breaking news
Shubman Gill
-
‘బాగుందిరా మావ’.. నితీష్ రెడ్డిని తెలుగులో ప్రశంసించిన గిల్! వీడియో
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన అద్బుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఒకే ఓవర్లో రెండు వికెట్లు అందించాడు. తన తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీని పెవిలియన్‌కు పంపాడు.జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ వంటి పేసర్లు వికెట్ తీసేందుకు శ్రమించిన చోట.. నితీశ్ తన గోల్డెన్ ఆర్మ్‌తో ఇంగ్లండ్‌కు ఊహించని షాకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఈ ఆంధ్ర ఆల్‌రౌండ్ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డారు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేసి జో రూట్ వంటి బ్యాటర్లకు సైతం చుక్కలు చూపించాడు.ఈ క్రమంలో నితీశ్‌ను భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తెలుగులో ప్రత్యేకంగా అభినందించాడు. 'బౌలింగ్ బాగుందిరా మావ'అంటూ ప్రశంసించాడు. అతడి మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.55 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(62), బెన్‌స్టోక్స్ ఉన్నారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు నితీశ్ కుమార్ రెడ్డి రెండు, జస్ప్రీత్ బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గాBagundi ra mawa - Gill to NKR ( save the video) might delete soon. pic.twitter.com/YmQn6nC30Z— Abhishek Reddy (@1_m_Abhishek) July 10, 2025 -
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్ గడ్డపై టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్‌లక్ వెంటాడుతోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టాస్ ఓడిపోయాడు. లార్డ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యా టింగ్ ఎంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది ఆరంభం నుంచి భారత్ టాస్ ఓడిపోవడం ఇది వరుసగా 13వ సారి కావడం గమనార్హం.ఈ క్రమంలో టీమిండియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ క్రికెట్(మూడు ఫార్మాట్లు)లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. విండీస్ 1999లో వరుసగా 12 మ్యాచ్‌ల్లో టాస్ గెలవలేకపోయింది. తాజా మ్యాచ్‌తో విండీస్‌ను మెన్ ఇన్ బ్లూ అధిగమించింది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్, భారత జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. ఇంగ్లండ్ జట్టులోకి జోఫ్రా ఆర్చర్ రాగా.. టీమిండియాలోకి జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. 35 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(27), పోప్(19) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్‌కు పంపాడు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్. -
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. అతడి స్థానంలో బుమ్రా
England vs India, 3rd Test- Lord's Day 1: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మూడో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. పిచ్ స్వభావాన్ని బట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. తాను టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకునేవాడినని తెలిపాడు. తమ బౌలర్లు పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నారని పేర్కొన్నాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం తనకు సంతోషంగా ఉందన్న గిల్.. తాము ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. యువ పేసర్ ప్రసిద్ కృష్ణ స్థానంలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్‌లో తొలి టెస్టు జరుగగా.. ఆతిథ్య ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ ఇందుకు ప్రతీకారం తీర్చుకుంది. స్టోక్స్ బృందాన్ని ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి.. ఈ వేదికపై తొలి గెలుపు నమోదు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య లార్డ్స్‌లో ఇప్పటి వరకు 19 టెస్టులు జరుగగా ఇంగ్లండ్ 12, భారత్ మూడు టెస్టు గెలువగా.. నాలుగు డ్రా అయ్యాయి. కాగా 2021లో చివరగా ఇక్కడ టీమిండియా గెలుపుబావుటా ఎగురవేసింది. తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్. -
IND vs ENG: భారత్ గెలుపులో వాళ్లకు కూడా క్రెడిట్ దక్కాల్సింది: యువీ
భారత టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్‌గా, సారథిగా రాణిస్తున్న గిల్‌ను చూస్తే గర్వంగా ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ పంజాబీ బ్యాటర్ మరిన్ని శతకాలు బాది తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకోవాలని ఆకాంక్షించాడు.కాగా ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లింది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత.. తొలిసారిగా జరుగుతున్న ఈ సిరీస్ సందర్భంగా యువ ఆటగాడు గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు ఉన్న జట్టుకు సారథిగా ఎంపికైన అతడు.. తొలి టెస్టులోనే బ్యాట్ ఝులిపించాడు.చారిత్రాత్మక విజయంలీడ్స్లో ఇంగ్లండ్‌పై శతక్కొట్టిన (147) గిల్.. సారథిగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)లతో చెలరేగి చారిత్రాత్మక గెలుపును రుచిచూశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి టీమిండియాను గెలిపించిన సారథిగా చరిత్రకెక్కాడు.గర్వంగా ఉందిఈ నేపథ్యంలో గిల్ మెంటార్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని శుబ్‌మన్ సవాలుగా తీసుకున్నాడు. అతడిని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఒకే టెస్టు మ్యాచ్‌లో 400కు పైగా పరుగులు సాధించడం మామూలు విషయం కాదు.గిల్ ఆట నన్నెంతగానో ఆకట్టుకుంది. అతడు మరిన్ని సెంచరీలు కొట్టాలి. గిల్ తండ్రి కూడా ఎంతో గర్వించి ఉంటారు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. అయితే, ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా చారిత్రాత్మక విజయంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాత్ర కూడా ఉందన్నాడు యువీ.ఆ ఇద్దరికీ క్రెడిట్ దక్కాల్సింది‘‘టీమిండియా గెలవాలని నాతో పాటు అందరూ కోరుకున్నారు. అయితే, ఈ విజయంలో గౌతం, అజిత్ అగార్కర్‌కు దక్కాల్సినంత క్రెడిట్ దక్కలేదని అనిపిస్తోంది. ఈ జట్టును ఒక్కచోటికి చేర్చడంలో వారిదే కీలక పాత్ర. తదుపరి మ్యాచ్‌లలోనూ టీమిండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని యువీ చెప్పుకొచ్చాడు.కాగా యువరాజ్ సింగ్‌కు చెందిన ‘యు వి కెన్’ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమం లండన్‌లో జరిగింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో పాటు విరాట్ కోహ్లి, బ్రియన్ లారా, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజాలు పాల్గొన్నారు. శుబ్‌మన్ గిల్ సేన కూడా ఇందులో భాగమైంది. ఈ సందర్భంగానే యువీ గిల్ గురించి పైవిధంగా స్పందించాడు.చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటు -
వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా!.. టీనేజ్ స్టార్ కోసం ఏకంగా..
భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు మారుమ్రోగిపోతోంది. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలు బాదుతూ ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి జట్టును గెలిపించి గిల్ చరిత్ర సృష్టించగా.. అండర్-19 యూత్ వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకోవడంలో వైభవ్‌ది కీలక పాత్ర.ఇంగ్లండ్ గడ్డపై యాభై ఓవర్ల ఫార్మాట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. టీ20 మాదిరి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 48 పరుగులు సాధించిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్ రాబట్టాడు.సునామీ శతకంఇక మూడో యూత్ వన్డేల్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, ఆ తర్వాతి వన్డేలో మాత్రం వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలింగ్‌ను చిత్తు చేశాడు. వోర్సెస్టర్ వేదికగా కేవలం 52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకుని.. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్ల వంద రోజుల వయసు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు.అయితే, ఆఖరిదైన ఐదో వన్డేలో మాత్రం వైభవ్ 42 బంతుల్లో 33 పరుగులే చేయగలిగాడు. అయితేనేం.. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల్లో ఓవరాల్‌గా 29 సిక్సర్లు బాది.. 355 పరుగులు సాధించాడు. దీంతో క్రికెట్ ప్రేమికుల్లో ఎక్కడ చూసినా వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ గురించే చర్చ.వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా!ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద వైభవ్ సూర్యవంశీ మేనియా ఏ రేంజ్లో ఉందో తెలిపేలా.. అతడి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఆరు గంటల పాటు కారులో ప్రయాణించి వోర్సెస్టర్‌కు చేరుకున్నారు. పింక్ జెర్సీ ధరించి వచ్చి వైభవ్‌తో పాటు టీమ్ ఇండియాకు మద్దతు పలికారు.ఆన్య, రివా.. వైభవ్ వయసు వారే. తమ అభిమాన ఆటగాడి కోసం వారు ఇంత దూరం వచ్చి.. మధురజ్ఞాపకాలు పోగు చేసుకున్నారు’’ అంటూ వైభవ్‌తో ఇద్దరమ్మాయిలు దిగిన ఫొటోలను రాజస్తాన్ రాయల్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఐపీఎల్‌లోనూ సరికొత్త చరిత్రకాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ బిహార్‌కు చెందిన వైభవ్‌ను.. రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్‌నెస్‌లేమి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులోకి వచ్చాడు వైభవ్. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఆకాశమే హద్దుగా చెలరేగి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల 32 రోజుల వయసులో వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు యూత్ వన్డేల సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకుంది. చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటుProof why we have the best fans 🫡🚗 Drove for 6 hours to Worcester👚 Wore their Pink🇮🇳 Cheered for Vaibhav & Team IndiaAanya and Rivaa, as old as Vaibhav himself, had a day to remember 💗 pic.twitter.com/9XnxswYalE— Rajasthan Royals (@rajasthanroyals) July 9, 2025 -
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. 95 ఏళ్ల వరల్డ్ రికార్డుపై గిల్ గురి
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా శబ్‌మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర ద్విశతకం(269 పరుగులు), సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా శతక్కొట్టాడు.తద్వారా ఓ టెస్టు మ్యాచ్లోఅత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్(430) నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో గిల్ తన ఆసాధరణ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో కూడా సత్తాచాటాలని గిల్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో గిల్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.95 ఏళ్ల రికార్డుపై కన్ను..ఈ మ్యాచ్‌లో గిల్ 225 పరుగులు చేయగలిగితే.. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా వరల్డ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉంది. బ్రాడ్‌మాన్ 1930లో ఇంగ్లండ్‌పై 810 పరుగులు చేశాడు. గిల్ ఈ సిరీస్‌లో ఇప్పటికే కేవలం రెండు మ్యాచ్‌లలోనే 585 పరుగులు సాధించాడు. లార్డ్స్‌లో బ్రాడ్‌మాన్ రికార్డు బ్రేక్ అవ్వకపోయినా మిగిలిన మ్యాచ్‌లోనైనా కచ్చితంగా గిల్ అధిగమిస్తాడు.గవాస్కర్ రికార్డుపై గురి..అదేవిధంగా ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచే ఛాన్స్ గిల్ ముంగిట ఉంది. వెస్టిండీస్ దిగ్గజం క్లైడ్ వాల్కాట్ 1955లో ఆస్ట్రేలియాపై ఒకే సిరీస్‌లో ఐదు సెంచరీలు చేశాడు. గిల్ ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు చేయగా.. మరో రెండు చేస్తే వాల్కాట్ సరసన నిలుస్తాడు. అంతేకాకుండా టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్‌గానూ శుబ్‌మన్ నిలుస్తాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ 4 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs ENG: రెండేళ్లగా జట్టుకు దూరం.. కట్ చేస్తే! సడన్‌గా భారత జట్టుతో ప్రాక్టీస్ -
లార్డ్స్‌లో టీమిండియా రికార్డులు ఇవే.. 2021 ఫలితం రిపీట్ అవుతుందా?
ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు సమయం అసన్నమైది. క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానం వేదికగా గురువారం ప్రారంభం కానున్న మూడో టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమంగా ఉండడంతో.. లార్డ్స్‌లో టెస్టులో ఎలాగైనా గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.అందుకు తగ్గట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ జట్టులోకి స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. అదేవిధంగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. లార్డ్స్‌లో ఆడడం ఖాయమైంది.అంతకుతోడు లార్డ్స్ మైదానంలో పచ్చికతో కూడిన వికెట్‌ను తాయారు చేయడంతో ఫాస్ట్ బౌలర్లకు, బ్యాటర్లకు మధ్య గట్టి పోటీ నెలకోనుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత క్రికెట్ జట్టు టెస్టు రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.భయపెడుతున్న గత రికార్డులు..ఈ మైదానంలో గత రికార్డులు భారత అభిమానులను భయపెడుతున్నాయి. లార్డ్స్‌లో ఇప్పటివరకు 19 టెస్టులు ఆడిన టీమిండియా.. కేవలం మూడింట మాత్రమే గెలిచి 12 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత జట్టు 1986లో కపిల్‌దేవ్ నేతృత్వంలో లార్డ్స్‌లో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 2014 లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో గెలిచింది. అనంతరం చివరగా 2021లో విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలిచింది.గిల్ మ్యాజిక్ చేస్తాడా..?టీమిండియా లార్డ్స్‌లో చివరగా 2021లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు అద్బుతం చేసింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కోహ్లి సేన.. ఏడేళ్ల తర్వాత లార్డ్స్‌లో టెస్టు విజయాన్ని అందుకుంది. 272 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్‌ను 120 పరుగులకే భారత్ ఆలౌట్ చేసి తమ సత్తాను చాటింది.ఇప్పుడు యువ సారథి శుబ్‌మన్ గిల్ వంతు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టు 2021 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. లార్డ్స్‌లో 2021 నాటి చారిత్రత్మక టెస్ట్ విజయంలో భాగమైన ఐదుగురు భారత ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో కూడా ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ప్లేయర్లు అప్పుడు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోసారి ఈ సీనియర్ ప్లేయర్లు తమ స్దాయికి తగ్గట్టు రాణిస్తే ప్రత్యర్ధి జట్టుకు చెమటలు పట్టక తప్పుదు.ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ -
వరల్డ్ నెం1 బ్యాటర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు.. టాప్-10లోకి గిల్
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్(Harry Brook) సత్తాచాటాడు. ఐసీసీ ప్రకటించిన తాజాగా ర్యాకింగ్స్లలో బ్రూక్ తన సహచరుడు జో రూట్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ 886 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.అతడి తర్వాతి స్దానంలో జో రూట్ 868 పాయింట్లతో ఉన్నాడు. భారత్‌తో ఇటీవల ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్(158) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు తొలి టెస్టులోనూ బ్రూక్ రాణించాడు. ఈ క్రమంలోనే వరల్డ్ నెం1 టెస్టు బ్యాటర్‌గా అతడు అవతరించాడు.టాప్-10లో శుబ్‌మన్ గిల్..ఇక ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269), రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) సాధించిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సైతం తాజా ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. గిల్ 807 పాయింట్లతో ఏకంగా 15 స్థానాలు మెరుగుపరచుకుని తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ ఆరో స్థానానికి చేరుకున్నాడు.ఇక గిల్‌తో పాటు మరో ఇద్దరు బ్యాటర్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నాలుగో స్ధానంలో ఉండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఎనిమిదవ స్దానంలో నిలిచాడు. మరోవైపు భారత్‌తో రెండో టెస్టులో సత్తాచాటిన ఇంగ్లండ్ కీపర్ జెమీ స్మిత్ 753 పాయింట్లతో 16 స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరుకున్నాడు.టాప్‌లోనే బుమ్రా..అయితే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(898) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. సఫారీ పేసర్ కగిసో రబాడ(851) రెండో స్ధానంలో ఉన్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అగ్రస్దానంలో కొనసాగుతున్నాడు.చదవండి: ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్ పంత్ -
అమాసకు.. పున్నానికోసారి మాత్రమే!.. గంభీర్ రియాక్షన్ వైరల్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ Gautam Gambhir)కు చాలా కాలం తర్వాత గొప్ప ఊరట లభించింది. ఇంగ్లండ్ (IND vs ENG)తో రెండో టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంతో అతడిపై విమర్శలకు అడ్డుకట్ట పడింది. కాగా గౌతీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమిండియా బాగానే రాణిస్తోంది.వరుస పరాజయాలుముఖ్యంగా ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) రూపంలో ఐసీసీ ట్రోఫీ గెలవడం గంభీర్ కోచింగ్ కెరీర్లో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే, టెస్టుల్లో మాత్రం గౌతీ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌పై విజయం మినహా.. టీమిండియా వరుసగా దారుణ పరాజయాలు చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఘోర పరాభవం చవిచూసింది.ఆసీస్ చేతిలో 3-1తో ఓడి దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ క్రమంలో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఈ ట్రోఫీ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించగా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు స్వస్తి పలికారు.ఈ నేపథ్యంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టగా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ ఆరంభంలో చేదు అనుభవమే మిగిలింది. తొలి టెస్టులో టీమిండియా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇక సంప్రదాయ ఫార్మాట్లో భారత్ ఇలా వరుసగా మ్యాచ్‌లు ఓడటంతో గంభీర్‌పై విమర్శల వర్షం కురిసింది. అతడిని కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి.తొలిసారి ఈ వేదికపై గెలిచిఇలాంటి తీవ్ర ఒత్తిడి నడుమ టీమిండియా తమకు అచ్చిరాని ఎడ్జ్‌బాస్టన్ వేదికపై ఇంగ్లండ్‌పై భారీ విజయం సాధించింది. ఆతిథ్య జట్టుకు ఊహించని రీతిలో షాకిచ్చి.. ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా టెస్టుల్లో కెప్టెన్‌గా గిల్‌కు.. విదేశీ గడ్డపై కోచ్‌గా గంభీర్‌కు తొలి విజయమే మధురానుభూతిని మిగిల్చింది.ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించిన తర్వాత గంభీర్ చిరునవ్వులు చిందించాడు. సాధారణంగా అతడు ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం ఇరుజట్ల ఆటగాళుల పరస్పరం కరచాలనం చేసుకుంటున్న సమయంలో గిల్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న గౌతీ.. ఎంతో సంతోషంగా కనిపించాడు.అతడు తరచూగా నవ్వడు.. ఈసారి మాత్రంఇందుకు సంబంధించిన దృశ్యాలను కెమెరామెన్ ఒడిసిపట్టగా.. కామెంటేటర్ రవిశాస్త్రి గంభీర్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో చణుకులు విసిరాడు. ‘‘అతడు తరచూగా నవ్వడు. అయితే, ఈసారి మాత్రం చిరునవ్వులు చిందించేందుకు పూర్తిగా అర్హుడు.ఒక ఓటమి తర్వాత జట్టు తిరిగి పుంజుకోవడం.. అది కూడా ఈ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవ్వడం.. సిరీస్ ఆశలను సజీవం చేసుకోవడం కంటే ఓ కోచ్‌కు గొప్ప సంతోషం మరేదీ ఉండదు’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అమాసకు.. పున్నానికోసారి మాత్రమే!ఇక రవిశాస్త్రి కామెంట్స్ వైరల్ కాగా.. ‘‘అమాసకు.. పున్నానికి (అమావాస్యకు.. పౌర్ణమికి) ఓసారి నవ్వే గంభీర్.. ఈసారి మనస్ఫూర్తిగా చిరునవ్వులు చిందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్ వేదికగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలవగా.. బర్మింగ్‌హామ్‌లో గెలిచిన భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య జూలై 10-14 వరకు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మూడో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్🎙️ Ravi Shastri on-air: Don't see him smile too often but Gautam Gambhir deserves every bit of it. #ENGvsIND pic.twitter.com/avyTsSTv5t— KKR Vibe (@KnightsVibe) July 6, 2025 -
అందని ద్రాక్ష పుల్లన!... ఇంత ఏడుపు దేనికి?
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఓడిపోయిన తర్వాత ఇలాంటి కుంటిసాకులు చెప్పడం అస్సలు బాగాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘‘అందని ద్రాక్ష పుల్లన’’ అనుకునే ‘నక్క’ మాదిరి వేషాలు వేయొద్దంటూ తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర తిరగరాస్తూ తొలిసారి ఆతిథ్య జట్టు (IND Beat ENG)పై విజయ ఢంకా మోగించింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి వెయ్యికి పైగా పరుగులు సాధించి.. ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.ఉపఖండ పిచ్ మాదిరే ఉందిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందిస్తూ.. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘నిజం చెప్పాలంటే.. ఈ వికెట్ ఉపఖండ పిచ్ మాదిరే ఉంది. ఆట సాగుతున్న కొద్దీ పరుగులు రాబట్టడం కష్టతరంగా మారింది.పర్యాటక జట్టుకు అలవాటైన పిచ్‌లా మారిపోయిందనిపించింది. భారత బౌలింగ్ దళం తమకు అనుకూలమైన మాదిరి పిచ్‌పై బాగా ఆడింది’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా ఉపఖండ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే.పేసర్లకు 18 వికెట్లుఅయితే, ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పొడిగా ఉంటుంది కాబట్టి బంతి టర్న్ అవుతుందనుకున్నా.. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లే 18 వికెట్లు పడగొట్టారు. స్పిన్ ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ తలా ఒక్క వికెట్ మాత్రమే తీశారు. దీనిని బట్టి టీమిండియా కొత్త బంతితో ఎంత అద్భుతంగా రాణించిందో అర్థమవుతోంది. అయినప్పటికీ స్టోక్స్ ఇలా పిచ్‌ను సాకుగా చూపి.. టీమిండియా గెలుపును తక్కువ చేసేలా మాట్లాడటం అభిమానులకు రుచించలేదు. దీంతో.. ‘‘ఇంత ఏడుపు దేనికి?.. హుందాగా ఓటమిని అంగీకరించవచ్చు కదా’’ అంటూ అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.వరల్డ్ క్లాస్ టీమ్ ఇక ఏదేమైనా భారత్ వరల్డ్ క్లాస్ టీమ్ అంటూ ప్రశంసించిన స్టోక్స్.. శుమ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని కొనియాడటం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ద్విశతకం (269), శతకం (161) బాదగా... పేసర్ ఆకాశ్ దీప్ పది వికెట్లతో చెలరేగాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 10- 14 మధ్య జరుగనున్న మూడో టెస్టుకు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదిక.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు- సంక్షిప్త స్కోర్లు👉భారత్: 587 & 427/6 డిక్లేర్డ్👉ఇంగ్లండ్: 407 & 271👉ఫలితం: ఇంగ్లండ్‌పై 336 పరుగుల తేడాతో భారత్ జయభేరి.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్ -
టీమిండియా గెలుపుపై సచిన్ అలా.. కోహ్లి ఇలా..
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా చారిత్రాత్మక టెస్టు విజయం నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli) హర్షం వ్యక్తం చేశారు. యువ సారథి శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు జట్టును అభినందించారు. కాగా ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియా తొలిసారి గెలుపు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు రిటైర్మెంట్ తర్వాత.. తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లిన యువ జట్టు.. ఈ అద్భుతం చేసింది.కెప్టెన్‌గా తొలి టెస్టులో ఓటమిని చవిచూసినప్పటికీ రెండో టెస్టులో మాత్రం శుబ్‌మన్ గిల్.. గత తప్పిదాలను పునరావృతం కానీయలేదు. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా అదరగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.ఆకాశ్‌పై ప్రశంసలుఈ నేపథ్యంలో టీమిండియాతో పాటు గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందిస్తూ... ‘‘టీమిండియా అద్భుత టెస్టు విజయం సాధించినందుకు నీకు శుభాకాంక్షలు గిల్. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టారు.టీమిండియా తన వ్యూహాలతో ఇంగ్లండ్ తమ ఆట తీరును మార్చుకునేలా చేసింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ అద్భుతం. ఇక ఆకాశ్ దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?!... జో రూట్‌కు అతడు వేసిన బంతిని ‘బాల్ ఆఫ్ ది సిరీస్’గా చెప్పుకోవచ్చు. అంతేకాదు.. జాంటీరోడ్స్ మాదిరి మహ్మద్ సిరాజ్ క్యాచ్ అందుకోవడాన్ని నేనైతే పూర్తిగా ఆస్వాదించాను’’ అని సచిన్ టెండుల్కర్ భారత ఆటగాళ్లను ప్రశంసించాడు.కోహ్లి పోస్ట్ వైరల్మరోవైపు.. విరాట్ కోహ్లి సైతం స్పందిస్తూ.. ‘‘ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు గొప్ప విజయం. ఏమాత్రం బెదురులేకుండా ఆడి.. ఇంగ్లండ్‌పై ఆద్యంతం పైచేయి సాధించారు. శుబ్‌మన్ గిల్ బ్యాట్‌తోనూ.. సారథిగా తన వ్యూహాలతోనూ గొప్పగా రాణించాడు.ప్రతి ఒక్కరు గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇలాంటి పిచ్‌పై సిరాజ్, ఆకాశ్ బౌలింగ్ చేసిన తీరును కొనియాడాల్సిందే’’ అని ట్వీట్ చేశాడు. కాగా కోహ్లి పోస్టును ఇప్పటికే ఐదున్నర మిలియన్ల మందిక్షించారు. ఇక టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా భారత్ ఐదు సెంచరీలు నమోదు చేసినా.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.గిల్ సెంచరీలు.. అదరగొట్టిన ఆకాశ్అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లూ అదరగొట్టారు. కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) బాది ముందుండి నడిపించగా.. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (55), రిషభ్ పంత్ (65), రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తా చాటారు. దీంతో భారత్ ఇంగ్లండ్‌కు 608 పరుగుల లక్ష్యం విధించగా.. నాలుగో రోజు ఆటలో మూడు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టుకు వరణుడు సాయం చేసేలా కనిపించాడు.ఆఖరిదైన ఐదో రోజు వర్షం అంతరాయం కలిగించగా.. మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగుస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. అయితే, వాన తెరిపినిచ్చిన తర్వాత పేసర్ ఆకాశ్ దీప్ ఆకాశమే హద్దుగా చెలరేగి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఏడు వికెట్లతో అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్While Siraj & Akash Deep tore through England, the umpire had other plans for DSP Siraj… and got the stare of the century. 😤🎥India made history — first Asian team to conquer Edgbaston! 🏰🇮🇳From serious records to serial reactions —Historic win. Hilarious moments. One… pic.twitter.com/jF3q64fpws— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
చరిత్ర సృష్టించిన ఆకాశ్ దీప్..
టీమిండియా స్టార్ ఆకాశ్ దీప్ (Akash Deep) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు. స్టోక్స్ బృందంతో రెండో టెస్టు సందర్భంగా ఆకాశ్ దీప్ ఈ ఘనత సాధించాడు.టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందకు భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఓడిన గిల్ సేన.. రెండో టెస్టులో మాత్రం చారిత్రాత్మక విజయం సాధించింది.336 పరుగుల తేడాతో గెలుపుబర్మింగ్హామ్లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఆతిథ్య జట్టును ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. ఈ వేదికపై తొలిసారి టెస్టు గెలుపును రుచిచూసింది. అంతేకాదు పరుగుల తేడా పరంగా విదేశీ గడ్డపై టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం మరో విశేషం.ఇక చిరస్మరణీయ గెలుపులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు.. పేసర్ ఆకాశ్ దీప్లది అత్యంత కీలక పాత్ర. గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. భారత్ ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యం (608) ఉంచడానికి దోహం చేశాడు.పది వికెట్లతో మెరిసిఅయితే, వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో ఇంగ్లండ్ డ్రా కోసం ప్రయత్నిస్తుందేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి.. జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 20 ఓవర్లలో 88 పరుగులు ఇచ్చిన ఆకాశ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0)లను డకౌట్ చేయడంతో పాటు.. ప్రమాదకర బ్యాటర్ హ్యారీ బ్రూక్ (158)తో పాటు క్రిస్ వోక్స్ (5) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24)ల పనిపట్టాడు ఆకాశ్. అంతేకాదు జో రూట్ (6), హ్యారీ బ్రూక్ (23), జేమీ స్మిత్ (88), బ్రైడన్ కార్స్ (38) వికెట్లను కూడా ఈ 28 ఏళ్ల రైటార్మ్ పేసర్ పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో మొత్తంగా 21.1 ఓవర్ల బౌలింగ్‌లో 99 పరుగులు ఇచ్చిన ఆకాశ్ దీప్ ఇలా ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు.ఓవరాల్‌గా రెండో టెస్టులో మొత్తంగా 187 పరుగులు ఇచ్చి.. పది వికెట్లు పడగొట్టిన ఆకాశ్ దీప్.. టీమిండియా తరఫున ఇంగ్లండ్ గడ్డ మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు చేతన్ శర్మ పేరిట ఉండేది.ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టుల్లో భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు వీరే🏏ఆకాశ్ దీప్- 2025లో బర్మింగ్‌హామ్ వేదికగా- 10/187 🏏చేతన్ శర్మ- 1986లో బర్మింగ్‌హామ్ వేదికగా- 10/188🏏జస్ప్రీత్ బుమ్రా- 2021లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా- 9/110 🏏జహీర్ ఖాన్- 2007లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా- 9/134.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్#AkashDeep’s 6/99 was nothing short of sensational. A game-changing performance that turned the tide in India’s favour, securing a historic victory.#ENGvIND 👉 3rd TEST, THU, JULY 10, 2:30 PM onwards on JioHotsta pic.twitter.com/JfBGgKQF7T— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
భారత టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సాధించాడు. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలిసారి టీమిండియాకు టెస్టు విజయాన్ని అందించాడు. బ్యాటర్‌గానూ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని.. సారథిగా రెండో ప్రయత్నంలోనే చిరస్మరణీయ గెలుపుతో సత్తా చాటాడు.చారిత్రాత్మక విజయంతోనే సమాధానంఈ నేపథ్యంలో 25 ఏళ్ల శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెప్టెన్‌గా ఇతడేంటి? అన్న వాళ్లకు చారిత్రాత్మక విజయంతోనే సమాధానమిచ్చాడంటూ మాజీ క్రికెటర్లు ఈ కుర్రాడిని కొనియాడుతున్నారు. అయితే, అంతా బాగానే ఉన్నా టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ వ్యవహరించిన తీరు అతడిని చిక్కుల్లో పడేసేలా ఉంది.చిక్కుల్లో పడేలా గిల్ చర్య?టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269)తో చెలరేగిన గిల్.. రెండో ఇన్నింగ్స్ (161)లోనూ శతక్కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో తాను అవుటైన కాసేపటికే గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటన చేశాడు.డ్రెసింగ్‌రూమ్ బయటకు వచ్చి అప్పటికి క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా (69*), వాషింగ్టన్ సుందర్ (12*)లను వెనక్కి రావాల్సిందిగా గిల్ రెండు చేతులతో సైగ చేశాడు. అయితే, ఈ సందర్భంగా అతడు తన జెర్సీ తీసేసి.. బ్లాక్ వెస్ట్ (లో దుస్తులు)తో దర్శనమిచ్చాడు. అది నైక్ బ్రాండ్‌కు చెందినది.ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు గిల్ తీరును విమర్శిస్తూ అతడితో పాటు బీసీసీఐ కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..బీసీసీఐ అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ అన్న విషయం తెలిసిందే. ఇందుకు గానూ భారత పురుషుల జట్టు జెర్సీలు, కిట్లు రూపొందించేందుకు బీసీసీఐతో భారీ మొత్తానికి అడిడాస్ 2023లో ఐదేళ్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, ఆ బ్రాండ్‌కు కాంపిటీటర్ అయిన మరో బ్రాండ్ వెస్ట్ ధరించి గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం.. అది విశేషంగా వైరల్ కావడంతో చట్టపరంగా బోర్డుకు, అతడికి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. మరి కొందరేమో ఓ అడుగు ముందుకేసి.. ‘‘నువ్వు ఇప్పుడు కెప్టెన్‌వి. ఆచితూచి అడుగేయాలి. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు’’ అంటూ గిల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 10 -14 మధ్య లార్డ్స్‌లో మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు🏏టీమిండియా- 587 & 427/6 d🏏ఇంగ్లండ్- 407 & 271🏏ఫలితం- ఇంగ్లండ్‌ను 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 🏏తొలి టెస్టులో ఓటమికి బదులు తీర్చుకుని.. సిరీస్ 1-1తో సిరీస్ సమం🏏ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- శుబ్‌మన్ గిల్.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్pic.twitter.com/SkeKPaxH5S— Shubman Gill (@ShubmanGill) July 6, 2025While Siraj & Akash Deep tore through England, the umpire had other plans for DSP Siraj… and got the stare of the century. 😤🎥India made history — first Asian team to conquer Edgbaston! 🏰🇮🇳From serious records to serial reactions —Historic win. Hilarious moments. One… pic.twitter.com/jF3q64fpws— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
అక్కా.. ఇది నీ కోసమే.. బంతి అందుకున్న ప్రతిసారీ..: ఆకాశ్ దీప్ భావోద్వేగం
‘‘మా అక్కకు క్యాన్సర్. గత రెండు నెలలుగా ఆమె వ్యాధితో పోరాడుతోంది. ఇంత వరకు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే, ప్రస్తుతం మా అక్క పరిస్థితి బాగానే ఉంది. తను కోలుకుంటోంది.ఈ మ్యాచ్‌లో నా ఆటతీరుతో ఆమె ఎంతగానో సంతోషించి ఉంటుంది. మా అక్కకు నా ఈ మ్యాచ్‌ను అంకితమిస్తున్నా. ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెరగకూడదు. ఇది నీ కోసమే అక్కా.. బంతి అందుకున్న ప్రతిసారి నా మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.నీ రూపమే నా మదిలో మెదులుతుంది. నిన్ను సంతోషరచాలనే నా ప్రయత్నాలు. మేమంతా నీతోనే ఉన్నాం’’ అంటూ టీమిండియా స్టార్ ఆకాశ్ దీప్ (Akash Deep) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston)లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ పేస్ బౌలర్.. తన ప్రదర్శనను క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అక్కకు అంకితమిచ్చాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్ సేన.. ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఆది నుంచే ఆధిపత్యంఇలాంటి తరుణంలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు బరిలో దిగిన భారత్.. ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) బాది జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్‌కు 608 పరుగుల మేర భారీ లక్ష్యం విధించగలిగింది.కీలక వికెట్లు కూల్చి.. విజయం అందించిఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆట పూర్తవుతుందనగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తొలిరోజే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, ఐదో రోజు వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యం కాగా.. ‘డ్రా’ భయం అభిమానులను వెంటాడింది. కానీ ఆకాశ్ దీప్ ఇంగ్లండ్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు.అద్భుతమైన డెలివరీలతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24), జో రూట్ (6), హ్యారీ బ్రూక్ (23), జేమీ స్మిత్ (88) రూపంలో ఏకంగా ఐదు కీలక వికెట్లు కూల్చిన ఆకాశ్.. బ్రైడన్ కార్స్ (38) వికెట్‌తో సిక్సర్ కొట్టాడు. తద్వారా ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.బుమ్రా లేడు కాబట్టే..నిజానికి రెండో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో ఆకాశ్ దీప్‌నకు తుదిజట్టులో చోటు దక్కింది. ఇక అక్క క్యాన్సర్‌తో పోరాడుతున్న వేళ.. ఓవైపు తోబుట్టువు గురించి మనసులో ఆందోళనలు చెలరేగుతున్నా ఈ రైటార్మ్ పేసర్ తన ఏకాగ్రత చెదరనీయలేదు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.#AkashDeep’s 6/99 was nothing short of sensational. A game-changing performance that turned the tide in India’s favour, securing a historic victory.#ENGvIND 👉 3rd TEST, THU, JULY 10, 2:30 PM onwards on JioHotsta pic.twitter.com/JfBGgKQF7T— Star Sports (@StarSportsIndia) July 6, 2025 ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లతో మెరిశాడు. ఇలా రెండో టెస్టులో మొత్తంగా పది వికెట్లు తీసి టీమిండియా చిరస్మరణీయ విజయంలో కీలకంగా మారాడు. మిగతా వాళ్లలో సిరాజ్ మొత్తంగా ఏడు వికెట్లు కూల్చగా.. ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు (జూలై 2-6)వేదిక: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్హామ్భారత్: 587 & 427/6 డిక్లేర్డ్ఇంగ్లండ్: 407 & 271ఫలితం: ఇంగ్లండ్‌పై 336 పరుగుల తేడాతో భారత్ భారీ విజయంప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్ -
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా చరిత్రను తిరగరాసింది. ఎక్కడైతే వరుస పరాజయాలు చవిచూసిందో అక్కడే ఘన విజయం సాధించి సగర్వంగా తలెత్తుకుంది. తొమ్మిదో ప్రయత్నంలో ఎడ్జ్‌బాస్టన్ వేదికపై తొలిసారి టెస్టు మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును ఏకంగా 336 పరుగుల (India Beat England)తో చిత్తు చేసింది.ఇక భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు ఇదే తొలి విజయం. లీడ్స్‌లో స్టోక్స్ బృందం చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూనే.. సరికొత్త చరిత్ర సృష్టించాడు గిల్. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా సత్తా చాటి విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. ఆతిథ్య జట్టుకు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆఖరి రోజు వర్షం అడ్డంకిగా మారినా.. పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తన అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా పది వికెట్లు కూల్చాడు.ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతేఈ నేపథ్యంలో విజయానంతరం కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఆకాశ్ దీప్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడు తన ప్రాణం పెట్టి పూర్తి నిబద్ధతతో ఆడాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో అద్భుతం చేశాడు. ఇలాంటి వికెట్ మీద ఇలా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. అతడొక అద్భుతం అంతే’’ అంటూ ఆకాశ్‌ను ఆకాశానికెత్తాడు.కెప్టెన్‌కు ఇంకేం ఇబ్బందిఅదే విధంగా మిగతా బౌలర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మా బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. పేసర్లే 17 వికెట్లు తీసి ఇస్తే.. కెప్టెన్‌కు ఇంకేం ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా 20 వికెట్లు తీయగల బౌలింగ్ దళం మాకు ఉంది. గతంలో ఎన్నోసార్లు సిరీస్ తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత తిరిగి పుంజుకున్నాం. మా గెలుపునకు కారణం అదేగత మ్యాచ్ అనంతరం లోపాలపై దృష్టి పెట్టాం. ఈసారి బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శన వల్లే విజయం సాధ్యమైంది’’ అని తమ గెలుపునకు గల కారణాన్ని వెల్లడించాడు. ఇక తన వ్యక్తిగత ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నానన్న గిల్.. క్రీజులో ఉన్నప్పుడు బ్యాటర్‌గానే ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.కాగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చినా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కలిసి అతడు లేని లోటును పూడ్చారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లతో అదరగొట్టగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు కూల్చాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్ దీప్.. ఆరు వికెట్లు కూల్చి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వారిలో సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.చదవండి: Akash Deep: ‘ఆకాశ’మంత ఆనందం... #AkashDeep’s 6/99 was nothing short of sensational. A game-changing performance that turned the tide in India’s favour, securing a historic victory.#ENGvIND 👉 3rd TEST, THU, JULY 10, 2:30 PM onwards on JioHotsta pic.twitter.com/JfBGgKQF7T— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
Akash Deep: ‘ఆకాశ’మంత ఆనందం...
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనూ టీమిండియా మెరుగైన ప్రదర్శనే చేసింది. 15 సెషన్ల పాటు సాగిన పోరులో... అధిక భాగం మనదే ఆధిపత్యం. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ శతకాలతో ప్రత్యర్థి ముందు 371 పరుగుల లక్ష్యం నిలిచింది. ఎలాంటి పిచ్‌పైనైనా నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ స్కోరు ఛేదించడం కష్టతరమే! అందులోనూ ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టడం అంటే ఆషామాషీ కాదు! అయితే ఇక్కడే ఇంగ్లండ్ ప్లేయర్లు తమ గేమ్ ప్లాన్‌తో ఆకట్టుకున్నారు. ]బుమ్రాను గౌరవించిన ఆతిథ్య ఆటగాళ్లు ఇతర బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్జీవ పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల పండగ చేసుకుంటుంటే... మనవాళ్లు చేష్టలుడిగి చూస్తుండటం తప్ప మరేం చేయలేకపోయారు. సిరాజ్ ప్రభావం చూపలేకపోగా... ప్రసిధ్ కృష్ణ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఏ బౌలర్‌కు సాధ్యం కాని చెత్త గణాంకాలు ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ నిర్ణయాలు బెడిసికొట్టడంతో... ఇక సిరీస్‌లో టీమిండియా కోలుకోవడం కష్టమే అనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు ఆరు నెలల ముందు నుంచే బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టులే ఆడుతాడు అని మేనేజ్మెంట్ ఊదరగొడుతుండగా... రెండో మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. బరి్మంగ్హామ్లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ గెలిచిన చరిత్రలేని భారత జట్టు... ప్రధాన పేసర్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగింది. ఇంకేముంది మరో పరాజయానికి బాటలు పడ్డట్లే అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇలాంటి స్థితిలోనే టీమిండియా అద్భుతం చేసింది. మహామహా ఆటగాళ్లకు సాధ్యం కాని ఘనతను ఖాతాలో వేసుకుంది. యువ సారథి శుబ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేయడం వల్లే టీమిండియా కొండంత స్కోరు చేసిన మాట వాస్తవమే అయినా... ఆత్మవిశ్వాసం లోపించిన బౌలింగ్ దళంలో జవసత్వాలు నింపిన ఘనత మాత్రం ఆకాశ్దీప్కే దక్కుతుంది. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయాల్సిన తీవ్ర ఒత్తిడిలో... కొత్త బంతి అందుకున్న ఆకాశ్‌దీప్ తన రెండో ఓవర్లోనే ఇంగ్లండ్‌కు ‘డబుల్ స్ట్రోక్’ ఇచ్చాడు. ఓ చక్కటి బంతితో డకెట్‌ను బుట్టలో వేసుకున్న ఈ బీహార్ పేసర్... తదుపరి బంతికి ఓలీ పోప్‌ను పెవిలియన్ బాట పట్టించి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఈ రెండు వికెట్లలో క్యాచ్‌లు పట్టిన గిల్, రాహుల్‌కు కూడా సమాన పాత్ర ఉన్నా... జట్టులో ఒక్కసారిగా సానుకూల దృక్పథం తీసుకొచ్చింది మాత్రం ముమ్మాటికీ ఆకాశ్‌దీపే. మరో ఎండ్‌లో సిరాజ్ కూడా రాణించడంతో ఇంగ్లండ్ వెనకడుగు వేసినట్లే అనిపించినా... బ్రూక్, స్మిత్ ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం తిరిగి ఆతిథ్య జట్టును పోటీలోకి తెచ్చింది. ఈ దశలో మరోసారి ఆకాశ్‌దీప్ డబుల్ ధమాకా మోగించాడు. బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్‌దీప్... వోక్స్‌కు పెవిలియన్ బాట చూపెట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అతడి బౌలింగ్ మరింత పదునెక్కింది. నాలుగో రోజు రెండు వికెట్లు తీసిన ఆకాశ్... ఆఖరి రోజు తన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించాడు. వర్షం విరామం అనంతరం కాస్త సీమ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై చక్కటి బంతులతో పోప్, బ్రూక్‌ను అవుట్ చేసి భారత విజయానికి బాటలు వేశాడు. ఈ క్రమంలో కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో అదుర్స్ అనిపించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌దీప్ తీసిన ఐదు వికెట్లు వరుసగా డకెట్, రూట్, పోప్, బ్రూక్, స్మిత్వి కావడం అతడి బౌలింగ్ నైపుణ్యాన్ని చాటుతోంది. బుమ్రాలాగా మెరుపు వేగం లేకున్నా... లైన్ అండ్ లెంగ్త్‌తో కూడిన క్రమశిక్షణ కట్టిపడేసింది. తొలి ఇన్నింగ్స్ ప్రదర్శన అనంతరం ‘తదుపరి మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందో లేదో’ అని అనుమానం వ్యక్తం చేసిన ఆకాశ్... రెండో ఇన్నింగ్స్ ప్రదర్శనతో తనను జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి కలి్పంచాడు. ఈ జోరు ఇలాగే సాగిస్తే సుదీర్ఘకాలం అతడు జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఖాయమే!1692: ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన పరుగులు. భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్‌లో ఇవే అత్యధికం సాక్షి క్రీడా విభాగం -
బర్మింగ్‌హామ్‌లో జైహింద్
బుమ్రాకు విశ్రాంతినివ్వడం... కుల్దీప్ను విస్మరించడం... ప్రసి«ద్‌ను కొనసాగించడం... టాపార్డర్‌ను కూల్చిన అనంతరం ప్రత్యర్థిని కోలుకోనివ్వడం... సరైన సమయంలో ఇన్నింగ్స్ ‘డిక్లేర్’ చేయకపోవడం... ఇన్ని ప్రతికూలతలకు తోడు చివరి రోజు వర్షం సైతం ఆతిథ్య జట్టును ఆదుకునేలా కనిపించడంతో.. ఒకదశలో భారత విజయంపై నీలినీడలు కమ్ముకోగా... ఆకాశ్‌దీప్ సింగ్ వాటిని పటాపంచలు చేస్తూ విజృంభించాడు. యువసారథి శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్ మెరుపులకు... ఆకాశ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తోడవడంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా విజయఢంకా మోగించింది. నాలుగేళ్ల క్రితం ‘గబ్బా స్టేడియం’లో ఆ్రస్టేలియాపై తొలి విజయంలో కీలకపాత్ర పోషించిన గిల్, పంత్, సిరాజ్... ఇక్కడ కూడా సత్తా చాటడంతో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియా తొలిసారి టెస్టుల్లో గెలిచింది. గతంలో ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్లో ఇంగ్లండ్‌తో భారత్ 8 టెస్టులు ఆడగా ... ఏడింటిలో ఓడి... ఒకసారి ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిదో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలిసారి టెస్టు ఫార్మాట్లో విజయం నమోదు చేసుకుంది. బ్యాటర్ల బీభత్సానికి బౌలర్ల సహకారం తోడవడంతో రెండో టెస్టులో టీమిండియా 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. విదేశాల్లో పరుగుల తేడా పరంగా భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. 608 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 72/3తో ఆదివారం చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చివరకు 68.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (99 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. భారీ వర్షం కురవడంతో ... చివరిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా... ఒకదశలో వరుణుడి సాయంతో ఇంగ్లండ్ గట్టెక్కేలా కనిపించినా... వాన తెరిపినిచి్చన అనంతరం భారత బౌలర్లు విజృంభించి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఆకాశ్‌దీప్ 6 వికెట్లతో అదరగొట్టగా... సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, జడేజా, సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. బర్మింగ్‌హామ్‌లో భారత్‌కు ఇదే మొదటి గెలుపు కాగా... ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 1–1తో సమం చేసింది. భారత కెప్టెన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లార్డ్స్‌లో గురువారం నుంచి మూడో టెస్టు జరుగుతుంది. మళ్లీ అతడే... వర్షంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ఆట ప్రారంభం కావడంతో ఓవర్లను కుదించారు. దీంతో ఏ మూలో భారత విజయంపై అనుమానాలు రేకెత్తగా... వాటిని ఆకాశ్‌దీప్ పటాపంచలు చేశాడు. రెండో ఓవర్ తొలి బంతికే పోప్ (24)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్... తదుపరి ఓవర్లో బ్రూక్ (23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ ఆత్మరక్షణలో పడగా... లంచ్ విరామానికి ముందు కెప్టెన్ బెన్ స్టోక్స్ (73 బంతుల్లో 33; 6 ఫోర్లు)ను అవుట్ చేయడం ద్వారా సుందర్ జట్టును విజయానికి మరింత చేరువ చేశాడు. ఇక గెలుపు లాంఛనం మాత్రమే మిగలగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జేమీ స్మిత్ ఎదురుదాడికి దిగాడు. ధాటిగా ఆడుతూ ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన స్మిత్ మరో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖరారైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407; భారత్ రెండో ఇన్నింగ్స్: 427/6 డిక్లేర్డ్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డకెట్ (బి) ఆకాశ్‌దీప్ 25; క్రాలీ (సి) (సబ్) సుదర్శన్ (బి) సిరాజ్ 0; పోప్ (బి) ఆకాశ్‌దీప్ 24; రూట్ (బి) ఆకాశ్‌దీప్ 6; బ్రూక్ (ఎల్బీ) ఆకాశ్‌దీప్ 23; స్టోక్స్ (ఎల్బీ) (బి) సుందర్ 33; స్మిత్ (సి) సుందర్ (బి) ఆకాశ్‌దీప్ 88; వోక్స్ (సి) సిరాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 7; కార్స్ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 38; టంగ్ (సి) సిరాజ్ (బి) జడేజా 2; బషీర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (68.1 ఓవర్లలో ఆలౌట్) 271. వికెట్ల పతనం: 1–11, 2–30, 3–50, 4–80, 5–83, 6–153, 7–199, 8–226, 9–246, 10–271. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 21.1–2–99–6; సిరాజ్ 12–3–57–1; ప్రసిధ్ కృష్ణ 14–2–39–1; జడేజా 15–4–40–1; సుందర్ 6–2–28–1. -
అరివీర భయంకరమైన ఫామ్‌లో శుభ్‌మన్ గిల్.. ప్రమాదంలో ఆల్‌టైమ్ రికార్డు
ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఏకంగా 585 పరుగులు సాధించాడు. ఈ పర్యటనలో భారత్ ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గిల్ ఇదే ఫామ్‌ను తదుపరి మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తే ఓ ఆల్‌టైమ్ రికార్డు బద్దలయ్యే ప్రమాదం ఉంది.అదేంటంటే.. ఐదు అంతకంటే తక్కువ మ్యాచ్‌ల ఓ సిరీస్‌లో (విదేశాల్లో) అత్యధిక పరుగుల రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) పేరిట ఉంది. బ్రాడ్‌మన్ 1930 ఇంగ్లండ్ పర్యటనలో 974 పరుగులు చేశాడు. 95 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్లో ఇదే రికార్డుగా కొనసాగుతోంది.ఈ విభాగంలో రెండో స్థానంలో వాలీ హేమండ్ (ఇంగ్లండ్) ఉన్నాడు. హేమండ్ 1928/29 ఆసీస్ పర్యటనలో 905 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన నీల్ హార్వే ఉన్నాడు. హార్వే 1952/53 పర్యటనలో 834 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఉన్నాడు. రిచర్డ్స్ 1976 ఇంగ్లండ్ పర్యటనలో 829 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో వెస్టిండీస్‌కు చెందిన క్లైడ్ వాల్కాట్ ఉన్నాడు. వాల్కాట్ 1955 ఆస్ట్రేలియా పర్యటనలో 827 పరుగులు చేశాడు.భారత్ తరఫున ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. గవాస్కర్ 1970/71 వెస్టిండీస్ పర్యటనలో 4 మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేశాడు. గవాస్కర్ తర్వాత ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 2014/15 ఆస్ట్రేలియా పర్యటనలో 692 పరుగులు చేశాడు. భారత్ తరఫున విదేశీ టెస్ట్ సిరీస్‌ల్లో (ఐదు అంతకంటే తక్కువ మ్యాచ్‌లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గవాస్కర్, విరాట్ తర్వాతి స్థానాల్లో దిలీప్ సర్దేశాయ్ (1970/71 విండీస్ పర్యటనలో 642 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (2003/04 ఆస్ట్రేలియా పర్యటనలో 619 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (2002/03 ఇంగ్లండ్ పర్యటనలో 602 పరుగులు), మొహిందర్ అమర్నాథ్ (1982/83 విండీస్ పర్యటనలో 598 పరుగులు), విరాట్ కోహ్లి (2018 ఇంగ్లండ్ పర్యటనలో 593 పరుగులు)య ఉన్నారు. ప్రస్తుతం గిల్ (2025 ఇంగ్లండ్ పర్యటనలో 585 పరుగులు) వీరి తర్వాతి స్థానాల్లో ఉన్నాడు.గిల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 8.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చారిత్రక గెలుపుకు 7 వికెట్ల దూరంలో ఉంది. అయితే చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఎడ్జ్‌బాస్టన్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.ఇంగ్లండ్ భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.మరోవైపు టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్‌రేట్: 4.5 -
పంత్‌పై శుబ్‌మన్ గిల్ సీరియస్.. ఎందుకంటే?
