పెర్త్‌ వన్డేకు వర్షం​ అడ్డంకి.. | india vs australia 1st odi live updates and highlights | Sakshi
Sakshi News home page

India vs Australia: పెర్త్‌ వన్డేకు వర్షం​ అడ్డంకి..

Oct 19 2025 8:30 AM | Updated on Oct 19 2025 11:31 AM

india vs australia 1st odi live updates and highlights

IND vs AUS 1st ODI live Updates and highlights: పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ తలపడతున్నాయి.

మరోసారి వర్షం​ అడ్డంకి..
పెర్త్ వ‌న్డేకు వ‌రుణుడు మ‌రోసారి అంత‌రాయం క‌లిగించాడు. భారత్‌ స్కోర్‌ 37/3 వద్ద ఉండగా.. వర్షం రావడంతో  ఆటను నిలిపివేశారు.

11 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 35/3
11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ మూడు వికెట్లు కోల్పోయి 35 ప‌రుగులు చేసింది. క్రీజులో అక్ష‌ర్ ప‌టేల్‌(6), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(6) ఉన్నారు.

వర్షం అటంకి..
తొలి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఆట నిలిచే పోయే సమయానికి భారత్‌ స్కోర్‌: 25/3.

కెప్టెన్‌ గిల్‌ ఔట్‌.. 
భారత్‌కు వరుస షాక్‌లు తగిలాయి. కెప్టెన్‌ గిల్‌ ఔట్‌. ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేసిన గిల్‌.. ఇల్లీస్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

కింగ్‌ కోహ్లీ ఔట్‌..
భారత్‌ మరో షాక్‌ తగిలింది. రోహిత్‌ బాటలోనే కింగ్‌ కోహ్లీ కూడా వెనుదిరిగాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో కోహ్లీ.. క్యాచ్‌ అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌట్‌ అయ్యాడు. 

రోహిత్‌ శర్మ ఔట్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 14/1

ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు..
3 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా13 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌(5), రోహిత్‌ శర్మ(8) ఉన్నారు.

బౌలింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌..
పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌పున నితీశ్ కుమార్ రెడ్డి వ‌న్డే అరంగేట్రం చేశాడు. అదేవిధంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లతో టీమిండియాకు బరిలోకి దిగింది.

మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లు ఫాస్ట్ బౌలర్లగా చోటు దక్కించుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లగా అక్షర్ పటేల్‌, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అయితే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కలేదు.

రోహిత్‌, విరాట్‌ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఆసీస్ తరపున ఇద్దరు ఆటగాళ్లు డెబ్యూ చేశారు. మాట్ రెన్‌షా, మిచెల్ ఓవెన్‌లకు వన్డే క్యాప్‌లను అందించారు.

తుది జట్లు
భారత్‌:  రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్‌), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement