కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండో రోజు ఆటలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడపట్టేయడం (Neck Sprain)తో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ 35 ఓవర్ వేసిన సైమన్ హార్మర్ బౌలింగ్‌లో రెండో బంతిని సుందర్ ఔటయ్యాక గిల్ క్రీజులోకి వచ్చాడు.
అదే ఓవర్‌లో ఐదో బంతికి స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. ఈ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ మెడ పట్టేసింది. దీంతో గిల్ నొప్పితో విల్లవిల్లాడు. అతడు మెడను పూర్తిగా కదల్చలేని విధంగా కనిపించాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి గిల్ మాత్రం కాస్త ఆసౌకర్యంగానే కన్పించాడు.
ఈ క్రమంలో ఫిజియో సాయంతో గిల్ మైదానాన్ని వీడాడు. గిల్ బ్యాటింగ్‌కు తిరిగి వస్తాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
టీమిండియా సఫారీల కంటే ఇంకా 21 పరుగుల వెనకంజలో ఉంది. కాగా అంతకుముందు పర్యాటక జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది.
కాగా గిల్ గాయంపై బీసీసీఐ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. గిల్ రికవరీ బట్టి ఈ రోజు ఆటలో పాల్గొనడంపై నిర్ణయం తీసుకోబడుతుంది అని బీసీసీఐ ఎక్స్‌లో రాసుకొచ్చింది.
చదవండి: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్


