సాక్షి, అమరావతి: పలువురు ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమందిని బదిలీ చేసినప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వారికి పోస్టింగ్‌లు ఇస్తూ విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు.