breaking news
Karnataka
-
'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు
నకిలీ ఓట్లను, చొరబాటుదారులను ఏరివేసి పేరుతో భారత ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR - ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర వివాదాలకు దారితీసింది. ఒక్కో రోజు ఒక్కో వింత సంఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, భారత రత్న గ్రహీత ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు Chintamani Nagesa Ramachandra Rao (92)కు కర్ణాటక SIR నుంచి నోటీసు అందింది. ఓటర్ల జాబితాలో ఆయన పేరు వద్ద నమోదైన అక్షర దోషం (Spelling Discrepancy) కారణంగా ఈ నోటీసు జారీ కావడంపలువుర్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. "Self-name mismatch" (పేరు వ్యత్యాసం) కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో (2002) వివరాలకు, ప్రస్తుత ఓటర్ల జాబితా వివరాలకు వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ నోటీసు జారీ చేస్తారు. పాత ఓటర్ల జాబితాలో ఆయన పేరు "Prof CNR Rao" అని ఉండగా, ప్రస్తుత ఓటర్ల జాబితాలో "Prof" స్థానంలో అదనంగా ఒక 'f' చేరి "Proff CNR Rao"గా నమోదైంది. తన గురింపును నిరూపించుకోవడానికి బెంగళూరులోని మల్లేశ్వరం వద్ద జరగనున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించారు.ఇదీ చదవండి: రీల్స్‌తో పరువు తీస్తోందని కన్నతండ్రే కొడుకుతో కలిసి!ఎవరి ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు భారత అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' పొందిన మూడో శాస్త్రవేత్త. అంతేకాదు ఆయనకు పద్మశ్రీ, పద్మవిభూషణ్, కర్ణాటక రత్న పురస్కారాలు కూడా అందుకున్నారు. సాలిడ్-స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీలో సీఎన్ఆర్ రావు విశేష పరిశోధనలు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) అధిపతిగా, జవాహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR) వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందించారు. అలాగే రాజీవ్ గాంధీ, హెచ్.డి. దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్, మన్మోహన్ సింగ్ లాంటి మాజీ ప్రధాన మంత్రుల హయాంలో సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షుడిగా, సభ్యుడిగా దేశ సైన్స్ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్ -
1993లో పిటిషన్.. 1988లోనే మరణం! హైకోర్టులో వింత కేసు
కర్ణాటక హైకోర్టులో 33 ఏళ్ల క్రితం నమోదైన భూ వివాద కేసులో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి అప్పటికే ఐదేళ్ల క్రితమే మృతి చెందినట్లు కోర్టు గుర్తించింది. 1993లో సి.మరియప్ప పేరుతో రిట్ పిటిషన్ దాఖలు కాగా.. 1988 ఆగస్టులోనే మరణించినట్లు విచారణలో వెల్లడైంది. వివరాలు ఇలా.. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా బెళవాడి గ్రామంలోని 4 ఎకరాల 21 గుంటల భూమికి సంబంధించిన వివాదం ఇది. 1981లో ల్యాండ్ ట్రిబ్యునల్ సి.నింగమ్మకు భూమిపై హక్కులు కల్పించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 1993లో మరియప్ప పేరుతో కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. మరియప్పకు పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న వ్యక్తి ద్వారా పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టు రికార్డుల్లో ఉంది. 2001లో హైకోర్టు ఆ పిటిషన్‌ను అంగీకరించి, విషయాన్ని పునఃపరిశీలించేందుకు ల్యాండ్ ట్రిబ్యునల్‌కు తిరిగి పంపింది. అనంతరం ల్యాండ్ ట్రిబ్యునల్ 2023లో ఇచ్చిన ఆదేశాలను మరియప్ప చట్టబద్ధ వారసుడు హైకోర్టులో సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాది కీలక విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 1993లో పిటిషన్ దాఖలు చేసే సమయానికే మరియప్ప మరణించి ఉన్నారని తెలిపారు. దీనిపై పరిశీలన జరిపిన హైకోర్టు.. ఆ వాదనలో వాస్తవం ఉందని గుర్తించింది. మరియప్ప కుమార్తె సుమలమ్మ గతంలో ల్యాండ్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్లో కూడా తన తండ్రి చాలా ఏళ్ల క్రితమే మరణించినట్లు పేర్కొన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. అయితే ఆయన మరణించిన ఖచ్చితమైన తేదీని అఫిడవిట్లో వెల్లడించలేదని పేర్కొంది. మరణించిన వ్యక్తి పేరుతో 1993లో రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఎలా సాధ్యమైందన్న దానిపై పిటిషనర్ తరఫు న్యాయవాది నుంచి సమర్థవంతమైన వివరణ రాలేదని న్యాయమూర్తి ఈ.ఎస్.ఇందరేశ్ అభిప్రాయపడ్డారు. మరణించిన వ్యక్తి పేరుతో అనంతరం పిటిషన్ దాఖలు చేయడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: మాట వినకపోతే కాల్చి పారేస్తా -
భర్తను వదలి మరో వ్యక్తితో సహజీవనం!
అనుమానాస్పద రీతిలో చైత్ర (28) అనే వివాహిత చనిపోయిన ఘటన తాలూకా పరిధిలోని చొక్కహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం తాలూకా ఇనమించేనహళ్లికి చెందిన చైత్ర 8 సంవత్సరాల నుంచి భర్తను వదలి చొక్కహళ్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివాసముంది. ఆమెకు 10, 12 సంవత్సరాల గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచనబలెకు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి చైత్రతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చైత్రను కొట్టి తరువాత అతడే ఉరి వేసి చంపాడని చైత్ర బంధువుల ఆరోపిస్తున్నారు. అతడే ఆమెను చిక్క ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయిందని నాటకం ఆడుతున్నాడని వాపోయారు. తరువాత షబ్బీర్ ఆమె మొబైల్‌ని తీసుకుని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. నందిగిరి ధామ పోలీసులు కేసు దాఖలు చేసుకొని షబ్బీర్ కోసం గాలిస్తున్నారు.-బెంగళూరు చదవండి: నాకేం తెలియదు.. అంతా నా భర్తే చూసుకుంటాడు -
మాట వినకపోతే కాల్చి పారేస్తా
బెంగళూరు: మొన్నటికి మొన్న ఇస్లాం మతాన్ని పొగుడుతూ హజ్ యాత్రకు వెళ్లాలని ఆశగా ఉందని వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి బసవరాజ రాయరెడ్డి ఈసారి మాట వినని అధికారులను కాల్చి పారేస్తానంటూ హెచ్చరించారు. కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా గున్నాళ గ్రామంలో జరిగిన జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి మాటలు చర్చనీయాంశమయ్యాయి. ఏ అధికారి మాట వినడో నాకు చెప్పండి, ఆ అధికారిని కాల్చి పారేస్తానంటూ ఆగ్రహించారు. యలబుర్గ తహసీల్దార్ ప్రకాష్‌ను వేదికపైకి పిలిచి తాను మంత్రి బాధ్యతల్లో పూర్తిగా బిజీగా ఉంటా, నువ్వే నా పీఆర్ఓగా పని చేయాలంటూ సూచించారు. తమ ప్రభుత్వంలోని గ్యారెంటీ పథకాలు ఎప్పటిలా కొనసాగుతాయన్నారు. చదవండి: కంగనా సీరియస్.. కేంద్రాన్ని అడుక్కోవాలా అంటూ.. -
చిన్నారి కిట్టయ్యలు
మైసూరు: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా మైసూరు సరస్వతీపురంలోని శ్రీకృష్ణధామలో చిన్నారులు ఆకట్టుకున్నారు. సుమారు 120 మంది పిల్లలు కృష్ణ, రాధా, గోపికల వేషధారణలో మురిపించారు. విజేతలకు కాణియూరుమఠం శ్రీవిద్యావల్లభతీర్థ స్వామీజీ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత ఆత్మహత్యమండ్య: రాష్ట్రంలో తీవ్ర కరువు కారణంగా అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని బలేత్తిగుప్పె గ్రామంలో అప్పుల భారం భరించలేక ఒక రైతు ప్రాణాలు తీసుకున్నాడు. వివరాలు.. సోమయ్య కుమారుడు బి.ఎస్.చంద్రశేఖర్ (39), 1.23 ఎకరాల భూమిలో టమాటా, ఇతర పంటలు పండించేవాడు. ఇందుకోసం రూ. 25 లక్షల వరకూ అప్పులు చేశాడు. తీర్చమని అతనిపై ఒత్తిడి తేవడం, కరువు కారణంగా కలత చెంది పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పాండవపుర పోలీసులు కేసు నమోదు చేశారు. సహజీవనంలో విషాదం.. మహిళ అనుమానాస్పద మృతిచిక్కబళ్లాపురం: అనుమానాస్పద రీతిలో చైత్ర (28) అనే వివాహిత చనిపోయిన ఘటన తాలూకా పరిధిలోని చొక్కహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం తాలూకా ఇనమించేనహళ్లికి చెందిన చైత్ర 8 సంవత్సరాల నుంచి భర్తను వదలి చొక్కహళ్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివాసముంది. ఆమెకు 10, 12 సంవత్సరాల గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచనబలెకు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి చైత్రతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చైత్రను కొట్టి తరువాత అతడే ఉరి వేసి చంపాడని చైత్ర బంధువుల ఆరోపిస్తున్నారు. అతడే ఆమెను చిక్క ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయిందని నాటకం ఆడుతున్నాడని వాపోయారు. తరువాత షబ్బీర్ ఆమె మొబైల్‌ని తీసుకుని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. నందిగిరి ధామ పోలీసులు కేసు దాఖలు చేసుకొని షబ్బీర్ కోసం గాలిస్తున్నారు. 5వేల టెంకాయల నీళ్లతో అభిషేకంబొమ్మనహళ్లి: దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నగరంలోని శరవు మహా గణపతి ఆలయంలో స్వామివారికి మంగళవారం వేలాది కొబ్బరి నీళ్లతో అభిషేకించారు. భాద్రపద శుక్ల పక్ష చతుర్థికి ముందు వచ్చే ఏకాదశినాడు గణపతి స్వామికి ఇలా అభిషేకిస్తారు. మొదట పంచామృత అభిషేకం, ఆ తర్వాత కొబ్బరినీటితో అభిషేకం, పూజలు చేశారు. ఏడాదికోసారి జరిగే ఈ వేడుకను చూడడానికి అశేష భక్తులు తరలివచ్చారు. సోమవారం మధ్యాహ్నం నుంచే భక్తులు టెంకాయలను తీసుకొచ్చి ఆలయంలో అందజేశారు. 5 వేలకు పైగా కొబ్బరికాయలు సమకూరాయి. రాఘవేంద్ర శాస్త్రి, సరావు సుదేశ్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. -
తమిళనాడుకు మళ్లీ కావేరి జలాలు
బనశంకరి: కావేరి జలాల విషయంలో కన్నడనాడుకు ఎదురుగాలి వీస్తూనే ఉంది. తమిళనాడుకు కావేరి నదీ జలాలను ప్రతిరోజు 6 వేల క్యూసెక్కులను 15 రోజలు పాటు విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్సీ కర్ణాటకకు సిఫార్సు చేసింది. అంటే మొత్తం 7.8 టీఎంసీలను వదలాలి. తీవ్రమైన కరువు ఏర్పడిన సమయంలో మరోసారి నీటి విడుదల ఆదేశాలు అటు సర్కారుతో పాటు రైతాంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో కబిని, కేఆర్ఎస్ సహా నాలుగు డ్యాముల్లో ఇన్‌ఫ్లో గణనీయంగా క్షీణించింది. ఇది 3వ దఫా నీటి విడుదల ఆదేశం. రాష్ట్ర ప్రజలకు ద్రోహం మైసూరు: రాష్ట్రంలో కరువు సంభవించి ప్రజలకు, పశువులకు తాగునీటి సమస్య ఉన్నందున తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వెంటనే ఆపాలని రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు బడగలపుర నాగేంద్ర డిమాండ్ చేశారు. ఆయన జిల్లా పత్రికాభవనంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో గతంలో ఎన్నడూ చూడనంతగా కరువుతో మంచినీటికి కూడా ప్రజలు తిప్పలు పడుతున్న సందర్భంలోనూ తమిళనాడుకు నీటిని వదలడం సరికాదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 7.8 టీఎంసీలు ఇవ్వాలని సీడబ్ల్యూఆర్సీ ఆదేశం -
అదుపు తప్పిన బైక్.. ఇద్దరు దుర్మరణం
మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలో దేవలాపుర బస్టాండ్ వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. కేటీఎం బైక్‌లో వేగంగా వెళ్తున్న ఇద్దరు.. ఓ స్కూటర్‌ను ఢీకొని, ఆ తర్వాత రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో కిందపడిపోయారు. తీవ్రగాయాలైన అక్కడే మరణించారు. మృతులు బెంగళూరుకు చెందిన అభిషేక్, ప్రేమ్ కుమార్ అని తెలిసింది. స్కూటరిస్టు కాలికి గాయమైంది. నాగమంగళ రూరల్ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. దేవలాపుర పట్టణంలో రహదారి పనులు అసంపూర్తిగా ఉండటంతో, ఆ రహదారి ఏకమార్గంగా మారి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తోంది. ఇతర ప్రాంతాలవారు ఇక్కడి రోడ్లు తెలియక వేగంగా వెళ్తూ ప్రమాదాల బారినపడుతున్నారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరారు. ప్రదోష్ అప్రూవర్‌కు బ్రేక్ బనశంకరి: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నిందితుడు దర్శన్‌కు ఓరకంగా ఊరట లభించింది. సహ నిందితుడు ప్రదోష్ ఎస్.రావ్ అప్రూవర్‌గా మారతానని ప్రకటించడం తెలిసిందే. ఇందుకు కింది కోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో దర్శన్ శిబిరంలో తీవ్ర ఆదుర్దా నెలకొంది. ప్రదోష్ అప్రూవర్ని దర్శన్ వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారించి.. నగర 59వ సీసీహెచ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చారు. వారంలోగా ఆ ప్రక్రియను పునఃపరిశీలించి కొత్తగా ఆదేశాలు ఇవ్వాలని కింది కోర్టుకు ఆదేశించారు. బంగ్లా కోసం ఒత్తిడి చేయలేదు: మంత్రి బనశంకరి: బెంగళూరు క్రిసెంట్ రోడ్డులోని మాజీ మంత్రి హెచ్‌సీ.మహదేవప్ప ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని మంత్రి బైరతి సురేశ్ ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. మంత్రి అక్కడ మరమ్మతు పనులు కూడా ప్రారంభించారు. దీనిపై మంత్రి బైరతి సురేశ్ మాట్లాడుతూ మహదేవప్పతో ఎలాంటి గందరగోళం లేదని, అక్కడ ప్రజాపనుల శాఖ అధికారులు పనులు చేస్తున్నారని, వాటితో తనకు సంబంధం లేదని చెప్పారు. ఖాళీ చేయాలని నేను మహదేవప్పను ఒత్తిడి చేయలేదన్నారు. సీఎం అనుమతి ఇస్తే మహదేవప్ప అదే ఇంట్లో ఉండవచ్చునని, నాకు ఇబ్బంది లేదని అన్నారు. మంగళూరు జైల్లో భారీగా మొబైళ్లు యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు జైల్లోకి మొబైల్ఫోన్లు సరఫరా అవుతున్నట్లు తెలియడంతో స్థానిక బర్కే ఠాణా పోలీసులు సోదాలు చేశారు. 10 స్మార్ట్ ఫోన్లు దొరికాయి. మంగళవారం ఉదయం ఎ–బ్లాక్‌లో భారీగా సోదాలు నిర్వహించారు. మొబైళ్లు లభించిన నిందితులందరూ వివిధ క్రిమినల్ కేసుల్లో ఉన్నవారని విచారణలో బయట పడింది. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాట వినకపోతే కాల్చి పారేస్తా● అధికారులకు మంత్రి హెచ్చరిక హుబ్లీ: మొన్నటికి మొన్న ఇస్లాం మతాన్ని పొగుడుతూ హజ్ యాత్రకు వెళ్లాలని ఆశగా ఉందని వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి బసవరాజ రాయరెడ్డి ఈసారి మాట వినని అధికారులను కాల్చి పారేస్తానంటూ హెచ్చరించారు. కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా గున్నాళ గ్రామంలో జరిగిన జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి మాటలు చర్చనీయాంశమయ్యాయి. ఏ అధికారి మాట వినడో నాకు చెప్పండి, ఆ అధికారిని కాల్చి పారేస్తానంటూ ఆగ్రహించారు. యలబుర్గ తహసీల్దార్ ప్రకాష్‌ను వేదికపైకి పిలిచి తాను మంత్రి బాధ్యతల్లో పూర్తిగా బిజీగా ఉంటా, నువ్వే నా పీఆర్ఓగా పని చేయాలంటూ సూచించారు. తమ ప్రభుత్వంలోని గ్యారెంటీ పథకాలు ఎప్పటిలా కొనసాగుతాయన్నారు. -
మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి తనిఖీ
రైతులతో కలిసి ఇడ్లీలు ఆరగిస్తున్న సీఎం డీకే కూరగాయల రైతులతో సీఎం డీకే యశవంతపుర: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం ఉదయం బెంగళూరులోని యశవంతపుర ఏపీఎంసీ మార్కెట్‌ను ఆకస్మికంగా సందర్శించారు. రైతులు, వ్యాపారస్తులు, కూలీ కార్మికులతో మాటామంతీ జరిపారు. సీఎం రాకతో అధికారులు, రైతులు సంభ్రమానికి లోనయ్యారు. ఏపీఎంసీలో సమస్యలు, తూకంలో మోసాలు, వేలంలో వంచనల గురించి రైతులు సీఎంకు వివరించారు. రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిగడ్డలు, ఉర్లగడ్డలు, టెంకాయలు తదితరాలను పరిశీలించి వారితో మాట్లాడారు. మహిళా చిరు వ్యాపారులతో కలిసి సీఎం కాఫీ తాగారు. మార్కెట్లోకి వచ్చే వాహనాల నుంచి పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నారా, వ్యాపారులు కమీషన్ తీసుకుంటున్నారా అని రైతులను ప్రశ్నించారు. యశవంతపురలో లేదని, కలబుర్గి, బీదర్, విజయపుర మార్కెట్లో కమీషన్ వసూలు చేస్తున్నారని రైతులు తెలిపారు. మండీ వ్యాపారులు సక్రమంగా పన్నులు కడుతున్నారా? అని విచారించారు. రైతులకు అన్యాయం చేయకుండా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. కార్యదర్శి సస్పెండ్ జీవర్గి తాలూకా హిట్టనహళ్లి నుంచి వచ్చిన రైతులు అక్కడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి అక్రమాలకు పాల్పడుతున్నాడని సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు. బాల కార్మికులు ఉండరాదు యశవంతపుర మార్కెట్లో బాలలతో పని చేయించరాదని సీఎం స్పష్టంచేశారు. బాలలతో పనిచేయించేవారిపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి సీఎం ఇడ్లీ ఆరగించారు. 10న 100 రోజుల వేడుక బనశంకరి: సీఎం డీకే పదవిని చేపట్టిన 10వ తేదీకి వంద రోజులు అవుతుంది. ఆ రోజున ప్రత్యేక సమావేశం జరపనున్నారు. ఇందులో పాల్గొనాలని మాజీ సీఎం సిద్దరామయ్య నివాసానికి వెళ్లి సీఎం డీకే ఆహ్వానపత్రిక అందించారు. గంటపాటు చర్చలు జరిపారు. యశవంతపుర ఏపీఎంసీలో డీకే శివ రైతులు, వ్యాపారులతో సమస్యలపై ఆరా -
వచనకారుల కృషి అపారం
బళ్లారిఅర్బన్: వచనకారులు సమాజంలో మానవత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను పెంపొందించేందుకు తమ వచనాల ద్వారా చేసిన కృషి అపారం అని కసాప నేత నిష్టి రుద్రప్ప అన్నారు. నేతాజీ నగర్ గణేష్ దేవస్థానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 12వ శతాబ్దం వచనకారుల యుగం తెలిపారు. కులం, మతం, వర్ణం, లింగ, సామాజిక తారతమ్య భేదం లేకుండా చక్కటి సందేశాలను అందించారన్నారు. కాంగ్రెస్ ప్రముఖులు ఎల్.మారెప్ప, గాయకులు కే.తిమ్మప్ప, రాఘవేంద్ర గుడదూరు, విజయేంద్ర క్షత్రియ, గణేష్ అభయ్ కసాప, దొడ్డ బసవ గవాయి చక్కగా వచన గీతాలను పాడారు. వీరికి తబలాపై విరుపాక్షప్ప, కీప్యాడ్‌పై తిప్పేస్వామి సహకరించారు. దాతలు అక్కి మల్లికార్జున అందరిని సన్మానించారు. టీ.తిమ్మప్ప, నాగరెడ్డి, బీ.శ్రీధర్, శరణ బసవ పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్‌లో మూడో స్థానం రాయచూరు రూరల్: బళ్లారిలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో వివేకానంద మూడో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించాడు. టేబుల్ టెన్నిస్ అకాడమీ అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, నందాపూర్ శ్రీనివాస్, లక్ష్మి నారాయణ, శిక్షకుడు వీరణ్ణ వివేకానందను అభినందించారు. పర్యాటక రంగంలో పురస్కారాలు అందజేస్తాం బనశంకరి: పర్యాటక రంగంలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యక్తులను గుర్తించి కర్ణాటక టూరిజం అవార్డులు ప్రదానం చేస్తామని ఇంధన, టూరిజం శాఖ మంత్రి కేజే.జార్జ్ తెలిపారు. రాష్ట్రంలో వన్స్టేట్ మెనీవరల్డ్స్ బ్య్రాండ్ పేరుతో పురస్కారాలను అందజేస్తామన్నారు. కర్ణాటక టూరిజం సొసైటీ అధ్యక్షుడు కే.శ్యామరాజు మాట్లాడుతూ పర్యాటక ఆతిథ్య రంగంలో ఉత్తమసేవలు అందిస్తున్న వారికి గుర్తింపు ఇవ్వడంతోపాటు సేవా నాణ్యతను పెంచడం కోసం ఐదు విభాగాల్లో 35 పురస్కారాలు అందిస్తారని అన్నారు. -
అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకారం
రాయచూరు రూరల్: లింగసూగూరు అసిస్టెంట్ కమిషనర్‌గా నాగేంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. మంగళవారం ఏసీ కార్యాలయంలో అధికార బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు, ప్రజలు, రైతుల సహకారంతో లింగసూగూరు డివిజన్లో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ దాఖలాలు, ఖాతాల మార్పిడి తదితర పనులను సత్వరం పూర్తి చేస్తామన్నారు. నేత్రపర్వంగా రథోత్సవంరాయచూరు రూరల్: బాగల్కోటె జిల్లా హునగుంద తాలూకా ఇలకల్‌లో విజయ మహంతేష్ స్వామీజీ రథోత్సవం వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి వేలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. రథోత్సవంలో రాయచూరు, కొప్పళ, విజయపుర, గదగ్, బళ్లారి, హుబ్లీ ధార్వాడల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరక్షరాస్యత నిర్మూలిద్దాం రాయచూరు రూరల్: జిల్లాలో నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేద్దామని జెడ్పీ ప్రణాళికాధికారి రోణ అన్నారు. మంగళవారం జెడ్పీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలని పిలుపునిచ్చారు. భూమిలో పడిన విత్తనం, మనిషిని చేరిన అక్షరం ఎక్కడికీ వెళ్లదన్నారు. హత్తి, ఈరణ్ణ, శివమ్మ, దండెప్ప, సదానంద పూజారి, గిరియప్పలున్నారు. -
తుది అంకానికి బీజేపీ పాదయాత్ర