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో పర్యాటక టీమిండియా విజయానికి 7 వికెట్ల దూరంలో నిలవగా.. ఆతిథ్య ఇంగ్లండ్ తమ గెలుపునకు 536 పరుగుల దూరంలో ఉంది. 608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్టోక్స్ సేన నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.క్రీజులో ఓలీ పోప్(24), హ్యారీ బ్రూక్(15) ఉన్నారు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి టెస్టు విజయాన్ని అందుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ పంత్‌పై కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సీరియస్ అయ్యాడు. డీఆర్ఎస్ విషయంలో కెప్టెన్-వైస్ కెప్టెన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది.అసలేమి జరిగిందంటే?సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ తమ అద్బుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్‌డకెట్‌ను ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపారు. ఈ క్రమంలో గిల్ మూడో పేసర్ ప్రసిద్ద్ కృష్ణను ఎటాక్‌లో తీసుకొచ్చాడు.పదో ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ.. మూడో బంతిని జో రూట్‌కు ఫుల్లర్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడేందుకు రూట్ ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు.అయితే బంతి లెగ్ సైడ్‌కు వెళ్తున్నట్లగా అన్పించడంతో గిల్ రివ్యూ తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కానీ రిషబ్ పంత్ మాత్రం పట్టుపట్టి మరి రివ్యూకి వెళ్లమని బలవంతం చేశాడు. దీంతో గిల్ ఆఖరి సెకెన్లలో రివ్యూ తీసుకునేందుకు సిగ్నల్ చేశాడు.రిప్లేలో బంతి స్టంప్స్ మిస్స్ అయ్యి డౌన్‌ది లెగ్ వెళ్తున్నట్లు తేలింది. దీంతో శుబ్‌మన్ కోపంతో పంత్ వద్దకు వెళ్లాడు. పంత్ వెంటనే తను అనుకున్నది కెప్టెన్‌కు వివరించాడు. కానీ గిల్ మాత్రం కోపంగానే పంత్ వైపు చూస్తూ తన ఫీల్డింగ్ స్ధానానికి చేరుకున్నాడు. అయితే ఆ తర్వాతే ఓవర్లోనే రూట్‌ను ఆకాష్దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
గెలుపు ముంగిట టీమిండియా.. కానీ ఓ బ్యాడ్ న్యూస్! అదే జరిగితే?
ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా(Teamindia) 7 వికెట్ల దూరంలో నిలిచింది. ఈ మైదానంలో ఇప్పటివరకు కనీసం ఒక్క టెస్టులో కూడా గెలవని భారత జట్టు.. తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేందుకు సిద్దమైంది.బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి. అయితే గెలుపు ముంగిట భారత జట్టును వరుణుడు భయపెడుతున్నాడు. ఆఖరి రోజుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆదివారం ఉదయం మ్యాచ్ ప్రారంభ సమయంలో 60 శాతం వర్షం కురిసేందుకు ఆస్కారం ఉన్నట్లు ఆక్యూ వెదర్ తమ రిపోర్టులో పేర్కొంది. అయితే మధ్యాహ్నం సమయంలో వర్షం ఉండకపోవచ్చని ఆక్యూ వెదర్ తెలిపింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైతే ఇంగ్లండ్ కచ్చితంగా డ్రా కోసం ఆడుతోంది.అయితే మరోవైపు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఇన్నింగ్స్‌ను లేట్‌గా డిక్లేర్ చేయడాన్ని చాలా మంది క్రికెట్ నిపుణులు తప్పుబడుతున్నారు. కాస్త ముందుగానే ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడివుండేవని అభిప్రాయపడుతున్నారు.కాగా ఓవర్‌నైట్ స్కోరు 64/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.చదవండి: IND vs ENG: శుబ్‌మన్ గిల్ వరల్డ్ రికార్డు.. 148 ఏళ్లలో ఇదే తొలిసారి -
శుబ్‌మన్ గిల్ వరల్డ్ రికార్డు.. 148 ఏళ్లలో ఇదే తొలిసారి
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ సారథి శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో గిల్ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(269)తో చెలరేగిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో శతకం (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) తో కదం తొక్కాడు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 430 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గిల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.గవాస్కర్ రికార్డు బద్దలు..👉ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. 1971లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో సన్నీ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 344 పరుగులు చేశాడు. ఇప్పుడు తాజా ప్రదర్శనతో గిల్ 54 ఏళ్ల కిందట గవాస్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా వరల్డ్ టెస్టు క్రికెట్లో ఈ రికార్డు ఇంగ్లండ్ లెజెండ్ గ్రాహం గూచ్ పేరిట ఉంది. 1990లో లార్డ్స్‌లో భారత్‌పై అతడు రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 456 పరుగులు చేశాడు. గిల్ మరో 26 పరుగులు చేసి ఉంటే గూచ్ ఆల్‌టైమ్ రికార్డు కూడా బ్రేక్ అయిఉండేది. అయితే ఈ జాబితాలో గూచ్ తర్వాత స్ధానంలో గిల్‌నే ఉన్నాడు.👉అదేవిధంగా 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఒకే టెస్టుల 250 ప్లస్, 150కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఏ బ్యాటర్‌కు ఈ ఘనత సాధ్యం కాలేదు.గెలుపు వాకిట్లో భారత్..ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ముంగిట నిలిచింది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.ఇక ఈ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ సారథ్యంలోని భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత తమ టెస్టు క్రికెట్ హిస్టరీలో ఓ మ్యాచ్‌లో 1000కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేసింది.మొత్తం రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 1014 పరుగులు నమోదు చేసింది. ఇప్పటివరకు 2004లో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులకే భారత్‌కు అత్యధికం. తాజా మ్యాచ్‌తో చరిత్రను యంగ్ టీమిండియా తిరగ రాసింది.అదరగొట్టిన గిల్..ఇక ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ద్విశతకంతో చెలరేగిన శుబ్‌మన్.. రెండో ఇన్నింగ్స్‌లో (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కాడు. దీంతో భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్ 83 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.భారత బ్యాటర్లలో గిల్‌తో పాటు రవీంద్ర జడేజా (118 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (58 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (84 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 608 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
రెండో ఇన్నింగ్స్ లోనూ దంచి కొట్టిన టీమిండియా
-
విజయం వాకిట్లో...
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా విజయం వాకిట్లో నిలిచింది. బ్యాటర్ల అసమాన ప్రదర్శనకు బౌలర్ల సహకారం తోడవడంతో భారీ విజయంపై కన్నేసింది. గిల్ రికార్డు శతకానికి పంత్, జడేజా, రాహుల్ హాఫ్ సెంచరీలు జతవడంతో ఆతిథ్య జట్టు ముందు కొండంత లక్ష్యం నిలవగా... 608 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. విజయానికి ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉండగా... ఇక్కడి నుంచి ఆ జట్టు గెలవాలంటే మహాద్భుతం జరగాల్సిందే! భారత బౌలర్ల జోరు చూస్తుంటే ఆదివారం వేగంగా ఏడు వికెట్లు తీయడం ఖాయంగా అనిపిస్తుండగా... రోజంతా వర్షం కురవాలని ప్రార్థించడం తప్ప ఇంగ్లండ్ ముందు మరో అవకాశం కనిపించడం లేదు!బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో దంచి కొట్టిన టీమిండియా... ప్రత్యర్థి ముందు ఏకంగా 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొండంత స్కోరును చేరుకునే క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రాలీ (0), డకెట్ (15 బంతుల్లో 25; 5 ఫోర్లు), రూట్ (6) పెవిలియన్ చేరగా... పోప్ (24 బ్యాటింగ్; 3 ఫోర్లు), బ్రూక్ (15 బ్యాటింగ్; 2 ఫోర్లు) పోరాడుతున్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఆదివారం ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు... విజయానికి ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 64/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 83 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో, యువ సారథి శుబ్‌మన్ గిల్ (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) మరో శతకంతో కదం తొక్కాడు. రవీంద్ర జడేజా (118 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (58 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (84 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. ఈ క్రమంలో టీమిండియా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక (1014) స్కోరు నమోదు చేసుకోగా... గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 430 పరుగులతో విజృంభించాడు. పంత్ ఫటాఫట్... గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా... పరాజయం పాలైన టీమిండియా ఈ సారి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపించింది. నాలుగో రోజు తొలి సెషన్ ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదురైనా... వాటిని అధిగమించి భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో పరుగుల రాక కష్టం కాగా... కరుణ్ నాయర్ (26; 5 ఫోర్లు) మరోసారి మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్నాడు. కాసేపటికి అర్ధశతకం అనంతరం రాహుల్ కూడా వెనుదిరగగా... పంత్ వచ్చిరావడంతో విరుచుకుపడ్డాడు.ఎదుర్కొన్న మూడో నాలుగు బంతులకు వరుసగా 4, 6 కొట్టి తన ఉద్దేశం చాటాడు. అతడి దూకుడుకు ఇంగ్లండ్ పేలవ ఫీల్డింగ్ కూడా తోడ్పడింది. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్‌ను క్రాలీ అందుకోలేకపోయాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతడు... తదుపరి ఓవర్లో మరో 4, 6 బాదాడు. బషీర్‌కు రెండు ఫోర్లతో స్వాగతం పలికిన పంత్... చిత్రవిచిత్రమైన షాట్లతో చెలరేగిపోయాడు. దీంతో తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. గిల్ నిలకడ... రెండో సెషన్లో పంత్‌తో పాటు గిల్ కూడా దంచి కొట్టడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. టంగ్ బౌలింగ్‌లో 6, 4, 4 కొట్టిన గిల్.. అతడి తదుపరి ఓవర్లో మరో 6, 4తో 57 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పంత్ 48 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. స్కోరు పెంచే క్రమంలో పంత్ ఔట్ కాగా... జడేజా రాకతో పరుగుల వేగం మందగించింది. ఈ మధ్యలో కొన్ని చక్కటి షాట్లతో అలరించిన గిల్ 129 బంతుల్లో మ్యాచ్‌లో రెండో సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. రెండో సెషన్లో టీమిండియా 30 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. ఇక మూడో సెషన్లో గిల్, జడేజా దుమ్మురేపారు. బంతి తమ పరిధిలో ఉంటే చాలు దానిపై విరుచుకుపడిన ఈ జంట స్కోరు బోర్డుకు రాకెట్ వేగాన్నిచ్చింది. వోక్స్ ఓవర్లో గిల్ 6, 4, 4తో చెలరేగాడు. మరోవైపు జడేజా కూడా మ్యాచ్‌లో రెండో అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. రూట్ బౌలింగ్ 6, 4తో గిల్ 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. పంత్‌తో నాలుగో వికెట్‌కు 110 పరుగులు జోడించిన గిల్... జడేజాతో ఐదో వికెట్‌కు 175 పరుగులు జతచేశాడు. ఎట్టకేలకు బషీర్ బౌలింగ్‌లో గిల్ ఔట్ కాగా... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. వాషింగ్టన్ సుందర్ (12 నాటౌట్) అండతో జడేజా జట్టు ఆధిక్యాన్ని 607కు చేర్చాడు. స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) టంగ్ 28; రాహుల్ (బి) టంగ్ 55; నాయర్ (సి) స్మిత్ (బి) కార్స్ 26; గిల్ (సి అండ్ బి) బషీర్ 161; పంత్ (సి) డకెట్ (బి) బషీర్ 65; జడేజా (నాటౌట్) 69; నితీశ్ రెడ్డి (సి) క్రాలీ (బి) రూట్ 1; సుందర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (83 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 427. వికెట్ల పతనం: 1–51, 2–96, 3–126, 4–236, 5–411, 6–412. బౌలింగ్: వోక్స్ 14–3–61–0; కార్స్ 12–2–56–1; టంగ్ 15–2–93–2; స్టోక్స్ 7–1–26–0; బషీర్ 26–1–119–2; రూట్ 9–1–65–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డకెట్ (బి) ఆకాశ్‌దీప్ 25; క్రాలీ (సి) (సబ్) సుదర్శన్ (బి) సిరాజ్ 0; పోప్ (బ్యాటింగ్) 24; రూట్ (బి) ఆకాశ్‌దీప్ 6; బ్రూక్ (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (16 ఓవర్లలో 3 వికెట్లకు) 72. వికెట్ల పతనం: 1–11, 2–30, 3–50, బౌలింగ్: ఆకాశ్‌దీప్ 8–1–36–2; సిరాజ్ 5–1–29–1; ప్రసిధ్ కృష్ణ 3–0–6–0.430 ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి గిల్ చేసిన పరుగులు. భారత్ తరఫున ఇదే అత్యధికం. సునీల్ గావస్కర్ (344; 1971లో వెస్టిండీస్‌పై)ను అతను అధిగమించాడు. ఓవరాల్‌గా గూచ్ (456; 1990లో భారత్‌పై) అగ్ర స్థానంలో ఉండగా... గిల్ రెండో స్థానంలో నిలిచాడు.1014 ఈ మ్యాచ్‌లో భారత్ చేసిన పరుగులు. మన టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికం. 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగుల స్కోరును టీమ్ దాటింది.2 ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. గతంలో సునీల్ గావస్కర్ ఒక్కడే ఈ ఘనత సాధించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 150+స్కోర్లు చేసిన రెండో బ్యాటర్‌గాను గిల్ నిలిచాడు. గతంలో అలెన్ బోర్డర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. -
Ind vs Eng: పట్టుబిగించిన భారత్.. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబాటు!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్ సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. ఆది నుంచి పట్టుబిగించిన గిల్ సేన.. ఆతిథ్య జట్టుకు కొండంత లక్ష్యాన్ని విధించింది. బ్యాటింగ్‌లో దుమ్ములేపిన టీమిండియా.. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 427/6 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.తద్వారా ఇంగ్లండ్ ముందు ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఉంచింది. 64/1 ఓవర్ నైట్ స్కోరుతో టీమిండియా శనివారం తమ ఆట మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269)తో చెలరేగిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ధనాధన్ దంచికొట్టాడు. 162 బంతుల్లో 161 పరుగులతో భారీ శతకం సాధించాడు.మిగతా వారిలో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (55), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలతో రాణించగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, షోయబ్ బషీర్ రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మహ్మద్ సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ జాక్ క్రాలే (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు.ఇక మరో భారత పేసర్ ఆకాశ్ దీప్ మరో ఓపెనర్ బెన్ డకెట్ (25), జో రూట్ (6) వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 15, ఓలీ పోప్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరిదైన ఐదో రోజు భారత్ మిగిలిన ఏడు వికెట్లు కూల్చి గెలుపొందాలని పట్టుదలగా ఉండగా.. విజయానికి 536 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్ కనీసం డ్రా కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు-2025 (బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6))👉వేదిక: ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హామ్👉టాస్: ఇంగ్లండ్- మొదట బౌలింగ్👉భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 587 ఆలౌట్👉ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 407 ఆలౌట్ 👉భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం👉భారత్ రెండో ఇన్నింగ్స్- 427/6 డిక్లేర్డ్- తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని మొత్తం 607👉ఇంగ్లండ్ లక్ష్యం- 608👉శనివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 72/3 (16). -
అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్‌కు కొండంత లక్ష్యం
రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం విధించింది. ఆతిథ్య జట్టుపై ఆద్యంతం పైచేయి సాధించిన భారత్.. ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఇచ్చింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Torphy)లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు బుధవారం మొదలైంది.587 పరుగులుఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) భారీ ద్విశతకం (269) బాదగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్ (42) కూడా రాణించాడు.ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. మిగిలిన వారిలో కెప్టెన్ బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆటలో భాగంగా 407 పరుగులకు ఆలౌట్ అయింది.హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) అద్భుత శతకాలతో 303 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో.. ఇంగ్లండ్ మేర స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని 180 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. ఓవర్ నైట్ స్కోరు 64/1 (13)తో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది.మరోసారి గిల్ దంచేశాడుఆట మొదలైన కాసేపటికే కరుణ్ నాయర్ (26) పెవిలియన్ చేరగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (55) అర్ధ శతకంతో రాణించాడు. ఇక గిల్ మరోసారి భారీ శతకం (161)తో దుమ్ములేపగా.. వికెట కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ శతకాలతో అదరగొట్టారు. నితీశ్ రెడ్డి (1) మరోసారి నిరాశపరచగా.. వాషింగ్టన్ సుందర్ జడేజాతో కలిసి 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.గిల్ భారీ శతకం పూర్తైన కాసేపటికి భారత్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 83 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 180 పరుగులకు ఈ మేర (427) స్కోరు జతచేసి... ప్రత్యర్థికి భారీ లక్ష్యం విధించింది. ఈ క్రమంలో శనివారం మూడో సెషన్ ఆఖర్లో లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 108 ఓవర్లలో పనిపూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఆఖరి రోజు ఆట ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌ను టీమిండియా ఆలౌట్ చేస్తుందా? లేదంటే.. డ్రా చేసుకునేందుకు స్టోక్స్ బృందం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్న విషయం తేలుతుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. మరో ఆటగాడి శతకం.. భారత్ భారీ స్కోరు -
శెభాష్!.. మరోసారి శతక్కొట్టిన గిల్.. అరుదైన రికార్డు
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తన కెరీర్లోనే అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలతో దుమ్ములేపుతున్నాడు. ఆతిథ్య జట్టుతో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ భారీ శతకం (147) బాదిన విషయం తెలిసిందే.అనంతరం బర్మింగ్‌హామ్‌లో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ శతక్కొట్టిన శుబ్‌మన్ గిల్.. దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 387 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. అయితే, కెరీర్లో సాధించిన తొలి ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మార్చడంలో గిల్ విఫలమయ్యాడు.జోష్ టంగ్ బౌలింగ్‌లో ఓలీ పోప్‌నకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరడంతో.. అతడి భారీ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా గిల్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. యాభై ఏడు బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ సాబ్.. 129 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.భారీ ఆధిక్యంలో భారత్ఇదిలా ఉంటే.. 64/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కాసేపటికే వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) వికెట్ కోల్పోయింది. అయితే, ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం(55)తో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ (58 బంతుల్లో 65) సాధించాడు. ఇక గిల్ మరోసారి శతక్కొట్టగా.. 68 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేసరికి, టీ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180)తో కలుపుకొని భారత్.. 484 పరుగుల భారీ లీడ్ సాధించింది.భారత రెండో బ్యాటర్‌గా..కాగా టెస్టు మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ.. మరో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన భారత రెండో బ్యాటర్‌గా గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు భారత మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ 1971లొ పోర్ట్ ఆఫ్ స్పెయిన్వేదికగా వెస్టిండీస్‌పై ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో గిల్ తొమ్మిదో ఆటగాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టుషెడ్యూల్: బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6)వేదిక: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్హామ్టాస్: ఇంగ్లండ్- తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 587 ఆలౌట్ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 407 ఆలౌట్ టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్ -
వాటే ఫామ్!.. ధనాధన్ దంచికొట్టి.. గిల్, పంత్ హాఫ్ సెంచరీలు
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ (Ind vs Eng)తో తొలి టెస్టులో శతకం (147) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి (Virat Kohli) లేని లోటు పూడుస్తూ.. ఇంగ్లండ్ గడ్డ మీద అతడి రికార్డునే బద్దలు కొట్టాడు.భారీ ద్విశతకం (269)తో ఆకట్టుకుని.. ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా క్రికెటర్, కెప్టెన్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ శుబ్‌మన్ గిల్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. యాభై ఏడు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో ఫోర్ బాది 51 పరుగులు సాధించాడు.𝐅𝐥𝐮𝐞𝐧𝐭. 𝐅𝐞𝐚𝐫𝐥𝐞𝐬𝐬. 𝐅𝐨𝐜𝐮𝐬𝐞𝐝. 🔥Leading with intent, #ShubmanGill crafts a classy fifty, setting the stage for a commanding team effort 🫡#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/ftaIUA9YIy— Star Sports (@StarSportsIndia) July 5, 2025మరోవైపు.. గిల్‌కు తోడుగా వైస్ కెప్టెన్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 51 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో 44 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన టీమిండియా ఆధిక్యం.. 400కు చేరింది.పంత్ అవుటైన తర్వాత స్కోరు ఇలాకాగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 587 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్‌వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు కూల్చారు. బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఆరు, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.ఈ క్రమంలో 64/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కేఎల్ రాహుల్ (55), రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలు.. గిల్ అజేయ హాఫ్ సెంచరీ (ప్రస్తుతానికి 58) కారణంగా 46.2 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి.. 416 పరుగుల ఆధిక్యంలో ఉంది. పంత్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్ -
టెస్టుల్లో ఆడతా.. నా రోల్ మోడల్ అతడే: వైభవ్ సూర్యవంశీ
భారత క్రికెట్ వర్గాల్లో ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. ఒకరు టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అయితే.. మరొకరు భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). వీరిద్దరూ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు.గిల్ శతకాల మోతఇంగ్లండ్తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tenudulkar- Anderson Trophy)లో భాగంగా గిల్ కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే శతకం (147) బాదడంతో పాటు.. రెండో టెస్టులో భారీ డబుల్ సెంచరీ (269)తో చెలరేగాడు. తద్వారా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధించాడు.వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ఈ వేదికపై అత్యధిక వ్యక్తిగత స్కోరు (269) సాధించిన భారత తొలి క్రికెటర్, కెప్టెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. వైభవ్ సూర్యవంశీ అండర్-19 భారత జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో ఈ బిహారీ చిచ్చరపిడుగు దుమ్ములేపుతున్నాడు.ఆయుశ్ మాత్రే సారథ్యంలోని జట్టులో భాగమైన పద్నాలుగేళ్ల వైభవ్.. తొలి మూడు వన్డేల్లో వరుసగా 19 బంతుల్లో 48, 34 బంతుల్లో 45, 31 బంతుల్లోనే 81 పరుగులతో అదరగొట్టాడు. చివరగా మూడో యూత్ వన్డేలో సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసిన వైభవ్.. ఆ తర్వాత వెంటనే తమ జట్టుతో కలిసి ఎడ్జ్‌బాస్టన్‌కు వెళ్లాడు.ఇంగ్లండ్‌తో తలపడుతున్న సీనియర్ జట్టు ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు యువ జట్టును బీసీసీఐ అక్కడకు పిలిపించింది. ఈ నేపథ్యంలో గిల్ అద్భుత, చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం వైభవ్‌తో పాటు యువ ఆటగాళ్లందరికీ కలిగింది.టెస్టుల్లో ఆడతా.. నా రోల్ మోడల్ అతడేఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌లో నాకిదే తొలి టెస్టు. ఇక్కడ టెస్టు మ్యాచ్ చూడటం ఇదే తొలిసారి. మ్యాచ్ ఎలా సాగుతుందో ప్రత్యక్షంగా వీక్షించాను. నాకెంతో సంతోషంగా ఉంది. మ్యాచ్ చూసేందుకే మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడకు తీసుకువచ్చారు.టీమిండియా ఆట చూసి మేమెంతగానో స్ఫూర్తి పొందాము. శుబ్‌మన్ గిల్ మా అందరికీ రోల్ మోడల్. దేశం తరఫున రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు’’ అని పేర్కొన్నాడు. టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే తన చిరకాల కోరిక అని చెప్పుకొచ్చాడు. కాగా అనేక మంది క్రికెటర్ల మాదిరి.. భారత దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల పేర్లు కాకుండా టీమిండియా యువ సారథి గిల్‌ను వైభవ్ తన రోల్‌మోడల్‌గా చెప్పడం విశేషం.యువ భారత్‌దే పైచేయికాగా ఇంగ్లండ్ యువ జట్టుతో ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు అక్కడికి వెళ్లింది. ఇప్పటికి మూడు యూత్ వన్డేలు పూర్తి కాగా భారత్ రెండింట గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉంది. వోర్సెస్టర్ వేదికగా శనివారం నాటి నాలుగో యూత్ వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడుతున్న టీమిండియా తొలి టెస్టులో ఓడింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది.చదవండి: WCL: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ -
నన్ను మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు: టీమిండియా స్టార్
టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య రెండో టెస్టు రసవత్తరంగా మారింది. మొదటి రెండు రోజులు భారత్ ఏకపక్షంగా పైచేయి సాధించగా.. మూడో రోజు మాత్రం ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత బౌలర్ల ధాటికి ఒక దశలో 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్టోక్స్ బృందాన్ని జేమీ స్మిత్ (184 నాటౌట్), హ్యారీ బ్రూక్(158) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు.ఇద్దరూ సెంచరీలతో చెలరేగి ఏకంగా 303 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో టీమిండియా పట్టుతప్పినట్లే అనిపించింది. అయితే, పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ (Akash Deep) తమ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లతో మెరవగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు.180 పరుగుల మేర ఆధిక్యంభారత పేసర్ల దెబ్బకు ఇంగ్లండ్ బజ్‌బాల్ ఇన్నింగ్స్ 407 పరుగుల వద్ద ముగిసిపోయింది. 89.3 ఓవర్లలో ఈ మేర స్కోరు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల మేర ఆధిక్యం లభించింది. ఇక మ్యాచ్‌లో బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0), హ్యారీ బ్రూక్ (158) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చిన ఆకాశ్ దీప్.. క్రిస్ వోక్స్(5) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆకాశ్ దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తదుపరి మ్యాచ్‌లో ఆడతానో లేదో తెలియదని.. రెండో టెస్టులో మిగిలిన రెండు రోజుల్లో తానేంటో మరోసారి నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు.మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు‘‘ఈ టెస్టు మ్యాచ్‌లో మాకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతాం. మూడో టెస్టు గురించి నేను ఇప్పుడే ఆలోచించడం లేదు. ఈ రెండు రోజుల్లో నా శాయశక్తులా జట్టు విజయం కోసం పనిచేయడమే ముఖ్యం.ఆ తర్వాతే మరో మ్యాచ్‌లో ఆడిస్తారా? లేదా? అన్న విషయం గురించి ఆలోచిస్తాను. ఈ విషయంలో మేనేజ్మెంట్దే తుది నిర్ణయం. లార్డ్స్ టెస్టు ఆడతారా? అంటే నాకైతే కచ్చితంగా తెలియదు. నేను ఆడొచ్చు.. ఆడకపోవచ్చు. మ్యాచ్‌కు ఒకరోజు ముందే మాకు ఆ విషయం తెలుస్తుంది’’ అని ఆకాశ్ దీప్ మీడియా ప్రశ్నలకు బదులిచ్చాడు.బుమ్రా స్థానంలోకాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. లీడ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలు కాగా.. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం రెండో టెస్టు మొదలైంది.ఇక లీడ్స్‌లో తొలి టెస్టు ఆడిన భారత ప్రధాన జస్ప్రీత్ బుమ్రాకు.. రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చాడు. అయితే, బుమ్రాను తదుపరి లార్డ్స్ టెస్టులో ఆడించేందుకే ఇప్పుడు రెస్ట్ ఇచ్చామని కెప్టెన్ గిల్ చెప్పాడు. దీనిని బట్టి ఆకాశ్ దీప్‌నకు మూడో టెస్టులో చోటు దక్కదా? అన్న ప్రశ్నకు ఈ పేసర్ ఇలా బదులిచ్చాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మూడో రోజు పూర్తయ్యేసరికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (28) పెవిలియన్ చేరగా.. కేఎల్ రాహుల 28, కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌పై భారత్ మూడో రోజు ఆట ముగిసే సరికి 244 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: 'అతడిని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం'.. గంభీర్‌పై ఇంజనీర్ ఫైర్ -
అయ్యో జడేజా.. టైం అయిపోయిందంటూ..!
ప్రస్తుత టీమిండియా టెస్ట్ టీమ్‌లో అందరికంటే సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ కావడంతో జట్టులో సీనియర్‌గా కొనసాగుతున్నాడు జడ్డూ. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తాజా టెస్ట్ సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. రెండో టెస్టులో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆట రెండో రోజు 89 పరుగులు చేసి జట్టుకు తన విలువను మరోసారి గుర్తు చేశాడీ సీనియర్ ఆల్‌రౌండర్. కెప్టెన్ గిల్‌తో కలిసి కీలకమైన 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆరో వికెట్ అంతకంటే దిగువ స్థానాల్లో 200 పరుగులు భాగస్వామ్యాల్లో పాలుపంచుకోవడం జడేజాకు ఇది మూడోసారి.కాగా, ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జడేజాకు మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కెప్టెన్సీపై ఇంకా ఆశలు ఉన్నాయా అని మీడియా ప్రతినిధి అడగ్గా.. చిరునవ్వుతో లేదన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. 'వో టైమ్ గయా' (ఆ సమయం దాటిపోయింది) అని వ్యాఖ్యానించాడు.చాన్స్ లేదా?నిజంగానే అతడికి సమయం మించిపోయిందని క్రీడావ్యాఖ్యతలు అభిప్రాయపడుతున్నారు. జడేజా వయసు ఇప్పుడు 35 ఏళ్లు. ఇంకో రెండుమూడేళ్లు క్రికెట్ ఆడినా కూడా అతడికి కెప్టెన్ చాన్స్ రాదు. ఎందుకంటే జట్టు ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని గిల్‌కు టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది బీసీసీఐ. నాయకత్వ బాధ్యతను భుజానికెత్తుకోవడానికి బుమ్రా నిరాకరించడంతో గిల్‌కు చాన్స్ దక్కింది. బహుశా రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత వన్డే జట్టు పగ్గాలు కూడా శుబ్మన్కే దక్కుతాయి. ఈ నేపథ్యంలోనే తనకు ఇక చాన్స్ లేదని జడేజా వ్యాఖ్యానించి ఉంటాడని క్రీడావ్యాఖ్యతలు పేర్కొంటున్నారు.కలిసిరాని కెప్టెన్సీఅయితే దేశం తరపున జాతీయ జట్టుకు నాయకత్వం వహించే చాన్స్ రాకపోయినా.. మరోవిధంగా అతడికి కెప్టెన్సీ దక్కింది. సారథిగా తనకు వచ్చిన అవకాశాన్ని జడేజా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు 2022లో కెప్టెన్‌గా చాన్స్ దక్కించకున్నాడు. వరుస పరాజయాలతోనే మధ్యలోనే నాయకత్వం నుంచి వైదొలగడంతో మళ్లీ ధోనికే పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. ఆ రకంగా చూస్తే కెప్టెన్సీ జడ్డూకు కలిసిరాలేదనే చెప్పాలి.నంబర్ 1 ఆల్రౌండర్ఆల్రౌండర్గా జడేజా ఆటకు పేరు పెట్టలేం. బ్యాట్‌తోనే కాకుండా బంతితో కూడా తానేంటో నిరూపించుకున్నాడు. మెరుపు ఫీల్డింగ్‌తో జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికీ యంగ్ ప్లేయర్స్‌తో పోటీ పడుతూ మైదానంలో విన్యాసాలు చేస్తుంటాడు. చాలా సందర్భాల్లో జట్టును కష్టాల నుంచి గట్టెక్కించిన ఘనత అతడికి ఉంది. అందుకే ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో టాప్‌లో కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన జడేజా.. డబ్ల్యూటీసీలో తొలి ప్లేయర్ గిల్ గురించి జడేజా.. ఆటగాడి నుంచి టెస్ట్ కెప్టెన్ వరకు గిల్ ఎదుగుదల గురించి మీడియా ప్రతినిధులు జడేజాను అడగ్గా.. శుబ్‌మన్ గిల్ (shubhman gills) ఎంత ఎదిగాడో మీరు చూడలేదా? అంటూ ఎదురు ప్రశ్నించాడు. డబుల్ సెంచరీ చేసిన గిల్‌ను ప్రశంసించాడు. సుదీర్ఘ భాగస్వామ్యం నెలకొల్పాలని తామిద్దం మాట్లాడుకున్నామని వెల్లడించాడు. -
ఫాస్టెస్ట్ సెంచరీ!.. చరిత్ర సృష్టించిన జేమీ స్మిత్.. ఇంగ్లండ్ తొలి ప్లేయర్‌గా..
టీమిండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ జేమీ స్మిత్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 80 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు.ఇంగ్లండ్ తొలి ప్లేయర్‌గా..అంతేకాదు.. టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఓ రోజు ఆటలో భోజన విరామానికి ముందు సెషన్లోనే వందకు పైగా పరుగులు స్కోరు చేసిన ఇంగ్లండ్ తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు జేమీ స్మిత్. అతడి శతక ఇన్నింగ్స్‌లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక భారత యువ పేసర్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో జేమీ స్మిత్ ఏకంగా 23 పరుగులు పిండుకోవడం విశేషం.టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు🏏గిల్బర్ట్ జెసప్- 1902లో ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాపై 76 బంతుల్లో శతకం🏏జానీ బెయిర్ స్టో- 2022లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా న్యూజిలాండ్‌పై 77 బంతుల్లో శతకం🏏హ్యారీ బ్రూక్- 2022లో రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌పై 80 బంతుల్లో శతకం🏏జేమీ స్మిత్- 2025లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాపై 80 బంతుల్లో శతకం🏏బెన్ స్టోక్స్- 2015లో లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌పై 85 బంతుల్లో శతకం.The THIRD-FASTEST England Test century 🤯Counter-attacking in the extreme from Jamie Smith ☄️ pic.twitter.com/8Yz3Ccc0WL— England Cricket (@englandcricket) July 4, 2025 లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 249/5 (47)ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలైంది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రెండో రోజు ఆటలో భాగంగా 587 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) కూడా అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు కూల్చారు. అదే విధంగా... కెప్టెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. గురువారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్లు నష్టపోయి 77 పరుగులు చేసింది. ఇక శుక్రవారం నాటి ఆటలో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ బజ్‌బాల్ ఇన్నింగ్స్ కారణంగా భోజన విరామ సమయానికి 249 పరుగులు స్కోరు చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి స్మిత్ 102, బ్రూక్ 91 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమిండియా కంటే ఇంకా 338 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! -
గిల్ భారీ డబుల్ సెంచరీ.. టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు ఇవే..!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. గిల్‌కు టెస్ట్‌ల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. ఈ డబుల్ సెంచరీతో గిల్ చాలా రికార్డులను తిరగరాశాడు.టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత కెప్టెన్‌గా.. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా.. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా పలు రికార్డులు నెలకొల్పాడు.గిల్ భారీ డబుల్ సెంచరీ అనంతరం క్రికెట్ అభిమానులు ఓ విషయంపై ఆరా తీయడం మొదలు పెట్టారు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరిదని వెతకడం ప్రారంభించారు. అలాగే భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరిదని.. ఇందులో గిల్ స్థానం ఏంటని గూగుల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టెస్ట్‌ల్లో టాప్ 10 అత్యధిక వ్యక్తిగత స్కోర్లపై ఓ లుక్కేద్దాం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉంది. లారా 2004లో ఆంటిగ్వాలో ఇంగ్లండ్‌పై 400 పరుగలు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో క్వాడ్రపుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా లారా కొనసాగుతున్నాడు.ఈ జాబితాలో లారా తర్వాతి స్థానంలో ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఉన్నాడు. హేడెన్ 2003లో పెర్త్ మైదానంలో జింబాబ్వేపై 380 పరుగులు చేశాడు. దీనికి ముందు అత్యధిక స్కోర్ రికార్డు లారా పేరిటే ఉండింది. లారా 1994లో ఆంటిగ్వాలో ఇంగ్లండ్‌పై 375 పరుగులు చేశాడు. దాదాపు 9 ఏళ్లు లారా పేరిటే టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు నమోదై ఉండింది.అయితే హేడెన్ 2003లో ఈ రికార్డును బద్దలు కొట్టాడు. హేడెన్ తన రికార్డును బద్దలు కొట్టిన ఏడాదిలోపే లారా క్వాడ్రాపుల్ సెంచరీ చేసి తిరిగి ఆ రికార్డును తన పేరిటే లిఖించుకున్నాడు.2006లో లారా రికార్డును శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే బద్దలు కొడతాడని అంతా అనుకున్నారు. కొలొంబోలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో జయవర్దనే 374 పరుగులకు ఔటై లారా ఆల్‌టైమ్ రికార్డుకు 26 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.లారా, హేడెన్, జయవర్దనేకు ముందు ఈ రికార్డు విండీస్ ఐకాన్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ పేరిట ఉండేది. 1958లో సోబర్స్ పాకిస్తాన్‌పై 365 పరుగులు చేశాడు. ఈ రికార్డు 36 ఏళ్ల పాటు సోబర్స్ ఖాతాలోనే ఉండింది. 1994లో తన దేశానికి చెందిన లారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు.సోబర్స్‌కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం లెన్ హటన్ ఖాతాలో ఉండింది. 1938లో అతను ఆస్ట్రేలియాపై 364 పరుగులు సాధించాడు. అప్పటివరకు ఈ రికార్డు మరో ఇంగ్లండ్ ఆటగాడు వాలీ హేమండ్ పేరిట ఉండింది. హేమండ్ 1933లో న్యూజిలాండ్‌పై 336 పరుగులు చేశాడు.టెస్ట్‌ల్లో ఏడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ శ్రీలంక డాషింగ్ బ్యాటర్ సనత్ జయసూర్య పేరిట ఉంది. జయసూర్య 1997లో భారత్‌పై 340 పరుగులు చేశాడు. జయసూర్య తర్వాత ఈ రికార్డు పాకిస్తాన్ స్టయిలిష్ బ్యాటర్ యూనిస్ ఖాన్ పేరిట ఉంది. 2009లో యూనిస్ శ్రీలంకపై 313 పరుగులు చేశాడు. తొమ్మిదో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు వాలీ హేమండ్ (336) ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ చేసిన పదవ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 2019లో పాకిస్తాన్‌పై 335 పరుగులు చేశాడు.ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 31 మంది ఆటగాళ్లు ట్రిపుల్ సెంచరీలు చేశారు. భారత్ తరఫున ఈ ఘనతను వీరేంద్ర సెహ్వాగ్ రెండు సార్లు.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు సభ్యుడు కరుణ్ నాయర్ ఓ సారి సాధించారు. భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాపై 319 పరుగులు చేశాడు. భారత్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా సెహ్వాగ్ పేరిటే ఉంది. 2004లో సెహ్వాగ్ ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై 309 పరుగులు చేశాడు. కరుణ్ విషయానికొస్తే.. ఇతను 2016లో ఇంగ్లండ్‌పై అజేయమైన 303 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 269 పరుగులు చేసిన గిల్ టెస్ట్‌ల్లో భారత్ తరఫున ఏడో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేశాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో 61వ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. -
ఏం చూస్తున్నావు?.. వేగంగా పరిగెత్తలేవా?: ఆకాశ్ దీప్‌పై గిల్ ఫైర్!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి రోజు బాదిన శతకాన్ని ప్రిన్స్.. రెండో రోజు ఆట సందర్భంగా దానిని డబుల్ సెంచరీ (Double Century)గా మలిచాడు. మొత్తంగా 387 బంతులు ఎదుర్కొన్న గిల్.. 30 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. తద్వారా రికార్డుల మోత మోగించాడు.ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత కెప్టెన్, ఆటగాడిగా గిల్ చరిత్రకెక్కాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత టెస్టు క్రికెట్లో ప్రిన్స్ శకం మొదలైందంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు అతడిని ఆకాశానికెత్తుతున్నారు. మరోవైపు.. గిల్ తన ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిస్తే ఇంకా బాగుండేదంటూ కాస్త నిరాశకు లోనవుతున్నారు..@ShubmanGill rewrites the record books in England! 👑📚✅ First Asian captain to score a double century in SENA✅ First visiting captain to score 200 in England since 2003✅ Only the third Indian to score a double century in England!#ENGvIND 👉 2nd TEST, Day 2 | LIVE NOW… pic.twitter.com/VoVrRQT8VT— Star Sports (@StarSportsIndia) July 3, 2025 ఇదిలా ఉంటే.. డబుల్ సెంచరీ వీరుడు గిల్ రెండో రోజు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా సహనం కోల్పోయాడు. తొలి రోజు నుంచి.. రెండో రోజు వరకు దాదాపు ఐదు సెషన్లలోనూ ఓపికగా ఉన్న గిల్‌కు కోపం రావడానికి కారణం భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep).రనౌట్ రూపంలో బలయ్యేవారే!గురువారం నాటి రెండో రోజు ఆట టీ సమయానికి ముందు.. గిల్ చరిత్రాత్మక ట్రిపుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ.. షోయబ్ బషీర్ బౌలింగ్ (139.5)లో మిడ్ వికెట్ మీదుగా గిల్ షాట్ బాదాడు. ఈ క్రమంలోనే అవతలి ఎండ్‌లో ఉన్న ఆకాశ్ దీప్‌ను పరుగుకు ఆహ్వానించాడు. కానీ అప్పుడు పరధ్యానంగా ఉన్న ఆకాశ్.. వెంటనే తేరుకుని డైవ్ కొట్టి ఎలాగోలా క్రీజులోకి చేరుకున్నాడు. లేదంటే ఎవరో ఒకరు రనౌట్ రూపంలో బలయ్యేవారే!pic.twitter.com/cXM1utO4a8— Nihari Korma (@NihariVsKorma) July 3, 2025ఏం చూస్తున్నావు?.. తొందరగా పరిగెత్తలేవా?దీంతో కోపోద్రిక్తుడైన గిల్.. ‘‘ఏం చూస్తున్నావు?.. తొందరగా పరిగెత్తలేవా?’’ అంటూ ఆకాశ్ దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక అప్పటికి 260 పరుగుల వద్ద ఉన్న గిల్.. మరో తొమ్మిది రన్స్ తన స్కోరుకు జతచేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో పోప్‌నకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు.. ఆకాశ్ దీప్ ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ఇదిలా ఉంటే.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ భారీ ద్విశతకం (269) బాదగా.. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! -
ఇలాంటి తప్పెలా చేశావు గిల్?.. యువీ తండ్రి అసంతృప్తి!
