగతి తెల్సిందే. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన తన ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. విద్యుత్ బస్సులను, పలు డిపోలను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతగా నాలుగు డిపోలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించేశారు. వాటిపై కార్మికులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇపుడు డ్రైవర్, కండక్టర్ పోస్టులను సైతం ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పగించడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. రెగ్యులర్ నియామకాలకు తిలోదకాలిచ్చేసి ఔట్సోర్సింగ్, ఆన్‌కాల్ విధానంలో సిబ్బందిని తీసుకుని ఆర్టీసీని నడిపించాలని చూస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంటే శాశ్వత ప్రాతిపదికన కండక్టర్, డ్రైవర్ వంటి పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఆన్‌కాల్ అంటే.. రోజు కూలీ... ఆర్టీసీలో సుమారు 4వేల డ్రైవర్ పోస్టులు, 2వేలకుపైగా కండక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల జేఏసీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ చంద్రబాబు ససేమిరా అంటున్నారు. ఆన్‌కాల్ (ఏ రోజుకు ఆరోజు ఔట్సోర్సింగ్ విధులు) పద్ధతిలో పనిచేయించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రోజుకు రూ.వెయ్యి వేతనం ఇస్తారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో 1,800మంది ఆన్‌కాల్ డ్రైవర్లు పనిచేస్తున్నారు. మరో 4వేల మందిని అదే పద్ధతిలో తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం. ప్రజా రవాణాను దారుణంగా దెబ్బతీసే కుట్ర ఎర్రబస్సు అంటే పేదవాడి బెంజ్ కారు. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణానికి ప్రధాన సాధనం. అలాంటి ప్రజా రవాణా వ్యవస్థను ఒక పథకం ప్రకారం దారుణంగా దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. ఆర్టీసీ డిపోలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం, ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం వంటివన్నీ ఈకోవలోనివే. ఇపుడు డ్రైవర్లను, కండక్టర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించడం మరింత ప్రమాదకరమని ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులు అంటున్నారు. ఆర్టీసీలో డ్రైవర్లను ‘‘ఆన్‌కాల్/రోజువారీ వేతనం’’పై తీసుకోవడం కేవలం ఉద్యోగుల సమస్యగా కాకుండా ప్రయాణికుల భద్రత, బాధ్యత, సిబ్బంది నిర్వహణ పరంగా కూడా సమస్యలు వస్తాయి. రెగ్యులర్ డ్రైవర్ నియామకంలో ఎంపిక, శిక్షణ, డ్రైవింగ్ పరీక్షలు, వైద్య పరీక్షలు, సేవా రికార్డు వంటి వ్యవస్థలు ఉంటాయి. రోజువారీ/ఆన్‌కాల్ విధానంలో అవి పట్టించుకోరు. ప్రయాణికులతో నిండిన ఆర్టీసీ బస్సును నడిపే వ్యక్తి ఎంపికలో ప్రమాణాలు సడలితే ప్రమాదమే. ఆన్ కాల్ విధానం నేరుగా ప్రయాణికుల భద్రతపై పడుతుంది. ఆన్‌కాల్ డ్రైవర్ ఎక్కువ రోజువారీ ఆదాయం కోసం ఇతర డ్రైవింగ్ పనులు కూడా చేస్తే, అతని మొత్తం పని గంటలను ఆర్టీసీ ఎలా పర్యవేక్షిస్తుంది? అన్నది ముఖ్యమైన భద్రతా ప్రశ్న. ఉద్యోగ భద్రత లేకపోవడంతో డ్యూటీ ఒత్తిడి రోజువారీ వేతనంపై ఆధారపడే డ్రైవర్‌కు ‘‘డ్యూటీ వద్దంటే తదుపరి రోజు పని ఉండకపోవచ్చు’’ అనే పరిస్థితి ఉంటే, టైమ్ టార్గెట్లు, ట్రిప్పులు, అదనపు డ్యూటీల విషయంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రజా రవాణాలో భద్రత కంటే ట్రిప్పుల సంఖ్య/సమయపాలనకు ప్రాధాన్యత పెరగకూడదనే అంశాన్ని ముందుకు తెస్తుంది. రూట్ పరిజ్ఞానం, డిపో విధానాలపై అవగాహన, బస్సు ప్రత్యేకతలపై పరిచయం, స్థానిక ట్రాఫిక్ పరిస్థితుల అవగాహన, అత్యవసర పరిస్థితుల నిర్వహణ వంటి అంశాల్లో రెగ్యులర్ డ్రైవర్లకు ఉన్న అవగాహన రోజువారీ వేతన డ్రైవర్ కి వుండవు.విద్యుత్ బస్సులది ‘ప్రైవేట్ దారి’.. కేంద్ర ప్రభుత్వ సాయంతో పీఎం ఈ బస్సు సేవా పథకంలో ఏపీఎస్ ఆర్టీసీలో తెస్తున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించేలా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మొత్తం 1,450 విద్యుత్ బస్సుల ఆపరేషన్, నిర్వహణను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిలో ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలని నిర్ణయించారు.వాటిలో తొలివిడతగా 750 విద్యుత్ బస్సులను పూనేకు చెందిన పినాకిల్ అనే కంపెనీకి అప్పగించి వాటి నిర్వహణకు అవసరమైన 12 డిపోలలో నాలుగింటిని (విద్యాధరపురం, గుంటూరు 2, మంగళం, నెల్లూరు 2) సైతం ఆ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు దశలవారీగా ఉద్యమాలు చేశాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ బస్సుల్లో ఒక్కటీ ఇంకా రోడ్డెక్కలేదు. ఆ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీయే నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రయాణీకులు పెరిగారు.. బస్సులు తగ్గాయి.. రాష్ట్రంలో గతేడాదితో పోల్చితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు పెరిగారు. అందుకు అనుగుణంగా బస్సులు, సిబ్బంది సంఖ్య పెరగకపోగా మరింత తగ్గిపోయింది. » 2025 ఆగష్టు నాటికి రాష్ట్రంలో 10,700 బస్సులు తిరిగేవి. 44వేల సిబ్బంది ఉండేవారు. ప్రతిరోజూ 35 లక్షల మందికిపైగా ప్రయాణించేవారు. » 2026 ఆగష్టు నాటికి కాలం చెల్లిన 600 బస్సులు తగ్గిపోగా 10,100 బస్సులు మాత్రమే సర్వీస్ చేస్తున్నాయి. గోదావరి పుష్కరాలు(2027)నాటికి మరో 1500 బస్సులకు కాలం చెల్లిపోతుంది(్రస్కాప్ అవుతాయి). గడిచిన ఏడాదికాలంలో దాదాపు మూడు వేల మంది సిబ్బంది పదవీ విరమణ చేయడంతో 41వేల మంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణీకులు మాత్రం దాదాపు 15లక్షలు పెరిగి మొత్తం 50లక్షల మంది ప్రయాణిస్తున్నారు. » వాస్తవానికి 35 లక్షల మంది ప్రయాణీకులకు 44వేల సిబ్బంది, 10,700బస్సులు ఉంటే పెరిగిన మరో 15లక్షల మందికి అదనంగా కనీసం 20వేల సిబ్బంది, ఐదు వేల బస్సులు అవసరం. » వైఎస్ జగన్ ప్రభుత్వంలో తిరుమల కొండపై తెచ్చిన ఈ బస్సులు, ఏపీఎస్ ఆర్టీసీకి మంజూరు చేసిన డీజిల్ బస్సులు మినహా చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్క బస్సు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన బస్సులే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్తగా వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల నాన్ ఏసీ సీఎన్జీ 500 బస్సులకు టెండర్ పిలిచారు. దాన్ని రద్దు చేసి వాటిని ఏసీ బస్సులుగా మళ్లీ టెండర్ పిలవాలని నిర్ణయించారు. ఆర్టీసీ విలీనం.. దశాబ్దాల కల నెరవేర్చిన జగన్ దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన ఆర్టీసీ విలీనాన్ని వైఎస్ జగన్ నెరవేర్చారు. తద్వారా 58 వేల మంది ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశారు. అంటే ఆర్టీసీలోని ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులయ్యారన్నమాట. వారంతా కొత్తగా ఏర్పాటైన ప్రజా రవాణా శాఖ కిందకు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమనిబంధనలు ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచారు. ఈ విలీనం వల్ల ప్రభుత్వంపై రూ.3,300 కోట్ల ఆర్టీసీ ఆర్థిక భారం పడింది. అయినా వైఎస్ జగన్ వెనక్కి తగ్గలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని విలీనం చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.4వేల బస్సులు.. 15వేల రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలి ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్ ఏపీఎస్ ఆర్టీసీలో ప్రభుత్వమే సొంతంగా 4వేల బస్సులను కొనుగోలు చేసి 15వేల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఏపిపిటిడి(ఆర్టీసి) ఉద్యోగ సంఘాల జేఏసి రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు స్టేట్ కో కన్వీనర్లు పీవీ రమణారెడ్ఢి, జీవీ నరసయ్య, సీహెచ్ సుందరయ్య, కట్టా సుబ్రమణ్యం, ఎస్వీ శేషగిరిరావు, సూర్యప్రకాశరావు, జి.మాల్యాద్రి డిమాండ్ చేసారు. కండక్టర్ల కొరతను అధిగమించే పేరుతో రెగ్యులర్ నియామకాలకు బదులుగా కాంట్రాక్టర్ ద్వారా ఔట్సోర్సింగ్, ఆన్‌కాల్ పద్దతిలో నియమించడం సరికాదన్నారు. ఈ విధానం తాత్కాలికంగా సిబ్బంది కొరతను తీర్చినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో ఆర్టీసీలో రెగ్యులర్ ఉద్యోగ వ్యవస్థను బలహీనపరిచి, ప్రైవేట్ పరం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది సహా వివిధ కేటగిరీల్లో సుమారు 15 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే పునరాలోచించి రెగ్యులర్ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలు విడనాడకపోతే సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల భద్రత కోసం అన్ని సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. -
వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల పెన్‌డౌన్
సాక్షి, అమరావతి: తమ సమస్యల పరిష్కారం కోసం వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఆదివారం ఆస్పత్రుల్లో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయకుండా పెన్‌డౌన్ రూపంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. సర్వీస్ రెగ్యులరైజేషన్, అది జరిగే వరకూ వంద శాతం గ్రాస్ వేతనం, ఇతర డిమాండ్లతో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్థికేతర డిమాండ్లను నెలరోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, గడువు ముగిసినా తమ డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు ఆదివారం నుంచి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. అలాగే, సోమవారం జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాల అందజేత, మంగళవారం అత్యవసరం మినహా మిగిలిన సేవలన్నీ నిలిపివేత, బుధవారం నుంచి అత్యవసర సేవలనూ బహిష్కరించి సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని జేఏసీ హెచ్చరించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి.. మరోవైపు.. కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులు, సూపరింటెండెంట్లకు వైద్యశాఖ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. అవసరాన్ని బట్టి ఎంఎల్‌హెచ్‌పీలు, జీఎన్ఎం శిక్షణ పొందిన ఎంపీహెచ్ఏ (ఎఫ్) సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని సూచించింది. ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సెలవుల మంజూరుపై నియంత్రణ పాటించాలని, ఎఫ్ఆర్ఎస్ హాజరును సిబ్బంది వాస్తవ హాజరుతో సరిపోల్చి పరిశీలించాలని తెలిపింది. ఇదిలా ఉంటే.. సోమవారం మరోమారు చర్చలకు వైద్యశాఖ ఉన్నతాధికారులు తమను పిలిచినట్లు జేఏసీ కనీ్వనర్ అజయ్ తెలిపారు. -
విశాఖలో ఆగని పర్యావరణ విధ్వంసం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంపై కనీస గౌరవం కూడా లేకుండా విశాఖపట్నంలో పర్యావరణ విధ్వంసం కొనసాగిస్తున్నారని పర్యావరణవేత్త, జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపాదిత డేటా సెంటర్‌కు సుమారు 160 ఎకరాలు సింహాచలం దేవస్థానం భూముల లీజు, కంబాలకొండ అభయారణ్య పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్‌జెడ్) తదితర అంశాలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశానని తెలిపారు. ఈ పిల్ సోమవారం విచారణకు రానుందని, అయినప్పటికీ విచారణకు ఒక్కరోజు ముందు కూడా ఏమాత్రం భయం లేకుండా ముడసర్లోవలోని సింహాచలం కొండపై భారీగా చెట్లను నరికేస్తున్నారని బొలిశెట్టి మండిపడ్డారు. ఒకవైపు ముడసర్లోవ రిజర్వాయర్, మరోవైపు కంబాలకొండ అభయారణ్యం ఉన్న ఈ ప్రాంతంలో చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే పర్యావరణ విధ్వంసకాండకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భావితరాల పర్యావరణ హక్కులను బలిచేయవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం సింహాచలం కొండపై చెట్లు నరికివేస్తున్న విషయాన్ని గమనించి రహదారి పక్కన కుప్పలుగా పోసిన చెట్ల మొద్దులు, కలప దుంగల వీడియోలు, ఫొటోలను రికార్డు చేశానని, ఈ ఆధారాలను కోర్టుకు సమర్పిస్తానని తెలిపారు. ప్రభుత్వం, అటవీ, దేవదాయ శాఖ అధికారులు తక్షణమే విచారణ జరిపి అనుమతులపై స్పష్టత వచ్చే వరకు చెట్ల నరికివేతను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అడవివరం ప్రాంతంలో మిగిలిన పచ్చదనాన్ని, జలవనరులను కాపాడాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని బొలిశెట్టి స్పష్టంచేశారు. -
ఓటు హక్కు హరించడాన్ని సమర్థించలేం
సాక్షి, హైదరాబాద్: భారతీయ పౌరుడి ఓటుహక్కు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో అంతర్భాగమని, కోట్లాది మంది ఓట్లను దూరం చేసే ఏ ప్రక్రియ అయినా పూర్తిగా ఏకపక్షమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేశారు. అటువంటి చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), 326 (వయోజన ఓటు హక్కు)లను స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 19వ నల్సార్–జస్టిస్ బీఆర్ సాహ్ని మెమోరియల్ మూట్ కోర్టు పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగం పౌరులను ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలుగా విభజించడాన్ని అంగీకరించదని జస్టిస్ భూయాన్ అన్నారు. ‘ఏదైనా ఒక ప్రక్రియ కారణంగా దేశంలోని కోట్లాది మంది పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయి, సొంత దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోతే, అలాంటి ప్రక్రియ సహజంగానే అత్యంత ఏకపక్షమైనది. ఎలాంటి సాకులు లేదా ఏ ఇతర వాదనలు దీన్ని సమర్థించలేవు. ఇది రాజ్యాంగ మూలాలనే దెబ్బతీస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఓటు హక్కు,.. పౌరసత్వానికి అసలైన ప్రాణం ‘నిజానికి, ఓటు హక్కు అనేది పౌరసత్వానికి అసలైన ప్రాణం. దేశ పాలనా వ్యవస్థలో ఒక సామాన్య పౌరుడు భాగస్వామి కావడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. ఆర్టికల్ 326ను ఎవరూ మార్చలేరు. ఏ అధికార సంస్థ కూడా ఇలా చేయలేదు. ఏ కోర్టు కూడా దీన్ని క్షమించదు. రాజ్యాంగానికి అతీతులు ఎవరూ లేరు’ అని జస్టిస్ భూయాన్ స్పష్టం చేశారు. గతంలో కొన్ని తీర్పుల్లో ఓటు హక్కు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికీ, ’పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసు తీర్పు ప్రకారం ఓటు హక్కు కచ్చితంగా రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అది ఆర్టికల్ 326 ద్వారానే లభిస్తుందని జస్టిస్ భూయాన్ స్పష్టం చేశారు. పరిపాలనాపరమైన ప్రక్రియల ద్వారా పౌరుల ఓటు హక్కును హేతుబద్ధత లేకుండా హరించకూడదన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950 ప్రకారం ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించే ముందు సదరు ఓటరుకు తగిన వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలన్నారు. ‘ఓటరు మరణించిన సందర్భంలో తప్ప, ఒకసారి ఓటర్ల జాబితాలో చేరిన పేరును సదరు వ్యక్తికి నోటీసు ఇవ్వకుండా, వారి వివరణ వినకుండా తొలగించడానికి వీల్లేదు. ఒక భారతీయ పౌరుడి గుర్తింపు నుంచి ఓటు హక్కును లేదా ఓటర్ల జాబితాలో ఉండే హక్కును వేరు చేయలేం. అది శరీరం నుండి ఆత్మను తీసేయడంతో సమానం’ అని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యానించారు.స్వాగతించిన కాంగ్రెస్, తృణమూల్ జస్టిస్ భూయాన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్వాగతించారు. ‘పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం గళమెత్తే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ఇప్పుడు ఓటు హక్కు అనేది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగమని అత్యంత ధైర్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా సీఈసీ స్వయంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఇది నిరూపిస్తోంది’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.జస్టిస్ భుయాన్ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వైఫల్యాలను పూర్తిగా ఎండగట్టారని, జ్ఞానేశ్‌కు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు ఎంతమాత్రం లేదన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సైతం జస్టిస్ భూయాన్‌ను అభినందించారు. ‘పదవీ విరమణ చేసిన రోజున న్యాయమూర్తులు ధైర్యంగా మాట్లాడటం చాలా సులువు. కానీ, పదవిలో ఉన్న ఒక సిట్టింగ్ జడ్జి అధికార పీఠాన్ని ప్రశ్నిస్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఇదే మొదటిసారి. జస్టిస్ భూయాన్‌కు నా అభినందనలు’ అని ఆమె పేర్కొన్నారు. -
సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : ప్రముఖ దర్శకుడు, లెజెండరీ ఫిలింమేకర్ సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దక్షిణ భారత సినీ రంగంలో సింగీతం శ్రీనివాసరావు తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా ఆయన ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞ చిరస్మరణీయం. ఎన్నో విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని మరింత ఉన్నతంగా నిలిపారు. మూస ధోరణులకు భిన్నంగా కొత్త కథలు, కొత్త సాంకేతికత, వినూత్నమైన ఆలోచనలతో తరతరాల సినీ ప్రేక్షకులను అలరించారు.తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా, ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. 94 ఏళ్ల వయసులోనూ సినిమాపై అదే అంకితభావంతో పనిచేయడం ఆయనలోని కళాతపనకు నిదర్శనం. సింగీతం శ్రీనివాసరావు మృతి భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. Indian cinema has lost a true pioneer and pathbreaker, who continued making movies even at the age of 94. Singeetham Srinivasa Rao garu’s unmatched creativity, from silent marvels to sci-fi epics, inspires generations. Heartfelt condolences to his family and loved ones. May he rest in peace!— YS Jagan Mohan Reddy (@ysjagan) October 4, 2026 -
ఆలయాల్లో పండుగ వ్యాపారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పండుగల పేరుతో ఆలయాల్లో వ్యాపారం మొదలు పెట్టింది. పండుగ రోజుల్లో దైవ దర్శన టికెట్ల ధరలు పెంచేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాల వేళ అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్ ధరను రూ.500 నుంచి రూ.1,000కి పెంచాలని నిర్ణయించింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రెండేసి గంటలపాటు రూ.1,000 టికెట్లు ఉన్నవారికి అంతరాలయ దర్శనాలకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు దేవదాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తాజాగా దుర్గగుడి పాలకమండలి అంతరాలయ దర్శన టికెట్ ధరను రూ.1,000లకు పెంచుతూ తీర్మానానికి ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. మధ్య తరగతి వర్గాలను అమ్మవారి అంతరాలయ దర్శనానికి దూరం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని భక్తులు మండిపడుతున్నారు. కలియుగదైవం తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసాలనే తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడానికి పవిత్ర లడ్డూ ప్రసాదంపై జుగుప్సాకరమైన విమర్శలు చేసిన చంద్రబాబు, కూటమి పారీ్టల నేతలు ఇప్పుడు గుళ్లలోనూ పండుగ వ్యాపారం మొదలుపెట్టారంటూ భక్తులు మండిపడుతున్నారు. -
మభ్యపుచ్చేందుకే ' సుప్రీం'!