సాక్షి,బళ్లారి: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బీజేపీ చేపట్టిన బళ్లారి చలో బీజేపీ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. పాదయాత్ర ముగింపు సమావేశానికి భారీ ఎత్తున జన సమీకరణ చేసి ముగించాలని బీజేపీ భావించిన నేపథ్యంలో బహిరంగ సభకు తొలుత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రస్తావిస్తూ బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ పాదయాత్ర ముగింపు సమావేఽశానికి సెప్టెంబర్ 10న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. సమావేశాన్ని నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహిస్తామని అనుమతించాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా ఈ నెల 7న అధికారులకు దరఖాస్తు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సభ నిర్వహణకు మైదానంలో అనుమతి ఇవ్వాలని కోరారు. బీజేపీ నేతల విన్నపానికి ఎట్టకేలకు జిల్లాధికారి ఓకే చెబుతూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం బీజేపీ పాదయాత్ర ముగింపు సమావేశం నిర్వహించే మున్సిపల్ హైస్కూల్ మైదానాన్ని గాలి జనార్దనరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు తదితరులు పరిశీలించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతిపక్ష నేత ఆర్.అశోక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై. విజయేంద్ర, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, జగదీష్ శెట్టర్ తదితరులు పాల్గొంటారు. కుడితినికి చేరిన పాదయాత్ర సండూరు తాలూకాలోని దరోజీ నుంచి తిమ్మలాపుర మీదుగా కుడితిని వరకు పాదయాత్ర సాగింది. పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మాజీ మంత్రి బీ.శ్రీరాములు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి తదితరులు జనంతో మమేకం అవుతూ ముందుకు సాగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా అడుగంటిందని, అవినీతి తారస్థాయికి చేరుకుందనేందుకు ఉదాహరణ వాల్మీకి అభివృద్ధి మండలిలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలే సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. పాదయాత్రలో పాల్గొన్న శ్రీరాములు, విజయేంద్ర తదితరులు మున్సిపల్ మైదానాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి రేపటితో విపక్ష పోరాటానికి ముగింపు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సభ -
విద్యార్థిని మృతిపై దర్యాప్తునకు డిమాండ్
హొసపేటె: దావణగెరెలోని పీయూ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని రంజిత తన హాస్టల్ గదిలో ఇటీవల అనుమానాస్పదంగా మరణించిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని విజయనగర జిల్లా గంగామతస్తుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాధికారిణి కార్యాలయం ముందు నిరసన తెలిపిన గంగామత సమాజ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. రంజిత చాలా ప్రతిభావంతురాలైన విద్యార్థిని అని, ఆమెకు ఎలాంటి శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఉరి వేసుకుని మరణించడం అనేక అనుమానాలకు దారి తీసిందని, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని ఒత్తిడి చేశారు. యమనూరప్ప, శ్రీధర్, వై.రాజేష్, జంబయ్య, రామప్ప కబ్బేర్, వీరేష్, ఉమాపతి, ఎం.దానప్ప, ఎన్.అనిల్, ఎం.మారియప్ప, కే.నింగప్ప, సూర్యనారాయణ, శివకుమార్, బెండిగేరి లింగరాజు, మంజప్ప భోవి, హాలప్ప భోవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్‌స్టాలో తల్వార్‌తో పోజు.. నిందితుడు అరెస్ట్
హుబ్లీ: ఇన్‌స్టా ఖాతాలో తల్వార్ పట్టుకొన్న వీడియోను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన పాత హుబ్లీ ఈశ్వర్ నగర్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తల్వార్‌ను జప్తు చేశారు. గంగాధర్ మడివాళ నిందితుడు. ప్రజల్లో భయాందోళనలు కలిగేలా తల్వార్ పట్టుకున్న ఫోటోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కసబాపేటె పోలీసులు ఆయుధాల చట్టం ద్వారా కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ ఎస్జీ వడ్డర్ నేతృత్వంలో కార్యాచరణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్హుబ్లీ: ధార్వాడ జనతా నగర్ స్లం బోర్డులోని పేకాట అడ్డాపై దాడి చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతానికి చెందిన జకీర్, యాసిన్, అల్తాఫ్, సాదిక్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.12,030ల నగదుతో పాటు ఇతర వస్తువులను జప్తు చేశారు. విద్యాగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అభివృద్ధి పనులకు భూమిపూజబళ్లారిఅర్బన్: నగరంలోని పలు వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకు నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. 21వ వార్డులో హెచ్.లక్ష్మీకాంత్ ఇంటి వద్ద నుంచి 4వ క్రాస్ రోడ్డు వరకు రూ.90 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అనంతరం 24వ వార్డు కప్పగల్ రోడ్డులో సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టే 7వ క్రాస్ రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో హనుమాన్ నగర్‌లోని రమ్య లేఅవుట్ సమీపంలో 17, 18వ వార్డులను కలిపే పలు రోడ్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. చానాళ్ శేఖర్, వాసురెడ్డి, బండ్రాళ మృత్యుంజయ స్వామి తదితరులు పాల్గొన్నారు. టీచర్ల కొరతతో విద్యా రంగం కుదేలు రాయచూరు రూరల్: సర్కార్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యా రంగం కుదేలైందని రాష్ట్ర విద్యా సమితి అధ్యక్షుడు నిరంజనారాధ్య పేర్కొన్నారు. మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రాయచూరు ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం, ప్రభుత్వ పాఠశాల వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శూన్య ఉపాధ్యాయ పాఠశాలల్లో నియామకాలు లేకపోవడంతో విద్యా రంగం కుంటుపడిందని విచారం వ్యక్తం చేశారు. దేశంలో దశాబ్ద కాలం నుంచి లక్షకు పైగా పాఠశాలను మూసి వేశారన్నారు. ఎస్డీఎంసీ అధ్యక్షుడు జయణ్ణ, రతన్ చౌహాన్, సిద్దప్ప, అలీనా జోసెఫ్, విరుపాక్షి, సిద్దరామయ్య, హఫీజుల్లా, విద్యాపాటిల్లున్నారు. కనీస వేతనాలు అందించండి రాయచూరు రూరల్: రాష్ట్రంలోని వివిధ శాఖలు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలకు తోడు సవరించిన వేతనాలను అందించాలని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం ప్రధాన తపాలా అధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అయ్యాళప్ప మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించే విధంగా సర్కార్ చర్యలు చేపట్టి వారికి సక్రమంగా సౌకర్యాలు అందించాలని కోరుతూ రాష్ట్రపతికి తపాలా శాఖ కార్డుల మీద సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. -
క–క విమోచన వేడుకపై సమీక్ష
హొసపేటె: కళ్యాణ కర్ణాటక(క–క) ప్రాంతానికి స్వేచ్ఛా స్వాతంత్య్రం లభించిన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అత్యంత అర్థవంతంగా జరుపుకోవాలని అదనపు జిల్లాధికారి పీఎన్.లోకేష్ అన్నారు. తన కార్యాలయ సభామందిరంలో నిర్వహించిన ప్రాథమిక సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ఆరోజు ఉదయం 8 గంటలకు నియమావళి ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జెండాను ఎగురవేస్తారన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది జిల్లా స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి. జిల్లా శాఖలకు అప్పగించిన బాధ్యతలన్నింటినీ శ్రద్ధగా నిర్వర్తించాలని ఆయన అన్నారు. ఉదయం 9 గంటలకు జిల్లా ఇంచార్జి మంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారన్నారు. అనంతరం పోలీస్ బ్యాండ్ జాతీయ గీతాన్ని ఆలపిస్తుందన్నారు. ప్రముఖులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తారన్నారు. ఉదయం 10 గంటలకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. సబ్ డివిజనల్ అధికారి వివేకానంద, కన్నడ సంస్కృతి శాఖ సహాయ సంచాలకులు సిద్దలింగేష్ రంగన్నవరతో సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. -
కొత్త ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
హొసపేటె: జంబునాథహళ్లిలో నిర్మిస్తున్న కొత్త 300 పడకల జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రికి సంబంధించిన పనులు, వైద్య పరికరాల సరఫరా పురోగతిలో ఉన్నాయని, అక్టోబరు నెలలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి ఆస్పత్రిని ప్రారంభిస్తామని అన్నారు. ఆస్పత్రి పనులు దాదాపుగా పూర్తయ్యాయని, 50 శాతానికి పైగా వైద్య పరికరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలిన పరికరాలు, సామగ్రి వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రారంభోత్సవానికి ముందే ఆస్పత్రిని శుభ్రపరచాలని, వైద్య పరికరాలను అమర్చాలని, పరీక్షల ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. కేకేఆర్డీబీ గ్రాంటుతో కొత్త జిల్లా ఆస్పత్రికి అవసరమైన స్కానింగ్‌తో సహా వైద్య పరికరాలు, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కొత్త జిల్లా ఆస్పత్రికి అవసరమైన వైద్య సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ టీ.లింగరాజు తెలిపారు. జిల్లా సర్జన్ డాక్టర్ ఎల్ఆర్.శంకర్ నాయక్, జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్యతో పాటు వైద్య అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మాతా శిశు ఆస్పత్రిలో ఆరావైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల ఒక నవజాత శిశువు మరణించిన ఘటనపై నగరంలోని 60 పడకల మాతా, శిశు సంరక్షణ ఆస్పత్రిపై ప్రజలు, సంస్థల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్యే గవియప్ప ఆకస్మికంగా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సమస్యలను పరిశీలించారు. ఆయన రోగులు, వారి బంధువులను కలిసి ఆస్పత్రిలో సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో నెలకొన్న గందరగోళంపై రోగులు ఎమ్మెల్యే ముందు తమ గోడును వెలిబుచ్చారు. హాజరైన ఆస్పత్రి వైద్యులకు రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పెట్టిన పంటలు దెబ్బతినగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడ లేక, చేసిన అప్పులు తీర్చలేక రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బాధ ఎక్కువ కావడంతో వారం రోజుల క్రితం పురుగుల మందు తాగిన ఓ రైతు మంగళవారం చికిత్స ఫలించక మృతి చెందారు. తాలూకాలోని మోకా గ్రామానికి చెందిన శరభయ్య అనే రైతు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి దాదాపు రూ. 20 లక్షల అప్పు చేశారు. పంటలు పండక, అప్పు తీర్చే మార్గం కానరాక గత నెల 28న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. తక్షణం కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడిన శరభయ్య మరణించారు. మృతుడికి భాఽర్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలు తప్పకుండా పాటించాలిహుబ్లీ: ఈసారి గణేష్ చవితి ఉత్సవాల్లో నియమాలను తూచ తప్పకుండా పాటించాలని నిర్వాహకులకు నగర కొత్త పోలీస్ కమిషనర్ భూషణ్ బుర్సే సూచించారు. వినాయక చవితి నేపథ్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండళ్ల నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల అనుకూలం కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే నియమాలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంలో ప్రతి పోలీస్‌ను కఠినంగా హెచ్చరిస్తున్నానన్నారు. ముఖ్యంగా నిమజ్జనోత్సవాల్లో జరిగే పూజలు, పునస్కారాలు, ఇతర కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లోను సుప్రీంకోర్టు నియమాలను ఉల్లంఘించరాదని సూచించారు. నిర్వాహకులకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు. మా సొమ్ము తిరిగి ఇప్పించండిరాయచూరు రూరల్: నగరంలోని దర్వేశి కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి డబ్బు తిరిగి చెల్లించాలని పెట్టుబడిదార్లు డిమాండ్ చేశారు. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షులు అంబాజీ మైదునకర్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం రూ.800 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపి ప్రజలకు టోపీ వేసిన కంపెనీ నుంచి నిధులు వాపస్ ఇవ్వాలని కోరారు. ప్రజల నుంచి డిపాజిట్లుగా తీసుకున్న డబ్బులను కంపెనీ యాజమాన్యం నుంచి ఇప్పించాలని కోరుతూ అసిస్టెంట్ కమిషనర్ హంపన్నకు వినతిపత్రం సమర్పించారు. చేతివృత్తిదారులకు శిక్షణ మండ్య: సంప్రదాయక చేతివృత్తిదారులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అమలు చేస్తున్నట్లు జిల్లాధికారి డాక్టర్ కుమార్ తెలిపారు. మంగళవారం నగరంలోని జిల్లా కమిషనర్ కార్యాలయంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద 18 సాంప్రదాయ చేతివృత్తిదారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు సర్టిఫికెట్లతో సహా వివిధ సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా పారిశ్రామిక కేంద్రం అధికారి దినేష్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ కరాటే పోటీల్లో సత్తారాయచూరు రూరల్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిన 13వ జాతీయ కరాటే పోటీల ఫైనల్స్‌లో రాయచూరుకు చెందిన వైష్ణవి పాటిల్ మూడో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించింది. కరాటే అకాడమీ అధ్యక్షుడు రామచంద్ర, శిక్షకులు అనిరుధ్, పవన్ సుఖాణి, ఆశా, రాజాశంకర్ ఆమెను అభినందించారు. గణేష్ పండుగ ప్రశాంతంగా జరుపుకోండి రాయచూరు రూరల్: జిల్లాలో ప్రశాంతంగా గణేష్ పండుగను జరుపుకోవాలని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. నగరసభ కార్యాలయంలో జరిగిన శాంతి సమావేశంలో ఆమె మాట్లాడారు. 14వ తేదీన వినాయకులను ప్రతిష్టించాలని, 22వ తేదీన నిమజ్జనం చేయాలన్నారు. డీజేల అమరికను పూర్తిగా నిషేధించామన్నారు. రాత్రి 10 గంటల తరువాత లౌడ్ స్పీకర్లను వినియోగిస్తే చర్యలు తప్పవన్నారు. గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, పోలీస్ అధికారులు శాంత వీర, దాదావలి, ఉమేష్, మంజునాథ్‌లున్నారు. -
భ్రూణలింగ నిర్ధారణ నేరం
హొసపేటె: భ్రూణలింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అని జిల్లా మిషన్ శక్తి కో–ఆర్డినేటర్ విద్యా పేర్కొన్నారు. ఆమె విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా ఆరోగ్య అధికారి కార్యాలయ హాలులో పీసీపీఎన్డీటీ చట్టం–1994పై ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణా సదస్సులో మాట్లాడారు. పీసీపీఎన్డీటీ చట్టం ఉద్దేశ్యం, భ్రూణహత్యల నివారణలో ప్రాముఖ్యత, ఆడపిల్లలను రక్షించాల్సిన అవశ్యకత, వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం గురించి వివరించారు. హరపనహళ్లి బాలల అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి రామన గౌడ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. బాలికల సంఖ్య తగ్గిపోకుండా నివారించడానికి సమాజంలో అవగాహన కల్పించడం, బాలికలపై సామాజిక వైఖరిలో మార్పు తేవడం గురించి విశ్లేషించారు. జిల్లా కుటుంబ సంక్షేమ అధికారి వినయ్, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ ధర్మనగౌడ, జిల్లా ఆరోగ్య విద్యా అధికారి దొడ్డమని, తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ అరవింద్, సీనియర్ సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పవిత్రగౌడ బ్యారక్ మార్పు!
కర్ణాటక: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, నటి పవిత్ర గౌడ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో బ్యారక్‌ను మార్చేందుకు 59వ సివిల్, సెషన్స్‌కోర్టు ఆమోదించింది. ఇప్పుడున్న బ్యారక్‌లో 30 మందికి పైగా ఉంటున్నారు, ఒక్కటే మరుగుదొడ్డి ఉండడంతో ఇబ్బందిగా ఉందని పవిత్ర కోర్టులో అర్జీ వేసింది. దీంతో మరో బ్యారక్‌లోకి తరలించాలని జడ్జి ఆదేశించారు. మళ్లీ హైకోర్టుకు దర్శన్ తనను వీడియో కాన్ఫరెన్స్‌లో కాకుండా నేరుగా కోర్టు వాయిదాలకు హాజరయ్యేలా అనుమతించాలని రెండవ నిందితుడు, నటుడు దర్శన్ మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన పిటిషన్‌ని భద్రతా కారణాల పేరుతో 59వ సీసీహెచ్ కోర్టు తిరస్కరించింది.చదవండి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్ -
ఇస్రో ప్రైవేటీకరణ జరగదు
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రభుత్వ సంస్థగానే కొనసాగనుందని ఆ సంస్థ ఛైర్మన్ వి.నారాయణన్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ఆందోళనలను కొట్టివేశారు. భారత అంతరిక్ష ప్రయోగ వ్యవస్థను విస్తరించే లక్ష్యంతో ఇస్రో ప్రస్తుతం 450 స్టార్టప్, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తోందని స్పష్టం చేశారు. తయారీ, నిర్వహణ కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న ప్రతిపాదనపై ఇస్రో అధికారికంగా స్పష్టత ఇవ్వాలని కోరుతూ తొమ్మిది ఉద్యోగ సంఘాలు సెపె్టంబరు నాలుగున ఛైర్మన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. బెంగళూరులో సోమవారం మొదలైన తొమ్మిదవ బెంగళూరు స్పేస్ ఎక్స్పో కార్యక్రమంలో ఛైర్మన్ నారాయణన్ విలేకరులతో మాట్లాడారు. భారత అంతరిక్ష ప్రయోగ కార్యక్రమాలు మొదలై దాదాపు 65 సంవత్సరాలవుతోందని, దేశంలోని సామాన్య పౌరుల సేవలో 56 వ్యవస్థలు అంతరిక్షంలో పనిచేస్తున్నాయని... కాకపోతే మరెన్నో వ్యవస్థల అవసరం ఉందని చెప్పారు. ఆరేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో సంస్కరణల అమలు మొదలైనప్పుడు ఇస్రో ప్రైవేట్ రంగాన్ని, స్టార్టప్ కంపెనీలకు తగిన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఏర్పడిందని గుర్తు చేశారు. -
కరువుపై నేతల మధ్య లేఖల సమరం
హుబ్లీ: కరువు ప్రాంతాల ప్రకటన విషయంలో విజయపుర జిల్లా ఇన్చార్జి మంత్రి ఎంబీ పాటిల్, ముద్దేబిహాళ ఎమ్మెల్యే సీఎస్ నాడగౌడల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుంది. ముద్దేబిహాళ, తాళికోటె పేర్లను కరువు పీడిత తాలూకాల జాబితాలో ప్రకటించక పోవడానికి కారణం ఎంబీ పాటిలే అంటూ ఎమ్మెల్యే నాడగౌడ తీవ్ర ఆరోపణలు చేశారు. స్వపక్ష ఎమ్మెల్యే వ్యాఖ్యల మేరకు మంత్రి ఎంబీ పాటిల్ ప్రకటన చేశారని, అన్ని తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు. అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. తాను ఆయా నియోజకవర్గాలకు కరువు అధ్యయనానికి వెళ్లినప్పుడు నేను బెంగళూరు, ఢిల్లీలో ఉన్నానని సాకు చెప్పారు. తమకు అన్యాయం జరిగితే రెవెన్యూ మంత్రిని, సీఎంను కలిసి చర్చించాలి. అయితే నియోజకవర్గ ప్రజలను వంచించడానికి నాటకం అడుతున్నారని ఎంబీ పాటిల్ తన లేఖలో నాడగౌడపై మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యే ఇటీవల ప్రభుత్వంపై, హైకమాండ్‌పై, తనపై నిరంతరంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనను సహనంతో నడుచుకోవాలని హైకమాండ్ సూచించిందన్నారు. తన సహనాన్ని బలహీనతగా కొందరు భావిస్తున్నారు. ముద్దేబిహాళ్ ఎమ్మెల్యే వయోసహజ మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు సరైన చికిత్స అవసరం. ఇకపై దిగజారుడు వ్యాఖ్యలు కొనసాగిస్తే ఆయన మనోవ్యాధికి చికిత్సే సరైన పరిష్కారం అని ఎంబీ పాటిల్ కాసింత ఆగ్రహంగా ఎమ్మెల్యే నాడగౌడపై చిందులు తొక్కారు. -
వరుణదేవుని కోసం పెళ్లితంతు
మండ్య: ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నా వానలు రావడం లేదు. నదులు, చెరువుల్లో నీటి ప్రవాహం కరువై దుర్భిక్షం తాండవిస్తోంది. పొలాలు, పశుపక్ష్యాదులు వర్షం కోసం పరితపిస్తున్నాయి. ఇప్పటికై నా వరుణదేవుడు కరుణించాలని ప్రజలు పలు రకాలుగా పూజలు చేస్తున్నారు. మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని దేవలాపురంలో వర్ష దేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామస్తులు బాలునికి, బాలికకు వివాహ మహోత్సవ తంతు నిర్వహించారు. ఈ జంటను చూసైనా దేవుని మనసు కరిగి మంచి వర్షాలు కురవాలని ప్రార్థించారు. ఈ వేడుకకు చుట్టుపక్కల పల్లెల నుంచి జనం తరలివచ్చారు. వృద్ధ మహిళలు వర్షం కోసం జానపద గీతాలు ఆలపించారు. ప్రసాదం ఆరగించి వధూవరులు, అతిథులు ఎవరికి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. -
అందని నీరు.. రైతన్న బేజారు
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటికే సాగు చేసిన లక్షలాది హెక్టార్లలో పంట నష్టం సంభవించే అవకాశాలున్నాయి. సామర్థ్యాన్ని బట్టి గేజ్ నిర్వహణ చేసి ఆయకట్టు చివరి భూములకు నీరందేలా నీటిని సరఫరా చేయడంలో అధికారులు తగిన జాగ్రత్తలు పాటించడం లేదు. గతంలో ముఖ్యమంత్రి యడియూరప్ప ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించినందువల్లే నేడు ఆయకట్టు చివరి భూములకు నీరందక వాణిజ్య పంటలు వాడుముఖం పట్టాయన్న వాదన వినిపిస్తోంది. సింధనూరు, మస్కి, కవితాళ, మాన్వి తాలూకాల్లో రెండు లక్షల హెక్టార్లలో వరిని, రాయచూరు, సిరవార తాలూకాల్లో లక్ష హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో మిరప పంటలను పండిస్తున్నారు. నీరందించకుంటే పంట నష్టమే చివరి భూములకు నీటిని అందిస్తే పంటలు చేతికందే అవకాశం ఉంది. లేకుంటే పంట నష్టం తప్పదు. కాలువకు నీటి సామర్థ్యం పెంచడం, గేజ్ నిర్వహణ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల పంటలు ఏపుగా పెరిగే సమయంలో నీటిలభ్యత కరువైంది. దీంతో దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. సింధనూరు తాలూకా ముక్కుంద గ్రామానికి చెందిన అయ్యప్ప అనే యువ రైతు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నీరు విడుదల చేస్తామని హామీలిచ్చిన నేతలు నేడు కనుమరుగయ్యారని ఆరోపించారు. తాము 20 ఎకరాలు స్వంతంగా, 4 ఎకరాలు లీజుకు తీసుకొని పంటలు సాగు చేశామని, నీరు లేక పంటలు మొత్తం వాడుముఖం పట్టాయని వాపోయారు. ఎడమ కాలువ చివరి భాగానికి చేరని నీరు ఆయకట్టులో ఎండుతున్న వాణిజ్య పంటలు -
రహదార్లు.. మృత్యుబాటలు
