శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద కుట్ర
నా భార్య రాజకీయ జీవితాన్ని సమాధి చేయడమే వారి లక్ష్యం
మా వద్ద అన్ని ఆధారాలున్నాయి..
జనసేన బహిష్కృత నేత కోట వినుత భర్త చంద్రబాబు
ఏర్పేడు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్యలో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుదీర్‌రెడ్డే ప్రధాన సూత్రధారి అని, తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెట్టి నిర్దోíÙత్వం నిరూపించుకుంటామని జనసేన పార్టీ బహిష్కృత నేత కోట వినుత భర్త కోట చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన శనివారం మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ... ‘‘నా భార్య వినుత రాజకీయంగా ఎదుగుతుండడం ఓర్వలేక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఇదంతా చేశారు. ఆమెను అడ్డు తొలగించేందుకు డ్రైవర్ రాయుడు హత్యకు కుట్ర చేసి, అందులో మమ్మల్ని ఇరికించేలా పక్కా స్క్రిప్ట్ రచించి అధికార బలంతో అమలు చేశారు.
మా పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకముందే... రాయుడిది హత్యనా? ఆత్మహత్యనా? అని పోలీసులు తేల్చకముందే సు«దీర్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాపై ఆరోపణలు చేశారు. ఆయన వ్యాపారాలన్నీ చెన్నై కేంద్రంగా చేస్తున్నారు. అక్కడినుంచే మాపై కుట్ర చేశారు. రాయుడిని మేమే హత్య చేసి ఉంటే శ్రీకాళహస్తి నుంచి 150 కి.మీ. దూరంలోని చెన్నై వెళ్లి మృతదేహాన్ని పడేయాల్సిన అవసరం ఏముంది?’’ అని కోట చంద్రబాబునాయుడు ప్రశి్నంచారు. ఈ ఉదంతంలో ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి వన్‌టౌన్ సీఐ గోపీని చెన్నై పంపి, అక్కడి పోలీసులతో ఎమ్మెల్యే మంతనాలు జరిపించారని, విచారణ ద్వారానే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
మా కారు డ్రైవర్‌తో ఆయనకు పనేంటి?
జూన్ 25న తన మామ నగరం భాస్కర్‌కు ప్రమాదం జరగడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చి వారం పాటు అక్కడే ఉండి వైద్యం చేయించామని కోట చంద్రబాబునాయుడు తెలిపారు. అప్పటినుంచి ఆస్పత్రి పనిపైనే చెన్నై తరచూ వెళ్లామని వెల్లడించారు. సుధీర్‌రెడ్డికి అనుచరులే సరిగా గుర్తుండరని, తమ కారు డ్రైవర్‌తో ఆయనకు పనేంటని ప్రశి్నంచారు. రాయుడిని సు«దీర్‌రెడ్డి ఎమ్మెల్యే కాకముందు చాలాసార్లు ఇంటికి పిలిపించుకుని తమపై కుట్రకు బీజం వేశారని ఆరోపించారు.