సాక్షి, అమరావతి : ముందుగా నిర్ణయించుకున్న స్క్రిప్టు ప్రకారం బీసీలను మభ్యపెట్టేందుకు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిజంగా బీసీ రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తున్నారని అనుకోవడానికే ఇదంతా చేస్తున్నారు తప్ప చంద్రబాబుకు ఎలాంటి చిత్తశుద్ధీ లేదని బీసీ నాయకులంటున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు ఏం చెబుతుందో వినాలి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు కోర్టులో పోరాడుతున్నట్టు నటిస్తూ ఇటు అధికారులను, అటు పార్టీ నాయకులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఎలాగూ కోర్టు కొట్టేస్తుంది కాబట్టి మీరంతా మీ పనులు వేగంగా పూర్తిచేయండి అంటూ అధికారులను అదిలిస్తున్నారు. అదే సమయంలో పార్టీ ముఖ్యనేతలతో ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. సుప్రీంకోర్టులో స్పష్టత రాకముందే చంద్రబాబు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఎన్నికల నిర్వహణకు చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎన్నికలకు సన్నద్దతపై శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. మరికొన్ని జిల్లాల్లోనూ కూటమి నేతల ఎన్నికల సమావేశాలు కొనసాగాయి. కలెక్టర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల హడావుడి శనివారం కూడా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారుల సమావేశాలు కొనసాగాయి. పోలింగ్ తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగిందని, స్ట్రాంగ్ రూమ్‌ల గుర్తింపు వంటి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిసింది. పాత రిజర్వేషన్లకు అనుగుణంగా ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవలసిందిగా పైనుంచి సూచనలందాయని అధికారుల స్థాయిలో చర్చ సాగుతోంది. ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు పార్టీ నాయకులను స్థానిక సంస్థలకు సన్నద్ధం చేస్తుండగా ఇంకోపక్క జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోనూ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిని పెంచింది. ఈ నెల 7 (బుధవారం) అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ నగర పోలీసు కమిషనర్లతో పాటు ఆయా జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, నగర, పట్టణ మున్సిపల్ కమిషనర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశం కూడా పూర్తి చేసిందంటే ఆ తర్వాత ఎప్పడైనా ఎన్నికల నోటిఫికేషన్ జారీకి అవకాశం ఉంటుందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. -
మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి
రైల్వేకోడూరు అర్బన్: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో 5వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్త చీర్ల రమేష్ నాయుడు పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజులు ఆలస్యంగా శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడిపై పోక్సోకేసు నమోదు చేసిన పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. బాధిత బాలిక కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బాలిక ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. చీర్ల రమేష్ నాయుడు బుధవారం రాత్రి 8 గంటలకు బాలికను తన ఆటోలో తీసుకెళ్లాడు. తిరిగి ఓ గంట తరువాత ఇంటివద్ద వదిలి వెళ్లాడు. రెండు రోజులుగా బాలిక మౌనంగా ఉండడాన్ని గమనించిన తల్లి నిలదీసి అడిగింది. దీంతో రమేష్ నాయుడు తనపై పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక వివరించింది. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు రైల్వే కోడూరు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే, కార్యకర్త రమేష్ నాయుడుపై నమోదైన ఈ కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరో వైపు బాలికకు న్యాయం చేయని పక్షంలో సహించేది లేదని మహిళలు హెచ్చరిస్తున్నారు. -
న్యాయాధికారుల పదవీ విరమణ వయసు ఏడాది పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని న్యాయాధికారుల (జ్యుడీషియల్ ఆఫీసర్లు) పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 1న ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని శనివారం గెజిట్‌లో ప్రచురించింది. న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని సుప్రీంకోర్టు ఇటీవల పలు రాష్ట్రాలను ఆదేశించింది. మరోవైపు న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు విషయంలో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం అమలయ్యేలా చూసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పాటు పలు ఇతర రాష్ట్రాలకు కూడా స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వేర్వేరు ఆదేశాలు ఇచ్చింది. పదవీ విరమణ వయసు పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ హైకోర్టులను సంప్రదించాలని కూడా ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవీ విరమణ వయసును పెంచాలని నిర్ణయిస్తే, ఆ పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చే మధ్యంతర కాలంలో పదవీ విరమణ చేసిన న్యాయాధికారులకు కూడా ఆ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని సుప్రీంకోర్టు వెసులుబాటును ఇచ్చింది. ప్రత్యేకంగా సమావేశమైన ఫుల్కోర్టుఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్ కోర్టు ఈ ఏడాది ఆగస్టు 24న ప్రత్యేకంగా సమావేశమైంది. రాష్ట్రంలోని అందరు న్యాయాధికారులు పదవీ విరమణ వయసును 61 నుంచి 62కు పెంచాలని సిఫారసు చేసింది. ఈ విషయాన్ని హైకోర్టు లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అటు సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇటు హైకోర్టు ఫుల్‌కోర్టు సిఫారసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచి వర్తిస్తుంది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి ప్రతిభాదేవి శనివారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. -
‘డిజిటల్’లో బాలల భద్రతకు సమష్టి కృషి
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ యుగంలో చిన్నారుల భద్రతకు కుటుంబాలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, న్యాయ సేవా సంస్థలు, టెక్నాలజీ సంస్థలు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ విక్రమ్‌నాథ్ పిలుపునిచ్చారు. చిన్నారులపై సైబర్ వేధింపులు, ఆన్లైన్ బెట్టింగ్, లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్ వంటి ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ‘పిల్లలు తమపై జరిగిన వేధింపులను వెల్లడించినప్పుడు మొదటి స్పందన అత్యంత కీలకం. ఓపికగా వినాలి.. గౌరవంగా చూడాలి. ఇకపై ఏం జరుగుతుందో వారికి అర్థమయ్యే భాషలో వివరించాలి’ అని చెప్పారు. సైబర్ ప్రపంచంలో పిల్లలపై జరుగుతున్న లైంగిక దోపిడీని అరికట్టడం, బాలల హక్కులకు రక్షణ కల్పించడం, వారికి స్నేహపూర్వక న్యాయవ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నల్సా నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీఎస్ఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ప్రారంభ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహా, జస్టిస్ ఆర్.మహదేవన్, జస్టిస్ అలోక్ అరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, ఆ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శామ్ కోషి, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్, తెలంగాణ సీఎం ఎ.రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. వారి స్వేచ్ఛకు భద్రత కల్పించాలి: జస్టిస్ విక్రమ్‌నాథ్ కవయిత్రి సరోజినీ నాయుడు రచించిన ‘టు మై చిల్ర్డన్’కవితలోని భావాల ప్రకారం.. ప్రతి తల్లీదండ్రి కోరుకునేది పిల్లలు నవ్వుతూ, బాధలకు దూరంగా ఎదగడమే. పిల్లలకు నేర్చుకునే, ఆడుకునే ప్రపంచాన్ని భయం లేకుండా అన్వేషించే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛకు భద్రత కల్పించడం సమాజం బాధ్యత. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ పిల్లల జీవితంలో భాగమయ్యాయి. వాటి ద్వారా విద్య, స్నేహం వంటి ప్రయోజనాలతోపాటు అనేక ప్రమాదాలు కూడా ఎదురవుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ మోసాలు, లైంగిక వేధింపులు చిన్నారులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నకిలీ ప్రొఫైళ్ల ద్వారా పిల్లలతో పరిచయం పెంచుకుని లైంగికంగా వేధించడం, వ్యక్తిగత ఫొటోలు పంపేలా ఒత్తిడి చేయడం, అనంతరం వాటితో బ్లాక్మెయిల్ చేయడం వంటి ఘటనలు ఆందోళనకరం. కృత్రిమ మేధ (ఏఐ) విస్తృత వినియోగం కూడా బాలల భద్రతకు కొత్త సవాళ్లు విసురుతోంది. చిన్నారుల సాధారణ ఫొటోలను మార్ఫింగ్ చేసి లైంగికంగా అసభ్యకరమైన నకిలీ చిత్రాలుగా రూపొందించడం, వాటిని సోషల్ మీడియా, మెసేజింగ్ గ్రూపుల్లో ప్రచారం చేయడం లేదా బ్లాక్‌మెయిల్‌కు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో పిల్లల చదువు, ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతోపాటు వారు ఇతరులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు బెదిరింపు సందేశాలు వచ్చినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పేలా ప్రోత్సహించాలి. లైంగిక బ్లాక్‌మెయిల్‌కు గురైన చిన్నారి.. ధైర్యంగా తమ సమస్యను చెప్పుకునే వ్యవస్థ అవసరం. పిల్లలే అత్యంత విలువైన ‘ఆస్తి’: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహాఆధునిక జీవన విధానం, పని ఒత్తిళ్లు, సైబర్ ప్రపంచం కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. మానవ సమాజానికి అత్యంత విలువైన ఆస్తి పిల్లలే. అయితే, ఈ విషయాన్ని మన నాగరికత, సంస్కృతి తగినంత ప్రాధాన్యంతో గుర్తించలేదు. దేశ భవిష్యత్తును భద్రపరచాలంటే ముందుగా పిల్లల భవిష్యత్తును భద్రపరచాలి. తల్లిదండ్రులు పిల్లలతో గడపాల్సిన సమయాన్ని కూడా సైబర్ ప్రపంచమే ఆక్రమిస్తోంది. చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.బాలలకు ఉచిత న్యాయసేవలు: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేడిజిటల్ వాతావరణంలో పిల్లలను రక్షించడం కేవలం విధానపరమైన అంశం కాదు. అది రాజ్యాంగపరమైన బాధ్యత. సంప్రదాయ నేరాలకు భిన్నంగా ఆన్లైన్ లైంగిక నేరాల్లో అజ్ఞాత ఖాతాలు, ఎన్క్రిప్టెడ్ సందేశాలు, వివిధ డిజిటల్ వేదికలు, వేర్వేరు దేశాలు లేదా న్యాయ పరిధులు దాటి పనిచేసే నిందితులు ఉండే అవకాశం ఉంది. డిజిటల్ ఆధారాలను తొలగించడం లేదా మార్చడం సాధ్యమవుతున్నందున వాటిని సరైన విధానంలో భద్రపరచడం, పరిశీలించడం, విశ్లేషించడం అత్యంత కీలకం. బాలలకు ఉచిత న్యాయ సేవలు అందించడం చట్టబద్ధ హక్కు. -
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే సహించం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా ప్రజల హక్కులను, స్వేచ్ఛను హరిస్తూ సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ ఇష్టారీతిన చెలరేగిపోతున్న పోలీసులపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. చట్ట పరిధి దాటి సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ప్రజల సంక్షేమమే అత్యున్నత చట్టమనే విషయాన్ని పోలీసులు గ్రహించాలంది. ప్రజల ప్రాణాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులు, శాంతి భద్రతలను రక్షించడానికే పోలీసులున్నారని హైకోర్టు గుర్తు చేసింది. అంతే తప్ప ప్రజలపై అధికారం చలాయించడానికి కాదని తేల్చి చెప్పింది.తాము ప్రజల కంటే పైస్థాయిలో ఉన్నామన్న రీతిలో పోలీసులు వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పౌరులపై నియంత్రణలేని అధికారాన్ని పోలీసులు చలాయించలేరని తెలిపింది. రాజ్యాంగ సూత్రాలకు సంరక్షకులుగా పోలీసులు వ్యవహరించాలని హైకోర్టు హితవు పలికింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం చట్టం పోలీసులకు ఇవ్వలేదని పునరుద్ఘాటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. సివిల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న తమ సివిల్ వివాదాల్లో పోలీసులు అకారణంగా జోక్యం చేసుకుంటున్నారని, పోలీస్‌స్టేషన్‌కు పిలిపిస్తూ వివాదాలను పరిష్కరించుకోవాలని బెదిరిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన పౌరులు హైకోర్టును ఆశ్రయించారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకుండా పోలీసులను నిరోధించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన న్యాయమూర్తి, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై గత ఏడాది అక్టోబర్ 24న డీజీపీ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని పోలీసులను తన తీర్పులో ఆదేశించారు.స్వాతంత్య్రం వచ్చినా వలసవాద పోలీస్ వ్యవస్థ మారలేదు‘ప్రసిద్ధ న్యాయ శాస్త్రవేత్త ఉపేంద్ర భక్షి చెప్పినట్లు.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా కూడా వలసవాద పోలీస్ వ్యవస్థ మాత్రం అంతం కాలేదు. కేవలం యజమానులు మాత్రమే మారారు. స్వాతంత్య్రం వచ్చినప్పటికీ పోలీసుల నిర్మాణం, పద్ధతులు, చట్టపరమైన విధానాలు ఎక్కువగా 1861 నాటి పోలీస్ చట్టం ఆధారంగానే కొనసాగాయి. ఈ వ్యవస్థ పౌర సేవా దృక్పథం కంటే, శాంతి భద్రతలను కాపాడటం, జనాలను నియంత్రించడం, పాలకుల ప్రయోజనాలను రక్షించడం కోసమే ప్రధానంగా రూపుదిద్దుకుంది.అందువల్ల, బ్రిటిష్ పాలకుల స్థానంలో ఎన్నికైన భారత ప్రభుత్వం వచ్చినప్పటికీ, పోలీసుల ప్రాథమిక సంస్థాగత స్వరూపంలో పెద్దగా మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఆధునిక భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా, వలసవాద పోలీస్ వ్యవస్థ.. ప్రజలే కేంద్రంగా సాగే ప్రజాస్వామ్య పోలీసింగ్ (డెమోక్రటిక్ పోలీసింగ్)గా మారాలి. ఇందుకు అందరూ సహకరించాలి. అంటే పోలీసులు చట్ట పరిమితులకు లోబడి అధికారాలను ఉపయోగించడం, రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్థలకు జవాబుదారీగా ఉండటం, పౌరుల చట్టపరమైన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండటం వంటి దిశలో చర్యలు ఉండాలి’పరిధి లేని వ్యవహారాల్లో జోక్యం సమాజానికి మంచిదికాదు ‘పోలీసులు చట్టబద్ధమైన అధికార పరిధి లేకుండా పౌరుల హక్కులలో జోక్యం చేసుకుంటే, అది మొత్తం సమాజంపైనే కాకుండా పోలీసుల వి«ధి నిర్వహణపై కూడా తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. ఓ పోలీస్‌స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన సిబ్బంది, తమకు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా, కేవలం తమ ఇష్టానుసారంగా సివిల్ వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే, అది సమస్యలను మరింత జఠిలం చేస్తుంది. ఈ రకమైన పోలీసుల ప్రవర్తన చివరికి శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తుంది. పోలీసులు చట్టబద్ధమైన పోలీసింగ్ విధులను సమర్థవంతంగా నిర్వర్తించకుండా అడ్డుకుంటుంది. ఇది సమాజ శ్రేయస్సుకైనా, లేదా పోలీస్‌శాఖ హితానికైనా ఏమాత్రం మంచిది కాదు. స్వేచ్ఛను ప్రభావితం చేసే కార్యనిర్వాహక విచక్షణ అధికారాన్ని అడ్డూ అదుపు లేకుండా వాడకూడదు. ఆ అధికారం తార్కిక, హేతుబద్ధ కారణాలు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై ఆధారపడి ఉండాలి. అంతే తప్ప, అస్పష్టమైన లేదా అర్థంలేని స్వీయ నిర్ణయాలపై ఆధారపడి పోలీసుల అధికారాలు ఉండకూడదు’– జస్టిస్ కుంచెం మహేశ్వరరావు తీర్పు -
ఆగని ఆగడాలు.. కనీవినీ ఎరు‘గని’ దోపిడీ
చంద్రబాబు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. ఇష్టారీతిన మట్టి, గ్రావెల్, ఇసుక, సహజ వనరుల దోపిడీకి తెగబడుతోంది. కొండలనూ కబళిస్తోంది. గుల్లచేసి సొమ్ము చేసుకుంటోంది. విలువైన ఖనిజాలను కబళిస్తోంది. ప్రభుత్వ పెద్దలే సూత్రధారులుగా సాగుతున్న ఈ అరాచకపర్వం ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే సాగుతోంది. ఈ దందాకు సర్కారు పెద్దల అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఫలితంగా కొండలు కుదేలవుతున్నాయి. నదీగర్భాలకు తూట్లు పడుతున్నాయి. తాజాగా చీరాల నియోజకవర్గంలో సాగుతున్న ఇసుక దందాపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా అధికార పార్టీ నేతల ఆగడాలు ఆగలేదు. అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి.సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర రాజధాని ప్రాంతంలోనే టీడీపీ నేతలు మైనింగ్‌కు తెగబడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో కృష్ణానదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. డ్రెడ్జింగ్ పడవలతో నదీగర్భానికి తూట్లు పొడుస్తున్నారు. రాత్రీపగలూ తేడాలేకుండా తవ్వకాలు చేస్తున్నారు. సేకరించిన ఇసుకను పలుచోట్ల డంపుచేసి అమ్మకాలు సాగిస్తున్నారు. రాజధాని నిర్మాణాల పేరుతోనూ ఇసుక దోపిడీకి తెగబడుతున్నారు. తాడికొండ నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమంగా తరలిపోతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. రాజధాని నిర్మాణాల పేరిట టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ దందా సాగుతుండడంతో చేష్టలుడిగి చూస్తున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో అక్రమార్కులు కొండలను గుల్ల చేసి గ్రావెల్, కంకర యథేచ్ఛగా దోచుకుంటున్నారు. పట్టా భూముల్లోనూ గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరుల ఆధ్వర్యంలోనే యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతోంది. రీచ్‌లలో పాగా వేసి రాత్రీపగలూ ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరుల దందా సాగుతోంది. పంట భూములను కబళించి యథేచ్ఛగా మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. చీరాల నియోజవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలో మైనింగ్ యథేచ్ఛగా సాగుతోంది. గ్రావెల్, మట్టి అక్రమంగా తరలిపోతోంది. క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క క్వారీ నుంచి రోజుకు రూ.30 లక్షలకుపైగా మట్టి, గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. ఈ ఒక్క నియోజవకర్గంలోనే రోజుకు రూ.పది కోట్ల మేర అక్రమ సొమ్మును టీడీపీ నేతలు జేబుల్లో వేసుకుంటున్నారని సమాచారం. ఈ దందా అంతా టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ కన్నుసన్నల్లోనే సాగుతోంది. పల్నాడు జిల్లా బీరవల్లిపాయ చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు.... పెన్నాకు తూట్లు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నదుల్లో ఇసుక తవ్వకాలు చేపడట్టకూడదని నిషేధం ఉన్నా..భారీ యంత్రాలతో నదీగర్భాన్ని కుళ్లబొడుస్తున్నారు. దీంతో సోమశిల ప్రాజెక్ట్ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ప్రాజెక్టు సున్నిత ప్రాంతంలోనూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగించడం ఆందోళన కలిగిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీమణి షాడో ఎమ్మెల్యేగా మారి దందా సాగిస్తున్నట్టు సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక అనుచరుడే ఇసుక దందా సాగిస్తున్నారు. ఒక్క పీకేపాడులోనే నెలకు రూ.వంద కోట్ల ఇసుక దోపిడీకి తెగబడినట్టు సమాచారం. నెల్లూరు పెన్నాబ్యారేజీ, సంగం బ్యారేజీ వద్ద కూడా డీసిల్టింగ్ పేరుతో యథేచ్ఛగా యంత్రాలతో తవ్వేస్తున్నారు. ⇒ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మార్కాపురం జిల్లాలో పేదలు, జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లోనూ అక్రమ తవ్వకాలకు బరితెగించడం గమనార్హం. దర్శి మండలంలో ఎర్రమట్టి అక్రమ రవాణాతో నెలకు రూ.