కోలారు: రాష్ట్రంలో పలుచోట్ల రోడ్లు రక్తసిక్తమయ్యాయి. విహారయాత్రలకు, కూలిపనులకు వెళ్లిన వారు అకాల మృత్యువు పాలయ్యారు. వారిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. తిరుమలలో వైకుంఠవాసున్ని దర్శించుకుని ఆనందంగా ఇంటికి తిరుగుముఖం పట్టిన కుటుంబం రోడ్డు ప్రమాదం బారిన పడింది. తల్లీ, కొడుకు, ఆయన కుమారుడు, సమీప బంధువు చనిపోయారు. కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలోని దొడ్డకారి గ్రామం వద్ద చైన్నె – బెంగళూరు ఎక్ప్‌ప్రెస్ హైవేలో సోమవారం ఉదయం ఈ ఘోరం జరిగింది. బెంగళూరు నగరం విద్యారణ్య పురకు చెందిన ఓ కుటుంబం ఇన్నోవా కారులో తిరుమలయాత్రకు వెళ్లింది. దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఘటనాస్థలిలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను ఢీకొని బోల్తా పడింది. శారద (70), ఆమె కుమారుడు దేవేంద్రకుమార్ (41), ఈయన కొడుకు జిష్ణు (13), బంధువు దీక్షిత (25) ప్రాణాలు కోల్పోయారు. డ్రైవరు వికాస్, మరో ముగ్గురు గాయపడ్డారు. అందరినీ కోలారు ఆస్పత్రికి తరలించారు. తరువాత గాయపడిన వారు అంబులెన్సులో బెంగళూరుకు వెళ్లిపోయారు. బేతమంగల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీఎఫ్ ఆస్పత్రికి తరలించారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి మార్మోగింది. ఆకస్మాత్తుగా కుక్క అడ్డం రావడం వల్ల తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టి పల్టీలు కొట్టిందని డ్రైవరు వికాస్ తెలిపాడు. విహారయాత్రకు వచ్చి తల్లీకూతురు.. యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లా యల్లాపుర తాలూకా అరబైలు ఘాట్‌లో రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమార్తె మరణించారు. వివరాలు.. పూణెకి చెందిన శర్మిలా రాజన్ కుల్లె (59), ఆమె కూతురు మృణ్మయి (32), హొసకోటకు చెందిన బాడుగ కారు డ్రైవర్ అలంబాషాతో కలిసి బాగల్‌కోట జిల్లాలో బాదామి విహారయాత్రకు వచ్చారు. సొంతూరికి తిరిగి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు కారు యల్లాపుర తాలూకా అరబైలు ఘాట్‌లో లారీ ఢీకొంది. లారీ కొంతదూరం కారును ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తె చనిపోగా, డ్రైవరుకు గాయాలయ్యాయి. పోలీసులు చేరుకుని కారులో నుంచి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. వెనుక కారు బీభత్సం ● మండ్య వద్ద బెంగళూరు మహిళ మృతి మండ్య: జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని తావరకెరె గేట్ వద్ద కారును వెనుక నుంచి మరో కారు వేగంగా దూసుకువచ్చి ఢీకొనింది. ముందు కారులోని బెంగళూరువాసి సుధా జైన్ (58) దుర్మరణం చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. హాసన్ జిల్లాలోని శ్రావణ బెళగోళ టూర్‌కు వెళ్లిన సుధా జైన్ కుటుంబం, జాతీయ రహదారిపై స్విఫ్ట్ కారులో బెంగళూరుకు తిరిగి వస్తోంది. వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు వారి కారును ఢీకొంటూ ముందుకెళ్లింది. ఈ రభసకు ముందున్న కారు తీవ్రంగా ధ్వంసమైంది. సుధా జైన్ అక్కడికక్కడే మరణించగా, కారులోని ముగ్గురు గాయపడ్డారు, రోడ్డు పక్కన నిలబడిన పెట్రోల్ బంక్ యజమాని కాలు విరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు, స్థానికులు కలిసి క్షతగాత్రులకు బయటకు తీసి బీజీ నగరలోని ఆదిచుంచనగిరి ఆసుపత్రిలో చేర్పించారు. వెనుక వస్తున్న ఓ వాహనంలోని డ్యాష్‌బోర్డు కెమెరాలో ఈ ప్రమాదం మొత్తం రికార్డయింది.కేజీఎఫ్ వద్ద ప్రమాదంలో నుజ్జయిన కారు రాష్ట్రంలో పలుచోట్ల యాక్సిడెంట్లు కోలారులో నలుగురు మృత్యువాత తిరుమల నుంచి బెంగళూరుకు వస్తుండగా కారు పల్టీలు -
కరువు సేద్యం.. ట్యాంకరు నీరే శరణ్యం
హొసపేటె: ఈసారి రుతుపవన వర్షాలు సరిగా కురవక పోవడంతో విజయనగర జిల్లా హడగలి తాలూకా కెంచమ్మనహళ్లి గ్రామానికి చెందిన రైతు బసవలింగప్ప తన ఉల్లి పంటను కాపాడుకోవడానికి ట్యాంకరు నీటిని ఆశ్రయించారు. జెస్కాం అధికారులు సరైన విద్యుత్‌ను అందించకపోవడంతో గ్రామంలోని బోరుబావులు ఎండిపోతున్నాయి. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల నీటిని వాడుతున్నారు. రైతు బసవలింగప్ప మాట్లాడుతూ ఉల్లికి ప్రస్తుతం మంచి ధర ఉండగా, వర్షాలు చేయి ఇవ్వడంతో చేతికి వచ్చిన పంట ఎండిపోయి నష్టం వచ్చిందన్నారు. తాను రూ.2 లక్షలు అప్పు తీసుకుని 4 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. కానీ నారు మొక్కలు రాగానే బోరుబావిలోని నీరు నిలిచి పోయి ఎండిపోతోందన్నారు. రోజూ 15 ట్యాంకర్ల నీరందిస్తున్నాం నా ఆస్తులన్ని తాకట్టు పెట్టి, పంటను కాపాడటానికి ప్రతి రోజూ పంటకు 15 ట్యాంకర్ల నీటిని అందిస్తున్నామని అన్నారు. ఒక్కొక్క ట్యాంకర్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నామని అన్నారు. రైతుల కష్టాలను చూడటానికి ఏ ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ పొలాలకు రావడం లేదు. బదులుగా వారు కార్యాలయాల్లో కూర్చుని నివేదికలు తయారు చేస్తున్నారు. పంట సర్వే నిర్వహించి, పంట నష్టపోయిన వారికి కనీసం ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని జిల్లాధికారిని డిమాండ్ చేశారు. కాగా ఉల్లి రైతుల సంఘం రాష్ట్ర విభాగం అధ్యక్షుడు సిద్దేశ్ ఉత్తంగి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు రైతులకు అండగా నిలిచి ఆదుకోవాలని డిమాండ్ వేశారు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా ఉల్లి పంటకు నీరందిస్తున్న రైతు ట్యాంకర్‌కు రూ.వెయ్యి ఖర్చుతో పంటను కాపాడుతున్న వైనం -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి
రాయచూరు రూరల్: నగరంలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరసభ, కార్పొరేషన్లు, ఈ–ఖాతా, తాగునీరు, మురుగు కాలువల శుభ్రత, అమృత నగర్– 2 పథకం పనులు మందకొడిగా సాగడంపై మంత్రి అధికారులపై చిందులు తొక్కారు. నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేయాలన్నారు. డిసెంబరులోగా ‘స్థానిక’ ఎన్నికలు నగర స్వచ్ఛతను కాపాడడానికి అధికారులు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య పేర్కొన్నారు. సోమవారం నగరంలోని యక్లాసపుర వద్ద చెత్త సేకరణ డంప్ యార్డులను పరిశీలించి మాట్లాడారు. ముఖ్యమంత్రి డీకే.శివ కుమార్ పేర్కొన్నట్లు డిసెంబర్‌లోగా జెడ్పీ, టీపీ, జీపీ, నగరసభ, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఐదేళ్లుగా జెడ్పీ, టీపీ, జీపీలకు, ఎనిమిదేళ్లుగా నగరసభలకు ఎన్నికలు నిర్వహించలేదన్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికల ప్రక్రియలు జరుగుతాయన్నారు. మహాత్మాగాంధీ వికాస్ పథకంలో నగరానికి రూ.185 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. స్వచ్ఛ భారత్ పథకం కింద రాయచూరు సిటీ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకొని శుభ్రత, ముడి వస్తువుల సేకరణ, ఇతర పనుల నిర్వహణలో తర్ఫీదు పొందే అవకాశముందన్నారు. ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఏనుగు ప్రతిమలను చూసి అధికారులను అభినందించారు. రెవెన్యూ అదాలత్‌ను ప్రారంభించి, అమృత్ తాగునీటి పథకాన్ని పర్యవేక్షించారు. మావినకెరె చెరువును పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీలు బోసురాజు, వసంత్ కుమార్, ఎమ్మెల్యే బసన గౌడ, ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లాధికారిణి పూవిత, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, మల్లికార్జునలున్నారు. -
ఎట్టకేలకు యావజ్జీవం
మైసూరు: పాత కక్షల కారణంగా ఒక ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురిని హత్య చేసిన దోషికి ఎట్టకేలకు హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మైసూరులోని ఉదయగిరికి చెందిన అబ్దుల్ షరీఫ్ దోషి. వివరాలు.. ఉదయగిరికి చెందిన అబ్దుల్ షరీఫ్, మహమ్మద్ అమీర్ జాన్ కుటుంబాల మధ్య డబ్బుల గురించి వివాదం ఉండేది. అదే పగతో, షరీఫ్ 2013 ఏప్రిల్ 12న అర్ధరాత్రి మహమ్మద్ అమీర్ జాన్ ఇంటిలోకి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో గ్యాస్ సిలిండర్ విస్ఫోటం చెందింది. ఈ ఘటనలో మహమ్మద్ అమీర్ జాన్, అతని తల్లి అఫ్రోజ్ బేగం, రేష్మా, అంజు.ఎ, రిజ్వాన్, రిగ్నానా తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రిలో మరణించారు. ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. ఈ కేసును విచారించిన మైసూరు రెండవ అదనపు సెషన్స్ కోర్టు, 2018 ఏప్రిల్ 28న నిందితున్ని నిర్దోషిగా ప్రకటించింది. కింది కోర్టు తీర్పుపై అభ్యంతరం ప్రభుత్వ న్యాయవాదులు ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. జడ్జిలు జస్టిస్ హెచ్. పి.సందేశ్ ధర్మాసనం విచారించింది. అన్ని ఆధారాలు పరిశీలించి దోషిగా నిర్ధారించి జీవితఖైదును విధించింది. ఘటన సమయంలో నిందితుని వయస్సు 50 కాగా, ఇప్పుడు వయస్సు 63 ఏళ్లు. ఫోరెన్సిక్ సాక్ష్యాలు, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కింది కోర్టు సరైన నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. పేలుడు వెంటనే జరిగిందా, తరువాత జరిగిందా అనే దానిపైనే ఎక్కువగా చర్చించారని, అది పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆ తీర్పు లోపభూయిష్టమని, దోషి వెంటనే పోలీసులు ముందు లొంగిపోవాలని జడ్జి స్పష్టం చేశారు. మైసూరులో ఇంటిపై పెట్రోలు పోసి ఆరుగురి హత్య కేసు.. 13 ఏళ్ల తరువాత దోషికి హైకోర్టులో శిక్ష -
సమయం మీరినా తెరిచిన పబ్‌పై దాడి
హుబ్లీ: సమయం గడిచినా పబ్ నిర్వహిస్తున్న గోకుల్ రోడ్డు ఐస్ క్యూబ్ హోటల్‌పై హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనరేట్ శాంతిభద్రతల విభాగం డీసీపీ శృతి నేతృత్వంలో రాత్రి దాడి చేశారు. నిర్ధిష్ట సమయంలో హోటల్ వ్యాపారాలను ముగించడం లేదని ప్రజలు చేసిన ఫిర్యాదులతో ఉన్న ఫలంగా ఈ దాడి చేసి అక్కడ ఉన్న యువతీ యువకులను బయటకు పంపించి పబ్‌ను బంద్ చేశారు. గోకుల్ రోడ్డు పోలీస్ స్టేషన్లో కేసు దర్యాప్తులో ఉంది. నగరంలోని అన్ని హోటళ్లు, పబ్‌లు, వైన్ షాపులను పరిశీలించాలని కొత్త కమిషనర్ భూషన్ బుర్సే సూచన మేరకు ఈ దాడి జరిగింది. ఇకపై ఎవరూ కూడా గడువుకు మించి హోటళ్లు, పబ్‌లను తెరిచి ఉంచరాదని కొత్త కమిషనర్ గట్టి హెచ్చరిక చేశారు. గురువు స్థానం మహోన్నతం● ఎమ్మెల్యే నేమిరాజ నాయక్ హొసపేటె: అందరి కంటే గురువు స్థానం మహోన్నతమైనదని విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ నాయక్ పేర్కొన్నారు. సోమవారం హగరిబొమ్మనహళ్లి పట్టణంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా పట్టణంలోని వాల్మీకి భవన్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గురువు స్థానం అమూల్యమైనదని ఆయన అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ ప్రపంచానికి ఆదర్శం అన్నారు. విద్య లేకుండా ఏదీ సాధించడం అసాధ్యం. విద్య ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జీవితాన్ని నిర్మించుకునే శక్తిని గురువు నుంచి పొందవచ్చన్నారు. ఇంతటి పవిత్రమైన స్థానంలో ఉన్న ఉపాధ్యాయుల బాధ్యత చాలా ముఖ్యమైనది. రూ.50 లక్షల వ్యయంతో గురుభవన్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. మరమ్మతులకు మరిన్ని నిధులు అవసరమైతే, ఈ ఏడాదే ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. నందీపుర డాక్టర్ మహేశ్వర స్వామీజీ, హాల సిద్దేశ్వర స్వామీజీ, బీఈఓ జగదీశ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ బోధనలు అనుసరణీయంరాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో శ్రీకృష్ణ పరమాత్ముడి బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య అన్నారు. సోమవారం శ్రీకృష్ణ యాదవ భవనంలో యాదవ సమాజం ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. దేశంలో కుల, వర్గ, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు పెద్దపీట వేశారన్నారు. ఎమ్మెల్సీలు వసంత్ కుమార్, బోసురాజు, శంకరప్ప, నగరసభ మాజీ అధ్యక్షుడు మారెప్ప, తిమ్మప్ప నాడగౌడ, రవీంద్ర, భీమన్న, హనుమంతప్ప, చెన్నారెడ్డిలున్నారు. -
ఎడమ కాలువకు ‘గాలి’ వాయనం
హొసపేటె: గంగావతి తాలూకాలోని దాసనాళ సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర ఎడమ కాలువకు ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీఅరుణ సోమవారం రైతులు, బీజేపీ కార్యకర్తల సమక్షంలో వాయనం సమర్పించారు. శ్రావణమాసం సందర్భంగా మల్లాపుర సమీపంలోని వాన వీరభద్రేశ్వర ఆలయ మూడో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం వీరభద్రేశ్వర విగ్రహానికి రుద్రాభిషేకంతో పాటు వివిధ పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుడి దయతో మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని తాను ప్రార్థించానన్నారు. కల్మఠ కొట్టూరేశ్వర స్వామీజీ, జోగద నారాయణప్ప, శరబయ్య హిరేమట, మహంతేష్ శాస్త్రి హిరేమట, శ్రీకాంత్ హిరేమట, అనిల్, తుంగభద్ర సేవా సమితి సభ్యులు లింగరాజ్గౌడ, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. -
గజరాజులకు బరువు మోత
450 కేజీల ఇసుక మూటలతో నడక మైసూరు: దసరా గజరాజులకు అప్పుడే బరువు మోసే తర్ఫీదును ప్రారంభించారు. దసరా జంబూసవారీ ఊరేగింపు కోసం గజరాజులను సిద్ధం చేస్తున్నారు. గజదళంలోని మగ ఏనుగులకు వీపుపై బరువులు మోయించారు. ఒక్కో ఏనుగుపై 450 కేజీల బరువున్న ఇసుక మూటలను ఉంచి నడిపించారు. క్రమంగా దానిని 1000 కేజీలకు పెంచుతారు. పూజారి ప్రసాద్ రావు అంబావిలాస్ ప్యాలెస్‌లోని సోమేశ్వర ఆలయం సమీపంలో ఏనుగులకు పూజలు చేసి బరువు మోతకు సాగనంపారు. ముఖ్య ఏనుగు మహేంద్రపై మంచం కట్టి ఇనుప ఊయలను బిగించారు. తరువాత ఒక్కొక్కటి 50 కేజీల బరువున్న 9 ఇసుక బస్తాలను ఉంచారు. అటవీ సిబ్బంది, మావటీలు జాగ్రత్తగా బిగించారు. ప్యాలెస్ నుంచి బన్నిమంటపం పరేడ్ మైదానం వరకు బరువు మోస్తూ నడిచింది. డీసీఎఫ్ ప్రభుగౌడ మాట్లాడుతూ మహేంద్ర, ప్రశాంత్, ఏకలవ్య, ధనంజయతో బరువులు మోయించే సాధన చేయిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఫలితాలను బట్టి బంగారు అంబారీని మోసే గజరాజును ఎంపిక చేస్తామన్నారు. -
పాదయాత్రతో ప్రభుత్వానికి వణుకు
సాక్షి బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి, అక్రమాలు పెరిగిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ తాము చేపట్టిన పాదయాత్రతో ప్రభుత్వానికి వణుకు పుడుతోందని, సీఎం డీకే.శివకుమార్‌కు నిద్ర లేకుండా చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర పేర్కొన్నారు. సోమవారం బీజేపీ పాదయాత్ర ఏడో రోజుకు చేరుకుంది. కంప్లి తాలూకాలో బీజేపీ పాదయాత్రకు ఘనస్వాగతం లభించింది. బీవై. విజయేంద్రతో పాటు మాజీ మంత్రి శ్రీరాములు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ తేజస్ సూర్య, బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, మాజీ ఎమ్మెల్యే టీహెచ్ సురేష్‌బాబు తదితరులు పాదయాత్రలో పాల్గొనడంతో ఆయా గ్రామాల్లో రైతులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. భారీ జనసందోహంతో కంప్లి తాలూకా దేవలాపురకు పాదయాత్ర చేరుకుంది. పెచ్చుమీరిన అవినీతి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించినా రూ.52 వేల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని, మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అభివృద్ధి నిధులను కాజేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరిందని ధ్వజమెత్తారు. యువశక్తి భారత దేశానికి భవిష్యత్తు అని, అయితే సరైనా దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కేపీఎస్సీ నియామక ప్రక్రియలో నోటిఫికేషన్, పరీక్ష ఫలితాలు, ఇంటర్వ్యూల తర్వాత నెలల తరబడి కాలయాపన జరుగుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేపీఎస్సీలో సంస్కరణలు తేవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకతను పాటిస్తామన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి మాట్లాడుతూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పది రోజులు నిర్వహించాలని సూచించారు. మంత్రి పదవికి నాగేంద్ర రాజీనామా చేసినా పాదయాత్రకు విశేష మద్దతు లభిస్తోందన్నారు. అయితే ప్రభుత్వం కొత్తగా ప్రజాసేవ అంటూ జనంలోకి వెళ్తుండటం సిగ్గుచేటన్నారు. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్థన్‌రెడ్డి, మాజీ మంత్రి బీ.శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎంకు నిద్ర దూరం చేస్తున్న పోరాటం కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేక ప్రాధాన్యత బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర -
దేవదేవుని కళ్యాణం
కోలారు: ముళబాగిలు నగరంలోని జ్యోతినగర పాళ్యలో ఉన్న పురాణ ప్రసిద్ధ తుళసిరామ దేవాలయంలో శ్రీనివాస సమేత పద్మావతి దేవర కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయంలో గత వంద సంవత్సరాలకు పైగా ఏటా కళ్యాణోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. వేదపండితులు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులకు కనులపండువగా సాగింది. పవిత్రగౌడ బ్యారక్ మార్పు! యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, నటి పవిత్ర గౌడ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో బ్యారక్‌ను మార్చేందుకు 59వ సివిల్, సెషన్స్‌కోర్టు ఆమోదించింది. ఇప్పుడున్న బ్యారక్‌లో 30 మందికి పైగా ఉంటున్నారు, ఒక్కటే మరుగుదొడ్డి ఉండడంతో ఇబ్బందిగా ఉందని పవిత్ర కోర్టులో అర్జీ వేసింది. దీంతో మరో బ్యారక్‌లోకి తరలించాలని జడ్జి ఆదేశించారు. మళ్లీ హైకోర్టుకు దర్శన్ తనను వీడియో కాన్ఫరెన్స్‌లో కాకుండా నేరుగా కోర్టు వాయిదాలకు హాజరయ్యేలా అనుమతించాలని రెండవ నిందితుడు, నటుడు దర్శన్ మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన పిటిషన్‌ని భద్రతా కారణాల పేరుతో 59వ సీసీహెచ్ కోర్టు తిరస్కరించింది. త్వరలో మరిన్ని కరువు తాలూకాలు: సీఎం దొడ్డబళ్లాపురం: కరువుపీడిత తాలూకాలుగా ప్రకటించలేదని ఏ ఎమ్మెల్యే కూడా ఆందోళన చెందవద్దని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. రాష్ట్రంలో చాలా తాలూకాలలో కరువు తాండవిస్తోందని, అన్ని విధాలుగా పరిశీలించి కరువు పీడిత తాలూకాలను ఎంపిక చేస్తున్నామన్నారు. మొదటి విడత మాత్రమే ప్రకటించామని రెండవ, మూడవ విడతల్లో మరిన్ని తాలూకాలను ప్రకటిస్తామని తెలిపారు. రైతుల సమస్యల గురించి చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరుపుతామన్నారు. నైస్ పథకంపై చట్ట వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. వీధి వ్యాపారుల పొట్ట కొట్టొద్దుతుమకూరు: నగరంలో ఫుట్‌పాత్ దుకాణాలను కోర్టు ఆదేశాలంటూ కార్పొరేషన్ అధికారులు తొలగించి పొట్టకొడుతున్నారని వ్యాపారులు, కన్నడ, దళిత సంఘాల నాయకులు బృహత్ నిరసన నిర్వహించారు. ఇష్టానుసారం దుకాణాలను తొలగించడంతో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. వారికి జిల్లా యంత్రాంగం సహాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పార్కులు, రాజకాలువలను కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించిన ధనికులను పట్టించుకోరా, పేదలే కనిపిస్తారా? అని ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేసి, తరువాత కలెక్టరేట్‌కు వెళ్లి నిరసన తెలిపారు. ఒంటరిని చేసిన నేపాల్ దొడ్డబళ్లాపురం: నేపాల్ విహారయాత్రకు వెళ్లిన బెంగళూరు దంపతులు అక్కడ వరదల్లో గల్లంతయ్యారు. ఇప్పటివరకూ వారి ఆచూకీ లభించకపోవడంతో వారి కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కన్నవారు లేని అనాథగా జీవించాలా? అని ఆవేదన చెందుతోంది. అన్నందేవర వెంకటరావ్, అనఘ దంపతులు 67 మందితో కలిసి కై లాస పర్వత యాత్రకు వెళ్లారు. అయితే నేపాల్ విపత్తులో చిక్కుకుని అదృశ్యమయ్యారు. ఆగస్టు 30 తరువాత తల్లిదండ్రులతో మాట్లాడలేకపోయానని కుమార్తె తాన్వి కన్నీటిపర్యంతమవుతోంది. తాన్వి డీఎన్ఏతో ఏ మృతదేహం డీఎన్ఏ కూడా జత కాకపోవడంతో కన్నవారు బతికే ఉండవచ్చని ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. -
తిమ్మరాయ.. తిరుమలరాయ
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో ఆనేకల్ పట్టణంలోని తిమ్మరాయస్వామి ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన కోనేరును అటవీ శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కనులపండువగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అనేక సంవత్సరాల క్రితం ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు ఉండేది. కానీ పట్టణీకరణలో అది కనుమరుగైంది. భక్తులు, ఆలయ నిర్వాహకులు కలిసి పుష్కరిణిని పునరుద్ధరించారు. తిమ్మరాయస్వామికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. జీర్ణోద్ధరణ చేసిన పుష్కరిణిలో తెప్పోత్సవం -
సర్కారు బడుల్ని కాపాడుకుందాం
