టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ఎదురు దెబ్బ | Major Setback for TDP MLA Daggupati Prasad | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ఎదురు దెబ్బ

Jan 13 2026 9:12 PM | Updated on Jan 13 2026 9:27 PM

Major Setback for TDP MLA Daggupati Prasad

సాక్షి,అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు కేటాయించిన గన్‌మెన్ షేక్షావలిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా ఎస్పీ జగదీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అనంతపురం నగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను గన్‌మెన్ షేక్షావలి, ఎమ్మెల్యే అనుచరులు కలిసి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. డబ్బు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై దాడి చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే గన్‌మెన్‌తో పాటు కొంతమంది టీడీపీ నేతలు దాడి చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన అనంతపురం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ వెంటనే స్పందించి, గన్‌మెన్ షేక్షావలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా కార్యక్రమాల్లో భద్రత కోసం నియమించిన గన్‌మెన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్రంగా ఖండించబడింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాంపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు అనంతపురం రాజకీయ వాతావరణంలో కొత్త మలుపు తిప్పింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement