కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు సైతం తడబడుతున్నారు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం రవీంద్ర జడేజా(11), ధ్రువ్ జురెల్(4) ఉన్నారు.
37-1 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 14 ఓవర్ల తర్వాత వాషింగ్టన్ సుందర్(29) వికెట్ కోల్పోయింది. ఆచితూచి ఆడిన సుందర్ సఫారీ స్పిన్నర్ హార్మర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చి కెప్టెన్ శుభ్‌మన్ గిల్(4) మెడ పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు.

అనంతరం క్రీజులో నిలదొక్కుకున్న కేఎల్ రాహుల్(39), రిషబ్ పంత్(27) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇప్పటివరకు జానెసన్, బాష్, హార్మర్, మహారాజ్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 21 పరుగుల వెనకంజలో ఉంది.
తుది జట్లు
దక్షిణాఫ్రికా : ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్
భారత్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