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలలను సంరక్షించడం మనందరి బాధ్యత అని ఎస్డీఎంసీ అధ్యక్షుడు జయణ్ణ పేర్కొన్నారు. సోమవారం విజ్ఞాన కేంద్రంలో స్వామి వివేకానంద, ప్రభుత్వ పాఠశాల వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి, ఎల్ఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాయచూరు జిల్లాను ఆస్ప్రియేషన్ జిల్లాగా ప్రకటించడంతో ఎస్డీఎంసీల సహకారంతో విద్యా రంగానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇంటిలో విద్య కేవలం సంస్కారం, సంప్రదాయాలు, ఆచార విచారాలతో పాటు పాఠశాలల్లో లభించే విద్య జీవన ప్రమాణాలను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. మన పాఠశాల, మన హక్కు లక్ష్యాన్ని సాధించాలన్నారు. సమావేశంలో నిరంజనారాధ్య, విరుపమ్మ, సురేష్ స్వామి, దేవరాజ్, హఫీజుల్లా, కృష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, సువర్ణలున్నారు. ఆర్టికల్ అమలు చేయాలని ధర్నా రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్– 371(జే)ను అమలు చేయాలని కళ్యాణ కర్ణాటక పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ కేంద్రం ఆర్టికల్‌ను జారీ చేసి దశాబ్దాలు గడిచినా దానిని సక్రమంగా అమలు చేయడంలో అధికారులు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆందోళనలో చామరస మాలి పాటిల్, కరియప్ప, చంద్రశేఖర్, అమరేష్, విద్యా పాటిల్ తదితరులున్నారు. ఖైదీలకు సంగీత శ్రవణం అవసరం రాయచూరు రూరల్: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మానసికంగా ప్రవర్ధమానులై సమాజంలో శాంతియుతంగా కుటుంబ జీవితం గడపడానికి సంగీత రస మంజరి అవసరమని సినీ నటి పూజా పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జిల్లా జైలులో కలా సంకుల సంస్థ ఏర్పాటు చేసిన సంగీతోత్సవ కార్యక్రమంలో ఖైదీలనుద్దేశించి మాట్లాడారు. శిక్షలు అనుభివించే ఖైదీలు భవిష్యత్తులో జీవితాలను మార్చుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోడానికి సంగీత శ్రవణం సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలర్ అనితా హిరేమని, జైల్ అధికారులు, శ్యాం ఖానాపూర్లున్నారు. బాధిత కుటుంబానికి పరామర్శరాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కర్ణాటక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం అశ్విని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి మాట్లాడారు. జిల్లాలో భూమానంద, రేణుక, రమేష్ మృతి చెంది నెల రోజులు కావస్తున్నా రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు దళితుల ఇళ్లలో చావులపై కనికరం లేకపోయిందని వాపోయారు. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గే కలబుర్గికి మంత్రా లేక రాష్ట్రాినికి మంత్రా, ఏసీ గదుల్లో కూర్చొని కాలయాపన చేయడం తగదన్నారు. హత్యలకు కారకులపై చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. రౌడీషీటర్‌పై కేసుహుబ్లీ: రోడ్డుపై తెల్లరంగు పౌడర్ పెట్టి దానిపై ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఏదో లిక్విడ్ వేసి నిప్పంటించి పేల్చేసి వీడియో వైరల్ చేసిన రౌడీషీటర్‌పై కేసు నమోదైంది. హుబ్లీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ మహమ్మద్ ఉజైఫ్ హుబ్లీ కులకర్ణి అక్కలద రోడ్డులో పేలుడు వస్తువును రవాణా చేస్తూ రోడ్డుపై పేల్చిన ఆరోపణలపై కేసు నమోదు చేశారు. -
నకిలీ వైద్యులపై కొరడా
సాక్షి, బెంగళూరు: నకిలీ ఔషధాల కేంద్రాలపై దాడులు చేసిన ఆరోగ్య శాఖ తాజాగా నకిలీ వైద్యులపై నిఘా పెట్టింది. రాష్ట్రంలో గత రెండేళ్లలో ఎంబీబీఎస్, బీఏఎంఎస్ తదితర సరైన వైద్య డిగ్రీ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేసే 583 మంది నకిలీ వైద్యులను గుర్తించింది. రాష్ట్రంలో ఈ సంఖ్య వేలల్లో ఉండవచ్చని అంచనాలున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా ఇటువంటి క్లినిక్‌లు దర్శనమిస్తాయి. ఏదో వైద్యం చేసేది డబ్బులు పిండుకోవడం వీరి నైజంగా మారింది. సహాయకులుగా పనిచేసి డాక్టర్‌గా అవతారం ఈ నకిలీ వైద్యుల్లో చాలామంది గతంలో క్లినిక్‌లలో సహాయకులు, ల్యాబ్ అసిస్టెంట్లు, కాంపౌండర్లు, నర్సులుగా పనిచేశారు. తరువాత సొంతంగా క్లినిక్‌లు ప్రారంభించి ఎడాపెడా వైద్యం చేస్తున్నారు. పల్లెలు, ఉత్తర కర్ణాటక ప్రాంతంలో నకిలీ వైద్యుల తాకిడి ఎక్కువగా ఉంది. బళ్లారి, విజయనగర, కలబురిగి, రాయచూరు, ధార్వాడ తదితర జిల్లాల్లో మరీ అధికమని తేలింది. సరిహద్దు జిల్లాలు, బెంగళూరులో మొబైల్ క్లినిక్‌లు నడిపిస్తున్నారు. ప్రతిరోజూ స్థలం, మొబైల్ నంబర్ మార్చుకుంటూ ప్రజలకు చికిత్సలు అందిస్తూ రావడం ప్రత్యేక తనిఖీ బృందాల దృష్టికి వచ్చాయి. వచ్చీరాని వైద్యంతో పరిస్థితి విషమించడం, ప్రాణాలే పోవడం జరుగుతోంది. జరిమానాలు, శిక్షలు అర్హతలు లేకుండా వైద్యమందిస్తూ పట్టుబడేవారికి తొలిసారి రూ. 25 వేల జరిమానా విధిస్తున్నారు. రెండో సారి కూడా పట్టుబడితే రూ. 2.5 లక్షల వరకు జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష, ఆ తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 5 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్షకు చట్టంలో అవకాశం ఉంది. దాడులకు జిల్లాస్థాయిలో ఆరోగ్య శాఖ బృందాలను ఏర్పాటు చేసింది. రోగులు అర్హత కలిగిన వైద్యుల వద్దకే వెళ్లాలని తెలిపింది. రెండేళ్లలో 583 మంది గుర్తింపు మళ్లీ దాడులకు ఆరోగ్యశాఖ కార్యాచరణ -
కరువు ప్రాంతంగా ప్రకటించాలి
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని యాదగిరి జిల్లా గురుమటకల్ను కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించి, వాణిజ్య బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని గురుమటకల్ శాసన సభ్యుడు శరణేగౌడ కందకూరు డిమాండ్ చేశారు. సోమవారం బెంగళూరు విధానసౌధ ముందు మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఆయన ఆందోళన చేపట్టి మాట్లాడారు. జిల్లా అధికార యంత్రాగం కరువు తాలూకాగా ప్రకటించాలని రాష్ట్ర సర్కారుకు ప్రతిపాదనలు పంపినా జేడీఎస్ శాసన సభ్యుడిననే భావనతో కరువు ప్రాంతంగా ప్రకటించకుండా జాబితా నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విధాన పరిషత్ ప్రతిపక్ష నేత నారాయణస్వామి ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. కనీస వేతనాలు అందించరూరాయచూరు రూరల్: రాష్ట్రంలోని వివిధ శాఖలు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలకు తోడు సవరించిన వేతనాలను అందించాలని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించేలా సర్కార్ చర్యలు చేపట్టి వారికి సక్రమంగా సౌకర్యాలు అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. -
ఉపాధికి వెళ్తుంటే ఊపిరే పోయింది
చింతామణి: పూలు కోయడానికి ఓమ్ని కారులో 13 మందిని మహిళా కూలీలతో వెళ్తుండగా మృత్యు శకటంలా టెంపో లారీ ఢీకొట్టింది. ముగ్గురు మహిళలు మరణించారు. శిడ్లఘట్ట తాలూకాలోని హొసహళ్లి గేట్ దగ్గర సోమవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. చింతామణి తాలూకా మల్లిఖార్జునపుర గ్రామానికి చెందిన మహిళా కూలీలు శిడ్లఘట్ట తాలూకాలోని తోటలో కూలి పనికి ఓమ్నీలో బయల్దేరారు. ఘటనాస్థలిలో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఓమ్నీ పల్టీలు కొట్టింది. రత్నమ్మ, (40), మునిచెన్నమ్మ (50), రూప (35) ప్రాణాలు కోల్పోయారు. మునిరత్నమ్మ, లక్ష్మీనరసమ్మ, నరసమ్మ, అనిత తీవ్రంగా గాయపడ్డారు. మంగమ్మ, నాగవేణి, లక్షమ్మ, రుక్మిణి, శిల్ప, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు తక్షణమే బాధితులను శిడ్లఘట్ట ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ పద్మిని సాహో ప్రమాదస్థలిని పరిశీలించారు. ఓమ్నీని ఢీకొన్న మినీ లారీ.. ముగ్గురు మహిళా కూలీల మృతి -
జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్
కర్ణాటక: ఖైదీలకు సెంట్రల్ జైలులో రాచ మర్యాదలు కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కలబుర్గి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ డాక్టర్ అనితను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీపీ అలోక్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జైలులో ఖైదీలు మొబైళ్లు వాడటం, సిగరెట్లు, మద్యం తాగడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియా, న్యూస్ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. ఇందుకు అనితను బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్ చేశారు. చదవండి: జైలు ఖైదీ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా.. -
మిమ్మల్ని క్షమించేది లేదు
బెంగళూరు: అందాల నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన అసభ్య కామెంట్ల కేసులో తగ్గేదే లేదని చెప్పారు. గతంలో దర్శన్ అభిమానులపై పెట్టిన అశ్లీల సందేశాల కేసును వాపస్ తీసుకోబోనని రమ్య తెలిపారు. బెంగళూరులో కోర్టు ఆవరణలో నిందితుల కుటుంబసభ్యులు రమ్యను కలిసి క్షమించి, కేసు వాపస్ తీసుకోవాలని వేడుకున్నారు. కానీ రమ్య ససేమిరా అన్నారు. ఈ కేసు అందరికీ గుణపాఠం కావాలని రమ్య చెప్పినట్లు తెలిసింది. మొబైల్‌ఫోన్ ఉందని ఓ మహిళను ఎలా కావాలంటే అలా కామెంట్ చేయవచ్చా? అని రమ్య వారిని ప్రశ్నించారు. కామెంట్ చేయడానికి ముందు వెయ్యి సార్లు యోచన చేయాలని, కేసు నడవాలి, తానే గెలపాలని, ఎన్నిసార్లు కోర్టు వాయిదాకు పిలిచినా వస్తానని ఆమె చెప్పారు. నిందితులను క్షమిస్తారా? అని జడ్జి కూడా ఆమెను విచారణలో అడిగినట్లు తెలిసింది. చదవండి: త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్ -
బైక్‌లకు దుండగుల నిప్పు
దొడ్డబళ్లాపురం: ఇంటి ముందు నిలిపిన ఐదు బైక్‌లకు దుండగులు నిప్పంటించిన సంఘటన బెంగళూరు పరప్పన అగ్రహార ఠాణా పరిధిలో జరిగింది. దొడ్డనాగమంగల దగ్గర కేంబ్రిడ్జ్ పాఠశాల వద్ద ఉన్న ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న ఐదు ఖరీదైన బైక్‌లకు శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో అవన్నీ పూర్తిగా దహనం కావడంతో పాటు ఆ ఇంటి కిటికీలు, తలుపులు కూడా కాలిపోయాయి. ఆధారాలను బట్టి కావాలనే నిప్పంటించారని పోలీసులు అనుమానిస్తున్నారు.కలబుర్గిలో దొంగనోట్ల ముఠా దొడ్డబళ్లాపురం: హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత జిల్లా కలబుర్గిలో దొంగనోట్ల ముఠా గుట్టు రట్టయింది. వివరాలు.. కలబుర్గిలోని రాజరాజేశ్వరి నగరలో ఓ ఇంట్లో దొంగనోట్లు ముద్రిస్తున్నారని సమాచారం అందడంతో యూనివర్సిటీ ఠాణా పోలీసులు దాడులు చేశారు. అశ్విన్ అనే నిందితుడు పరారవగా దశరథ్ రాథోడ్, సిద్దరామ అనే ఇద్దరు పట్టుబడ్డారు. నిందితులు అద్దె ఇల్లు తీసుకుని నోట్ల ముద్రణను ప్రారంభించారు. అక్కడ కలర్ ప్రింటర్‌తో పాటు రూ.14వేల విలువగల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పులు ఎక్కువవడంతో తీర్చడానికి ఈ దందాకు దిగినట్టు నిందితులు తెలిపారు. అయితే నోట్లు సరిగా ప్రింటింగ్ కాకపోవడంతో వాటిని చలామణి చేయలేకపోయారు. చాలా నోట్లను కాల్చివేసినట్టు తెలిసింది. మిమ్మల్ని క్షమించేది లేదు ● నిందితులపై రమ్య కాఠిన్యం యశవంతపుర: అందాల నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన అసభ్య కామెంట్ల కేసులో తగ్గేదే లేదని చెప్పారు. గతంలో దర్శన్ అభిమానులపై పెట్టిన అశ్లీల సందేశాల కేసును వాపస్ తీసుకోబోనని రమ్య తెలిపారు. బెంగళూరులో కోర్టు ఆవరణలో నిందితుల కుటుంబసభ్యులు రమ్యను కలిసి క్షమించి, కేసు వాపస్ తీసుకోవాలని వేడుకున్నారు. కానీ రమ్య ససేమిరా అన్నారు. ఈ కేసు అందరికీ గుణపాఠం కావాలని రమ్య చెప్పినట్లు తెలిసింది. మొబైల్‌ఫోన్ ఉందని ఓ మహిళను ఎలా కావాలంటే అలా కామెంట్ చేయవచ్చా? అని రమ్య వారిని ప్రశ్నించారు. కామెంట్ చేయడానికి ముందు వెయ్యి సార్లు యోచన చేయాలని, కేసు నడవాలి, తానే గెలపాలని, ఎన్నిసార్లు కోర్టు వాయిదాకు పిలిచినా వస్తానని ఆమె చెప్పారు. నిందితులను క్షమిస్తారా? అని జడ్జి కూడా ఆమెను విచారణలో అడిగినట్లు తెలిసింది. గణేశ మండపాలకు నిబంధనలు ● బెంగళూరు పోలీసు కమిషనర్ బనశంకరి: బెంగళూరులో వినాయక చవితి మండపాల ఏర్పాటులో నిబంధనలను పాటించాలని పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ తెలిపారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గణేశోత్సవానికి ఇతర శాఖల అనుమతి తప్పనిసరి అనుమతి తీసుకోవాలన్నారు. ఎలాంటి ఆదేశాలను ఉల్లంఘించరాదని తెలిపారు. సూచించిన మార్గంలోనే ఊరేగింపు నిర్వహించాలి, స్వయంసేవకుల జాబితా పోలీసులకు అందించాలన్నారు. మండపాలను, ఊరేగింపు మార్గాలను డీసీపీలు పరిశీలిస్తారు. నిబంధనల ఉల్లంఘన కనబడితే కఠినచర్యలు తీసుకుంటారని తెలిపారు. నగరంలో పీఓపీ విగ్రహాల తయారీ, విక్రయాలను, నిమజ్జనాన్ని నిషేధించామన్నారు. అధిక విగ్రహాలకు లోహమిశ్రమంతో కూడిన రసాయనిక రంగులు వాడకూడదన్నారు. చెరువులు, బావులతో పాటు ఎలాంటి జలమూలాల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదన్నారు. -
పులి వీడియో వైరల్
హుబ్లీ: పనికి వెళ్లకుండా తప్పించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) పరిజ్ఞానంతో ఓ యువకుడు సృష్టించిన నకిలీ పులి వీడియో వైరల్‌గా మారింది. వివరాలు ఇలా.. కొప్పళ తాలూకా కవళి గ్రామం ఈరణ్ణ అనే యువకుడు తోటలోకి పనికి వెళ్లకుండా ప్లాన్ వేశాడు. పని నుంచి తప్పించుకునేందుకు తోటలోకి పులి వచ్చినట్లుగా ఏఐతో వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. వీడియోను పరిశీలన చేయగా ఇది ఏఐ పని అని తెలుసుకున్నారు. అసత్యాన్ని సత్యంగా వైరల్ చేసి భయాందోళనకు గురి చేసినందుకు ఆ యువకుడిని అధికారులు మందలించారు. 50 బస్కిలు చేయమని శిక్ష విధించి హెచ్చరించి పంపించేశారు. -
శాంత హొసమనికి లుకౌట్
రికార్డు నాట్యంబనశంకరి: కేపీఎస్సీ పశువైద్యాధికారులు పోస్టుల అక్రమాలలో పరారీలో ఉన్న ఆ సంస్థ సభ్యురాలు శాంత హొసమనిపై సీఐడీ లుకౌట్ నోటీస్ జారీచేసింది. గత నెలలో ఈడీ అధికారులు ఆమె ఇంటిపై దాడి చేసినప్పటి నుంచి ఆమె జాడ లేరు. మొబైల్ స్విచ్చాఫ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు కూడా నోరుమెదపడం లేదు. అరెస్ట్ భయంతో పరారైనట్లు తెలుస్తోంది. మూడోసారి నోటీస్ జారీ చేయనున్నారు. ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్‌ను సీఐడీ మరోసారి విచారించింది. అక్రమాల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తన కుమార్తె కుల, ఆదాయ సర్టిఫికెట్లో సాంకేతిక లోపాటు తలెత్తి ఉండవచ్చు, అంతేతప్ప ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. పరీక్షల ప్రక్రియ కంట్రోలర్ ఆధీనంలో ఉంటుందని, ఇందులో తన పాత్రలేదని చెప్పినట్లు తెలిసింది. పరీక్షల కంట్రోలర్, ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్, బ్రోకరు బసవరాజ కన్నాళేను కస్టడీలో విచారిస్తున్నారు. ఆందోళనబాటలో విద్యార్థులు పశు వైద్యాధికారుల పరీక్షలు రాసిన నిరుద్యోగ యువత ఈ స్కాం నేపథ్యంలో ఢిల్లీ జెన్ జీ తరహాలో ఆందోళన చేయాలని నిర్ణయించారు. బెంగళూరు స్వతంత్రపార్కులో ఈనెల రెండోవారం నుంచి చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేపీఎస్సీ స్కాంలో సీఐడీ చర్యలు -
ఇస్కాన్‌లో ప్రత్యేక పూజలు
హుబ్లీ: ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఆచార్య ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆవిర్భావ దినం (పుట్టిన రోజు) సందర్భంగా స్థానిక రాయపుర్‌లోని ఇస్కాన్ మందిరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుపాదుల ఉత్సవ విగ్రహానికి అభిషేకం, తదితర పూజలు చేశారు. మహా నైవేద్యం కోసం భక్తులు తయారు చేసిన 3000 భక్షాలను ప్రభుపాదులకు సమర్పించారు. ఆ ప్రసాదాలను భక్తులకు వితరణ చేశారు. సన్మానం.. వివాదాస్పదంహుబ్లీ: హుబ్లీ–ధార్వాడ నగర పోలిస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన భూషణ బుర్సేను గంజాయి, హత్య కేసుల్లో నిందితులు సన్మానించడం వివాదాస్పదంగా మారింది. మత్తు మందుల రవాణా, హత్య కేసులో నిందితుడు అయిన కేత్సింగ్ రాజపురోహిత, గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడు అమిత్ బద్ది కమిషనర్‌ను సన్మానించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశమైంది. -
గజ సాధన.. జన రంజకం
ఆదివారం ప్యాలెస్ ఆవరణలో గజరాజులు నడక సాధనకు బయల్దేరిన గజం మైసూరు: నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవంలో పాల్గొనేందుకు అడవుల్లోని శిబిరాల నుంచి రాచ నగరానికి చేరుకున్న దసరా గజరాజులకు మంచి ఆతిథ్యం లభిస్తోంది. సిటీ లైఫ్‌ని ఏనుగులు చవి చూస్తున్నాయి. రోజూ ప్రభుత్వ లాంఛనాలతో కూడిన ఆహారం అందిస్తూ ఉత్సవాల కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తున్నారు. 9 ఏనుగులు మైసూరు ప్యాలెస్ ఆవరణలో మకాం వేశాయి. పొద్దున్నే మావటీలు వాటికి స్నానాలు చేయించి ఆహారం అందిస్తున్నారు. అటవీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రాజభవనం నుంచి ఆయుర్వేద కళాశాల సర్కిల్ వరకు నడక సాధన చేస్తున్నాయి. మొదట కూరగాయల మెను అటవీ అధికారి ఎస్.ఎస్.రవిశంకర్ మాట్లాడుతూ, ఏనుగులకు ఏమేం ఆహారం ఇస్తున్నదీ వివరించారు. మర్రిచెట్లు కొమ్మలు, గడ్డి, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి పీచుపదార్థం అధికంగా ఉండే కూరగాయలను తినిపిస్తున్నట్లు చెప్పారు. పశువైద్య అధికారుల సూచనల ప్రకారం ఏనుగుల జీర్ణక్రియకు ఆటంకం కలగకుండా, మితమైన మోతాదులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని అందిస్తున్నారు. త్వరలో ధాన్యాల తిండి మొదటి దశ శిక్షణ పూర్తయిన తర్వాత, ఏనుగులకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇస్తారు. శనగపిండి, మినపపప్పు, గోధుమలు, కుసుబల బియ్యం, ఉప్పు కలిపిన ఉల్లిపాయలు తినిపిస్తారు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, దోసకాయ వంటి కూరగాయల సలాడ్ కూడా అందిస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఇదే మెను ఇస్తారు, ఏనుగులు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటాయి. త్వరలో అభిమన్యు రాక దసరా ఏనుగుల రెండవ విడత బృందం మైసూరుకు చేరుకోనుంది. ఇందులో ప్రముఖ ఏనుగు కెప్టెన్ అభిమన్యు కూడా ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఆ ఏనుగు వల్ల మిగతా ఏనుగులకు కాస్త ధీమా ఏర్పడుతుంది. మైసూరులో నిత్యం ఏనుగుల సందడి నడక సాధనకు విశేష స్పందన అతిథులకు ఆరోగ్యకర మెనూమిన్నంటిన సందడి ఇక ఏనుగులను చూడటానికి వచ్చే ప్రజలు, టూరిస్టులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఏనుగుల ప్రశాంతతకు భంగం కలిగించరాదని వారిని అధికారులు కోరుతున్నారు. ప్రజలు గజరాజుల పట్ల ప్రేమగా ప్రవర్తించాలని, ఆటంకం కలిగించరాదని విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, పెద్దసంఖ్యలో అటవీ, పోలీసు సిబ్బంది ఏనుగుల వద్ద ఉంటున్నారు. ఆదివారం భారీ జన కోలాహలం మధ్య నడక సాధన చేశాయి. -
సమానత్వం కోసం పోరాడుతూనే ఉండాలి
● బీసీ కులాలకు సిద్దరామయ్య పిలుపు శివాజీనగర: ఈ దేశంలో ఒకనాటికి సమానత్వంతో కూడిన సమాజం ఏర్పడుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. మనం కుల వ్యవస్థ ఉన్నంత కాలం పోరాటం కొనసాగాలి అని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. కుల సర్వే నివేదికలోని సిఫార్సులను అమలు చేయాలని డీ.కే.శివకుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో రాష్ట్ర బీసీ కులసంఘాలు నిర్వహించిన రజతోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2013లో తాను ఎంతో తపించి కుల సర్వే చేయించానని, తరువాత సీఎం అయిన హెచ్డీ కుమారస్వామి ఆ నివేదికను అంగీకరించలేదని ఆయన చెప్పారు. అందరికీ సామాజిక న్యాయం కావాలంటే, కనీసం 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థను సంస్కరించాలి నేను రాజకీయాల్లో కొనసాగుతా, కేవలం ఎన్నికల నుంచే విరమిస్తాను, మన ఎన్నికల వ్యవస్థ చాలా ఖరీదైనదిగా మారింది, దీనిని సంస్కరించాలి అని సిద్దరామయ్య అన్నారు. ఎన్నికల వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉన్నందున నేను పోటీ చేయనని తెలిపారు. మీతో ఉండి పోరాటంలో పాల్గొంటానని చెప్పారు. ఈ సభలో డీసీఎం పరమేశ్వర్, మంత్రులు సంతోష్ లాడ్, పుట్టరంగశెట్టి, భైరతి సురేష్, మధు బంగారప్ప, అజయ్ సింగ్, ఎమ్మెల్యేలు బసవరాజ శివణ్ణనవర్, భీమసేన చిమ్మనకట్టి, ఉమేశ్ మేటి, పలువురు ఎమ్మెల్సీలు, బోర్డుల అధ్యక్షులు పాల్గొన్నారు. సొసైటీలో భారీ స్కాం.. సీఈఓ అదృశ్యంశివమొగ్గ: జిల్లాలోని హొసనగర తాలూకా, రిప్పన్‌పేట సమీపంలో హెడ్డరిపుర గ్రామ పంచాయతీ పరిధిలోని జంబళ్లి వద్ద దట్టమైన అడవిలో స్విఫ్ట్ కారు నిలిపి ఉంది. ప్రజలు పరిశీలన చేయగా, ఆ కారు కుడుమల్లిగే సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మదన్దని తెలిసింది. కారులోనే తాళాలు, ఆయన మొబైల్ ఫోన్, సొసైటీ ఖాతా పుస్తకాలు లభ్యం కావడం ఘటన తీవ్రతను మరింత పెంచింది. ఈ సొసైటీలో భారీఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మలూరు పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో మదన్ అదృశ్యమయ్యారు. ఆయన శుక్రవారం తీర్థహళ్లిలోని ఇంటి నుంచి బయలుదేరాడని సంబంధీకులు తెలిపారు. కారును నిలిపి ఎక్కడికి వెళ్లాడనేది మిస్టరీగా ఉంది. కారు లభ్యమైన జంబళ్లి అటవీ ప్రాంతంలో మదన్ కుటుంబసభ్యులు, స్థానిక ప్రజలు గాలిస్తున్నారు. పోలీసులు కూడా వెతుకులాట ప్రారంభించారు. టెక్కీకి చావుదెబ్బలు ● బెంగళూరులో దురాగతం కృష్ణరాజపురం: బెంగళూరులో చిన్న విషయానికే ఐటీ ఇంజనీరును బార్బర్‌షాపు యజమాని చావుదెబ్బలు కొట్టాడు. వివరాలు.. కృష్ణరాజపురంలో టెక్కీ టెరెన్స్ సందీప్‌ను నిందితుడు మునిరాజు కిరాతకంగా చావబాదాడు. శీగేహళ్లిలో పక్క భవనంలో కటింగ్ షాప్ నడుపుతున్న మునిరాజు, టెక్కీ నివసించే ఇంటి గోడకు నిత్యం మూత్రవిసర్జన చేసేవాడు. ఇది సభ్యత కాదని టెక్కీ అతనికి సూచించాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన మునిరాజు వాగ్వాదానికి దిగి టెక్కీ ముఖంపై ముష్టిఘాతమిచ్చాడు. అతడు పడిపోగా తీవ్రంగా కొడుతూ రోడ్డు మీదకు లాక్కొచ్చాడు. అక్కడ కూడా కాళ్లు చేతులతో కొడుతూ రాక్షసంగా ప్రవర్తించాడు. టెక్కీకి ఓ కన్ను దెబ్బతినడంతో పాటు ముఖంపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఇది సెప్టెంబర్ 5వ తేదీన, సాయంత్రం సుమారు 6:55 గంటలకు జరిగింది. అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయింది. కేఆర్ పుర పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు. -
హెలికాప్టర్లలో తిరిగితే సమస్యలు తెలుస్తాయా?