రెండు కోట్ల వరకూ అక్రమంగా ఆర్జిస్తున్నట్టు తెలుస్తోంది. కందుకూరు నియోజకవర్గంలోని పాలేరు, ఉప్పుటేరు, మున్నేరు తదితర నదులను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. గోదావరి ఘోష తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతల తవ్వకాలతో గోదారమ్మ నదీగర్భానికి భారీగా తూట్లు పడుతున్నాయి. ఇసుక రాత్రీపగలూ తేడా లేకుండా భారీగా తరలిపోతోంది. ప్రతి ఇసుక లారీకీ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి రూ.2 వేలు చొప్పున చెల్లించాల్సిందేనని ర్యాంపుల నిర్వాహకులు బహిరంగంగానే ఇక్కడ చెబుతుండడం గమనార్హం. కాతేరులోనూ టీడీపీ ఎమ్మెల్యే కన్నసన్నల్లోనే దందా సాగుతోంది. ⇒ కాకినాడ జిల్లా పెద్దాపురం మైనింగ్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రెండు నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉన్న రామేశంమెట్టను గ్రావెల్ కోసం అక్రమార్కులు తవ్వేస్తున్నారు. తుని మండలం లోవ కొత్తూరులో పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకంలో ఏర్పడిన మట్టి గుట్టలను అక్రమంగా తరలించుకుపోతున్నారు. ⇒ ఏలూరు జిల్లాలో మట్టి అక్రమ రవాణా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో తమ్మిలేరులో అక్రమ రవాణా నిలిచిపోవడంతో మెట్ట ప్రాంతంలో మట్టి దందాకు తెరలేపారు. పోలవరం నియోజకవర్గంలో జనసేన నేతలు మట్టిని పొక్లెయిన్లతో అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు. నెల్లూరు వేంకటేశ్వరపురం వద్ద పెన్నా నదిలో బ్రిడ్జికి సమీపంలోనే ఇసుకను అక్రమంగా తోడేస్తున్న దృశ్యం ఉత్తరాంధ్రలో గ్రానైట్, తెల్లరాయి, నల్ల ఇసుక దందా శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్, గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టెక్కలిలో నీలి గ్రానైట్‌కు డిమాండ్ బాగుండడంతో టీడీపీ నేతలు యథేచ్ఛగా కొల్లగొట్టేస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ కీలక నేత సోదరుడు ఆయన కుమారుడు అండతో అక్రమ గ్రానైట్ తవ్వకాలు, తరలింపు సాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పంచాయతీలో రాత్రి వేళ నల్ల ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గంలోనూ గ్రావెల్‌ను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పెందుర్తి మండలం దువ్వపాలెంలో తెల్లరాయి మెటల్ కొండను పూర్తిగా తొలిచేశారు. దీంతో రాళ్లు కూలిపోతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అనుచరగణం రోజూ రూ.లక్షల విలువైన మట్టి దోచేస్తున్నారు. ఎస్‌ఆర్‌పురంలోని తెల్లరాయిమెటల్ని జనసేన నాయకులు అక్రమంగా తరలించేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోనూ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. పలు మండలాల్లో అక్రమ గ్రావెల్ క్వారీయింగ్ చేస్తున్నారు. యలమంచిలి నియోజక వర్గంలోని అచ్యుతాపురం అందలాపల్లి కొండపై నిబంధనలకు విరుద్ధంగా క్వారీయింగ్ జరుగుతోంది. అలూరి సీతారామరాజు మన్యం జిల్లాలోనూ పపలు గెడ్డలలో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. అమరావతి పరిధిలో యథేచ్ఛగా కృష్ణా నదిలో ఇసుక డ్రెడ్జింగ్ సాగుతోందిలా... రాయలసీమలో టీడీపీ నేతల జేబుల్లోకి ఖనిజ సంపద రాయలసీమలో టీడీపీ నేతలు అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. కొండలను కొల్లగొట్టేస్తున్నారు. విలువైన ఖనిజ సంపదను రాష్ట్రాలు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో యథేచ్ఛగా అక్రమ క్వారీలను నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలో బెరైటీస్ నిక్షేపాల ద్వారా రూ.వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఇసుక, మట్టి, గ్రావెల్ పెద్ద ఎత్తున కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు తరలిపోతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక, మట్టి, గ్రానైట్‌తోపాటు కంకర క్వారీయింగ్ అక్రమంగా సాగుతోంది. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో మైకా, క్వార్‌ట్టŠజ్ తదితర విలువైన ఖనిజాల దోపిడీ సాగుతోంది. -
యువతి దారుణ హత్య
అజిత్‌సింగ్ నగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లికి నిరాకరిస్తోందనే అక్కసుతో యువతిని కొడవలితో గొంతుకోసి చంపేశాడు. తప్పించుకునే ప్రయత్నంలో భవనం పైనుంచి దూకడంతో అతడు కూడా మృత్యువాతపడ్డాడు. విజయవాడ అజిత్‌సింగ్ నగర్ న్యూరాజరాజేశ్వరిపేటలో శనివారం జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. రాజరాజేశ్వరీపేటలోని మూడంతస్తుల అపార్ట్మెంట్లో నివసిస్తున్న పడవల మహాలక్ష్మి (19) పదో తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసినా ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదువును మధ్యలోనే ఆపేసి ఓ వస్త్ర దుకాణంలో పనికి వెళుతోంది. రెండేళ్ల వయసులోనే మహాలక్ష్మి తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో మహాలక్ష్మిని నాయనమ్మ శాంతమ్మ పెంచి పెద్దచేసింది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మంకు చిన్నారావు అలియాస్ చిన్నా (22) అనే యువకుడు రాజరాజేశ్వరి పేటలో తన అన్నయ్య మహేష్ వద్ద ఉంటూ అప్పుడప్పుడూ ఫ్లవర్ డెకరేషన్ పనులకు వెళ్తుంటాడు. కొడవలితో గొంతుకోసి.. ఇంటి సమీపంలోనే ఉండే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా చిన్నా ఒత్తిడి చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతడి ప్రవర్తన నచ్చని మహాలక్ష్మి ‘ముందు నీ ప్రవర్తన మార్చుకో’ అని చెబుతోంది. మహాలక్ష్మి ఎవరితో మాట్లాడుతున్నా ఓర్చుకోలేని చిన్నా ఆమెను తిట్టడం.. కొట్టడం చేస్తున్నాడు. ఇటీవల ఇంటి సమీపంలో జరిగిన అన్నసమారాధనకు వెళ్లిన మహాలక్ష్మిని దుర్భాషలాడి కొట్టాడు. దీంతో మహాలక్ష్మి నాయనమ్మ శాంతమ్మ చిన్నాను పిలిచి ఇలా అయితే నీకు మహాలక్ష్మిని ఇచ్చి అస్సలు పెళ్లిచేయబోమని చెప్పింది. దీంతో అక్కసు పెంచుకున్న చిన్నా మహాలక్ష్మిని చంపాలని నిర్ణయించుకున్నాడు. శనివారం ఉదయం మహాలక్ష్మి నాయనమ్మ శాంతమ్మ టిఫిన్ తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లగా.. కొడవలితో ఆ ఇంట్లోకి చొరబడిన చిన్నా తలుపులు మూసేసి మహాలక్ష్మిపై కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఆమె చేతి వేళ్లు నరికేసి.. గొంతుకోసి అత్యంత కిరాతకంగా గాయపరిచాడు. మహాలక్ష్మి కేకలు విన్న స్థానికులు ఇంటి తలుపులు పగులకొట్టే ప్రయత్నం చేయగా.. చిన్నా ఆ ఇంటి వెనుక తలుపు తీసుకుని అదే భవనం పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా చిన్నా అక్కడికక్కడే మృతిచెందగా.. మహాలక్ష్మి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా దాదాపు ఏడు గంటల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచింది. మహాలక్ష్మిని దారుణంగా హత్య చేసిన చిన్నారావు తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్ పేరు కూడా సైకో చిన్నా అనే పెట్టుకున్నాడు. నిజంగానే అతడు సైకోలా ప్రవర్తిస్తాడని.. పనీపాట లేకుండా తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. -
రైతులకు బాబు లక్ష మోసాలు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి ప్రతి హామీ నెరవేరుస్తానని ఇంటింటికీ బాండ్లు పంచిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాలన మూడో ఏడాది నడుస్తోంది... ఇప్పుడు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ పిట్టలదొర మాటలు చెబుతూ మరోవైపు రైతులను లక్ష మోసాలకు గురి చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో ఆయన ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నారా?రూ. లక్ష కోట్లంటూ చంద్రబాబు పిట్టలదొర మాటలు చెబుతూ, మరోవైపు రైతులను లక్ష మోసాలకు గురి చేస్తున్నారు. రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ చంద్రబాబు చేస్తున్నవి డ్రామాలు, అంకెల గారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. రైతులమీద ప్రేమ మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనే పలుమార్లు రుజువు చేసింది. హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే, రోజూ ధర్నాలు చేస్తే చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నారా? మా ప్రభుత్వంలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటల బీమాను తీసివేసి రైతుల వెన్నువిరిచిన మాట వాస్తవం కాదా?. సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేసి, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నిర్వీర్యం చేసి రైతుల నడ్డివిరిచారు. చంద్రబాబు పబ్లిసిటీ డ్రామాలు చేసి, వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు గానీ రైతుల కష్టసుఖాల గురించి ఏరోజూ పట్టించుకోరనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి.. కరువు నివారణా చర్యలు మొదలు పెట్టాలితీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు ఎండిపోతుంటే... చంద్రబాబు వాటర్ మ్యాన్ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఓ పక్క రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబే అడ్డుతగులుతున్నారు. మరోపక్క ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే దాదాపుగా 78 లక్షల బోర్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000 ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇక హార్టికల్చర్ హబ్ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యింది. చంద్రబాబు ఇప్పటికైనా డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలుపెట్టాలి. -
రూ.9 లక్షల డొల్ల కంపెనీకి రూ.1400 కోట్ల ప్రాజెక్టా?: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో తమ అనుయాయులకు, బినామీ కంపెనీలకు అడ్డగోలుగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఇవ్వడమే కాకుండా, పలు రాయితీల రూపంలో వందల కోట్లు దోచిపెడుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు.గతంలో విశాఖపట్నంలో ఉర్సా లాంటి డొల్ల కంపెనీకి రూపాయికే ఎకరం చొప్పున భూములు కట్టబెట్టిన తరహాలోనే, ఇప్పుడు రాయలసీమలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో ‘రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట మరో భారీ దోపిడీకి తెర లేపారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆక్షేపించారు. ప్రెస్మీట్లో పుత్తా శివశంకర్ ఇంకా ఏం మాట్లాడారంటే..:బినామీ సంస్థలకు ప్రజా ఆస్తులు:ఏర్పాటై ఏడాది కూడా పూర్తి కాని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎలాంటి అనుభవం లేని, కేవలం రూ.9 లక్షల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో రిజిస్టర్ అయిన సంస్థకు ఏకంగా రూ.1388.14 కోట్ల ప్రాజెక్టు ఆపాదించారు. ‘రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు ఏపీఐఐసీకి చెందిన విలువైన 40.50 ఎకరాల భూమితో పాటు, రూ.592.22 కోట్ల మేర టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌లను జీవో ఎంఎస్ 259 ద్వారా ధారాదత్తం చేశారు. అలా తమ వారి లబ్ధి కోసం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే బినామీ సంస్థలకు ప్రజల ఆస్తులను యథేచ్ఛగా దోచిపెడుతున్నారు.రూ.9 లక్షల కంపెనీకి రూ.1400 కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఎక్కడిది?:గత ఏడాది నవంబరు 20న ప్రారంభమైన రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పెయిడ్ అప్ క్యాపిటల్ కేవలం రూ. 9 లక్షలు మాత్రమేనని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) రికార్డులే చెబుతున్నాయి. కనీసం రూ.2.5 లక్షల రుణం పొందే అర్హత కూడా లేని ఈ పసిగుడ్డు కంపెనీ ఏకంగా రూ.1388.14 కోట్ల పెట్టుబడి పెడుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ఈ కంపెనీ వెనుక ఉండి నల్లధనాన్ని పెట్టుబడిగా పెడుతున్న బడా బాబులు ఎవరు? కేవలం పేపర్ మీద కంపెనీ పెట్టి, ప్రభుత్వ భూములు చేజిక్కించుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పారిపోయే కుట్ర కాదా ఇది?సర్జికల్ గ్లౌజులు చేసే వారికి ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది?:ఈ సంస్థ డైరెక్టర్లకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీస అనుభవం ఉందా? వీరికున్న మరో కంపెనీ ఈజిస్ గ్లోవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం ఏఎంటీజెడ్‌లో సర్జికల్ హ్యాండ్ గ్లౌజులు తయారు చేస్తుంది. గ్లౌజులు తయారు చేసే వారికి, టమోటా, మామిడి ప్రాసెసింగ్ చేసే అనుభవం ఎలా ఆపాదించారు? పైగా వీళ్ల అనుబంధ సంస్థ ’దిసూత్ర ల్యాబ్స్’ను, ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం రూ.10 వేల పెట్టుబడితో ప్రారంభించారు.జీవోకు ముందే రూ.1090 కోట్ల మెషినరీ ఆర్డర్లు ఎలా ఇచ్చారు?:ఈ కంపెనీకి భూకేటాయింపునకు సంబంధించిన ఆదేశాలు గత నెల జారీ అయ్యాయి. ఆ మేరకు జీఓ ఎంఎస్ నెం:259ని సెప్టెంబరు 25న జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన తొలుత సెప్టెంబరు 7న జరిగిన ఎస్ఐపీసీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ) సమావేశంలోనూ, ఆ తర్వాత 11 రోజుల అనంతరం, సెప్టెంబరు 18న జరిగిన ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో వచ్చింది. కాగా, అప్పటికే దాదాపు రెండు నెలల ముందే జూలై 1 నాటికే ఆ సంస్థ రూ.1090 కోట్ల విలువైన ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్డర్ ప్లేస్ చేసింది! నిజంగా ఆ కంపెనీకి అంత ఆర్థిక స్థోమత ఉందా? అదే నిజమైతే అంత తక్కువ మూలధన పెట్టుబడి మాత్రమే పెడతారా? లేక ఇదంతా ముందస్తు కుమ్మక్కు కాదా?రూ.592 కోట్ల ఇన్సెంటివ్ ఎవరి జేబుల్లోకి?:రూ.1388 కోట్ల ప్రాజెక్టు విలువలో ఏకంగా 46.61 శాతం, అంటే రూ.592.22 కోట్లను టైలర్ మేడ్ ఇన్సెంటివ్లుగా ప్రకటించడం విడ్డూరం కాదా? కేవలం రూ.9 లక్షల మూలధన పెట్టుబడి ఉన్న కంపెనీకి రూ.592 కోట్ల ఇన్సెంటివ్‌లు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఎక్కడైనా ఉందా?. ఇలా 40.50 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వడమే కాకుండా, వివిధ రూపాల్లో మరో రూ.592 కోట్లు ప్రభుత్వం నుంచే దోచి పెడుతుంటే ఇది బినామీ దందా కాక మరేమిటని పుత్తా శివశంకర్ నిలదీశారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టండి: వైఎస్ జగన్ -
చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టండి: వైఎస్ జగన్
తాడేపల్లి: హార్టికల్చర్‌కు రూ.లక్ష కోట్లంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిట్టలదొర మాటలు మానుకోవాలని సూచించారు. చంద్రబాబు డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టాలని అన్నారు. రూ. లక్ష కోట్లు కాదని, రైతులకు లక్ష మోసాలు అంటూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ.లక్ష కోట్లు అంటూ మీరు చేస్తున్నవి డ్రామాలు, అంకెలగారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం మీకు మాత్రమే సాధ్యం. రైతుల మీద మీ ప్రేమ, మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల మీ పాలనే పలుమార్లు రుజువు చేసింది. హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే రోజూ ధర్నాలు చేస్తే మీరు ఏరోజైనా పట్టించుకున్నారా?’’ అని వైఎస్ జగన్ అన్నారు.రైతుల వెన్ను విరిచారు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటల బీమాను తీసివేసి రైతుల వెన్ను విరిచిన మాట వాస్తవం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘‘సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేసి, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నిర్వీర్యంచేసి, రైతుల నడ్డివిరిచారు. మీరు పబ్లిసిటీ డ్రామాలు చేసి, వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు తప్ప, రైతుల కష్టసుఖాల గురించి ఏరోజూ పట్టించుకోరనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? తీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు ఎండిపోతుంటే, మీరు వాటర్ మ్యాన్ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.ఇదీ చదవండి: నయవంచన రాజకీయాలు ఇంకెన్నాళ్లు?ఓ పక్క రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు మీరే అడ్డుతగులుతున్నారు. మరొపక్క ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే దాదాపుగా 7-8 లక్షల బోర్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000లు ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక హార్టికల్చర్ హబ్ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా, రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యింది. చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలు పెట్టండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.రూ. లక్ష కోట్లంటూ చంద్రబాబు పిట్టలదొర మాటలు, మరోవైపు రైతులకు లక్ష మోసాలు @ncbn గారూ... రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ, మీరు చేస్తున్నవి డ్రామాలు, అంకెలగారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం మీకు…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 3, 2026 -
స్థానికానికి లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు నామినేషన్ నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అన్ని దశల్లో న్యాయపరమైన అండ అందించేందుకు పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులకు లీగల్ సెల్ గట్టిగా అండగా నిలిచిందని అభినందించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా సహకరించాలని సూచించారు. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, పోలింగ్ సందర్భంగా ఎదురయ్యే సమస్యలపై వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలమై సజావుగా స్ధానిక ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమన్న కారణంతో పోలీసులను, అధికారులను ఉపయోగించి అక్రమ కేసులు, వేధింపుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసినా ధీటుగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సన్నద్ధంగా ఉండాలని సూచించారు.ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని లీగల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట న్యాయవాదులను అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా సెంట్రల్ ఆఫీస్‌లో లీగల్ వార్‌రూమ్ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. లీగల్ సెల్ నాయకులు టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలని, యువ న్యాయవాదులతో పాటు పార్టీ పట్ల సానుభూతి కలిగిన అనుభవజ్ఞులైన న్యాయవాదుల సేవలను కూడా వినియోగించుకోవాలని కోరారు.అభ్యర్థుల నామినేషన్లకు లీగల్ సెల్ రక్షణగా నిలవాలి: చెవిరెడ్డిమాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేసేలా అవసరమైన న్యాయ సహకారం అందించాలని కోరారు. అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీలు, పోలీస్ క్లియరెన్స్ తదితర పత్రాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లీగల్ సెల్ ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే వెంటనే న్యాయపరంగా స్పందించాలని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లా స్థాయి లీగల్ నాయకులు పూర్తి సమయం కేటాయించి పార్టీ అభ్యర్థులకు బ్యాక్‌బోన్‌గా నిలవాలని కోరారు. నియోజకవర్గ స్థాయి లీగల్ సెల్ అధ్యక్షులు పార్టీ ఇన్చార్జులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.ముందస్తు కార్యాచరణ అవసరం: లేళ్ల అప్పిరెడ్డివైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అందించిన సహకారాన్ని అభినందించారు. నామినేషన్లకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు ముందుగానే సిద్ధం చేయించడం, నామినేషన్లు సక్రమంగా దాఖలు చేయించడం, ఎన్నికల సమయంలో ఎదురయ్యే సమస్యలను రిటర్నింగ్ అధికారుల నుంచి రాష్ట్ర లీగల్ సెల్ వరకు వెంటనే తీసుకెళ్లేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నియోజకవర్గాలు, ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా లీగల్ సెల్ ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని కోరారు.వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జితో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రతి మండలానికి ఒక న్యాయవాదిని కేటాయించి, నామినేషన్లకు ముందే అభ్యర్థులకు అవసరమైన నో డ్యూస్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు, కేసులకు సంబంధించిన వివరాలు, ఇతర పత్రాలను సిద్ధం చేయించాలని చెప్పారు. నామినేషన్ పత్రాల తయారీ, అఫిడవిట్లు, స్క్రూటినీ సమయంలో అభ్యర్థులకు న్యాయవాదులు ప్రత్యక్షంగా సహకరించాలని సూచించారు. నామినేషన్ తిరస్కరణ జరిగితే వెంటనే సంబంధిత అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించాలన్నారు.పోలింగ్ సమయంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు లీగల్ సెల్ నాయకులు, న్యాయవాదులు అభ్యర్థులకు అందుబాటులో ఉండాలని కోరారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న న్యాయవాదులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: డ్యూయల్ డ్రామా! -
13న అల్పపీడనం!