టీమిండియా కెప్టెన్, డబుల్ సెంచూరియాన్ శుబ్‌మన్ గిల్( Shubman Gill)పై మాజీ క్రికెటర్ యువరాజ్ తండ్రి యోగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం పట్ల యోగరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఈ మ్యాచ్‌లో గిల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లతో 269 పరుగులు చేశాడు. తన మొదటి ట్రిపుల్ సెంచరీకి 31 పరుగుల దూరంలో శుబ్‌మన్ నిలిచిపోయాడు. ఇంగ్లండ్ పేసర్ జోష్ టాంగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు."యువరాజ్ సింగ్(Yuvraj Singh) తన కెరీర్లో ఏమి సాధించాడో, దానిని ఆటగాళ్లకు శిక్షణ రూపంలో అందించడం చాలా సంతోషంగా ఉంది. శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లను యువరాజ్ తన శిక్షణతో రాటుదేల్చాడు. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ 200 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతను 250 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండాలని నేను కోరుకున్నాను.250 పరుగుల మార్క్ చేరుకున్నాక ట్రిపుల్ సెంచరీ చేసి ఆజేయంగా ఉండాలని ఆశించాను. కానీ గిల్ అంతలోనే గిల్ ఔట్ కావడంతో నేను బాధపడ్డాను. యువరాజ్ కూడా నిరాశచెందాడు. అంత భారీ స్కోర్ సాధించాక అలా ఔట్ కావడం పెద్దం నేరం. రెండు వందులు అవ్వొచ్చు, మూడు వందలు అవ్చొచ్చు ఏదైనా కానీ నాటౌట్‌గా ఉంటే మన తప్పిదాలను సరిదిద్దుకోవచ్చు.ఇక శుబ్‌మన్ గిల్ కోసం చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. వారందరికి ఒక్క విషయం చెప్పాలనకుంటున్నాను. దయచేసి మీరు క్రికెటర్ కాకపోతే, ఆ విషయం గురించి మాట్లాడకండి. గిల్ ఒక టాప్ క్లాస్ ప్లేయర్. గిల్‌కు 400 పరుగులు చేసే సత్తా కూడా ఉంది" అని ఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.చదవండి: 'ఇదంతా అతడి వల్లే'.. గిల్ డబుల్ సెంచరీ వెనక మాస్టర్ మైండ్ -
IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన.. మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) భారీ ద్విశతకం (269)తో చెలరేగగా.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja- 89), యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal- 87) అర్ధ శతకాలతో రాణించారు. 510 పరుగుల ఆధిక్యంవీరికి తోడుగా వాషింగ్టన్ సుందర్ (42) మెరుగ్గా ఆడగా కరుణ్ నాయర్ (31) కూడా ఈసారి కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్.. బౌలింగ్‌లోనూ రాణిస్తోంది. గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్లు తీసిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 77 పరుగులకు పరిమితం చేసింది. తద్వారా ప్రస్తుతం 510 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.అరుదైన రికార్డులుఇక రెండో రోజు ఆటలో హైలైట్ గిల్ డబుల్ సెంచరీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా నిలవడంతో పాటు.. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గానూ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.అంతేకాదు.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆసియా తొలి కెప్టెన్‌గానూ గిల్ చరిత్రకెక్కాడు. వీటితో పాటు మరెన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు.ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో వైభవ్ ప్రత్యక్షంఇక గిల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ప్రత్యక్షంగా వీక్షించాడు. ఓవైపు గిల్‌కు సంబంధించిన మరుపురాని మధుర క్షణాలను ఒడిసిపడుతూనే.. స్టాండ్స్‌లో వైభవ్‌పై కూడా కెమెరామెన్ ఫోకస్ చేశాడు. ఈ నేపథ్యంలో ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో వైభవ్ సూర్యవంశీ మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫున సంచలన శతకం సాధించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో భారత అండర్-19 జట్టు తరఫునా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో యూత్ వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.తొలి యూత్ వన్డేలో 19 బంతుల్లోనే 48 పరుగులతో రాణించిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్ చేశాడు. తాజాగా మూడో వన్డేలో 31 బంతుల్లోనే 81 పరుగులతో దుమ్ములేపాడు. ఇక నాలుగో యూత్ వన్డే జూలై 5న జరుగనుండగా.. ఆఖరిదైన ఐదో మ్యాచ్ జూలై 7న జరుగనుంది.యువ జట్టును పిలిపించిన బీసీసీఐఇక నార్తాంప్టన్‌లో మూడో యూత్వన్డే ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. ఆయుశ్ మాత్రే సారథ్యంలోని యువ జట్టును ఎడ్జ్‌బాస్టన్‌కు పిలిపించింది. సీనియర్ల ఆటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో గిల్ ఐకానిక్ ఇన్నింగ్స్‌ను వీక్షించిన వైభవ్ సూర్యవంశీ.. ‘‘మనదే ఆధిపత్యం’’ అంటూ గిల్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక వైభవ్‌ను ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో చూసిన అభిమానులు త్వరలోనే అతడు టీమిండియాలో అరంగేట్రం చేయాలంటూ ఆకాంక్షిస్తున్నారు.చదవండి: WCL: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా యువరాజ్ సింగ్Vaibhav Suryavanshi in the stands at the Edgbaston. pic.twitter.com/p7xMZoZdQf— Mufaddal Vohra (@mufaddal_vohra) July 3, 2025 -
'ఇదంతా అతడి వల్లే'.. గిల్ డబుల్ సెంచరీ వెనక మాస్టర్ మైండ్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు తన కెరీర్లో చిర్మసరణీయంగా మిగిలిపోనుంది. ఈ మ్యాచ్‌లో గిల్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. గిల్‌కు టెస్టుల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లతో 269 పరుగులు చేశాడు. అయితే హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సలహాతోనే ఈ మారథాన్ ఇన్నింగ్స్ ఆడినట్లు గిల్ వెల్లడించాడు."తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్‌కు వెళ్లేముందు నేను క్రీజులోకి వచ్చాను. ఆ తర్వాత టీ సమయానికి నేను 100 బంతులు ఆడి 35 పరుగులు మాత్రమే చేశాను. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి గౌతమ్ గంభీర్ భాయ్‌తో మాట్లాడాను. నేను బౌండరీలు కొట్టలేకపోతున్నాని, ఫీల్డర్ల గ్యాప్ చూసుకుని ఆడుతున్నానని అతడితో చెప్పాను. అందుకు బదులుగా గౌతీ భాయ్ నన్ను క్రీజులో నిలదొక్కకోమని చెప్పాడు. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే పరుగులు వాటింతట అవే వస్తాయి అని అతడు అన్నాడు. ఇక ఐపీఎల్ ఆఖరిలో నా బ్యాటింగ్ టెక్నిక్‌పై తీవ్రంగా శ్రమించాను. నా ఫుట్ మూమెంట్, ఏ బంతులను ఆడాలో ఎంచుకోవడంపై ఎక్కువగా దృష్టిసారించాను.ప్రతీ మ్యాచ్‌లోనూ నేను బాగానే బ్యాటింగ్ చేస్తున్నాను. కానీ 30-40 పరుగుల మధ్య ఔటయ్యేవాడిని. అందుకే ఈ సారి నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలనుకున్నాను. అందుకు తగ్గట్టు నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేశాను. టీ20 ఫార్మాట్లో ఆడి ఒక్కసారిగా టెస్టుల్లోకి తిరిగి రావడం కష్టం.మన మైండ్‌సెట్‌ను మార్చుకోని ఆడాలి. వైట్‌బాల్ క్రికెట్ పూర్తి భిన్నం. అందుకే ఐపీఎల్-2025 నుంచే రెడ్‌బాల్ క్రికెట్‌తో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను" అని రెండో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో గిల్ పేర్కొన్నాడు.ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైశ్వాల్( 87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.చదవండి: ENG vs IND: ట్రిపుల్ సెంచరీ మిస్.. ఇంగ్లండ్ ఆటగాడి ట్రాప్‌లో పడ్డ గిల్! వీడియో -
ట్రిపుల్ సెంచరీ మిస్.. ఇంగ్లండ్ ఆటగాడి ట్రాప్‌లో పడ్డ గిల్! వీడియో
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లతో 269 పరుగులు చేశాడు. ఈ మారథాన్ ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి(254) రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.ఓ దశలో గిల్ ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకునేలా కన్పించాడు. అయితే సమయంలో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మైండ్ గేమ్స్ మొదలు పెట్టాడు. టీ విరామం తర్వాత 265 పరుగుల మార్కును దాటి బ్యాటింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్ ఏకగ్రాతను దెబ్బతీసేందుకు బ్రూక్ ప్రయత్నించాడు.స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్.. గిల్‌తో తన ట్రిపుల్ సెంచరీ కోసం చర్చించాడు. 143 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గిల్-బ్రూక్ మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. అయితే ఇద్దరి మాటలు అంత క్లారిటీగా బయటకు వినిపించడం లేదు.ఈ క్రమంలో కామెంటరీ బాక్స్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్.. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను వివరించాడు. "290 పరుగుల వద్ద ఆడటం చాలా కష్టం" అని బ్రూక్ అనగా, "నీ కెరీర్లో ఎన్ని ట్రిపుల్ సెంచరీలు చేశావ్? అని గిల్ బదులు ఇచ్చినట్లు అథర్టన్ తెలిపారు.ఇది జరిగిన తర్వాత ఓవరే గిల్ తన వికెట్‌ను కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. కాగా హ్యారీ బ్రూక్ పేరిట ఓ టెస్టు ట్రిపుల్ సెంచరీ ఉంది. గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో బ్రూక్ 317 పరుగులు చేశాడు.ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైశ్వాల్( 87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.pic.twitter.com/PKokKBCd4R— The Game Changer (@TheGame_26) July 3, 2025 -
టెస్టు క్రికెట్‌కు సరికొత్త రారాజు.. ఇంక అంతా 'శుభ్' మయం
"ఈ సిరీస్‌లో నేను బెస్ట్ బ్యాటర్‌గా నిలుస్తా.. కెప్టెన్‌గా ఎటువంటి ఒత్తిడి తీసుకోను".. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు భారత యువ సారథి శుబ్‌మన్ గిల్ చెప్పిన మాటలివి. ఇప్పుడు అందుకు తగ్గట్టే దూసుకుపోతున్నాడు ఈ యువ రాజు.ఎవరైతే అతడిని కెప్టెన్‌గా ఎంపికచేయడాన్ని వ్యతిరేకించారో.. ఇప్పుడు వారితోనే శెభాష్ అనిపించుకుంటున్నాడు. కెప్టెన్‌గా తొలి టెస్టులోనే సెంచరీతో మెరిసిన గిల్.. ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు.తన అసాధారణ ప్రదర్శనతో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్‌గా చరిత్రను తిరగ రాశాడు. ఈ సిరీస్ ముందు వరకు ఇంగ్లండ్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా చేయని శుబ్‌మన్.. ఇప్పుడు శతకాల మోత మ్రోగిస్తున్నాడు. ఇంతకుముందు ఒక్క లెక్క.. కెప్టెన్ అయ్యాక ఒక లెక్క అన్నట్లు గిల్ ప్రయాణం సాగుతోంది.జయహో నాయక..ఒక జట్టు నాయకుడికి ఉండవలసిన అన్ని లక్షణాలు గిల్‌కు ఉన్నాయి. జట్టు గెలిస్తే క్రెడిట్ తీసుకున్న వాడు నిజమైన కెప్టెన్ కాడు.. అదే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఆదుకున్న వాడే నిజమైన లీడర్. ఇది గిల్‌కు సరిగ్గా సరిపోతుంది.తొలి టెస్టులో ఓటమికి నైతిక బాధ్యత వహించిన గిల్.. ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును.. తన బాధ్యయుత ఆటతీరుతో ఆదుకున్నాడు.ఆచితూచి ఆడి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలుత 100 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన ఈ పంజాబీ ఆటగాడు.. క్రీజులో నిలదొక్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. గిల్ తొలి టెస్టు డబుల్ సెంచరీ వెనక ఎంతో శ్రమ దాగి ఉంది. దాదాపు రెండు రోజుల పాటు ఎంతో ఓర్పు, నిబద్దతతో బ్యాటింగ్ చేసి జట్టును పటిష్ట స్ధితిలో నిలిపాడు. అతడి ఆటతీరుకు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. అప్పటిలో సచిన్, కోహ్లి.. భారత టెస్టు జట్టులో నాలుగో నంబర్‌కు ప్రత్యేక స్ధానం ఉంది. ఒక దశాబ్ధం క్రితం జోహన్నెస్‌బర్గ్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వదిలిపెట్టి వెళ్లిన నాలుగో నంబర్ స్ధానాన్ని లెజెండరీ విరాట్ కోహ్లి భర్తీ చేశాడు. ఆ స్ధానంలో దాదాపు పుష్కరకాలం పాటు విరాట్ కోహ్లి విజయవంతంగా కొనసాగాడు. విరాట్ తన అద్బుత ప్రదర్శనలతో మాస్టర్‌బ్లాస్టర్‌ను మరిపించాడు. ఇప్పుడు కింగ్ కోహ్లి వారసుడిగా అదే ఎంఆర్ఎఫ్( MRF) బ్యాట్‌తో 25 ఏళ్ల గిల్ బాధ్యతలు చేపట్టాడు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు వరకు ఈ కీలకమైన స్దానంలో ఎవరి బ్యాటింగ్ వస్తారన్న చర్చ తీవ్ర స్ధాయిలో జరిగింది.కొంతమంది మాజీలు కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్‌ను నాలుగో స్ధానంలో బ్యాటింగ్ పంపాలని సూచించారు. కానీ కెప్టెన్ గిల్ మాత్రం విరాట్ కోహ్లి స్దానానికి తానే సరైనోడనని ముందుకు వచ్చాడు. అందుకు తగ్గట్టే ఆ స్ధానంలో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లో శతక్కొట్టాడు. ఇప్పుడు రెండో టెస్టులో 269 పరుగులు చేసి సత్తాచాటాడు. ఓవరాల్‌గా గిల్ ఇప్పటివరకు 34 టెస్టులు ఆడి 40.65 సగటుతో 2317 పరుగులు చేశాడు.పట్టు బిగిస్తున్న భారత్..ఇక ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(30), జో రూట్(18) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ రెండు, సిరాజ్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. -
గిల్ రికార్డుల హోరు ఇంగ్లండ్ బేజారు
‘హెడింగ్లీలో నేను 147 పరుగులకే అవుటయ్యా... మరింత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సింది. తప్పుడు షాట్‌తో వెనుదిరిగా’... రెండో టెస్టుకు ముందు భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చెప్పిన మాట ఇది. తాను నిజంగా నిలబడి పట్టుదలగా ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అతను ఎడ్జ్‌బాస్టన్‌లో చూపించాడు. 8 గంటల 29 నిమిషాల అసాధారణ బ్యాటింగ్, ఎక్కడా చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకుండా... 94 శాతం నియంత్రణతో కూడిన చక్కటి షాట్లతో గిల్ అదరగొట్టాడు... ఏకంగా 269 పరుగులు చేసి పలు రికార్డులను అలవోకగా అధిగమిస్తూ పోయాడు. గిల్‌కు జడేజా, వాషింగ్టన్ సుందర్ అండగా నిలవడంతో టీమిండియా భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ఒక దశలో 211/5తో కష్టాల్లో నిలిచిన జట్టు చివరి 5 వికెట్లకు ఏకంగా 376 పరుగులు జోడించింది. ఆపై బుమ్రా లేని లోటును తీర్చేలా ఆకాశ్‌దీప్, సిరాజ్ చెలరేగిపోయి ఇంగ్లండ్ టాప్–3ని కుప్పకూల్చారు. మూడో రోజూ మన బౌలర్ల జోరు సాగితే టీమిండియాకు మ్యాచ్‌పై పట్టు చిక్కడం ఖాయం. బరి్మంగ్‌హామ్: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి కూడా ఓడిన భారత్ ఈసారి అంతకంటే మరింత భారీ స్కోరును నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 310/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ క్రికెట్లో స్టోక్స్–మెకల్లమ్ (బజ్‌బాల్) శకం మొదలైన తర్వాత ఆ జట్టుపై ప్రత్యర్థి సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (103 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో వికెట్‌కు జడేజాతో 203 పరుగులు జోడించిన గిల్... ఏడో వికెట్‌కు సుందర్‌తో 144 పరుగులు జత చేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఫాలోఆన్ తప్పించుకునేందుకు కూడా ఆ జట్టు మరో 311 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా చేజారిన సెంచరీ మ్యాచ్ రెండో రోజు తొలి బంతికి సింగిల్‌తో గిల్, జడేజా భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. అనంతరం 80 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... ధాటిని పెంచిన గిల్ టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అందుకోవడంతో పాటు కెరీర్లో తొలిసారి 150 పరుగులు (263 బంతుల్లో) దాటాడు. ఆ తర్వాత మరింత జోరు ప్రదర్శించిన వీరిద్దరు బషీర్ ఓవర్లో చెరో సిక్స్ బాదారు. ఇదే ఊపులో శతకం దిశగా దూసుకుపోయిన జడేజా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం కోల్పోయాడు. టంగ్ వేసిన షార్ట్ బంతి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా... గ్లవ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచి కీపర్ చేతుల్లో పడింది. దాంతో ద్విశతక భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం సుందర్ కూడా చక్కటి షాట్లతో గిల్‌కు తగిన సహకారం అందించాడు. తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 109 రన్స్ చేసింది. కొనసాగిన జోరురెండో సెషన్లో గిల్ మరింత చెలరేగిపోయాడు. బషీర్ ఓవర్లో సిక్స్ కొట్టిన అతను టంగ్ ఓవర్లో రెండు ఫోర్లతో 195కు చేరుకున్నాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్‌లోనే ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీయడంతో 311 బంతుల్లో గిల్ డబుల్ సెంచరీ పూర్తయింది. ఆపై 200 నుంచి 250 వరకు చేరేందుకు గిల్‌కు కేవలం 37 బంతులు (8 ఫోర్లు, 1 సిక్స్) సరిపోయాయి. ఈ క్రమంలో బ్రూక్ ఓవర్లో అతను వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఎట్టకేలకు సుందర్‌ను రూట్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్‌కు కాస్త ఊరట లభించింది. రెండో సెషన్లో భారత్ 31 ఓవర్లలో ఓవర్‌కు 4.6 రన్‌రేట్‌తో ఏకంగా 145 పరుగులు సాధించడం విశేషం. టీ విరామానంతరం ‘ట్రిపుల్’పై కన్నేసిన గిల్‌ను నిలువరించడంలో ఇంగ్లండ్ సఫలమైంది. టంగ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇవ్వడంతో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మరో 13 పరుగుల తర్వాత భారత్ తమ చివరి 2 వికెట్లు కోల్పోయింది. టపటపా ప్రత్యర్థి చేసిన కొండంత స్కోరు కనిపిస్తుండగా ఒత్తిడిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఆకాశ్‌దీప్ చెలరేగిపోతూ వరుస బంతుల్లో డకెట్ (0), పోప్ (0)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ తర్వాత క్రాలీ (19)ని సిరాజ్ పెవిలియన్ పంపడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే రూట్, బ్రూక్ పట్టుదలగా నిలబడి ఇంగ్లండ్‌ను ఆదు కున్నారు. ఆరంభంలో కొంత తడబడినా చివరకు 12.5 ఓవర్లు నిలిచి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (సి) పోప్ (బి) టంగ్ 269; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 89; సుందర్ (బి) రూట్ 42; ఆకాశ్‌దీప్ (సి) డకెట్ (బి) బషీర్ 6; సిరాజ్ (స్టంప్డ్) స్మిత్ (బి) బషీర్ 8; ప్రసిధ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (151 ఓవర్లలో ఆలౌట్) 587. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211, 6–414, 7–558, 8–574, 9–574, 10–587. బౌలింగ్: వోక్స్ 25–6–81–2, కార్స్ 24–3–83–1, టంగ్ 28–2–119–2, స్టోక్స్ 19–0–74–1, బషీర్ 45–2–167–3, రూట్ 5–0–20–1, బ్రూక్ 5–0–31–0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్‌దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 18; బ్రూక్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 77. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 7–1–36–2, సిరాజ్ 7–2–21–1, ప్రసిధ్ కృష్ణ 3–0–11–0, నితీశ్ రెడ్డి 1–0–1–0, జడేజా 2–1–4–0. -
ENG VS IND 2nd Test Day 2: పట్టుబిగిస్తున్న భారత్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్‌లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 20 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. రూట్ (18), బ్రూక్ (30) క్రీజ్‌లో ఉన్నారు. -
ENG VS IND 2nd Test: నిప్పులు చెరిగిన ఆకాశ్‌దీప్, సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్‌లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/3గా ఉంది. రూట్ (5), బ్రూక్ (5) క్రీజ్‌లో ఉన్నారు. -
ENG VS IND 2nd Test: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు ఈ స్థాయి స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్.. ఇవాళ (రెండో రోజు) మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఇవాళ డబుల్ సెంచరీ సాధించాడు.భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లో భారత తరఫున ఐదు శతకాలు నమోదైనా ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. -
భారీ డబుల్ సెంచరీ.. కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారీ డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి రికార్డులు తిరగరాశాడు. రెండో రోజు గిల్ టీ విరామం తర్వాత కాసేపటికే ఔటయ్యాడు. టంగ్ బౌలింగ్‌లో ఓలీ పోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ డబుల్ సెంచరీతో గిల్ చాలా రికార్డులు సాధించాడు.కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలుఈ మ్యాచ్‌లో 269 పరుగులు చేసి ఔటైన గిల్.. టెస్ట్‌ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. విరాట్ 2019లో సౌతాఫ్రికాపై 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టి టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా అవతరించాడు. గిల్ కెప్టెన్‌గా తన మూడో ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత కెప్టెన్లు..గిల్-269కోహ్లి-254 నాటౌట్ (2019)కోహ్లి-243 (2017)కోహ్లి-235 (2016)ధోని-224 (2013)టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాళ్లు..వీరేందర్ సెహ్వాగ్ - 319వీరేందర్ సెహ్వాగ్ - 309కరుణ్ నాయర్ - 303*వీరేందర్ సెహ్వాగ్ - 293వీవీఎస్ లక్ష్మణ్ - 281రాహుల్ ద్రవిడ్ - 270శుభ్‌మన్ గిల్ - 269ఇంగ్లండ్‌లో 250+ స్కోర్లు సాధించిన పర్యాటక టెస్ట్ కెప్టెన్లు..311 - బాబ్ సింప్సన్ (AUS), ఓల్డ్ ట్రాఫోర్డ్, 1964277 - గ్రేమ్ స్మిత్ (SA), ఎడ్జ్‌బాస్టన్, 2003269 - శుభ్‌మన్ గిల్ (IND), ఎడ్జ్‌బాస్టన్, 2025259 - గ్రేమ్ స్మిత్ (SA), లార్డ్స్, 2003విదేశీ టెస్టుల్లో టీమిండియా తరపున 250+ స్కోర్లు చేసిన ఆటగాళ్లు..309 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, ముల్తాన్, 2004270 - రాహుల్ ద్రవిడ్ vs PAK, రావల్పిండి, 2004269 - శుభ్‌మన్ గిల్ vs ENG, ఎడ్జ్‌బాస్టన్, 2025254 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, లాహోర్, 2006గిల్ సాధించిన మరిన్ని రికార్డులు..ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్..ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడు.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడు.. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్.. ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడు.. టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. గిల్ ఔటయ్యాక భారత్ అదే స్కోర్ వద్ద ఆకాశ్‌దీప్ (6) వికెట్ కూడా కోల్పోయింది. 149 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 583/9గా ఉంది. సిరాజ్ (7), ప్రసిద్ద్ కృష్ణ (2) క్రీజ్‌లో ఉన్నారు.యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1), రవీంద్ర జడేజా (89), సుందర్ (42), గిల్ (269), ఆకాశ్‌దీప్ (6) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, టంగ్, బషీర్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ENG VS IND 2nd Test: భారీ డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారీ డబుల్ సెంచరీతో (266) చెలరేగి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు లంచ్ తర్వాత గిల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. గిల్‌కు టెస్ట్‌ల్లో ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ మైలురాయిని గిల్ 311 బంతుల్లో చేరుకున్నాడు. ఈ డబుల్‌తో గిల్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా..ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా.. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్‌గా.. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్‌గా.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్‌గా పలు రికార్డులు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ ఇప్పటికే భారీ స్కోర్ చేసేసింది. డబుల్ సెంచరీ తర్వాత కూడా గిల్ జోరు కొనసాగుతుంది. 266 పరుగుల వద్ద గిల్ బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఆకాశ్‌దీప్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. టీ విరామం సమయానికి భారత్ స్కోర్ 565/7గా ఉంది.310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. లంచ్ విరామానికి ముందు రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, సిక్సర్) వికెట్ కోల్పోయింది. 41 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జడేజా గిల్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్‌కు 203 పరుగులు జోడించారు. అనంతరం గిల్, వాషింగ్టన్ సుందర్‌తో (42) కలిసి ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్, జోష్ టంగ్ తలో వికెట్ పడగొట్టారు. -
డబుల్ సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో తొలి ద్విశతకం (Maiden Test Double Century)నమోదు చేయడంతో పాటు.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా గిల్ ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి 21 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా గిల్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్ చేరాడు. గిల్ కంటే ముందు.. విరాట్ కోహ్లి ఏడుసార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఒక్కో డబుల్ సెంచరీ బాదారు.విదేశీ గడ్డ మీద కోహ్లి తర్వాత..అదే విధంగా.. విదేశీ గడ్డ మీద విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్‌గానూ గిల్ చరిత్రకెక్కాడు. కోహ్లి 2016లో నార్త్ సౌండ్‌లో 200 పరుగులు సాధించాడు.👉అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్‌గానూ ఘనత.. ఈ జాబితాలో గిల్ కంటే ముందు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు.🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 1964లో ఢిల్లీ వేదికగా 23 ఏళ్ల 39 రోజుల వయసులో..🏏శుబ్‌మన్ గిల్- 2025లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా 25 ఏళ్ల 298 రోజుల వయసులో..🏏సచిన్ టెండుల్కర్- 1999లో అహ్మదాబాద్ వేదికగా 26 ఏళ్ల 189 రోజుల వయసులో..🏏విరాట్ కోహ్లి- 2016లో నార్త్ సౌండ్ వేదికగా 27 ఏళ్ల 260 రోజుల వయసులో...500 పరుగుల మార్కు దాటిన టీమిండియాఎడ్జ్బాస్టన్ వేదికగా ఓవైపు శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ అతడికి సహకారం అందిస్తున్నాడు. 129 ఓవర్ల ఆట ముగిసేసరికి సుందర్ 24, గిల్ 231 పరుగులతో ఉండగా.. టీమిండియా స్కోరు: 510/6. అంతకు ముందు రవీంద్ర జడేజా అర్ధ శతకం (89) బాది అవుట్ కాగా.. తొలిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
చరిత్ర తిరగరాసిన శుబ్‌మన్ గిల్.. అత్యధిక స్కోరుతో..
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. తొలిరోజే శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గురువారం నాటి రెండో రోజు ఆటలో 150 పరుగుల మార్కు అందుకున్నాడు. 263 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో గిల్ ఈ మేర స్కోరు చేశాడు.తద్వారా టీమిండియా దిగ్గజ బ్యాటర్, కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా అవతరించాడు. ఇంతకు ముందు 2018 నాటి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి ఇదే వేదికపై 149 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా గిల్ కోహ్లిని అధిగమించి ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర తిరగరాశాడు. ఇక టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం ఇదే తొలిసారి.భారత రెండో కెప్టెన్‌గా..ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్‌గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు.మూడో సారథిగా..అదే విధంగా.. 26వ పడిలో అడుగుపెట్టక ముందే టెస్టు ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మార్కు దాటిన భారత మూడో కెప్టెన్‌గానూ గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు మన్సూర్ అలీఖాన్ పటౌడీ రెండుసార్లు ఈ ఘనత సాధించగా.. సచిన్ టెండుల్కర్ కూడా ఈ ఫీట్ నమోదు చేశాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడే నిమిత్తం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ సిరీస్‌తో గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఐదు వికెట్లు తేడాతో ఓటమిపాలైంది.జడేజాతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యంఈ క్రమంలో బుధవారం (జూలై 2) నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసిన భారత్.. గురువారం నాటి రెండో రోజు 400 పరుగుల మార్కు దాటింది. 107 ఓవర్లుముగిసే సరికి గిల్ 164, జడేజా 88 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టును ఆదుకున్నారు. అయితే, తన స్కోరుకు మరో పరుగు జతచేసిన తర్వాత జడ్డూ జోష్ టంగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.లంచ్ బ్రేక్ సమయానికి స్కోరు ఎంతంటే?గురువారం భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: 419/6 (110). గిల్ 168, వాషింగ్టన్ సుందర్ ఒక పరుగుతో ఉన్నారు.చదవండి: ఇదేం సెలక్షన్?.. ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్ -
ఇదేం సెలక్షన్?.. ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రస్తుతానికి 1-1తో సమం చేయాలని భావిస్తోంది. అయితే, భారత్ రెండో టెస్టుకు ఎంపిక చేసిన తుదిజట్టుపై విమర్శలు వస్తున్నాయి.మూడు మార్పులుబర్మింగ్హామ్లో బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. తొలి టెస్టులో విఫలమైన సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూలను జట్టు నుంచి తప్పించింది.వీరి స్థానాల్లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తుదిజట్టులోకి వచ్చారు. అయితే, ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్పిన్‌కు కాస్త ఎక్కువగానే సహకరిస్తుందనే విశ్లేషణల నడుమ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను టీమిండియా పక్కనపెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.విమర్శల వర్షంఅంతేకాదు.. బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేసేందుకు ఆల్‌రౌండర్లు నితీశ్, వాషీలను తీసుకున్నామని.. ఆఖర్లో కుల్దీప్ను కూడా పక్కనపెట్టాల్సి వచ్చిందని కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్లు సునిల్ గావస్కర్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ టీమిండియా నాయకత్వ బృందంపై విమర్శలు గుప్పించారు.ఎనిమిది రోజుల విరామం తర్వాత కూడా బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని రవిశాస్త్రి తప్పుబడితే.. కుల్దీప్ను ఎలా పక్కనపెడతారంటూ గావస్కర్, గంగూలీ ఫైర్ అయ్యారు. కీలక మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదంటూ విమర్శించారు.ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్అయితే, బుధవారం నాటి తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్క మాటతో ఈ విమర్శలను తిప్పికొట్టాడు. ఆట పూర్తైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లేదు.. తుదిజట్టు ఎంపికలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు’’ అంటూ విమర్శకులకు ఇచ్చిపడేశాడు. తమ ప్రణాళికలకు అనుగుణంగానే మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. ‘‘బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అతడు అద్బుతం. జట్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అతడికి స్పష్టమైన అవగాహన ఉంది. మేము అనుకున్న పని పూర్తి చేస్తాం’’ అని జైస్వాల్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. బర్మింగ్‌హామ్ వేదికగా రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసింది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (2) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ అద్భుత అర్ధ శతకం(87) సాధించాడు. ఇక కరుణ్ నాయర్ (31) మరోసారి నిరాశపరచగా.. రిషభ్ పంత్ 25 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ గిల్ శతక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా అతడికి అండగా నిలిచాడు. బుధవారం ఆట పూర్తయ్యేసరికి గిల్ 114, జడ్డూ 41 పరుగులతో అజేయంగా ఉన్నారు.చదవండి: గిల్‌పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
ENG VS IND 2nd Test Day 2: ప్రమాదంలో కోహ్లి రికార్డు
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయ సెంచరీతో (114), రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 87, కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు.రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు శుభ్‌మన్ గిల్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రెండో రోజు గిల్ మరో 36 పరుగులు చేస్తే, ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై 150 పరుగులు మార్కును తాకిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తరఫున ఇప్పటివరకు ఎవరూ 150 పరుగుల మార్కును తాకలేదు. 2018లో విరాట్ 149 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకు ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. విరాట్ రికార్డును ఛేదించే క్రమంలో గిల్ సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్‌లను అధిగమించే అవకాశం ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో సచిన్ 122, పంత్ 146 పరుగులు చేశారు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు.ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్బుతంగా ఆడారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు.ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత్ ఎంచుకున్న తుదిజట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కీలక మ్యాచ్‌లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినివ్వడంతో పాటు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను జట్టులోకి తీసుకోకపోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.తప్పని ఓటమిలీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు శతకాలు సాధించినా.. లోయర్ ఆర్డర్, బౌలర్లు, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా పరాభవం తప్పలేదు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ సేన 0-1తో వెనుకబడింది. అయితే, రెండో టెస్టులోనైనా పొరపాట్లు సరిచేసుకుంటుందని భావిస్తే.. తుదిజట్టు కూర్పే సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి.తొలి టెస్టులో ఆడిన బుమ్రాకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్‌లను ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు తీసుకుంది.ఇద్దరు బెస్ట్ స్పిన్నర్లు ఉన్నారా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లతో ఆడుతుందని నాకు అనిపించడం లేదు. ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది.టీమిండియాకు ఇదే మంచి అవకాశం. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే సానుకూల ఫలితం రాబట్టగలము’’ అని పేర్కొన్నాడు ఇక భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ మాత్రం మేనేజ్మెంట్ తీరుపై ఘాటు విమర్శలు చేశాడు. ‘‘కుల్దీప్ యాదవ్‌ను తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎడ్జ్‌బాస్టన్ లాంటి పిచ్‌పై బంతి కాస్త టర్న్ అవుతుందనీ తెలిసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.గిల్‌పై గావస్కర్ ఆగ్రహం!అంతేకాదు.. బ్యాటింగ్‌లో డెప్త్ కోసం ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లను తీసుకున్నామన్న కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సమర్థనను కూడా గావస్కర్ తప్పుబట్టాడు. ‘‘మీ జట్టులోని టాపార్డర్ విఫలమవుతుంటే.. వాషింగ్టన్ ఏడో స్థానంలో వచ్చి.. నితీశ్ రెడ్డి ఎనిమిదో స్థానంలో వచ్చి ఏం చేయగలరు?వాళ్లేమీ తొలి టెస్టులో విఫలమైన బ్యాటర్ల మాదిరి కాదు కదా!.. మీరు మొత్తంగా 830కి పైగా పరుగులు చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 380 స్కోరు చేయలేక ప్రత్యర్థికి అవకాశం ఇచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్‌ను పటిష్టం చేస్తున్నామని చెప్పడం కాదు.. వికెట్లు తీసే బౌలింగ్ విభాగాన్ని ఎంచుకోండి’’ అని గావస్క కెప్టెన్ గిల్, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఇంగ్లండ్‌తో బుధవారం మొదలైన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు ఆడుతున్నారు. వీరిలో ఒకరికి బదులు స్పెషలిస్టు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేయాల్సిందని గావస్కర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక రెండో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (114 నాటౌట్)లతో పాటు రవీంద్ర జడేజా (41 నాటౌట్) రాణించాడు.ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్ -
గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్
ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman gill) అద్బుతమైన సెంచరీ సాధించాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శుబ్‌మన్ గిల్.. బాధ్యయుత ఇన్నింగ్స్‌తో కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన గిల్.. మొదటి 100 బంతుల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కున్నాక తనదైన శైలిలో గిల్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో శుబ్‌మన్ 199 బంతుల్లో తన ఏడవ టెస్ట్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. తొలి టెస్టులో కూడా గిల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఆటను చూసి దక్షిణాఫ్రికా లెజెండ్ గ్రేమ్ స్మిత్ గర్వపడతుంటాడని యువరాజ్ కొనియాడాడు. కాగా గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఇంగ్లండ్‌లో తన తొలి టెస్ట్ సిరీస్‌లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు గిల్ డబుల్ సెంచరీలు సాధించికపోయినప్పటికి.. వరుసగా రెండు సెంచరీలు మాత్రం నమోదు చేశాడు. ఈ క్రమంలోనే గిల్‌ను స్మిత్‌తో యువీ పోల్చాడు."జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది నేను ఉన్నా అంటూ ముందుకు వస్తారు. ఆ కోవకు చెందినవాడే శుబ్‌మన్ గిల్. టెస్టు కెప్టెన్‌గా వరుసగా సెంచరీలు చేసిన అతికొద్ది మందిలో ఒకడిగా గిల్ నిలిచాడు. ఎంతో ప్రశాంతత, ధైర్యవంతంగా బ్యాటింగ్ చేయడం, జట్టును విజయవంతంగా నడిపించాలనే తపన గిల్లో కన్పించాయి.అతడిని చూసి గ్రేమ్ స్మిత్ కచ్చితంగా గర్వపడుతుంటాడు అని ఎక్స్‌లో యువీ రాసుకొచ్చాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌తో పాటు రవీంద్ర జడేజా(41) ఉన్నాడు.చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి భారత ప్లేయర్‌గా -
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి భారత ప్లేయర్‌గా
భారత టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడిన టీమిండియాను జైశ్వాల్‌తో కలిసి గిల్ ఆదుకున్నాడు.ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నాక తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్‌ను భారీ స్కోర్ దిశగా శుబ్‌మన్ నడిపిస్తున్నాడు. గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. గిల్‌కు ఇది ఏడో టెస్టు సెంచరీ.కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌తో పాటు రవీంద్ర జడేజా(41) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన శుబ్‌మన్ గిల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.గిల్ సాధించిన రికార్డులు ఇవే..👉కెప్టెన్‌గా వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా గిల్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు విజయ్ హాజారే, సునీల్ గవాస్కర్ టెస్టు కెప్టెన్లుగా మొదటి రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లి వరుసగా మూడు మ్యాచ్‌లలో శతక్కొట్టాడు.👉ఇంగ్లండ్ గడ్డపై రెండు టెస్టు సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడైన ఆసియా కెప్టెన్‌గా శుబ్‌మన్ నిలిచాడు. గిల్ కేవలం 25 సంవత్సరాల 297 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇంగ్లండ్‌లో అతి తక్కువ వయస్సులో రెండు టెస్టు సెంచరీలు పర్యాటక బ్యాటర్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఈ ఘనతను 22 సంవత్సరాల 180 రోజుల వయస్సులో సాధించాడు. స్మిత్ తర్వాత ఈ ఫీట్ సాధించింది శుబ్మనే కావడం గమనార్హం.👉అదేవిధంగా ఇంగ్లండ్‌లో రెండుసార్లు టెస్టు మ్యాచ్ మొదటి రోజే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ భారత ఆటగాడిగా ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఓవరాల్‌గా 13వ ప్లేయర్‌గా గిల్ రికార్డులకెక్కాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్ -
గిల్ 'శతక' మోత
యువ సారథి శుబ్‌మన్ గిల్ మరో సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరిస్తే... రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్‌తో తన విలువ చాటుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రెండో రోజు గిల్, జడేజా జంట ఎంతసేపు నిలుస్తుందనే దానిపైనే భారత స్కోరు ఆధారపడి ఉంది.బర్మింగ్‌హామ్: పరాజయంతో ఇంగ్లండ్ పర్యటనను ప్రారంభించిన భారత క్రికెట్ జట్టు... రెండో టెస్టును మెరుగ్గా మొదలు పెట్టింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం మొదలైన రెండో టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (216 బంతుల్లో 114 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఈ సిరీస్‌తోనే సారథ్య బాధ్యతలు చేపట్టిన గిల్... కెప్టెన్సీ ప్రభావం తన బ్యాటింగ్‌పై ఏమాత్రం లేదని మరోసారి నిరూపించాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన గిల్... రెండో టెస్టులోనూ దాన్ని పునరావృతం చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 87; 13 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా (67 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కరుణ్ నాయర్ (50 బంతుల్లో 31; 5 ఫోర్లు), రిషబ్ పంత్ (42 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 2 వికెట్లు పడగొట్టగా... కార్స్, స్టోక్స్, బషీర్ తలా ఒక వికెట్ తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న భారత జట్టు రెండో రోజు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది కీలకం. జైస్వాల్ దూకుడు గత మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ జట్టు... ఈ సారి కూడా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. లీడ్స్‌తో పోల్చుకుంటే ఈ పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా ఉంటుందనే అంచనాల మధ్య తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 2) తొమ్మిదో ఓవర్లో అవుటయ్యాడు. తొలి స్పెల్‌ను కట్టుదిట్టంగా వేసిన వోక్స్‌కు ఈ వికెట్ దక్కింది. ఈ దశలో కరుణ్ నాయర్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న ఈ జంట... ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. గత మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన నాయర్... ఈసారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు సాధికారికంగా ఆడిన అతడు కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్‌లో జైస్వాల్ అలవోకగా పరుగులు రాబట్టాడు. వన్డే తరహాలో ఆడుతూ పాడుతూ... 59 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో హాఫ్‌సెంచరీ పూర్తిచేసుకున్నాడు. లంచ్ విరామానికి కాస్త ముందు కార్స్ బౌలింగ్‌లో నాయర్ అవుటయ్యాడు. దీంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ సంయమనం... రెండో సెషన్లో గిల్, జైస్వాల్ జోరు చూస్తే భారత్‌కు తిరుగులేనట్లు అనిపించింది. మంచి బంతులను గౌరవించిన ఈ జంట... గతి తప్పిన బంతులపై విరుచుకుపడి పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో జైస్వాల్ మరో సెంచరీ చేయడం ఖాయం అనుకుంటే... ఇంగ్లండ్ కెపె్టన్ స్టోక్స్ అతడిని ఔట్ చేసి జట్టుకు బ్రేక్ త్రూ అందించాడు. చివరి సెషన్లో పంత్ ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. శార్దుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన నితీశ్ ఆరు బంతులాడి వోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో ఇంగ్లండ్ శిబిరంలో ఉత్సాహం పెరగగా... గిల్ సంయమనంతో ముందుకు సాగాడు. మరో ఎండ్ లో జడేజా అతడికి చక్కటి సహకారం అందించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) జేమీ స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (బ్యాటింగ్) 114 ; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (బ్యాటింగ్)41; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం (85 ఓవర్లలో 5 వికెట్లకు) 310. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211. బౌలింగ్: వోక్స్ 21–6–59–2; కార్స్ 16–2–49–1; టంగ్ 13–0–66–0; స్టోక్స్ 15–0–58–1; బషీర్ 19–0–65–1; రూట్ 1–0–8–0. -
ENG VS IND, 2nd Test: టీమిండియాను ఆదుకున్న కెప్టెన్ 'గిల్' సెంచరీ
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్‌కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్‌కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్‌మన్ గిల్ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్‌కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్‌కు దక్కింది. వోక్స్ బౌలింగ్‌లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. గిల్ 114, రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 85 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 310/5గా ఉంది. -
ENG VS IND 2nd Test Day 1: జైస్వాల్ సెంచరీ మిస్.. పోరాడుతున్న గిల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్‌కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్‌కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్‌మన్ గిల్ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్‌కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్‌కు దక్కింది. వోక్స్ బౌలింగ్‌లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. గిల్ 86, రవీంద్ర జడేజా 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 76 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 270/5గా ఉంది. -
అందుకే కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టాం: శుబ్‌మన్ గిల్