అభివాదం చేస్తున్న బీజేపీ నాయకులు పాదయాత్రకు పూర్ణకుంభాలతో స్వాగతం పలుకుతున్న మహిళలుసాక్షి, బళ్లారి: తమ పాదయాత్ర ప్రభావంతోనే సీఎం డీకే శివకుమార్ ఉత్తర కర్ణాటక వైపు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర పేర్కొన్నారు. ఆదివారం ఆరవ రోజు పాదయాత్ర ఉల్లాసంగా కొనసాగింది. కొప్పళ జిల్లా గంగావతి తాలూకా మీదుగా కంప్లి వరకు కొనసాగిన పాదయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీ అరుణ, జేడీఎస్ పార్టీ నేత బసవరాజ్ హొరట్టి, మాజీ మంత్రి శ్రీరాములు, స్థానిక బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో జనం పాల్గొనడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పాలాలు మధ్య రైతులను పలకరిస్తూ పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. పొలాలు మధ్య గొర్రెలు కాపరులు, యజమానులను ఆప్యాయంగా పలకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విజయేంద్ర విలేకరులతో మాట్లాడారు. బీజేపీ పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి సర్కార్‌కు వణుకు పుడుతోందని తెలిపారు. ప్రజా సేవకుడు అని చెప్పుకునే సీఎం డీకేశీ మాటలు చూస్తుంటే నవ్వు వస్తుందని ఎద్దేవా చేశారు. సూటు, బూటు వేసుకుని హెలికాప్టర్లలో తిరిగితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రజా సేవకుడు ఎలా అవుతారని మండపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎం డీకేశీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ధ్వజం ఉత్సాహంగా కొనసాగుతున్న పాదయాత్ర -
ఉద్యోగ ప్రాప్తిరస్తు
ఉచిత భోజన వసతి హొసపేటె: హొసపేటె నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు కొందరు ఉచితంగా భోజన అందించి మానవత్వం చాటుకున్నారు. అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా తమవంతు సాయంగా భోజనం పెట్టామని నిర్వాహకులు తెలిపారు. లక్ష్మి, షర్వి, శ్రీకాంత్, బసవరాజ్, కిరణ్ కుమార్, మంజు నాయక్, రేణుక నాయక్ పాల్గొన్నారు. బళ్లారి అర్బన్: బళ్లారి నగరంలోని పలు పరీక్ష కేంద్రాల్లో సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు ఆదివారం ప్రశాంతంగా పరీక్ష నిర్వహించారు. మున్సిపల్ కళాశాల, మేధా కళాశాల, సన్జోన్స్ స్కూల్, గర్ల్స్, సరళా దేవి కళాశాల తదితర కేంద్రాలకు ఉదయమే అభ్యర్థులు చేరుకున్నారు. జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షకు 10 వేలకు పైగా అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రం వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులుహాల్టికెట్ నంబర్లు చూసుకుంటున్న అభ్యర్థులు హొసపేటె: కర్ణాటక సాయుధ పోలీస్ కానిస్టేబుల్ (సీఏఆర్/డీఏఆర్) నియామక రాత పరీక్ష ఆదివారం విజయవంతంగా జరిగింది. విజయనగర జిల్లాకు సంబంధించి హోస్పేట్లో మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బారులు తీరారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం కర్ణాటక పరీక్షల అథారిటీ రాత పరీక్ష నిర్వహిస్తోందన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్ష పారదర్శకంగా జరిగిందన్నారు. ఉదయం సెషన్లో 4,406 మంది, మధ్యాహ్నం సెషన్లో 4,500 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్లతో సహా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రశ్నపత్రాలు ఉంచే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుని రాకుండా తనిఖీలు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలిపారు. ప్రశాంతంగా కేఎస్పీ సాయుధ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష -
సాగునీరు విడుదల చేయాలని ఆందోళన
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టు చివరి భూములకు సాగునీరు విడుదల చేయాలని మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ డిమాండ్ చేశారు. ఆదివారం సింధనూర్ తాలుకా జవుళి గేట్ (జవుళీదిన్ని క్రాస్) వద్ద రైతులు మూడు గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ మాట్లాడుతూ.. నీటి లభ్యతను సరిగ్గా అంచనా వేయడానికి నిరంతరం గేజ్ నిర్వహణ చేపట్టాలని తెలిపారు. 54వ ఉప కాలువ కింది భాగంలో ఉన్న రైతులకు నీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 69 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు వదలాలంటే కాలువలోకి 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలువ పైభాగంలో కొందరు అక్రమంగా అమర్చిన పైపుల ద్వారా నీటిని మళ్లించుకుంటున్నారని.. వాటిని తక్షణమే తొలగించాలన్నారు. కొప్పళ ఇన్చార్జ్ మంత్రి శివరాజ్ తంగడిగి వెంటనే రాజీనామా చేయాలన్నారు. రహదారులకు మరమ్మతులు చేయరా? రాయచూరు రూరల్: యదగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రహదారులపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని కరవే డిమాండ్ చేసింది. ఆదివారం వడిగెర క్రాస్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా కరవే జిల్లా అధ్యక్షుడు భీమా పూజారి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు వచ్చినప్పటికీ రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చడంలో అధికారులు, శాసన సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా, తాలూకా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో రోడ్లను పరిశీలించి మరమ్మతులు చేయాలని కోరారు. లోకాయుక్తకు ఫిర్యాదు హుబ్లీ: నియమాలను ఉల్లంఘించి ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజాధనాన్ని వ్యర్థం చేశారని నవళగుంద ఎమ్మెల్యే ఎన్.హెచ్.కోనరెడ్డిపై లోకాయుక్తతో పాటు మానవ హక్కుల కమిషన్‌కు సామాజిక కార్యకర్త మాబుసాబ్ యరగుప్పి ఫిర్యాదు చేశారు. గత నెల 6న మంత్రి సంతోష్లాడ్తో ఎమ్మెల్యే కోనరెడ్డి నవళగుంద తాలూకాలో కరువు పరిస్థితులను పరిశీలించారు. ఆ సమయంలో కోనరెడ్డి ఎస్కార్ట్ వాహనం వాడుకున్నారని సామాజిక కార్యకర్త మాబుసాబ్ యరగుప్పి వీడియోలతో పాటు హోం శాఖకు ఫిర్యాదు చేశారు. అయితే హోం శాఖ ఆయన ఎస్కార్ట్ వాహనాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యే వాడిన ఎస్కార్ట్ వాహన డీజల్ బిల్లు, సిబ్బంది వేతనాలతో పాటు వాహన మరమ్మతులను ప్రభుత్వమే వసూలు చేయాలి. ఇది ప్రజాధనం ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం అని మాబుసాబ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యపానంతో అనర్థాలు బళ్లారి అర్బన్: మద్యపానంతో పాటు అన్ని రకాల దుర అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, వ్యసన రహిత జీవనం సాగించాలని కళ్యాణ మహాస్వామి సూచించారు. ఆదివారం నగరంలోని బండిహట్టి కార్యక్షేత్రం కళ్యాణ స్వామి మఠంలో శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామాభివృద్ధి యోజన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసనాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన కుటుంబం ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. మద్యపానం వ్యక్తి ఆరోగ్యంపైనే కాకుండా కుటుంబం ప్రశాంతత, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మద్యానికి బానిస కావడం వల్ల కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయన్నారు. సంతోషకరమైన జీవనం సాగించాలని సూచించారు. కార్యక్రమంలో కళ్యాణ మఠం కన్నేరి మఠం సవితానంద మహాస్వామి తదితరులు పాల్గొన్నారు. సంతానం లేదని కార్మికుడు ఆత్మహత్య హోసూరు: సంతానం కలగపోవడంతో విరక్తి చెందిన కార్మికుడు ప్రాణాలు తీసుకున్న ఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల మేరకు తిరుపత్తూరు జిల్లా పెరంపట్టు గ్రామానికి చెందిన శంకర్ (37), ఇతని భార్య సత్య (25), ఈ దంపతులకు గత ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. హోసూరు తాలూకా జీ.మంగలం సమీపంలోని ఓ కోళ్లఫాంలో పనిచేస్తున్నారు. పిల్లలు పుట్టలేదని బాధపడేవారు. విరక్తి చెందిన శంకర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కరువు పరిహారంపై నోరు విప్పరా?
రాయచూరు రూరల్: బీజేపీ నాయకులు చేస్తున్న పాదయాత్రతో ఒరిగింది ఏమీ లేదు. వర్షాభావంతో రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. రైతులకు అందించాల్సిన పరిహారం నోరు విప్పాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య సూచించారు. ఆదివారం ఆయన రాయచూరులో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో చర్చించి కరువు పరిహారంపై అందించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, కస్తూరి రంగన్ నివేదికలపై చర్చింకుండా విధాన సభలో సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. పంటలు వేసి నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.39 వేల కోట్లను సుప్రీం కోర్టు చివాట్లు పెడితే మంజూరు చేశారన్నారు. ఈ ఏడాది కూడా అలాగే చేస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శాసన సభ్యులు బోసురాజ్, నాగవేణి పాటిల్, శాలం తదితరులు పాల్గొన్నారు. -
వర్షాల కోసం ఎదురుచూపులు
● ముఖం చాటేసిన వరుణుడు ● వర్షాభావంతో ఎండుముఖం పడుతున్న పంటలు బళ్లారి అర్బన్: ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొంది. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశించి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. వరుణుడు ముఖం చాటేడయంతో చెరువు, కుంటలు, వాగులు ఎండిపోయాయి. భూగర్భ జలవనరులు గణనీయంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావులపై ఆధారపడిన రైతులకు సాగు నీటి కష్టాలు మరింత పెరిగాయి. గతంతో నీటితో కళకళలాడిన చెరువు, గుంటలు ప్రస్తుతం వటిపోయాయి. వర్షాలు కురవక పోతే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. విత్తనాలు ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం ఇప్పటికే పెద్ద మొత్తం ఖర్చు చేసిన రైతులు పంట చేతికందుతోందో లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో పంటల పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి సాగు నీటి సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు. సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తుంగభద్ర జలాశయం కింద ఉన్న హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ కాలువలకు నీరు వదలడంతో ఆయకట్టు రైతులతో కొంత ఉపశమనం లభించింది. అయితే వర్షంపై ఆధారపడిన రైతులు మాత్రం దిగులుతో వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
రాయచూరు రూరల్: ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు ప్రజా సేవా అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ పేర్కొన్నారు. ఆదివారం రాయచూరు తాలూకా యాపల దిన్ని ప్రభుత్వ హైస్కూలు మైదానంలో ప్రజా సేవా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇంటి వద్దకే పాలన అందిస్తామని తెలిపారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీపీఈఓ చంద్రశేఖర్ పవార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మంజునాథ్, ఆరోగ్య అధికారి యోగేష్ తదితరులు పాల్గొన్నారు. -
మౌనేషా చారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
రాయచూరు రూరల్: రాయచూరులోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో ఆదివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. లింగసూగురు తాలుకా జనతా పూరి సర్కారీ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు మౌనేషా చారి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును జిల్లా ఇన్చార్జ్ మంత్రి అజయ్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. విజయనగరం జిల్లా హర్పన హళ్లి తాలుకా బెన్నహళ్లికి చెందిన మౌనేషా చారి విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పాఠశాలను బలోపేతం చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించారు. ఈయన సేవలను గుర్తించిన అధికారులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. దుండగులను శిక్షించాలిరాయచూరు రూరల్: సిరవార తాలూకా హోక్రాని గ్రామంలో మలవిసర్జనకు వెళ్లిన అశ్విని అనే యువతిపై అత్యాచారం చేసి చంపేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సేన డిమాండ్ చేసింది. ఆదివారం టిప్పు సుల్తాన్ ఉద్యాన వనంలో ఆ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సినీ తారలు పూజా రమేష్, సంగీత దర్శకుడు మనోహర్ మద్దతు ఇచ్చారు. పోలీసులు ఈ కేసును నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. అశ్విని మృతదేహాన్ని బావిలో పడేసిన వారిపై కేసు నమోదు చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జిల్లాలో దళిత యువతులు, మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. భూమానంద, రేణుక, రమే్‌ష్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పల్లకీలో ఊరేగిన శ్రీకృష్ణుడురాయచూరు రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలో శ్రీకృష్ణుడి పల్లకీ ఉత్సవాలు వేడుకగా జరిగాయి. మహిళ సమాజ్ భక్తులు శ్రీకృష్ణుడి ప్రతిమ పల్లకీలో కొలువుదీర్చీ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. దారి పొడవునా భక్తులకు త్రైత సిద్దాంత భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో ఆదికర్త ఆచార్య ప్రభోదాంనద యోగీశ్వరులు, ఆయుర్వేద పతంజలి సంచాలకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రవచనాలతో మానసిక ప్రశాంతతరాయచూరు రూరల్: సమాజంలో మానవుడు సంస్కారంతో జీవించే విధంగా తన జీవన విధానం మార్చుకోవాలని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అభిప్రాయపడ్డారు. ఆదివారం కిల్లే బ్రహన్మఠంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ప్రవచన పఠన కార్యక్రమంలో భాగంగా జంగమ వటువులకు అయ్యాచార దీక్షలు బోధించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లలకు పాండిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, పఠించడం వల్ల మానవుడు ప్రశాంత జీవనం గడపడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సీఎం డీకేశీకి సన్మానంహొసపేటె: ‘మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు హెచ్‌జీ రాములు నాకు తండ్రిలాంటి వారు. నేను స్టూడెంట్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి నేను ఆయన ఆశీస్సులు, మార్గదర్శకత్వం పొందుతూనే ఉన్నాను’. అని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ అన్నారు. శనివారం సాయంత్రం గంగావతి సమీపంలోని భూదేశ్వర ఆలయంలో మాజీ ఎంపీ హెచ్‌జీ రాములు ఆయన కుటుంబ సభ్యులు సీఎం డీకే శివకుమార్‌ను సన్మానించారు. -
కుల ధ్రువీకరణ పత్రాల జారీలో నిర్లక్ష్యం
బళ్లారి అర్బన్: బళ్లారి జిల్లాలోని గాణిగ కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కళ్యాణ కర్ణాటక గాణిగ జన అభివృద్ధి సంఘం అధ్యక్షుడు బసవరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్డులోని మున్సిపల్ కళాశాల మైదనంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రజాసేవ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర, జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్ తదితరులు హాజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. గాణిగ సమాజ అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో గాణిగ కులస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. బళ్లారి జిల్లాలో మాత్రం అవసరమైన పత్రాలను దరఖాస్తు చేసుకున్న వాటిని తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. కుల ధ్రువీకరణ పత్రాలు అందక విద్యార్థులు స్కాలర్‌షిప్స్‌కు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు పొందలేక పోతున్నారన్నారు. మధ్యవర్తుల ద్వారా డబ్బు చెల్లిస్తే సర్టిఫికెట్లు అందుతున్నాయని పేర్కొన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి గాణిగ కులస్తులకు పథకాలు అందేలా చూడాలని కోరారు. -
నడిరోడ్డుపై భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్?
బనశంకరి: బెంగళూరులో నడిరోడ్డున శనివారం తెల్లవారుజామున దంపతులను అడ్డగించి దోచుకున్న దుండగులు.. అంతటితో ఆగకుండా భర్త ఎదురుగా భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పులకేశినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఓ దంపతులు స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో తిరి వెళ్తున్నారు. భారతీనగర వద్ద ఐటీసీ ఫ్లై ఓవర్ పైన వెళుతుండగా బైకులలో వచ్చిన ఐదారుమంది అల్లరి మూకలు కత్తులతో ఆటోడ్రైవరు, దంపతులను బెదిరించి మొబైల్, బంగారు గొలుసు, పర్సు లాక్కున్నారు. మహిళను ఆటోలో నుంచి కిందికి లాగి భర్త ఎదురుగా ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అల్లరిమూకలు ఉడాయించారు. భార్యాభర్తలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.చదవండి: రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి -
నల్లనయ్య దర్శనం.. ఉడుపి జనసంద్రం
● రమణీయంగా జన్మాష్ణమి సంబరాలు యశవంతపుర: ఉడుపిలోని సుప్రసిద్ధ శ్రీకృష్ణ మందిరంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నయన మనోహరంగా జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి పర్యాయ మఠాధిపతి శిరూరు వేదవర్ధన తీర్థ, కృష్ణాపుర విద్యాసాగర తీర్థస్వామి గర్భగుడిలో కృష్ణుని విగ్రహానికి విశేష పూజలు చేశారు. తరువాత వేల సంఖ్యలో భక్తులు శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. శనివారం జన్మాష్టమిలో భాగంగా శ్రీకృష్ణ లీలోత్సవం, విట్లపిండి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఉట్టి వేడుకల్లో యువకులు పోటీలు పడ్డారు. అలాగే హుబ్లీలోనూ బాలలకు శ్రీకృష్ణ వేషధారణ పోటీలు, యువకుల ఉట్టి కొట్టే వేడుకలు ఆకట్టుకున్నాయి. -
వైభవంగా శ్రీకృష్ణ వసంతోత్సవం
రాయచూరురూరల్: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వసంతోత్సవం నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి మఠంలో రాఘవేంద్ర స్వామి మూల విరాట్‌కు ఊంజల్ సేవలు నెరవేర్చారు. భక్తుల సందడి మధ్య శ్రీకృష్ణుడి వెన్నకుండ ఉట్టిని సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ కొట్టారు. పీడీఓపై సస్పెన్షన్ వేటు హుబ్లీ: విధి నిర్వహణలో లోపంతో పాటు నియమాల ఉల్లంఘన ఆరోపణలపై ధార్వాడ తాలూకా అళిగేరి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిణి పుష్పవతి మేదారపై సస్పెన్షన్ వేటు పరడింది. అక్రమ బిల్లుల సృష్టితో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా నకిలీ బిల్లులను సృష్టించిన ఆరోపణలపై పీడీఓపై ఈ చర్యలు తీసుకున్నారు. గ్రామస్తులే జిల్లా ఇంచార్జి మంత్రి సంతోష్‌లాడ్ దృష్టికి తెచ్చారు. ఆరోపణల నేపథ్యంలో మంత్రి సూచన మేరకు జెడ్పీ సీఈఓ భువనేశ్ పాటిల్ ఈ ఆదేశాలను వెల్లడించారు. స్కూటీని ఢీకొన్న కారు.. మహిళ మృతి రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. సంతోష్ నగర్ జేకే స్కూల్ ఎదుట కారు స్కూటీని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో స్కూటీపై వెనుక కూర్చున్న విజయనగర నివాసి రూపా సోలంకి (60) తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలింతం దక్కలేదు. స్కూటీ నడుపుతున్న గోపనకొప్ప లిఖిత చేతులు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌పై హుబ్లీ తూర్పు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హాస్టల్ పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి గాయం రాయచూరు రూరల్: రపభుత్వ హాస్టల్ పైకప్పు పెచ్చులూడి విద్యార్థినిఽకి గాయమైన ఘటన జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో చోటు చేసుకుంది. శనివారం దేవదుర్గ తాలూకా గబ్బూరులో ప్రభుత్వ బాలికల హాస్టల్లో పైకప్పు పెచ్చు ఊడి పడడంతో పదవ తరగతి చదువుతున్న శృతి అనే విద్యార్థినికి తీవ్ర గాయమైంది. దీంతో బాలికను రాయచూరులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాంక్రీట్‌తో కూడిన పెళ్లలు మీద పడడంతో విద్యార్థులు అరుపులు, కేకలు వేస్తూ బయటికి పరుగు తీశారు. గది పైపెచ్చు ఊడుతోందని వార్డెన్ రాధికకు తెలిపినా ఫలితం లేక పోయిందని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఆమె నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని వారు ఆరోపించారు. నిరంతర అధ్యయనంతో కొత్త ఒరవడిరాయచూరు రూరల్: నిరంతరం అధ్యయనంతో ఆరోగ్య, వైద్య రంగాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయని రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ బీ.సీ.భగవాన్ పేర్కొన్నారు. నవోదయ వైద్య కళాశాలలో జరిగిన రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వ విద్యాలయం 218వ సిండికేట్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు త్వరితగతిన ఫలితాలు పొందాలనే ఆశకు తగినట్లుగా విద్యనభ్యసించ లేకపోతు న్నారన్నారు. నవోదయ వైద్య కళాశాల చేస్తున్న సేవలు అనన్యమన్నారు. పేదలకు ఉచిత సేవలు చేయడం అభినందనీయమన్నారు. నవోదయ వైద్య కళాశాల రిజిస్ట్రార్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ దొడ్డయ్య, రామ్ మోహన్ గుప్త, ప్రకాష్, మహ్మద్ సలా ఉద్దీన్, సురేష్ బాబు, శివరాజ్ గౌడ, అపర్ణ, లక్ష్మి, మంజునాథ్‌లున్నారు. ప్రజల కోసం సేవా అభియాన్ కోలారు: ప్రజల ఇంటి ముందుకు పాలన వ్యవస్థను అందించడం ప్రజా సేవా అభియాన్ ముఖ్య ఉద్దేశమని తహసీల్దార్ వి.గీతా తెలిపారు. శనివారం ముళబాగిలు తాలూకా ఆవణి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రజా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వివిధ శాఖలకు చెందిన ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కే ఎన్ ఉమాశంకర్, తాలూకా పంచాయతీ ఈఓ ఎన్ వీ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
పంచ గ్యారంటీలకు సర్కారు మంగళం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కరువు ఛాయలు తీవ్రంగా నెలకొన్నాయనే నెపంతో కాంగ్రెస్ సర్కార్ పేదలకు, మహిళలకు జారీ చేసిన పంచ గ్యారెంటీ పథకాలకు మంగళం పాడిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు. శనివారం ఐదో రోజు బీజేపీ నేతలు లింగసూగూరు నుంచి బళ్లారికి చేస్తున్న పాదయాత్రలో భాగంగా కారటగి మీదుగా గంగావతికి పాదయాత్రగా వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో అమలు పరిచిన గ్యారంటీలకు తాజాగా పేర్ల నమోదు సాకుతో పేదల కడుపు కొట్టడాన్ని తప్పుబట్టారు. గృహజ్యోతి, గృహలక్ష్మి పథకంలో మరో మారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో వైపు పెన్షన్ల విషయంలో ఆన్లైన్లో సర్వర్ సమస్యలంటూ వేధించడం సరికాదన్నారు. నెల సరి ఆదాయాన్ని రూ.32 వేలుగా నిర్ణయించడం తగదన్నారు. ఎస్పీటీఎస్పీ నిధుల వినియోగంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు. పాదయాత్రలో మాజీ మంత్రులు శ్రీరాములు, రాజుగౌడ, శాసన సభ్యుడు మానప్ప వజ్జల్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్, శరణమ్మ కామరెడ్డి తదితరులున్నారు. పాదయాత్రలో విజయేంద్ర ఆరోపణ -
విపక్షం పాదయాత్ర హాస్యాస్పదం
●మంత్రి అజయ్‌సింగ్ రాయచూరు రూరల్: జిల్లాలో బీజేపీ నేతలు లింగసూగూరు నుంచి బళ్లారి వరకు చేస్తున్న పాదయాత్ర హాస్యాస్పదమని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్ పేర్కొన్నారు. శనివారం ఆయన పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరం వద్ద విలేకరులతో మాట్లాడారు. సర్కార్‌లో మంత్రిగా పని చేసిన నాగేంద్ర రాజీనామా చేసినా పాదయాత్ర చేయడం హాస్యాస్పదమన్నారు. రెండు వారాల పాటు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కరువు, రైతులు, కస్తూరి రంగన్ నివేదికలపై చర్చ జరగకుండా అసెంబ్లీ కార్యకలాపాలకు అడ్డు తగిలి కాలహరణం చేశారని ఆరోపించారు. -
ప్రాణం తీసిన అక్రమ సంబంధం
కోలారు: భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడిని భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మాలూరు తాలూకా చిక్కతిరుపతి గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకాలోని సొణ్ణేనహళ్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (36) హతుడు. సురేష్ భార్యతో వెంకటేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మానసికంగా కుంగిపోయిన సురేష్.. ఎలాగైనా వెంకటేష్‌ను హతమార్చాలని పక్కా ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలో సురేష్ తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి వెంకటేష్‌కు పూటుగా మద్యం తాగించారు. అనంతరం వెంకటేష్‌ను గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని నీటి సంపులో పడేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మాలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకుపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మవారికి గాజుల సింగారం
బనశంకరి: నగరంలో బనశంకరీదేవి ఆలయంలో అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రావణ శనివారం సందర్భంగా వేకువజామున సుప్రభాత సేవ తరువాత అర్చకులు అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం, అర్చనలు గావించి గాజులతో సుందరంగా సింగారించారు. మహిళా భక్తులు నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేశారు. ఠాణాలో మహిళ ఆత్మహత్యాయత్నంబనశంకరి: పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ న్యాయం జరగలేదని అక్కడే పురుగుల మందు తాగింది. ఈ ఘటన హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత జిల్లా కలబుర్గిలోని జేవర్గి తాలూకా నెలోగి పోలీస్‌స్టేషన్ లో శనివారం జరిగింది. యాతనూరు గ్రామానికి చెందిన రేవుబాయి భీమరాయ తళవార (40).. ఇంట్లో గొడవలపై నెలోగి ఠాణాలో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని ఆవేదన చెందిన రేవుబాయి అక్కడే పురుగుల మందు తాగి పడిపోయింది. ఆమెను కలబుర్గి జిల్లాసుపత్రికి తరలించారు. వెంటనే గ్రామస్తులు, బంధువులు చేరుకుని పోలీసుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిర్యాదు తీసుకోవడానికి ఇబ్బంది ఏమిటని రేవుబాయి కుమారుడు నాగరాజ్ విలపించాడు. పొలంలో దారుణ హత్యమండ్య: పొలంలో యువకున్ని దుండగులు కొడవళ్లతో చంపి మృతదేహాన్ని చిక్కదేవరాయ కాలువలోకి పారేసి పరారైన ఘటన జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలూకా కట్టేరి గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన విశ్వేశ్వరయ్య కుమారుడు నవీన్‌కుమార్ (28) హతుడు. చెలువరాజు, కాంతరాజు అనే ఇద్దరు పొలంలో ఉండగా, నవీన్ కుమార్ అప్పుడే వెళ్లాడు. దీంతో ఆ ఇద్దరు కొడవళ్లతో నవీన్‌కుమార్ తల, చెవి, చేతులపై దాడి చేసి చంపి శవాన్ని కాలువలో పారేసి పరారయ్యారు. నవీన్‌కుమార్ రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భయపడిన అతని తండ్రి పొలానికి వెళ్లి గాలించగా స్కూటర్ మాత్రమే ఉంది. దీంతో బంధువులు, గ్రామస్తులకు చెప్పగా అందరూ కలిసి వెతికినా జాడలేదు. కేఆర్ఎస్ పోలీస్ స్టేషన్ సీఐ వివేకానంద, ఎస్ఐ జగదీష్ సిబ్బందితో కలిసి కాలువలో గాలించగా మృతదేహం దొరికింది. దుండగులను అరెస్టు చేసినట్లు తెలిసింది. -
ధై ర్యంగా నడిపి.. గమ్యానికి చేర్చి..