సాక్షి, అమరావతి: ఈ నెల 13 నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 15 నాటికి బంగాళాఖాతంలో అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. -
మద్యం మత్తులో తోబుట్టువుల ఘాతుకం
మర్రిపాడు/దేవరకోట (ఘంటసాల): తోడబుట్టిన వారే కాలయముళ్లుగా మారి ప్రాణాలు తీసిన రెండు వేర్వేరు ఘటనలు నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో కలకలం రేపాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని నాగరాజుపాడుకి చెందిన కుంభగిరి రాజగోపాల్ (46)కు అతడి తమ్ముడు గోపీకి మధ్య పాత గొడవలున్నాయి. గతంలో తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో గోపీ అంగవైకల్యానికి గురయ్యాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య వివాదం ఉంది. గురువారం రాత్రి మద్యం మత్తులో అన్నతో గోపీ గొడవపడ్డాడు. కోపంతో బండతో రాజగోపాల్‌పై దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం పోలీసులకు గోపీ లొంగిపోయాడు. రాజగోపాల్ భార్య గతంలో మృతిచెందగా.. కుమారుడు, కుమార్తె అనాథలయ్యారు.క్షణికావేశంలో తమ్ముడిని హత్యచేసిన అన్నఅలాగే, కృష్ణాజిల్లా ఘంటసాల మండలం దేవరకోటలో గురువారం రాత్రి సీహెచ్. రాజ్‌కుమార్ (40) మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్నాడు. అతడి అన్న విజయ్‌కుమార్ తమ్ముడిని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇరువురు మధ్య గొడవ జరగ్గా ఆగ్రహించిన విజయ్‌కుమార్ క్షణికావేశంలో తమ్ముడు రాజ్‌కుమార్ తలపై అక్కడే ఉన్న రాయితో బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే విజయ్‌కుమార్ విజయవాడ పారిపోయాడు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు రాజ్‌కుమార్‌ను చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. విజయ్‌కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. రాజ్‌కుమార్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్ల క్రితమే ఇతడు భార్యతో విడిపోయాడు. -
సిండికేట్‌కు మరో ‘ప్యాకేజీ’
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్ పనులను అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని.. బోరు బావులు ఎండిపోతాయని.. తాము జీవనాధారం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ.. రైతుల ఆందోళనను ఏమాత్రం ఖాతరు చేయకుండా హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ.. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఇప్పటికే రూ.3,850 కోట్ల మేర టీడీపీ కూటమి సర్కార్ వ్యయం చేసింది. తాజాగా రూ.625.69 కోట్ల విలువైన పనులను సిండికేట్ అస్మదీయ కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్పీ కుంట, అన్నమయ్య జిల్లాలో గాలివీడు, పెదమండ్యం, చినమండ్యం, కేవీపల్లి మండలం అడవిపల్లి వరకూ హంద్రీ–నీవా రెండో దశ కాలువ 463 కి.మీ. నుంచి 554.175 కి.మీ. వరకూ మిగిలిపోయిన లైనింగ్, కాంక్రీట్ కట్టడాల నిర్మాణాల పనులకు జలవనరుల శాఖ శుక్రవారం టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువను రూ.511.66 కోట్లుగా నిర్ణయించింది. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.113.63 కోట్ల రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.625.29 కోట్లన్నమాట. పనుల పూర్తికి 18 నెలలు గడువు పెట్టింది. బిడ్ల దాఖలుకు ఈనెల 15 తుది గడువు. ఈనెల 19న ఆర్థిక బిడ్‌ను తెరిచి.. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఆమోదంతో టెండర్ ఖరారు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఐదు సంస్థలకే అర్హత...గతంలో హంద్రీ–నీవా లైనింగ్ పనులను ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టŠట్స్, సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్, బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రా, కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్, రంగరాజు ఎండీగా ఉన్న ఎన్సీసీ దక్కించుకున్నాయి. కాంట్రాక్టు ఒప్పందాన్ని తుంగలో తొక్కి.. రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్ క్రీటింగ్ (రాతి పొరకు ఇనుప జాలరీ అమర్చి సిమెంటు కాంక్రీట్ వేయడం) పద్ధతిలో కాకుండా, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ – ఇనుప మేకులతో కూడిన కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పిచికారి చేయడం) పద్ధతిలో మట్టి పొరకు చేశారు. అత్యంత నాసిరకంగా పనులు చేయడంతో 2025లో కాలువలో నీటి ప్రవాహానికే లైనింగ్ ఎక్కడికక్కడ దెబ్బతిని కొట్టుకుపోయింది. తాజాగా పిలిచిన టెండర్లలోనూ ఈ ఐదు సంస్థలే బిడ్లు దాఖలు చేసేలా నిబంధనలు రూపొందించారు. 2016–17 నుంచి 2025–26 వరకూ కాలువలో మట్టి తవ్వకం, గట్లు వేయడం, సిమెంటు కాంక్రీట్ లైనింగ్ చేయడం లాంటివి ఏదైనా ఒక ఏడాదిలో రూ.170.554 కోట్ల విలువైనవి పూర్తి చేసి ఉండాలని నిబంధన పెట్టారు. గత పదేళ్లలో ఏదైన ఒక ఏడాదిలో 14,84,552 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం, గట్లు వేసే పని.. 38,054 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్(పీసీసీ/వీఆర్‌సీసీ/ఆర్సీసీ), సిమెంట్ కాంక్రీట్ లైనింగ్/షార్ట్ క్రీటింగ్/ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పద్ధతిలో 5,05,263 చదరపు మీటర్ల పని చేసి ఉండాలని నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే.. ఆ ఐదు సంస్థల్లో ఒక సంస్థకు పనులు కట్టబెట్టడానికేనన్నది స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎస్ఎస్ఆర్ తుంగలోకి...బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్ (బీవోసీఈ) ఖరారు చేసి, ప్రభుత్వం ఆమోదించిన ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం మట్టి తవ్వకం పనులకు క్యూబిక్ మీటర్‌కు రూ.123.75.. కాలువ గట్లు (ఎంబాక్‌మెంట్) పనులకు క్యూబిక్ మీటర్‌కు 195.57 చెల్లించాలి. నిజానికి రెండో దశ ప్రధాన కాలువ 463 నుంచి 554.175 కిమీ వరకూ తవ్వకం పనులు 95 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి. కానీ.. 44,53,657 క్యూబిక్ మీటర్ల మట్టి పని, కాలువ గట్ల పని మిగిలి ఉన్నట్లు చూపారు. సగటున క్యూబిక్ మీటర్‌కు రూ.195.57లు చొప్పున వేసుకున్నా ఈ పనులకు రూ.87.10 కోట్లు వ్యయం అవుతుంది. కానీ.. ఆ పనులకు సగటున క్యూబిక్ మీటర్‌కు రూ.396.60 చొప్పున లెక్కగట్టి ఏకంగా రూ.176.62 కోట్లుగా టెండర్లో పేర్కొనడం గమనార్హం. అంటే.. మట్టి పనికి క్యూబిక్ మీటర్‌కు సగటున రూ.201.03 పెంచేసినట్లు స్పష్టమవుతోంది. తద్వారా మట్టి పనుల రూపంలోనే రూ.89.52 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేశారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇక కాంక్రీట్ కట్టడాలు, సిమెంటు కాంక్రీట్ లైనింగ్, షార్ట్ క్రీటింగ్, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పనుల అంచనా వ్యయాన్ని కూడా ఇదే రీతిలో పెంచేశారు. గతంలోలానే సిండికేటు కాంట్రాక్టు సంస్థల్లో ఒక సంస్థకు అధిక ధరలకు పనులు కట్టబెట్టి.. అత్యంత నాసిరకంగా చేపట్టి నీకింత నాకింత అంటూ ప్రజాధనాన్ని దోచుకుతినేందుకు ముఖ్యనేత సిద్ధమయ్యారని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. -
10 నెలల కంపెనీకి.. ఫ్రీగా 40 ఎకరాల భూమి
సాక్షి, అమరావతి: ఆ కంపెనీ పుట్టి పట్టుమని పది నెలలే అయింది. దాని ప్రమోటర్లకు ఫుడ్ ప్రాసెసింగ్లోగానీ ఫుడ్ పార్కుల నిర్మాణంలోగానీ ఎలాంటి అనుభవంలేదు. రూ.9 లక్షలతో కంపెనీ పెట్టి రూ.1,388.14 కోట్లతో ఫుడ్ పార్కును ఏర్పాటుచేస్తున్నామంటూ దరఖాస్తు చేసుకున్నారో లేదో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద 40 ఎకరాల భూమిని ఉచితంగా ధారాదత్తం చేసేసింది. అంతేకాదు.. పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద రూ.592.22 కోట్లు వెనక్కి ఇచ్చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉర్సా.. ఇండిచిప్.. అజాద్ మొబిలిటీ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేవాక్స్ అగ్రిటెక్ ఇండియాకి భారీ ప్రయోజనాలను చేకూరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది.ఎలాంటి అనుభవం లేకపోయినా..విశాఖ కేంద్రంగా 2025 నవంబర్ 20న రూ.9 లక్షల మూలధనంతో రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా పేరిట దేవిప్రసాద్ ముల్లూరు, కీర్తి వినాయక్ కంభంలు కలిసి కంపెనీని ఏర్పాటుచేశారు. వీరిద్దరికీ అప్పటివరకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోగానీ, ఫుడ్ పార్కులు, ఇతర నిర్మాణ రంగ కార్యకలాపాల్లోగానీ ఎలాంటి అనుభవంలేదు. విశాఖలో ఉన్న వీరు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కైగల్ గ్రామంలో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కి చెందిన 40.50 ఎకరాల్లో రూ.1,388.14 కోట్లతో ఫుడ్‌పార్క్ ఏర్పాటుచేస్తామంటూ ప్రతిపాదన పంపగానే 99 పైసలు కూడా తీసుకోకుండానే ఉచితంగా భూమి కేటాయించడమే కాక భారీ రాయితీలు ఇవ్వడంపై అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 2025 నవంబర్ 20న రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా కంపెనీ రిజిస్టర్ అయినట్లు స్పష్టం చేస్తున్న కాపీ ఈ ఇద్దరు డైరెక్టర్లలో దేవిప్రసాద్ అనే వ్యక్తికి ఇంతవరకు వ్యాపార రంగంలో ఎలాంటి అనుభవంలేదు. మరో డైరెక్టర్ కీర్తి వినాయక్‌కు మాత్రం గ్లౌజులు వంటి వైద్య సంబంధిత వస్తువులను ఈజీఐఎస్ గ్లోవ్స్ పేరిట ఉత్పత్తి చేసిన అనుభవం ఉంది. అలాగే, పెటోరస్ కెమికల్స్‌తో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌లో సత్రా లాబ్స్ ఇండియా పేరిట మరో కంపెనీని స్థాపించారు. ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనుభవంలేని వారికి పాలసీకి విరుద్ధంగా> ఉచితంగా భూమిని ఇవ్వడం వెనుక ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న వారు చక్రం తిప్పారంటూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా కంపెనీకి చిత్తూరు జిల్లాలో ఉచితంగా 40.5 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 259 ప్రోత్సాహకాల రూపంలో భారీ మొత్తం వెనక్కి..పండ్ల రసాలు, కెచప్‌లు, జ్యూస్, జామ్‌లు, ఇతర స్పైసెస్ పదార్థాలు తయారుచేసే విధంగా రూ.1,388.14 కోట్ల పెట్టుబడితో ఫుడ్ పార్కును ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వానికి రేవాక్స్ ప్రతిపాదనలను పంపింది. వీటిని పరిశీలించిన తర్వాత వాస్తవ పెట్టుబడి విలువలో రూ.592.22 కోట్ల ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో క్యాపిటల్ సబ్సిడీ రూపంలో రూ.272.64 కోట్లు, విద్యుత్ సబ్సిడీల రూపంలో రూ.37.20 కోట్లు, జీఎస్టీ మినహాయింపుల కింద రూ.280.83 కోట్లు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి ఏప్రిల్, 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. -
సీమను ఆయనే ఉద్ధరించారంట.. బాబు కాకమ్మ కథలు!
సాక్షి, అమరావతి : బడ్జెట్లో రూపాయి కేటాయించకుండానే.. రూ.లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతానంటూ చంద్రబాబు మాటల విన్యాసాలు చూసి రాయలసీమ వాసులు నివ్వెరపోతున్నారు. అబ్రకదబ్ర.. చూమంత్రకాళీ అంటూ ఇంద్రజాలికుల మాదిరిగా పైసాలేకుండానే మదనపల్లిలో శంకుస్థాపన హంగామా చేసిన చంద్రబాబు కళ్లార్పకుండా నిస్సిగ్గుగా మాట్లాడిన తీరుచూసి రాష్ట్ర ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.ఈ రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెడుతుందో చెప్పని చంద్రబాబు.. కేంద్రం రూ.40 వేల కోట్లు పెడుతుందని, ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్లు పెట్టుబడులొస్తున్నాయని గొప్పలు చెప్పారు. కానీ, ఇదే సభలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.40 వేల కోట్లు ఇస్తున్నట్లుగా చెప్పకపోవడం కొసమెరుపు. దీంతో.. చంద్రబాబు ఏ స్థాయిలో ప్రజలను మభ్యపెడుతున్నారో ఇట్టే అర్ధమవుతుంది. ఈ అసత్య హరిశ్చంద్రుడు ఇంకా ఏఏ అబద్ధాలు చెప్పారంటే.. రాయలసీమను ఉద్యాన సీమగా తీర్చిదిద్దింది ఆయనేనట!.. రాయలసీమను ఉద్యాన సీమగా మార్చేందుకు ఆద్యుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్. ఈ విషయం సీమలోని ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తే ఈరోజు రాయలసీమలో ఉద్యాన పంటల సాగుకు ఊతమిచ్చింది. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ బోర్లలో మూడొంతులు రాయలసీమలోనే ఉన్నాయి. 90 శాతం సబ్సిడీపై బిందు, తుంపర పరికరాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సూక్ష్మ, సాగునీటి వ్యవస్థతో ఉద్యాన పంటలకు ఊతమిచ్చిందీ వైఎస్సారే. ఈ వాస్తవాలను కప్పిపుచ్చుతూ ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్‌తో కరువు సీమ రూపురేఖలు మార్చేశానంటూ చంద్రబాబు తెగ డబ్బా కొట్టుకున్నారు. పైగా.. మైక్రో ఇరిగేషన్ పాలసీని తీసుకొచ్చానంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లెవేశారు. ‘సీమ’లో సాగునీటి ప్రాజెక్టులన్నీ ఆయన గొప్పతనమేనట.. ‘ఎన్టీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాం. రూ.3,500 కోట్లతో అతిపెద్ద లిఫ్ట్ హంద్రీ–నీవా ద్వారా కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లాం. వెలిగొండ ఫేజ్–1 ప్రారంభించాం. హంద్రీ–నీవా నుంచి నీళ్లులేకపోతే మదనపల్లి పూర్తిగా ఎప్పుడో వలస పోయేది’.. అంటూ చంద్రబాబు నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చారు. వాస్తవానికి.. జలయజ్ఞం కింద పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు తీసుకెళ్లడమే కాదు.. గాలేరు–నగరిలో అంతర్భాగమైన గోరుకల్లు, అవుకు, గండికోట, మైలవరం, సర్వారాయ సాగర్, వామికొండ రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు, హంద్రీ–నీవాలో జీడిపల్లితో పాటు మరో ఆరు రిజర్వాయర్లు నిర్మించి సీమను సస్యశ్యామలం చేసేందుకు బాటలు వేసిన ఘనత డాక్టర్ వైఎస్సార్‌దే. అయినాసరే చంద్రబాబు ఎలాంటి సిగ్గులేకుండా సీమలో ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే చేపట్టి పూర్తిచేసినట్లు చెప్పుకొచ్చారు. సీమ రూపురేఖలు మార్చేశారంట.. ఇక తలసరి ఆదాయంలో రాయలసీమ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చంద్రబాబు మరో ఘోరమైన అబద్ధం చెప్పారు. పైగా.. ఒకప్పుడు సీమలో ఎడారి ఛాయలుండేవని, కరువుతో పెద్ద సంఖ్యలో వలస పోతుండేవారని, పంటలకు నీళ్లుండేవి కావని, పశువులకు మేత ఉండేది కాదని.. కూలీలకు ఉపాధి దొరికేది కాదని చెబుతూ.. ఇప్పుడు తన కృషివల్లే రాయలసీమ రూపురేఖలు మారిపోయాయంటూ నోటికొచ్చినట్లు డబ్బాకొట్టుకున్నారు. నిజంగా.. తలసరి ఆదాయంలో నెం.1గా ఉంటే, కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమను వదిలి ఈ ఏడాది లక్షలాది కుటుంబాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ఎందుకు వలస పోతున్నారంటూ సీమ వాసులు ప్రశ్నిస్తున్నారు. -
‘సర్’లో భారీగా అక్రమాలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఏకంగా 13 కోట్లమంది ఓటర్ల పేర్లు తొలగించారని చెప్పారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోపభూయిష్టంగా సాగుతున్న ఈ సర్ ప్రక్రియను నిలిపివేయాలని, ఎన్నికల కమిషన్ పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా శుక్రవారం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు మాట్లాడారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సర్ ప్రక్రియలో లోటుపాట్లను తమ పార్టీ పలుమార్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలిపినట్లు చెప్పారు. 2023లో తెచ్చిన ఎన్నికల చట్టం, ఎంపిక కమిటీ నుంచి ప్రధాన న్యాయమూర్తిని తొలగించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదట స్పందించి ట్వీట్ చేశారని, ఈ చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని ౖవైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో కోరారని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు, ఫారం–6 ప్రక్రియపై అధికారులు శ్రద్ధ పెట్టకుండా నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ..సీఈసీ జ్ఞానేష్ కుమార్ బీజేపీ ఏజెంట్ అని డాక్యుమెంటరీతో రుజువైందని చెప్పారు. సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫారం–6 పేరుతో కొత్త ఓటర్లను, యువతను ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రెండున్నర లక్షలమంది కొత్త ఓటర్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. బీజేపీ తొత్తుగా మారి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. మాజీ ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్,ఆంధ్ర మేథావుల ఫోరం కనీ్వనర్ చలసాని శ్రీనివాస్, జెన్‌జెడ్ ప్రతినిధి మేఘనారెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర నాయకులు డి.రమాదేవి, వై.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు నరహరిశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ, వామపక్ష పార్టీల నేతలు చిట్టిపాటి, రవీంద్ర, జాస్తి కిషోర్‌బాబు, హరినాథ్, గణేష్ , సి.భాస్కరరావు మాట్లాడారు. -
శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఐదుగురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్(టీసీడీ శేఖర్), జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరి హరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు సోమవారం ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో నిర్వహించనున్న కార్యక్రమంలో వారితో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయిస్తారు. జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్ 2024 అక్టోబర్ 28న, జస్టిస్ అవధానం హరి హరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 2025 జనవరి 24న హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని గత నెల 23న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసింది. -
సర్కారుపై ఉద్యోగుల సత్యాగ్రహం
చంద్రబాబు సర్కారుపై ఉద్యోగులు నిరసన గళమెత్తారు. గాంధీ జయంతి రోజున రోడ్డెక్కి శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు. గాంధేయమే గాండీవమని నినదించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని గర్జించారు. ఐఆర్, పీఆర్సీ, ఐదు డీఏలు, 40వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు మాటేమిటని నిలదీశారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, జీవో నంబర్ 11 రద్దు తదితర అంశాలపై ధ్వజమెత్తారు. సమస్యలపై జాతిపిత విగ్రహాలకు విన్నపాలు నివేదించారు. సర్కారుకు సద్బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. – సాక్షి, అమరావతిమహాత్మా.. మా మొర వినుమా.. ఓ మహాత్మ మా మొర వినుమా అంటూ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహాల ఎదుట గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసనలు తెలిపారు. ‘ప్రజలకు సేవ చేయాల్సిన మేమే మా హక్కుల కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది. మా సమస్యలు వినాలని కోరుతున్నాం’ అంటూ గాంధీ విగ్రహాల ఎదుట వినతిపత్రాలు ఉంచారు. ఈ పాలకుల మనసులు మార్చి మా కష్టాలు కడతేర్చు జాతిపితా అంటూ వేడుకున్నారు. గాం«దీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల గుమ్మం వద్దకు సేవలందిస్తున్న తమపట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. ఒకవైపు ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తూ.. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తమపట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తే కేసులా? తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిర్వహించిన ‘చలో విజయవాడ’లో పాల్గొన్న ఉద్యోగులను సస్పెండ్ చేయడం, 46 మందిపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ట అని ఐక్యవేదిక నేతలు దుర్గం మధులత, కేవీ రాజేష్‌బాబు మండిపడ్డారు. స్వాతంత్య్ర సాధన కోసం గాం«దీజీ ఎంచుకున్న శాంతియుత మార్గంలోనే నిరసనలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో కదలిక రావాలని, తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో చిత్తశుద్ధితో ముందుకు రావాలన్నారు. గతంలో ఉపాధ్యాయులకు ఇచ్చినట్లుగానే సచివాలయ ఉద్యోగులకు కూడా రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయాలని, ప్రొబేషన్ ఆలస్యమైన తొమ్మిది నెలల కాలానికి చెందిన బకాయిలు చెల్లించడంతో పాటు అదనంగా వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు కనీస వేతన పరిరక్షణ కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తాము ఇదే రీతిలో శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఆందోళనల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో పాటు ఏపీ మహిళా పోలీసు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, వ్యవసాయ, ఉద్యాన, పశు సవంర్థక, మత్స్య సహాయకుల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలకు నాయకత్వం వహించారు. డీఏ బకాయిల కోసం డిమాండ్ డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీస్ఈఏ)పోరాటానికి దిగింది. గాంధీ జయంతి రోజైన శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్‌లో సీపీఎస్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, ఇతర నాయకులు దీక్షలో కూర్చున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. 48 గంటల నిరశన దీక్షకు సిద్ధపడిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం భారీ వర్షం కురిసి టెంట్లు చెల్లాచెదురు కావడంతో దీక్షాపరులతో బలవంతంగా దీక్ష విరమింపజేశారు. సీపీఎస్ ఉద్యోగుల ఉద్యమానికి పలు సంఘాలు మద్దతు తెలిపాయి. జాతిపితా.. సర్కారుకు సద్బుద్ధి ప్రసాదించు ఇచి్చన హామీలు అమలు చేయని చంద్రబాబు సర్కారుపై అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. గాంధీజీ విగ్రహాల వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హామీలు అమలుచేసేలా బాబు ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న తమకు కనీస వేతనాలు పెంచకపోవడం ఎంతవరకు సమంజసమని నిరసించారు. తమకు ప్రభుత్వం సామాజిక పెన్షన్లు, సంక్షేమ పథకాలు కూడా అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సామాజిక పింఛన్లు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, కనీస వేతనాలు అందించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సర్కారు స్పందించకుంటే గాంధేయమార్గంలో మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ మూడు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఐదో రోజుకు చేరిన ‘పార్ట్‌టైమ్ ఉద్యోగుల’ మహా ధర్నాపెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ వర్షంలోనూ కొనసాగిన నిరసన మధురానగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లు, లెక్చరర్లు, సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న మహాధర్నా శుక్రవారం ఐదో రోజుకు చేరింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు మహా ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్ట్‌టైమ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పడంతోనే ఈ మహా ధర్నా చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం దారుణమన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ధర్నాకు న్యాయవాది, జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామకృష్ణ, విశ్వ కళా మండలి రాష్ట్ర అధ్యక్షుడు కుటుంబరావు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు తదితరులు మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి విశాఖలో సత్యాగ్రహ దీక్ష బీచ్‌రోడ్డు: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వందలాది మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ఏపీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర గౌరవ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంపై చంద్రబాబు ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే రాష్ట్రంలోని మూడు లక్షల మంది ఉద్యోగులు అసెంబ్లీకి తరలివస్తారని హెచ్చరించారు.ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగులకు కనీసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు (నాని) మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగులతో సదస్సులు నిర్వహిస్తామని, అక్టోబర్ 4న రాజమహేంద్రవరంలో ‘గోదావరి జిల్లాల గర్జన’ నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీకాస్ ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి పి.వెంకటసుబ్బయ్య, సమగ్ర శిక్ష కేజీబీవీ రాష్ట్ర నాయకులు కె. విజయగౌరి, ఎన్హెచ్ఎం రాష్ట్ర జేఏసీ చైర్మన్ డి.దయాని, మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ నాయకుడు రాజు, అనకాపల్లి జిల్లా జేఏసీ నాయకుడు వీవీ శ్రీనివాసరావు, విశాఖ జిల్లా జేఏసీ నాయకుడు పి.మణి, సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డ్యూయల్ డ్రామా!