టీమిండియా- ఇంగ్లండ్ (India vs England) మధ్య రెండో టెస్టు నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వచ్చిన పేరు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav). ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఈ చైనామన్ స్పిన్నర్‌ను ఆడిస్తే భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌తో పాటు.. సునిల్ గావస్కర్ వంటి భారత దిగ్గజ క్రికెటర్లు కూడా టీమిండియా మేనేజ్మెంట్కు సూచించారు.అతడికి విశ్రాంతి.. వారిపై వేటుఅయితే, రెండో టెస్టు ఆడే జట్టులో మాత్రం కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కలేదు. ఈ మణికట్టు స్పిన్నర్‌కు బదులు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)కు సెలక్టర్లు తుదిజట్టులో స్థానం ఇచ్చారు. తొలి టెస్టులో ఆడిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో పాటు.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేశారు.ఈ ముగ్గురి స్థానంలో పేసర్ ఆకాశ్ దీప్తో పాటు ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో జట్టులో చేసిన మార్పుల గురించి స్పందించిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు.అందుకే కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టాం‘‘ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో మేము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. రెడ్డి, వాషీలతో పాటు ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించడం లేదు. అతడి వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం.మూడో టెస్టు లార్డ్స్‌లో జరుగనుంది. అక్కడ బుమ్రా అవసరం మాకు ఎక్కువగా ఉంటుంది. అక్కడి పిచ్‌ను బుమ్రా సద్వినియోగం చేసుకోగలడు. అందుకే ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చాం.ఇక కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలని ఆఖరి వరకు అనుకున్నాం. అయితే, బ్యాటింగ్‌లో డెప్త్ గురించి ఆలోచించి అతడిని పక్కనపెట్టాం. ’’ అని శుబ్‌మన్ గిల్ వెల్లడించాడు. గత మ్యాచ్‌లో తమ లోయర్ ఆర్డర్ దారుణంగా విఫలమైందని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా గతంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ కుల్దీప్ యాదవ్‌కు మొదట ప్రాధాన్యం ఇవ్వలేదు మేనేజ్మెంట్.భారత గడ్డపై ఇలాఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు ఓడిన తర్వాత.. రెండో మ్యాచ్ నుంచి అతడిని తుదిజట్టులోకి తీసుకున్నారు. తదుపరి నాలుగు మ్యాచ్‌లలో కుల్దీప్ ఆకాశమే హద్దుగా చెలరేగి మొత్తంగా 19 వికెట్లు కూల్చాడు. తద్వారా టీమిండియా ఇంగ్లండ్‌పై 4-1తో గెలిచి సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ప్రస్తుతం సిరీస్ ఇంగ్లండ్‌లో జరుగుతున్నందున అతడికి ఎక్కువగా అవకాశం రాకపోవచ్చు. కానీ ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్వభావాన్ని బట్టి కుల్దీప్ను ఆడిస్తారని అంతా భావించారు. కాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఐదు శతకాలు బాదినాఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు శతకాలు బాదినా ఫలితం లేకుండా పోయింది. యశస్వి జైస్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలు కొట్టగా.. రిషభ్ పంత్ రెండు శతకాలతో అలరించాడు. అయితే, అప్పుడు కూడా బ్యాటింగ్ డెప్త్ కోసమని శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోగా.. అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఐదు పరుగులు చేయడంతో పాటు కేవలం రెండు వికెట్లే పడగొట్టగలిగాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (జూలై 2) రెండో టెస్టు ఆరంభం కాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 8.4 ఓవర్ వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (2) బౌల్డ్ కాగా.. యశస్వి జైస్వాల్ 12 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 15/1 (8.4).చదవండి: IND vs ENG T20Is: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు -
IND vs ENG: తుదిజట్టులోకి నితీశ్ రెడ్డి, వాషీ, ఆకాశ్.. ఆ ఇద్దరిపై వేటు
England vs India 2nd Test Birmingham: టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తెలిపాడు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.బుమ్రాకు విశ్రాంతితాను టాస్ గెలిస్తే తప్పక తొలుత బౌలింగే ఎంచుకునేవాడినని తెలిపాడు. ఇక రెండో టెస్టులో తాము మూడు మార్పులతో బరిలోకి దిగినట్లు గిల్ వెల్లడించాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చామని.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.ఆ ఇద్దరిపై వేటుకాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో పాటు.. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్‌పై వేటు పడింది. శార్దూల్ తొలి టెస్టులో కేవలం ఐదు పరుగులు చేయడంతో పాటు.. రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.కరుణ్ నాయర్‌కు రెండో అవకాశంమరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో ముప్పై పరుగులు చేయగలిగాడు. అయితే, సాయి సుదర్శన్‌తో పాటే విఫలమైన సీనియర్ కరుణ్ నాయర్‌పై మేనేజ్మెంట్ మరోసారి నమ్మకం ఉంచింది. అతడికి రెండో ఛాన్స్ ఇచ్చింది. కాగా కరుణ్ తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్‌లోనూ 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఫలితంగా ఇంగ్లండ్ ఈ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జూలై 2-6 రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు -
‘అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్‌కు ముగింపు’
టీమిండియా ఓపెనర్‌గా శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ లెఫ్టాండర్.. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా వన్డేల్లో అత్యుత్తమంగా రాణించాడు. తన కెరీర్లో మొత్తంగా 167 వన్డేలు ఆడిన గబ్బర్ 6793 పరుగులు సాధించాడు.అయితే, నయా స్టార్లు శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (Ishan Kishan)ల రాకతో టీమిండియాలో ధావన్ స్థానం ప్రశ్నార్థకమైంది. ఈ ఇద్దరు ఓపెనర్లుగా పాతుకుపోవడంతో పాటు.. వీరికి తోడు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులోకి వచ్చారు. ఫలితంగా ధావన్‌ను సెలక్టర్లు పట్టించుకోవడమే మానేశారు.ఈ క్రమంలో 2022లో టీమిండియా తరఫున చివరగా ఆడిన శిఖర్ ధావన్.. రెండేళ్ల పాటు పునరాగమనం కోసం ఎదురుచూశాడు. కానీ యువ ఆటగాళ్ల జోరు ముందు నిలవలేక గతేడాది ఆగష్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్‌కు ముగింపుతాజాగా ఈ విషయాల గురించి శిఖర్ ధావన్ స్పందించాడు. బంగ్లాదేశ్ మీద ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాదినపుడే తన కెరీర్ ముగింపు దశకు వచ్చిందని భావించినట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నేను చాలాసార్లు ఫిఫ్టీలు బాదాను. ఎన్నోసార్లు డెబ్బైలలో అవుటయ్యాను.వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాను. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో వన్డేలో 200 పరుగులు చేశాడో.. అప్పుడే నా కెరీర్ ముగింపునకు వచ్చేసిందని నా మనసు చెప్పింది. నా అంతరాత్మ చెప్పినట్లే జరిగింది.ఆ సమయంలో నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నా గురించి చాలా ఫీలయ్యారు. నేనెక్కడ బాధపడిపోతానో అని నన్ను కనిపెట్టుకుని ఉన్నారు. కానీ నేను మాత్రం జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను’’ అని హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. కాగా డబుల్ సెంచరీ వీరుడు ఇషాన్ కిషన్ కూడా అనతికాలంలోనే క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో చోటుతో పాటు.. సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోవడం గమనార్హం. మరోవైపు.. గిల్ మాత్రం నిలకడైన ఆటతో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఎదిగాడు.ఒక్కరూ మాట్లాడలేదుఇక జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఒక్కరు కూడా తనను మళ్లీ కాంటాక్టు చేయలేదని ఈ సందర్భంగా ధావన్ చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో చోటు కోల్పోవడం సాధారణ విసయమే. పద్నాలుగేళ్ల వయసు నుంచే మాకు ఇది అలవాటు అవుతుంది.అంతేకాదు ఎవరి బిజీలో వాళ్లుంటారు. పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. అయితే, ద్రవిడ్ భాయ్ మాత్రం ఆ సమయంలో నాతో మాట్లాడాడు. ఆయన నాకు మెసేజ్ చేశారు’’ అని ధావన్ తెలిపాడు. కాగా శిఖర్ ధావన్ ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో, లెజెండ్స్ లీగ్ క్రికెట్లోనూ అతడు భాగమవుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు -
శుభవార్త చెప్పిన శుబ్‌మన్ గిల్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు (Ind vs Eng 2nd Test)కు భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అందుబాటులో ఉంటాడా? లేడా?.. గత కొన్ని రోజులుగా క్రికెట్ వర్గాల్లో ఇదే చర్చ. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. అయితే, అతడిని ఆడించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ ట్విస్ట్ ఇచ్చాడు.తొలి టెస్టులో ఓటమిటెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన స్టోక్స్ బృందం చేతిలో ఓటమిపాలైంది. ఐదో రోజు వరకు సాగిన ఆటలో ఆఖరికి ఐదు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.బుమ్రాపైనే భారంఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లలో బుమ్రా ఒక్కడే గొప్పగా రాణించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఐదు వికెట్లు కూల్చాడు. అయితే, మిగతా బౌలర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. అదే విధంగా.. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా టీమిండియా కొంపముంచాయి.ఇదిలా ఉంటే.. ఫిట్నెస్, పనిభారం దృష్ట్యా బుమ్రా ఇంగ్లండ్‌తో ఐదింటిలో మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని మేనేజ్మెంట్ ముందే స్పష్టం చేసింది. అయితే, అవి ఏ మూడో మాత్రం చెప్పలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బుమ్రా రెండో టెస్టు బరిలో దిగితేనే బాగుంటుందని విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు టీమిండియాకు సూచిస్తున్నారు.బుమ్రా అందుబాటులో ఉంటాడు.. కానీతొలి- రెండో టెస్టుకు మధ్య వారానికి పైగా విరామం దొరికింది కాబట్టి బుమ్రాను ఆడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా అందుబాటులో ఉన్నాడు. అతడి వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ గురించి మేము ఆలోచిస్తున్నాం.అయితే, ఈరోజు సాయంత్రానికి మేము సరైన కూర్పుతో జట్టును ఎంపిక చేసుకోగలం. అప్పుడే బుమ్రా విషయంలో నిర్ణయం తీసుకుంటాం. ఈ సిరీస్ ఎంత ముఖ్యమో మాకు తెలుసు.కనీసం మూడు మ్యాచ్‌లకైనా బుమ్రా అందుబాటులో ఉంటాడు. తను జట్టు లేకపోతే ఆ లోటు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అధిక పనిభారాన్ని మోపడం కూడా సరికాదు.20 వికెట్లు కూల్చడం సహా భారీగా పరుగులు రాబట్టగలిగే జట్టు కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం. పిచ్‌ను చూసిన తర్వాతే స్పిన్నర్లలో ఎవరిని తుదిజట్టులో చేర్చుకుంటామో చెప్పగలము’’ అని పేర్కొన్నాడు. కాగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం (జూలై 2-6) నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు మొదలుకానుంది. చదవండి: జైస్వాల్‌పై గంభీర్ ఆగ్రహం!.. ‘వేటు’ తప్పదన్న డష్కాటే! -
ఇంగ్లండ్‌కు టీమిండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి.. లేదంటే కష్టమే: రవిశాస్త్రి
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు నాలుగు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్లో గిల్ సేన తీవ్రంగా శ్రమించింది.ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే రెండో టెస్టులో ప్రత్యర్ధికి ధీటైన సమాధానిమివ్వాలని భారత జట్టును రవిశాస్త్రి కోరాడు."రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి ఇంగ్లండ్‌కు టీమిండియా కౌంటర్ పంచ్ ఇవ్వాలి. ఇది భారత్‌కు చాలా ముఖ్యమైన విషయం. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవకపోతే సిరీస్‌లో వెనకబడుతోంది. తొలి టెస్టులో ఎక్కువ భాగం ఆధిపత్యం చెలాయించినప్పటికి.. ఆఖరి రోజు ఆటలో నిరాశపరచడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరి రోజు ఆటలో భారీ టార్గెట్ చేధించి గెలిచినందుకు ఇంగ్లండ్‌కు కచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే. కానీ ఇప్పుడు ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి పుంజుకోవాల్సిన అవసరముంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడుతాడో లేదో ఇంకా తెలియదు. కానీ అతడు ఆడాలనే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్.. ఇందులో గెలిస్తే సిరీస్ సమమవుతోంది. కాబట్టి ఈ ఒక్క మ్యాచ్‌లో అతడిని ఆడించి మిగితా మ్యాచ్‌లకు విశ్రాంతి ఇస్తే సరిపోతుంది. ఇది ఐదు మ్యాచ్‌ల సిరీస్ కాబట్టి భారత్ తిరిగి కమ్‌బ్యాక్ ఇస్తుందని ఆశిస్తున్నా" అని ఐసీసీ రివ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: IND vs ENG: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క వికెట్ తేడాతో ఓటమి -
గిల్‌ను విమర్శించొద్దు!.. రెండో టెస్టులో అతడిని ఆడించండి: అజారుద్దీన్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ అండగా నిలిచాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన ఈ యువ ఆటగాడిని విమర్శించడం తగదని హితవు పలికాడు. అతడికి మరికాస్త సమయం ఇవ్వాలని కోరాడు.దిగ్గజాల నిష్క్రమణ తర్వాతఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్‌శర్మ (Rohit Sharma), దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఆస్ట్రేలియా టూర్లో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలాంటి తరుణంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు మేనేజ్మెంట్ టెస్టు జట్టు పగ్గాలు అప్పగించింది.ఐదు వికెట్ల తేడాతో ఓటమిఈ క్రమంలో తొలుత టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) ఆడేందుకు గిల్ సారథ్యంలోని జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు శతకాలు బాదినా ఫలితం లేకుండా పోయింది.లోయర్ ఆర్డర్, బౌలింగ్ విభాగం వైఫల్యం, ఫీల్డర్ల తప్పిదాల కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో గిల్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మహ్మద్ అజారుద్దీన్ స్పందిస్తూ అతడికి మద్దతుగా నిలిచాడు.తొందరపాటే అవుతుంది‘‘కెప్టెన్‌గా అతడికి ఇదే తొలి మ్యాచ్. ఇప్పుడే కెప్టెన్సీ గురించి ఇంత చర్చ అవసరం లేదు. అతడికి ఇంకాస్త సమయం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు అతడికి అండగా నిలవాల్సిన సమయం ఇది. ప్రతిసారీ ఏదో ఒక ఫిర్యాదు చేస్తూ ఆటగాళ్లను విమర్శించడం తగదు. ఏదేమైనా తొలి టెస్టు ఆఖర్లో మన బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. ఇప్పటికైనా సరైన కూర్పుతో జట్టును ఎంపిక చేసుకోవాలి. బౌలింగ్ కూడా మారాలి’’ అని స్పోర్ట్స్‌కీడాతో అజారుద్దీన్ పేర్కొన్నాడు.కుల్దీప్ను తప్పక ఆడించండిఅదే విధంగా.. భారత బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే జట్టు అతిగా ఆధారపడుతోంది. వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు నియంత్రించేందుకు జట్టు ప్రతిసారి అతడినే ఆశ్రయిస్తోంది.అతడు ఒక్కడే రాణిస్తే సరిపోదు. అనుభవజ్ఞులైన మరికొంత మంది బౌలర్లు కూడా తమ వంతు పాత్ర పోషించాలి. రెండో టెస్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. తద్వారా బౌలింగ్‌లో వైవిధ్యం పెరుగుతుంది’’ అని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (జూలై 2-6)నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఇందుకు వేదిక. అయితే, ఇక్కడి పిచ్ పొడిగా ఉండనుండటంతో... కుల్దీప్ ప్రభావం చూపగలడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అజారుద్దీన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు -
వాళ్లంతా డుమ్మా!.. వీళ్లకు సీరియస్ వార్నింగ్.. సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు నేపథ్యలో టీమిండియా (Ind vs Eng 2nd Test) ప్రాక్టీస్‌లో తలమునకలైంది. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు పునరావృతం చేయకుండా ఉండేందుకు కఠినంగా సాధన చేస్తోంది. ఇందులో భాగంగా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బ్యాట్‌తో నెట్స్‌లో శ్రమించడం విశేషంగా నిలిచింది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు యువ పేస్ బౌలర్ ప్రసిద్ కృష్ణ ట్రెయినింగ్ సెషన్‌కు గైర్హాజరు కాగా.. సిరాజ్‌తో ఇతర టెయిలెండర్లు కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో మునిగిపోవడం గమనార్హం. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే.లోయర్ ఆర్డర్ కూడా దారుణంగా విఫలంఈ క్రమంలో లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బౌలర్లు, ఫీల్డర్లు తేలిపోవడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, లోయర్ ఆర్డర్ కూడా దారుణంగా విఫలం కావడం ప్రభావం చూపింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి టెయిలెండర్లంతా కలిపి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.అదే సమయంలో ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ ఉత్తమంగా రాణించి జట్టు విజయంలో భాగమైంది. ఈ నేపథ్యంలో భారత టెయిలెండర్లపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీరియస్ వార్నింగ్.. సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్!బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ నిర్దేశకత్వంలో సిరాజ్ డిఫెన్సివ్ షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. షార్ట్ బంతులు ఎదుర్కొన్న అతడు.. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతుల్ని వదిలేశాడు. ఫార్వర్డ్ డిఫెన్స్ కూడా ప్రాక్టీస్ చేశాడు.సాధారణంగా బౌలర్లు.. ఇంతగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టరు. అయితే, మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు టెయిలెండర్లు బ్యాటింగ్‌పై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ డుమ్మా కొట్టినట్లు సమాచారం. కాగా గిల్ (147)తొలి టెస్టులో శతకం బాదగా.. వైస్ కెప్టెన్ పంత్ ఏకంగా రెండు సెంచరీలు (134, 118) బాదాడు.ఇక రెండో టెస్టుకు ప్రధాన పేసర్ బుమ్రా దూరం కానున్నాడన్న వార్తల నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్ అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సూచనల మేరకు నెట్స్‌లో అర్ష్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఇందుకు కారణం. కాగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టుకు వేదిక. ఇరుజట్ల మధ్య జూలై 2-6 వరకు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు! -
ఐపీఎల్లో అలవాటైంది.. ఇక్కడా అదే చేశారు.. గిల్ మారకుంటే..
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదుర్కొన్నాడు యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill). ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng)లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో శతకం (147)తో చెలరేగినా.. అతడి ఇన్నింగ్స్‌కు విలువ లేకుండా పోయింది.గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిబ్యాటింగ్ విభాగం రాణించినా.. బౌలర్లు.. ముఖ్యంగా ఫీల్డర్ల తప్పిదాల వల్ల గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఏకంగా ఆరు క్యాచ్‌లు వదిలేసింది. యశస్వి జైస్వాల్ (Yashavi Jaiswal), రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, సాయి సుదర్శన్ కీలక సమయాల్లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేశారు.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (106), రెండో ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ (149) శతకాలతో సత్తా చాటి.. మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.ఫీల్డింగ్ కూడా అద్భుతమే.. కానీ ఇప్పుడుభారత్ జట్టు గొప్పదని.. వారి ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉండేదన్న హాడిన్.. గిల్ మాత్రం ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో ఆదిలోనే విఫలమయ్యాడని పేర్కొన్నాడు. కెప్టెన్‌తో పాటు ఆటగాళ్ల ఉదాసీనత వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని విమర్శించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భారత ఆటగాళ్లు ఇలా క్యాచ్‌లు జారవిడవడం ఎక్కువగా ఉందని.. ఇదో అలవాటుగా మారిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.‘‘ప్రతి గొప్ప జట్టు.. ఎక్కడ ఆడుతున్నా.. ఎప్పుడైనా ఫీల్డింగ్ విషయంలోనూ గొప్పగానే ఉంటుంది. కానీ ఈసారి గిల్ ఆ లెగసీని కొనసాగించలేకపోయాడు. జట్టుపై అతడు పట్టు కోల్పోయాడు. ఇప్పటికైనా గిల్ తన ఆటిట్యూడ్ మార్చుకోవాలి.మీ జట్టు బాగా ఫీల్డింగ్ చేయాలన్నా.. జట్టుగా సమిష్టిగా పోరాడలన్నా కెప్టెన్‌గా నువ్వు మరింత బలంగా తయారవ్వాలి. టెక్నిక్ మార్చాలి. ఎంత మంది కోచ్‌లు ఉంటే ఏం లాభం?.. ఆటగాళ్ల దృక్పథంలో మార్పు రావాలి. ఐపీఎల్లో అలవాటైంది.. ఇక్కడా అదేఈ ఏడాది ఐపీఎల్‌లోనూ చాలా మంది భారత ఆటగాళ్లు క్యాచ్‌లు మిస్ చేసిన తీరు చూశాం. దాని ఫలితమే ఇక్కడా కనిపిస్తోంది’’ అని బ్రాడ్ హాడిన్ విల్లో టాక్స్ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఇరుజట్ల మధ్య జూలై 2-6 రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు! -
తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్ప ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా
భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు.. ఆటలో సచిన్ టెండుల్కర్ వారసుడిగా పేరొందిన ఈ ముంబైకర్ ఇప్పుడు అవకాశాల కోసం పాకులాడాల్సిన పరిస్థితి. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి కారణంగా కెరీర్ పరంగా ఎంతో వెనుకబడిపోయాడు పృథ్వీ.గిల్ ఏకంగా టీమిండియా సారథి అయితే..అండర్-19 జట్టు కెప్టెన్‌గా భారత్‌కు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా సారథ్యంలో ఆడిన శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఏకంగా టీమిండియా కెప్టెన్ అయితే.. ఇతడు మాత్రం దేశవాళీ జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఒక్క ఫ్రాంఛైజీ కూడా కనీస ధర రూ. 75 లక్షల ధరకు పృథ్వీని కొనుగోలు చేయకపోవడం అతడి పరిస్థితికి అద్దం పడుతోంది.ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఇటీవలే ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీ క్రికెట్లో ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇందుకు అంగీకరించింది. ఇక వచ్చే సీజన్లో కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్న పృథ్వీ షా తాజాగా న్యూస్24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకున్నాడు.పంత్ తప్ప ఎవరూ మాట్లాడలేదు.. సచిన్ సర్‌కు తెలుసుతాను కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఒక్క ‘బిగ్ క్రికెటర్’ కూడా తనకు అండగా నిలవలేదని పృథ్వీ చెప్పాడు. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) తప్ప ఎవరూ తనతో కనీసం మాట్లాడలేదని తెలిపాడు. ‘‘సచిన్ టెండుల్కర్‌కు నాకు సమస్యలు తెలుసు.అర్జున్ టెండుల్కర్తో పాటు నేను క్రికెటర్‌గా ఎదగడం ఆయన చూశారు. ఓసారి వారి ఇంటికి కూడా వెళ్లాను. అయితే, నేను కెరీర్ పరంగా చిక్కుల్లో ఉన్నపుడు రిషభ్ పంత్ తప్ప ఒక్కరూ పలకరించలేదు’’ అని పృథ్వీ షా వెల్లడించాడు.అదే విధంగా ఆటపై దృష్టి పెట్టలేకపోవడానికి గల కారణాల్ని వివరిస్తూ.. ‘‘నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. బయటి నుంచి చూసే వాళ్లకు ఇది అర్థం కాకపోవచ్చు. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.తప్పుడు వ్యక్తులతో స్నేహంఅందుకే ఆటకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయా. నిజానికి నేను గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. కనీసం మూడు నాలుగు గంటలు నెట్స్‌లో గడిపేవాడిని. రోజులో సగం సమయం అక్కడే గడిపేవాడిని. కానీ ఆ తర్వాత ఆట నుంచి నా దృష్టి మరలింది.తర్వాత నాలో పశ్చాత్తాపం మొదలైంది. దేనికి ఎంత సమయం కేటాయించాలో ఓ అవగాహన వచ్చింది. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను. క్రికెటర్‌గా నేను ఉన్నత స్థితిలో ఉన్నపుడు వాళ్లు నా చెంత చేరారు. నన్ను చాలా చోట్లకు తిప్పారు.అప్పుడే నేను దారి తప్పాను. ఒకప్పుడు నెట్స్‌లో 8 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు ఆ సమయం నాలుగు గంటలకు తగ్గింది’’ అని పృథ్వీ షా తన తప్పులను అంగీకరించాడు. ఇకపై ఆటపైనే దృష్టి కేంద్రీకరిస్తానని వెల్లడించాడు. కాగా వచ్చే డొమెస్టిక్ సీజన్లో పృథ్వీ మహారాష్ట్ర జట్టుకు ఆడే అవకాశం ఉంది.చదవండి: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ -
ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయి.. గంభీర్‌పై పంత్ ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తీరు (Gautam Gambhir)పై స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో అద్భుత శతకాలు బాదిన ఆటగాడిని తక్కువ చేసినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. వేరే వాళ్లను ప్రశంసించడంలో తప్పులేదని.. కానీ అందుకోసం పంత్ గురించి అడిగిన ప్రశ్నకు ఇంతలా అసహనం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.విషయం ఏమిటంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది.ఐదు శతకాలుఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా మూడు సెంచరీలు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో పాటు కెప్టెన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) కూడా శతకాలతో అలరించారు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (4), గిల్ (8) విఫలం కాగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (137), పంత్ (118) సెంచరీలు బాది.. జట్టును ఆదుకున్నారు. వీరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యం విధించగలిగింది.అయితే, ఆఖరి రోజు వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు శతకాలు బాదినా టీమిండియాకు పరాభవమే మిగిలింది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయిఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. పంత్ ప్రదర్శన గురించి చెప్పాల్సిందిగా ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన గౌతీ.. ‘‘ఈ మ్యాచ్‌లో మనకు మరో మూడో సెంచరీలు కూడా ఉన్నాయి.అవి కూడా అతిపెద్ద సానుకూల అంశాలే. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. అయితే, యశస్వి బాదిన 100, కెప్టెన్‌గా అరంగేట్రంలోనే గిల్ చేసిన శతకం.. కేఎల్ రాహుల్ 100 గురించి కూడా మీరు ప్రస్తావించి ఉంటే ఇంకా సంతోషించేవాడిని.వీరు ఒక్కో సెంచరీ చేస్తే రిషభ్ పంత్ రెండు శతకాలు బాదాడు. ఒక్క టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు. నిజం చెప్పాలంటే.. ఇదొక గొప్ప ప్రదర్శన. ఏదేమైనా మీ ప్రశ్న ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది’’ అని కౌంటర్ ఇచ్చాడు.అంత అసహనం ఎందుకు?ఈ మేరకు గంభీర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా... పంత్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా పంత్ సాధించిన రికార్డులను ప్రస్తావిస్తూ గౌతీని విమర్శిస్తున్నారు. కాగా ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు శతకాలు బాదిన రెండో వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు ఆండీ ఫ్లవర్ ఈ ఘనత సాధించాడు.మరోవైపు.. ఇంగ్లండ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన ఏడో భారత బ్యాటర్‌గా పంత్ నిలిచాడు. అయితే, టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడటంతో అతడి వీరోచిత ప్రదర్శన వృథాగా పోయింది. ఇరుజట్ల మధ్య జూలై 2- 6 వరకు బర్మింగ్‌హామ్ వేదికగా రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్
ఇంగ్లండ్‌తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీని టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించినప్పటికీ భారత్‌కు చేదు అనుభవమే మిగిలింది.బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడం.. ఫీల్డర్ల బౌలర్ల వైఫల్యం తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో గిల్ సేన ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)మాత్రం జట్టుకు అండగా నిలిచాడు. ఏ ఒక్కరిని నిందించేందుకు తాను సిద్ధంగా లేనని.. గెలిచినా, ఓడినా ఆటగాళ్లంతా ఒక్కటిగా ఉంటారని పేర్కొన్నాడు.అంతా కలిసి కేవలం తొమ్మిది పరుగులేకాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత లోయర్ ఆర్డర్ (8-11 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చినవాళ్లు) అంతా కలిసి కేవలం తొమ్మిది పరుగులే చేసింది. ఈ విషయం గురించి ప్రస్తావన రాగా.. ‘‘కొన్నిసార్లు కొందరు విఫలమవుతారు. నిరాశ కలిగించే విషయమే అయినా మరేం పర్లేదు.అయితే, అందరి కంటే ఎక్కువ సదరు ఆటగాళ్లే ఎక్కువ నిరాశకు లోనవుతారు. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని వారికి తెలుసు. ఒకవేళ మొదటి ఇన్నింగ్స్‌లో మేము 570- 580 పరుగులు చేసినట్లయితే మా ఆధిపత్యమే కొనసాగేది.ప్రతి ఒక్కరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. అయితే, అన్నిసార్లూ అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోవచ్చు. స్పెషలిస్టు బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. అంతమాత్రాన ఏ ఒక్కరినో వేరు చేసి నిందించాల్సిన పనిలేదు.ఈ మ్యాచ్‌లో మేము గెలిచే సందర్భాలు కూడా ఎన్నో వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తూ పని పూర్తి చేయలేకపోయాం. ఏదేమైనా గెలిచినా, ఓడినా ఒక్కటే. కలిస్తే గెలుస్తాం.. కలిసే ఓడిపోతాం’’ అని గంభీర్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాంఇక శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) గురించి ప్రశ్నించగా.. ‘‘అతడిని మేము స్పెషలిస్టు బౌలర్‌గా జట్టులోకి తీసుకోలేదు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గానే తీసుకున్నాం. కొన్నిసార్లు కెప్టెన్ నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో శార్దూల్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అదే విధంగా.. 1, 4 పరుగులు స్కోర్ చేశాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌ను టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌తో మొదలుపెట్టింది. ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత జట్టు.. హెడింగ్లీ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఈ సిరీస్‌తో తన ప్రయాణం మొదలుపెట్టగా.. ఓటమి కారణంగా నిరాశే ఎదురైంది.ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (134) సెంచరీలు బాదారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137)తో పాటు రిషభ్ పంత్ (118) శతక్కొట్టాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు స్కోర్లుటీమిండియా: 471 & 364ఇంగ్లండ్: 465 & 373/5.చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్ -
వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ఆరంభించాడు. టెండూల్కర్- అండర్సన్ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో భారత జట్టు అద్భుతంగా రాణించినప్పటికి బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. మొదటి నాలుగు రోజుల ఆటలో ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. ఆఖరి రోజు ఆటలో మాత్రం తేలిపోయింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(149) భారీ సెంచరీతో కదం తొక్కగా.. జాక్ క్రాలీ(65), జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు సాధించగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ గిల్ స్పందించాడు. చెత్త ఫీల్డింగ్ కారణంగానే తాము ఓడిపోయామని గిల్ చెప్పుకొచ్చాడు."టెస్టు మ్యాచ్ అద్భుతంగా సాగింది. మాకూ మంచి అవకాశాలు వచ్చాయి. అయితే క్యాచ్‌లు వదిలేయడం, లోయర్ ఆర్డర్లో ఎక్కువ పరుగులు చేయలేకపోవడం ఓటమికి కారణాలు. నాలుగో రోజు కూడా కనీసం 430 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలని అనుకున్నాం.అయితే 25 పరుగులకే చివర్లో వరుసగా వికెట్లు పడటంతో అది సాధ్యం కాలేదు. ఈ రోజు కూడా తొలి వికెట్ తీసిన తర్వాత మాకు మంచి అవకాశం ఉందనిపించింది. కానీ అది జరగలేదు. తొలి సెషన్లో మేం బాగానే బౌలింగ్ చేసి వారిని నియంత్రించగలిగినా ఒక్కసారి బంతి పాతబడిన తర్వాత ఏమీ చేయలేకపోయాం. అలాంటి స్థితిలోనూ వికెట్లు తీయడం అవసరం.జడేజా చాలా బాగా బౌలింగ్ చేసి మంచి అవకాశాలు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా కుప్పకూలడంపై ఇప్పటికే చర్చించాం. ఈ తప్పును మేం మున్ముందు సరిదిద్దుకోవాలి. ఇలాంటి పిచ్‌పై అవకాశాలు అంత సులువుగా రావు.వాటిని వృథా చేసుకోవద్దు. అయితే మాది యువ జట్టు. నేర్చుకునే దశలో ఉంది. మరింత మెరుగువుతాం. బుమ్రా మిగిలిన టెస్టుల్లో ఏవి ఆడతాడో ఇప్పుడే చెప్పలేం. దానికి తగినంత సమయం ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
IND Vs ENG: టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియాతో ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(149) భారీ శతకంతో చెలరేగగా.. జాక్ క్రాలీ(65), జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్లు తేలిపోయారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా ఓ వికెట్ సాధించాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన జస్ప్రీత్ బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు.అంతకుతోడు చెత్త ఫీల్డింగ్ కూడా టీమిండియా కొంపముంచింది. రెండో ఇన్నింగ్స్‌లు కలపి ఏడు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు విడిచిపెట్టారు. అందులో నాలుగు క్యాచ్‌లు జైశ్వాల్ జారవిడిచినవే కావడం గమనార్హం. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.టెస్టు క్రికెట్ హిస్టరీలోనే..ఇక ఈ ఓటమితో భారత్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. 141 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ చెత్త ఫీట్‌ను నమోదు చేయలేదు.తాజా ఓటమితో టీమిండియా ఈ ఘోర ఆప్రతిష్టతను మూట కట్టుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు సంక్షిప్త సమాచారం🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం -
Ind vs Eng: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమి
Ind vs Eng 1st Test: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తొలి ఇన్నింగ్స్‌లో మూడు శతకాలుబ్యాటింగ్కు దిగిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42), యశస్వి జైస్వాల్ (101) శుభారంభం అందించారు. జైసూతో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ చెరో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు.. 465 పరుగులు చేసింది.ఆరు పరుగుల ఆధిక్యంఓపెనర్ బెన్ డకెట్ (62) హాఫ్ సెంచరీతో మెరవగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీ (106)తో ఆకట్టుకున్నాడు. ఇక మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ 99 పరుగులతో అదరగొట్టగా... మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ 40, టెయిలెండర్ క్రిస్ వోక్స్ 38 పరుగులతో రాణించారు.భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. మిగిలిన పేసర్లలో ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో465 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఆదుకున్న రాహుల్, పంత్.. కానీఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్ సేన శుభారంభం అందుకోలేకపోయింది. ఈసారి ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ గిల్ (8) కూడా నిరాశపరిచాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు.ఈ దశలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118) శతకాలు సాధించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే, ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (20) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్ (4), సిరాజ్ (0), బుమ్రా (0), ప్రసిద్ కృష్ణ (0) చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా (25 నాటౌట్) కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో 96 ఓవర్లలో 364 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది.శతక్కొట్టిన డకెట్ఈ స్కోరుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆరు పరుగులు కలుపుకొని.. ఇంగ్లండ్ లక్ష్యాన్ని 371 పరుగులుగా నిర్దేశించింది గిల్ సేన. సోమవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఓవర్ నైట్ స్కోరు 21/0తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. తొలి సెషన్లో వికెట్ నష్టపోకుండా ఆడిన స్టోక్స్ బృందం.. ఆ తర్వాత వికెట్లు కోల్పోయినా టార్గెట్‌ను పూర్తి చేసింది.ఓపెనర్లలో జాక్ క్రాలే అర్ద శతకం (65) చేయగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ డకెట్ అద్భుత శతకం (149)తో మెరిశాడు. ఓలీ పోప్ (8), హ్యారీ బ్రూక్ (0) విఫలమైనా.. జో రూట్ (53 నాటౌట్), జేమీ స్మిత్ (44 నాటౌట్) పని పూర్తి చేశారు. ఇక కెప్టెన్ స్టోక్స్ 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా ఒక వికెట్ తీయగా.. ప్రసిద్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ ఓటమితో కెప్టెన్‌గా గిల్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం -
గిల్ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్!.. ఆఖరికి మేమే గెలిచాం!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదో రోజు తొలి సెషన్లో టీమిండియాకు కలిసిరాలేదు. లీడ్స్ (Leeds)లో భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు నిలకడగా ముందుకు సాగుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజులో పాతుకుపోగా.. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయారు.లంచ్ బ్రేక్‌కు వెళ్లేసరికి ఇలా..దీంతో.. ఓవర్ నైట్ స్కోరు 21/0తో మంగళవారం నాటి ఐదో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి ముప్పై ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టపోకుండా 117 పరుగులు సాధించింది. లంచ్ బ్రేక్‌కు వెళ్లేసరికి జాక్ క్రాలే 42, బెన్ డకెట్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.శుబ్‌మన్ గిల్ అసంతృప్తిఇక ఎంతగా ప్రయత్నించినప్పటికీ క్రాలే, డకెట్‌ను అవుట్ చేయడం సాధ్యం కాకపోవడంతో భారత శిబిరంలో అసంతృప్తి నెలకొంది. బౌలర్లతో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా అసంతృప్తికి లోనయ్యాడు. బంతి ఆకారం మారిందని, దానిని మార్చి కొత్త బంతి ఇవ్వాలని ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్లకు భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, సిరాజ్ తదితరులు విజ్ఞప్తి చేశారు.కెప్టెన్ గిల్ కూడా వారి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా, నవ్వులు చిందిస్తూ బంతిని మార్చమని అడిగాడు. కానీ అంపైర్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అయితే, టీమిండియా పట్టుబట్టడంతో గేజ్ టెస్టులో బంతి ఆకారం మారినట్లు తేలింది. దీంతో అంపైర్లు కొత్త బంతి ఇవ్వక తప్పని పరిస్థితి.జడ్డూ చర్య వైరల్ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంపైర్ వద్దకు వెళ్లి.. ‘‘చూశారా.. మేము చెప్పింది నిజం.. ఆఖరికి మాదే విజయం’’ అన్నట్లుగా పిడికిలి మడిచి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా అంపైర్ కూడా నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఏదేమైనా ఎట్టకేలకు కొత్త బంతిని తెచ్చుకోవడంలో టీమిండియా సఫలమైంది. ఇక భారమంతా బౌలర్లదే. ఇంగ్లండ్‌ను కట్టడి చేసి జట్టుకు విజయం అందించాల్సిన బాధ్యత వారిదే.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ సైతం బంతిని మార్చమని అంపైర్లను కోరగా.. నిరాశే ఎదురైంది. దీంతో అతడు తన చేతిలో ఉన్న బంతిని నేలకేసి కొట్టగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మందలించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది.ఇంగ్లండ్ వర్సెస్ భారత్ తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏భారత్ తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏భారత్‌కు ఆరు పరుగుల ఆధిక్యం🏏భారత్ రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 21/0 (6) 🏏ఐదో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 117/0.చదవండి: వసీం అక్రం, షేన్ వార్న్ కాదు!.. నన్ను భయపెట్టింది ఆ బౌలరే: గంగూలీ.@imjadeja is all fired up as the umpire allows #TeamIndia a ball change! 🔄💥Is a breakthrough around the corner? Will the next two sessions bring the wickets India needs? 👀#ENGvIND 1st Test Day 5 LIVE NOW Streaming on JioHotstar 👉 https://t.co/0K41uhrKJ5 pic.twitter.com/qKMYKc6gDl— Star Sports (@StarSportsIndia) June 24, 2025 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ తమ విజయానికి 350 పరుగులు దూరంలో ఉండగా.. టీమిండియా 10 వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.క్రీజులో జాక్ క్రాలీ (12 బ్యాటింగ్), బెన్ డకెట్ (9 బ్యాటింగ్) ఉన్నారు. అంతకముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు), రిషభ్ పంత్ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతక్కొట్టారు.ఈ టెస్టులో పంత్‌కు ఇది రెండో సెంచరీ. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 6 పరుగుల ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో మరోసారి బౌలర్లకు మరోసారి కఠిన సవాలు తప్పదు. బుమ్రాకు తోడుగా సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ రాణించాల్సిన అవసరముంది.93 ఏళ్ల చరిత్రలోనే..ఇక ఈ లీడ్స్ టెస్టులో భారత జట్టు చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తరపున ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత జట్టు.. 93 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్‌ను అందుకుంది.గతంలో భారత్ తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సెంచరీలు రావడం మొదటి సారి. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ సెంచరీలు చేయగా...రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, పంత్ శతకాలు బాదారు.అదేవిధంగా 1955 తర్వాత విదేశీ గడ్డపై ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. 70 ఏళ్ల కిందట వెస్టిండీస్ టూర్లో ఒకే టెస్టులో ఐదుగురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు మూడు అంకెల స్కోర్‌ను అందుకున్నారు.చదవండి: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత -
IND VS ENG 1st Test Day 4: టీమిండియాకు షాక్
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఔట్ కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (47), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు షాక్ఓవర్నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్‌కు జతగా రిషబ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు. గిల్ వికెట్ కోల్పోవడంతో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌పై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా గౌరవప్రదమైన టార్గెట్ ఉంచాలంటే రాహుల్, పంత్ చాలా కీలకం కానున్నారు. వీరిద్దరు ఈ రోజంతా క్రీజ్‌లో ఉంటేనే భారత్ ఓ మోస్తరు స్కోర్ చేయగలుగుతుంది. -
Ind vs Eng: వర్షం వల్ల ముందే ముగిసిన ఆట.. పూర్తి వివరాలు
India vs England 1st Test Day 3 Report: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో నిర్ణీత సమయం కంటే కాస్త ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆదివారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ 23.5 ఓవర్లు ఆడి రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అంతకు ముందు ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ కంటే 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గిల్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.భారత తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147)లతో పాటు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగాడు. మిగతా వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ ఒక్కో వికెట్ తీశారు.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు దీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మరోవైపు.. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సరికి మొత్తంగా 96 పరుగుల లీడ్‌లో ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) ఈసారి నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 47, కెప్టెన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
గిల్, జైశ్వాల్, పంత్ సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్ సేన. అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు మెరుగ్గా రాణించలేకపోయారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (134, 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (101 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.సుదర్శన్, కరుణ్ నాయర్ అట్టర్ ప్లాప్.. ఇక ఈ మ్యాచ్‌లో భారత తరపున అరంగేట్రం చేసిన సాయిసుదర్శన్ తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అతడితో పాటు తొమ్మిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ సైతం ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు.చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
'శుబ్‌మన్ గిల్ ఒక అద్బుతం'.. యూటర్న్ తీసుకున్న భారత మాజీ క్రికెటర్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి 127 పరుగులతో గిల్ అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ గడ్డపై గిల్‌కు ఇదే మొదటి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో కెప్టెన్‌గా అతడిని ఎంపిక చేయడాన్ని విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అంటున్నాయి. తొలుత కెప్టెన్‌గా గిల్‌ను వ్యతిరేకించిన భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ అద్బుతమైన టెక్నిక్‌తో బ్యాటింగ్ చేశాడని మంజ్రేకర్ కొనియాడాడు."కొన్ని రోజుల కిందట భారత టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను ఎంపికచేయడాన్ని నేను వ్యతిరేకించాను. గిల్ కంటే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా బెటర్ అని అభిప్రాయపడ్డాను. ఆ సమయంలో సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకోలేదని నేను చెప్పుకొచ్చాను. కానీ నేను ఎక్కడా కూడా గిల్ కెప్టెన్‌గా విఫలమవుతాడని మాత్రం చెప్పలేదు.కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్‌కు పడకుండా గిల్ చూసుకుంటాడని నేను ముందే ఊహించాను. కానీ విదేశాల్లో మాత్రం అతడి ప్రదర్శన ఇంకా మెరుగు పడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో మాత్రం గిల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు.శుబ్‌మన్ తన బ్యాటింగ్‌లో టెక్నికల్ లోపాలను సరిదిద్దుకున్నాడు. అందుకే విదేశీ గడ్డపై భారీ సెంచరీసాధించగలిగాడని" జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ -
ICC: శుబ్‌మన్ గిల్‌కు జరిమానా?!.. కారణం?
