సాక్షి, విజయవాడ: మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. జోగీ రమేష్‌పైకు డాక్టర్లు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల సందర్భంగా జోగి రమేష్‌ను కలిసేందుకు వచ్చిన భార్య, కుమారుడితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు అందించారు. కాగా, కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులో భాగంగా కూటమి ప్రభుత్వం జోగి రమేశ్‌ను అరెస్టు చేసింది.