సాక్షి, అమరావతి: అపరిచితుడు సినిమాలో హీరో కాసేపు రెమోలా.. కాసేపు రామాచారిలా.. వ్యవహరిస్తూ పోలీసు అధికారులను ముప్పుతిప్పలు పెట్టడం చూశాం. అచ్చు అలానే బీసీ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అపరిచితుడి అవతారం చూసి అధికారులు విస్తుపోతున్నారు. చెల్లవని తెలిసీ బీసీలను బుట్టలో వేయడానికి రిజర్వేషన్ల కోసం జీవోలిస్తారు.. దానిపై కోర్టు విచారణ జరుపుతుండగానే అధికారులను ఎన్నికలకు సన్నాహాలు చేయమంటారు.. కలెక్టర్ల మీటింగులు పెట్టి ఎన్నికల ఏర్పాట్లపై గంటల తరబడి చర్చిస్తారు. కోర్టు కొట్టేయగానే మొసలి కన్నీరు కారుస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేద్దామని బీసీలకు గంభీరంగా చెబుతారు.ఓహో నిజంగానే సీఎంగారు సుప్రీంకోర్టుతో కొట్లాడతారు కాబోలనుకుని అధికారులు అనుకుంటే.. కోర్టులెలాగూ కొట్టేస్తాయి.. పాత రిజర్వేషన్ ప్రకారమే సీట్లు ఖరారు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని అధికారులకు హకుం జారీ చేస్తారు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ ముఖ్యనేతలకూ సంకేతాలిస్తారు.. బీసీలతో అలా.. అధికారులతో ఇలా.. చంద్రబాబు డ్యూయల్ డ్రామా నడిపిస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో మాట్లాడి పార్లమెంటులో చట్టసవరణ కోసం పట్టుబట్టేవారు. టీడీపీ బలంపై కేంద్రం ఆధారపడి నడుస్తున్నందున ఇపుడు చంద్రబాబు తలుచుకుంటే అది చాలా సులువు. కానీ బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదనేది సుస్పష్టం.ఇంకా ఆగని బాబు నాటకాలు..బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు మొదలెట్టిన డ్రామా రక్తికట్టకపోవడంతో తన నట కౌశలాన్ని మరింత పెంచి ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది కోసం జీఓలు ఇచ్చి భంగపడ్డారు. ఒకవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని చెబుతూనే.. మరోవైపు శనివారంలోపు స్థానిక సంస్థలకు 34శాతం రిజర్వేషన్లు ఖరారు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఆయన డ్రామాలకు పరాకాష్ట. ఇప్పటికే రిజర్వేషన్ల హామీ.. కమిషన్ ఏర్పాటు.. జీఓలు వంటి విషయాల్లో బీసీను నమ్మించి వెన్నుపోటు పొడిచారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేవనే కారణంతో చంద్రబాబు ఇచ్చిన రెండు జీఓలను హైకోర్టు కొటేసిన విషయం విదితమే. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామంటూ చంద్రబాబు చెప్పడంతోపాటు మంత్రులతోను చెప్పిస్తున్నారు. వాస్తవానికి రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని తెలిసినా చంద్రబాబు డ్రామా ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం రిజర్వేషన్లు 61శాతం అవుతాయని, సుప్రీం కోర్టుకు వెళ్లినా చెల్లదని సామాన్యులకు సైతం అర్థమవుతోంది. అయినప్పటికీ తానేదో బీసీల కోసం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ.. డ్రామాను రక్తికట్టించేందుకు బాబు తెగ తాపత్రయ పడుతున్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్ పరిమితి పెంచుకునేలా చట్ట సవరణ చేయాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.బీసీ రిజర్వేషన్లపై మొదటి నుంచి నాటకాలే..ఎన్నికల ముందు హామీల్వివ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబు నైజం. హామీలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు డ్రామాలు ఆడటంలో ఆయనకు ఎవరూ సాటిరారు. బీసీ రిజర్వేషన్ల అమలులోను చంద్రబాబు అనేక డ్రామాలాడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకున్నట్టుగా కనిపించడానికి రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ హైకోర్టుకు సమర్పించిన వాదనలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా రాష్ట్రంలో బీసీల జనాభా 50.42 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 34 శాతం రిజర్వేషన్ నిర్ణయానికి ఈ సమకాలీన గణాంకాలతోపాటు మిశ్రా కమిషన్ అధ్యయనం కూడా ఆధారమని తెలిపింది. ఇదే సమయంలో మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇంకా పరిశీలిస్తోందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలపడం గమనార్హం. అలాంటప్పుడు ఆ నివేదికలోని గణాంకాలను ఆధారంగా చేసుకుని 34 శాతం బీసీ రిజర్వేషన్ ఎలా నిర్ణయించారనే ప్రశ్న ఉత్పన్నమైంది. నివేదిక ఇంకా తుది ఆమోదం పొందకపోతే దాని ఆధారంగా ప్రభుత్వం జీవోలు ఎలా జారీ చేసిందని ధర్మాసనం ప్రశ్నించింది. నివేదికను బహిరంగపరచకపోవడానికి కారణమేంటని కూడా కోర్టు ప్రశ్నించడం గమనార్హం.నాడు టీడీపీ నేతతో కేసు వేయించిన చంద్రబాబు..నిజానికి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు టీడీపీ నేతతోనే చంద్రబాబు హైకోర్టులో కేసు వేయించారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్ జీఓ ఇవ్వడంతో టీడీపీకి చెందిన బిర్రు ప్రతాపరెడ్డితో చంద్రబాబు హైకోర్టులో కేసు వేయించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యహరించిన ప్రతాపరెడ్డి 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఓ నామినేటెడ్ పోస్టు కూడా అనుభవించారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఓసీలకు అవకాశాలు తగ్గిపోతాయని, ఇది సుప్రీం కోర్టు విధించిన 50శాతం కోటాకు విరుద్ధమని ప్రతాపరెడ్డి చేత చంద్రబాబు హైకోర్టులో కేసు వేయించారు. దీన్ని విచారించిన హైకోర్టు వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీఓను రద్దు చేస్తూ 2020 మార్చి 2న తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే 2021లో నిర్వహించిన గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోను బీసీ అభ్యర్థులను నిలబెట్టి 34శాతం రిజర్వేషన్లకు మించి పదవులు కట్టబెట్టిన వైఎస్ జగన్.. అలా బీసీల పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.బీసీలను మోసం చేయడానికే.. బాబు డ్రామాలు..!సుప్రీం కోర్టు మార్గదర్శకాలు.. 2020లో హైకోర్టు తీర్పు అన్నీ తెలిసిన చంద్రబాబు మళ్లీ బీసీ రిజర్వేషన్ల పేరుతో హంగామా చేయడం మోసం చేయడానికేనని బీసీ నేతలు మండిపడుతున్నారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో మూడు కీలక దశలు(ట్రిపుల్ టెస్ట్)ను నిర్ధేశించింది. బీసీల స్థానిక వెనుకబాటుతనంపై సమకాలీన, కఠినమైన అనుభావిక అధ్యయనం చేసే ప్రత్యేక కమిషన్ ఉండాలి. కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఏ స్థానిక సంస్థలో ఎంత రిజర్వేషన్ అవసరమో నిర్ణయించాలి. ఒకే శాతం మొత్తంగా వర్తింపజేయడం కాకుండా స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలన్నదే సుప్రీంకోర్టు నిర్దేశించిన విధానం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఈ మూడు దశలను పూర్తి చేసిన తర్వాతే బీసీ రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇవన్నీ తెల్సినా.. తెలియనట్టు నటిస్తూ.. కమిషన్ వేసిన చంద్రబాబు దాన్ని గడువును సుదీర్ఘంగా పొడిగించి చివరకు పూర్తిస్థాయి నివేదిక ఆమోదించకుండానే జీఓలు ఇచ్చి న్యాయపరంగా నిలబడకుండా చేసి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. ఈ ప్రశ్నలకు బదులేది బాబూ..» 34 శాతం బీసీ రిజర్వేషన్‌కు ఖచ్చితమైన గణాంక ప్రాతిపదికపై స్పష్టత ఏది?» రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పూర్తి నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిరంగపరచలేదు?» నివేదిక ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉంటే దాని ఆధారంగా 34 శాతం నిర్ణయం ఎలా తీసుకున్నారు?» యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలోని బీసీ గణాంకాలను పూర్తిగా ఎందుకు ప్రజల్లోకి తీసుకురాలేదు?» మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటితే దానికి ప్రభుత్వం చూపుతున్న రాజ్యాంగ, న్యాయపరమైన ఆధారం ఏమిటి?» 2020లో 34 శాతం బీసీ రిజర్వేషన్‌పై వచ్చిన కోర్టు తీర్పుల నేపథ్యంలో ప్రస్తుత విధానంలో కొత్తగా వచ్చిన చట్టపరమైన రక్షణ ఏమిటి?కాపులను ఇలానే దగా చేసిన చంద్రబాబు..రిజర్వేషన్ల పేరుతో ఇప్పుడు బీసీలను మోసం చేసిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ల అమలుకు హామీ ఇచ్చి దగా చేసిన విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. 2014లో కాపులకు రిజర్వేషన్ అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ అమలు కోసం కాపు సామాజికవర్గం వత్తిడి పెంచడంతో 2016లో మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. మంజునాథ్ కమిషన్ పూర్తి రిపోర్టు బహిర్గతం చేయకుండానే హడావుడిగా అసెంబ్లీలో పెట్టి 2017లో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టు బిల్లు తెచ్చారు. దీంతో మళ్లీ 50శాతం పరిమితికి మించిన కోటాపై న్యాయపరమైన అడ్డంకులు తప్పలేదు. 2019 ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇస్తున్నట్టు ప్రకటించిన చంద్రబాబు వాటిని కూడా సక్రమంగా అమలు చేయలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం 2014లో కాపులకు, దశాబ్ధం తర్వాత 2024లో బీసీలకు రిజర్వేషన్ హామీలతో మోసం చేసిన ఘనత చంద్రబాబుది. -
కరువు వేళ ఈవెంట్లు కాదు.. రైతులను ఆదుకోండి..
సాక్షి, తాడేపల్లి: రాయలసీమ తీవ్ర కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు ఈవెంట్లతో కాలం గడుపుతున్నారని.. ‘రైజింగ్ రాయలసీమ’ ఈవెంట్లు ఎవరి కోసం? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుకు కావాల్సింది ఈవెంట్లు, పబ్లిసిటీ కాదు.. కష్టకాలంలో ప్రభుత్వ భరోసా. రైతులకు తక్షణమే రుణాల రీ షెడ్యూల్, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందించాలి’’ అని డిమాండ్ చేశారు.‘‘కేవలం 388 మండలాలకే కరువు పరిమితం చేయడం అన్యాయం. వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హమైన అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. జూన్ నుంచే వర్షాభావ పరిస్థితులు ఉన్నా సెప్టెంబరు చివరి వరకు కరువు ప్రణాళిక ఎందుకు సిద్ధం చేయలేదు?. వేల ఎకరాల్లో చీనీ సహా పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. రైతులు లక్షలు ఖర్చుపెట్టి కొత్త బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టమోటా, అరటి, బత్తాయి, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఈ రెండేళ్లలో ఉద్యాన రంగానికి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే ఇప్పుడు ‘హబ్‌లు ఏర్పాటు చేస్తాం’ అంటూ కొత్త ప్రకటనలు చేయడం వల్ల రైతుకు తక్షణ ప్రయోజనం ఏమిటి?. గతంలో అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని ప్రచారం చేశారు. ప్రకటించిన వాటిలో ఎన్ని ప్రాజెక్టులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయో ప్రభుత్వం చెప్పాలి. చంద్రబాబును ‘వాటర్ మ్యాన్’ అని పొగిడే వారు ఒక్కసారి రాయలసీమలో ఎండిపోయిన పొలాలు, రైతుల కష్టాలను చూడాలి. విశాఖకు తన ప్రార్థనల వల్లే వర్షం వచ్చిందని చంద్రబాబు చెప్పుకున్నారు. అదే నిజమైతే నాలుగు నెలల ముందే ప్రార్థించి కరువును ఎందుకు నివారించలేకపోయారు?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఇప్పుడు ‘రోడ్డు డాక్టర్లు’ అంటున్నారు.. ముందు ‘కరువు డాక్టర్లను’ తీసుకొచ్చి రైతులను దుర్భిక్షం నుంచి బయటపడేయండి. ఈవెంట్లతో కరువు పోదు.. పబ్లిసిటీతో రైతు కష్టాలు తీరవు. ‘రైజింగ్ రాయలసీమ’ అని పేరు పెట్టడం కాదు.. కరువుతో కుంగిపోతున్న రాయలసీమ రైతును కాపాడండి’’ అని కన్నబాబు హితవు పలికారు.‘‘మదనపల్లెలో సీఎం చంద్రబాబు మొదలుకాని సినిమాకే విజయోత్సవ సభ నిర్వహించారు. ప్రచారం తప్ప పని చేయకుండా తనకు తానే డబ్బా కొట్టుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం. మదనపల్లెలో ప్రకటించింది లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ కాదు... లక్ష అబద్ధాల ప్రభుత్వం. పంటలు, తోటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే హార్టికల్చర్ హబ్ పేరిట సంబరాలు జరుపుతారా?. వ్యవసాయాన్ని గబ్బు పట్టించి, ఇప్పుడు హబ్లంటూ సరికొత్త విన్యాసాలు చేస్తున్నారు...గతంలో అమరావతికి హైపర్‌లూప్, బుల్లెట్ ట్రైన్, మెట్రో, సీ-ప్లేన్ అన్నట్లే ఇదీ ఒక పిట్టల దొర కథ. లాక్‌హీడ్ ప్లాంట్, సౌదీ అరాంకో, ఎయిర్‌బస్, అలీబాబా డేటా సెంటర్ తరహాలోనే ఈ హబ్ ప్రచారం కూడా గాల్లో కలిసిపోతుంది. రోజూ మాటలు, ఈవెంట్లతో ప్రజలను మభ్యపెట్టడమే కూటమి ప్రభుత్వ నైజం. 2026-27 బడ్జెట్లో హార్టికల్చర్ శాఖకు కేటాయించింది కేవలం రూ. 1,123 కోట్లే. లక్ష కోట్ల ప్రాజెక్టు అని ప్రచారం చేసుకుంటున్న హబ్‌కు బడ్జెట్లో పెట్టింది కేవలం రూ. 200 కోట్లా?. హబ్‌లో రూ. 60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు ఎవరు పెడుతున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’’ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: బాబు కుట్రలను దీటుగా ఎదుర్కొందాం -
క్రీడాకారిణి బొల్లు లిఖితకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: క్రీడాకారిణి బొల్లు లిఖితకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలవటంపై హర్షం వ్యక్తం చేశారు. గుంటూరుకు చెందిన లిఖిత అంతర్జాతీయ వేదికపై సత్తా చాటటం.. దేశానికి బంగారు పతకం అందించడం గర్వకారణం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.లిఖిత విజయానికి అండగా నిలిచిన ఆమె కుటుంబ సభ్యులు, కోచ్‌ల ప్రోత్సాహం అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి.. దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: చికిత ‘గోల్డెన్’ ధమాకా.. తెర వెనక సైలెంట్ హీరో!Congratulations to Bollu Likhitha on winning the gold medal in the 76 kg category at the Commonwealth Powerlifting Championships in Winnipeg, Canada! It’s a proud moment to see a young woman from Guntur win gold for India. The encouragement and support of your family and coaches are truly appreciable. Wishing you continued success, Likhitha!— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2026 -
అక్రమ మైనింగ్ సూత్రధారులను వదిలేస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అక్రమ మైనింగ్‌ను నిరాటంకంగా అనుమతిస్తున్నట్లు ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అందుకే అక్రమ మైనింగ్‌కు అడ్డేలేకుండా పోతోందని మండిపడింది. కనీస స్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదంది. అక్రమ మైనింగ్ తద్వారా తవ్వితీసిన వాటిని రవాణా చేస్తున్న వాహనాల డ్రైవర్లను, సూపర్వైజర్లపై కేసులు పెడుతూ, సూత్రధారులను మాత్రం వదిలేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. శాఖల మధ్య సమన్వయం కూడా ఉండటం లేదని స్పష్టం చేసింది.అధికారులు తమ బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారని, దీంతో అడ్డులేకుండా అక్రమ మైనింగ్ సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్దారులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయకపోవడం వల్లే అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోందని తేల్చి చెప్పింది. దీంతో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్లు వరదలా దాఖలవుతున్నాయంది.అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు కార్యాచరణను సిద్ధం చేయాలంది. సమగ్ర అఫిడవిట్ దాఖలుకు ఆదేశాలిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.ధర్మాసనం ముందు శాటిలైట్ ఫొటోలుబాపట్ల జిల్లా, చీరాల మండలం, కవురివారిపాలెం గ్రామ పరిధిలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీని వెనుక పెద్ద తలకాయలున్నాయని, దీంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఆమంచి తరఫున న్యాయవాది ఎన్.రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ, ఇసుక అక్రమ మైనింగ్ జరిగిన తీరుపై శాటిలైట్ ఫొటోలను ధర్మాసనం ముందుంచారు.2022లో ఎలాంటి తవ్వకాలు జరగని ప్రాంతాన్ని, ఇప్పుడు భారీ ఇసుక తవ్వకాలవల్ల అతిపెద్ద గుంతలు ఏర్పడిన ప్రాంతాన్ని పోల్చి ధర్మాసనానికి వివరించారు. 2024 చివరిలో మొదలైన ఇసుక అక్రమ మైనింగ్ 2026లో పరాకాష్టకు చేరుకుందని తెలిపారు. రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, రోజూ 200 లారీల్లో తవ్వితీసిన ఇసుకను తరలిస్తున్నారని ఆయన వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ‘ఎలాంటి అక్రమ మైనింగ్ జరగలేదని గత విచారణ సమయంలో చెప్పారుగా..’ అని ప్రభుత్వ న్యాయవాది (మైన్స్) సాయివిహారిని ప్రశ్నించింది. హెల్ప్‌లైన్ ఉండి ప్రయోజనం ఏమిటి?అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటుచేయండి అని ధర్మాసనం చెబుతుండగా, ఇప్పటికే ఉందని ప్రభుత్వ న్యాయవాది (మైన్స్) సాయివిహారి చెప్పారు. దీంతో ‘హెల్ప్‌లైన్ ఉండి ప్రయోజనం ఏముంది. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ఎన్నింటికి స్పందించారు?’ అని ధర్మాసనం నిలదీసింది.వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేస్తే ఉపేక్షించంఅక్రమ మైనింగ్‌ను నిలువరించేందుకు మార్గదర్శకాలు రూపొందించి, కఠిన విధానాలను అమల్లోకి తీసుకురావాలి. అక్రమ మైనింగ్ ఎక్కడ జరిగినా కూడా అందుకు అధికారులను బాధ్యులుగా చేస్తూ మార్గదర్శకాలు తేవాలి. అక్రమ మైనింగ్‌పై అన్నీ విభాగాల అధికారులు కూర్చొని, సమన్వయంతో పూర్తిస్థాయి అఫిడవిట్‌ను మా ముందుంచండి. అందరూ కలిసి ఒక అఫిడవిట్ కాకుండా, వేర్వేరుగా అఫిఢవిట్లు దాఖలు చేస్తే ఉపేక్షించేది లేదు. – సీజే ధర్మాసనంపోలీసుల నిఘా ఉన్నా.. సూత్రధారులు దొరకడం లేదా?ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని పోలీసులను ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. రాత్రి వేళల్లో నిఘా పెంచామని, పికెట్లు నిర్వహిస్తున్నామని హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది అడుసుమల్లి జయంతి తెలిపారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘పోలీసులు పనిచేస్తుంటే, అక్రమ మైనింగ్ సూత్రధారులు దొరకాలి కదా?’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కఠిన చర్యలు లేకపోవడంవల్లే ఇదంతా జరుగుతోందని తెలిపింది. -
12వ వేతన సవరణ కమిషనర్‌గా దినేష్‌కుమార్
సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన 27 నెలలు తరువాత 12వ వేతన సవరణ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వేతన సవరణ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఒక సంవత్సరంలోపు ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 12వ వేతన సవరణ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్సింగ్ను 2023లోనే నియమించింది.అయితే, 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనతో రాజీనామా చేయించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 27 నెలలపాటు కమిషనర్‌ను నియమించకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇదిలా ఉంటే.. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించడం, వాటిని పరిశీలించడం, సమాచారాన్ని సేకరించడం వంటి అంశాలకు సంబంధించి వేతన సవరణ కమిషన్ తన సొంత విధానాన్ని రూపొందించుకుంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, వేతన సవరణ కమిషన్ కోరినప్పుడు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు కమిషన్‌కు అవసరమైన సహకారాన్ని, సహాయాన్ని అందించాలని అందులో పేర్కొన్నారు. దినేష్‌కుమార్ నియామకానికి సంబంధించిన నిబంధనలు, షరతులు విడిగా జారీచేయనున్నట్లు తెలిపారు. -
బాబు కుట్రలను దీటుగా ఎదుర్కొందాం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొందామని వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు పాలనపై ఆగ్రహంతో ఉండటంతో స్థానిక ఎన్నికలను సజావుగా జరిపించే ఉద్దేశం ఆయనకు లేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ నేతలు, శ్రేణులు ధైర్యంగా నిలబడాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్తృత కసరత్తు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దౌర్జన్యాలను ఎదుర్కోవడంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు. జిల్లాలవారీగా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సుదీర్ఘంగా, సమగ్రంగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం, ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై నేతలతో విస్తృతంగా చర్చించారు. ఉత్సాహంగా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ జిల్లాల వారీగా సమీక్షించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తగిన అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉందని పార్టీ నేతలు వైఎస్ జగన్‌కు వివరించారు. వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పాలన, స్థానిక సమస్యలు తదితర అంశాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పలువురు నేతలు వివరించారు. ప్రజల మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే పార్టీదే విజయమని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపులు స్థానిక ఎన్నికల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు అధికార పార్టీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని పలువురు నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు వ్యవస్థ దుర్వినియోగం కొనసాగుతోందని, ఎన్నికల్లో పోటీకి అవసరమైన సర్టిఫికెట్ల జారీలో కూడా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వంపై నానాటికీ పెరుగుతున్న అసంతృప్తిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక విపక్షంపై దౌర్జన్యాలకు దిగుతున్నారని వివరించారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొందాంనేతల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్న వైఎస్ జగన్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను సాఫీగా జరిపించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని చెప్పారు. చంద్రబాబు మోసాలు, దౌర్జన్యాలు, స్కామ్‌లు, అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ప్రతి వర్గం కూడా చంద్రబాబు పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉందని, అందుకే స్థానిక ఎన్నికలను సజావుగా జరిపే ఆలోచన చంద్రబాబుకు లేదని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ శ్రేణులు ధైర్యంగా నిలబడాలని వైఎస్ జగన్ నేతలకు సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం సమన్వయంతో పని చేయాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో స్థానిక పరిస్థితులు, ప్రజాదరణ, పార్టీ పట్ల నిబద్ధత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక జరగాలని నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
AP: 388 మండలాల్లో కరువు
సాక్షి, అమరావతి: కరువు మండలాలపై ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచింది. వానల్లేక పొలాలు ఎండిపోతున్నా.. రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నా పట్టించుకోకుండా తీరిగ్గా స్పందించింది. రాష్ట్రంలో 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ గురువారం జీవో జారీ చేసింది. ఇందులో 283 మండలాల్లో తీవ్ర కరువు, 105 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్టు పేర్కొంది. ప్రకటించిన మండలాల్లో దాదాపు మూడొంతులు తీవ్ర కరువులోనే ఉన్నాయి. లోటు ఆగస్టులోనే స్పష్టం.. ప్రకటన అక్టోబర్‌లో.. కరువు అంచనాకు తీసుకున్న వర్షపాతం లెక్కలు ఆగస్టు 31తోనే ముగిసినా.. కరువు మండలాలను ప్రకటించడానికి నెల రోజుల సమయం తీసుకోవడం గమనార్హం. వర్షాభావ తీవ్రత ఆగస్టు నెలాఖరుకే స్పష్టమైంది. అయినా సర్కారు వెంటనే కదల్లేదు. కరువు ప్రతిపాదనలు పంపాలంటూ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సెప్టెంబర్ 18న మెమో పంపింది. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కరువు కమిటీ సెప్టెంబర్ 30న ఒక్క వర్చువల్ భేటీలో పరిశీలించి 21 జిల్లాల్లోని మండలాలను సిఫార్సు చేసింది. మర్నాడే జీవో ఇచ్చింది. నెలంతా నాన్చి, చివర్లో హడావుడిగా ప్రక్రియను ముగించారు. ఇదేనా ముందస్తు? మాన్యువల్ ప్రకారం ఖరీఫ్ కరువును అక్టోబర్ 31లోగా ప్రకటించాలని చెబుతున్న ప్రభుత్వం తాము ముందుగానే ప్రకటించామని చెప్పుకుంటోంది. దీనికి ముందస్తు కరువు ప్రకటన అని పేరు కూడా పెట్టింది. కానీ అక్టోబర్ 31 అనేది చివరి గడువు మాత్రమే. కరువు సూచికలు కనిపించిన వెంటనే ప్రకటించాల్సి ఉంటుంది. జూన్ నుంచి వానలు లేక మూడు నెలలుగా నష్టపోతున్న రైతులకు అక్టోబర్‌లో వచ్చిన ప్రకటన ముందస్తు ఎలా అవుతుందన్నది అసలు ప్రశ్న. ఆలస్యానికి మూల్యం రైతులదే కరువు ప్రకటన ఆలస్యమైతే దాని ఆధారంగా అందాల్సిన సాయం కూడా ఆలస్యమవుతుంది. రుణాల రీషెడ్యూల్, ఇన్పుట్ సబ్సిడీ, కేంద్రానికి నివేదిక, ఉపాధి హామీ అదనపు పనిదినాలు అన్నీ ఈ ప్రకటనతోనే ముడిపడి ఉన్నాయి. వర్షాభావం స్పష్టమైన వెంటనే ప్రకటించి ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాల సరఫరా వంటి చర్యలకు అవకాశం ఉండేదని రైతు సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ప్రకటన వచ్చినా సాయం మాటే లేదు నెల ఆలస్యంగా వచ్చిన జీవోలోనూ రైతుకు ఊరటనిచ్చే మాట లేదు. మండలాల జాబితా, గెజిట్ ప్రచురణ ఆదేశాలు తప్ప ఇన్పుట్ సబ్సిడీ ఎంత, ఎప్పుడు, పంట నష్టం అంచనా ఎప్పటిలోగా, రుణాల రీషెడ్యూల్, వడ్డీ మాఫీ, కేంద్ర సాయం కోసం నివేదిక, పశుగ్రాసం, తాగునీటి ఏర్పాట్లు వంటి ఏ ఒక్కదానిపైనా స్పష్టత ఇవ్వలేదు. ప్రకటనకే నెల పడితే, సాయానికి ఇంకెన్ని నెలలు పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ, ప్రకాశంలో మరీ దారుణం తీవ్ర కరువు మండలాలు అత్యధికంగా రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల్లోనే ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 28, అనంతపురంలో 27, నంద్యాలలో 26, అన్నమయ్యలో 25, చిత్తూరులో 24, మార్కాపురంలో 19, ప్రకాశంలో 18, కర్నూలులో 15, వైఎస్సార్ కడపలో 14 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో 22 మండలాలు తీవ్ర కరువులో ఉన్నాయి. కుప్పం.. అమరావతిలోనూ కరువే సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం తీవ్ర కరువు జాబితాలో ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రకటించిన 24 మండలాలూ తీవ్ర కరువులో ఉన్నవే. రాజధాని అమరావతి ప్రాంతమైన తుళ్లూరు మండలం కూడా తీవ్ర కరువు జాబితాలో ఉంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం మధ్యస్థ కరువులో ఉంది. డెల్టా శివారు భూములకూ దెబ్బ సాగునీటికి కొదవలేదనుకునే కృష్ణా డెల్టా సైతం కరువు జాబితాలో చేరింది. కృష్ణా జిల్లాలో 8 మండలాలు తీవ్ర, 9 మండలాలు మధ్యస్థ కరువులో ఉన్నాయి. తీవ్ర కరువు జాబితాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, నాగాయలంక, కోడూరు వంటి మండలాలు డెల్టా చివరి ప్రాంతాలే. బాపట్ల జిల్లాలో ప్రకటించిన 15 మండలాలూ తీవ్ర కరువు కిందే ఉన్నాయి. జాబితాలో లేని 300 మండలాలు రాష్ట్రంలో 688 మండలాలు ఉంటే కరువు జాబితాలో చోటు దక్కింది 388కే. కరువు ఛాయలు ఉన్నా మిగతా 300 మండలాల రైతులకు మొండిచేయి చూపారని రైతు సంఘాలు చెబుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు కరువు జాబితాలో చోటు ఇవ్వలేదు.సగం సీమలోనే.. 388 కరువు మండలాల్లో 186 రాయలసీమలోనే ఉన్నాయి. తీవ్ర కరువు మండలాలు 283 అయితే, వాటిలో 159 సీమలోనే ఉన్నాయి. అన్నీ తీవ్రమే అనకాపల్లి, బాపట్ల, మార్కాపురం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ప్రకటించిన మండలాలన్నీ తీవ్ర కరువు కిందే ఉన్నాయి అగ్రస్థానం కడప అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 37 మండలాలు కరువు జాబితాలో ఉన్నాయి. -
ఐయ్యారే.. రూ.20,898 కోట్లు ఎగ్గొట్టారే!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు ప్రభుత్వం భారీ వెన్నుపోటు పొడిచింది. 2024 ఎన్నికల మేనిఫేస్టోలో ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని గాలికొదిలేసిన చంద్రబాబు, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వేతన సవరణ కమిషనర్ డాక్టర్ మన్మోహన్‌సింగ్‌తో ఆ పదవికి రాజీనామా చేయించారు. ఆ తరువాత వేతన సవరణ కోసం మరో కమిషనర్‌ను నియమించలేదు. తద్వారా 27 నెలలుగా ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకుండా వారికి చెందాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు చంద్రబాబు గండికొట్టారు. రెండేళ్లకు పైగా కాలయాపన చేసి తాజాగా వేతన సవరణ కమిషనర్‌గా దినేష్‌కుమార్‌ను నియమించారు. 27 నెలలుగా ఐఆర్ ప్రకటించకపోవడంతో ఉద్యోగులకు రూ.20,898 కోట్ల ఆర్థిక ప్రయోజనాలకు చంద్రబాబు ప్రభుత్వం గండికొట్టింది.నెలకు రూ.774 కోట్ల మేర గండి..వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల ఐఆర్ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2019 జూలై 1వ తేదీ నుంచి 27 శాతం ఐఆర్ అమలు చేస్తూ తొలి కేబినెట్ సమావేశంలోనే వైఎస్ జగన్ హయాంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 ఆగస్టు 1వ తేదీ వేతనంతో ఐఆర్ చెల్లించారు. అప్పట్లో నెలకు రూ.774 కోట్ల మేర ఐఆర్ ఇవ్వడం ద్వారా ఉద్యోగులకు ప్రయోజనం కల్పించారు. జగన్ మాటిచ్చి నెరవేర్చారు.. చంద్రబాబు మాట మార్చారు2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించి అమలు చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇవ్వడమే తప్ప ఇప్పటికీ అమలు చేయలేదు. ఇదే వైఎస్ జగన్‌కు చంద్రబాబుకు విశ్వసనీయతలో ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఇచ్చినట్టు 27 శాతం ఐఆర్ ఇచ్చి ఉంటే ఉద్యోగులకు రూ.20,898 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరేది. 27 నెలల తరువాత వేతన సవరణ కమిషనర్‌ను నియమించారు.కమిషన్ నివేదిక ఇచ్చేందుకు మరో ఏడాది గడువు విధించారు. కమిషనర్ నివేదిక సమర్పించి.. అమలు చేయడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంటే ప్రస్తుత వేతన సవరణ కమిషన్ నివేదిక సమర్పించేందుకు 2027 అక్టోబర్ వరకు గడువు ఉంది. 13వ వేతన సవరణ కమిషన్‌ను 2028లో నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుత కమిషన్ నివేదిక వచ్చి.. అది అమలయ్యే వరకు ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
అబద్ధాలతో చంద్రబాబు చెట్ట‘పట్టాలు’
సాక్షి, అమరావతి: కొండలు, కాలువ కట్టలపై కొద్దిపాటి స్థలంలో రేకుల షెడ్డు వేసుకుని బతుకీడుస్తున్న పేదవాడి స్థలం విలువ కోటి రూపాయలట. ఇది ఎవరో రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెప్పిన మాట కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సభా వేదిక నుంచి చెప్పిన లెక్క. విశాఖ, విజయవాడ, మంగళగిరిలో 60 వేల మందికి రూ.52 వేల కోట్ల విలువైన భూములు ఇచ్చామని అదేపనిగా ఊదరగొడుతూ ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో పట్టా విలువ ఏకంగా రూ.కోటిపైనే. నిజంగా ఆ భూమికి అంత విలువ ఉందా అంటే.. అంత ఉంటే వాళ్లు పేదలు ఎలా అవుతారని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారుల లెక్క ఒకటి.. బాబు లెక్క మరొకటి విజయవాడలో నిర్వహించిన సభకు నాలుగు రోజుల ముందు అధికారులు విజయవాడ భూముల విలువ రూ.9,800 కోట్లు అని చెప్పారు. ఒక్కో కుటుంబానికి లబ్ధి రూ.40–45 లక్షలని ప్రకటించారు. అదే చాలా ఎక్కువ. ఆ భూమికి అంత విలువ ఎక్కడ ఉంటుందని స్థానికులు ఆశ్చర్యపోయారు. కాగా.. చంద్రబాబు దాన్ని ఇంకా పెంచేసి మైక్ చేతికి రాగానే విజయవాడలోని ఆ భూమి విలువ రూ.28,112 కోట్లని చెప్పారు. అధికారులది ఒక లెక్క.. చంద్రబాబుది ఒక లెక్క. కానీ వాస్తవానికి అక్కడున్న భూముల విలువ కంటే ఒకటి, రెండు రెట్లు ఎక్కువ చేసి అధికారులు చెబితే దానికి మూడు రెట్లు కలిపి చంద్రబాబు లెక్క చెప్పడం గమనార్హం. దీనినిబట్టి చంద్రబాబు దొంగ లెక్కలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గజం రూ.82 వేలు.. ఏ కొండ మీద? సీఎం లెక్క ప్రకారం విజయవాడలో కొండపై స్థలాల్లో గజం ధర రూ.82,700. ఇది నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఉండే రేటు. పట్టాలు ఇచ్చింది మాత్రం కొండ ప్రాంతాల్లో, రోడ్డు కూడా లేని గల్లీల్లో ఉన్నవారికి. ప్రభుత్వ విలువ ప్రకారం చూసినా అక్కడ గజం రూ.20 వేలు దాటదు. మరి ఆ రూ.82 వేలు ఏ లెక్క? కేవలం ప్రచార లెక్క. ఇచ్చింది కాగితం.. చెప్పింది రూ.కోట్లు ఈ పట్టాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది పైసా కూడా లేదు. సేకరించిన భూమి సెంటు కూడా లేదు. పేదలు దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లకే ఒక కాగితం ఇచ్చారు. విశాఖలో అయితే గతంలోనే ఇచ్చిన పట్టాలకు ఇప్పుడు డీడ్లు ఇచ్చి మళ్లీ పట్టాభిషేకం అన్నారు. ఆ కాగితానికే రూ.కోట్ల విలువ కట్టి తానేదో పేదలకు కోట్ల ఆస్తి పంచినట్టు డప్పు కొట్టుకుంటున్నారు.చెప్పేది కొండంత.. చేసేది గోరంత సభలో రూ.కోట్ల లెక్కలు, క్షేత్రస్థాయిలో కాగితాలు. మైక్ ముందు రూ.52 వేల కోట్లు. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు సున్నా. చెప్పే మాటకు, చేసే పనికి, కనిపించే వాస్తవానికి ఎక్కడా పొంతన లేదు. అంకెల గారడీతో పేదలను మభ్యపెట్టడం చంద్రబాబుకు కొత్త కాదని, ఇది ప్రజలను నిలువునా మోసం చేయడమేనని పేదలు మండిపడుతున్నారు. -
ఈ ఏడాదీ తిరోగమనంలోనే జీఎస్టీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. యువతకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతీ లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన పంటలకు బీమా రాక రైతులు కుదేలైపోయారు. కొత్తగా వచ్చిన వ్యాపార సంస్థలు, పరిశ్రమలు లేవు. ఏ రంగంలోనూ అభివృద్ధి లేదు. వ్యాపారాలు దిగజారిపోతున్నాయి. దీంతో ఏటేటా జీఎస్టీ వసూళ్లు పడిపోతున్నాయి. చంద్రబాబు అధికారం చేపట్టిన మూడో సంవత్సరం కూడా రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు తిరోగమన దిశలోనే నడుస్తున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 6.79 శాతం మేర క్షీణించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల కాలానికి రూ.23,570 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాదికి వచ్చేసరికి 6.79 శాతం క్షీణించి 21,992 కోట్లకు పరిమితమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం 12 నెలల్లో కూడా రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 5.41 శాతం క్షీణించి రూ.44,825 కోట్ల నుంచి రూ.42,397 కోట్లకు పడిపోయిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు, రాజధాని అమరావతిలో వేల కోట్ల పనులతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందంటూ చంద్రబాబు సర్కారు ప్రకటనలతో ఊదరగొడుతుంటే జీఎస్టీ గణాంకాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు, వేల కోట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే ఆ మేరకు రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఎందుకు పెరగడం లేదని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే... జీఎస్టీతో పాటు పెట్రోలియం, లిక్కర్ వ్యాట్, వృత్తి పన్ను అన్నీ కలిపి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం మొదటి ఆరు నెలల కాలంలో 18 శాతం పెరిగి రూ.30,435.98 కోట్లకు చేరినట్లు రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ఎ.బాబు ప్రకటన జారీ చేశారు. -
తెలిసే వంచన!
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు మరోమారు వెన్నుపోటు రుచి చూపించారు. 34 శాతం రిజర్వేషన్లు కోర్టుల ముందు నిలబడవని తెలిసీ దారుణంగా వంచించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు మొక్కు బడిగా కల్పించిన 34 శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేయడంతో బాబు బండారం బట్టబయలైంది. కేవలం జీవో ఇచ్చి ఊరుకుంటే కోర్టులు కొట్టేస్తాయని ఆయనకు తెలుసు. రిజర్వేషన్లు 50శాతం దాటరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు తీర్పులిచ్చిన సంగతీ చంద్రబాబుకు తెలుసు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. కేంద్రంలో టీడీపీ బలంపై ఆధారపడిన ప్రభుత్వం ఉన్నదన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ కేంద్రంపై వత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం చేయించే పని చేయకుండా ఓ జీవో ఇచ్చి బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ కురిపించారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే హైకోర్టు ఆ జీవోను కొట్టేసింది. అలా బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు డ్రామాలో మరో అంకం పూర్తయింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని ఆయన అంటున్నారు. డ్రామాలో ఇది ఇంకొక అంకం. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఈ డ్రామాను మరికొన్ని రోజులు నడిపించవచ్చు. బీసీల కోసం చంద్రబాబు నిజంగా ప్రయత్నిస్తున్నాడని కొంతమందినైనా నమ్మించవచ్చు. కానీ చంద్రబాబు ఆడుతున్న నాటకం బీసీలకు అర్థమయ్యింది. తమకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబులో ఏ కోశానా కనిపించడంలేదని వారు మండిపడుతున్నారు. టీడీపీ బలంపై కేంద్రప్రభుత్వం ఆధారపడి ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయడానికి ఇదో మంచి అవకాశమని అందరూ భావిస్తున్నారు. కానీ చంద్రబాబులో చిత్తశుద్ధి, నిజాయితీ లేదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టుకు వెళ్తామంటూనే, మరోవైపు అన్ని మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులకు ఎన్నికల నిర్వహణకు సిద్ధంకావాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చేశారు. బీసీల కోసం కేంద్రంపై ఒత్తిడి చేసిందెక్కడ? వాస్తవానికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చారు. చట్టం ఏం చెబుతోంది.. సుప్రీంకోర్టు తీర్పులు ఏమంటున్నాయి.. అన్న విషయాలు తెలుసుకోకుండానే ఆయన ఈ హామీని ఇచ్చారని అనుకోవడానికి వీలేలేదు. బీసీల పట్ల నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేంద్రంలో తనకున్న పలుకుబడిని, కేంద్రం తమపై ఆధారపడి ఉన్న పరిస్థితిని ఉపయోగించుకుని బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చేందుకు ప్రయత్నించొచ్చు. నెలనెలా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే చంద్రబాబు, ఏ రోజు కూడా బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించిన దాఖలాల్లేవు. కేంద్రానికి ఓ వినతిపత్రం కూడా పంపలేదు. బీసీలకు 50 సంవత్సరాలకే రూ.4వేల పెన్షన్ అందిస్తామన్నారు. ధోకా ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.. ధోకా.. బీసీలకు సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నారు.. మూడు బడ్జెట్లలో బీసీ లకు సబ్‌ప్లాన్ ఉందా.. వీటిని బట్టి అర్థం కావడంలేదూ వెన్నుపోటులో చంద్రబాబు గోల్డ్‌మెడల్ హోల్డరని.మోసాన్ని దాచి ప్రతిపక్షంపై విమర్శలు బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వైఎస్సార్సీపీ వాళ్లే హైకోర్టులో కేసులు వేసి రిజర్వేషన్లను అడ్డుకున్నారనే అబద్ధాలతో కొత్త డ్రామాలకు తెరతీశారు. వాస్తవానికి ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియ ముగిసిన తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత స్థానిక సంస్థలను నిర్వహించాలని మాత్రమే వైఎస్సార్సీపీ హైకోర్టును కోరింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరలేదు. అయితే చంద్రబాబు మాత్రం రిజర్వేషన్ల వైఫల్యాన్ని వైఎస్సార్సీపీకి ముడిపెట్టి ప్రతిపక్షాన్నే నిందిస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను గతంలో అడ్డుకున్నది చంద్రబాబే.. 2020–21 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయిస్తూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28నే జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 58.95 శాతం రిజర్వేషన్ల అమలుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ చంద్రబాబు కోర్టులో కేసు వేయించారు. బిర్రు ప్రతాపరెడ్డి అనే టీడీపీ నాయకుడితో చంద్రబాబు ఈ నాటకం ఆడించారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రతాపరెడ్డి ఓ నామినేటెడ్ పదవి కూడా అనుభవించారు. చంద్రబాబు వేయించిన కేసు నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50శాతం మించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు కోర్టులో ఎందుకు అడ్డుకున్నారు చంద్రబాబూ..? బీసీలకు 34శాతం రిజర్వేషన్ వస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని సొంత పారీ్టలోనే కొందరు నాయకులు విమర్శించడం నిజం కాదా..? చేతులు దులుపుకునేందుకే సుప్రీంకోర్టుకు అప్పీలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేస్తూ తీర్పునివ్వడంతో దానిపై సుప్రీంకోర్టుకెళతామని చంద్రబాబు ప్రకటించేశారు. తద్వారా త్వరగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసి, అంతే త్వరగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సబబు కాదని చెప్పించాలన్నదే ఆయన వ్యూహం. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించిన ఏ కేసులో కూడా సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను సమర్థించిన దాఖలాలే లేవు. ఇదే పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు చేసిన రిజర్వేషన్ల వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటినప్పుడు అందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. ఆ తీర్పుల ఆధారంగానే ఇపుడు ఏపీ హైకోర్టు కూడా బీసీలకిచ్చిన 34 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు మళ్లీ వెళ్లినా కూడా ఏం జరుగుతుంది? గతంలో ఇచ్చిన తీర్పునే ఇస్తుంది. ఈ విషయం తెలిసీ కాలయాపన కోసమే చంద్రబాబు డ్రామాలు... రిజర్వేషన్లను కోర్టులు కొట్టేశాయి కాబట్టే, తానేం చేయలేకపోతున్నానని బీసీలను వంచించేందుకు చంద్రబాబు నాటకాలు.. వాస్తవానికి హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. అయితే సుప్రీంకోర్టుకెళ్లడానికి ముందే నోటిఫికేషన్ ఇస్తే, వంచన బయటపడుతుందన్న భయంతో ఆ పని చేయకుండా ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు ఆపారని అధికారవర్గాల్లో వినిపిస్తోంది. బాబు సర్కార్ తీరును అనుమానించిన హైకోర్టు... అసలు రాజీవ్ రంజన్ మిశ్రా క్షేత్రస్థాయిలో బీసీల గురించి ఎలాంటి సర్వే చేయలేదు. బీసీ స్థితిగతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కోర్టుకు మాత్రం కమిషన్ నివేదిక, సిఫారసుల మేరకే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన హైకోర్టు, రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కంగుతిన్న చంద్రబాబు ప్రభుత్వం విధి లేని పరిస్థితుల్లో కమిషన్ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టుకు, ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని గ్రహించింది. దీంతో ఎలాంటి శాస్త్రీయ సర్వే లేకుండా, బీసీల స్థితిగతులను తెలుసుకోకుండా వారికి నామమాత్రంగా, మొక్కుబడిగా ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లను కొట్టేసింది. అసలు కమిషన్ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదు. దాన్ని అత్యంత రహస్యంగా ఉంచింది. నివేదికను ఎందుకు బహిర్గతం చేయడంలేదని హైకోర్టు ప్రశ్నించినా పట్టించుకోలేదు. బీసీ రిజర్వేషన్లపై ఎప్పడు ఏం జరిగిందంటే.. ⇒ 2019 డిసెంబర్ 28: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీఓ 176 ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకుడు బిర్రుప్రతాపరెడ్డి చేత చంద్రబాబు కేసువేయించారు. ⇒ 2020 మార్చి 2: బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌తో మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు అవుతాయని ఆ జీఓను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ⇒ 2021 మార్చి 4: వికాస్ కిషన్‌రావు గవాలి తీర్పులో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు మూడు అంశాలు(ట్రిపుల్ టెస్ట్)ను స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ⇒ 2026 ఆగస్టు 20: స్థానిక సంస్థలైన గ్రామాల్లో 34 శాతం(జీఓ105), పట్టణాల్లో 33.33 శాతం(జీఓ 1065) ద్వారా బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ప్రభుత్వం జీఓలు ఇచ్చింది. ⇒ 2026 సెప్టెంబర్: 34 శాతం నిర్ణయానికి ఆధారమైన గణాంకాలు, కమిషన్ నివేదిక, చట్టపరమైన ప్రాతిపదికను ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ⇒ 2026 అక్టోబర్ 1: స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీఓలను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. బాబుకు గుణపాఠం చెప్పడం ఖాయం చట్టబద్ధత లేకుండా తెచ్చిన జీవోలు హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు కుటిల నైజం మరోసారి బట్టబయలైంది. యావత్ బీసీ సమాజానికి చంద్రబాబు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో బాబుకు బీసీ సమాజం గుణపాఠం చెప్పడం ఖాయం. – చెల్లుబోయిన వేణు, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి బాబు కల్లిబొల్లి మాటలు బీసీలు నమ్మరు బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. బీసీలను అణగదొక్కేందుకు రిజర్వేషన్ల పేరిట రాజకీయ కుట్రకు తెరతీశారు. బాబు చెప్పే కల్లిబొల్లి మాటలు, అబద్ధపు జీవోలతో బీసీలను మరోసారి మోసం చేయలేరు. – గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ మోసకారితనం బట్టబయలైంది బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసి బాబు ప్రభుత్వ మోసకారితనాన్ని బట్టబయలు చేసింది. ఇదంతా బీసీలను దగా చేయడానికి చంద్రబాబు ఆడిన నాటకం. బాబు ప్రభుత్వ మోసకారి విధానాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. – వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శిచిత్తశుద్ధి లేదని రుజువైంది బీసీలకు రిజర్వేషన్ల విషయంలో బాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రుజువైంది. ‘మేము ఇవ్వాలనుకున్నాం.. కానీ కోర్టు కొట్టేసింది’ అనే సాకుతో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోంది. ఇకనైనా బీసీలపై కపట ప్రేమ మానుకొని, చిత్తశుద్ధితో వ్యవహరించాలి. – కె.రామకృష్ణ, సీపీఐ జాతీయ కార్యదర్శి పార్లమెంటులో చట్టం చేయించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో చట్టం చేయించాలి. – కేశన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు మోసానికి ఫుల్స్టాప్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేయాలనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు తీర్పుతో ఫుల్స్టాప్ పడింది. రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు చేయడం, ఆ తర్వాత కోర్టుల్లో ఎదురుదెబ్బలు తినడం చంద్రబాబుకు అలవాటే. – ఉషశ్రీ చరణ్, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి 34 శాతం రిజర్వేషన్లపై బీసీలకు బాబు వెన్నుపోటు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి, చట్టపరమైన చర్యలు చేపట్టి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధించాలి. బీసీల రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జీఓలు జారీ చేయడం సిగ్గుచేటు. – వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ -
రంగా విగ్రహాలకే ఎందుకు అభ్యంతరం?