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రయాణంలో తొలి ప్రయత్నంలోనే శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా శతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు. తద్వారా టెస్టు సారథిగా అరంగేట్ర ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు.అజేయ శతకంలీడ్స్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో.. విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్తో ఖాళీ అయిన నాలుగో స్థానంలో గిల్ బ్యాటింగ్‌కు దిగాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 175 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 127 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటికి పదహారు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.ఇక మరో సెంచరీ వీరుడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో కలిసి 129 పరుగులు జోడించిన గిల్.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో కలిసి 138 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో టీమిండియా 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. చిక్కుల్లో పడే అవకాశంకాగా ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో భారత జట్టు ప్రదర్శన పట్ల సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలు హర్షం వ్యక్తం చేశారు. గిల్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌ను కొనియాడుతున్నారు. అంతాబాగానే ఉన్నా గిల్ చేసిన ఓ పని వల్ల అతడు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు నలుపు రంగు సాక్సులు వేసుకున్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్లేయర్ క్లాతింగ్- ఎక్విప్మెంట్ నిబంధన (క్లాజ్ 19.45)ల ప్రకారం.. టెస్టు మ్యాచ్‌లో ఆటగాడు ధరించే సాక్సులు తెలుపు, గోధుమ లేదా లేత బూడిద రంగులో మాత్రమే ఉండాలి.జరిమానా?ఈ నేపథ్యంలో డ్రెస్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గిల్‌కు జరిమానా పడే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంది. కాగా ఐసీసీలోని ఈ నిబంధనల ప్రకారం.. లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డట్లు తేలితే ఫైన్ తప్పదు. అయితే, గిల్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని రిఫరీ భావిస్తే అతడు జరిమానా నుంచి తప్పించుకోవచ్చు.కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభమైంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. కేఎల్ రాహుల్ (42) ఓ మోస్తరుగా రాణించగా.. అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇక జైసూ, గిల్ శతకాలతో చెలరేగగా.. పంత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్ ఫైర్ -
IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్?!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు రెండో రోజు కాస్త బ్రేక్ పడే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్యూవెదర్ వివరాల ప్రకారం.. లీడ్స్‌లో శనివారం ఉదయం ఎండ కాస్తుంది. 28-29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.అయితే, 25 శాతం మేర వర్షం కురిసేందుకు కూడా ఆస్కారం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాన పడే అవకాశాలు 86 శాతం ఉన్నాయి. 31 శాతం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసేందుకు ఛాన్స్ ఉంది. టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆటలో రెండో, మూడో సెషన్లో వర్షం పడే ఛాన్సులు 77 శాతం ఉన్నాయి.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్‌లో పరస్పరం తలపడుతున్నాయి. టెండుల్కర్-ఆండర్సన్ (Tendulkar-Anderson Trophy) ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టులు ఆడతాయి. ఈ క్రమంలో శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు మొదలైంది.ఇరగదీసిన భారత బ్యాటర్లుటాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్.. గిల్ సేనను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమై ఈ మేరకు అతడు తీసుకున్న నిర్ణయం భారత్‌కు కలిసి వచ్చింది. తొలి రోజు పొడిగా ఉన్న పిచ్‌పై టీమిండియా స్టార్లు బ్యాట్‌తో ఇరగదీశారు.ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (42) ఫర్వాలేదనిపించగా.. యశస్వి జైస్వాల్ (101) సెంచరీతో చెలరేగాడు. ఇక కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 127 పరుగులతో అజేయంగా ఉండగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అర్ధ శతకం (65*) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేయగా.. గిల్, పంత్ క్రీజులో ఉన్నారు.వరుణుడు అడ్డుపడతాడా?అయితే, రెండో రోజు ఆటలో వీరు మరింత చెలరేగితే చూడాలని ఆశపడుతున్న అభిమానులకు వరుణుడు షాకిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలిరోజు కూడా ఇదే తరహా హెచ్చరికలు కాగా.. ఆట సజావుగానే సాగింది. ఇక మొదటి రోజు టీమిండియా అభిమానులను నిరాశపరిచిన అంశం ఏదైనా ఉందంటే.. అది సాయి సుదర్శన్ డకౌట్ మాత్రమే.అదొక్కటే నిరాశఇంగ్లండ్ గడ్డ మీద ఈ తమిళనాడు బ్యాటర్ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు. 24 ఏళ్ల సాయి భారత్ తరఫున టెస్టు ఆడిన 317వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా అతనికి టెస్టు క్యాప్‌ను అందించాడు. అయితే, దురదృష్టవశాత్తూ కెరీర్ తొలి ఇన్నింగ్స్ అతనికి కలిసి రాలేదు. నాలుగు బంతులే ఎదుర్కొన్న అతను ‘సున్నా’కే వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. టెస్టు అరంగేట్రానికి ముందు సాయి భారత్ తరఫున 3 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్ ఫైర్ -
అలా అయితే అవుట్ అయిపోతావు! గిల్‌కు పంత్ వార్నింగ్.. వైరల్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అదరగొట్టింది. సీనియర్లు లేకపోయినా మేమున్నాము కదా అంటూ యువ ఆటగాళ్లు బ్యాట్‌తో చెలరేగారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) శతకంతో చెలరేగితే.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.భారీ భాగస్వామ్యాలుజైసూ 101 పరుగులు సాధించి.. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా జైస్వాల్ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42)తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో పాటు.. గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 129 పరుగులు జతచేశాడు.అనంతరం గిల్‌కు తోడైన పంత్ అభేద్యంగా 138 పరుగుల భాగస్వామ్యం జోడించి.. అతడితో కలిసి నాటౌట్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది.ఇక మొదటి రోజు ముగింపునకు చేరే క్రమంలో షాట్ ఎంపిక విషయంలో గిల్‌కు పంత్ స్నేహపూర్వక హెచ్చరిక జారీ చేశాడు.ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ సంధించిన ఫుల్లర్ బాల్‌ను ఆడేందుకు క్రీజు వెలుపలికి వచ్చిన గిల్.. షార్ట్ కవర్ దిశగా బాదాడు.అలా అయితే అవుట్ అయిపోతావు!ఆ సమయంలో నాన్- స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పంత్.. ‘‘క్రీజు బయటకు వచ్చేటపుడు కాస్త చూసుకో.. ఏమాత్రం తేడా జరిగినా క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించాడు. మైక్ స్టంప్‌లో ఈ మాటలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.కాగా ఇంగ్లండ్‌తో టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఈ సిరీస్‌తో ఇరుజట్లు తమ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌ను మొదలుపెట్టాయి. ఇక ఇదే సిరీస్‌తో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. అతడికి డిప్యూటీగా రిషభ్ పంత్ తమ ప్రస్థానం మొదలుపెట్టారు.ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీలో తొలి మ్యాచ్ జరుగుతుండగా.. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), లార్డ్స్ (లండన్), ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ (మాంచెస్టర్), కెన్నింగ్టన్ ఓవల్ (లండన్) మిగిలిన టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు👉షెడ్యూల్: జూన్ 20- 24👉వేదిక: హెడింగ్లీ, లీడ్స్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉తొలిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా స్కోరు: 359/3 (85).చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్ ఫైర్Warning: When @RishabhPant17's on strike, expect some advice and plenty of chatter between the wickets! 😜🎙️Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/v53iqPg8cm— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
ఆరోజు ముగ్గురం సెంచరీలు చేశామన్న సచిన్.. గంగూలీ రిప్లై ఇదే
ఇంగ్లండ్ (Ind vs Eng Tests)తో టెస్టు సిరీస్ ప్రయాణంలో టీమిండియా శుభారంభం అందుకుంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో.. శుక్రవారం మొదలైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలోనే పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గిల్ సేన.. 85 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు సాధించి పట్టు బిగించింది.ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (42) రాణించగా.. యశస్వి జైస్వాల్ (101) శతకంతో చెలరేగాడు. ఇక టీమిండియా టెస్టు సారథిగా తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ కూడా అద్భుత సెంచరీతో మెరిశాడు. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి గిల్ 127 పరుగులతో క్రీజులో ఉండగా.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) 65 పరుగులతో అతడికి తోడుగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా ప్రదర్శనపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) సంతృప్తి వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్, జైస్వాల్, గిల్, పంత్‌లను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.‘‘కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ఇక అద్భుతమైన శతకాలు బాదిన జైస్వాల్, శుబ్‌మన్ గిల్‌లకు శుభాకాంక్షలు. రిషభ్ పంత్ కూడా వీరితో సమానంగా తన వంతు పని పూర్తి చేశాడు.ఈరోజు టీమిండియా బ్యాటింగ్‌ను చూస్తుంటే.. నాకు 2002లో హెడింగ్లీలో.. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, నేను తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదడం గుర్తుకువచ్చింది. ఆ టెస్టులో మేము గెలిచాము.ఈరోజు.. యశస్వి, శుబ్‌మన్ తమ పని పూర్తి చేశారు. ఇక మూడో సెంచూరియన్ ఎవరు అవుతారో చూడాలి’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు. ఇందుకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘‘హాయ్ చాంప్.. ఈసారి నలుగురు సెంచరీలు చేస్తారేమో.. పిచ్ బాగుంది.. పంత్.. కరుణ్ కూడా శతకాలు బాదుతారేమో!అయితే, 2002 నాడు తొలి రోజు పిచ్ స్వభావానికి ఇప్పటి వికెట్‌కు కాస్త తేడా ఉంది’’ అని బదులిచ్చాడు. కాగా 2002లో ఇదే వేదికపై సచిన్ టెండుల్కర్ గంగూలీతో కలిసి 249 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక టెండుల్కర్ 303 బంతుల్లో 193 పరుగులు సాధించగా.. గంగూలీ 128 రన్స్ స్కోరు చేశాడు. అదే విధంగా.. ‘వాల్’ రాహుల్ ద్రవిడ్ 148 పరుగులు చేయగా.. అప్పటి ఓపెనర్ సంజయ్ బంగర్ 68 రన్స్ రాబట్టాడు.కాగా ఇప్పటి వరకు ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. తాజాగా దీనికి టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. ఇక దఫా పర్యటనలో భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పిన తర్వాత.. టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. రోహిత్ స్థానంలో టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు ఈ సిరీస్ ప్రతిష్టాత్మకంగా మారింది.Tendulkar at Leeds, 2002pic.twitter.com/o7MlA5Zn3L— Cricketopia (@CricketopiaCom) June 20, 2025 చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియాతో తొలి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్‌కు భంగపాటే ఎదురైంది. లీడ్స్ వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (Kl Rahul- 42) రాణించగా.. యశస్వి జైస్వాల్ శతకం (101)తో చెలరేగాడు. ఇక ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా సెంచరీతో కదం తొక్కాడు.అదే విధంగా.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా అర్ధ శతకంతో మెరిశాడు. వెరసి శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లు ఆడిన టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 359 పరుగులు సాధించింది. తద్వారా ఆతిథ్య జట్టుపై పర్యాటక టీమ్ మొదటి రోజు పూర్తి ఆధిపత్యం కనబరిచింది.కామన్ సెన్స్ ఉన్నవాళ్లు ఇలా చేయరుఈ నేపథ్యంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ ఆథర్టన్ కూడా ఈ విషయంలో స్టోక్స్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.‘‘టాస్ గెలిచిన కెప్టెన్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా అనిపించింది. గత ఆరు మ్యాచ్‌లలో తొలుత బౌలింగ్ చేసిన జట్టే విజయం సాధించిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కాస్త కామన్ సెన్స్ ఉన్నవాళ్లు.. క్రికెట్ బుర్ర వాడేవారు ఎవరైనా ఇక్కడ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు.ఎందుకంటే.. ఇక్కడ ఇప్పుడు తీవ్రమైన ఎండ ఉంది. రానున్న రెండు రోజుల్లో 30 డిగ్రీలకు పైగానే ఉంటుంది. స్టోక్స్ కేవలం గత రికార్డు ఆధారంగానే తొలుత బౌలింగ్ ఎంచుకుని ఉంటాడు’’ అని ఆథర్టన్ స్టోక్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అయితే, భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించగల సత్తా ఇంగ్లండ్‌కు ఉందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశాడు.ఇంగ్లండ్ పశ్చాత్తాపం!కాగా ఇంగ్లండ్ మరో మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కూడా టాస్ విషయంలో ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక తీవ్రమైన ఎండ, పొడిగా ఉన్న పిచ్, స్వింగ్‌కు ఏమాత్రం అవకాశం లేని వాతావరణం, పెద్దగా అనుభవం లేని బౌలర్లు... ఇలాంటి స్థితిలో టాస్ గెలిచి స్టోక్స్ బౌలింగ్ ఎంచుకునే సాహసం చేయడంతో ఇంగ్లండ్ పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి తలెత్తింది.నిజమే... హెడింగ్లీ మైదానంలో గత ఆరు టెస్టుల్లో ముందుగా బౌలింగ్ చేసిన జట్టే గెలిచింది. కానీ శుక్రవారం పరిస్థితి వాటికి భిన్నం. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడటం చూస్తే తాము చేసిన తప్పేమిటో ఇంగ్లండ్‌కు అర్థమై ఉంటుంది. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లింది.ఇంగ్లండ్ చేజారిన అవకాశాలు.. పెనాల్టీ పరుగులు👉45 పరుగుల వద్ద జైస్వాల్‌కు అదృష్టం కలిసొచ్చింది. కార్స్ వేసిన యార్కర్‌ను అతను చివరి నిమిషంలో నిలువరించగలిగాడు. ఇంగ్లండ్ అప్పీల్‌కు సిద్ధమైన తరుణంలో అంపైర్ దానిని ‘నోబాల్’గా ప్రకటించాడు. ఆ తర్వాత రీప్లే చూస్తే బంతి ముందుగా అతని ప్యాడ్‌కు తాకినట్లు తేలింది. ‘నోబాల్’ కాకపోతే అది కచ్చితంగా అవుట్‌గా తేలేది. 👉గిల్ 1 పరుగు వద్ద ఉన్నప్పుడు కార్స్ బౌలింగ్‌లో కష్టసాధ్యమైన సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే గిల్ చాలా దూరంలోనే ఉన్నా... పోప్ వేసిన త్రో నేరుగా వికెట్లకు తాకకపోవడంతో రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. ఓవర్‌త్రో బౌండరీని చేరడంతో మరో నాలుగు పరుగులు జట్టు ఖాతాలో చేరాయి. 👉టీ విరామానికి ముందు స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో స్లిప్ ఫీల్డర్ రూట్ బంతిని ఆపే క్రమంలో దానిని పక్కకు తోశాడు. అది అక్కడే పెట్టిన వికెట్ కీపర్ హెల్మెట్‌ను తాకడంతో భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగులు అదనంగా లభించాయి. ఈ గందరగోళంలో అంపైర్ లెక్క తప్పడంతో ఈ ఓవర్లో స్టోక్స్ 7 బంతులు వేశాడు. చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
నాకు అది అలవాటు.. నువ్వే గుర్తు చేయాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..
వయసు జస్ట్ 23 ఏళ్లు.. అయితేనేం.. టీమిండియా ఓపెనర్‌గా అతడు కనబరిచే పరిణితి మాత్రం అమోఘం.. టెస్టుల్లో ఇప్పటికే నాలుగు సెంచరీలు.. రెండు ద్విశతకాలు.. తాజాగా ఇంగ్లండ్ గడ్డ మీద ఆడిన తొలి టెస్టులోనే శతకం బాదాడు అతడు.. అంతేకాదు ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఓపెనర్‌గా నిలిచాడు.. అవును.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswak) గురించే ఈ ఉపోద్ఘాతం.ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ (India vs England)తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో జైసూ శతక్కొట్టాడు. ఆది నుంచే పలుమార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని ఎట్టకేలకు వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మూడో వికెట్‌కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి 129 పరుగుల పార్ట్నర్షిప్ అందించాడు.తొందరపడితే నన్ను వారించు..అయితే, గిల్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా జైసూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తొందరపడితే తనను వారించాలంటూ జైసూ కెప్టెన్‌కు చెప్పడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. భారత్ ఇన్నింగ్స్‌లో 38 వ ఓవర్లో క్రిస్ వోక్స్ బంతితో రంగంలోకి దిగాడు.అతడి బౌలింగ్‌లో తొలి బంతికి బౌండరీ బాదిన జైస్వాల్.. తదుపరి బాల్‌కు సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. షాట్ బాదగానే వెంటనే పరుగు కోసం వెళ్లాడు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న గిల్ మాత్రం రన్‌కు నిరాకరించాడు. దీంతో కాస్త అసహనానికి గురైనప్పటికి... ఆ వెంటనే తన తప్పు తెలుసుకున్న జైస్వాల్ వెంటనే క్రీజులోకి పరిగెత్తాడు. తద్వారా ఇంగ్లండ్‌కు రనౌట్ చేసే అవకాశం చేజారింది.నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!ఈ ఘటన తర్వాత జైస్వాల్ గిల్‌తో.. ‘‘రిస్కీ సింగిల్స్ వద్దని నాకు చెబుతూనే ఉండండి ప్లీజ్.. బంతిని బాదగానే వెంటనే పరిగెత్తడం నాకు అలవాటై పోయింది’’ అని పేర్కొన్నాడు. కాగా జైసూ బాదిన బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు. ఈ విషయాన్ని గమనించని జైసూ పరుగుకు రాగా.. ‘‘లేదు లేదు బంతి ఇక్కడే ఉంది’’ అంటూ గిల్ చెప్పాడు. గిల్ నో చెప్పిన కారణంగా ఇద్దరూ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.కాగా అప్పటికి జైస్వాల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. ఆ తర్వాత గిల్‌తో కలిసి చక్కటి సమన్వయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 159 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 101 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 359 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. శుబ్‌మన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 127 పరుగులతో.. రిషభ్ పంత్ 102 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?When #YashasviJaiswal says “Run!” and #ShubmanGill is still deciding if it’s a good idea! 😂Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/UJDlpPlpkH— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు.. బ్రాడ్‌మన్‌నే అధిగమించాడు!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiwal) అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ జట్టుపై టెస్టు ఫార్మాట్లో అత్యధిక సగటు నమోదు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (Don Bradman)ని జైసూ అధిగమించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) తొలి టెస్టు మొదలైంది. లీడ్స్ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకుని.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.భారత్ బ్యాటింగ్ అదుర్స్.. జైసూ, గిల్ సెంచరీలుఇక ఆది నుంచే జోరు కనబరిచిన భారత్ మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. ఆద్యంతం ఆకట్టుకుని తొలి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) స్వల్ప స్కోరుకు వెనుదిరిగినా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకంతో కదం తొక్కాడు.మరో సెంచరీ వీరుడు, కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొన్న జైసూ.. 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు చేసి.. స్టోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.బ్రాడ్‌మన్ రికార్డు బద్దలుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద జైసూకు ఇదే తొలి సెంచరీ కాగా.. ఓవరాల్‌గా పది ఇన్నింగ్స్‌లో కలిపి 813 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 90.33 సగటుతో ఈ మేర రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలోనే బ్రాడ్‌మన్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ మీద టెస్టుల్లో అత్యధిక సగటుతో పరుగులు రాబట్టిన ఆటగాడిగా నిలిచాడు.ఇక శుక్రవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి గిల్ 127 పరుగులతో.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ మాత్రం నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ జట్టుపై అత్యధిక టెస్టు యావరేజ్ కలిగిన బ్యాటర్లు🏏యశస్వి జైస్వాల్- 90.33🏏డాన్ బ్రాడ్‌మన్- 89.78🏏స్టీవీ డెంప్‌స్టర్- 88.42🏏లారెన్స్ రోవ్- 74.20🏏జార్స్ హెడ్లీ- 71.23 చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!𝐓𝐎𝐍 🆙𝐓𝐀𝐈𝐋𝐒 🆙Yashasvi Jaiswal leads Team India from the front. #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #DhaakadIndia #TeamIndia | @ybj_19 pic.twitter.com/QX4kdlTBu4— Sony Sports Network (@SonySportsNetwk) June 20, 2025 -
IND Vs ENG: ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టిన భారత బ్యాటర్లు.. పట్టుబిగించిన ‘గిల్’ సేన (ఫొటోలు)
-
Ind vs Eng 1st Day 1: బ్యాటింగ్‌తో అదరగొట్టారు
భారత టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయం ఘనంగా మొదలైంది. అంచనాలకు మించిన ఆటతో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. సీనియర్లు తప్పుకున్నా... జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు తాము సరైనోళ్లమని యువ ఆటగాళ్లు నిరూపించారు. అసాధారణ బ్యాటింగ్‌తో ముందుగా యశస్వి జైస్వాల్, ఆపై కెప్టెన్‌గా తొలి పరీక్షలో శుబ్‌మన్ గిల్ సెంచరీలు బాది సత్తా చాటగా, రిషభ్ పంత్ తన విలువను ప్రదర్శించాడు. హెడింగ్లీ పిచ్‌పై ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయిన ఇంగ్లండ్ బౌలర్లందరినీ ఒక ఆటాడుకున్న మన బ్యాటర్లు భారీ స్కోరుతో మొదటి రోజును గొప్పగా ముగించారు. లీడ్స్: ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు భారత్ భారీ స్కోరుతో చెలరేగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (175 బంతుల్లో 127 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్), ఓపెనర్ యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 101; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగగా, వైస్ కెపె్టన్ రిషభ్ పంత్ (102 బంతుల్లో 65 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. టెస్టుల్లో జైస్వాల్‌కు ఇది ఐదో సెంచరీ కాగా, గిల్‌కు ఆరో శతకం. జైస్వాల్, గిల్ మూడో వికెట్‌కు 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత గిల్, పంత్ నాలుగో వికెట్‌కు అభేద్యంగా 138 పరుగులు జత చేశారు. సిరీస్‌లో శుభారంభం... ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 42; 8 ఫోర్లు) జట్టుకు సరైన ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ చకచకా బౌండరీలు బాదారు. ఒకదశలో అసహనంతో జైస్వాల్ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇంగ్లండ్ ఏమాత్రం అవకాశం లేకపోయినా... ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరి విఫలమైంది. తొలి గంటలో భారత్ 9 ఫోర్లతో 44 పరుగులు చేసింది. ఎట్టకేలకు లంచ్ విరామానికి ముందు ఇంగ్లండ్‌కు ఊరట దక్కింది. ఆరు బంతుల వ్యవధిలో రాహుల్, తొలి టెస్టు ఆడుతున్న సుదర్శన్ (0) అవుట్ కాగా...లంచ్ సమయానికి జట్టు స్కోరు 92/2కు చేరింది. భారీ భాగస్వామ్యం... విరామానంతరం 96 బంతుల్లో జైస్వాల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ సెషన్లో జైస్వాల్, గిల్ ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ఆడుకున్నారు. ఓవర్‌కు దాదాపు ఐదు పరుగుల రన్‌రేట్‌తో పరుగులు రాబట్టి ప్రత్యరి్థపై ఆధిక్యం ప్రదర్శించారు. వోక్స్ వేసిన రెండు ఓవర్లలో గిల్, జైస్వాల్ చెరో 3 ఫోర్లు బాది ధాటిని ప్రదర్శించారు. 56 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు జోరు పెంచిన జైస్వాల్ కార్స్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి 99కు చేరుకున్నాడు. తర్వాతి బంతిని సింగిల్ తీసిన అతను 144 బంతుల్లో సెంచరీ మార్క్‌ను చేరుకొని సంబరాలు చేసుకున్నాడు. 50 నుంచి 100కు చేరడానికి జైస్వాల్ 48 బంతులే (8 ఫోర్లు, 1 సిక్స్‌తో) తీసుకోవడం విశేషం. పంత్ జోరు... టీ తర్వాత రెండో ఓవర్లోనే భారత్ వికెట్ కోల్పోయింది. జైస్వాల్‌ను స్టోక్స్ బౌల్డ్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత గిల్, పంత్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. పంత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా...గిల్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. బషీర్ ఓవర్లో పంత్ వరుసగా 4, 6 బాదడంతో స్కోరు 300కు చేరుకోగా... టంగ్ ఓవర్లో కవర్స్ దిశగా ఆడి గిల్ 140 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే పంత్ హాఫ్ సెంచరీ (91 బంతుల్లో) పూర్తయింది. ఎంత ప్రయత్నించినా ...పేలవ బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఈ జోడీని విడదీయలేకపోయింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) స్టోక్స్ 101; రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42; సాయి సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; గిల్ (బ్యాటింగ్) 127; పంత్ (బ్యాటింగ్) 65; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (85 ఓవర్లలో 3 వికెట్లకు) 359. వికెట్ల పతనం: 1–91, 2–92, 3–221. బౌలింగ్: వోక్స్ 19–2–89–0, కార్స్ 16–5–70–1, టంగ్ 16–0–75–0, స్టోక్స్ 13–1–43–2, బషీర్ 21–4–66–0. -
గిల్, జైశ్వాల్ సెంచరీలు.. తొలి రోజు భారత్‌దే
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు సత్తాచాటారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్(127 నాటౌట్) సెంచరీలతో మెరిశారు. ప్రస్తుతం క్రీజులో గిల్‌తో పాటు రిషబ్ పంత్(65) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. కార్స్ ఓ వికెట్ సాధించాడు. -
వారెవ్వా గిల్.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అద్బుత సెంచరీ
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో గిల్ సెంచరీతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్.. విరాట్ కోహ్లిని తలపించాడు. తొలుత దూకుడుగా ఆడిన శుబ్‌మన్, జైశ్వాల్ ఔటయ్యాక ఆచిచూచి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 140 బంతుల్లో గిల్ తన ఆరో టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 14 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. అతడి కంటే ముందు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ డెబ్యూలో సెంచరీతో చెలరేగిన గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లఖించుకున్నాడు.భారత టెస్టు కెప్టెన్‌గా అరంగేట్ర ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం విజయ్ హజారే అగ్రస్ధానంలో ఉన్నారు. 1951లో కెప్టెన్‌గా తన అరంగేట్ర ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పైనే సెంచరీ చేశారు.భారత టెస్ట్ కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..164* విజయ్ హజారే వర్సెస్ ఇంగ్లండ్, ఢిల్లీ 1951116 సునీల్ గవాస్కర్ vs న్యూజిలాండ్ ఆక్లాండ్ 1976115 విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియన్ అడిలైడ్ 2014102*శుబ్‌మన్ గిల్ vs ఇంగ్లాండ్ హెడింగ్లీ 2025భారీ స్కోర్ దిశగా భారత్..తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 78 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 మూడు వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(46), గిల్(112) ఉన్నారు. -
యువీతో గిల్ గురించి మాట్లాడాను.. కపిల్ దేవ్ మాదిరే అతడు కూడా..
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ప్రయాణం మొదలైంది. ఇంగ్లండ్ (Ind vs Eng)తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నాటి తొలి టెస్టుతో గిల్ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తండ్రి, కోచ్ యోగ్రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.శుబ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ గడ్డ మీద గెలిచి.. ట్రోఫీతో తిరిగి వస్తుందని యోగ్రాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, బ్యాటర్‌గానూ కెప్టెన్ గిల్ ముందుండి జట్టును నడిపిస్తేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.యువీతో మాట్లాడినపుడు ఇదే అన్నాడు‘‘కొన్ని రోజుల క్రితం.. అభిషేక్ శర్మ (Abhishek Sharma), శుబ్‌మన్ గిల్ల గురించి నేను యువరాజ్ సింగ్‌తో మాట్లాడాను. ఆ సమయంలో.. ‘గిల్ నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తాడు’ అని యువరాజ్ అన్నాడు. అవును.. శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు వెళ్లినపుడు వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలి.కపిల్ దేవ్ మాదిరికెప్టెన్ మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టులోనూ జోష్ నిండుతుంది. శుబ్‌మన్ సహచరులకు 100, 200 లేదంటే 300 స్కోరును టార్గెట్‌గా పెట్టాలి. తనే బాధ్యత తీసుకోవాలి. 1983 వన్డే వరల్డ్‌కప్‌లో కపిల్ దేవ్ మాదిరి ఆటగాడిగానూ జట్టును ముందుండి నడిపించాలి’’ అని యోగ్రాజ్ సింగ్ ANIతో పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు.జైసూ అర్ధ శతకం పూర్తికాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా తొలుత ఇంగ్లండ్‌తో తలపడుతోంది. స్టోక్స్ బృందంతో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు శుక్రవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది.ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42)- యశస్వి జైస్వాల్ కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, భారీ అంచనాలతో బరిలోకి దిగిన అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్ మాత్రం నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతడు డకౌట్ అయ్యాడు.ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్- కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నారు. 42 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి జైసూ 78 పరుగులతో ఉండగా.. గిల్ 42 పరుగులు సాధించాడు. టీమిండియా స్కోరు: 172-2 (42). చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్! -
Ind vs Eng 1st Test: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్
టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ప్రిన్స్.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా పేరు తెర మీదకు రాగా.. తానే స్వయంగా రేసు నుంచి తప్పుకొన్నాడు. పనిభారం కారణంగా సెలక్టర్లు కూడా ఇందుకు అంగీకరించి.. రోహిత్ స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు టెస్టు జట్టు పగ్గాలు అప్పగించారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో శుక్రవారం (జూన్ 20) మొదలైన తొలి టెస్టు సందర్భంగా సారథిగా గిల్ తన ప్రయాణం ఆరంభించాడు.ఈ నేపథ్యంలో పలు అరుదైన రికార్డులను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న వయసులోనే భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కెప్టెన్ల జాబితాలో చేరిన ప్రిన్స్.. 21వ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన సారథిగా చరిత్రకెక్కాడు. ఇన్నాళ్లుగా కోహ్లి పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు.అంతేకాదు.. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరు మీదున్న రికార్డును కూడా గిల్ ఈ సందర్భంగా సవరించాడు. కాగా టెస్టుల్లో భారత్‌కు గిల్ 37వ కెప్టెన్.యంగెస్ట్ ఇండియన్ టెస్టు కెప్టెన్లు🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 21 ఏళ్ల 77 రోజుల వయసులో- 1962లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో పోరుతో..🏏సచిన్ టెండుల్కర్- 23 ఏళ్ల 169 రోజుల వయసులో- 1996లో ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏కపిల్ దేవ్- 24 ఏళ్ల 48 రోజులు వయసులో- 1983లో కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో పోరుతో..🏏రవి శాస్త్రి- 25 ఏళ్ల 229 రోజుల వయసులో- 1988లో చెన్నై వేదికగా- వెస్టిండీస్‌తో పోరుతో..🏏శుబ్‌మన్ గిల్- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో పోరుతో..21వ శతాబ్దంలో పిన్న వయసులో టీమిండియా టెస్టు కెప్టెన్లుగా తొలి మ్యాచ్ ఆడింది వీరే.. ఒకే ఒక్కడు గిల్!🏏శుబ్‌మన్ గిల్- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో పోరుతో..🏏విరాట్ కోహ్లి- 26 ఏళ్ల 34 రోజుల వయసులో- 2014లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏సచిన్ టెండుల్కర్- 26 ఏళ్ల 253 రోజుల వయసులో- 2000లొ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏మహేంద్ర సింగ్ ధోని- 26 ఏళ్ల 379 రోజుల వయసులో- 2008లొ కాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో పోరుతో..🏏వీరేందర్ సెహ్వాగ్- 27 ఏళ్ల 59 రోజుల వయసులో- 2006లో అహ్మదాబాద్ వేదికగా శ్రీలంకతో పోరుతో..ఇంగ్లండ్‌లో టీమిండియా యంగెస్ట్ కెప్టెన్లు వీరే..🏏శుబ్‌మన్ గిల్- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్ వేదికగా..🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 26 ఏళ్ల 154 రోజుల వయసులో- 1967లో లీడ్స్ వేదికగా..🏏కపిల్ దేవ్- 27 ఏళ్ల 150 రోజుల వయసులో- 1986లో లార్డ్స్ వేదికగా..🏏మహ్మద్ అజారుద్దీన్- 27 ఏళ్ల 168 రోజుల వయసులో- 1990లో లార్డ్స్ వేదికగా..🏏జస్ప్రీత్ బుమ్రా- 27 ఏళ్ల 178 రోజుల వయసులో- 2022లో ఇంగ్లండ్ వేదికగా..👉 ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 92/2. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ 42 పరుగులకు అవుట్ కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 42 పరుగుల వద్ద ఉన్నాడు. అరంగేట్ర ఆటగాడు, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.చదవండి: IND vs ENG: పాపం నితీశ్ కుమార్.. అతడి కోసం పక్కన పెట్టేశారు? -
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. సాయి సుదర్శన్ అరంగేట్రం.. కరుణ్ ఉన్నాడా?
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్టు సమరానికి సమయం ఆసన్నమైంది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్- టీమిండియా (Eng vs Ind) మధ్య టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తొలుత బౌలింగ్ ఎంచుకుని.. గిల్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఇక ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ప్రస్థానం మొదలు కాగా.. చెన్నై చిన్నోడు సాయి సుదుర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా నయా వాల్, వెటరన్ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారా చేతుల మీదుగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ క్యాప్ అందుకున్నాడు.ఈ సందర్భంగా భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగే ఎంచుకునే వాడినని తెలిపాడు. బెకింగ్‌హామ్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం అద్బుతంగా అనిపించిందని.. సిరీస్‌లో శుభారంభం అందుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశాడు.అదే విధంగా సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని.. కరుణ్ నాయర్‌కు కూడా తుది జట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. కాగా దశాబ్ద కాలం తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేకుండా భారత్ టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందే ఈ ఇద్దరూ సంప్రదాయ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.విమాన ప్రమాద మృతులకు నివాళిగాకాగా తొలి టెస్టు సందర్భంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు ఇరుజట్ల ఆటగాళుల సంతాపం ప్రకటించారు. నిమిషం పాటు మౌనం పాటించడంతో పాటు.. బ్లాక్ ఆర్మ్బ్యాండ్లతో బరిలోకి దిగారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 181 మంది భారత ప్రయాణికులతో పాటు 53 మంది బ్రిటిష్ పౌరులు మృతి చెందారు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టువేదిక: హెడింగ్లీ మైదానం, లీడ్స్టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్తుదిజట్లుభారత్🏏యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్🏏జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
అక్కడ నేనిలాగే ఆడతా అంటే కుదరదు!.. సొంతంగా నిర్ణయాలు తీసుకో: సచిన్
ఇంగ్లండ్ (Ind vs Eng)తో టెస్టు సిరీస్ రూపంలో టీమిండియాకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ ద్వారానే భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), స్పిన్ లెజెండ్ రవించంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్ ఇదే కావడం.. అది కూడా ఇంగ్లండ్ గడ్డపై మ్యాచ్‌లు జరుగనుండటంతో సారథిగా గిల్ ఈ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.వాటిని పట్టించుకోకు.. సొంతంగా నిర్ణయాలు తీసుకోఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ గిల్‌కు కీలక సూచనలు చేశాడు. ఒత్తిడిని జయిస్తేనే అతడు అనుకున్న ఫలితం రాబట్టగలడని పేర్కొన్నాడు. ‘‘‘అతడు అలా చేయాలి.. ఇలా చేస్తే బాగుండు’ అని బయటి నుంచి ఎన్నో అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి.అయితే, అతడి దృష్టి మొత్తం టీమ్ ప్లాన్‌పై మాత్రమే కేంద్రీకృతమై ఉండాలి. డ్రెసింగ్ రూమ్‌లో జరిగే చర్చలపైనే ఫోకస్ చేయాలి. ప్రణాళికలకు అనుగుణంగానే జట్టు ముందుకు సాగుతుందా? లేదా? అన్న విషయాలను గమనిస్తూ ఉండాలి.ముఖ్యంగా మ్యాచ్‌కు ముందు రచించే ప్రణాళికలు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో సరిగ్గా అంచనా వేయగలగాలి. బయటి ప్రపంచం ఏమనుకుంటుందో అన్న విషయంతో సంబంధం లేకుండా.. దృష్టి మరల్చకుండా ఆటపైనే మనసు లగ్నం చేయాలి.కొన్నిసార్లు బయటి వ్యక్తుల నుంచి తీవ్రమైన విమర్శలు రావచ్చు. అలాంటపుడు ఒత్తిడిని దరిచేరనీయకూడదు. డిఫెన్స్‌లో పడిపోకూడదు. ఎవరికి తోచినట్లుగా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.ముందుగా చెప్పినట్లు డ్రెసింగ్ రూమ్‌లో చర్చలు, జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాలి. అంతకు మించి పెద్దగా చేయాల్సిందేమీ కూడా ఉండదు’’ అని సచిన్ టెండుల్కర్ చెప్పుకొచ్చాడు.ఇలాగే బ్యాటింగ్ చేస్తా అంటే కుదరదుఇక ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలన్న సచిన్ టెండుల్కర్.. ‘‘పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి. అలా అయితేనే ప్రణాళికలకు తగ్గట్లుగా ముందుకు వెళ్లే వీలు ఉంటుంది. ఇదేమీ వన్‌వే ట్రాఫిక్ కాదు.. ‘నేనిలాగే ఉంటా.. ఇలాగే బ్యాటింగ్ చేస్తా అంటే కుదరదు’.పిచ్ పరిస్థితులకు ఆకళింపు చేసుకున్న తర్వాతే అసలైన ఆట మొదలుపెట్టాలి’’ అని భారత ఆటగాళ్లకు సూచించాడు. ఏదేమైనా ఈసారి టీమిండియా ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలుస్తుందనే నమ్మకం ఉందని సచిన్ టెండుల్కర్ ధీమా వ్యక్తం చేశాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంటుందని అంచనా వేశాడు. కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌కు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్ గడ్డ మీద 1990- 2011 మధ్య సచిన్ ఐదు టెస్టు సిరీస్‌లు ఆడాడు.చదవండి: WI Vs AUS 1st Test: వరుస వైఫల్యాలు.. స్టార్ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా -
IND Vs ENG: నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం (ఫొటోలు)
-
నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలనుకుంటున్నా: గిల్
లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు శుక్రవారం(జూన్ 20) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభరంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం(జూన్ 18) టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు.ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు గిల్ సమాధనమిచ్చాడు. భారత కెప్టెన్‌గా తను ఎదుర్కొనున్న ఛాలెంజ్స్ కోసం గిల్ మాట్లాడాడు. అయితే కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్‌పై పడకుండా చూసుకుంటాని అతడు చెప్పుకొచ్చాడు. "ఇప్పటివరకు ఏ విధంగా అయితే పూర్తి స్వేఛ్చతో బ్యాటింగ్ చేశానో, ఇకపై కూడా అదే కొనసాగిస్తున్నాను. కెప్టెన్సీ గురుంచి ఎక్కువగా ఆలోచించకుండా నా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ సిరీస్‌లో బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలని భావిస్తున్నా. విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్ధానం కోసం ఇప్పటికే గంభీర్ భాయ్, నేను చర్చించుకున్నాము. మా దగ్గర రెండు వేర్వేరు కాంబినేషన్లు సిద్దంగా ఉన్నాయి. పిచ్‌ను పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకుంటాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ పేర్కొన్నాడు.భయపెడుతున్న గిల్ రికార్డు..శుబ్‌మన్ గిల్ తన కెరీర్లో 32 టెస్టులు ఆడి 1893 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. కానీ సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి రికార్డు మాత్రం టీమ్‌మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. సెనాదేశాల్లో గిల్ ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి 514 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌లో అయితే అతడి ప్రదర్శన మరి దారుణంగా ఉంది. ఇంగ్లండ్ గడ్డపై మూడు టెస్టులు ఆడిన శుబ్‌మన్.. 14.66 సగటుతో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: ‘కోహ్లి చెప్పింది నిజమే.. కానీ మాకూ కుటుంబం ఉంటుంది.. డబ్బు సంపాదించాలి’ -
గిల్ కచ్చితంగా ట్రోఫీతోనే తిరిగి వస్తాడు: టీమిండియా దిగ్గజం
భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ఆరంభం కానుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నిష్క్రమణ తర్వాత.. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లండ్ గడ్డ మీద తొలి టెస్టు సిరీస్ ఆడబోతోంది. లీడ్స్‌లో శుక్రవారం నుంచి ఇరుజట్ల మధ్య పోటీ ఆరంభం కానుంది.ఆ ముగ్గురికే సాధ్యమైందిఅయితే, ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలవడం అంత సులువేమీ కాదు. ఇప్పటి వరకు టీమిండియా కేవలం మూడుసార్లు మాత్రమే అక్కడ విజయపతాక ఎగురవేసింది. 1971లో అజిత్ వాడేకర్ సారథ్యంలో.. 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో.. చివరగా 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో ఇంగ్లండ్‌ను తమ స్వదేశంలో భారత్ ఓడించగలిగింది.ఈ నేపథ్యంలో.. కఠిన సవాలుకు సిద్ధమైన గిల్ సేన.. సొంతగడ్డపై మరింత పటిష్టంగా కనిపించే స్టోక్స్ బృందాన్ని ఏ మేరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ భారత జట్టు కొత్త సారథి శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ తప్పక ట్రోఫీతో తిరిగి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఈ మేరకు.. ‘‘అతడు ప్రతిభావంతుడైన ఆటగాడు. ఇప్పుడు భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. కచ్చితంగా ట్రోఫీతోనే అతడు ఇంగ్లండ్ నుంచి తిరిగి వస్తాడు. మనల్ని గర్వపడేలా చేస్తాడు. టీమిండియాకు గుడ్‌లక్. మనోళ్లు విజేతలుగా తిరిగి వస్తారు. వారికి ఆ సత్తా ఉంది’’ అని కపిల్ దేవ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించాడు.విచిత్రంగా అనిపించింది..టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా దీనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది. ఈ విషయంపై స్పందించిన కపిల్ దేవ్.. ‘‘నాకైతే ఇది విచిత్రంగా అనిపించింది.ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యం వేసింది. మరేం పర్లేదు. క్రికెట్లో అన్నీ జరుగుతాయి. క్రికెట్ అంటే క్రికెటే. మైదానంలో ఆటగాళ్ల స్ఫూర్తి అలాగే ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా పటౌడీ పేరును తొలగించడంపై ఈసీబీపై విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో బీసీసీఐ, టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ గెలిచిన కెప్టెన్‌కు పటౌడీ పేరిట పతకం అందించాలని ఈసీబీ నిర్ణయించింది.చదవండి: ‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుదిజట్టు ఇదే!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన తుదిజట్టు (భారత్)ను ప్రకటించాడు. కేఎల్ రాహుల్ (KL Rahul)- యశస్వి జైస్వాల్‌లను ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేసుకున్న అశూ.. జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్‌కు స్థానం ఇచ్చాడు. అదే విధంగా.. చెన్నై బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తాడని పేర్కొన్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్‌లో పరస్పరం తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ సిరీస్‌లోని తొలి టెస్టుకు లీడ్స్ వేదిక. ఈ మ్యాచ్‌తో శుబ్‌మన్ గిల్ (Shubman Gill) టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.అశూ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ లీడ్స్ టెస్టుకు భారత తుదిజట్టుపై తన అంచనా తెలియజేశాడు. సాయి సుదర్శన్‌తో పాటు కరుణ్ నాయర్‌కు కూడా తన జట్టులో చోటిచ్చాడు.‘‘కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ’’ అంటూ ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు తాను ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్‌ను అశూ వెల్లడించాడు.అందుకే కరుణ్‌కే ఓటుఅయితే, ఆరో స్థానం కోసం కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ ఉందని.. తాను మాత్రం ఫామ్ దృష్ట్యా కరుణ్‌కే ఓటు వేస్తానని అశూ తెలిపాడు. ఇక బుమ్రా అందుబాటులో లేనిపక్షంలో బౌలింగ్ ఆప్షన్ కోసం శార్దూల్‌ను ఎనిమిదో స్థానంలో ఆడించాలని సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అశూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అత్యధిక వికెట్లు తీసేది అతడే!అదే విధంగా.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లిష్ పేసర్ క్రిస్ వోక్స్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని అశూ జోస్యం చెప్పాడు. లేదా షోయబ్ బషీర్ హయ్యస్ట్ వికెట్ టేకర్ అవుతాడని పేర్కొన్నాడు.టీమిండియా నుంచి బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడటం లేదు కాబట్టి అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదని చెప్పాడు. అయితే, సిరాజ్‌కు మాత్రం ఆ అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. పరుగుల వీరుడిగా పంత్!ఇక అత్యధిక పరుగులు వీరుడిగా రిషభ్ పంత్ నిలుస్తాడని అంచనా వేసిన అశూ.. ఇంగ్లండ్ నుంచి జో రూట్, బెన్ డకెట్‌ల పేర్లు కూడా కొట్టిపారేయలేమన్నాడు. కాగా భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. గెలిచిన కెప్టెన్‌కు పటౌడీ మెడల్ అందిస్తారు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు అశ్విన్ ఎంపిక చేసిన భారత తుదిజట్టుకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ ప్రకటించిన తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’ -
Ind vs Eng: కోహ్లి స్థానంలో అతడే: క్లారిటీ ఇచ్చిన పంత్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభం నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ కీలక అప్డేట్ అందించాడు. విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరు వెల్లడించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా తమ తొలి సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రోహిత్ స్థానాన్ని శుబ్‌మన్ గిల్‌తో భర్తీ చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. అతడికి డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను నియమించింది. కాగా కోహ్లి నిష్క్రమణ నేపథ్యంలో టెస్టుల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో ఎవరు దిగుతారన్న అంశంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కోహ్లి వారసుడిగా కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ పేర్లు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రి- మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శుబ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.అయితే, అతడు ఆడుతున్న మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను యథావిధిగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను’’ అని రిషభ్ పంత్ వెల్లడించాడు. దీంతో తుదిజట్టుపై మరోసారి సందిగ్దం నెలకొంది. సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడా? లేదంటే ‘ట్రిపుల్ సెంచూరియన్’ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.ఇంగ్లండ్‌తో టెస్టులకు టీమిండియా:శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.చదవండి: టీమిండియాకు గేమ్ ఛేంజర్లు వీరిద్దరే: ఊహించని పేర్లు చెప్పిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ -
కోహ్లి లేకుండా టీమిండియాతో సిరీస్.. స్టోక్స్ రియాక్షన్ వైరల్!