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేలల్లో ఎంతోమంది రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటుచేశారని, వాటన్నింటికీ లేని అభ్యంతరం వంగవీటి రంగా విగ్రహాలకు మాత్రమే ఎందుకుని తెలగ, బలిజ, కాపు జేఏసీ (టీబీకే జేఏసీ), కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రంగా విగ్రహం తొలగించడం, దిమ్మెను కూల్చివేయడాన్ని ఖండించాయి. ఇది రంగా, యావత్ కాపు జాతికి జరిగిన అవమానమని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని.. ఘటనకు చంద్రబాబు సర్కారు మూల్యం చెల్లించాల్సిందేనంటూ టీబీకే జేఏసీ, కేఆర్పీఎస్ నేతలు హెచ్చరించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం తెలగ, బలిజ, కాపు జేఏసీ నేత దాసరి రాము మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం మీద నిరసన తెలిపేందుకు సమావేశమయ్యామన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో ఏడాది క్రితమే దిమ్మె ఏర్పాటుచేశారని.. అక్కడ విగ్రహం పెట్టడానికి అనుమతివ్వాలని అప్పటినుంచి పంచాయతీ వాళ్లను.. ఎమ్మెల్యేను అడుగుతూనే ఉన్నారన్నారు. కానీ, అక్కడున్న కమ్మ సామాజికవర్గానికి చెందిన వారి ఒత్తిడికి లోనై అనుమతులివ్వడానికి నిరాకరించారని దాసరి రాము చెప్పారు. ఏడాదిగా ఎంతగానో ఎదురుచూసి ఇటీవలే కాపులు రంగా విగ్రహం పెట్టారని, అయితే, దానిని దొంగతనంగా తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టారన్నారు. రెండో రోజు మరో విగ్రహం ఏర్పాటుచేస్తే.. పోలీసుల సహకారంతో ఆ విగ్రహాన్ని తరలించి విగ్రహ దిమ్మెను కూల్చివేశారన్నారు. రాష్ట్రంలో ఏ విగ్రహాలకి లేని లా అండ్ ఆర్డర్ సమస్య వంగవీటి రంగా విగ్రహానికే ఎందుకు వస్తోందంటూ ఆయన ప్రశ్నించారు. ఈ రౌడీ ముఖం మేం పొద్దున్నే చూడాలా.. కోట్లు ఖర్చుచేసైనా విగ్రహం పెట్టకుండా అడ్డుకుంటామని అంటున్నారట.. ఇదేనా కాపులకు, రంగాకు ఇచ్చే గౌరవమని రాము ప్రశ్నించారు.ప్రభుత్వం కాపులను అణచివేస్తోంది కేఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కాపులను అణచివేస్తోందని, కుల వివక్ష చూపుతోందని ఆరోపించారు. కాపులను ఏమార్చడానికి, తప్పుదోవ పట్టించడానికే వేరే ప్రాంతంలో విగ్రహం పెట్టిస్తున్నారని మండిపడ్డారు. రంగా విగ్రహం కూల్చి, కాపులపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. ముందుగా నిర్ణయించిన ప్రదేశంలోనే రంగా విగ్రహం ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
పోలీసుల నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, అమరావతి: విజయవాడ కాపు యువకుడు గాదే సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్టే తననూ పోలీసులు అంతమొందించాలని చూస్తున్నారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గుర్రంవాండ్లపల్లెకు చెందిన చర్చి పాస్టర్ బి.సంపత్‌కుమార్ ఆందోళనవ్యక్తం చేశారు. ఇదే విషయమై ఇటీవల డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేసిన సంపత్‌కుమార్ తాజాగా హోంమంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై కంప్లైంట్ చేశానని రాయచోటి పోలీసులు కక్ష సాధింపు చర్యలు ఆపకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు ‘సాక్షి’కి గురువారం ఫోన్లో మొరపెట్టుకున్నారు.రాయచోటి సీఐ వెంకటాచలపతి అవినీతిపై 2025 ఏప్రిల్ 28న కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశానని సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మీడియాలో ప్రసారం కావడంతో తనపై పోలీసులు కక్ష పెంచుకున్నారని, అప్పటి నుంచి తనపై వరుసగా ఐదు కేసులు పెట్టారని హోంమంత్రి, డీజీపీలకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. తనపై పెట్టిన ఒక కేసులో అక్రమంగా అరెస్టు చేశారని, 90రోజులపాటు రిమాండ్‌లో ఉండి బెయిల్‌పై విడుదలయ్యానని తెలిపారు. అయినప్పటికీ తనపై పోలీసుల కక్ష సాధింపులు ఆపకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానని వివరించారు. గత నెల 26 తెల్లవారుజామున 3.30గంటలకు మగ పోలీసులు తన ఇంటికి వచ్చి సోదాలు చేశారని, ఆ సమయంలో తాను లేకపోవడంతో వృద్ధురాలైన తన తల్లి శాంతమ్మ, భార్యను భయాందోళనలకు గురిచేశారని ఆరోపించారు. హోంమంత్రి, డీజీపీ స్పందించి తనపై నమోదైన కేసులన్నింటిపైనా రాయచోటి పోలీసులకు సంబంధం లేని ఇతర జిల్లా పోలీస్ అధికారితో స్వతంత్ర విచారణ జరిపించాలని, పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని సంపత్‌కుమార్ కోరుతున్నారు. -
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చెల్లవు
సాక్షి, అమరావతి: అనుకున్నదే అయింది. న్యాయస్థానం ముందు నిలబడవని తెలిసి కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మొక్కుబడిగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చట్టం ముందు నిలబడవని తేల్చి చెప్పింది. 34 శాతం రిజర్వేషన్ల వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్లపై పునః పరిశీలన చేసి, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.వికాస్ కిషన్‌రావు గవాలి, జన్హిత్ అభియాన్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా డేటా సేకరణ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తరువాతనే బీసీలకు 50 శాతానికి మించి రిజర్వేషన్ కల్పించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీలకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడానికి, ప్రభుత్వం సమర్పించిన ‘యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ద్వారా సేకరించిన ప్రాతిపదిక డేటా (యంపరికల్ డేటా) చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.వికాస్ కిషన్ రావు గవాలి, జన్హిత్ అభియాన్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పుల ప్రకారం... రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన సరైన, శాస్త్రీయమైన ప్రాతిపదిక డేటా ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్ల ప్రకటనకు ప్రాతిపదికగా నిలవలేని ‘యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ద్వారా సేకరించిన ప్రాతిపదిక డేటాపై రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోందని ఆక్షేపించింది. ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించండి... రాష్ట్రంలో పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పాలక వర్గాల కాల పరిమితి ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌లో ముగిసిందని, అందువల్ల వెంటనే స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ)పై ఉందంది. ఎన్నికలు నిర్వహించడం, అవసరమైన ఎన్నికల పూర్వ ప్రక్రియను సకాలంలో చేపట్టడమన్నది ఎన్నికల కమిషన్, రాష్ట్రప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత అని తెలిపింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను నేటి నుంచి ఆరు వారాల్లోపు ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు సర్ అడ్డంకి కాదు... స్థానిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ఎంత మాత్రం అడ్డంకి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. సర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, దాని కోసం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ‘అర్హత తేదీన ఉనికిలో ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరుపుకోవచ్చు. సర్ కారణంగా పాత ఓటర్ల జాబితాను పక్కన పెట్టలేమని ‘లక్ష్మీ చరణ్ సేన్ వర్సెస్ ఎ.కె.ఎం. హసన్ ఉజ్జమాన్’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.అంతేకాకుండా, 1994 నాటి ఏపీ పంచాయతీ రాజ్ చట్టం (సెక్షన్ 11), ఏపీ మున్సిపాలిటీల చట్టం1965, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం1955 (సెక్షన్ 12) నిబంధనలను పూర్తిగా పాటిస్తే చాలని, తాము ఎన్నికలను అడ్డుకోవాలనుకోవడం లేదని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, అడ్వకేట్ జనరల్ కూడా ఈ నిబంధనలను పాటిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిస్థితులన్నింటి దృష్ట్యా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించకుండా లేదా నోటిఫై చేయకుండా ఎన్నికల కమిషన్‌ను, ప్రభుత్వాన్ని ఆదేశించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు. ’అని హైకోర్టు స్పష్టం చేసింది. రాజీవ్ రంజన్ కమిషన్ చట్టబద్ధత జోలికి వెళ్లడం లేదు... బీసీ రిజర్వేషన్ల ఖరారు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ కమిషన్ చట్టబద్ధతను పిటిషనర్ సవాలు చేయలేదని, అందువల్ల తాము ఆ అంశం జోలికి వెళ్లడం లేదంది. బీసీ జనగణన చేసిన తరువాతనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. బీసీ ఉపవర్గీకరణ ప్రభుత్వ పరిధిలోనిది.. మేం ఆదేశాలివ్వలేం... అలాగే బీసీల ఉప వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా ధర్మాసనం కొట్టేసింది. ఉపవర్గీకరణ చేపట్టే విషయంలో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసేందుకు తగిన కారణాలేవీ కనిపించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ‘ఇ.వి. చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను తాము పరిశీలించామని, ఒక వర్గంలో ఉప–వర్గీకరణ లేదా వర్గీకరణ చేయడం చట్టవిరుద్ధం కాదు.అయితే అలా చేయాలంటే, ముందుగా ఆ వర్గం ’సజాతీయమైనదా లేదా అన్ని విధాలా సమానమైనదా అని తేల్చాలి. ఒకవేళ ఆ వర్గం సజాతీయమైనది అయితే, ఉప–వర్గీకరణ చేయడానికి వీలులేదు. అదే సజాతీయమైనది కాకపోతే, సాధించాలనుకున్న లక్ష్యానికి తగిన తార్కిక ప్రాతిపదికలతో ఉప–వర్గీకరణను పరిశీలించవచ్చు. పెద్ద వర్గమైన ఎస్సీ, బీసీల నుండి వేరు చేసిన నిర్దిష్ట సమూహం, కులం, అదే వర్గంలోని మిగతా వారి కంటే ఎక్కువ వెనుకబడిన స్థితిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాల్సిన అంశాలే తప్ప, ఉప–వర్గీకరణ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ’ అని హైకోర్టు తన తీర్పుల్లో పేర్కొంది. వార్డుల పునర్వీభజన అధికారం ప్రభుత్వానికి ఉంది... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్వీభజన ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లను సైతం హైకోర్టు కొట్టేసింది. వార్డుల పునర్వీభజన చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర జనాభా లెక్కల కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ వార్డుల పునర్వీభజనకు అడ్డంకి ఎంత మాత్రం కాదని తేల్చి చెప్పింది. వార్డులు పునర్వీభజన చేపట్టకూడదన్న నిషేధం ఏమీ చట్టంలో లేదని హైకోర్టు గుర్తు చేసింది. ‘భారత రాజ్యాంగంలోని పార్ట్ 9ఏ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థకు సంబంధించిన పరిపాలనా యూనిట్ మున్సిపాలిటీ అవుతుంది.అది మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు లేదా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు. జనగణన చట్టం 1948, జనగణన నిబంధనలు 1990లు మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పునర్వీభజన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకుండా నిషేధించవు. అందువల్ల 2025 ఆగస్టు 13వ తేదీన జారీ చేసిన సర్క్యులర్ ద్వారా జనగణన కోసం పరిపాలనా యూనిట్ల సరిహద్దులను ఫ్రీజ్ చేసినప్పటికీ, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో వార్డుల పునర్వీభజన ప్రక్రియను చేపట్టడానికి అది అడ్డంకి కాదు. అందువల్ల ఈ అప్పీళ్లను కొట్టేస్తున్నాం.’ అని హైకోర్టు తన తీర్పుల్లో తేల్చి చెప్పింది. వారి పదవీ కాలం ఐదేళ్లే... అంతకు మించి కొనసాగే అధికారం లేనే లేదు... రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఎన్నికైన సర్పంచులు, చైర్మన్ల పదవీ కాలం ఐదు సంవత్సరాలని, ఈ కాలం పూర్తయిన తరువాత కూడా ఆ పదవుల్లో కొనసాగడానికి వారికి ఎటువంటి హక్కు లేదని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సర్పంచ్‌లు, చైర్మన్లను కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయలేమంది. అందుకే ఆ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ‘రాజ్యాంగంలోని అధికరణ 243ఈ ప్రకారం ప్రతి పంచాయతీ తన మొదటి సమావేశ తేదీ నుండి ఐదు సంవత్సరాలు మాత్రమే కొనసాగుతుంది, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ కాలం కొనసాగరాదు. అదేవిధంగా, అధికరణ 243యు ప్రకారం మున్సిపాలిటీలు కూడా మొదటి సమావేశ తేదీ నుండి 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగడానికి వీలు లేదు. 1994 నాటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 13(1) కూడా ఎన్నికైన సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు అని స్పష్టంగా చెబుతోంది. రాజ్యాంగపరమైన ఈ స్పష్టమైన ఆదేశాన్ని ఉల్లంఘించి, 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పొడిగించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి, సర్పంచ్‌లు లేదా మున్సిపాలిటీ చైర్మన్లుగా ఎన్నికైన పిటిషనర్లకు 5 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన తర్వాత ఆ పదవులలో కొనసాగే హక్కు ఎంత మాత్రం లేదు.’ అని హైకోర్టు తేల్చిచెప్పింది. గ్రామాల విలీన సవరణ చట్టం సబబే... రాష్ట్రంలో పలు గ్రామాలను సమీప మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనం చేస్తూ అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2021 జూన్ 9న తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని హైకోర్టు సమర్ధించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ కొట్టేసింది. ‘ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని సమరి్ధస్తున్నాం. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 14, ఆర్టీకల్ 243క్యూ(2)లకు వ్యతిరేకం కాదు, అలాగే రాజ్యాంగంలోని 73, 74 వ సవరణలకు కూడా విరుద్ధం కాదు. ఈ సవరణ చట్టాన్ని శాసనసభ తన పరిధిని అతిక్రమించి తీసుకొచ్చినట్లుగా పరిగణించలేం.ఇది శాసనపరమైన చర్య. ఇది రాష్ట్ర శాసనసభ అధికార పరిధికి లోబడి ఉంది. గ్రామ పంచాయతీలను రద్దు చేస్తూ ఒక నోటిఫికేషన్, వాటిని మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం మరో వేరే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం గురువారం తీర్పులు వెలువరించింది. స్థానిక ఎన్నికలతో ముడిపడి ఉన్న మొత్తం 8 అంశాలపై ధర్మాసనం వేర్వేరుగా తీర్పులు ఇచ్చింది.హైకోర్టు తీర్పులిచ్చిన అంశాలివే..⇒ బీసీ జనాభా లెక్కించిన తరువాతనే రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు 2025లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ⇒ రాష్ట్రంలో స్థానిక సంస్థల కాల పరిమితి ముగిసినా కూడా ఎన్నికలు నిర్వహించడం లేదని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని, వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2026లో పిల్ వేశారు. ⇒ స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వరకు సర్పంచ్‌లు, చైర్పర్సన్లను యథాతథంగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రకాశం జిల్లాకు చెందిన లక్షమ్మ, ఎస్తేరమ్మలు ఈ ఏడాది పిల్ దాఖలు చేశారు.⇒ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్, కృష్ణా జిల్లాకు చెందిన పెనమకూరు వెంకట నరసింహ శర్మ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ⇒ బీసీల ఉపవర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తరువాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజయనగరంకు చెందిన మూలవీసల దుర్గాప్రసాద్ 2026లో పిల్ వేశారు. ⇒ కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.⇒ ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు తదితర జిల్లాకు చెందిన పలువురు అప్పీళ్లు దాఖలు చేశారు. ⇒ రాష్ట్రంలోని పలు గ్రామాలను సమీప మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనం చేస్తూ 2021లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ పలువురు 2021, 2024, 2026 సంవత్సరాల్లో పలువురు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.వీటన్నింటిపై ఇటీవల సుదీర్ఘ వాదనలు విని తీర్పులు రిజర్వ్ చేసిన సీజే ధర్మాసనం గురువారం ఉదయం వాటన్నింటిలో తన నిర్ణయాన్ని వెలువరించింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ తాండవ యోగేష్, వెంకట నరసింహ శర్మ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం అనుమతించింది. సర్ ప్రక్రియ ముగిసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్సార్సీపీ పిటిషన్‌ను పలు ఆదేశాలతో పరిష్కరించింది. ఇవి తప్ప మిగిలిన అన్ని వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టేసింది. -
నయవంచన రాజకీయాలు ఇంకెన్నాళ్లు ?