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో భారత జట్టు స్టోక్స్ బృందంతో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడే తొలి టెస్టు సిరీస్ కావడంతో గిల్ సేన ఎలా ఆడబోతుందన్న అంశంపైనే క్రికెట్ ప్రేమికుల దృష్టి కేంద్రీకృతమైంది.అతడికి ఎవరూ సాటిరారుఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విరాట్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోహ్లి సేవలను కచ్చితంగా మిస్ అవుతుందని.. అతడి పోరాటపటిమ, పట్టుదలకు ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. క్లాస్ ప్లేయర్ లేకుండా బరిలోకి దిగడం భారత జట్టుకు కాస్త కష్టంగానే ఉంటుందని తెలిపాడు.ఈ మేరకు.. ‘‘పోరాటతత్వం గల.. అదే విధంగా క్రీడాస్పూర్తిని రగిల్చే కోహ్లిని టీమిండియా మిస్ అవుతుందనడంలో సందేహం లేదు. గెలుపు కోసం అతడు పడే తాపత్రయం, అందుకోసం అతడు చేసే పోరాడే విధానానికి ఎవరూ సాటిరారు.18వ నంబర్‌ను అతడు తన గుర్తింపుగా మార్చుకున్నాడు. వేరొక భారత ఆటగాడి జెర్సీపై నంబర్ 18ను చూడటం కాస్త చిత్రంగానే అనిపించవచ్చు. సుదీర్ఘకాలంగా అతడు టీమిండియా క్లాస్ ప్లేయర్‌గా కొనసాగిన తీరు అమోఘం’’ అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.కోహ్లి ఉంటేనే మజాఅదే విధంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. తాను అతడి మెసేజ్ చేశానన్న స్టోక్స్... అతడు లేని టెస్టు క్రికెట్ ఆడటం అంత గొప్పగా ఉండదని చెప్పానన్నాడు. ‘‘ విరాట్ కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటంలో ఎంతో మజా ఉంటుంది. కానీ ఇకపై అది జరుగబోదని తెలిసి నాకు కాస్త విచారంగా అనిపించింది.మైదానంలో ఉన్నప్పుడు యుద్ధరంగంలో ఉన్నట్లే నేను, కోహ్లి భావిస్తాం. ఆట విషయంలో మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకే విధంగా ఉంటుంది. ఇంగ్లండ్ జట్టు మీద అతడు ఎంతో గొప్పగా ఆడాడు. అతడొక క్లాస్ ప్లేయర్’’ అని స్టోక్స్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.దిగ్గజ కెప్టెన్ కూడా!కాగా టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్లో.. 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు సాధించాడు. ఇందులో ముప్పై శతకాలు ఉన్నాయి. అంతేకాదు.. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కోహ్లి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. అంతేకాదు.. గ్రేమ్ స్మిత్ (53 విజయాలు), రిక్కీ పాంటింగ్ (48 విజయాలు), స్టీవ్ వా(41 విజయాలు) తర్వాత అత్యధిక టెస్టు విజయాలు (40) అందుకున్న సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్‌గా పది టెస్టులు ఆడిన కోహ్లి.. మూడింట జట్టును గెలిపించాడు.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు భారత బ్యాటింగ్ లైనప్ ఇదే.. రోహిత్, కోహ్లికి ప్రత్యామ్నాం వీళ్లే..! -
కొత్త ఆరంభానికి సిద్ధం
భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై 19 సిరీస్‌లు ఆడితే 14 సిరీస్‌లలో పరాజయమే పలకరించింది. రెండు సిరీస్‌లు సమంగా ముగియగా మూడుసార్లు భారత జట్టు విజేతగా నిలిచింది. అయితే పాత రికార్డుల్లోకి వెళ్లకుండా గత మూడు సిరీస్‌లనే చూసుకుంటే టీమిండియా ప్రదర్శనలో అక్కడక్కడ చెప్పుకోదగ్గ మెరుపులు ఉన్నాయి. చివరిసారిగా 2021–22లో పర్యటించిన సమయంలో ఐదు టెస్టుల సిరీస్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకోవడం మన జట్టు మెరుగైన ప్రదర్శనకు సూచిక.అంతకుముందు రెండు పర్యటనల్లో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన రికార్డు అంకెల్లో కనిపిస్తున్నా... భారత్ చాలా సందర్భాల్లో పైచేయి సాధించింది. దురదృష్టవశాత్తూ కీలక క్షణాల్లో పట్టు తప్పడంతో మ్యాచ్‌లు చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ బృందం పట్టుదలను, పోరాటపటిమను ప్రదర్శిస్తే ఇంగ్లండ్‌తో గట్టి పోటీనివ్వడం ఖాయం. అంచనాలకు అనుగుణంగా రాణిస్తే సిరీస్ ఏకపక్షంగా సాగకుండా ఇంగ్లండ్‌ను టీమిండియా నిలువరించవచ్చు. –సాక్షి క్రీడా విభాగం ప్రస్తుతం సిరీస్‌కు సిద్ధమైన జట్టులో ఇంగ్లండ్ గడ్డపై అనుభవంరీత్యా చూస్తే రవీంద్ర జడేజాఅందరి కంటే సీనియర్. గత మూడు సిరీస్‌లలో అతను జట్టులో భాగంగా ఉన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్‌లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరమైన స్థితిలో జడేజా అనుభవం జట్టుకు కీలకం కానుంది. కేఎల్ రాహుల్, బుమ్రా, రిషభ్ పంత్ ఇంగ్లండ్‌లో గత రెండు సిరీస్‌లు ఆడగా... కుల్దీప్ యాదవ్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్లకు కూడా ఆడిన అనుభవం ఉంది. కౌంటీ క్రికెట్లో ఆడటాన్ని పక్కన పెడితే మిగతా ప్లేయర్లంతా అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి ఇంగ్లండ్‌లో బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడున్న జట్టును చూస్తే స్టార్ అంటూ ఎవరూ లేరు. మున్ముందు సిరీస్‌లో ఇదే భారత్‌కు సానుకూలాంశం కూడా కావచ్చు. ఒక్కొక్కరి వ్యక్తిగత ఆటపై కాకుండా టీమిండియా సమష్టి ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా ఈ సిరీస్ సవాల్‌గా నిలవనుంది. బ్యాటర్‌గా ఇంగ్లండ్ గడ్డపై పేలవమైన రికార్డు (5 టెస్టుల్లో కలిపి 127 పరుగులు) ఉన్న గంభీర్ కోచ్‌గా తన వ్యూహాలకు పదును పెట్టి జట్టుకు ఎలా మార్గనిర్దేశం చేస్తాడనేది ఆసక్తికరం. బ్యాటర్లకు సవాల్... మబ్బు పట్టిన వాతావరణంలో బంతి అనూహ్యంగా స్వింగ్ కావడం... డ్రైవ్ కోసం ప్రయతి్నస్తే చాలు బంతి బ్యాట్ అంచులను తాకి స్లిప్స్‌లోకి దూసుకుపోవడం... ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌లలో సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇలాంటి స్థితిని దాటి బ్యాటర్లు రాణించాలంటే ఎంతో పట్టుదల, ఓపిక కనబర్చాల్సి ఉంటుంది. తమ బ్యాటింగ్ స్టాన్స్‌లో కూడా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్లది ప్రధాన పాత్ర కానుంది. ప్రస్తుతం జట్టు కూర్పును బట్టి చూస్తే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేయడం ఖాయమే. జైస్వాల్ 19 మ్యాచ్‌ల స్వల్ప కెరీర్‌ను చూస్తే ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్‌లపై ఆకట్టుకున్న అతను దక్షిణాఫ్రికాలో రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌లో అతను సత్తా చాటాల్సిన సమయం వచి్చంది. తొలి సిరీస్‌లోనే సుదర్శన్ నుంచి అతిగా ఆశించలేం. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ రెండు ఫైనల్‌లను వదిలేస్తే గిల్ ఇంగ్లండ్‌లో ఒకే ఒక టెస్టు ఆడాడు. కెప్టెన్‌గా అదనపు బాధ్యతతో అతను ఎంత బాగా ఆడతాడనేది కీలకం. గణాంకాల పరంగా చూస్తే మరో ప్రధాన బ్యాటర్ రాహుల్‌కు ఇంగ్లండ్‌లో మంచి రికార్డు ఉంది. ఇప్పుడు తన స్థానంపై సందేహాలు లేవు కాబట్టి స్వేచ్ఛగా ఆడగలడు. ఇక మిడిలార్డర్లో కరుణ్ నాయర్‌పై అందరి దృష్టీ ఉంది. నాయర్‌కు చోటు దక్కడంలో దేశవాళీ ప్రదర్శనతో పాటు నార్తాంప్టన్‌షైర్ అనుభవం కీలకపాత్ర పోషించింది. కాబట్టి అతను తనపై ఉంచిన నమ్మ కాన్ని నిలబెట్టుకునేందుకు ఏమాత్రం శ్రమిస్తాడనేది ఆసక్తికరం. ఇక పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా ఆట దిశను మార్చగల పంత్‌పై కూడా జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. మెల్బోర్న్ టెస్టు తర్వాత నిలకడ చూపించలేకపోయిన నితీశ్ రెడ్డి మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది.బుమ్రా, సిరాజ్ చెలరేగితే...ఈ సిరీస్ ఫలితాన్ని ప్రభావితం చేయగల ఏకైక ప్లేయర్లా జస్ప్రీత్ బుమ్రా కనిపిస్తున్నాడు. పని భారంతో అతను గరిష్టంగా మూడు టెస్టులే ఆడవచ్చని మేనేజ్మెంట్ ఇప్పటికే చెప్పింది. ఆ మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ బ్యాటర్లకు ‘నరకం’ కనిపించడం ఖాయం. ఇటీవల ఆ్రస్టేలియాకు ఈ అనుభవం ఏమిటో బాగా తెలిసింది. కాబట్టి బుమ్రా పూర్తి ఫిట్నెస్తో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరగడం ఖాయం. ఎరుపు బంతితో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ కూడా చాలా పదునెక్కింది. అక్కడి పరిస్థితుల్లో సిరాజ్ బౌలింగ్ ప్రత్యర్థి పాలిట ప్రమాదకరంగా మారడం ఖాయం. గత సిరీస్‌లో సిరాజ్ 5 టెస్టులూ ఆడి 18 వికెట్లు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ అనుభవం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. సిడ్నీ టెస్టులో ఆకట్టు కున్న ప్రసిధ్ కృష్ణ మూడో పేసర్‌గా బరిలోకి దిగనున్నాడు. సుదీర్ఘ సిరీస్ కాబట్టి అర్ష్ దీప్‌కు ఏదో ఒకదశలో అవకాశం దక్కవచ్చు కానీ ఏమాత్రం ప్రభావం చూపగలడో సందేహమే. అశ్విన్ రిటైర్మెంట్తో ఇప్పుడు కుల్దీప్కు తొలిసారి ప్రధాన స్పిన్నర్‌గా చోటు ఖాయం. 2018లో ఇక్కడ ఆడిన ఏకైక మ్యాచ్‌లో విఫలమైన అతను పెద్ద బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం ముఖ్యం. కెరీర్ చివరి దశలో ఉన్న జడేజా ఆల్‌రౌండర్‌గా రాణించడం ముఖ్యం. సీమ్ బౌలర్ శార్దుల్ శైలితో ఇక్కడ మంచి ఫలితం రాబట్టవచ్చు కాబట్టి మేనేజ్మెంట్ మొగ్గు శార్దుల్ వైపు ఉంది. -
కోహ్లి, రోహిత్ లేకపోయినా పర్వాలేదు.. గిల్ అంతా చూసుకుంటాడు: గూచ్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తొలి సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ కోసం గిల్ సేన తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేని యువ భారత జట్టు ఎలా రాణిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కమంలో ఇంగ్లండ్ మాజీ టెస్టు కెప్టెన్ కెప్టెన్ గ్రాహం గూచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.కోహ్లి, రోహిత్ స్ధానాలను భర్తీ చేసే అద్బుత ఆటగాళ్లు ప్రస్తుత భారత జట్టులో ఉన్నారని గూచ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరి దిగ్గజాల స్ధానాలను భర్తీ చేసేందుకు సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ సిద్ధంగా ఉన్నారు. కానీ టీమ్ మెన్జ్మెంట్ ఎవరికి అవకాశమిస్తుందో వేచి చూడాలి."భారత క్రికెట్లో కొత్త యుగం మొదలైంది. నా వరకు అయితే.. ఒక దారి మూసుకుపోతే, మరో దారి తెరుచుకుంటుంది. ఈ పర్యటనలో భారత ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తారని నేను నమ్ముతున్నాను. భారత క్రికెట్ జట్టులో ప్రతిభకు కొదవలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వారసత్వాన్ని కొనసాగించేందుకు యువ ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారు.అయితే బుమ్రా అన్ని మ్యాచ్‌లలో ఆడకపోవడం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే. బుమ్రా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఎటువంటి పరిస్థితులలోనైనా అతడిని ఎదుర్కొవడం అంత సులభం కాదు. ఈ పర్యటనలో భారత జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది.కానీ కొంతమంది యువ ఆటగాళ్లు తమ ప్రదర్శలనతో ముందుకు రావాలి. ఇక భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం అరుదైన గౌరవంగా భావించాలి. శుబ్‌మన్ గిల్ జట్టును విజయ పథంలో నడిపిస్తాడన్న నమ్మకం నాకు ఉందని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూచ్ పేర్కొన్నాడు.చదవండి: ICC Odi Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్
లీడ్స్ వేదికగా జూన్ 20న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చేసిన హెడ్ కోచ్ గౌతం గంభీర్.. తిరిగి మంగళవారం భారత జట్టుతో కలవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఎన్ఐ వర్గాల సమాచారం ప్రకారం.. గంభీర్ సోమవారం(జూన్ 16) లండన్‌కు బయలుదేరినట్లు తెలుస్తోంది. కాగా ఈ సిరీస్ కోసం గంభీర్ జూన్ 5న భారత జట్టుతో పాటు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోంది.అయితే తన తల్లి గుండెపోటుతో అస్పత్రిలో చేరడంతో గౌతీ ఉన్నపళంగా జూన్ 11న స్వదేశానికి వచ్చేశాడు. ఇప్పుడు అతడి తల్లి ఆరోగ్యం మెరుగుపడడంతో గంభీర్ తిరిగి ఇంగ్లండ్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. ఇక గంభీర్ లేకపోవడంతో భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీయస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొనసాగించింది.క్రిక్ బజ్రిపోర్ట్స్ ప్రకారం.. టీమిండియా సన్నాహాలను లక్ష్మణ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. లక్ష్మణ్ భారత జట్టుతో కాకుండా తన వ్యక్తిగత పనుల మీద ఇంగ్లండ్‌కు వెళ్లాడు. కానీ గంభీర్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోవడంతో లక్ష్మణ్ లౌసాన్ నుండి లండన్‌కు వచ్చినట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.ఇక తొలి టెస్టుకు గిల్ సారథ్యంలోని భారత జట్టు అన్నివిధాల సిద్దమైంది. ఈ టెస్టుకు ముందు ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో భారత సీనియర్, భారత-ఎ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాహుల్, గిల్, శార్ధూల్ ఠాకూర్ వంటి మెరుగ్గా రాణించారు. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా జరగనుంది.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే! యువ సంచలనానికి నో ఛాన్స్? -
కలలో కూడా ఊహించలేదు
లండన్: టీమిండియా సారథ్య బాధ్యతలు నిర్వర్తించే అవకాశం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అన్నాడు. పేస్ తురుపుముక్క బుమ్రా అందుబాటుపై ముందుగానే చెప్పడం కుదరదన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేందుకు... యథేచ్చగా ఆడేందుకు తగిన లక్ష్యాలను నిర్దేశించుకుంటామన్నాడు. స్టార్, వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో గిల్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఇన్నాళ్లు ఓపెనింగ్ సవాల్‌ను ఎదుర్కొన్న శుబ్‌మన్ ఇప్పుడు మొదటిసారి ఓపెనింగ్‌తోపాటు సారథ్య పరీక్షకూ ఇంగ్లండ్‌కు వచ్చాడు. 2007లో టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గింది. తర్వాత చాలాసార్లు పర్యటించినా విజయం మాత్రం దక్కలేదు. ఇప్పుడు గిల్ నేతృత్వంలోని భారత్ ఈ నిరీక్షణకు తెరదించేందుకు ఐదు టెస్టుల సిరీస్‌లో రాణించడంపై దృష్టి సారించింది. ఇంగ్లండ్‌లోని స్కై స్పోర్ట్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై గిల్ వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా... ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా జట్టు సంస్కృతిని మార్చాలనుకుంటున్నాను. సురక్షితమైన వాతావరణం కల్పించడం ద్వారా ఆ ఆటగాడు యథేచ్చగా ఆడే అవకాశం కల్పిస్తే... అతని పూర్తిస్థాయి సామర్థ్యం బయటపడుతుంది. ఓ నాయకుడు జట్టుకు చేయాల్సింది అదేనని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇది అంతసులువు కాదని నాకూ తెలుసు. అయితే ఆ దిశగా నా ప్రణాళికలుంటాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో దూకుడుగా ఉన్నట్లే జట్టును నడిపించే విషయంలోనే అంతే పట్టుదలను ప్రదర్శిస్తాడు. సిరీస్ లేదంటే పర్యటనలో ఆటగాళ్ల నుంచి తనకు ఏం కావాలనేది స్పష్టం చేస్తాడు. ముగిసిన తర్వాత సమీక్షలోనూ ఇదే పంథా అనుసరిస్తాడు. ఇది సరైన మార్గనిర్దేశనమని నేను భావిస్తున్నా. దూకుడైన సారథిగా కోహ్లి మార్కు కూడా జట్టుపై ఉంది. ఇద్దరి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. అంచనాలనేవి సహజం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతం గంభీర్‌లు నాపై అసాధారణ ఒత్తిడిని పెట్టలేదు. అమితమైన అంచనాలను పెంచలేదు. అయితే ఓ ఆటగాడిగా, కెప్టెన్‌గా నాపై సహజంగానే కొన్ని అంచనాలయితే తప్పకుండా ఉంటాయి. ఇది కాదనలేని సత్యం. వాటిని అందుకునేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. నా ఆటతీరుపై మా నాన్న ప్రభావం తప్పకుండా ఉంటుంది. నాలాగే తను కూడా భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌ను అవుతానని ఏనాడూ ఊహించలేదు. ఆయన కూడా నాలాగే టీమిండియాకు ఆడటం, జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాలనే ఆశలే పెట్టుకున్నాడు. కెప్టెన్సీపై నాతో సంప్రదింపులు జరుగుతున్నప్పుడే నాన్న నాకు ఫోన్ చేసి ఆడిగారు. కానీ నేను మాత్రం అధికారికంగా నియమించాకే నాన్నతో ఆ విషయాన్ని పంచుకున్నాను. గంభీర్ శైలిని అందిపుచ్చుకోవడం... ఐపీఎల్‌లోనే కోచ్ గంభీర్ శైలికి అలవాటు పడ్డాను. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నేను ఆడినపుడు గంభీర్ మెంటార్‌గా ఉన్నాడు. కాబట్టి అతని శిక్షణ శైలిపై అవగాహన ఉంది. ఇప్పుడు ఓ జాతీయ జట్టుకు అతను హెడ్ కోచ్ కాబట్టి ఎంతబాగా అతని శైలి తెలిసున్నప్పటికీ ఇంకాస్త జాగ్రత్తగా అనుసరించాల్సి ఉంటుంది. జట్టు కోసం అంకితభావం, నిబద్ధతతో పనిచేసే గంభీర్ ఆటగాళ్లకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. జట్టు ముందున్న లక్ష్యాలు, ఆటగాళ్లు అందుకోవాల్సిన అంచనాలు ముందే స్పషీ్టకరిస్తాడు. జట్టుకు ఏ సమయంలో ఏం కావాలనేది ఓ సానుకూల దృక్పథంతో ఆటగాళ్ల మానసిక స్థయిర్యాన్ని పెంచుతాడు. బుమ్రా అందుబాటుపై... పేసర్ బుమ్రాపై పని భారాన్ని తగ్గించేందుకు అన్ని టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఏ, ఏ మ్యాచ్‌లు ఆడతాడనేది ఇప్పుడే వెల్లడించడం సాధ్యం కాదు. ఐదు టెస్టుల పూర్తిస్థాయి సిరీస్‌లో పరిస్థితులు, పలు అంశాలను బట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ అతను ఈ మ్యాచ్ ఆడడు. వచ్చే మ్యాచ్ ఆడతాడు అని చెప్పలేం. ఇంగ్లండ్ ‘బజ్‌బాల్ క్రికెట్’ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలేం లేవు. పరిస్థితులను బట్టే జట్టు ఎత్తుగడలు అమలవుతాయి. దూకుడు ప్రతీసారి ఫలించదు. ఆ విషయం నాకు తెలుసు. -
శుభ్‌మన్ గిల్ ఓవరాక్షన్.. సచిన్, కోహ్లి కూడా ఎప్పుడూ అలా చేయలేదు..!
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. గిల్ ఓ ఫోటో షూట్లో తనను స్పాన్సర్ చేస్తున్న ఎంఆర్ఎఫ్ కంపెనీ బ్యాట్‌తో దర్శనమిచ్చాడు. ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.ఎంఆర్ఎఫ్ కంపెనీ క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే ఆటగాళ్లకు స్పాన్సర్ చేస్తూ వస్తుంది. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ లాంటి స్టార్ ఆటగాళ్లకు ఈ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ వచ్చింది. వీరంతా ఎంఆర్ఎఫ్ స్టిక్కర్లు ముద్రించిన బ్యాట్లను వినియోగిస్తారు.తమతో ఒప్పందంలో ఉన్న ఆటగాళ్లకు ఎంఆర్ఎఫ్ ఛాంపియన్, జీనియస్, మాస్టర్ లాంటి బిరుదులు ఇచ్చింది. వీటిని ఆటగాళ్ల బ్యాట్లపై కంపెనీ స్టిక్కర్‌తో పాటు ముద్రిస్తుంది. జీనియస్ అన్న పదాన్ని ఎంఆర్ఎఫ్ చాలాకాలం పాటు వాడింది. సచిన్, లారా, డివిలియర్స్, విరాట్ ఎంఆర్ఎఫ్ జీనియస్ అనే స్టిక్కర్లు ఉన్న బ్యాట్లు అధికంగా వాడారు.ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు ముందు గిల్‌తో ఒప్పందం చేసుకున్న ఎంఆర్ఎఫ్.. అతనికి కూడా జీనియస్ అన్న బిరుదును కొనసాగించింది. ఇక్కడి వరకు అంతా బాగుంది.గిల్ ఇటీవల టీమిండియా కొత్త కిట్ ఆవిష్కరణ సందర్భంగా ఎంఆర్ఎఫ్ లోగో ఉన్న బ్యాట్‌తో ఫోటో షూట్‌కు అటెండ్ అయ్యాడు. బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన ఈ ఫోటోల్లో కొందరు నెటిజన్లు గిల్ బ్యాట్‌పై ఎంఆర్ఎఫ్ జీనియస్ స్టిక్కర్‌తో పాటు ప్రిన్స్ అని ముద్రించడాన్ని గమనించారు.ఇదే గిల్‌పై విమర్శలకు దారి తీసింది. క్రికెట్లో ఎంతో సాధించిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి కూడా తమ బ్యాట్లపై తమ బిరుదులైన గాడ్, కింగ్ అన్న పదాలను ఎప్పుడూ ముద్రించుకోలేదు. గిల్ ఏవరో కొందరు ప్రిన్స్ అనగానే, ఆ పదాన్ని తన బ్యాట్‌పై ముద్రించుకున్నాడని విమర్శిస్తున్నారు. 🚨The Overhyped "Prince" of Indian Cricket🚨Shubman Gill is so self-obsessed. Who even called you the Prince? A so-called 'Prince of ICT with a poor SENA record, a below 35 Test average, and zero overseas centuries across all formats after 5 years in his international career. pic.twitter.com/SKxiUKT0pa— Niik (@Niiki099) June 11, 2025వాస్తవానికి ప్రిన్స్ అన్న బిరుదు మొదట లారా ఉండిందన్న విషయాన్ని 90 దశకంలోని అభిమానలు గుర్తు చేస్తున్నారు. గిల్ ప్రిన్స్ అన్న బిరుదుకు అర్హుడు కాదని అతని వ్యతిరేకులు కామెంట్లు చేస్తున్నారు. గిల్ ఏం సాధించాడని అతనికి ప్రిన్స్ అన్న బిరుదు అని ప్రశ్నిస్తున్నారు. గిల్‌కు టెస్ట్‌ల్లో 35 కంటే తక్కువ సగటు ఉందని గుర్తుకు చేస్తున్నారు. SENA దేశాల్లో అతనికి చెత్త రికార్డు ఉందని ప్రస్తావిస్తున్నారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదని అని గుర్తు చేస్తున్నారు. ఆటగాళ్లకు బిరుదులను విశ్లేషకులు, దిగ్గజాలు ఇస్తారు. సోషల్‌మీడియాలో సొంత డబ్బాను బట్టి బిరుదులు రావంటూ మండిపడుతున్నారు. Sachin Tendulkar never played with a bat that had "God" written over it and Virat Kohli never played with a bat that had "King" written over it. You get tags with your performances and the tags are given by the greats of the game and not from the social media.— Cricket🏏 Lover // ICT Fan Account (@CricCrazyV) June 11, 2025గిల్ తన సొంతంగా బ్యాట్‌పై ప్రిన్స్ అన్న పదం ముద్రించుకున్నాడో లేక ఎంఆర్ఎఫ్ కంపెనీనే ఆ పదాన్ని ముద్రించిందో తెలియలేదు. కాగా, గిల్ ఇంగ్లండ్ పర్యటనకు ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ ఆకస్మిక రిటైర్మెంట్తో గిల్‌కు ఈ అదృష్టం వరించింది. -
భారత కెప్టెన్ ఒక సూపర్ స్టార్.. కానీ అతడిని మిస్ అవుతారు: ఓలీ పోప్
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో మైదానంలో ఎంతో యాక్టివ్‌గా ఉండే విరాట్ కోహ్లి సేవలను భారత్ మిస్ అవుతుందని పోప్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ప్రస్తుత భారత జట్టులో యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారని అతడు కొనియాడాడు.ఇంగ్లండ్ టూర్‌కు ముందు కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు వరకైనా కొనసాగాలని విరాట్‌ను సెలక్టర్లు కోరినప్పటికి అతడు మాత్రం తన మనసును మర్చుకోలేదు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి షాకిచ్చాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడయ్యాడు. అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత టెస్టు జట్టులోకి చోటు దక్కగా.. కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేశాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌పై గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు.. ప్రాక్టీస్‌లో మునిగితేలుతోంది. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందో అందరూ ఆతృతగా ఎదురు చూస్తోంది.ఈ నేపథ్యంలో ఓలీ పోప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఇది యువ భారత జట్టు. కానీ ఈ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. చాలా మందికి కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. అదేవిధంగా కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టాలెంట్ కోసం మనందరికీ తెలుసు.అతడొక సూపర్ స్టార్. అయితే స్లిప్‌లో నిలబడి ప్రత్యర్ధి బ్యాటర్లను ఏకగ్రాతను కోల్పోయేలా చేసే విరాట్ కోహ్లి సేవలను మాత్రం భారత్ కోల్పోతుంది. అయినప్పటికీ భారత జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. వారిని ఎదుర్కొనేందుకు మా ఆటగాళ్లు కూడా సిద్దంగా ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం -
రచిన్, బ్రూక్.. కొత్త ఫాబ్ ఫోర్ వీళ్లే..!
అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్ ఫాబ్ ఫోర్‌గా (అత్యుత్తమమైన నలుగురు) కీర్తించబడుతున్నారు. అయితే వీరిలో విరాట్ కోహ్లి టెస్ట్‌లకు, టీ20లకు.. స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫాబ్ ఫోర్కు బీటలు వారినట్లైంది. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణిస్తుంటేనే ఫాబ్ ఫోర్ బిరుదుకు సార్దకత ఉంటుంది. అలాంటిది విరాట్, స్టీవ్ స్మిత్ ఆయా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇకపై వీరిని ఫాబ్ ఫోర్లో సభ్యులుగా పరిగణించలేము. మిగిలిన ఇద్దరిలో రూట్, విలియమ్సన్ కూడా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. పైగా వీరికి పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. వీరిద్దరితో పాటు స్టీవ్ స్మిత్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు.ఫాబ్ ఫోర్కు బీటలు వారిన నేపథ్యంలో కొత్త ఫాబ్ ఫోర్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. విశ్లేషకులు, మాజీలు కొత్త ఫాబ్ ఫోర్‌గా కీర్తించబడేందుకు పలానా ఆటగాళ్లు అర్హులంటూ ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడ కేన్ విలియమ్సన్ కూడా కొత్త ఫాబ్ ఫోర్‌ను ప్రకటించాడు. సొంత దేశ ఆటగాడు రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు కొత్త ఫాబ్ ఫోర్‌గా కీర్తించబడే అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్‌కు కూడా ఫాబ్ ఫోర్లో భాగమయ్యే అర్హతలున్నాయని అన్నాడు. ఈ సందర్భంగా కేన్ టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పాటు టెస్ట్‌ల్లో రాణిస్తేనే ఫాబ్ ఫోర్ అనిపించుకుంటారని తెలిపాడు. తాను వ్యక్తిగతంగా టెస్ట్ క్రికెట్‌కు అమితమైన ఆదరణ ఉన్న జమానాలో ఎదిగినందుకు గర్వపడుతున్నానని అన్నాడు. యువ ఆటగాళ్లు టీ20ల మాయలో పడి టెస్ట్ క్రికెట్‌ను విస్మరించకూడదని సూచించాడు. కేన్ అంచనా వేస్తున్న నయా ఫాబ్ ఫోర్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నారు. అయితే వీరంతా ఇదే ప్రదర్శనను సుదీర్ఘకాలం కొనసాగించగలిగితే ఫాబ్ ఫోర్ అనిపించుకుంటారు. గిల్, బ్రూక్, రచిన్, జైస్వాల్, గ్రీన్ ఆటగాళ్లుగా ఇప్పుడిప్పుడే పరిణితి చెందుతున్నారు. వీరి వయసు కూడా చాలా తక్కువ. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ క్రికెటర్‌గా స్థిరపడేందుకు వీరికి తగినంత సమయం ఉంది. ఇప్పటివకే వీరు కెరీర్లో అత్యుత్తమ దశలను చూశారు. -
IND vs ENG: టీమిండియా ప్రాక్టీస్ షురూ..
భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం మొదలైంది. విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలు వంటి దిగ్గజాలు లేకుండా తొలి టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ భారత జట్టుకు ఇంగ్లండ్ రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది.రోహిత్ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన శుబ్‌మన్ గిల్.. జట్టును ఎలా నడిపిస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్‌లను భారత్ కోల్పోవడంతో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైన కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో గిల్-గౌతీ కాంబనేషన్లో భారత జట్టు ఎలా రాణిస్తుందో మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.టీమిండియా ప్రాక్టీస్ షూరూ..ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆదివారం(జూన్ 8)తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ గిల్ రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్, సిరాజ్ కసరత్తలు చేస్తున్నట్లు కన్పించింది.కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రౌక్స్ కూడా భారత జట్టులో చేరారు. రాజీనామా చేసిన సోహమ్ దేశాయ్ స్ధానంలో అడ్రియన్ బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం..! వీడియో వైరల్𝗣𝗿𝗲𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 ✅First sight of #TeamIndia getting into the groove in England 😎#ENGvIND pic.twitter.com/TZdhAil9wV— BCCI (@BCCI) June 8, 2025 -
ఐపీఎల్ 2025 జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఐపీఎల్ 2025 సీజన్ జూన్ 3న జరిగిన ఫైనల్‌తో ముగిసింది. ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్లో ఆర్సీబీకి ఇది తొలి టైటిల్. 18 ఏళ్ల ప్రస్తానంలో ఆ జట్టు మూడు సార్లు ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నాలుగో ప్రయత్నంలో ఆ జట్టు టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరింది. రెండో ప్రయత్నంలోనూ ఆ జట్టుకు నిరాశే మిగిలింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించినా పంజాబ్ తుది మెట్టుపై బోల్తా పడింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఫైనల్లో ఓడినా పంజాబ్ మంచి మార్కులే కొట్టేసింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. శ్రేయస్ ఐపీఎల్లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను తాజాగా ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఈ సీజన్ స్టార్లందరికీ చోటు దక్కింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ జట్టులో అత్యధికంగా నలుగురు ఆర్సీబీ ఆటగాళ్లకు చోటు దక్కింది. స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లి సహా జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, జోష్ హాజిల్‌వుడ్ చోటు దక్కించుకున్నారు. వికెట్‌కీపర్‌గా జితేశ్ శర్మ ఎంపికయ్యాడు. ఇంపాక్ట్ సబ్‌గా సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను ఎంపిక చేశారు.ఈ జట్టుకు ఓపెనర్లుగా విరాట్ కోహ్లి, గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ ఎంపిక కాగా.. వన్‌డౌన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో ముంబై విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్, ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఆరో స్థానంలో జితేశ్ శర్మ, ఏడో ప్లేస్‌లో శశాంక్ సింగ్, ఆల్‌రౌండర్ల కోటాలో కృనాల్ పాండ్యా, స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, హాజిల్‌వుడ్, ప్రసిద్ద్ కృష్ణ ఎంపికయ్యారు. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చిన ఆటగాళ్లతో ఈ జట్టు ఎంపిక జరిగింది. పంజాబ్ లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ శశాంక్ సింగ్‌కు ఈ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది. ఐపీఎల్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్: విరాట్ కోహ్లి, సాయి సుదర్శన్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శశాంక్ సింగ్, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్, ప్రసిద్ద్ కృష్ణ, నూర్ అహ్మద్ (ఇంపాక్ట్ ప్లేయర్) -
కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది: శుబ్‌మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి సవాల్‌ను ఎదుర్కొనేందుకు శుబ్‌మన్ గిల్ సిద్దమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్‌కు పయనమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేని భారత జట్టును గిల్ ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇంగ్లండ్‌కు బయలుదేరే ముందు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శుబ్‌మన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్లపై కూడా గిల్ మాట్లాడాడు."సాధారణంగా ప్రతీ టూర్లోనూ ఒత్తిడి ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం మాకు నిజంగా గట్టి ఎదురుదెబ్చ అని చెప్పాలి. వారిద్దరూ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు. భారత జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించారు. వారి స్ధానాలను భర్తీ చేయడం చాలా కష్టం. అయితే రోహిత్, కోహ్లి ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అందులో ఎటువంటి మార్పు ఉండదు. మా బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇంకా మేము ఖారారు చేయలేదు. అందుకు మాకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. లండన్‌లో 10 రోజుల ప్రాక్టీస్ క్యాంపును నిర్వహిస్తాము. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడతాము. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌ను నిర్ణయిస్తాము అని గిల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌కు తెరలేవనుంది. ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు -
ఆల్‌ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్‌కు పయనమైన గిల్ సేన (ఫోటోలు)
-
IND Vs ENG: ఇంగ్లండ్‌కు బయలు దేరిన టీమిండియా.. 14 రోజుల ముందే
ఇంగ్లండ్-భారత మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి హెడ్డింగ్లీ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్‌కు పయనమైంది.ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. జట్టు తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు 14 రోజుల ముందే అక్కడకు గిల్ సేన చేరుకోనుంది. జూన్ 13 నుంచి 16 వరకు బెకెన్హామ్ వేదికగా ఇండియా-ఎతో సీనియర్ భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ప్రధాన సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇంగ్లండ్‌కు పయనమవ్వకముందు కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్, గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు.ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు వీరిద్దరూ సమాధనమిచ్చారు. ఈ సిరీస్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు. అదేవిధంగా భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇంకా ఖారారు చేయలేదని, తమకు ఇంకా రెండు వారాల సమయం ఉందని గిల్ పేర్కొన్నాడు.కాగా ఈ సిరీస్‌కు ముందు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి స్ధానాలను ఎవరు భర్తీ చేస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లి స్ధానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్‌కు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనాధికారిక టెస్టు సిరీస్‌లో దుమ్ములేపుతున్నాడు.తొలి అనాధికారిక టెస్టులో నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్
భారత టెస్ట్ జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ హోదాలో శుభ్‌మన్ గిల్ తొలిసారి మీడియా ముందుకు రానున్నాడు. ఇవాళ (జూన్ 5) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌ను హాజరు కానున్నాడు. ఈ సమావేశానికి గిల్‌తో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరవుతాడు.భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగనుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా త్వరలోనే లండన్‌కు బయల్దేరుతుంది. ఈ సమావేశంలో గిల్, గంభీర్ ఇంగ్లండ్‌లో అనుసరించబోయే వ్యూహాలు, తదుపరి డబ్ల్యూటీసీ సైకిల్లో ప్రణాళికల గురించి మీడియాకు వివరిస్తారు. దిగ్గజ ఆటగాళ్లు రోహిత్, విరాట్, అశ్విన్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక జరుగనున్న సిరీస్ కావడంతో ఇంగ్లండ్ టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. గిల్ ఇటీవలే రోహిత్ శర్మ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టాడు. బుమ్రా, పంత్ లాంటి సీనియర్లు ఉన్నా బీసీసీఐ గిల్‌కే టెస్ట్ కెప్టెన్సీ అప్పగించింది. గిల్ నేతృత్వంలో భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం మొదలుకానుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. వీరిని సమన్వయపరుచుకుంటూ గిల్ ఏ మేరకు నెట్టుకు రాగలడో చూడాలి. ఇంగ్లండ్ పర్యటనలో గిల్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) రిషబ్ పంత్‌ను నియమించారు.ఇంగ్లండ్ పర్యటనలో భారత్ జూన్ 20న తొలి టెస్ట్ ఆడనుంది. లీడ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం జులై 2, 10, 23, 31 తేదీల్లో రెండు, మూడు, నాలుగు, ఐదు టెస్ట్ మ్యాచ్‌లు బర్మింగ్హమ్, లార్డ్స్, మాంచెస్టర్, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికలుగా జరుగనున్నాయి. ఈ సిరీస్‌కు ముందు భారత్ జూన్ 13-16 మధ్యలో ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపికైన మెజార్టీ సభ్యులు ఇప్పటికే ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. భారత-ఏ జట్టులో భాగమైన వారు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఇదివరకే ముగిసింది. రెండో మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం భారత టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ముంబై చేతిలో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న గిల్ సోదరి! వీడియో వైరల్
ఐపీఎల్-2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కథ ముగిసింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 20 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. దీంతో ఈ మెగా ఈవెంట్ నుంచి గుజరాత్ నిష్కమ్రించింది. 229 పరుగుల భారీ లక్ష్య చేధనలో సాయిసుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 80), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి.. మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగ్. మ్యాచ్ ఆరంభంలోనే ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు రెండు లైఫ్‌లు వచ్చాయి. వరుస ఓవర్లలో అతడి ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను గుజరాత్ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది.3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్.. ఏకంగా 81 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బౌలర్లు కూడా భారీ పరుగులు సమర్పించుకున్నారు. పేలవ ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగానే ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.కన్నీరు పెట్టుకున్న నెహ్రా ఫ్యామిలీ..ఇక ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్టాండ్స్‌లో కూర్చున్న నెహ్రా కుమారుడు, కూమర్తె ఎక్కి ఎక్కి ఏడ్చారు. ఈ సమయంలో పక్కనే ఉన్న గుజరాత్ కెప్టెన్ గిల్ సోదరి షహ్నీల్ గిల్ కూడా వారిని ఓదర్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా భోవోద్వేగానికి లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 effort on a 𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 occasion 💙@mipaltan seal the #Eliminator with a collective team performance ✌Scorecard ▶ https://t.co/R4RTzjQNeP#TATAIPL | #GTvMI | #TheLastMile pic.twitter.com/cJzBLVs8uM— IndianPremierLeague (@IPL) May 30, 2025 Nehra ka Beta bada hoke humse badla lega 🤣🤣#MIvsGT pic.twitter.com/2j8Z17Hxx1— WTF Cricket (@CricketWtf) May 30, 2025 -
అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ముగిసింది. శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన గుజరాత్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో గుజరాత్ విఫలమైంది. సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ మిగితా బ్యాటర్లు తేలిపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లక్ష్య చేధనలో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పయి 208 పరుగులు చేయగల్గింది. ఇక ఈ హార్ట్‌బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. తమ పేలవ ఫీల్డింగ్ కారణంగానే ఓడిపోయాము అని గిల్ తెలిపాడు."క్రికెట్ అనేది నిజంగా ఒక అద్బుతమైన గేమ్. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడి ఓడిపోయాము. చివరి మూడు, నాలుగు ఓవర్లలో మాకు కలిసి రాలేదు. అయినప్పటికి మేము బాగానే ఆడాము. కచ్చితంగా క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.ఈ మ్యాచ్‌లో మేము మూడు సునాయస క్యాచ్‌లు జారవిడిచాము. ఈజీగా క్యాచ్‌లను వదిలిస్తే బౌలర్లకు పరుగులను నియంత్రించడం అంత సులభం కాదు. సాయిసుదర్శన్, వాషింగ్టన్ సుందర్‌కు మేము ఒకటే మెసేజ్ పంపాము. ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా ఆడాలని వారికి చెప్పాం. జట్టును గెలిపించడమే వారద్దరి లక్ష్యం.మంచు కారణంగా వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఈ సీజన్లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. గత మూడు మ్యాచ్‌లలో మేము స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాము. కానీ జట్టులోని ప్రతీ ఒక్కరూ కూడా మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా సాయిసుదర్శన్ ఒక అద్బుం. ఈ సీజన్లో అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: హార్దిక్ -
GT Vs MI: కీలక మ్యాచ్‌లో రఫ్ఫాడించిన ముంబై.. గుజరాత్‌కు ఝలక్ (ఫొటోలు)
-
భారత-ఎ జట్టు నుంచి తప్పుకున్న శుబ్‌మన్ గిల్..!
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ హైవోల్టేజ్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రధాన సిరీస్‌కు ముందు భారత-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.తొలి టెస్టు మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటర్బరీ వేదికగా, రెండో టెస్టు నార్తాంప్టన్‌లో జూన్ 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. అయితే ఈ అనాధికారిక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా- ఎ జట్టు నుంచి తప్పుకోవాలని గిల్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో గిల్ సభ్యునిగా ఉన్నాడు. ఇంగ్లండ్ కండీషన్స్‌కు అలవాటు పడేందుకు గిల్‌కు ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉపయోగపడతాయని సెలక్టర్లు భావించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కారణంగా తొలి వార్మాప్ మ్యాచ్‌కు గిల్ దూరంగా ఉంటాడని, రెండవ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇండియా-ఎ జట్టులో చేరతారని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు. కానీ ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే భారత-ఎ జట్టు ఇంగ్లండ్‌కు పయనమైంది. ఈ జట్టు కెప్టెన్‌గా దేశవాళీ దిగ్గజం అభిమాన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. జూన్ 13 నుంచి బెకెన్హామ్ వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఇంట్రా స్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ పాల్గోనే అవకాశముంది.ఇంగ్లండ్ పర్యటనకు భారత- ఎ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబేచదవండి: ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్ -
గిల్‌ను కాదు అతడిని కెప్టెన్‌గా సెలక్ట్ చేయాల్సింది: వీరేంద్ర సెహ్వాగ్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. అదేవిధంగా గిల్‌కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు మీడియా రిపోర్ట్లు ప్రకారం.. కెప్టెన్సీ రేసులో నుంచి ఫిట్నెస్, వర్క్‌లోడ్ కారణంగా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడంతో గిల్‌కు జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. కాగా భారత సెలక్టర్ల ముందు గిల్‌తో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అప్షన్స్ కూడా ఉండేవి. కానీ జట్టు దీర్ఘకాలక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీమ్ సెలక్షన్ ప్రెస్మీట్లో తెలిపాడు. అయితే 25 ఏళ్ల గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ,వీరేంద్ర సెహ్వాగ్‌లు తమ మనసులోని మాటను బయటపెట్టారు. ఫిట్నెస్ సమస్యల కారణంగానే బుమ్రా కాదని గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించరాని తివారీ అన్నాడు."భారత టెస్టు కెప్టెన్సీకి శుబ్‌మన్ గిల్ సెకెండ్ బెస్ట్ ఆప్షన్. సెలక్టర్లకు తొలి ఎంపికగా బుమ్రా ఉండేవాడు. కానీ ఫిట్నెస్ సమస్యల వల్ల తుదిజట్టులో ఆడలేని వారికి సారథ్య బాధ్యతలు ఎలా అప్పగిస్తారు. అందుకే తమ సెకెండ్ అప్షన్ అయిన గిల్‌కు జట్టు పగ్గాలను కట్టబెట్టారు" అని క్రిక్‌బజ్ లైవ్ షోలో తివారీ పేర్కొన్నాడు. అయితే తివారీ వ్యాఖ్యలతో సెహ్వాగ్ విభేదించాడు. గిల్‌ను కాకుండా పంత్ కెప్టెన్‌గా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు."కేవలం ఒక్క సిరీస్ కోసం అయితే బుమ్రాను కెప్టెన్‌గా సెలక్ట్ చేయవచ్చు. అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ దీర్ఘకాలనికి అయితే ఈ నిర్ణయం సరైంది కాదు. భారత్ ఒక ఏడాది 10 టెస్టులు ఆడితే, ఆ మ్యాచ్‌లన్నీ బుమ్రా ఆడగలడా అని ఆడగాలి? లేదా అతడు ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండగలడు అని ప్రశ్నించాలి. కెప్టెన్‌ను ఎంపిక చేయడంలో అది ఒక ప్రధాన అంశం.కానీ సెలక్టర్లు ఆ ఒత్తిడిని, వర్క్‌లోడ్‌ను బుమ్రాపై పెట్టాలనుకోలేదు. అందుకే అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు. సెలక్టర్లు తీసుకుంది సరైన నిర్ణయం అని నేను కూడా భావిస్తున్నాను. అయితే కెప్టెన్సీకి గిల్ రెండవ బెస్ట్ ఆప్షన్ అని తివారీ అన్నారు. నా దృష్టిలో టీమిండియాకు సారథిగా రిషభ్ పంత్ సెకండ్ బెస్ట్ ఆప్షన్. టెస్ట్ క్రికెట్‌కు పంత్ చేసినంతగా, ఇతర మరే ఇతర ఆటగాడు చేయలేదు. విరాట్ కోహ్లి తర్వాత టెస్టు క్రికెట్ చూసేలా చేసిన ప్లేయర్ పంత్. కారు ప్రమాదం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత పంత్ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. దీన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. అతడు తిరిగి తన ఫామ్‌ను అందుకంటే, భవిష్యత్తులో అతన్ని కెప్టెన్‌గా చేసే నిర్ణయాన్ని సెలక్టర్లు తీసుకొవచ్చు.అందుకే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే భారత టెస్టు సారథిగా చాలా కొద్ది మంది బౌలర్లరే వ్యవహరించారు.నేను క్రికెట్ ఆడిన కాలంలో కేవలం అనిల్‌కుంబ్లేనే ఈ ఫీట్ సాధించాడు. అదేవిధంగా అన్ని మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులో ఉన్నాడని" సెహ్వాగ్ విశ్లేషించాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. -
టీమిండియా కొత్త కెప్టెన్‌కు గవాస్కర్ వార్నింగ్!?
భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ నుంచి భారత టెస్టు కెప్టెన్‌గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది.గిల్‌కు తన మొదటి పరీక్షలోనే కఠిన సవాలు ఎదురుకానుంది. ఎందుకంటే వారి సొంతగడ్డపై ఇంగ్లీష్ జట్టును ఓడించడం అంతసులువు కాదు. అంతకుతోడు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేరు. ప్రస్తుతం భారత జట్టులో ముగ్గురు నలుగురికి మినహా ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. గిల్‌కు కూడా ఇంగ్లీష్ కండీషన్స్‌లో ఆడిన అనుభవం లేదు. దీంతో గిల్ కెప్టెన్‌గా తన మొదటి ఎసైన్మెంట్లో ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్‌పై ఇప్పుడు అదనపు ఒత్తిడి ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు."భారత కెప్టెన్‌గా ఎంపికైన ఆటగాడిపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే జట్టు సభ్యుడిగా ఉండటానికి, కెప్టెన్‌గా వ్యవహరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే టీమ్ మెంబర్‌గా ఉన్నప్పుడు సాధారణంగా మీకు క్లోజ్‌గా ఉన్న ఆటగాళ్లతో ఎక్కువగా సంభాషిస్తారు. కానీ కెప్టెన్ అయినప్పుడు, జట్టులోని ఇతర ఆటగాళ్ళు మిమ్మల్ని గౌరవించే విధంగా మీరు ప్రవర్తించాలి. కెప్టెన్ ప్రవర్తన అతని ప్రదర్శన కంటే ముఖ్యమైనది" అంటూ స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సిరాజ్చదవండి: IPL 2025: 'పంత్‌ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్ -
అందుకే సర్ఫరాజ్‌పై వేటు!.. రీఎంట్రీకి అతడు అర్హుడు: పుజారా
ఐపీఎల్-2025 తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటన (India vs England)తో బిజీకానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి సిరీస్ జరుగునుంది. ఇందుకు సంబంధించి శనివారమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించింది.వారికి గ్రీన్ సిగ్నల్పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన బృందానికి యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఇంగ్లండ్‌తో టెస్టులతో సారథిగా అతడి ప్రయాణం మొదలుకానుంది. ఇక ఈ జట్టులో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ చోటు దక్కించుకోగా.. అర్ష్‌దీప్ సింగ్ కూడా తొలిసారి టెస్టు టీమ్‌లోకి వచ్చాడు. కరుణ్ రీ ఎంట్రీచాలా ఏళ్ల తర్వాత ‘ట్రిపుల్ సెంచూరియన్’ కరుణ్ నాయర్‌కు కూడా అవకాశం దక్కింది. మరోవైపు.. శార్దూల్ ఠాకూర్ కూడా పునరాగమనం చేశాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టెస్టులు ఆడే జట్టులో చోటివ్వలేదు. ఈ పరిణామాలపై టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా స్పందించాడు. అందుకే సర్ఫరాజ్‌పై వేటు!‘‘ఆసియా, ఉపఖండ పిచ్‌లపై సర్ఫరాజ్ ఖాన్ విజయవంతమైన ఆటగాడిగా ఉన్నాడు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో అతడు రాణించలేడని సెలక్టర్లు భావించి ఉండవచ్చు. అందుకే.. అతడికి ఈ జట్టులో చోటు ఇవ్వలేదనుకుంటా. అంతేకాదు.. అతడికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం సర్ఫరాజ్ ఫిట్నెస్ గురించి నాకైతే సమాచారం లేదు. ఫిట్‌గా ఉండేందుకు అతడు అన్ని రకాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాడని మాత్రం తెలుసు.రీఎంట్రీకి అతడు అర్హుడుఏదేమైనా దురదృష్టవశాత్తూ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, కరుణ్ నాయర్ ఎంపిక పట్ల సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్న అతడు జట్టులో చోటుకు అర్హుడు’’ అని పుజారా హిందుస్తాన్ టైమ్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా అడే అవకాశం రాలేదు.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు కౌంటీల్లోనూ రాణిస్తున్న పుజారా సైతం టెస్టు జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, అతడి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.చదవండి: కోపంతో ఊగిపోయిన సిరాజ్.. ఇదేంటి మియా?.. అతడి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? -
కోపంతో ఊగిపోయిన సిరాజ్.. ఇదేంటి మియా?.. ఇలాగేనా ప్రవర్తించేది?
గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు కోపమొచ్చింది. సహచర ఆటగాడిపై మైదానంలోనే అతడు కోపంతో ఊగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. విషయమేమిటంటే..చేదు అనుభవంఐపీఎల్-2025 (IPL 2025) లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో శుబ్‌మన్ సేన 83 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగాలంటే మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ ఆది నుంచే గుజరాత్‌కు కలిసిరాలేదు. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 230 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34), డెవాన్ కాన్వే (35 బంతుల్లో 52) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37) దానిని కొనసాగించాడు.The word 'fear' isn't in their dictionary 🔥#CSK's young guns Ayush Mhatre and Urvil Patel added to the Ahmedabad heat with their knocks 👏Updates ▶ https://t.co/P6Px72jm7j#TATAIPL | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/KcM4XW9peg— IndianPremierLeague (@IPL) May 25, 2025 ఇక శివం దూబే (8 బంతుల్లో 17) కాసేపు మెరుపులు మెరిపించగా.. డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57) ధనాధన్ దంచికొట్టాడు. రవీంద్ర జడేజా (18 బంతుల్లో 21 నాటౌట్) కూడా ఈసారి ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.అదనపు పరుగులుకాగా సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న ఉర్విల్ పటేల్.. మిడాఫ్ దిశగా బాల్‌ను తరలించాడు. కాన్వేతో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్నాడు. అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ డైరెక్ట్ త్రో ద్వారా వికెట్లను గిరాటేయాలని చూడగా.. మిస్ ఫీల్డ్ అయింది. ఓవర్ త్రో కారణంగా చెన్నై మరో పరుగు తీయగలిగింది.ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గిల్ వేసిన ఓవర్ త్రోను అందుకునేందుకు స్క్వేర్ లెగ్ వద్ద నుంచి పరిగెత్తుకు వచ్చిన ఆర్. సాయి కిషోర్ బంతిని అందుకుని మిడ్ వికెట్ వద్ద కలెక్ట్ చేసుకున్నాడు. అనుకోకుండా బంతి అతడి నుంచి చేజారగా.. ఇంతలో సీఎస్కే బ్యాటర్లు మూడో పరుగు కూడా పూర్తి చేసుకున్నారు.ఇదేంటి మియా? ఇలాగేనా ప్రవర్తించేది?దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ కిషోర్‌ను ఉద్దేశించి గట్టిగానే తిట్టినట్లు కనిపించింది. అంతేకాదు.. బంతిని కూడా గ్రౌండ్‌కేసి కొడుతూ తన ఆగ్రహం వెళ్లగక్కాడు. ఇంతలో గిల్ వచ్చి సిరాజ్ భుజం తడుతూ నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘ఇదేంటి మియాన్’’ అంటూ ఇలాగేనా ప్రవర్తించేది? అన్నట్లుగా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కాగా లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన గుజరాత్... 18.3 ఓవర్లలో కేవలం 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది. చదవండి: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గాpic.twitter.com/8UKU1ibO6o— The Game Changer (@TheGame_26) May 25, 2025 -
Shubman Gill: ‘గొప్ప గౌరవం... పెద్ద బాధ్యత’
ముంబై: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో విదేశీ గడ్డపై అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మినహా మన జట్టు రికార్డు పేలవంగానే ఉంది. సహజంగానే సిరీస్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు కెప్టెన్సీపై కూడా అందరి దృష్టీ ఉంటుంది. ఇప్పుడు టీమిండియా టెస్టు కెప్టెన్ హోదాలో శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలిసారి బరిలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో సారథిగా తనపై అనవసరపు ఒత్తిడిని పెంచుకోనని గిల్ స్పష్టం చేశాడు. కెపె్టన్‌గా ఎంపికైన తర్వాత అతను బీసీసీఐ మీడియాతో తన స్పందనను పంచుకున్నాడు. బ్యాటర్‌గా కూడా తన బాధ్యత నెరవేర్చడం ముఖ్యమని అతను అన్నాడు. ‘ఒక విషయంలో నేను చాలా స్పష్టంగా ఉండదల్చుకున్నాను. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను బ్యాటర్‌గానే ఆలోచిస్తాను. అదే కోణంలో నిర్ణయాలు తీసుకుంటాను తప్ప కెప్టెన్ హోదా గురించి పట్టించుకోను. బ్యాటింగ్ చేస్తూ కూడా ఇతర అంశాలపై దృష్టి పెడితే సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. అది అవసరం లేదు. నేను కెప్టెన్‌ను అనే భావనే రాకుండా నా బ్యాటింగ్‌తో ఏం చేయగలననేది ముఖ్యం’ అని గిల్ వ్యాఖ్యానించాడు. భారత కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్న గిల్... అదో పెద్ద బాధ్యత అని అభిప్రాయపడ్డాడు. ‘చిన్నప్పుడు క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు భారత్‌కు ఆడితే చాలనుకుంటాం. ఆ తర్వాత ఎక్కువ కాలం టెస్టులు ఆడితే బాగుంటుందని భావిస్తాం. అలాంటిది ఇప్పుడు కెప్టెన్ కావడం గొప్ప గౌరవం. ఇంత పెద్ద బాధ్యత నాకు దక్కిన గొప్ప అవకాశం. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని గిల్ భావోద్వేగం ప్రదర్శించాడు.ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడంతో పాటు ఏ సమయంలో కెప్టెన్ అవసరం జట్టుకు ఉంటుందని గుర్తించడం కూడా కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవలే టెస్టుల నుంచి రిటైర్ అయిన కోహ్లి, రోహిత్, అశ్విన్‌ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని... విదేశాల్లో ఎలా గెలవాలో వారు చూపించారని కొత్త కెప్టెన్ అన్నాడు. ‘రోహిత్, విరాట్, అశ్విన్ విదేశాల్లో టెస్టులు, సిరీస్‌లు ఎలా గెలవాలనే విషయంలో ఒక ‘బ్రూప్రింట్’ను అందించారు. దీనిని అమలు చేయగలగాలి. విరాట్, రోహిత్‌ల నాయకత్వంలో ఆడటం నా అదృష్టం. బయటకు కనిపించడంలో ఇద్దరి శైలి భిన్నమే అయినా...మైదానంలో అటాకింగ్ చేసే విషయంలో ఇద్దరూ దూకుడుగానే ఉంటారు. ఎప్పటికిప్పుడు మాట్లాడుతూ ఆటగాళ్లనుంచి తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పే రోహిత్ కెప్టెన్సీ పద్ధతిని నేను నేర్చుకున్నాను’ అని గిల్ వివరించాడు. -
శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా ప్రకటించిన బీసీసీఐ
-
సీకే నాయుడు నుంచి శుబ్‌మన్ గిల్ వరకు...
అంచనాలకు అనుగుణంగానే యువ ఆటగాడు శుబ్‌మన్‌గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నెలలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం... గిల్ సారథ్యంలో 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల గిల్‌ను ఎంపిక చేసింది. సీకే నాయుడు భారత తొలి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించగా... ఇప్పుడు గిల్ 37వ కెప్టెన్ కానున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహించిన ప్లేయర్ల జాబితా... -
‘శుబ్’ సమయం మొదలు
భారత టెస్టు క్రికెట్‌కు కొత్త నాయకుడు వచ్చాడు...నాలుగున్నరేళ్ల కెరీర్ అనుభవం ఉన్న శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు... 93 ఏళ్ల భారత టెస్టు చరిత్రలో 37వ సారథిగా గిల్ బాధ్యతలు చేపడుతున్నాడు...గత కొంత కాలంగా చర్చ సాగినట్లుగా ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండా సెలక్టర్లు 25 ఏళ్ల గిల్‌కే మద్దతు పలికారు... ఇంగ్లండ్ పర్యటనలో అతను తొలిసారి టెస్టు జట్టును నడిపించనున్నాడు. టెస్టు జట్టులో సాయిసుదర్శన్, అర్ష్ దీప్ లకు తొలి అవకాశం లభించగా...ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్ మళ్లీ టీమ్‌లోకి రావడం విశేషం. ముంబై: ఇంగ్లండ్‌తో గడ్డపై జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందానికి శుబ్‌మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఆసీస్‌తో సిరీస్‌లో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించినా...అతని ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్సీ కోసం బుమ్రా పేరును పరిశీలించలేదు. కోహ్లి, రోహిత్, అశ్విన్‌ల శకం ముగిసిన తర్వాత భవిష్యత్తు కోసం టీమ్‌ను సిద్ధం చేసే కోణంలో జట్టు ఎంపిక జరిగింది. 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ పాల్గొనే తొలి సిరీస్ ఇదే కానుంది. భారత జట్టు చివరిసారిగా ఆ్రస్టేలియాలో ఆడిన టెస్టు సిరీస్‌తో పోలిస్తే జట్టులో ఐదు మార్పులు జరిగాయి. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ కాగా...రెండు టెస్టులు ఆడిన పేసర్ హర్షిత్ రాణా, ఒక్క మ్యాచ్ కూడా ఆడని బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానం కోల్పోయారు. వీరి స్థానాల్లో కరుణ్ నాయర్, సాయిసుదర్శన్, అర్ష్ దీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత... 33 ఏళ్ల కరుణ్ నాయర్ తన కెరీర్లో 6 టెస్టులు ఆడాడు. తన మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై 303 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతను...సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత మరో 3 టెస్టులు మాత్రమే ఆడి జట్టులో 2017లో జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో 9 మ్యాచ్‌లలో 863 పరుగులు సాధించి రేసులోకి వచ్చాడు. కోహ్లి రిటైర్మెంట్తో మిడిలార్డర్లో ఖాళీ ఏర్పడి మరో అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్లో, భారత్ ‘ఎ’ తరఫున టన్నుల కొద్దీ పరుగులు చేసి అభిమన్యు ఈశ్వరన్‌కు మరోసారి పిలుపు లభించింది. ఇక ఇప్పటికీ వన్డేలు, టి20లు ఆడిన పేసర్ అర్ష్ దీప్ సింగ్, సాయి సుదర్శన్‌కు టెస్టుల్లో ఇదే తొలి అవకాశం. షమీ అవుట్... సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించినట్లుగానే చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత వన్డేలు, టి20లు ఆడినా...టెస్టు మ్యాచ్‌లకు తగిన స్థాయిలో అతని ఫిట్నెస్ లేదని సెలక్టర్లు తేల్చారు. కివీస్‌తో సిరీస్‌లో చివరి రెండు టెస్టుల్లో విఫలమై మళ్లీ మ్యాచ్ అవకాశం దక్కని సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా పక్కన పెట్టారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రాణాను కూడా ఎంపిక చేయలేదు. ‘కోహ్లి, రోహిత్, అశ్విన్‌లాంటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం కష్టం. అయితే కొత్తగా జట్టులోకి వచ్చే వారికి తమ సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. ఫిట్నెస్ సమస్యల కారణంగా బుమ్రా అన్నీ టెస్టులూ ఆడతాడనే నమ్మకం లేదు. అందుకే కెప్టెన్సీ భారం లేకుండా అతను బౌలర్‌గా మాకు అందుబాటులో ఉంటే చాలు. ఈ విషయాన్ని బుమ్రా కూడా అర్థం చేసుకున్నాడు. గిల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న విషయాన్ని గమనించాం. చాలా మంది అభిప్రాయాలు కూడా విన్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే కెప్టెన్, జట్టును ఎంపిక చేశాం. ప్రస్తుత స్థితిలో సర్ఫరాజ్‌తో పోలిస్తే అనుభవజ్ఞుడైన కరుణ్ సరైనవాడు అనిపించింది’ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించారు. భారత జట్టు వివరాలు గిల్ (కెప్టెన్ ), పంత్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, జురేల్, జడేజా, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్, సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, సుందర్, శార్దుల్, అర్ష్ దీప్ భారత జట్టు విజేతగా నిలిచిన 2020–21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో శుబ్‌మన్ గిల్ టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. 91 పరుగులతో చారిత్రాత్మక గాబా టెస్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టెస్టు టీమ్‌లో గిల్ రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. భారత జట్టు ఆడిన రెండు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లలో గిల్ ఆడాడు. 32 టెస్టుల కెరీర్లో గిల్ 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.స్వదేశంలో ప్రదర్శనతో పోలిస్తే విదేశీ గడ్డపై అతని రికార్డు పేలవంగా ఉన్నా...మంచి ప్రతిభావంతుడైన బ్యాటర్‌గా మున్ముందు సత్తా చాటగలడని సెలక్టర్లు నమ్ముతున్నారు. భారత అండర్–19 జట్టు తరఫున ఆడినా అతను కెపె్టన్‌గా ఎప్పుడు వ్యవహరించలేదు. రంజీ ట్రోఫీలో కూడా పంజాబ్‌కు ఒకే ఒక మ్యాచ్‌లో సారథ్యం వహించాడు. అయితే భారత్‌కు 5 టి20 మ్యాచ్‌లలో కెప్టెన్ గా పని చేసిన అనుభవం గిల్‌కు ఉంది. రెండు సీజన్లుగా ఐపీఎల్లో గుజరాత్ జట్టును నడిపిస్తున్నాడు. -
ఇది కదా సక్సెస్ అంటే.. 25 ఏళ్లకే టీమిండియా కెప్టెన్‌గా
భారత టెస్టు క్రికెట్ జట్టుకు కొత్త నాయకుడొచ్చాడు. రోహిత్ శర్మ వారసుడు ఎవరో తేలిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించినట్టే గిల్‌కే భారత జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పంజాబీ క్రికెటర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామని ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్పేర్కొన్నాడు.ఇక అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగిన గిల్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కదా సక్సెస్ అంటూ గిల్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. గిల్ 2020లో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు.25 ఏళ్ల వయస్సులోనే?భారత టెస్టు జట్టుకు 17 ఏళ్ల తర్వాత యువ కెప్టెన్ వచ్చాడు. 2008లో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుంచి భారత టెస్టు జట్టు పగ్గాలను ఎంఎస్ ధోని చేపట్టాడు. అప్పటికి ధోని వయస్సు 27 ఏళ్లు. ఆ తర్వాత 8 ఏళ్ల పాటు భారత జట్టును మిస్టర్ కూల్ నడిపించాడు. అనంతరం 2014 డిసెంబరులో ధోనీ నుంచి కోహ్లికి టెస్టు కెప్టెన్సీ దక్కింది. అప్పటికి విరాట్‌కు 27 ఏళ్లు. కోహ్లి సరిగ్గా ఏడేళ్ల పాటు రెడ్‌బాల్ ఫార్మాట్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. కోహ్లి నాయకత్వంలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. 2021 ఆఖరిలో కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో అతడి వారుసుడిగా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యేటప్పటికి అతడి వయస్సు 34 ఏళ్లు. ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్‌మన్ గిల్ 25 ఏళ్ల వయస్సులోనే కొత్త టెస్టు కెప్టెన్‌గా నియిమితుడయ్యాడు. దీంతో దిగ్గజ కెప్టెన్లు ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల కంటే అతి తక్కువ వయస్సులోనే టీమిండియా నాయకుడిగా ఎంపికై గిల్ చరిత్ర సష్టించాడు.ఓవరాల్‌గా భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంపికైన ఐదవ అతి పిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు. గిల్ ప్రస్తుత వయస్సు 25 సంవత్సరాల 285 రోజులు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల 77 రోజులు) అగ్రస్దానంలో ఉన్నాడు.👉గిల్ ఇప్పటివరకు 32 టెస్టులు ఆడి 35.06 సగటుతో 1893 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 7 హాఫ్ సెంచరీలు, ఐదు శతకాలు ఉన్నాయి.టెస్టుల్లో అతి పిన్న వయస్కులైన భారత కెప్టెన్లు వీరే..మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల, 77 రోజులు)సచిన్ టెండూల్కర్ -(23 సంవత్సరాల, 169 రోజులు)కపిల్ దేవ్ (24 సంవత్సరాల, 48 రోజులు)రవి శాస్త్రి (25 సంవత్సరాల, 229 రోజులు)శుబ్మాన్ గిల్ (25 సంవత్సరాల, 285 రోజులు)చదవండి: ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ -
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. అధికారిక ప్రకటన
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. అదేవిధంగా శుబ్‌మన్ గిల్ డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను నియమించారు. ఇక ఐపీఎల్లో దుమ్ములేపుతున్న యువ సంచలనం సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. మరోవైపు దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ నాయర్‌తో పాటు శార్ధూల్ ఠాకూర్ కూడా తిరిగి టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. ఈ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడం అందరి ఆశ్చర్యపరిచింది.అదేవిధంగా ఆసీస్ టూర్లో భాగమైన హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు ఈసారి మొండి చేయి చూపించారు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq— BCCI (@BCCI) May 24, 2025 -
టీమిండియా సారథిగా శుబ్‌మన్ గిల్ ఫిక్స్!.. వైస్ కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. బీసీసీఐ శనివారం ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టుతో పాటు కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ పేరును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అదేవిధంగా గిల్‌కు డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను నియమించాలని అజిత్ అగార్కర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇంగ్లండ్ పర్యటనకు స్టార్ పేసర్ మహ్మద్ షమీని పక్కన పెట్టాలని సెలక్టర్లు డిసైడనట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. షమీ తన మడమ గాయం కారణంగా లాంగ్ స్పెల్స్ వేసేందుకు ఇంకా సిద్దంగా లేనట్లు బీసీసీఐ వైద్య బృందం ధ్రువీకరించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సాయిసుదర్శన్, కరుణ్ నాయర్లకు భారత టెస్టు జట్టులో చోటు ఖాయమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20 నుంచి 24 లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. కాగా ఈ కీలక సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు(అంచనా): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, దృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షి దేష్, ప్రశీద్, షర్షి దేష్, ప్రశిద్ కుల్దీప్ యాదవ్.చదవండి: రూ.25 లక్షలు మోసపోయిన దీప్తీ శర్మ..? సహచర క్రికెటర్‌పై కేసు నమోదు -
వారి ఆట అద్భుతం.. మేం కూడా నిరూపించుకున్నాం: పంత్
ఐపీఎల్-2025లో లక్నోసూపర్ జెయింట్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో.. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టింది. గుజరాత్ జట్టును 33 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది. లక్నో విజయంపై కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు.మ్యాచ్ ముగిసిన అనంతరం, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. విజయం పట్ల కచ్చితంగా సంతోషంగా ఉంది. ఓ జట్టుగా మేము మంచి క్రికెట్ ఆడగలమని నిరూపించాం. టోర్నమెంట్లో మాకు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినా రేసులో లేము. కానీ అది ఆటలో భాగం. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. టాప్ త్రీలో చోటు సంపాదించడం ఎప్పుడూ సులభం కాదు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చేశాం. మరికొంత మెరుగు కావాల్సి అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ఓటమి ద్వారా జట్టులో కొన్ని లోపాలు, సానుకూల అంశాలను తెలుసుకున్నాం. పవర్‌ప్లేలో మేము బాగా బౌలింగ్ చేశాం. కానీ, అనుకున్న ప్రకారం వికెట్టు సాధించలేకపోయాం. మా బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. వారిని 210 దగ్గర ఆపాలనుకున్నాము. 210కి 230 మధ్య భారీ తేడా ఉంటుంది. 240 పరుగులను ఛేదించడం ఎప్పుడూ సులభం కాదు. రూథర్‌ఫోర్డ్, షారుఖ్ బ్యాటింగ్ మాకు పెద్ద పాజిటివ్ అంశం. ప్లేఆఫ్‌లోకి వెళ్లే క్రమంలో మళ్లీ పుంజుకుని విజయం సాధిస్తామని తెలిపాడు.ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10×4, 8×6) మెరుపు శతకం సాధించడంతో ఎల్ఎస్జీ 2 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. నికోలస్ పూరన్ (56 నాటౌట్; 27 బంతుల్లో 4×4, 5×6), మార్క్రమ్ (36; 24 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 9 వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. షారుఖ్ ఖాన్ (57; 29 బంతుల్లో 5×4, 3×6) టాప్‌స్కోరర్. ఎల్ఎస్జీ బౌలర్లలో ఒరూర్క్ (3/27), ఆయుష్ బదోని (2/4) రాణించారు. 13 మ్యాచ్‌ల్లో గుజరాత్‌కిది 4వ ఓటమి కాగా.. లక్నో ఆరో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సాయి సుదర్శన్ (21) ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. -
గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో..
IPL 2025 GT vs LSG Live Updates: ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి.గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో..గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది.టైటాన్స్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫన్ రూథర్‌ఫర్డ్(38),బట్లర్(33), శుబ్‌మన్ గిల్(35) తమవంతు ప్రయత్నం చేశారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. బదోని రెండు, ఆకాష్ మహారాజ్ సింగ్,అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.గుజరాత్ నాలుగో వికెట్ డౌన్..రూథర్‌ఫర్డ్ రూపంలో గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రూథర్‌ఫర్డ్.. ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 23 బంతుల్లో 54 పరుగులు కావాలి. క్రీజులో షారుఖ్ ఖాన్(49) ఉన్నాడు.దూకుడు పెంచిన షారుఖ్, రూథర్‌ఫర్డ్14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో షారుఖ్ ఖాన్(27),రూథర్ ఫర్డ్(25) ఉన్నారు.గుజరాత్ మూడో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన బట్లర్.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.గుజరాత్ రెండో వికెట్ డౌన్శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన గిల్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.గుజరాత్ తొలి వికెట్ డౌన్..సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. విలియం ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(24), జోప్ బట్లర్(20) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్..33 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(15), సాయిసుదర్శన్(16) ఉన్నారు.గుజరాత్ ముందు భారీ టార్గెట్..అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాటన్స్తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(56), మార్క్రమ్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ఆర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీ..లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ తొలి ఐపీఎల్ సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాఛ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. కేవలం 56 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో మార్ష్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 16 ఓవర్లకు లక్నో స్కోర్: 180/115 ఓవర్లకు లక్నో స్కోర్: 160/115 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(89), పూరన్(29) ఉన్నారు.లక్నో తొలి వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన మార్క్రమ్.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(51), పూరన్(6) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు..6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(28), మార్ష్(22) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు..3 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(8), మార్క్రమ్(15) ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నామాత్రపు మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి మద్దతుగా లావెండర్ జెర్సీతో బరిలోకి దిగింది.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, విలియం ఒరూర్కేగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ -
కెప్టెన్‌గా బుమ్రా.. సుదర్శన్‌కు దక్కని చోటు!.. శార్దూల్‌కు ఛాన్స్!
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడే జట్టు ప్రకటన ఎప్పుడు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. మాజీ క్రికెటర్లలో దిగ్గజం సునిల్ గావస్కర్ సహా వసీం జాఫర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ తదితరులు జస్ప్రీత్ బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సూచిస్తున్నారు.మరోవైపు.. రవిశాస్త్రి వంటి మరికొంత మంది మాజీలు యువకుడైన శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని, పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న బుమ్రాపై అదనపు భారం వద్దని అభిప్రాయపడుతున్నారు.కాగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఈ సిరీస్‌తో టీమిండియా టెస్టు చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇద్దరు స్టార్ల నిష్క్రమణ తర్వాత తొలిసారి విదేశీ గడ్డపై రెడ్‌బాల్ క్రికెట్లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.వసీం జాఫర్ ఎంచుకున్న జట్టు ఇదేఇక మే 24న బీసీసీఐ ఇంగ్లండ్ టూర్‌కు జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈలోపే భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పదహారు మంది సభ్యులతో కూడిన తన జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేసిన వసీం.. శుబ్‌మన్‌ను అతడికి డిప్యూటీగా నియమించాడు.సాయి సుదర్శన్, నితీశ్‌లకు మొండిచేయిఅయితే, మొదటి నుంచి రేసులో ఉన్న సాయి సుదర్శన్ పేరును మాత్రం వసీం జాఫర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఐపీఎల్-2025లో అదరగొడుతున్న ఈ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్‌ను కాదని.. టెస్టు స్పెషలిస్టు, ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత్-ఎ జట్టు కెప్టెన్ అయిన అభిమన్యు ఈశ్వరన్‌కు పెద్దపీట వేశాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో ఆకట్టుకున్న ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా వసీం జాఫర్ మొండిచేయి చూపాడు. అతడికి బదులు సీనియర్ శార్దూల్ ఠాకూర్‌వైపే మొగ్గుచూపాడు.శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్‌కు స్థానమిచ్చిన వసీం జాఫర్.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్లకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపాడు. ఇక స్పిన్ దళంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్‌కు చోటిచ్చాడు ఈ మాజీ క్రికెటర్.అదే విధంగా.. ఫాస్ట్ బౌలర్ల బృందంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు చోటిచ్చిన వసీం జాఫర్.. నాలుగో ఆప్షన్‌గా అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టులకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్.. మరి మీ ఎంపిక ఏమిటంటూ క్రికెట్ ప్రేమికులను అడగ్గా.. మెజారిటీ మంది అతడి జట్టుతోనే ఏకీభవిస్తున్నారు. కాగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.ఇంగ్లండ్‌తో టెస్టులకు వసీం జాఫర్ ఎంచుకున్న భారత జట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్/ప్రసిద్ కృష్ణ/ అకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్.చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు -
అతడొక అద్బుతం.. గిల్‌ను మించిపోయాడు: జడేజా
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 61 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు.అతడి విధ్వంసర ఇన్నింగ్స్ ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. అతడితో పాటు గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్‌పై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు.సుదర్శన్ తన ప్రదర్శనలతో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను మించిపోయాడని జడేజా కొనియాడాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సుదర్శన్ 12 మ్యాచ్‌లు ఆడి 56.10 సగటుతో 617 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ సాయిసుదర్శన్ వద్దే ఉంది."సాయి సుదర్శన్ అద్బుతమైన బ్యాటర్. అతడి బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంది. ఈ ఏడాది సీజన్లో సుదర్శన్ తన ప్రదర్శనలతో శుబ్‌మన్ గిల్‌ను మించిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే కాదు, అంతకుముందు మ్యాచ్‌లలో కూడా గిల్ కంటే మెరుగ్గా రాణించాడు.శుబ్మన్తో పోలిస్తే సుదర్శన్ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో తొలుత గిల్ బంతిని టైమ్ చేయడానికి కాస్త కష్టపడ్డాడు. గిల్ బంతిని స్టాండ్స్‌కు తరలించేందుకు తన బలాన్ని మొత్తాన్ని ఉపయోగించాడు. కానీ సాయి విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడు చాలా సులువుగా షాట్లు ఆడాడు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడేజా పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్-2025లో దారుణ ప్రదర్శన.. కేకేఆర్ హెడ్ కోచ్‌పై వేటు? -
IPL 2025: గుజరాత్ దర్జాగా...
200 పరుగుల లక్ష్యం. ఛేదించే జట్టుకు ఏమాత్రం సులువు కానేకాదు. కానీ ఇద్దరే ఇద్దరు... గుజరాత్ ఓపెనర్లు దంచేశారు. అంతపెద్ద లక్ష్యాన్ని సులువుగా కరిగించేశారు. సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ పోటీపడ్డారు. పరుగు పెట్టేందుకు... ఫోర్లు బాదేందుకు... సిక్సర్లు కొట్టేందుకు ఇలా ప్రతిదానికి ఆఖరుదాకా పోటీపడి మరీ సాధించడంతో కఠిన లక్ష్యం కూడా ఓ ఓవర్‌కు ముందే కరిగిపోయింది. అంత చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో కుంగిపోయింది. అంతేకాదు గుజరాత్ దర్జాగా సాధించిన విజయంతో తమతోపాటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లను కూడా ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లింది. ఇక మిగిలింది ఒకే ఒక్క బెర్త్. దీని కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కాచుకున్నాయి. మరి ఆఖరి బెర్త్ ఎవరిని వరిస్తుందో చూడాలి. న్యూఢిల్లీ: ఓపెనర్ల గర్జనతో గుజరాత్ టైటిల్స్ దర్జాగా ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సంపాదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఢిల్లీ బౌలింగ్‌ను దంచికొట్టారు. దీంతో టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. అర్షద్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ అజేయంగా, ఆకాశమే హద్దుగా చెలరేగారు. నెల నిషేధం ముగియడంతో గుజరాత్ తరఫున రబడ ఈ మ్యాచ్ బరిలోకి దిగాడు. రాహుల్ 112 నాటౌట్ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచి ఆఖరుదాకా నడిపించింది... పరుగులు రాబట్టింది ఒకే ఒక్కడు రాహుల్. డుప్లెసిస్ (5)తో ఓపెనింగ్ వికెట్ ఎంతోసేపు నిలబడలేదు. ఆరంభంలో స్కోరులో ఏమాత్రం జోరు లేదు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 28/1. పవర్‌ప్లేలో కనీసం బంతికో పరుగైనా చేయలేదు. అయితే ఆరో ఓవర్లో రాహుల్ రెండు సిక్స్‌లు, ఓ బౌండరీ బాదడంతో క్యాపిటల్స్ 45/1 స్కోరుతో కోలుకుంది. అభిషేక్ పొరెల్ (19 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అడపాదడపా భారీషాట్లు బాదాడు. రాహుల్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. రబడ 11వ ఓవర్లో పొరెల్, రాహుల్ చెరో సిక్సర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దీంతో మరుసటి ఓవర్లోనే క్యాపిటల్స్ 100 మార్క్‌ను దాటింది. కానీ ఆఖరి బంతికి పొరెల్ వికెట్‌ను కోల్పోయింది. దీంతో రెండో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కెపె్టన్ అక్షర్ పటేల్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాగా... రాహుల్ ధాటిని పెంచాడు. 14వ ఓవర్లో వరుసగా 3 బౌండరీలు కొట్టాడు. అక్షర్ కూడా 4, 6తో దంచేపనిలో పడ్డాడు కానీ మరుసటి ఓవర్లోనే ప్రసి«ద్కృష్ణకు వికెట్ సమరి్పంచుకున్నాడు. 19వ ఓవర్లో 6, 4 బాదిన రాహుల్ 60 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. స్టబ్స్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్స్‌లు) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఆరంభం నుంచే ధనాధన్ తొలి ఓవర్లో సాయి సుదర్శన్ బౌండరీతో శుబ్‌మన్ సిక్స్‌తో తమ ఖాతా తెరవడం ద్వారా లక్ష్యానికి దీటైన ఆరంభమిచ్చారు. నటరాజన్ వేసిన రెండో ఓవర్‌ను సుదర్శన్ 6, 4, 4, 0, 2, 4లతో చితగ్గొట్టాడు. దీంతో 20 పరుగులు వచ్చాయి. అక్షర్ మూడో ఓవర్లో మరో రెండు బౌండరీలు బాదాడు. టైటాన్స్ 6 ఓవర్లలో 59/0 స్కోరు చేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరు చక్కని సమన్వయంతో ఆడటంతో పరుగులకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ క్రమంలో మొదట సుదర్శన్ 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 93/0 స్కోరు చేసింది. ఇక మిగిలిన 10 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సిన దశలోనూ ఓపెనింగ్ జోడీ పరుగుల పయనం సాఫీగా సాగిపోయింది. దీంతో ఓవర్లు గడిచేకొద్దీ ఢిల్లీ బౌలర్లు కాస్తా డీలా బౌలర్లుగా మారిపోయారు. 33 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తవగా జట్టు స్కోరు 15వ ఓవర్లో 150 దాటింది. ఇక 30 బంతుల్లో 46 పరుగుల సమీకరణంతోనే... చేతిలో పది వికెట్లున్న టైటాన్స్ చేతుల్లోకే మ్యాచ్ వచ్చేసింది. ఈ లాంఛనాన్ని మరో బ్యాటర్‌కు ఇవ్వకుండా ఓపెనర్లే పూర్తి చేశారు. భారీ సిక్సర్‌తో సాయి సుదర్శన్ 56 బంతుల్లో సెంచరీ సాధించగా, చూడచక్కని బౌండరీలతో గిల్ కూడా శతకానికి చేరువయ్యాడు. కానీ ఈ లోపే 200 పరుగుల పెద్ద లక్ష్యం 19వ ఓవర్లోనే దిగిరావడంతో అతని సెంచరీకి అవకాశం లేకుండాపోయింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 112; డుప్లెసిస్ (సి) సిరాజ్ (బి) అర్షద్ 5; పోరెల్ (సి) బట్లర్ (బి) సాయికిషోర్ 30; అక్షర్ (సి) సాయికిషోర్ (బి) ప్రసిధ్ కృష్ణ 25; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–16, 2–106, 3–151. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 2–0–7–1, రబడా 2–0–34–0, ప్రసిద్‌కృష్ణ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–32–0, సాయికిషోర్ 4–0–47–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (నాటౌట్) 108; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 93; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 205. బౌలింగ్: అక్షర్ పటేల్ 3–0–35–0, నటరాజన్ 3–0–49–0, ముస్తాఫిజుర్ 3–0–24–0, చమీర 2–0–22–0, విప్రాజ్ 4–0–37–0, కుల్దీప్ 4–0–37–0. -
టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్
ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. భారత జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు సెలక్టర్లు మల్లుగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికి.. బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కెప్టెన్సీ రేసులో గిల్‌తో పాటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పేర్లు కూడా వినిపిస్తున్నాడు.తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రయాన్ని వెల్లడించాడు. వీరి ముగ్గురిలో శుబ్‌మన్ గిల్‌కే గవాస్కర్ ఓటేశాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. అదే రోజున కొత్త టెస్టు కెప్టెన్ పేరును బీసీసీఐ వెల్లడించనుంది."ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించినా మన సూపర్ లీడర్స్ ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి స్ధాయికి చేరుకోవడానికి కచ్చితంగా రెండేళ్లు పడుతోంది. ఈ ముగ్గురు టెస్టు కెప్టెన్సీకి సరికొత్త అర్ధాన్ని తీసుకొచ్చారు. భారత కెప్టెన్సీకి ప్రధాన పోటీదారులైన గిల్, అయ్యర్, పంత్‌లను చూస్తుంటే, నాకు ధోని, రోహిత్, విరాట్ గుర్తుస్తున్నారు. బహుశా అయ్యర్, పంత్ కంటే గిల్‌కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా న్నాయి. గిల్‌కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మైదానంలో చాలా చురుగ్గా ఉంటూ వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: ఇది ‘ఇండియన్’ ప్రీమియర్ లీగ్: ఫారన్ ప్లేయర్లకు శ్రేయస్ కౌంటర్? -
రోహిత్‌ను నిండా ముంచిన గిల్
-
ఇంగ్లండ్ టూర్: వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?
ఐపీఎల్-2025 (IPL 2025) ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీకానున్నారు. ఇందులో భాగంగా భారత జట్టు తొలుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTV) 2025-27 సీజన్ ఆరంభం కానుంది.తొలుత అనధికారిక టెస్టులుఅయితే, అంతకంటే ముందే భారత్-‘ఎ’- ఇంగ్లండ్ లయన్స్ (India A vs England Lions)తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. మే 30 నుంచి తొలి మ్యాచ్, జూన్ 6 నుంచి రెండో మ్యాచ్ జరుగుతాయి. ఆ తర్వాత భారత సీనియర్ జట్టు, భారత ‘ఎ’ టీమ్ మధ్య కూడా జూన్ 13 నుంచి ఒక నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతుంది.జైసూ, నితీశ్, గిల్, జురెల్ కూడాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్ గత సీజన్లో అద్భుతంగా చెలరేగిన బ్యాటర్ కరుణ్ నాయర్‌కు భారత టెస్టు టీమ్‌లో పునరాగమనం చేసేందుకు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో తలపడేందుకు సెలక్టర్లు ఎంపిక చేసిన భారత ‘ఎ’ జట్టులో కరుణ్ నాయర్‌కు చోటు లభించింది. అదే విధంగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో సభ్యులైన యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్‌దీప్‌లను కూడా భారత ‘ఎ’ జట్టుకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఈ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు సరైన అవకాశంగా సెలక్టర్లు భావించారు.వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?అయితే, ఈ జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ ఆచితూచి అడిగేసిందంటూ బోర్డు సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ IANSకు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘భారత్-‘ఎ’ జట్టు ఎంపిక విషయంలో ఒక విధమైన గందరగోళం నెలకొందనే చెప్పాలి. ఏ ఆటగాడిని తీసుకోవాలో అర్థం కాలేదు.అప్పుడు బీసీసీఐ సెలక్టర్లకు ఓ సలహా ఇచ్చింది. ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్‌నకు చేరని జట్ల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయమని చెప్పింది. వారికి ప్రాధాన్యం ఉండేలా చూసుకోమంది. ఎందుకంటే.. భారత్-‘ఎ’ జట్టు మే 25న ఇంగ్లండ్‌కు బయలుదేరాల్సి ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థతో చెప్పుకొచ్చాయి.కాగా ఇంగ్లండ్‌కు వెళ్లే భారత్-‘ఎ’ జట్టులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్‌లు ఉన్నారు. వీరి టీమ్ ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. మిగతా ఆటగాళ్ల జట్లు రాజస్తాన్ రాయల్స్ (యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి), చెన్నై సూపర్ కింగ్స్ (రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తదితరులు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ పోటీ నుంచి నిష్క్రమించాయి.ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, మానవ్ సుతార్, తనుశ్ కొటియాన్, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే, శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
‘బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్’
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ అంశంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయం పంచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సారథిగా నియమించకూడదని యాజమాన్యానికి సూచించాడు. పేస్ దళ నాయకుడికి బదులు యువ ఆటగాడికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందంటూ ఇద్దరు స్టార్ల పేర్లు చెప్పాడు.దిగ్గజాల వీడ్కోలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్ భారత్- ఇంగ్లండ్ సిరీస్‌తో మొదలుకానున్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఐదు టెస్టుల్లో తలపడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లనుంది. అయితే, ఈ కీలక పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో భారత జట్టు కొత్త కెప్టెన్, నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే ఆటగాడు ఎవరన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో భాగంగా ప్రజెంటర్, బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌తో రవిశాస్త్రి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బుమ్రానే ఫస్ట్ చాయిస్.. కానీ వద్దే వద్దు‘‘నా వరకైతే.. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కచ్చితంగా జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్‌గా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వగలిగే ఆటగాడు. అయితే, నేను జస్ప్రీత్ సారథి కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే.. కెప్టెన్‌గా ఉంటే అతడిపై అదనపు భారం పడుతుంది.బౌలర్‌గానూ బుమ్రా సేవలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అతడు తన శరీరాన్ని మరీ ఎక్కువగా కష్టపెట్టకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి తర్వాత ఇటీవలే బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ ఆడుతున్నాడు.ఒత్తిడికి లోనయ్యే అవకాశంఅయితే, అక్కడ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా మాత్రమే ఉంటుంది. కానీ టెస్టుల్లో 10- 15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఇలా బౌలర్‌గా, కెప్టెన్‌గా అదనపు భారం పడితే అతడు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.ఆ ఇద్దరిలో ఒకరు బెటర్ఇక యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందంటూ.. ‘‘కెప్టెన్‌గా శుబ్‌మన్ సరైన వాడు అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తే బాగుంటుంది. అతడి వయసు 25- 26 ఏళ్ల మధ్య ఉంటుంది. సారథిగా తనను తాను నిరూపించుకుంటే.. దీర్ఘకాలం కొనసాగల సత్తా అతడికి ఉంది.రిషభ్ పంత్‌ను పక్కన పెట్టే వీలు లేదు. నా దృష్టిలో టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్లుగా వీరిద్దరిలో ఒకరే అత్యుత్తమ ఎంపిక. మరో దశాబ్దకాలం పాటు టీమిండియాకు ఆడగలరు.ఇప్పటికే ఇద్దరూ ఐపీఎల్లో జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి ఆ అనుభవం కూడా పనికివస్తుంది. అందుకే గిల్, పంత్‌లలో ఒకరికి టీమిండియా కెప్టెన్‌గా అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది.కాగా గతంలో ఇంగ్లండ్ పర్యటనలో ఓసారి భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పెర్త్, సిడ్నీ టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో మాత్రమే గెలిచిన భారత జట్టు.. 1-3తో ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
'గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే బెటర్'
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది. రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు నివేదికల ప్రకారం టెస్టు కెప్టెన్సీ రేసులో స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా విన్పిస్తోంది. కానీ గిల్ తో పోలిస్తే బుమ్రాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గాయాల బెడద, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనుభవం లేని గిల్ వైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతుండడం క్రికెట్ వర్గాల్లో అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తోంది.చాలా మంది మాజీలు భారత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్‌గా బుమ్రా ఉండాలని, శుబ్‌మన్ గిల్‌ను అతడి డిప్యూటీగా ఎంపిక చేయాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు."భారత టెస్టు కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా ముందంజలో ఉంటాడాని భావిస్తున్నాను. ఒకవేళ తనంతట తానుగా కెప్టెన్సీ ఆఫర్ తిరష్కరిస్తే తప్ప సెలక్టర్లు మరో ఆప్షన్‌ను పరిశీలించరు. అతడిని కెప్టెన్‌గా చేసి గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలి. బుమ్రాకు విశ్రాంతి అవసరమైనప్పుడల్లా గిల్ జట్టును నడిపిస్తున్నాడు. దీంతో గిల్‌కు పూర్తి స్ధాయి కెప్టెన్‌గా ఎదిగేందుకు తగినంత సమయం లభిస్తోంది" అని జాఫర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా గిల్‌కు కెప్టెన్‌గా అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. జింబాబ్వే సిరీస్‌లో భారత జట్టు సారధిగా గిల్ వ్యవహరించాడు. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టును నడిపించలేదు. ఐపీఎల్ మాత్రం కెప్టెన్‌గా అతడికి అనుభవం ఉంది. గుజరాత్ టైటాన్స్ సారథిగా గిల్ కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.చదవండి: BCCI - IND vs ENG: టీమిండియాలో అతడికి చోటు కష్టమే! -
శుబ్‌మన్ గిల్, పంత్ కాదు.. అతడి టెస్టు కెప్టెన్ చేయండి: అశ్విన్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరన్న చర్చ మొదలైంది. టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు. కెప్టెన్‌గా గిల్ ఎంపిక దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా తదుపరి కెప్టెన్ గిల్ అన్న ఊహాగానాలపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది మాజీలు సంతృప్తి వ్యక్తం చేస్తూంటే.. మరి కొంత మంది సీనియర్ ఆటగాడిని కెప్టెన్‌గా చేయాలని బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను భారత కెప్టెన్‌గా ఎంపిక చేయాలని అశ్విన్ సూచించాడు.."ప్రస్తుత భారత జట్టులో రవీంద్ర జడేజా అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతడిని కూడా కెప్టెన్సీ ఎంపికగా పరిగణించాలి. మీరు కొత్త ఆటగాడికి శిక్షణ ఇచ్చి తర్వాత కెప్టెన్‌గా చేయాలని భావిస్తుంటే.. సారథిగా మీకు జడేజా బెస్ట్ ఛాయిస్. జడేజా రెండేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించవచ్చు. జడ్డూకు డిప్యూటీగా మీరు ఎవరినైతే కెప్టెన్‌గా చేయాలనకుంటున్నారో వారిని నియమించండి. అప్పుడు అతడు మరింత రాటుదేలుతాడు. భారత జట్టుకు కెప్టెన్ కావడం ప్రతి ఆటగాడి కల. జడేజాకు అవకాశమిస్తే అతడు కచ్చితంగా స్వీకరిస్తాడని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అదేవిధంగా శుబ్‌మన్ గిల్‌పై కూడా అశూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. గిల్ అక్కడ జట్టును గెలిపిస్తే.. కెప్టెన్‌గా పరిపక్వత సాధించినట్లు అవుతోంది. అయితే టెస్టుల్లో కెప్టెన్సీ అంత సలువు కాదు. ఒక కెప్టెన్‌గా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కూడా ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అశ్విన్ అన్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ -
ఓపెనర్‌గా కేఎల్ రాహుల్.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు!
భారత టెస్టు జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు రాబోతున్నాయి. ఇన్నాళ్లుగా ఓపెనర్‌గా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే దిగ్గజం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో వీరిద్దరి స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరన్న అంశంపై చర్చ జరగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ (KL Rahul)- యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను కొనసాగించాలని సూచించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లోఅయితే, నాలుగో స్థానానికి మాత్రం వసీం జాఫర్ కొత్త ఆటగాడిని ఎంపిక చేశాడు. కాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ జైసూతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. రోహిత్ తిరిగి వచ్చిన తర్వాత కూడా వీరే ఓపెనర్లుగా కొనసాగారు.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ న్యూస్18తో మాట్లాడుతూ.. ‘‘బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రాణించారు. కాబట్టి కేఎల్ అదే స్థానంలో కొనసాగితే బాగుంటుంది. నిలదొక్కుకున్న జోడీని విడదీయడం వల్ల నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.నాలుగో స్థానంలో గిల్!ఇక శుభ్‌మన్ గిల్ విషయానికొస్తే.. అతడు వైట్ బాల్ క్రికెట్లో ఓపెనర్‌గా వస్తున్నాడు. కానీ టెస్టు క్రికెట్లో మాత్రం అతడిని మూడు నుంచి నాలుగో స్థానానికి పంపితే బాగుంటుంది.మూడో స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడించాలి. సుదీర్ఘకాలం వన్‌డౌన్‌లో ఆడిస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా కేఎల్ రాహుల్ టీమిండియా తరఫున ఓపెనర్‌గా 83 ఇన్నింగ్స్‌లో 2803 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు శతకాలు ఉన్నాయి.ఓపెనర్లుగా ఇలాఇక నాలుగో స్థానంలో రెండు ఇన్నింగ్స్ ఆడిన కేఎల్.. 108 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. శుబ్‌మన్ గిల్ 30 ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో వచ్చి 1019 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా 29 ఇన్నింగ్స్‌లో 874 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇంత వరకు ఒక్కసారి కూడా నాలుగో స్థానంలో ఆడలేదు.కాగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల నిష్క్రమణ తర్వాత టీమిండియా తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో తొలి సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. ఈ టూర్ నుంచి భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది.చదవండి: ‘మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా.. -
తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?
టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు పగ్గాలు అప్పగించాలని సునిల్ గావస్కర్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు.. ఇప్పటికే యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను సారథిగా నియమించడం లాంఛనమే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. టెస్టు తుదిజట్టులో చోటే కరువైన ఆటగాడు కెప్టెన్సీకి ఎలా అర్హుడు అవుతాడని ప్రశ్నించాడు.విదేశీ గడ్డపై గిల్ విఫలంకాగా 2020లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన గిల్.. ఇప్పటికి 32 మ్యాచ్‌లు ఆడాడు. 35.06 సగటుతో 1893 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు, ఐదు సెంచరీలు ఉన్నాయి. అయితే, సొంతగడ్డపై వైట్ జెర్సీలో రాణిస్తున్న గిల్‌కు విదేశాల్లో రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో గిల్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొత్తంగా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి చెత్త ప్రదర్శ కారణంగా మెల్బోర్న్ టెస్టులో ఆడించకుండా యాజమాన్యం వేటు వేసింది కూడా!తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?అంతకు ముందు వెస్టిండీస్, సౌతాఫ్రికా పర్యటనల్లోనూ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్ వైఫల్యాలను ఎత్తి చూపాడు. ‘‘టెస్టు క్రికెట్లో అతడు ఇంకా పూర్తిగా నిలదొక్కుకోనేలేదు.మరి ఇప్పుడే కెప్టెన్‌గా ఎందుకు? జస్ప్రీత్ బుమ్రానే సారథిని చేయాలి. ఒకవేళ అతడు ఫిట్‌గా లేకుంటే కేఎల్ రాహుల్ లేదంటే రిషభ్ పంత్‌లలో ఒకరు భారత జట్టుకు నాయకుడిగా వ్యవహరించాలి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కేఎల్ రాహుల్ సరైనోడుఇక విరాట్ కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో కీలకమైన నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించాలని చిక్కా ఈ సందర్భంగా సూచించాడు. కోహ్లి వదిలి వెళ్లిన స్థానానికి రాహుల్ మాత్రమే న్యాయం చేయగలగడని అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో భారత్‌కు అతడు విలువైన ఆటగాడని.. అతడికి జట్టులో స్థిరమైన స్థానం ఇవ్వాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు.కాగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ రక్తంతో నిండిన జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. అన్నట్లు.. ఇంగ్లండ్ గడ్డ మీద శుబ్‌మన్ గిల్ మూడు టెస్టులు ఆడి 88 పరుగులు మాత్రమే చేశాడు!!చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. రహానే, పుజారా రీ ఎంట్రీ! -
గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు!
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం టీమిండియా మీద కేంద్రీకృతమై ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత.. వారి స్థానాల్ని భర్తీ చేసేదెవరన్న చర్చ నడుస్తోంది. కాగా గత కొంతకాలంగా సంప్రదాయ ఫార్మాట్లో ఘోర పరాభవాలు చవిచూసిన భారత జట్టు.. తదుపరి ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది.ఇరు జట్ల మధ్య ఈ మేర ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఆరంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ కీలక సిరీస్‌కు టీమిండియా ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే వెళ్లనుండటం ఆసక్తిగా మారింది.పనిభారం పడకుండా ఉండేందుకే?ఇక ఈ సిరీస్ నుంచి యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై పనిభారం పడకుండా ఉండేందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బుమ్రా కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే క్రమంలో తనకు తానుగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకొన్నాడని మరికొన్ని వార్తలు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టెస్టు కెప్టెన్‌గా బుమ్రానే సరైనోడుటీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను కాదని.. బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రతి ఒక్కరు పనిభారం అంటూ బుమ్రా గురించి ఏదేదో మాట్లాడేస్తున్నారు. నిజానికి అతడికి మాత్రమే ఈ వర్క్‌లోడ్ గురించి పూర్తిగా తెలుస్తుంది. తన శరీరం ఒత్తిడిని తట్టుకోగలదా? లేదా ? అనేది బుమ్రాకు మాత్రమే తెలుస్తుంది.ఆ కారణంతో కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడం సరికాదు. ఎందుకంటే కెప్టెన్‌గా ఇతరులు ఎవరు ఉన్నా.. బుమ్రాతో అదనపు ఓవర్లు వేయించాలనే చూస్తారు. మరి అలాంటపుడు పనిభారం పెరగదా?జట్టులో బుమ్రా నంబర్ వన్ బౌలర్. తనే కెప్టెన్‌గా ఉంటే ఎప్పుడు విరామం తీసుకోవాలి.. ఎప్పుడు బరిలోకి దిగాలనే విషయాల్లో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోగలడు. అందుకే నా వరకైతే జస్ప్రీత్ బుమ్రానే తదుపరి టెస్టు కెప్టెన్‌గా నియమించాలి.పనిభారం అంటూ వచ్చే ఊహాగానాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో బుమ్రాకు బాగా తెలుసు. కెప్టెన్‌గా అతడే ఉండటం అత్యుత్తమ నిర్ణయం అని నా అభిప్రాయం’’ అని గావస్కర్ స్పోర్ట్స్ టుడేతో వ్యాఖ్యానించాడు.గతంలోనూ నాయకుడిగాకాగా బుమ్రా గతంలో ఓసారి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలుత పెర్త్‌లో.. ఆఖరిగా సిడ్నీలో ఐదో టెస్టులో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా వెన్నునొప్పి తిరగబడటంతో దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్-2025తో ఇటీవలే పునరాగమనం చేశాడు. ఇదిలా ఉంటే.. జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే! -
కోహ్లి స్థానాన్ని భర్తీ చేసేదెవరు?.. ఛతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్తో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసింది. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడుతూ ఇన్నాళ్లూ ఈ రన్‌మెషీన్ కీలక బాధ్యతను తన భుజాల మీద మోశాడు. అయితే, ఇప్పుడు అతడు టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మరి కోహ్లి ప్లేస్‌ను భర్తీ చేసేదెవరు?!ఈ విషయం గురించి టీమిండియా వెటరన్ బ్యాటర్, నయా వాల్ ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి వారసుడి గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని.. కనీసం రెండు సిరీస్‌ల తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ..ఛతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు‘‘నాలుగో స్థానంలో అత్యుత్తమ బ్యాటర్ ఉండాలి. అప్పుడే జట్టు నిలబడుతుంది. ప్రస్తుతం చాలా మంది టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. అయితే, వీరిలో నాలుగో స్థానంలో ఎవరు పూర్తిస్థాయిలో ఆడతారనేది ఇంగ్లండ్ పర్యటన తర్వాత తేలనుంది.ఎందుకంటే ఇంగ్లండ్ గడ్డ మీద నంబర్ ఫోర్లో రాణిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అని పుజారా పేర్కొన్నాడు. కాగా సచిన్ టెండుల్కర్ నిష్క్రమణ తర్వాత కోహ్లి 99 సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.ఇక అజింక్య రహానే తొమ్మిది సార్లు, పుజారా ఏడు టెస్టుల్లో నాలుగో నంబర్ బ్యాటర్లుగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్లకు కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కొత్త బంతుల్ని ఎదుర్కోవడంలో శుబ్‌మన్ దిట్ట. గతంలో అతడు ఓపెనర్‌గా వచ్చేవాడు. ఆ తర్వాత మూడో స్థానానికి మారిపోవాల్సి వచ్చింది. అయితే, అతడు ఓల్డ్ బాల్‌ను ఎంత వరకు ఎదుర్కోగలడన్న విషయం కాలక్రమేణా తేలుతుంది. అప్పటిదాకా కోహ్లి స్థానాన్ని భర్తీ చేస్తూ.. దీర్ఘకాలంలో ఆ ప్లేస్‌లో కొనసాగే ఆటగాడు ఎవరో చెప్పడం కష్టతరమే అవుతుంది’’ అని పుజారా పేర్కొన్నాడు.రోహిత్ బాటలోనే కోహ్లికాగా మే తొలివారంలో కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పగా.. సోమవారం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. వీరిద్దరు ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగారు. ఇక ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు.ఇదిలా ఉంటే కోహ్లి సారథ్యంలో 2021లో, రోహిత్ కెప్టెన్సీలో 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన టీమిండియా.. ఈసారి మాత్రం నిరాశపరిచింది. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకున్న రోహిత్ సేన డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు దూరమైంది.ఇక తదుపరి డబ్ల్యూటీసీ 2025-27 సీజన్లో మొదటగా టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లి, రోహిత్ లేకుండా తొలిసారి భారత జట్టు ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టబోతోంది. ఈ జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.చదవండి: కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడరు: టీమిండియా దిగ్గజం -
గిల్ టీమిండియా కెప్టెన్ అయితే ధోనితో పాటు ఓ చెత్త రికార్డును షేర్ చేసుకుంటాడు..!
రోహిత్ శర్మ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. భారత సెలెక్టర్లు, బీసీసీఐ గిల్‌కు భారత టెస్ట్ జట్టు పగ్గాలు అప్పజెప్పేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. టెస్ట్‌ల్లో గిల్‌కు అంత మంచి ట్రాక్ రికార్డు లేనప్పటికీ.. బీసీసీఐ పెద్దలు అతనివైపే మొగ్గుచూపుతున్నారు. బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆప్షన్స్ ఉన్నా ఆల్ ఫార్మాట్ ఆటగాడని గిల్‌ను వెనకేసుకొస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. గిల్ సారథ్యంలోనే భారత్ కఠినమైన ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుందన్న విషయం స్పష్టమవుతుంది. మరో రెండు రోజుల్లో గిల్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో భేటి కానున్నాడని తెలుస్తుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసే భారత టెస్ట్ జట్టుకు గిల్ సారధిగా నియమితుడైతే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనితో కలిసి ఓ చెత్త రికార్డును షేర్ చేసుకుంటాడు. గడిచిన 30 సంవత్సరాల్లో 30 కంటే తక్కువ బ్యాటింగ్ సగటుతో సేనా దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) టీమిండియాకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా అపప్రదను మూటగట్టుకుంటాడు. ఈ జాబితాలో ధోనితో పాటు కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు.సేనా దేశాల్లో ధోని బ్యాటింగ్ సగటు 28.37 కాగా.. రాహుల్ బ్యాటంగ్ సగటు 29.60గా ఉంది. గిల్ విషయానికొస్తే.. సేనా దేశాల్లో అతని బ్యాటింగ్ సగటు ధోని, రాహుల్ కంటే అధ్వానంగా 25.70గా ఉంది. గిల్ టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడైతే ధోని, రాహుల్‌తో పాటు పైన పేర్కొన్న చెత్త రికార్డును షేర్ చేసుకుంటాడు. టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన విరాట్టెస్ట్ క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారంలోపే విరాట్ కోహ్లి కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇవాళ (మే 12) ఉదయం కోహ్లి టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనను చేశాడు. బీసీసీఐలోని కొందరు పెద్దలు కోహ్లిని రిటైర్మెంట్ విషయంలో వెనక్కు తగ్గాలని కోరినా వినలేదని తెలుస్తుంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లి.. తాజాగా టెస్ట్‌లకు కూడా వీడ్కోలు పలికాడు. -
IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా గిల్.. వైస్ కెప్టెన్‌గా అతడే!
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా కొత్త కెప్టెన్ నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ (Rohit Sharma) నిష్క్రమణ నేపథ్యంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. అతడికి డిప్యూటీగా మరో యువ ఆటగాడినే ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈసారి కనీసం ఫైనల్ చేరకుండానేగతేడాది టెస్టుల్లో పరాభవాల పాలైన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్‌కు దూరమైన విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిపోయిన భారత్.. ఈసారి ఆలోటు తీర్చుకుంటుందనుకుంటే ఇలా మొత్తానికే మోసం వచ్చింది.స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)-2025లో 3-1తో ఓడటం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన రోహిత్ శర్మ బుధవారమే సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే!ఈ క్రమంలో మరో సీనియర్ బ్యాటర్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే నడుస్తాడనే వార్తలు వినిపించాయి. కోహ్లి ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నా.. బోర్డు అందుకు సమ్మతించలేదని.. అందుకే అతడు ఈ మేర తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు వదంతులు వ్యాపించాయి.వైస్ కెప్టెన్‌గా పంత్డబ్ల్యూటీసీ 2025-27 కొత్త సీజన్లో యువ రక్తంతో నిండిన జట్టును ఇప్పటి నుంచే సిద్ధం చేయాలనే యోచనలో ఉన్న బోర్డు.. కోహ్లికి నో చెప్పిందన్నది వాటి సారాంశం. తాజా సమాచారం ప్రకారం.. శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే ఆఖరి వారంలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి గిల్ కంటే పంత్ సీనియర్. అంతేకాదు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై సమర్థవంతంగా ఆడిన అనుభవం అతడికి ఉంది.అయితే, ఇటీవల ఆసీస్ పర్యటనలో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. షాట్ల ఎంపిక విషయంలో పదే పదే తప్పులు చేస్తూ విమర్శల పాలయ్యాడు. ఇలాంటి తరుణంలో గిల్ వైపు మొగ్గు చూపిన యాజమాన్యం.. అతడి చుట్టూ భవిష్యత్ జట్టును నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించే పంత్‌పై అదనపు భారం మోపకుండా.. బ్యాటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టేలా బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టులతో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ఆరంభం కానుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతుంది. చదవండి: SRH: బ్యాటర్ల వైఫల్యం... బౌలర్ల నిస్సహాయత -
టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?
ఐపీఎల్-2025 సీజన్ నిరావధికంగా వాయిదా పడడంతో భారత జట్టు ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దం కానుంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.ఈ క్రమంలో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ప్రకటనకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముహార్తం ఖారారు చేసింది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. మే 23న బీసీసీఐ విలేకరుల సమావేశం నిర్వహించి, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టుతో పాటు భారత టెస్ట్ కెప్టెన్‌ను కూడా ప్రకటించననున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది. తొలుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును మే 20న ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కానీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావలనుకుంటున్నట్లు బీసీసీఐకి చెప్పడంతో జట్టు ప్రకటనను రెండు రోజుల పాటు వాయిదా వేసినట్లు వినికిడి. కోహ్లిని తన నిర్ణయాన్ని మార్చుకోవాలని బీసీసీఐ సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరి కోహ్లి యూ-టర్న్ తీసుకుంటాడా? లేదా అన్నది మరో కొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇక భారత టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు.ప్రస్తుతం టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. కానీ గాయాల బెడద, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించకూడదని బీసీసీఐ భావిస్తుందంట. దాదాపు శుబ్‌మన్ గిల్ పేరును బీసీసీఐ ఖారారు చేసినట్లు వినికిడి. -
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకబోతున్నాడన్న వార్తల నడుమ.. తాజాగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అభ్యర్థనను తిరస్కరించిన కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈసారి ఫైనల్ చేరకుండానేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2023-25 సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. అసలు సమయానికి చేతులెత్తేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ వైఫల్యాలను కొనసాగించింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా ఈసారి ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. రెండు సిరీస్‌లలో ఇంతటి ఘోర పరాభవానికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల బ్యాటింగ్ వైఫల్యమే.అయితే, కోహ్లి ఆసీస్ గడ్డపై ఓ శతకంతో మెరిసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అనంతరం ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ బరిలో దిగి అక్కడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టుకు వీడ్కోలు పలకాలనే డిమాండ్లు రాగా.. బుధవారం ఇందుకు సంబంధించి అతడు అధికారిక ప్రకటన విడుదల చేశాడు.సోషల్ మీడియా వేదికగాతాను టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో జూన్ 20 నుంచి మొదలుకానున్న డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ఆరంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోహ్లి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.జట్టుకు బలం అతడుఅయితే, బీసీసీఐ మాత్రం కోహ్లిని ఇంగ్లండ్‌తో సిరీస్ వరకైనా ఆడాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీతో బీసీసీఐ వర్గాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఇంకా పరుగుల దాహంతోనే ఉన్నాడు. అతడు డ్రెసింగ్‌రూమ్‌లో ఉంటే జట్టుకు బలం.ఇప్పట్లో టెస్టులకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాం’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది?అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. రోహిత్ శర్మ వీడ్కోలు నేపథ్యంలో విరాట్ కోహ్లి తనకు కెప్టెన్సీ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శుబ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని బోర్డు సహా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ మొదలుకానుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కెప్టెన్ నియమించాలని బోర్డు భావిస్తోంది.హెడ్‌కోచ్ గంభీర్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. కొత్తతరం ఆటగాళ్లతో పటిష్ట జట్టు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంగ్లండ్ వంటి మేటి జట్టుతో సిరీస్ నుంచే ఈ పని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అందుకే కొత్త నాయకుడి వైపే యాజమాన్యం మొగ్గు చూపుతోంది’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్‌గానూ హిట్‌కాగా గతంలో కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కోహ్లికి ఉంది. టెస్టుల్లో అతడి రికార్డులు అమోఘం. అయితే, వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించిన తర్వాత... సౌతాఫ్రికా పర్యటనలో ఓటమి అనంతరం టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు.కోహ్లి సారథ్యంలో డబ్ల్యూటీసీ 2019-21లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. అయితే, ఆ తర్వాత రోహిత్ గైర్హాజరీలో కూడా కోహ్లి ఎప్పుడూ కెప్టెన్‌గా వ్యవహరించలేదు. బ్యాటర్‌గా కొనసాగేందుకే ఇష్టపడ్డాడు. అలాంటిది ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీ అడిగాడని.. అందుకు బోర్డు నిరాకరించిందనే వార్తలు కల్పితాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్! -
గిల్, బుమ్రా, పంత్ కాదు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే?
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. ఇకపై కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగనున్నట్లు హిట్‌మ్యాన్ తెలిపాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్‌కు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో కొత్త టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది.కెప్టెన్సీ రేసులో స్టార్ ప్లేయర్లు శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ప్రస్తుతం బుమ్రా.. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కానీ గాయాల బెడద, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతన్ని ఈ కెప్టెన్స్ రేసు నుంచి గ్రూప్ నుంచి తప్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వినికిడి. తాజాగా ఈ జాబితాలోకి కేఎల్ రాహుల్ చేరినట్లు సమాచారం. కెప్టెన్‌గా తక్కువ అనుభవం ఉన్న గిల్, పంత్ కంటే సీనియర్ ప్లేయర్ అయిన రాహుల్‌కు పగ్గాలు అప్పగిస్తే బెటర్ అని సెలక్టర్లు భావిస్తున్నట్లు అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంగ్లండ్ సిరీస్ తర్వాత పూర్తి స్ధాయి కెప్టెన్‌ను నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కెప్టెన్‌గా రాహుల్..టెస్టు కెప్టెన్సీ పరంగా కేఎల్ రాహుల్‌కు అనుభవం ఉంది. గతంలో మూడు సార్లు టీమిండియాకు రాయల్ నాయకత్వం వహించాడు. 2022లో అతడి సారథ్యంలోనే బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో కూడా రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌లో వ్యక్తిగత గణాంకాల పరంగా కూడా రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇంగ్లండ్ గడ్డపై ఈ వికెట్ కీపర్ ఈ కీపర్-బ్యాటర్ 9 మ్యాచ్‌ల్లో 614 పరుగులు చేశాడు. ఈ టెస్టు పర్యటనకు బీసీసీఐ భారత జట్టును మే రెండో వారంలో ప్రకటించే అవకాశముంది.చదవండి: పీసీబీకి చావు దెబ్బ!.. రావల్పిండి స్టేడియంపై డ్రోన్ దాడి?.. PSLపై నీలినీడలు! -
వర్షమా?.. ఎక్కడ?: ఆశిష్ నెహ్రా, రాహుల్ తెవాటియా ఆగ్రహం
ఐపీఎల్-2025 (IPL 2025)లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. ముంబై ఇండియన్స్ (MI vs GT)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది. అయితే, ఈ గెలుపు గుజరాత్‌కు అంత సులువుగా ఏమీ దక్కలేదు.వర్షం కారణంగా పదే పదే వాయిదా పడిన మ్యాచ్ ఎట్టకేలకు పూర్తి కావడంతో గిల్ సేనకు ఊరట దక్కింది. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దయిపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చేది. అప్పుడు గుజరాత్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త క్లిష్టంగా మారేవి. మరోవైపు.. బ్యాటింగ్ పరంగా విఫలమైన ముంబై పాలిట వర్షం వరంగా మారేది. టైమింగ్‌ను మార్చడంతోఅందుకే, మధ్యలో వాన తెరిపినిచ్చినా మ్యాచ్ టైమింగ్‌ను పదే పదే మార్చడంపై గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనేక అవాంతరాల అనంతరం.. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:09 AM నుంచి మ్యాచ్‌ను 12:25 AMకు మార్చిన అంపైర్లు.. ఆ తర్వాత మ్యాచ్ పునఃప్రారంభాన్ని 12:30 AMకు వాయిదా వేశారు.వర్షమా?.. ఎక్కడ?ఈ నేపథ్యంలో మైదానంలోకి వచ్చిన ఆశిష్ నెహ్రా అంపైర్లతో వాదనకు దిగినట్లు కనిపించింది. మరోవైపు.. టైటాన్స్ బ్యాటర్ రాహుల్ తెవాటియా కూడా.. ‘‘వర్షం ఎక్కడ పడుతోంది’’ అన్నట్లుగా అంపైర్లతో వాదించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కీలకమైన మ్యాచ్‌లో గెలుపునకు దగ్గరైన వేళ వరుణుడితో పాటు అంపైర్లు కూడా తమతో దోబూచులాడటం నచ్చకే వీళ్లిద్దరూ ఇలా ఫైర్ అయ్యారంటూ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.Rahul Tewatia saying where is rain.- Ashish Nehra is furious.Rain go 🤣#MIvGT #MIvsGT pic.twitter.com/oEiO7q1Qpf— its cinema (@iitscinema) May 6, 2025రాణించిన గుజరాత్ బౌలర్లుకాగా ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ముంబైని 155 పరుగులకు కట్టడి చేయగలిగింది. సాయి కిషోర్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక ముంబై బ్యాటర్లలో ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (2), రోహిత్ శర్మ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్‌డౌన్ బ్యాటర్ విల్‌జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆఖర్లో కార్బిన్ బాష్ (27) కూడా రాణించడంతో ముంబై ఎనిమిది వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది.డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారంఇక లక్ష్య ఛేదనలో టైటాన్స్‌కు పదే పదే వర్షం ఆటంకం కలిగించింది. అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (43), వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ (30), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (28) రాణించారు. అయితే, ఆఖర్లో వర్షం వల్ల డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో గుజరాత్ లక్ష్యాన్ని 147గా నిర్ణయించారు.ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో అనేక నాటకీయ పరిణామాల నడుమ గుజరాత్ 19 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి సరిగ్గా 147 పరుగులు చేసి జయభేరి మోగించింది. చివరి ఓవర్లో ముంబై పేసర్ దీపక్ చహర్ బౌలింగ్‌లో (4,1, 6, N1, 1, W, 1) తెవాటియా కొట్టిన ఫోర్, కోయెట్జి బాదిన సిక్సర్ గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాయి.ఇక ఈ సీజన్లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న గుజరాత్‌కు ఇది ఎనిమిదో విజయం. ఫలితంగా గిల్ సేన ఖాతాలో ఇప్పుడు 16 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్‌రేటు (0.793) పరంగానూ మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకువచ్చింది.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025 -
టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: హార్దిక్
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) స్పందించాడు. ఆఖరి వరకు తమ జట్టు పోరాడిన తీరు అద్భుతమని కొనియాడాడు. అయితే, నో బాల్స్ వేయడం ప్రభావం చూపిందన్న హార్దిక్.. టీ20లలో ఇలా చేయడం నేరంతో సమానమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరచుకునే క్రమంలో ముంబై మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. సొంత మైదానం వాంఖడేలో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గుజరాత్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.వాన వల్ల పదే పదే ఆగిన ఆటఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆరంభంలోనే ఓపెనర్ సాయి సుదర్శన్(5) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (43) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. జోస్ బట్లర్ (30), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (28) అతడికి సహకరించారు.ఈ క్రమంలో 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసి విజయం దిశగా గుజరాత్ పయనిస్తున్న వేళ వర్షం వల్ల చాలా సేపు మ్యాచ్ నిలిచిపోయింది. అయితే, వాన తెరిపినిచ్చిన తర్వాత ముంబై బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ధాటికి పదహారు బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు నష్టపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు ఓవర్లలో గుజరాత్ విజయానికి 24 పరుగులు అవసరమైన వేళ... భారీ వర్షం వల్ల ఆట మళ్లీ ఆగిపోయింది. ఫలితంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ లక్ష్యం 19 ఓవర్లలో 147గా మారగా.. ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఆఖరి ఓవర్లో దీపక్ చహర్ నో బాల్ఈ నేపథ్యంలో తమ పేసర్ దీపక్ చహర్‌ను ముంబై బరిలోకి దించింది. అయితే, తొలి బంతికే రాహుల్ తెవాటియా ఫోర్ బాదగా.. మరుసటి బంతికి ఒక రన్ వచ్చింది. ఆ తర్వాత గెరాల్డ్ కోయెట్జి సిక్సర్ బాదాడు. దీంతో మూడు బంతుల్లో విజయ సమీకరణం నాలుగు పరుగులుగా మారింది.ఇలాంటి కీలక సమయంలో చహర్ నోబాల్ వేశాడు. అయితే, ఆ తర్వాత అతడు వేసిన లో ఫుల్ టాస్కు తెవాటియా ఒక్క పరుగే రాబట్టాడు. దీంతో రెండు బంతుల్లో ఒక్క పరుగు అవసరం కాగా.. చహర్ కోయెట్జిని పెవిలియన్‌కు పంపాడు. అయితే, ఆఖరి బంతికి అర్షద్ ఖాన్ పరుగు తీయడంతో గుజరాత్ విజయం ఖరారైంది.అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకేఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ముంబై సారథి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘మా వాళ్లు ఆఖరి వరకు పట్టుదలగా పోరాడారు. జట్టుగా మేము సమిష్టిగా ముందుకు సాగాము. అయితే, ఇంకో 25 పరుగులు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.ఏదేమైనా మా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక క్యాచ్ డ్రాప్‌ల వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందని నేను అస్సలు అనుకోను. మా వాళ్లు ఈరోజు వందకు 120 శాతం కష్టపడ్డారు.ఏదేమైనా నో బాల్స్ వేయడం సరికాదు. నేను కూడా అదే పని చేశాను. నిజానికి నా దృష్టిలో టీ20 మ్యాచ్‌లో నో బాల్స్ వేయడం నేరం లాంటిది. ఇవే మన కొంప ముంచుతాయి. అయితే, మా వాళ్ల ప్రదర్శన పట్ల నేనైతే సంతోషంగానే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు.కాగా గుజరాత్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో హార్దిక్ కూడా నో బాల్ వేశాడు. ఇక 12వ ఓవర్లో ముంబై శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా జారవిడిచింది. కాగా ముంబైపై మూడు వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్ Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025 -
IND vs ENG: బుమ్రాకు షాక్.. వైస్ కెప్టెన్‌గానూ అవుట్!
గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌లో సత్తా చాటి పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు సీనియర్ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి ఇప్పటికే ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)పేరు దాదాపుగా ఖరారు కాగా.. వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై సందిగ్దం నెలకొంది.నిజానికి స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0తో క్లీన్‌స్వీప్, ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT)ని చేజార్చుకున్న తర్వాత రోహిత్ టెస్టు భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అతడు విఫలం కావడంతో ఇక సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్‌గానే కాదు.. వైస్ కెప్టెన్‌గానూ బుమ్రా అవుట్!ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండే ఆటగాడికే వైస్ కెప్టెన్ ఇవ్వాలని భావిస్తున్నాం.నిజానికి బుమ్రా ఈ పర్యటనలో అన్ని మ్యాచ్‌లు ఆడడు. కాబట్టి కెప్టెన్‌కు డిప్యూటీగా వేర్వేరు మ్యాచ్‌లలో వేర్వేరు ఆటగాళ్లను నియమించలేము. అందుకే ఐదు టెస్టులు ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తాం’’ అని పేర్కొన్నాయి.గాయం తిరగబెట్టే అవకాశం!కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదింట రెండు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు.. పేస్ దళం భారం మొత్తాన్ని బుమ్రానే మోశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2023-25 సీజన్లో ముప్పై రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కానీ ఈ సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. మరోవైపు.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడ్డాడు.వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకూ అతడు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగానే న్నాడు.ఈ క్రమంలో బుమ్రా ఫిట్నెస్ దృష్ట్యా ఇంగ్లండ్‌లోనూ అతడిని వరుస మ్యాచ్‌లలో ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.బుమ్రా వంటి విలువైన ఫాస్ట్ బౌలర్‌ను కాపాడుకోవాలంటే.. ఒక టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం తగ్గించే విషయంలో సెలక్టర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే వైస్ కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రేసులో ఆ మూడు పేర్లుఒకవేళ బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. రిషభ్ పంత్ లేదంటే.. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌ల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అసలే ఇంగ్లండ్‌తో టెస్టులు కాబట్టి యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపకుండా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లకు బోర్డు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. కాగా టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. మే 25న క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరుగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.చదవండి: PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్ -
Shubman Gill: అంపైర్లతో గొడవ.. తప్పేముంది?.. తగ్గేదేలే..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరును గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సమర్థించుకున్నాడు. వందకు నూటా పది శాతం కష్టపడుతున్నపుడు ఇలాంటివి జరుగుతాయని.. ఒక్కోసారి భావోద్వేగాలను అదుపు చేసుకోలేమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా టైటాన్స్ శుక్రవారం సన్‌రైజర్స్‌తో తలపడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 38 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 76 పరుగులు సాధించాడు.అంపైర్లతో వాదనతనకు అచ్చొచ్చిన మైదానంలో గిల్ శతకం దిశగా పయనిస్తున్న వేళ అనూహ్య రీతిలో రనౌట్ అయ్యాడు. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో జోస్ బట్లర్ పరుగుకు యత్నించగా.. గిల్ రన్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఇంతలో ఫీల్డర్ హర్షల్ పటేల్ విసిరిన బంతిని వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అందుకుని వికెట్లకు గిరాటేశాడు.అయితే, బంతి క్లాసెన్ గ్లోవ్స్‌ను తాకి స్టంప్స్ పక్కగా వెళ్లింది. అప్పుడు క్లాసెన్ గ్లవ్ తాకి స్టంప్స్ పైకి ఎగిరినట్లు కనిపించింది. అయితే, కీపర్ చేతిలో ఉండగానే బంతి స్టంప్‌ను తాకిందా లేదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ టీవీ అంపైర్ మాత్రం గిల్‌ను అవుట్‌గానే ప్రకటించాడు.మరోసారి వాగ్వాదంఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనైన శుబ్‌మన్ గిల్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అదే విధంగా.. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ విషయంలో ఎల్బీడబ్ల్యూ అప్పీలు అంశంలో ప్రతికూల నిర్ణయం రావడంతో కోపోద్రిక్తుడయ్యాడు.మళ్లీ అప్పుడు కూడా గిల్ అంపైర్‌తో వాదనకు దిగాడు. ఈ పరిణామాల గురించి విజయానంతరం గిల్ స్పందించాడు. ‘‘నాకు, అంపైర్‌కు మధ్య చర్చ జరిగింది. ఒక్కోసారి భావోద్వేగాలను అదుపుచేసుకోలేము.తప్పేముంది?.. తగ్గేదేలేగెలిచేందుకు వందకు 110 శాతం కృషి చేస్తున్నపుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరిగిన విషయం గురించే మాట్లాడాను. ఈ వైఖరి తప్పని నేను అనుకోను’’ అని గిల్ స్పష్టం చేశాడు. స్కోరు బోర్డును ఎలా పరుగులు తీయించాలో తమకు తెలుసునని.. ఏదేమైనా ప్లే ఆఫ్స్‌కు చేరువ కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.కాగా ఈ సీజన్లో ఇప్పటికి పది మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌కు ఇది ఏడో గెలుపు. తద్వారా పద్నాలుగు పాయిం ట్లతో పట్టికలో రెండోస్థానంలోకి దూసుకు వచ్చింది. మరోవైపు.. ఏడో పరాజయం నమోదు చేసిన సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. ఐపీఎల్-2025: టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్👉టాస్: సన్‌రైజర్స్.. తొలుత బౌలింగ్👉టైటాన్స్ స్కోరు: 224/6 (20)👉సన్‌రైజర్స్ స్కోరు: 186/6 (20)👉ఫలితం: 38 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై టైటాన్స్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రసిద్ కృష్ణ (టైటాన్స్ పేసర్- నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 19 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు).చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని! What's your take? 👇✍🏻#ShubmanGill seen having a word with the umpire after being given out by the third umpire on a tight call! 👀Watch the LIVE action ➡ https://t.co/RucOdyBVUf#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on SS-1, SS- 1 Hindi & JioHotstar! pic.twitter.com/TPiALXJu8O— Star Sports (@StarSportsIndia) May 2, 2025 -
అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!.. ఎందుకిలా చేశాడు?
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ప్రవర్తన విమర్శలకు దారితీసింది. సారథిగా సంయమనంతో వ్యవహరించాల్సిన ఆటగాడే ఇలా సహనం కోల్పోవడం సరికాదంటూ క్రికెట్ ప్రేమికులు అతడిని విమర్శిస్తున్నారు. గిల్ నుంచి ఇలాంటివి అస్సలు ఊహించలేదని.. స్నేహపూర్వకంగా చేసే పనులకు కూడా ఓ హద్దు ఉంటుందని సోషల్ మీడియా వేదికగా హితవు పలుకుతున్నారు.అసలు విషయమేమిటంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (GT vs SRH)తో తలపడింది. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.సాయి, గిల్ మెరుపు ఇన్నింగ్స్‌ఓపెనర్లు సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48), శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 76) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. వన్‌డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ (37 బంతుల్లో 64) కూడా అదరగొట్టాడు. వీరికి తోడు వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 21) కూడా రాణించాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టైటాన్స్ ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 224 పరుగులు చేసింది. అయితే, గిల్ రనౌట్ అయిన తీరు విమర్శలకు దారితీయగా.. అతడు మైదానాన్ని వీడే ముందు అంపైర్‌తో వాదించాడు.38 పరుగుల తేడాతో ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో తడబడ్డ సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 186 పరుగులే చేసింది. తద్వారా 38 పరుగుల తేడాతో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపు వదిలేసుకుంది.ఇక రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కడే మెరుగ్గా ఆడాడు. మొత్తంగా 41 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. అయితే, పద్నాలుగో ఓవర్లో టైటాన్స్ పేసర్ ప్రసిద్ కృష్ణ వేసిన యార్కర్‌ను ఆడే క్రమంలో అభిషేక్ విఫలమయ్యాడు.అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!అయితే, బంతి దిశను మార్చుకుని అతడి ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం స్పందించకపోవడంతో.. టైటాన్స్ రివ్యూకు వెళ్లింది. అందులో బంతి వికెట్లను హిట్ చేసినట్లుగా కనిపించినప్పటికీ.. అంపైర్స్ కాల్ ద్వారా అభిషేక్ నాటౌట్‌గా నిలిచాడు.దీంతో సహనం కోల్పోయిన శుబ్‌మన్ గిల్ ఫీల్డ్ అంపైర్‌తో వాదనకు దిగాడు. కోపంతో అతడి పైపైకి వస్తూ వాగ్వాదం పెట్టుకున్నాడు. ఇంతలో అభిషేక్ శర్మ జోక్యం చేసుకుని గిల్‌ను కూల్ చేసేందుకు ప్రయత్నించాడు.అయితే, అప్పటికి అభిషేక్ క్రీజులో ఉండి చాలా సేపు కావడంతో బహుశా కండరాలు పట్టేయడంతో.. ఫిజియోను పిలిపించుకుని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అభిషేక్ కింద కూర్చుని ఉండగా.. గిల్ వెనక్కి వచ్చి అతడి కాలిని తన్నాడు. సమయం వృథా చేస్తున్నాడన్న కారణంతో ఇలా చేసి ఉంటాడు.PC: BCCI/JioHotstarయాంగ్రీ యంగ్ మ్యాన్.. సరదాగా చేసినా..కాగా గిల్- అభిషేక్.. ఇద్దరూ దేశవాళీ క్రికెట్లో పంజాబ్ జట్టుకు ఆడతారన్న విషయం తెలిసిందే. ఈ ఓపెనింగ్ జోడీ మధ్య గాఢమైన స్నేహం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో మాత్రం అభిషేక్ గిల్‌ను సముదాయించేందుకు ప్రయత్నిస్తే.. అతడు మాత్రం ఇలా కాలితో తన్నడం గమనార్హం.అభిషేక్‌తో తనకున్న చనువుతో సరదాగానే గిల్ ఈ పని చేసినా.. లైవ్‌లో ఇలాంటి చర్యలు ఎంతమాత్రం సరికాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రైజర్స్పై గెలుపుతో ఈ సీజన్లో టైటాన్స్ ఏడో విజయం నమోదు చేయగా.. కమిన్స్ సేనకు ఇది ఏడో ఓటమి.చదవండి: IPL 2025: శుబ్‌మన్ గిల్ది ఔటా? నాటౌటా? Chaos at the centre! 😳#ShubmanGill and #AbhishekSharma in discussion with the umpires!A review going #SRH’s way has sparked some serious drama! 🧐Watch the LIVE action ➡ https://t.co/RucOdyBo4H#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, &… pic.twitter.com/KX68eec2ZB— Star Sports (@StarSportsIndia) May 2, 2025 -
IPL 2025: శుబ్‌మన్ గిల్ది ఔటా? నాటౌటా?
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఓవర్ నుంచే ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊతికారేశాడు.మహ్మద్ షమీ, కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం గిల్ వదలేదు. ఈ క్రమంలో కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత కూడా గిల్ ఎక్కడ తగ్గలేదు. దీంతో అతడు దూకుడు చూసి మూడెంకల స్కోర్‌ను అందుకుంటాడని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో గిల్‌ను దురదృష్టం వెంటాడింది. అనుహ్యంగా గిల్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. దీంతో కేవలం 38 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు చేసిన గిల్.. తీవ్ర నిరాశతో డగౌట్‌కు చేరాల్సి వచ్చింది. అయితే గిల్ ఔటైన తీరు వివాదస్పదమైంది.ఏమి జరిగిందంటే?గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఆఖరి బంతికి జోష్ బట్లర్.. షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. ఆ బంతికి బట్లర్, గిల్ క్విక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించారు. నాన్‌స్ట్రైక్ నుంచి గిల్ వికెట్ కీపర్ వైపు వచ్చేటప్పటికి బంతిని హర్షల్ పటేల్ త్రో చేశాడు. అయితే గిల్ క్రీజులోకి వచ్చేటప్పుడు వికెట్ కీపర్ క్లాసెన్ స్టంప్ట్స్ ను పడగొట్టాడు. అయితే క్లాసెన్ బంతితో కాకుండా తన గ్లౌవ్స్‌తో స్టంప్స్‌ను పడగొట్లు అన్పించింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అంత ఉత్సాహంగా అప్పీల్ చేయలేదు. ఏదేమైనప్పటికి ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. రీప్లేలు గిల్ క్రీజుకు షార్ట్‌గా ఉన్నప్పటికీ, క్లాసెన్ తన గ్లోవ్స్‌తో బెయిల్స్‌ను పడగొట్టినట్లు కన్పించింది. కానీ పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించి అందరికి షాకిచ్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై గిల్ కూడా అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు. Shubman Gill robbed of a century here due to a terrible decision by the Umpire 💔The bails are clearly dislodged by the gloves !#ShubmanGill #IPL2025 #GTvSRH pic.twitter.com/aTXAA7Gr4Q— Prateek (@prateek_295) May 2, 2025