సాక్షి,అమరావతి: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరిట సీఎం చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు, నయవంచనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారు? ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారని చంద్రబాబుని ప్రశ్నించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామాఆడుతున్నారని మీకూ తెలుసు? సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు? కోర్టులో నిలబడదని తెలిసీ, 44 రోజులుగా మీరు ఆడుతోంది కపట నాటకం కాదా? అంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబును వైఎస్ జగన్ కడిగిపారేశారు. ఇవాళ మీరిచ్చిన జీవోలను కొట్టేస్తూ, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు క్షమాపణలు చెప్పి, లెంపలు వేసుకోండని హితవు పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే... కేంద్రాన్ని ఒప్పించండి.. చంద్రబాబు గారూ.. నిజంగా మీకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే.. మీరు చేయాల్సింది కేంద్రంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఆ మేరకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక మార్గాన్ని తీసుకొస్తే గాని, ఈ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి ఆ దిశగా మీరు ఏం చేశారు? కేంద్రంతో మాట్లాడారా? కనీసం మీ కేంద్ర మంత్రులతో అక్కడి కేబినెట్ సమావేశాల్లో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారా? మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నిసార్లు దీనిపై కేంద్రంతో చర్చించారు? ఇవి చేయకుండా, చెల్లని జీవోలు ఇచ్చి డ్రామాలు చేయడం వెనుక మీ ఉద్దేశం, బీసీలను మభ్య పెట్టి, మోసం చేయాలనే కదా? రాజకీయ స్వార్థం కోసం మీ డ్రామాలు ప్రదర్శించడానికి బీసీలే కావాల్సి వచ్చారా? బీసీలపై ప్రేమను చేతల్లో చూపండి బీసీలపై ప్రేమ మాటల్లో కాదు చంద్రబాబు గారూ చేతల్లో చూపించాలి. మా ప్రభుత్వ హయాంలో మనసా, వాచా, కర్మణా బీసీల సహా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయపరంగా పైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా పనిచేశాం. చరిత్రలో తొలిసారి విప్లవాత్మకమైన చట్టాన్ని, 2019 ఆగస్టులో తీసుకువస్తూ, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, కమిటీలలోని నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. పదవులు పొందిన ఎంతోమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు.ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మెట్టు పైకి వచ్చి, ప్రజాసేవలో పాల్గొన్నారు. దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ వర్గాల్లో సరికొత్త నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత ఒక్క వైఎస్సార్సీపీకే దక్కింది. అంతేకాదు 139 బీసీ కులాలను కవర్ చేస్తూ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మీ ప్రభుత్వం వద్దే మేం తెచ్చిన చట్టం ఉంది. రెండున్నరేళ్లుగా ఆ చట్టాన్ని ఎందుకు పట్టించుకోలేదు? మా మాదిరి మీరు ఎందుకు అమలు చేయలేదు? కళ్లముందే బీసీలకు మేలు కలిగే చట్టం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి. సంక్షేమ పథకాలతో బీసీలకు బాసట అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు తదితర సంక్షేమ కార్యక్రమాల్లో బీసీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో లబ్ధిపొందాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు మొత్తం రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం అందించాం. ఇప్పుడు వీటన్నింటినీ నాశనం చేసి బీసీల ఉసురు తీస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకురావడం కోసం మేం ఏర్పాటు చేసిన నిచ్చెనలను విరగ్గొట్టారు. పైగా మీరిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు సహా అనేక హామీలను మోసాలుగా మార్చారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన చర్యల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నమీరు, అక్కడ మీ పరపతిని వాడి, కేంద్రాన్ని ఒప్పించి, చట్ట సవరణ ద్వారా 34శాతం రిజర్వేషన్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. రాజకీయంగా బీసీలకు మంచి అవకాశాలు కల్పించాంఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మాకు మేముగా బీసీలకు రాజకీయంగా మంచి అవకాశాలను కల్పించాం. 11 రాజ్యసభ స్థానాల్లో నాలుగు బీసీలకు అవకాశం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాం. చివరకు స్థానిక సంస్థల్లో కూడా జనరల్ స్థానాల్లో బీసీలకే టిక్కెట్లు ఇచ్చాం. 13 జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఆరు, 13 మేయర్ పదవుల్లో తొమ్మిది, 84 మున్సిపల్ చైర్పర్సన్ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చాం. 636 మండలాధ్యక్ష పదవుల్లో 239, 639 జడ్పీటీసీల్లో 227 బీసీలకే ఇచ్చాం, చంద్రబాబు గారూ.. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా?వైఎస్ జగన్‌ను కలిసిన వేమూరు విద్యార్థులునేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో యూకేలో ఉన్నతవిద్యకు వెళుతున్నట్లు వెల్లడి ఉన్నత పౌరులుగా ఎదగాలని వైఎస్ జగన్ ఆకాంక్షసాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన విద్యార్థులు వేమూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో ఉన్నతవిద్య అభ్యసించేందుకు వెళుతున్నట్టు వైఎస్ జగన్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో ప్రతిభ కనబరిచి, భవిష్యత్తులో సమాజానికి మేలుచేసే ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వారి ఉన్నత విద్యాభ్యాసం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యావ్యవస్థలో చేపట్టిన కార్యక్రమాలు మాలాంటి అనేకమంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పించాయి. ఆ సమయంలో విద్యారంగంలో మీరు తీసుకున్న చర్యలు మా ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడ్డాయి’ అని విద్యార్థులు వైఎస్ జగన్‌తో పేర్కొన్నారు. వరికూటి అశోక్‌బాబు కుమారుడు గౌతమ్ గైడ్ చేయడంతో తాము ఈ సీట్లు సాధించామని చెప్పారు. పేద విద్యార్థులకు ఉన్నతవిద్య అందేలా సహాయం చేసిన గౌతమ్‌ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్‌ను కలిసిన విద్యార్థుల్లో నడకుర్తి అలెగ్జాండర్, వేణు వాసుమల్ల, మూల్పూరు ప్రసన్నకుమారి, నీరజా భూపతి, రోహిత్ వాసుమల్ల ఉన్నారు. -
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రానైట్ క్వారీ మూసివేత
సాక్షి, ప్రకాశం జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులతో చీమకుర్తిలోని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రానైట్ క్వారీ మూసివేశారు. గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే బూచేపల్లిఫై కూటమి సర్కార్.. రాజకీయ వేధింపులతో పాటు ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్రకు తెరతీసింది. దీంతో ఇవాళ(బుధవారం) నుంచి గ్రానైట్ క్వారీని మూసివేశారు. ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి.. ఆయన సూర్య గ్రానైట్ క్వారీని ఇవాళ నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించారు.ప్రభుత్వ వేధింపులతో కార్మికులను ఇబ్బంది పెట్టలేక క్వారీని మూసి వేస్తున్నట్లు బూచేపల్లి ప్రకటించారు. ఇవాళ కార్మికులతో సమావేశమైన బూచేపల్లి.. ప్రత్యామ్నాయ పనులు వెతుక్కోవాలని క్వారీలోని కార్మికులకు సూచించారు. ఇటీవల విజిలెన్స్, మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌కు పాల్పడ్డారంటూ రూ.78 కోట్ల జరిమానా విధించింది. ఆ ఫైనాల్టీ ఆర్డర్‌ని హైకోర్టు డిస్మిస్ చేసింది.అయినా క్వారీపై చంద్రబాబు సర్కార్ రాజకీయ వేధింపులు ఆపలేదు. మూడు నెలలుగా క్వారీ నుండి ఒక్క రాయి కూడా కదలకుండా మైనింగ్ శాఖ నిలిపివేసింది. దీంతో ప్రతి నెలా క్వారీఫై మూడు కోట్ల భారం పడుతోంది. చివరకు క్వారీ మూసివేయాలని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి నిర్ణయించారు. నేటితో కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించిన యాజమాన్యం.. కార్వీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 350 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.ఇదీ చదవండి: హైదరాబాద్ షాపుల్లో ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’ -
అందుకే ప్రజలు చంద్రబాబును నమ్మరు: ఉషశ్రీ చరణ్
సాక్షి, తాడేపల్లి: 34 శాతం బీసీ రిజర్వేషన్ చెల్లదని తెలిసీ చంద్రబాబు డ్రామా చేశారని.. కేవలం బీసీలను మోసం చేయటానికే ఈ నాటకమంటూ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే చట్టమే తీసుకురావచ్చు.. కానీ అలా చేయకపోవటానికి కారణం బీసీలు ఎదగటం చంద్రబాబుకు ఇష్టం లేదు. వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు’’ అంటూ ఆమె దుయ్యబట్టారు.‘‘అందుకే ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, జడ్పీలు, మేయర్లు, ఎంపీపీలు.. ఇలా అన్ని పదవుల్లోనూ వైఎస్ జగనే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. బీసీల బతుకుల్లో వెలుగు నింపినది వైఎస్ జగన్ మాత్రమే. బీసీల కోసం ప్రత్యేకంగా ఒక శాఖను పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదన చేసిందీ వైఎస్ జగనే. బీసీల్లోని కులవృత్తుల వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నదీ వైఎస్ జగనే.. ఇలా అనేక రకాలుగా ఆయన బీసీలకు మేలు చేశారు’’ అని ఉషశ్రీ చరణ్ వివరించారు.కానీ చంద్రబాబు పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నాయి. జోగి రమేష్, విడదల రజిని, కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు.. ఇలా అనేకమంది బీసీ నేతలపై దాడులు చేశారు. అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేశారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుంది’’ అని ఉషశ్రీ చరణ్ తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు! -
రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు!
సాక్షి, అమరావతి: బీసీల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు వరుస డ్రామాలకు దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోలను ఏపీ హైకోర్టు గురువారం కొట్టేసింది. సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం తెచ్చిన ఆ జీవోలు చెల్లవంటూ హైకోర్టు తేల్చేసింది. తద్వారా ఊహించిన తీర్పే రావడంతో కూటమి సర్కార్‌పై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం కోటా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2026 ఆగస్టులో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే.. ఈ రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతున్నాయంటూ జీవో 105, జీవో 1065 చట్టబద్ధతను సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు సందర్భంగా.. రిజర్వేషన్లు 59 శాతానికి మించి ఉండకూడదన్న ధర్మాసనం, రాజ్యాంగపరిధికి లోబడి రిజర్వేషన్లు కల్పించలేదని అభిప్రాయపడింది. మొత్తం రిజర్వేషన్లు పరిమితిని దాటకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని చెబుతూ పంచాయతీరాజ్, పురపాలక శాఖలు తెచ్చిన ఆ జీవోలను డిస్మిస్ చేసింది. సర్ ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికలను వాయిదా వేయాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం.. ఆ కారణంతో ఎన్నికలు వాయిదా వేయమని కోరడం సరికాదని వ్యాఖ్యానించింది. అలాగే వార్డుల పునర్విభజనపైనా జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణలో చట్ట నిబంధనలు పాటించాలని.. ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది.డ్రామా నడిపిన చంద్రబాబుబీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చట్టం మాత్రం చేయలేదు. బదులుగా కేవలం జీవోలతో ముందుకెళ్లడంపై మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాల్సిన చంద్రబాబు.. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు పేరిట మరో నాటకానికి తెర తీశారు. అయితే ఆ కమిటీ నివేదిక పూర్తిగా అందకముందే జీవోలు జారీ చేయడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటే అంశంపై ఇప్పటికే న్యాయపరమైన వివాదాలు, గతంలో కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ.. అదే అంశంపై మరోసారి జీవోలు ఇవ్వడం ద్వారా బీసీలను చంద్రబాబు గందరగోళానికి గురిచేశారు. ఇటు.. కేంద్రంలోనూ భాగస్వామ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేసే దిశగా చర్యలు తీసుకోకపోవడాన్ని బీసీ సంఘాలు నిలదీస్తూ వస్తున్నాయి. ఈలోపు ఈ జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో.. చంద్రబాబు డ్రామా పండిందంటూ బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. సుప్రీం పేరిట ఇంకోటి!హైకోర్టు తీర్పు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో చంద్రబాబు మరో డ్రామాకు దిగినట్లు తెలుస్తోంది. తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని భావిస్తోందట. అయితే రిజర్వేషన్లు రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అలాంటిది ఈ జీవోల యవ్వారంలో బాబు సర్కార్ తీరును కోర్టు సమర్థిస్తుందా? అనేది అనుమానంగానే కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అదెలా సమర్థించుకుంటారు?.. ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న -
‘రౌడీషీట్ల’ ప్రొసీడింగ్స్‌ను ఎలా సమర్థించుకుంటారు?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై రౌడీషీట్లు తెరవాలంటూ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ఎలా సమర్థించుకుంటారని హైకోర్టు బుధవారం పోలీసులను ప్రశ్నించింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఎలా చెల్లుబాటు అవుతాయని నిలదీసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన బచ్చు మురళీకృష్ణ మరికొందరు మంగళవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ మహేశ్వరరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.శ్రీరామ్, వేలూరు మహేశ్వరరెడ్డి తొలుత వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పిటిషనర్లపై రౌడీషీట్లు తెరుస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. వాదనల్లో మరిన్ని ముఖ్యాంశాలు⇒ రౌడీషీట్లు ఎప్పుడు తెరవాలి.. ఎలా తెరవాలి.. అన్న విషయాలను పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ స్పష్టంగా చెబుతున్నాయి. ⇒ ఎవరిపైన అయితే రౌడీషీట్ తెరవాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తిపై ఉన్న కేసుల వివరాలు, వాటి స్వభావం, ఆ వ్యక్తి పదే పదే నేరాలు చేస్తున్నారా? ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నారా? వంటి వివరాలతో స్థానిక పోలీసులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతారు. ⇒ అయితే ప్రస్తుత కేసులో మాత్రం అందుకు విరుద్ధంగా, కమిషనరే నేరుగా ఆదేశాలు ఇచ్చారు. ఇది పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్‌కు విరుద్ధం. ⇒ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారన్న ఆరోపణలతో రౌడీషీట్లు తెరవడం దారుణం. ⇒ పిటిషనర్లకు ఎలాంటి నేర చరిత్ర లేదు. పదే పదే నేరాలు చేశారన్న ఆరోపణలు కూడా లేవు. -
బకాయిల షాక్‌తో డిస్కంలు విలవిల
సాక్షి, అమరావతి: సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రతినెలా గడువులోగా బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపేసే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు.. రూ.లక్షల్లో ఉన్న బిల్లులు చెల్లించకపోయినా బడా సంస్థలు, పెద్ద పరిశ్రమల నిర్వాహకులను ఏమీ చేయలేకపోతున్నాయి. ఇలా ఏళ్ల తరబడి పేరుకుపోతున్న బకాయిలు ఇప్పుడు రాష్ట్రంలో డిస్కంల ఆర్థిక నిర్వహణకు పెద్ద సవాలుగా మారాయి. ఒకవైపు వినియోగదారులు, ప్రభుత్వశాఖలు, స్థానికసంస్థల నుంచి రావాల్సిన వేలకోట్ల రూపాయలు బకాయిలుగా నిలిచిపోతుండగా.. మరోవైపు విద్యుత్ కొనుగోలు చేసిన జనరేటర్లకు డబ్బు చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా డిస్కంల అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తాజాగా వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని పునరుద్ధరించింది. ప్రభుత్వశాఖలు, సంస్థల నుంచే రూ.8,910.71 కోట్ల బకాయిలు ఏపీఈఆర్సీ 2025–26 టారిఫ్ ఆర్డర్లో పేర్కొన్న వివరాల ప్రకారం సబ్సిడీ బకాయిలను మినహాయించినా డిస్కంలకు రూ.20,858.47 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వశాఖలు, సంస్థల నుంచే రూ.8,910.71 కోట్లు, స్థానికసంస్థల నుంచి రూ.6,259.38 కోట్లు రావాల్సి ఉండగా ప్రైవేటు వినియోగదారుల నుంచి రూ.5,222.59 కోట్లు వసూలు కావాల్సి ఉంది. దీంతో విద్యుత్ కొనుగోలు, ప్రసార–పంపిణీ నిర్వహణ, సిబ్బంది జీతాలు, ఇతర వ్యయాలు, ఇతరత్రా తప్పనిసరి చెల్లింపులకు ఇబ్బందులు కలుగుతున్నాయి.మరోవైపు 2025 మార్చి 31 నాటికి జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.14,653 కోట్లుగా ఏపీఈఆర్సీ రికార్డులు చెబుతున్నాయి. అంటే ఒకవైపు డిస్కంలు సరఫరా చేసిన విద్యుత్‌కు రావాల్సిన డబ్బు నిలిచిపోతుండగా.. మరోవైపు డిస్కంలు కొనుగోలు చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన మొత్తాలు పేరుకుపోతున్నాయి. పాత బకాయిలు ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండటం వల్ల వాటి వసూళ్లు మరింత సంక్లిష్టం కావడంతో ఓటీఎస్‌ను పునరుద్ధరించాలని డిస్కంలు ఏపీఈఆర్సీని అభ్యర్ధించాయి. డిస్కంలకు వచ్చేది అరకొరే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమల నుంచి బకాయిల వసూలు డిస్కంలకు తలనొప్పిగా మారింది. పాత బకాయిల వసూళ్లకు న్యాయపరమైన చిక్కులు కూడా తోడవుతున్నాయి. ముఖ్యంగా పరిశ్రమలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించినప్పుడు డిస్కంలు అన్సెక్యూర్డ్ క్రెడిటర్లుగా మిగులుతున్నాయి. దీంతో సంవత్సరాల తరబడి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిల్లోను పూర్తి మొత్తం తిరిగి వచ్చే పరిస్థితి ఉండటం లేదు. అసలు విద్యుత్ బకాయితో పోలిస్తే పరిష్కారం ద్వారా అందే మొత్తం చాలా తక్కువగా ఉంటోందని ఏపీఎస్పీడీసీఎల్.. ఏపీఈఆర్సీకి సమర్పించిన నివేదికలోæ పేర్కొంది. విద్యుత్ సరఫరా చేసిన సమయంలో మొత్తం బిల్లు డిస్కం ఖాతాలో బకాయిగా కనిపించినా.. తర్వాత న్యాయపరమైన పరిష్కారంలో అందులో కొంతభాగమే చేతికి వచ్చే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపింది. ఇప్పుడైనా వసూలవుతాయా? బిల్లులు నిలిచిపోయి, కనెక్షన్లు తొలగించిన సేవలకు సంబంధించిన పాత బకాయిలను సాధారణ వసూళ్ల ప్రక్రియలో రాబట్టడం కష్టంగా మారడంతో ఓటీఎస్‌ను పునరుద్ధరించారు. సెప్టెంబర్ 28 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఏడాదికి పైగా బిల్–స్టాప్‌లో ఉన్న ఎల్టీ, హెచ్‌టీ ప్రైవేట్ వినియోగదారుల బకాయిలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. కనెక్షన్ తొలగించిన తేదీ నాటికి ఉన్న బకాయిలో సెక్యూరిటీ డిపాజిట్‌ను సర్దుబాటు చేసి, మిగిలిన మొత్తాన్ని ఒకేసారి వసూలు చేయనున్నారు. అయితే ఎన్సీఎల్టీ కేసులు, కోర్టు కేసులు, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద తుదిదశలో ఉన్న కేసులకు ఈ పథకం వర్తింపుపై పరిమితులున్నాయి. ఎన్సీఎల్టీ కేసుల్లో సంబంధిత వినియోగదారు లేదా ఐఆర్పీ, లిక్విడేటర్ అంగీకారం అవసరమని ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. పథకం అమలు, వసూళ్ల పురోగతిపై రెండునెలలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. -
వలసొచ్చిన చోటా వెతలే
సాక్షి, అమరావతి: సొంతూరిలో పనిలేక పొట్ట చేతపట్టుకుని ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాల కార్మికులు దక్షిణాది బాట పట్టారు. ఇక్కడికి వచ్చాక వారి ఆదాయం పెరిగింది. జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. కానీ.. ప్రభుత్వ పథకాలు.. వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఆదాయం సంతృప్తిగా ఉన్నా ఉద్యోగంలో భద్రత లేదు. దక్షిణాది రాష్ట్రాలకు వలస వచ్చిన కార్మికుల జీవన పరిస్థితులపై దక్షిణ భారత అంతర్ రాష్ట్ర వలస కార్మికుల సర్వే–2026 (ఎస్ఐఐఎంఎస్) వలసతో బతుకులో వెలుగు కనిపిస్తున్నా.. హక్కులు, సంక్షేమం విషయంలో అంతంతమాత్రంగానే ఉందని వెల్లడించింది. అంతర్జాతీయ వలసలు–అభివృద్ధి సంస్థ (ఐఐఎంఏడీ) ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) సహకారంతో అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) భాగస్వామ్యంతో 2026లో నిర్వహించిన ఈ సర్వే నివేదికను ఇటీవల (ఈ నెల 28న) విడుదల చేశారు. కర్ణాటక, తమిళనాడు, కేరళలోని 33 జిల్లాల్లో 1,824 మంది వలస కార్మికులు సర్వేలో పాల్గొన్నట్టు నివేదిక వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 72 శాతం మంది వలస వచ్చిన తర్వాత జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పినట్టు పేర్కొంది. వీరిలో సగం మందికి పైగా ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింది. ఉత్తర, తూర్పు రాష్ట్రాల నుంచే అధికం కర్ణాటక, తమిళనాడు, కేరళకు వచ్చిన కార్మికుల్లో ఎక్కువ మంది ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాలకు చెందినవారే ఉన్నట్టు గుర్తించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 92 శాతానికి పైగా మంది పశ్చిమ బెంగాల్ (26.2%), బిహార్ (21.8%), అసోం (17.1%), ఒడిశా (12%), ఉత్తరప్రదేశ్ (9.6%), జార్ఖండ్ (5.6%) రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఉన్నారు. వలస వచ్చిన వారు వ్యవసాయం, చేపల వేట, సముద్ర ఆధారిత పనులు, రోజువారీ కూలి పనులు, హోటళ్లు–ఆతిథ్య రంగం, వస్త్ర–దుస్తుల తయారీ, వ్యర్థాల సేకరణ వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. కేరళ హోటళ్ల రంగంలో ఉపాధి కల్పిస్తుండగా.. తమిళనాడు వస్త్ర–దుస్తుల రంగంలోను, కర్ణాటకలో వ్యర్థాల సేకరణ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించినట్టు సర్వే గుర్తించింది. పథకాల కోసం పడిగాపులు వలస కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో సమస్యలు కొనసాగుతున్నాయని సర్వే తేల్చింది. వలస కార్మికుల్లో కేవలం 19.4 శాతం మందికి మాత్రమే సంక్షేమ ప్రయోజనాలు సులభంగా అందుతున్నాయి. 35.3 శాతం మందికి పాక్షికంగా మాత్రమే అందుతుండగా.. 45.3 శాతం మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. మొత్తంగా 73.3 శాతం మంది సంక్షేమ పథకాలు, సేవలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. వైద్య సేవలు తీసికట్టు.. ఉద్యోగానికి భరోసా నిల్ వలస కార్మికుల పరిస్థితి వైద్య సేవల విషయంలోనూ ఆందోళనకరంగానే ఉంది. 69.2 శాతం మంది ఆరోగ్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. వలస కార్మికుల ఉద్యోగ పరిస్థితులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. 86.4 శాతం మందికి రాతపూర్వక ఉద్యోగ ఒప్పందం లేదు. దాదాపు 58 శాతం మందికి వేతనాలు నగదు రూపంలోనే అందుతున్నాయి. సర్వేలో పాల్గొన్న కార్మికుల సగటు నెలవారీ ఆదాయం రూ.17,640గా నమోదైంది. సగటున రోజుకు 9.87 గంటలు పనిచేస్తున్నట్టు నివేదిక తెలిపింది. మహిళా కార్మికులు పురుషుల కంటే నెలకు సగటున రూ.3,313 తక్కువగా సంపాదిస్తున్నట్టు పేర్కొంది. ఉపాధి కోసం.. ఆర్థిక భద్రత కోసం సొంత రాష్ట్రాల్లో తక్కువ వేతనాలు, ఉద్యోగ అవకాశాల కొరత, నిరుద్యోగం, పని స్థిరంగా లేకపోవడం, పేదరికం, అప్పులు వంటి కారణాలతో కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నట్టు వెల్లడైంది. చాలా మంది ఎక్కువ సంపాదన కోసమే కాకుండా కుటుంబ ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు కూడా వలస బాటపడుతున్నారని సర్వే చెబుతోంది. సూచనలు ఇవీ వలస కార్మికులకు ప్రయోజనాలు సులభంగా అందేలా ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ విధానాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని అధ్యయనం సూచించింది. స్థానిక భాషల్లో సహాయక కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. వేతనాలు సకాలంలో అందేలా పర్యవేక్షణ పెంచడం, పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు బలోపేతం చేయడం, ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం, కార్మికుల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచాలని సిఫారసు చేసింది. వలసతో జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నా.. సంక్షేమం, వైద్యం, ఉద్యోగ భద్రత విషయంలో మాత్రం కార్మికులకు పూర్తిస్థాయి అండ అవసరమని ఈ సర్వే స్పష్టం చేసింది.