హుబ్లీ: వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ(ఎన్ఈకేఆర్టీసీ) బస్సు హెడ్‌లైట్ పని చేయక పోవడంతో మొబైల్ టార్చ్ వెలుగులోనే డ్రైవర్ బస్సును ధై ర్యంగా నడిపిన ఘటన చోటు చేసుకుంది. హుబ్లీ నుంచి అణ్ణిగేరికి వెళుతున్న రాత్రి డ్యూటీ బస్సు హెడ్‌లైట్‌లో సాంకేతిక దోషం కనిపించింది. దీంతో ప్రయాణికులతో మొబైల్ టార్చ్ వెలుగులోనే డ్రైవర్ ఆ బస్సును నడిపి సురక్షితంగా గమ్యం చేర్చిన ఘటన శుక్రవారం సంశి– గుడగేరి మార్గంలో జరిగింది. హుబ్లీ నుంచి రాత్రి 8.05 గంటలకు బయలుదేరి గుడగేరికి రాత్రి 9.20 గంటలకు చేరుకోవాలని బస్సు సంశి బస్టాండ్ సమీపంలోకి రాగానే ప్రధాన హెడ్‌లైట్ పని చేయక మొరాయించడంతో బస్సులోని ప్రయాణికులు కంగారు పడ్డారు. సంశి నుంచి గుడగేరికి ప్రయాణం సుమారు 20 నిమిషాలు పడుతుంది. దీంతో ప్రయాణికులు తమ మొబైల్ టార్చ్‌లను ఆన్ చేసి డ్రైవర్‌కు సహకరించడంతో బతుకు జీవుడా అంటు నిదానంగా బస్సును నడిపి క్షేమంగా గమ్యస్థానానికి చేర్చారు. కొందరు ప్రయాణికుల మండిపాటు కాగా ఈ వైనంపై కొందరు ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి వేళ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే అత్యవసరమైన బస్సు సర్వీసులు డిపో నుంచి బయలుదేరే ముందు అవి సక్రమంగా, సాంకేతికంగా సిద్ధంగా ఉన్నాయా, లేదా? అని పరిశశీలించాలి. ఏ దోషాలు లేని బస్సులను మాత్రమే గ్రామీణ ప్రాంతాలకు నడపాలి. లేకుంటే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తథ్యం అని ప్రయాణికులు వాపోయారు. ఈ 12 కిలో మీటర్ల ప్రయాణానికి సుమారు ఓ గంట సేపు సమయం పట్టింది. ఈ ఘటనపై సంబంధిత డిపో కంట్రోలర్ రామనగౌడ మాట్లాడుతూ ఎండీ ఎం.ప్రియాంగ సూచన మేరకు ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇలాంటి ఘటనే గత జూలైలో కూడా కేకేఆర్టీసీ పరిధిలో చోటు చేసుకుంది. కలబుర్గి నుంచి చించోళికి వెళుతున్న బస్సు హెడ్లైట్లు మొరాయించడంతో మొబైల్ టార్చ్ వెలుగులోనే డ్రైవర్ బస్సును నడిపాడు. ఆ ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు డ్రైవర్‌తో పాటు ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. హెడ్లైట్లు వెలగని బస్సును మొబైల్ టార్చ్ వెలుగులో నడిపిన డ్రైవర్ ఎన్ఈకేఆర్టీసీ బస్సుల అధ్వాన నిర్వహణకు నిదర్శనం ఈ ఘటన -
నిష్పక్షపాత దర్యాప్తునకు వినతి
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. ఆదివారం రాత్రి జిల్లాధికారి కార్యాలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మునియప్పతో సంచాలకుడు మారెప్ప, రవీంద్రనాథ్ మాట్లాడారు. అశ్వినితో పాటు భూమానంద, రేణుక, రమే్ష్ల మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. నరసింహులు, శివ కుమార్, బేరి, హేమరాజ్‌లున్నారు. ఉపాధ్యాయులు నిష్టగా పని చేయాలి రాయచూరు రూరల్: సమాజంలో ఉపాధ్యాయులు నిష్ట, నిజాయితీతో పని చేయాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్ పేర్కొన్నారు. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, విద్యా శాఖ, నగరసభ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ఉపాధ్యాయులు నిష్ట, ప్రామాణికత, దక్షతతో విధులు నిర్వహించి ఉన్నత విద్యను బోధించాలన్నారు. 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులిచ్చి సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బోసురాజు, గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, జయన్న, జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున, సుఖదేవ్, విద్యాశాఖాధికారులు ఈరణ్ణ, చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘం పదాధికారులు చంద్రశేఖర్ రెడ్డి, యంకప్ప, మొయిన్ ఉల్ హక్, యంకప్ప మూర్తిలున్నారు. -
సర్కారు బడి విద్యార్థులకు రిజర్వేషన్లు
సాక్షి,బళ్లారి: ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ రంగాల్లో 7 శాతం అదనపు రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపట్టామని, అందుకు తగిన మార్గదర్శకాలు, దిశానిర్దేశాలను త్వరలోనే జారీ చేస్తామని సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఉమ్మడి బళ్లారి జిల్లా కూడ్లిగిలోని గుడేకోట రోడ్డులో ఇంటి ముంగిటకే ప్రభుత్వ పాలన అనే విధంగా ఏర్పాటు చేసిన ప్రజా సేవ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన విద్యనందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనుండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకు సమాజంలో అదే గౌరవం లభిస్తుందన్నారు. రాధాకృష్ణన్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత రాష్ట్రపతి పదవి దాకా ఎదిగారన్నారు. ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. డాక్టర్ల తరహాలో టీచర్లను కూడా టీఆర్ అని సంబోధించేలా దిశానిర్దేశం చేస్తామన్నారు. డాక్టర్లకు ముందు డీఆర్ అని ఎలా రాస్తారో టీచర్లకు కూడా టీఆర్ అని రాసి గౌరవం కల్పిస్తామన్నారు. ప్రజలే పాలకులు, అధికారం ఇచ్చిన ప్రజలు దేవుళ్లతో సమానం అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రజా సేవకుడిని– సీఎం హొసపేటె: రాజుల యుగం ముగిసింది. ప్రజాస్వామ్యం వచ్చింది. నేను ప్రజాసేవకుడిని అని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఉద్ఘాటించారు. శనివారం విజయనగర జిల్లా కూడ్లిగిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త ప్రజాసేవ శాఖను ప్రారంభించి ఆయన మాట్లాడారు. పనుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరిగే రోజులు పోయాయి. ప్రభుత్వ పరిపాలన నేరుగా ప్రజల గడపకే చేరాలనే పవిత్ర ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం అని ఆయన వివరించారు. విధాన సౌధ, కలెక్టరేట్ లేదా తహసీల్దార్ కార్యాలయాల నుంచి పరిపాలన సాగిస్తూ అధికారులు ప్రజలకు దూరంగా ఉండటం సరికాదు. ప్రజాసేవా విభాగం ప్రజల సమస్యలను ఆలకించి, అక్కడికక్కడే ప్రత్యక్ష పరిష్కారాలను అందించడానికి కృషి చేస్తుందని అన్నారు. ప్రజల ముంగిటకే అధికారులు సామాన్యుడు ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా తాలూకా అధికారుల కోసం వెతుక్కుంటూ రాకుండా అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను విని పరిష్కరించాలి. ఈ ఉద్దేశ్యంతోనే ప్రజా సేవా విభాగాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వ్యవస్థను రాష్ట్రంలోని మొత్తం 224 నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నామన్నారు. ప్రతి నెలా మొదటి, మూడో శనివారాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లి పని చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో ఓ మహిళ నుంచి అర్జీని స్వీకరిస్తున్న సీఎం డీకే.శివకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం డీకే.శివకుమార్, చిత్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించడమే లక్ష్యం టీచర్లను ఇకపై డాక్టర్ల తరహాలో టీఆర్ అని సంబోధిస్తాం కూడ్లిగి ప్రజా సేవ కార్యక్రమంలో సీఎం డీకే శివకుమార్ -
జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం
హుబ్లీ: జైలులోని అవ్యవస్థను ఖండిస్తూ ఖైదీలు ఆందోళన చేపట్టారు. ఆందోళనపై జైలు అధికారులు స్పందించక పోవడంతో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ధార్వాడ జిల్లా కేంద్ర కారాగృహంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని మీరజ్కు చెందిన మహేష్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అస్వస్థతతో ఉన్న ఆయనను జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జైలులో కనీస సౌకర్యాలు లేక ఖైదీలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ అవ్యవస్థను సరి చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజుల నుంచి ఆందోళన చేపట్టారు. ఖైదీల ఈ ఆందోళనను జైలు అధికారులు పట్టించుకోలేదు. హత్య కేసులో నిందితుడిగా గత ఏడాదిన్నరగా జైలులో ఉన్న మహేష్ ఈ అకృత్యానికి పాల్పడ్డారు. ధార్వాడ ఉప నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మహిళ ఆత్మహత్యాయత్నం కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకా పోలీసు స్టేషన్లో ఖాకీల బాధ్యతారాహిత్యానికి అమాయక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. యాతనూరు గ్రామ నివాసి రేవుబాయి అనే మహిళపై పాతకక్షల నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన కొందరు అమానుషంగా దాడి చేశారు. అతనికి జరిగిన అన్యాయానికి న్యాయం కల్పించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కన్నీరు పెడుతూ ఈ మహిళ నెలోగి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా ఆమెను రక్షించడానికి బదులుగా వేధించారు. దాడికి గురై తీవ్రంగా గాయపడినా కూడా ఎఫ్ఐఆర్ దాఖలుకు పోలీసులు కాలయాపన చేశారని ఆమె ఆరోపించింది. దీంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఆ స్టేషన్ పరిధిలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె కలబుర్గిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై రేవుబాయి కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. -
నమో వేంకటేశా.. నమో తిరుమలేశా
మండ్య: చివరి శ్రావణ శనివారం సందర్భంగా అంతటా వైష్ణవ దేవాలయాల్లో విశేష పూజలు జరిగాయి. ఆలయాలకు నెలవైన మండ్య తాలూకాలోని కొమ్మేరహళ్లి నరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం రాత్రి నుంచే పచ్చని తోరణాలు, రకరకాల పూలతో అలంకరించారు. ● ఏకశిలా స్తంభపు నరసింహస్వామికి మహారాజుగా అలంకరించారు. ● హనియంబాడి రోడ్డులోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం 10 గంటల నుంచే భక్తాదులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. ● మండ్య నగరంలోని ప్రముఖ ఆలయాలైన లక్ష్మీ జనార్ధనస్వామి ఆలయం, శ్రీనివాస ఆలయం, హొసహళ్లి బడావణె శ్రీనివాస ఆలయం, బోవి కాలనీ శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం, నగరంలోని మైసూరు–బెంగళూరు రహదారిలో కల్లహళ్లి ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో శ్రావణశోభ ఉట్టిపడింది. దేవీదేవతలను దర్శించుకుని భక్తజనం పునీతులయ్యారు. ● మద్దూరు, మళవళ్లి, కేఆర్ పేటె, నాగమంగల, శ్రీరంగపట్టణ, పాండవపుర తాలూకాల్లోని విష్ణు ఆలయాల్లో పూజలు జరిగాయి. ● మేలుకోటె, శ్రీరంగపట్టణ, కేఆర్‌పేటె భూవరహనాథ స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు సమర్పించారు. అగరలో బొమ్మనహళ్లి: నగరంలోని బొమ్మనహళ్ళిలోని అగరలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయుంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అలంకారం తరువాత భక్తులకు దర్శనం కల్పించారు. భక్తిశ్రద్ధలతో చివరి శ్రావణ శనివార పూజలు వైష్ణవ ఆలయాల్లో భక్తకోటి -
ప్రజల ముందుకే ప్రభుత్వం
యశవంతపుర: ‘ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు తీసే రోజులు అంతం కానున్నాయి. ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తుంది’ అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ప్రజా సేవా శాఖ ద్వారా శనివారం తొలిసారిగా విజయనగర జిల్లా కూడ్లిగిలో అభియాన నిర్వహించారు. సీఎం డీకే పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను ఆలకించారు. ప్రజలు అందజేసిన సమస్యలపై అధికారులు పరిష్కార చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా వందలాది మంది సీఎంకు తమ కష్టనష్టాలను ఏకరువు పెట్టారు. పెద్దసంఖ్యలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హాసన్‌లో రైతు ఆత్మహత్యాయత్నం పక్క భూమి యజమాని పెడుతున్న వేధింపులు తట్టుకోలేక రైతు ఒకరు మంత్రికి అర్జీ ఇచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన హాసన్‌లో కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. శనివారం ఉదయం ప్రజా సేవా అభియానలో భాగంగా ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చారు. హాసన్ తాలూకా హొసహళ్లికి చెందిన కరీగౌడ (35) మంత్రి కెఎం శివలింగేగౌడకు భూ వివాదంపై మంత్రికి అర్జీ సమర్పించారు. పక్క పొలంవారు తనను వేధిస్తున్నట్లు చెబుతూ అక్కడే పురుగుల మందును తాగాడు. ఇతర రైతులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. హాసన్ తాలూకా శాంతిగ్రాంలోని అంబేడ్కర్ వసతి పాఠశాల దయనీయ స్థితిలో ఉన్నట్లు పత్రికలలో వార్తలు రావటంతో మంత్రి శివలింగేగౌడ అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను మరో హాస్టల్‌కు తరలించి దానికి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. 172 మంది విద్యార్థులను ఒక షెడ్లో ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. సీఎం డీకే శివకుమార్ కూడ్లిగిలో ఘనంగా ప్రజాసేవా అభియాన్ ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకారం -
ప్రజా సేవతో సమస్యలకు చెక్
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో సీఎం డీకే శివకుమార్ దిశానిర్దేశంతో నూతనంగా ప్రారంభించిన ప్రజా సేవ ఉద్యమం ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే వేదిక కానుందని ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వారు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసిన ప్రజాసేవ కార్యక్రమాన్ని నగరంలో ప్రారంభించి మాట్లాడారు. జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామాల్లో పేరుకుపోయిన, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటి ముంగిటికే వచ్చి సమస్యలను నేరుగా ఆలకించి అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసేందుకు, జనం కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా నేరుగా జనం వద్దకే పాలన అన్న విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఏ పనికై నా సత్వర పరిష్కారం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు ముగింపు పలకాలని, ఏ పనినైనా సాధ్యమైంత త్వరలో పరిష్కరిస్తారన్నారు. చట్ట పరిధిలో ఉన్న పనులన్నింటికీ సాధ్యమైంత వరకు పరిష్కారం చూపిస్తారన్నారు. ఇది సీఎం కలల ప్రాజెక్టు అని గుర్తు చేశారు. అధికారులు కూడా బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో అర్హుల పేర్లు కచ్చితంగా ఉండాలన్నారు. నగరంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాసేవ కార్యక్రమంలో జనం ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించి, అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నగర ప్రజలు పాల్గొన్నారు. దేశానికే ఆదర్శంగా నిలవనుంది ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి -
సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేరాలి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజల దరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్ పేర్కొన్నారు.శ శనివారం మాన్వి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా సేవ పథకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలో ఇచ్చిన హామీల ప్రకారం లబ్ధిదారులకు పథకాలను అందించారన్నారు. ముఖ్యమంత్రి డీ.కే.శివ కుమార్ ఆదేశాల మేరకు ప్రజల వద్దకు పాలనను అందించాలనే ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్నారు. కల్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తారన్నారు. జిల్లాధికారిణి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి శరణమ్మ, జిల్లా ఆరోగ్య అధికారిణి నందితలున్నారు. దేవదుర్గలో శాసన సభ్యురాలు కరెమ్మ, గ్రామీణలో శాసన సభ్యుడు బసనగౌడ, సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, మస్కి శాసన సభ్యుడు బసన గౌడ తుర్విహాళ్ తమ తమ నియోజకవర్గాల్లో ప్రజా సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. కలబుర్గిలో మంత్రి ప్రియాంక్ ఖర్గే, యాదగిరిలో మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, విజయపురలో ఎంబీ పాటిల్, బాగల్కోటెలో విజయానంద కాశప్పనవర్, బీదర్‌లో ఈశ్వర్ ఖండ్రే ప్రజా సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా ఇంచార్జి మంత్రి అజయ్‌సింగ్ ప్రజా సేవ కార్యక్రమానికి శ్రీకారం -
హనుమకు శ్రావణ పూజలు
మైసూరు: శ్రావణ మాసంలోని నాలుగవ శనివారం సందర్భంగా, నగరంలోని ఇర్విన్ రోడ్డులో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామికి అభ్యంజన తైలాభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పాభిషేకాలు గావించారు. హోమం నిర్వర్తించారు. వందలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు. మోదీ రూ.15 లక్షలు ఇచ్చారా?: సిద్దుశివాజీనగర: ‘సీఎం పదవికి రాజీనామా చేయవద్దు సార్ అని నాకు చాలా మంది నాకు చెప్పారు. కానీ మాట ఇచ్చానని’ సిద్దరామయ్య తెలిపారు. శనివారం చిక్కమగళూరు జిల్లా కడూరులో మాట్లాడుతూ, తాను ఏదైన గుడికి వెళ్లినప్పుడు మోదీ.. మోదీ..అని అంటుండేవారు. మోదీ స్వాతంత్య్రం కోసం పోరాడారా? 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? అచ్చేదిన్ ఎక్కడ, రైతుల ఆదాయం రెండింతలు చేస్తానన్నారు చేశారా? 12 సంవత్సరాలు అయింది ప్రధాని పదవి చేపట్టి, నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్నారు వేశారా? పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఒక ఓటు వేయాలి? అని విమర్శల వర్షం కురిపించారు. మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారని విమర్శించారు. ఇక్కడి బీజేపీ నేత సీటీ రవి కాదు లూటీ రవి అని ఎద్దేవా చేశారు. తనది మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని అన్నారు. నగరంలో గ్యాంగ్ రేప్?● భర్త ఎదుట అఘాయిత్యం బనశంకరి: బెంగళూరులో నడిబొడ్డున శనివారం తెల్లవారుజామున దంపతులను అడ్డగించి దోచుకున్న దుండగులు.. అంతటితో ఆగకుండా భర్త ఎదురుగా భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పులకేశినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఓ దంపతులు స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో తిరి వెళ్తున్నారు. భారతీనగర వద్ద ఐటీసీ ఫ్లై ఓవర్ పైన వెళుతుండగా బైకులలో వచ్చిన ఐదారుమంది అల్లరి మూకలు కత్తులతో ఆటోడ్రైవరు, దంపతులను బెదిరించి మొబైల్, బంగారు గొలుసు, పర్సు లాక్కున్నారు. మహిళను ఆటోలో నుంచి కిందికి లాగి భర్త ఎదురుగా ఆమైపె అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అల్లరిమూకలు ఉడాయించారు. భార్యాభర్తలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళూరుకు వందేభారత్ ట్రయల్ రన్ యశవంతపుర: బెంగళూరులోని యశవంతపుర– తీర నగరం మంగళూరు సెంట్రల్ల మధ్య వందేభారత్ రైలును ప్రయోగాత్మకంగా నడిపి చూశారు. 16 బోగీలతో కూడిన వందేభారత్ రైలు ట్రయల్ శనివారం విజయవంతమైంది. యశవంతపుర రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన రైలును వివిధ ష్టేషన్ల గుండా ప్రయాణించి చూశారు. రైల్వే ఉన్నతాధికారులు ఈ రైలులో ప్రయాణించారు. సమస్యలు ఉంటే పరిష్కరించి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభించే అవకాశముంది. -
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
పోలీసుల కంటపడకుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు.. పోలీసులు వెంటపడటంతో ఊహించని పని చేశాడు. ఏకంగా చెరువులోకి దిగి నీళ్ల కింద దాక్కున్నాడు. పోలీసులు వెనక్కి వెళ్లిపోతారని భావించాడు. కానీ.. పోలీసులు అంత ఈజీగా వదులుతారు. అతగాడి జాడను అవలీలగా పట్టేశారు. నీళ్లలోకి దిగి అతడిని పట్టుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన దిలీప్ అలియాస్ కారియా (19)పై మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో రెండు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో అతడిపై మూడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో దిలీప్ భద్రావతి న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని గమనించిన దిలీప్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఓ నీటి ప్రవాహం వద్దకు చేరుకుని.. ఎక్కడ దాక్కోవాలో తెలియక ఏకంగా నీళ్లలోకి దిగిపోయాడు.పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా తొలుత దిలీప్ కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకున్నాడని భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల కంటికి నీళ్లలో కలుపు మొక్కలు కదలడం, నీటి అడుగు నుంచి గాలి బుడగలు పైకి రావడం కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.అంతే.. అసలు విషయం బయటపడింది. దిలీప్ నీళ్ల అడుగునే దాక్కుని ఉన్నాడు. వెంటనే ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది ప్రసన్న నీళ్లలోకి దిగి అతడిని బయటకు లాగారు. అక్కడికక్కడే చేతులకు బేడీలు వేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!” అంటూ ఖాకీలతో ఆ దిలీప్ చమత్కరించాడు.Hide and Seek : Cops dive into a pond to nab a rowdy sheeter hiding under weeds in ShivamoggaPolice in Shivamogga district have arrested a rowdy sheeter who was hiding in a pond to evade arrest despite three non bailable warrants issued against him by the court.The accused,… pic.twitter.com/6K0DBzRTUA— Imran Khan (@KeypadGuerilla) September 4, 2026 -
మురిపాల ముకుందా..
సాక్షి, బళ్లారి: సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీ కృష్ణుడు దేవుడు కాదు.. ప్రతి తరానికి మార్గదర్శకుడు అని పలువురు వక్తలు కొనియాడారు. శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని నగరంలోని శ్రీ కృష్ణ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అర్చనలు చేసిన అనంతరం శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని ఊరేగించారు. జొళదరాఽశి దొడ్డనగౌడ రంగమందిరంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్‌లో పూజలు బళ్లారి రూరల్: శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం ఇస్కాన్ మందిరానికి భక్తులు పోటెత్తారు. శ్రీకృష్ణుడి ప్రతిమను పల్లకీలో కొలువుదీర్చి నగర వీధుల్లో ఊరేగించారు. భక్తులకు కృష్ణుడిని దర్శించుకుని పూజలు చేయించారు. ఇస్కాన్ ప్రతినిధులు హరేరామ.. హరేకృష్ణ అంటు భజనలు చేస్తూ ముందుకు సాగారు. కేంద్రియ విద్యాలయంలో.. హొసపేటె: టీబీ డ్యాంలోని కేంద్రియ విద్యాలయంలో శుక్రవారం కృష్ణాష్టమిని ఉత్సాహంగా జరుపుకున్నారు. పాఠశాల విద్యార్థుల కృష్ణుడు, రాధ వేషధారణలో నృత్యం చేశారు. చిన్ని కృష్ణులు, గోపికలతో పాఠశాలలో కోలహలం నెలకొంది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోహర్ లాల్ జింగర్, ఉపాధ్యాయులు ప్రకాష్, రమీజ, దీపిక, సునీత, విజయలక్ష్మి, ఆషియా బేగం, అఫ్తాబ్, గులాం ముస్తఫా, మహేష్, అప్సా, అబిద అంజలి, రాహుల్, ఈరన్న పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి చిత్రపటం ఊరేగింపు రాయచూరు రూరల్: నగరంలోని శ్రీక్రష్ణ యాదవ భవనంలో జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగర సభ, సాంఘిక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి చిత్రపటానికి విధాన పరిషత్ సభ్యుడు బోసురాజ్ పూలమాల వేశారు. నగరేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన జాతాను ఎమ్మెల్సీ వసంత్ కుమార్ ప్రారంభించారు. సభలో నగర సభ మాజీ అధ్యక్షుడు తిమ్మప్ప నాడగౌడ, భీమన్న, హనుమంతప్ప, చెన్నారెడ్డి పాలొన్నారు. శ్రీకృష్ణుడి ఊయల సేవ రాయచూరు రూరల్: ఉప్పారవాడి లక్ష్మీ వేంకటేశ్వర మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చిన్నారులతో శ్రీకృష్ణుడి వేషధారణలు (పాత్రలు) వేయించారు. విఠల్ రుక్మిణి మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణాష్టమి సంబరాలు అంబరాన్నంటాయి. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గోపికలు, చిన్ని కృష్ణుల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
రైతుల రుణాలు మాఫీ చేయాలి
రాయచూరు రూరల్: తీవ్ర వర్షాభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతుల రుణాలు మాఫీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం నాలుగో రోజు బీజేపీ నాయకులు పాదయాత్ర కొనసాగించారు. సింధనూరు–కారటగి క్రాస్ వద్ద పాదయాత్రకు ముందు విజయేంద్ర విలేకరులతో మాట్లాడారు. వర్షాలు కురవక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందించకుండా అధికారం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా మార్గంమధ్యలో పొలం గట్టుపై కూర్చొన్న విజయేంద్ర.. కూలీలతో కలసి భోజనం చేశారు. రైతులతో కలసి వరినాట్లు వేశారు. మాజీ మంత్రులు శ్రీరాములు,రాజు గౌడ, శాసన సభ్యుడు మానప్పవజ్జల్, నాయకులు ప్రతాప్ పాటిల్, శరణమ్మ కామరెడ్డి పాల్గొన్నారు. -
ప్రైవేట్ దసరా కోసం గజరాజులు సిద్ధం
ఎంపికై న ఏనుగులుమైసూరు: ప్రపంచ ప్రసిద్ధ మైసూరు దసరా కోసం మైసూరు జిల్లా యంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు యదువంశ రాజవంశం ప్రైవేట్ దసరా ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. మైసూరు రాజమాత ప్రమోదాదేవి ఒడెయర్ కుటుంబం తమ ధార్మిక వేడుకల కోసం శ్రీకంఠ, ఏకలవ్య ఏనుగులను ఎంపిక చేసింది. నవరాత్రి పండుగ అయిన దసరా సమయంలో, ధార్మిక ప్రాముఖ్యత కలిగిన బంగారు సింహాసనాన్ని పూజించడం, సింహాసనాన్ని అధిరోహించడం, ప్రైవేట్ దర్బారును నిర్వహించడం యదువీర్ శ్రీకంఠ దత్త నరసింహరాజ ఒడెయర్ రాజకుటుంబానికి కొనసాగుతున్న సంప్రదాయం. దీనికి అదనంగా నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు రాజభవనంలోని రాజకుటుంబం ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. ఆ సమయంలో దసరాకు వచ్చే గజరాజుల నుంచి మగ ఏనుగును పట్టపుటేనుగుగా ఎంచుకోవడం ఆనవాయితీ. శ్రీకంఠ, ఏకలవ్య ఏనుగుల ఎంపిక -
ముగిసిన పడివడిక తాత ఉత్సవాలు
రాయచూరు రూరల్: మాన్వి తాలూకా కుర్డి గ్రామంలో వెలసిన సద్గురు రాజయోగిని పడివడికి తాత ఉత్సవాలు గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య స్వామీజీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా వందలాది మంది భక్తుల సమక్షంలో మహా రథోత్సవం నిర్వహించారు. ఉచిత ఆరోగ్య శిబిరంబళ్లారి రూరల్: లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా వారోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. బళ్లారి ఎల్ఐసీ బ్రాంచ్–2లో శుక్రవారం ఎల్ఐసీ అధికారులు, సిబ్బందికి, ఏజెంట్లకు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో వైద్యులు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, కొలెస్ట్రాల్, కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ హర్షవర్దన్, పారా మెడికల్ సిబ్బంది మృత్యుంజయ గౌడ, వినీలా రెడ్డి, వన్నప్ప, ఎల్ఐసీ సిబ్బంది, ఏజెంట్లు పాల్గొన్నారు. ఘనంగా పుట్టి జాతర రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో శుక్రవారం మూన్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో పుట్టి జాతర వైభవంగా జరిగింది. లక్ష్మీ దేవి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పుట్టి జాతరను మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురిసి, రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలన్నారు. దేశం సుభిక్షంగా ఉండి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఏటా ఈ పుట్టి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. కాలువ నిర్మాణం పూర్తి చేయాలి రాయచూరు రూరల్: జిల్లాలోని నారాయణపుర 9ఏ కాలువ నిర్మాణం పూర్తి చేయాలని అఖిల భారత కిసాన్ సంఘటన నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కవితాళ అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం సంచాలకుడు బసవ లింగప్ప మాట్లాడుతూ.. నారాయణపుర కాలువల నిర్మాణాలు పూర్తి చేసి రైతుల భూములకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. కవితాళ, సిరవార, మాన్వి తాలుకాలను కరువు ప్రాంతాలుగ ప్రకటించాలని కోరారు. అనంతరం వివిధ సమస్యలపై నాడ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పౌర కార్మికులకు నియామక పత్రాలు హొసపేటె: నగర సభకు చెందిన 65 మంది పౌర కార్మికులకు స్థానిక ఎమ్మెల్యే హెచ్.ఆర్.గవియప్ప శుక్రవారం పార్టీ కార్యాలయంలో నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పౌర కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పట్టణాభివృద్ధి నిధి ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, నగర సభ కమిషనర్ శివకుమార్ జిల్లా గ్యారెంటీ పథకం అమలు కమిటీ ఉపాధ్యక్షురాలు కే.బడవాలి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవి కుమార్, మాజీ నగర పరిషత్ అధ్యక్షుడు గుజ్జల నింగప్ప, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువుల ఆరోపణ హొసపేటె: నగరంలోని 60 పడకల ప్రభుత్వ తల్లి, శిశు ఆస్పత్రిలో ఓ చిన్నారి మృతి చెందింది. అయితే వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా చిన్నారి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాలు.. నగరానికి చెందిన వినయ్ భార్య మేఘనకు పురిటి నొప్పులు రావడంతో బుధవారం సాయంత్రం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవ సమయంలో బిడ్డ తల మాత్రమే బయటకు వచ్చింది. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో పని మనుషులు ప్రసవం చేశారు. బిడ్డకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. తదుపరి చికిత్స కోసం బిడ్డను కొప్పళకు తీసుకెళ్లమని వైద్యులు వారిని పంపించారు. కొప్పళ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా బిడ్డ చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. మరణించిన శిశువును పిల్లల ఆస్పత్రికి తీసుకువచ్చిన బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. నిర్లక్ష్యం వహించిన వైద్యుడిని తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్.లింగరాజు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిర్లక్ష్యం వహించిన వైద్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే అంగీకరించని కుటుంబ సభ్యులు చిన్నారి మరణానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. -
త్వరలోనే బస్సు చార్జీల పెంపు
సాక్షి బెంగళూరు: త్వరలో ఆర్టీసీ బస్సు టికెట్ ధరలను పెంచనున్నట్లు రవాణా శాఖ మంత్రి బైరతీ సురేశ్ వెల్లడించారు. బెంగళూరులో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముడిచమురు ఉత్పత్తుల ధరలను పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ చార్జీలను పెంచాల్సి వస్తోందని తెలిపారు. గత 8 నెలల నుంచి క్రమంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా బస్సు ప్రయాణ చార్జీలను పెంచలేదని, దానివల్ల నాలుగు ఆర్టీసీ సంస్థలకు రూ.వేలాది కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని గుర్తు చేశారు. విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి అతుల్ తివారి నేతృత్వంలోని కమిటీ చార్జీల పెంపునకు సంబంధించి అధ్యయనం చేపట్టి ఇటీవలే నివేదిక సమర్పించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత కరువు పరిస్థితుల నేపథ్యంలో సామాన్య ప్రజలపై అధిక భారం మోపకుండా స్వల్ప ప్రమాణంలో బస్సు చార్జీలను పెంచుతామని తెలిపారు. మళ్లీ టోయింగ్ ప్రారంభం సాక్షి బెంగళూరు: నగరంలో ట్రాఫిక్ పోలీసులు అక్రమ పార్కింగ్‌కు వ్యతిరేకంగా టోయింగ్ వ్యవస్థను తిరిగి ప్రారంభించారు. వాహనాలను ఇష్టానుసారం నిలిపే వారిపై జరిమానాలతో విరుచుకుపడుతున్నారు. వారం రోజులుగా శాంతినగర చుట్టుపక్కల ప్రాంతాల్లో టోయింగ్‌ను ఎక్కువగా నిర్వహించారు. సెయింట్ జోసెఫ్ కాలేజీ, దివ్యశ్రీ చాంబర్స్ వద్ద నో పార్కింగ్ ఫలకాలను అమర్చారు. అక్కడ నిలిపిన వాహనాలను టోయింగ్ చేస్తున్నారు. బైక్‌లకు రూ. 1,150, నాలుగు చక్రాల వాహనాలకు రూ. 1,500 మేర జరిమానా విధిస్తున్నారు. కోలారు జిల్లాలో ఈడీ దాడులుకోలారు: కర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరు తాలూకా జోడి కృష్ణాపుర గ్రామంలో మృత్యుంజయ అనే వ్యక్తి ఇంటిపై ఈడీ అధికారులు దాడి జరిపి సోదాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నగదు అక్రమ బదిలీకి సంబంధించి అతనిపై గతంలో బెంగుళూరు తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో కోలారు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు బెంగళూరు రూరల్ జిల్లా హొసకోటెలో ఇతనికి చెందిన ఇళ్లపై ఈడీ అధికారులు గురువారం రాత్రి వరకు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. కంతులు చెల్లించలేదని ఇంటికి తాళం యశవంతపుర: కరువుతో రైతులు ఇబ్బంది పడుతున్నా బ్యాంకర్లు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. రుణం కంతు చెల్లించలేదని ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది ఓ ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన హాసన తాలూకాలో జరిగింది. ఉగనె కొప్పలు గ్రామానికి చెందిన రైతు మహిళ సుమా 2023లో తన ఇంటిని క్వెటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.12 లక్షల రుణం తీసుకుంది. రెండేళ్లపాటు కంతులు చెల్లించి మూడు లక్షలు తీర్చారు. మొదట 9 శాతం వడ్డీ వేయగా అనంతరం దుబారు వడ్డీ వేశారు. దీంతో కంతులు చెల్లించడంలో జాప్యం జరిగింది. మరో వైపు తాకట్టు పెట్టిన ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలతో కూలిపోయింది. ఈక్రమంలో ఆ బ్యాంక్ సిబ్బంది ఆ మహిళా రైతుపై కోర్టులో కేసు వేశారు. ఇంటిని సీజ్ చేయాలని కోర్టు అదేశించింది. 12 రోజుల క్రితం బ్యాంక్ సిబ్బంది ఇంటికి తాళం వేసుకొని వెళ్లారు. ఆ గ్రామానికి చెందిన మరో మహిళ రత్నమ్మ, గురువయ్య దంపతులు ఇదే బ్యాంక్‌లో భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. మూడేళ్లపాటు నెలకు రూ.18 వేలు కట్టారు. వర్షాలతో వీరి ఇల్లు కూడా కూలిపోయింది. ఫైనాన్స్ సంస్థ వారిపై కూడా కేసులు వేసి భూమిని లాక్కోవటానికి యత్నిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జైలు వార్డెన్‌పై ఖైదీల హత్యాయత్నం బనశంకరి: జైలు వార్డెన్‌పై రిమాండ్ ఖైదీలు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈఘటన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో జరిగింది. మంగళూరుకు చెందిన భజరంగదళ్ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్య కేసు నిందితులు ఈ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈనెల 2న ఉదయం జైలు వార్డెన్ మంజునాథ్ హవేలి ఖైదీ నుంచి సమాచారం కోసం అనెక్స్–1 బ్యారక్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో మహమ్మద్ ముజాయిద్ అనే ఖైదీ మంజునాథ్ హావేలిని దూషించి ముఖంపై రక్తం వచ్చేలా గాయపరిచాడు. అనంతరం అతడి వెంట ఉన్న అబ్దుల్ చౌహాన్, మహ్మద్ రిజ్వాన్, నయాజ్, కలందర్ షఫీలు కలిసి వార్డెన్‌ను గదిలోకి తీసుకెళ్లి దాడి చేసి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జైలు సిబ్బంది అతడిని కాపాడారు. దాడికి పాల్పడిన ఐదుగురు ఖైదీలపై కేసు దర్యాప్తులో ఉంది. -
ఇంటి స్థలాలకు భూమి కేటాయిస్తాం
కోలారు : పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అవసరమైన భూమిని మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ తెలిపారు. పాత్రికేయుల భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సహకార సంఘ సభ్యుల ప్రథమ వార్షిక మహాసభను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాత్రికేయుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని మంజూరు చేయడం ద్వారా పాత్రికేయులకు న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుత పాత్రికేయుల భవనాన్ని నవీకరిస్తామన్నారు. కలెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర అమోఘమన్నారు. ఎమ్మెల్సీ అనిల్‌కుమార్, సమాజ సేవకుడు సిఎంర్ శ్రీనాథ్, పాత్రికేయుల గృహనిర్మాణ సహకారం సంఘం అధ్యక్షుడు మునిరాజు, పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ అధ్యక్షులు గోపినాథ్, రాష్ట్ర సంఘం కార్యదర్శి వాసుదవహొళ్ల పాల్గొన్నారు. -
సిరుగుప్పలో కదంతొక్కిన రైతులు
సాక్షి, బళ్లారి: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కర్ణాటక ప్రాంత రైతు సంఘం ఆధ్వర్యంలో సిరుగుప్ప పట్టణంలో ఆందోళన చేపట్టారు. సిరుగుప్ప ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. బస్సులు, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది తీవ్ర వర్షభావ పరిస్థితులే నెలకొన్నప్పటికి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు రాక రైతులు కష్టాల్లో కురుకుపోయినప్పటికి సిరుగుప్ప తాలూకాను కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. వేదావతి, తుంగభద్ర నదిలో చుక్క నీరు లేక బీటలు వారాయన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. తక్షణం తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల చేయాలన్నారు. డ్యాంలో 95 టీఎంసీల నీరు ఉన్నా ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ఆదేశాల మేరకు పరిహారం ఇవ్వాల్సిందే..
బళ్లారి రూరల్: ‘ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి తనకు పరిహారం చెల్లించాలి. లేకపోతే పోరాటం చేస్తా’ అని ఆర్.హెచ్.చెన్నబసవ స్వామి తెలిపారు. శుక్రవారం పత్రికా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని గుగ్గిరహట్టి పంచాచార్య ఉన్నత పాఠశాలలో 1987 మే 30వ తేదీన ఉపాధ్యాయుడిగా చేరినట్లు తెలిపారు. పాఠశాల పాలక మండలి నియామక ఉత్తర్వులు కూడా అందజేసిందన్నారు. రెండు సంవత్సరాల తరువాత ఉజ్జయిని పాఠశాలకు బదిలీ చేశారని తెలిపారు. అయితే ఉజ్జయిని పాఠశాలలో పోస్ట్ లేదంటూ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగం పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు. 37 ఏళ్ల పాటు జీతం లేకుండా జీవించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. మూడు నెలల్లో పరిహారం చెల్లించాలని ఉజ్జయిని పాఠశాల, డీడీపీఐకి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. అయితే 8 నెలలు గడిచినా తనకు పరిహారం అందలేదన్నారు. సమావేశంలో విశ్రాంత ఉపాధ్యాయుడు సి.ఎం.గంగాధరయ్య,విశ్రాంత ప్రిన్స్‌పాల్ ఎ.ఎస్.ప్రభయ్య పాల్గొన్నారు. -
కరువుపై సీఎం వైమానిక సర్వే
యశవంతపుర/శివాజీనగర/హొసపేటె: కరువు పరిస్థితులపై సీఎం డీకే శివకుమార్ శుక్రవారం బాగలకోటె, విజయనగర, బళ్లారి జిల్లాల్లో వైమానిక సర్వే నిర్వహించారు. హెలికాప్టర్లో వివిధ ప్రదేశాలలో సంచరించిన సీఎం.. బాగలకోటె జిల్లా హునగుంద తాలూకా ధన్నూరు గ్రామంలో సూర్యకాంతి, ఉల్లి పంట నష్టాన్ని సమీక్షించారు. వానల కొరతతో ఎండిన వ్యవసాయ భూములను, హానికి గురై, కరువుతో ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితిని పరిశీలించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాంకాళ వైద్య, ఎంపీ డాక్టర్ జేసీ చంద్రశేఖర్ సీఎం వెంట పాల్గొన్నారు. కూడలసంగమలో పూజలు సీఎం డీకే శివకుమార్ బాగలకోటె జిల్లా కూడలసంగమలోని సంగమేశ్వర ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా నదికి వాయనం సమర్పించారు. రుణమాఫీ చేయాలి రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై విపక్షాలతో కలిసి కేంద్రంతో భేటీ కావాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. సదాశివనగరలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
హుబ్లీ: జిల్లాలో మరో అన్నదాత అప్పులకు బలి అయ్యాడు. వివరాలు.. సాగు చేసిన పంట చేతికందక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక జిల్లాలోని అణ్ణిగేరి తాలూకా వరకేరి వీధికి చెందిన రైతు శంకరప్ప గూళప్ప (80) పొలంలోనే విషం తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని అణ్ణిగేరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం గదగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక గురువారం మృతి చెందాడు. ఈ మేరకు అణ్ణిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సౌరశక్తి పథకాలపై అవగాహన రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాలు, దివ్యాంగులు ఆర్థిక స్వావలంబన సాధించాలని కమిషనర్ శరణప్ప సూచించారు. శుక్రవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో సేల్కో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధాన సౌరశక్తి పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీఎం సూర్యఘర్, రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రాంలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీపీ ఈఓ చంద్రశేఖర్ పవార్, దివ్యాంగుల శాఖ అధికారిణి సరస్వతి, నరసింహ మూర్తి, సురేష్, హృతిక్ భండారి తదితరులు పాల్గొన్నారు. బైక్‌లపై పిచ్చి.. దొంగగా మారి హుబ్లీ: బైక్ నడపాలన్న ఆశ.. అలాగే జల్సాలకు అలవాటు పడిన బైక్ దొంగగా మారిన ఓ 20 ఏళ్ల యువకుడిని కొప్పళ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బళ్లారికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్‌గా గుర్తించారు. ఇతడి నుంచి 16 బైక్‌లను జప్తు చేశారు. బైక్ మెకానిక్‌గా పని చేసే ఇర్ఫాన్ వాహనాలు లాక్ తీయడానికి ప్రత్యేకంగా మాస్టర్ కీ సిద్ధం చేసుకున్నాడు. కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలో ఇతడు వివిధ వాహనాలను చోరీ చేశాడు. పోలీసుల బైక్ కూడా ఇతడు చోరీ చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. గత నెలలో కొప్పళ జిల్లా ఆస్పత్రిలో ఆవరణలో జరిగిన బైక్ చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. కార్యచరణ జరిపి నిందితుడు మహమ్మద్ ఇర్ఫాన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు చోరీ చేసిన బైక్‌లను విడి భాగాలుగా విడదీసి కేవలం రూ.100, రూ.500లకు అమ్మే వాడు. కొన్ని సార్లు మొబైల్ ఫోన్లను తీసుకుని చోరీ చేసిన బైక్‌లను విక్రయించే వాడు. చిన్నప్పటి నుంచే చోరీ చేసే స్వభావాన్ని నేర్చుకున్న ఇతడిపై 8 పైగా కేసులు ఉన్నట్లు కొప్పళ ఎస్పీ సాహిల్బాగ్ర తెలిపారు. సమస్యలపై గళం విప్పాలి హొసపేటె: హొసపేటెలో నెలకొన్న సమస్యలపై శాసన సభలో గళం విప్పాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ నాయకులు ఎమ్మెల్యే గవియప్పను కోరారు. శుక్రవారం స్థానిక ప్రెస్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఆర్.భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. 2015 నుంచి నిరంతర పోరాటం చేస్తున్నప్పటికీ పట్టణంలో ఇప్పటి వరకు భూమి లేని వారికి ఒక్క ప్లాట్ కూడా కేటాయించలేదన్నారు. నగరంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్‌పాస్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కొత్త జిల్లా ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే అక్టోబర్‌లో నిరవధిక దర్నాకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎం.జంబయ్య నాయక్ కార్యదర్శి ఎన్.యల్లలింగ ఎం.గోపాల, జె.ఎం.చన్నబసయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజా సేవా అభియాన్ ● నేడు ప్రారంభించనున్న సీఎం డీకే శివకుమార్ హొసపేటె: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడానికి, పాలనను ప్రజల ముంగిటకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సేవా అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలో శనివారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, క్రీడల శాఖ మంత్రి డాక్టర్.జీ.పరమేశ్వర, ముజ్రాయ్, మత్స్య, ఓడరేవులు, అంతర్గత జల రవాణా శాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కేఎస్.బసవంతప్ప హాజరుకానున్నారు. రాష్ట్ర గ్యారంటీ పథకాల అమలు అథారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీటీ పరమేశ్వర నాయక్ హాజరవుతారు. కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్.ఎన్‌టి.శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. పైప్‌ల తొలగింపు రాయచూరు రూరల్: రాయచూరు, కొప్పళ జిల్లాల్లో తుంగభద్ర ఎడమ కాలువలో రైతులు అక్రమంగా వేసుకున్న పైప్‌లను తొలగించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. రెండు రోజుల నుంచి గంగావతి పరిధిలోని సోమనాళ, మైలాపూర్, చిక్క డంకన్కల్, కారటిగిలో జేసీబీల సహాయంతో అక్రమంగా వేసుకున్న పైప్‌లను తొలగిస్తున్నారు. రైతులు అక్రమంగా పైప్‌లు పెట్టుకుంటే చివరి ఆయకట్టు భూములకు నీరు అందడం కష్టంగా మారిందన్నారు. జలచౌర్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
రాయచూరు రూరల్: జిల్లాలో మృతి చెందిన దళిత కుటుంబాలకు పరిహారం అందిస్తాం. సర్కార్ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదనలను పరిశీలించడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మునియప్ప పేర్కొన్నారు. శుక్రవారం దేవదుర్గ తాలూకాలో పర్యటించారు. హద్దినాళలో భూమానంద, కరడకల్లలో రేణుక, సిరవార తాలుకా హోక్రాణిలో అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సర్కార్ నుంచి బాధిత కుటుంబాలకు త్వరగా పరిహారం అందేలా చొరవ తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి, పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యార్థులు చదువుకునేందుకు హాస్టల్ సౌలభ్యం కల్పిండచం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శౌచాలయాలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు బోసురాజ్, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, కరెమ్మ నాయక్. జిల్లా అధికారి పూవిత, ఏడీసీ శివానంద, అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ, ఎస్పీ అరుణాంగ్శు గిరి, సిరవార తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన
బళ్లారి రూరల్: వివిధ కారణాలతో నగరంలోని ఎస్పీ సర్కిల్ వద్ద మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం 8 నెలలుగా వాయిదా పడింది. ఎట్టకేలకు మంత్రిమండలిలో ఆమోదం లభించడంతో త్వరలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వాల్మీకి విద్యాభివృద్ధి సంఘం ఉపాధ్యక్షుడు జయరాం తెలిపారు. శుక్రవారం పత్రికా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. మంత్రి మండలిలో ఆయోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. మహర్షి వాల్మీకి కేవలం ఒక వర్గానికి చెందిన వాడు కాదని.. రామాయణం రచించిన ఆదికవిగా గుర్తించాలని అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులకు సూచించారు. విగ్రహాన్ని నగర ఎమ్మెల్యే నారాభరత్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. నాయకులందరూ కలిసి చర్చించుకుని విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహణ తేదీని నిర్ణయించాలని పేర్కొన్నారు. సమావేశంలో వాల్మీకి సముదాయ ప్రముఖులు వీ.కే.బసప్ప, ముదిమల్లయ్య, రుద్రప్ప, లోకేశ్, జనార్దన పాల్గొన్నారు. -
హే కృష్ణా.. ముకుందా.. మురారి
బనశంకరి: శ్రీకృష్ణ భగవానుడి జన్మదినోత్సవం(శ్రీకృష్ణాష్టమి) వేడుకలను శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బెంగళూరు నగరంలోని రాజాజీనగర, వసంతపుర ఇస్కాన్‌తో పాటు వివిధ ఆలయాల్లో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా చేపట్టారు. కృష్ణాష్టమి సందర్భంగా రాజాజీనగర ఇస్కాన్ ఆలయంలో బృందావన బృందం ప్రధాన ఆలయాన్ని నెమలి ఈకలతో అలంకరించారు. రంగమందిరంలో రాధాకృష్ణ ఉత్సవ విగ్రహాల కోసం 108 రకాల జలామృతాలతో నాలుగుసార్లు అభిషేకం చేసి రాధాకృష్ణ విగ్రహాలకు ప్రత్యేక పూల అలంకరణ చేపట్టి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో చిన్నారుల రాధాకృష్ణ వేషధారణల సందడి నెలకొంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భక్తులు ఇస్కాన్ దేవస్థానానికి భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి వరకు భక్తులకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఉడుపిలో శ్రీకృష్ణ వైభవం యశవంతపుర: ఉడుపి శ్రీకృష్ణ మఠంలో శ్రీకృష్ణ జన్మాష్ఠమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం పర్యాయ మఠాధిపతి వేదవర్థనతీర్థ మహాపూజను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఉడుపి మఠాన్ని దర్శించుకున్నారు. రాత్రి అర్చన మహా పూజలు చేశారు. ఉదయం లడ్డూలను శ్రీకృష్ణుడికి నివేదించారు. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడో రోజు లీలోత్సవ మృణ్మయ మూర్తికి పూజలు చేశారు. శ్రీకృష్ణ మఠాన్ని విశేషంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ధర్మాన్ని స్థాపించి ఆధర్మ సంహారం కోసం అవతరించిన శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను ఉడుపిలో సంబరంగా నిర్వహిస్తున్నారు. వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు దర్శనానికి బారులు తీరిన భక్తులు -
ఐశ్వర్య గౌడ బెయిల్ దరఖాస్తు కొట్టివేత
కర్ణాటక: మహిళా ఎస్ఐపై చేయి చేసుకున్నారనే ఆరోపణపై నమోదైన కేసుకు సంబంధించి ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య గౌడ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తును శ్రీరంగపట్నం 3వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు కొట్టివేసింది. మండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకా ఆరతి ఉక్కడలో శ్రీ అహల్యాదేవి ఆలయం వద్ద గతనెల 12న ఎస్ఐ సవిత విధుల్లో ఉండగా ఐశ్వర్యగౌడ ఆమెతో గొడవపడింది. ఈక్రమంలో ఐశ్వర్య తనపై చేయి చేసుకున్నట్లు క్యాతనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ ఫిర్యాదు చేశారు. దీంతో ఐశ్వర్యగౌడపై కేసు నమోదైంది. అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఐశ్వర్యగౌడ అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు. చదవండి: బ్యారక్ మార్చాలని పవిత్ర అర్జీ దాఖలు -
బ్యారక్ మార్చాలని పవిత్ర అర్జీ దాఖలు
కర్ణాటక: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, నటి పవిత్రగౌడ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో తనను మరో బ్యారక్‌లోకి బదిలీ చేయాలని 59వ సీసీహెచ్ కోర్టులో అర్జీ దాఖలు చేసింది. అక్రమంగా విలాసాలు కల్పించారని ఆరోపణలు రావడంతో ఆమెను 16 మంది నిందితులున్న బ్యారక్‌లోకి ఇటీవల బదిలీ చేశారు.అయితే అక్కడ 30 మంది వరకు ఖైదీలున్నారు, రెండే మరుగుదొడ్లు ఉండగా, ఒకదానికి మరమ్మతులు చేస్తున్నారు, ఆ బ్యారక్‌లో ఉండడం ఆమెకు చాలా ఇబ్బందిగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. అలర్జీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా తెలిపింది.చదవండి: ఐశ్వర్య గౌడ బెయిల్ దరఖాస్తు కొట్టివేత -
వరుస హత్యలపై భారీ నిరసన
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, వరుస హత్యలను ఖండిస్తూ కర్ణాటక దళిత సంఘర్ష సమితి(రిజిస్టార్) బళ్లారి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో నిరసన చేపట్టారు. నగరంలోని మర్చేడ్ హోటల్ నుంచి పాత జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లాధికారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. దళితులపై అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ జిల్లాలో భూమానంద, అశ్విని, రాణెమ్మల అత్యాచారం, హత్య ఘటనలను ప్రస్తావిస్తూ దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. -
ద్రౌపదమ్మ దేవికి ప్రత్యేక పూజలు
కోలారు: వహ్నికుల క్షత్రియ కుల బాంధవుల ఆరాధ్యదైవం ద్రౌపదమ్మ దేవి జయంత్యుత్సవాన్ని ప్రతి యేటా ప్రభుత్వం నుంచే ఆచరించాలని తిగళ సముదాయ అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఎల్ఏ మంజునాథ్ మనవి చేశారు. మంగళవారం నగరంలోని ధర్మరాయస్వామి, ద్రౌపదమ్మ దేవి ఆలయంలో ద్రౌపతమ్మ దేవి జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అన్ని జయంతులను ఆచరిస్తోంది. అదేవిధంగా వహ్నికుల క్షత్రియ ఆరాధ్య దేవత శ్రీ ద్రౌపదమ్మ దేవి జయంతిని కూడా ఆచరించాలన్నారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధికి అనుకూల మయ్యేలా అధిక నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సముదాయ సంఘటితం అయితేనే ప్రభుత్వం నుంచి సౌకర్యాలను పొందవచ్చన్నారు. సముదాయ ప్రజలు తమ పిల్లలకు ఉత్తమ విద్యాభ్యాసం అందించాలన్నారు. ద్రౌపతాంబ దేవికి విశేష పూజలను నిర్వహించారు. రాష్ట్ర తిగళ క్షత్రియ మహాసభ అధ్యక్షుడు ఎం.వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మైక్ శంకర్, కోశాధికారి నరసాపుర శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నగరంలో పోటాపోటీ నిరసనలు
శివాజీనగర: పంచాయితీరాజ్ శాఖ ఇంజనీర్ల ఉద్యోగాలు, కేపీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ మంగళవారం జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు బెంగళూరులో క్వీన్స్ రోడ్డులో కేపీసీసీ ఆఫీసు ముట్టడికి యత్నించారు. మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్‌మూర్తి నేతృత్వంలో ధర్నా చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. మరోవైపు ఎమ్మెల్సీ శరవణ ఆధ్వర్యంలో కేపీఎస్సీ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు అడ్డుకోగా వాగ్వివాదం నెలకొంది. శరవణ, కార్యర్తలు రోడ్డు మధ్యలోనే కూర్చొని ధర్నా చేయగా పోలీసులు వారిని వాహనాల్లో తరలించారు. మరోవైపు రాహుల్‌గాంధీపై కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. -
పరిసరస్నేహిగా గణేశ చవితి
బనశంకరి: బెంగళూరు నగరంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) గణపతి విగ్రహాలను ప్రతిష్టించడాన్ని పూర్తిగా నిషేధించామని, ప్రజలు పరిసరస్నేహి వినాయకులను ఏర్పాటు చేయాలని జీబీఏ కమిషనర్ మహేశ్వర్రావ్ విన్నవించారు. గౌరీ గణేశోత్సవం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం జీబీఏ, నగర పోలీసులు మంగళవారం టౌన్హాల్లో శాంతి సభను నిర్వహించారు. మహేశ్వర్రావ్ మాట్లాడుతూ పీఓపీతో తయారు చేసిన గణపతి విగ్రహాల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని నిషేధం ఉన్నట్లు తెలిపారు. మట్టి వినాయకులనే కూర్చోబెట్టి పూజించాలని కోరారు. గణేశోత్సవానికి అన్ని శాఖలతో చర్చించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రోడ్లు, ఫుట్‌పాత్ మార్గాలు బాగాలేని చోట మరమ్మతులు చేయాలని, పుష్కరిణిలను సిద్ధం చేయాలని తెలిపారు. ప్రజల కోసం అన్నిశాఖల సిబ్బందితో కూడిన సింగిల్ విండో కేంద్రాలను తెరుస్తామని తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు ఆ కేంద్రాల్లో అన్ని అనుమతులు తీసుకోవచ్చని చెప్పారు. ఉత్సవాలకు గట్టి భద్రత పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ గణేశోత్సవం శాంతియుతంగా ఆచరించడానికి భద్రత కల్పిస్తామని, ప్రజలకు ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ పెరగవచ్చని, ఊరేగింపులకు అనుకూలమైన మార్గాలను సూచిస్తామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు కార్తీక్‌రెడ్డి, ఆర్.లతా, నవీన్‌కుమార్‌రాజు, అధికారులు, నగరవాసులు పాల్గొన్నారు.బెంగళూరులో విక్రయాలకు సిద్ధంగా విగ్రహాలుపాల్గొన్న పోలీస్ అధికారులు, నగర ప్రజలు అనుమతులకు సింగిల్ విండోలు పీఓపీ విగ్రహాలు వద్దు జీబీఏ, పోలీసు అధికారుల వెల్లడి -
కేబినెట్ భర్తీకి స్వస్తి
శివాజీనగర: అధికార కాంగ్రెస్‌లో మళ్లీ పదవుల పందేరం వేడి మొదలైంది. వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి కేసులో మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేయడంతో కాంగ్రెస్ కేబినెట్లో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ పదవుల కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కన్నేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే మరింత గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని హైకమాండ్ నాయకులు భావిస్తున్నారు. అందుకే సీఎం డీకే శివకుమార్ కేబినెట్ విస్తరణను పక్కనపెట్టి కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్షుల నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. అలాగే 5 విధాన పరిషత్ సీట్ల నియామకం జరగనుంది. పెద్దసంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. గొడవలతో సతమతం సీఎం డీకే శివ ఇటీవల ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపారు. మళ్లీ మంత్రి పదవుల పంపిణీని ముట్టుకుంటే లేని సమస్యలు తలెత్తవచ్చని అనుకున్నారు. దీనివల్ల పునర్వ్యవస్థీకరణపై సానుకూల నిర్ణయం తీసుకోలేదు. కేబినెట్‌ను కదిలించినప్పుడల్లా అసమ్మతి చెలరేగడం, వివాదాలు చుట్టుముట్టడంతో డీకే సర్కారుకు సమస్యగా తయారైంది. ఇప్పుడు 2 మంత్రి పదవులను భర్తీ చేస్తే మళ్లీ గందరగోళానికి, అసంతృప్తికి దారితీయవచ్చనే భావన పార్టీ అగ్రనేతల్లో నెలకొంది. పీఠం ఇచ్చి బుజ్జగింపు కేబినెట్ భర్తీ కంటే ముందు కార్పొరేషన్, బోర్డుల పదవులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో భర్తీ చేసే అవకాశముంది. చాలా ప్రభుత్వ సంస్థలకు సారథుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పదవులను నేతలకు కట్టబెట్టి బుజ్జగించే పని చేపట్టనున్నారు. అలాగే 5 విధాన పరిషత్ సీట్ల నామినేషన్ల ప్రక్రియను కూడా సీఎం చేపడతారు. ఇందుకు ఢిల్లీ నుంచి పచ్చజెండా లభించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ సీట్లకు రేసు 5 ఎమ్మెల్సీ సీట్ల కోసం చాలామంది ఆశావహులు క్యూలో ఉన్నారు. గత జూలైలో ఖాళీ అయిన ఈ స్థానాలకు అభ్యర్థులను నామినేట్ చేసే పని సాగుతోంది. ఈ స్థానాలకు కళ, సాహిత్యం, సినీరంగం, సమాజ సేవా వంటి రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేయాల్సి ఉంది. డీకే చిన్ననాటి స్నేహితుడు వీ.రవిచంద్రన్, మాజీ సీఎం సిద్దరామయ్య మీడియా కార్యదర్శి కేవీ ప్రభాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. రమేష్‌బాబు, యూబీ వెంకటేష్, రాణీ సతీష్, కామ్ నాయక్, విజయ్ ముళగుంద్లు సైతం రేసులో ఉన్నారు.త్వరలో మరో దఫా పదవుల పంపకాలు సీఎం డీకే శివకుమార్ ముందు సవాలు ముట్టుకుంటే వివాదాలే కాంగ్రెస్ హైకమాండ్ సూచన కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్ష పదవుల భర్తీపై సీఎం దృష్టి మంత్రి ఖర్గే రాజీనామా తథ్యం బీజేపీ నేత అశోక్ జోస్యం హొసపేటె: వాల్మీకి మండలి కుంభకోణంలో నాగేంద్ర రాజీనామా చేసిన తర్వాత, కేపీఎస్సీ కుంభకోణంలో మంత్రి ప్రియాంక్ ఖర్గే రాజీనామా చేస్తారని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ అన్నారు. మంగళవారం ఆయన హొసపేటెలో మాట్లాడుతూ వాల్మీకి అభివృద్ధి మండలి కుంభకోణం, కరువు, కేపీఎస్సీ స్కాం సహా పలు సమస్యలపై తాము పాదయాత్ర చేస్తున్నామననారు. తమ పోరాటం వల్లనే నాగేంద్ర రాజీనామా చేశారన్నారు. ఇప్పుడు కేపీఎస్సీ కుంభకోణంలో ఒక ఐఏఎస్ అధికారిని అరెస్టు చేశారు, అది సరిపోదు. ఇందులో ప్రమేయం ఉన్న వారందరనీ అరెస్టు చేయాలి, మంత్రి ఖర్గే రాజీనామా చేయడం ఖాయం అని అన్నారు. ఈ పాదయాత్రలో జేడీఎస్ పాల్గొనకపోవడంపై స్పందిస్తూ తాను హెచ్డీ కుమారస్వామితో మాట్లాడతాని, తమ పొత్తులో ఎలాంటి సమస్య లేదని అన్నారు. -
రైతు బిడ్డకు రూ.46 లక్షల జీతం
యశవంతపుర: పల్లెటూరిలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి ప్రతిభావంతురాలిగా ఎదిగింది, ఐటీ కంపెనీలో కళ్లు చెదిరే వేతనంతో ఉద్యోగం సంపాదించింది. హావేరి జిల్లాకు చెందిన రైతు మంజునాథ్ కూతురు సృష్టి దక్షిణ కన్నడ జిల్లాలో బీటెక్ కోర్సు పూర్తి చేసింది. ప్రముఖ సంస్థ వీసా లో రూ.46.33 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని పొందింది. ఆమె అదే సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తూ ఉద్యోగానికి ఎంపికై నట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేవు. చెరువులోకి దూకి తల్లీకూతురు ఆత్మహత్యయశవంతపుర: ఇంటిలో గొడవ జరిగి కోపంతో కూతురు పరుగున వెళ్లి చెరువులోకి దూకింది, అది చూసిన తల్లి కూడా అదే చెరువులోకి దూకడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన కొడగు జిల్లా మడికెరి తాలూకా తలకావేరి సమీపంలో తరమణ గ్రామంలో జరిగింది. ప్రియాంక (14), తల్లి ప్రేమ (35) మృతులు. ప్రియాంక 8వ తరగతి చదువుతోంది. చిన్న విషయమై తల్లితో గొడవ పడింది, తల్లి మందలించడంతో ఆక్రోశం పట్టలేక సమీపంలోని చెరువులోకి దూకేసింది, వెంబడిస్తూ వెళ్లిన తల్లి కూతురు వెంటే చెరువులోకి దూకడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. చెరసాలలో అక్రమాల పర్వం● మండ్య జైలు అధికారి శతమ్మ బళ్లారికి బదిలీ మండ్య: విచారణ ఖైదీ అయిన శ్రీరంగపట్న ప్రభుత్వ అధికారి మహమ్మద్ హుస్సేన్‌కు సహాయం చేశారని, జైలులో డబ్బు చెల్లిస్తే రాజమర్యాదలు అందిస్తారని ఆరోపణలు రావడంతో జిల్లా జైలు ప్రధానాధికారి ఎం.శతమ్మను జైళ్ల చీఫ్ అలోక్ కుమార్ బళ్లారి సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. జైలులో అక్రమాలపై ఖైదీలు రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ వైరల్ అయిన తర్వాత ఈ ఉత్తర్వు వెలువడింది. ఫోర్జరీ విచారణ ఖైదీగా ఉన్న మహమ్మద్ హుస్సేన్.. అనారోగ్యం లేకున్నా జబ్బు సాకుతో మిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా కొందరు గుట్టురట్టు చేశారు. జిల్లా సెషన్స్ జడ్జి బృందం ఆసుపత్రిని తనిఖీ చేసి విచారించారు. ఈ కేసులో శతమ్మ నిర్లక్ష్యం స్పష్టం కావడంతో బళ్లారి జైలుకు బదిలీ చేసి ఆమె స్థానంలో ఫక్కీరప్ప బరకర్‌ను నియమించారు. నమో శంభులింగేశ్వరా బొమ్మనహళ్లి: శ్రావణ మంగళవారం సందర్భంగా హాసన్ జిల్లాలోని గండసీ గ్రామంలోని క్షేత్రనాథ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారికి రుద్రాభిషేకం, సహస్రనామ బిల్వార్చన, కుంభాభిషేకం, జలాభిషేకం తరువాత వివిధ పుష్పమాలలతో అలంకరించారు. స్వామి దర్శనానికి వేలాదిగా భక్తులు వచ్చి మొక్కుకున్నారు. బాలునిపై పిచ్చికుక్క భీకర దాడి ● మండ్య వద్ద ఘటన మండ్య: మండ్య తాలూకాలోని బేలూరు గ్రామంలో రోడ్డు పక్కన ఆడుకుంటున్న బాలునిపై పిచ్చికుక్క దాడి చేసి, కరిచి, ముక్కు, నోటిని ముక్కలు చేసింది. గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు, మన్విత్ గౌడ (8) బాలుడు ఆదివారం మధ్యాహ్నం, ఇంటి ముందు బాలలో ఆడుకుంటున్నాడు. ఓ పిచ్చికుక్క ఆకస్మాత్తుగా అతనిపై దాడి చేసింది. ఇది చూసి, ఇతర బాలురు పరిగెత్తిపోయారు. కుక్క కరవడంతో చిన్నారి ముక్కు, పెదవులు చీలికలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో కేకలు వేస్తుండగా తల్లిదండ్రులు వచ్చి కుక్కను తరిమివేసి, అతన్ని మిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని మైసూరులోని కె.ఆర్. ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పట్టించుకోలేదని బాలున్ని జేఎస్ఎస్ ఆసుపత్రిలో చేర్పించారు. మొదట కుక్క కాటుకు చికిత్స చేస్తున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముక్కు, పెదవులకు వైద్యం చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆ కుక్కను కొట్టి చంపేశారు.తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో వైద్యం -
పాదయాత్ర తో బీజేపీ సమరభేరి
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, శాసన సభ్యులు, అధికారులు అవినీతి అక్రమాల్లో మునిగి పోయారని, అక్రమాల పుట్ట కాంగ్రెస్‌ను ఇంటికి పంపడమే లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని లింగసూగూరులో బీజేపీ ఆధ్వర్యంలో లింగసూగూరు నుంచి బళ్లారి వరకు చేపట్టిన పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని వారు మాట్లాడారు. సర్కార్‌లో మంత్రిగా పని చేసిన నాగేంద్ర రాజీనామా చేసినంత మాత్రాన వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి నిధులను తిరిగి రాబట్టాలని డిమాండ్ చేశారు. ఎస్టీలకు కేటాయించిన ఏడు శాతం రిజర్వేషన్లను 3 శాతానికి తగ్గించారని దుయ్యబట్టారు. కరువు నివారణ విషయంలో నిర్లక్ష్యం, కేపీఎస్సీ బాగోతం, అభివృద్ధి పనుల స్తంభన వంటివి జరిగాయని ఆరోపించారు. పాదయాత్రలో విధాన పరిషత్ సభ్యుడు నారాయణ స్వామి, మాజీ మంత్రులు గోవింద కారజోళ, శ్రీరాములు, అశోక్, శివనగౌడ నాయక్, రాజుగౌడ, విరుపాక్షప్ప, మాజీ ఎమ్మెల్యేలు మానప్ప వజ్జల్, ప్రతాప్‌గౌడ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. బిడదిలో సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం సరైన వర్షాలు కురవక కరువుతో సతమతమవుతున్న రైతుల సమస్యలను పట్టించుకోకుండా, బిడదిలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. మంగళవారం బీజేపీ నేతలు లింగసూగూరు నుంచి బళ్లారి వరకు చేపట్టిన పాదయాత్రకు ముందు విలేకరులతో మాట్లాడారు. సర్కార్‌లో మంత్రిగా పని చేసిన నాగేంద్ర రాజీనామా చేసి వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి చేశారని, దళితులకు కేటాయించిన నిధులను వారికి వ్యయం చేయకుండా దిగమింగారన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప వరదలు వచ్చిన సమయంలో రూ.5 లక్షల పరిహారం అందించారని గుర్తు చేశారు. మాజీ మంత్రి రాజణ్ణ విషయంలో దళితులపై ఎంత మమకారం ఉందో తెలుస్తోందన్నారు. వాల్మీకి అభివృద్ధి మండలి అధికారి చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సాంత్వన చెప్పలేని సర్కార్ గాఢనిద్రలో ఉందని ఎద్దేవా చేశారు. మంత్రివర్గంలో నలుగురు అమాత్యులు త్వరలో తమ పదవులు రాజీనామా చేయడానికి సిద్ధం కావాలన్నారు. 2028లో బీజేపీ నేతృత్వపు ఎన్డీఏ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్నారు. కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు లింగసూగూరులో పాదయాత్రకు నగారా మోగించిన నేతలు పాదయాత్ర వేదికపై మాజీ ముఖ్యమంత్రుల నగారా లింగసూగూరు నుంచి పాదయాత్రకు నేతల శ్రీకారం -
హోటళ్లలో ఆహార తనిఖీలు
శివమొగ్గ: శివమొగ్గ నగరంలోని హోటళ్లు, బేకరీలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఆహార నాణ్యత తనిఖీలు కొనసాగుతున్నాయి. సహాయక కలెక్టర్ డాక్టర్ మైత్రి నేతృత్వంలో అధికారులు మంగళవారం నగరంలోని పలు ఫుడ్ కోర్టులలో సోదాలు చేశారు. ఆహార తయారీలో నాణ్యతను పాటించాలని, నాసిరకం, హానికరమైన, నిషేధిత రసాయనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని నిర్వాహకులకు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, శుభ్రమైన వంట నూనెను ఉపయోగించాలని పలు సూచనలు చేశారు. ఆహార నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు, నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని కూడా పరిశీలిస్తున్నట్లు, కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని మైత్రి తెలిపారు. -
గంగావతిలో రాజీనామా చేసి గెలవండి
సాక్షి,బళ్లారి: ఉమ్మడి బళ్లారి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేయండని మాట్లాడే ముందు మీరు గంగావతి ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి, గెలిచిన తర్వాత ఉమ్మడి బళ్లారి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల గురించి మాట్లాడాలని లోక్‌సభ సభ్యుడు తుకారాం, రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్, ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని కమ్మభవన్‌లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశంలో పాల్గొని గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములుపై నిప్పులు చెరిగారు. మా దమ్ము గురించి మాట్లాడే ముందు మీకు ఎంత దమ్ము ఉందో తెలుసుకోవాలన్నారు. ఇటీవల జరిగిన సండూరు ఉప ఎన్నికల్లో మీ నాయకత్వంలోనే బీజేపీ పోటీ చేస్తే, అక్కడ బీజేపీ అభ్యర్థి చిత్తుచిత్తుగా ఓడిపోలేదా అని ప్రశ్నించారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఒక మహిళను ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబెట్టి గెలిపించిందని గుర్తు చేశారు. సండూరు ఉప ఎన్నికల్లో గెలవలేని మీరు, జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల గురించి మాట్లాడతారా అని ఎద్దేవా చేశారు. నేను స్వచ్ఛందంగా రాజీనామా చేశా తాను స్వంత నిర్ణయంతో రాజీనామా చేశాను కాని ఎవరి ప్రోద్బలంతోనో కాదని నాగేంద్ర అన్నారు. గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు ఇద్దరూ చెల్లని నాణేలు అని పరోక్షంగా విరుచుకుపడ్డారు. గాలి జనార్దనరెడ్డి ఎన్ని రాజకీయ ఎత్తులు వేసినా, అందుకు ప్రతీగా తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. గంగావతిలో రాజీనామా చేసి గెలిస్తే, తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని పలువురు ఎమ్మెల్యేలు ఘాటు హెచ్చరికలు చేశారు. వాల్మీకి అభివృద్ధి నిగమలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తప్పు చేసి ఉంటే కోర్టు ఏ శిక్ష వేసినా అనుభవిస్తానన్నారు. చివరకు ఉరిశిక్ష వేసినా సంతోషంగా స్వీకరిస్తాన్నారు. మీ అక్రమాల చిట్టా విప్పితే మీకు పుట్టగతులు ఉండవన్నారు.గాలి జనార్దనరెడ్డి చేసిన అక్రమాల్లో శ్రీరాములుకు కూడా వాటా ఉందన్నారు. ఎమ్మెల్యేలు గణేష్, అన్నపూర్ణ, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, బుడా అధ్యక్షుడు జే.ఎస్ ఆంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ గెలిస్తే మేం రాజకీయ సన్యాసం స్వీకరిస్తాం గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములుపై కాంగ్రెస్ నేతలు గరం -
కారు బోల్తా.. ముగ్గురి మృతి
హుబ్లీ: కారు బోల్తా పడిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన ధార్వాడ తాలూకా వెంకటాపుర గ్రామం వద్ద జాతీయ రహదారి– 4లో మంగళవారం జరిగింది. దావణగెరె జిల్లా కెరె యాగళహళ్లికి చెందిన వినాయక (25), బసవరాజ(34), హరిహర తాలూకా జిగళి గ్రామానికి చెందిన మంజునాథ(29) మృతులు. ధార్వాడ ఎలెగార వీధి బసవనగౌడ (26), దావణగెరె అభిషేక్ (30), అజయ్ (26) గాయపడ్డారు. బెళగావి నుంచి ధార్వాడకు వస్తుండగా ముందు ఉన్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో రోడ్డు డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడింది. ఫలితంగా ముగ్గురు ఘటన స్థలంలోనే మృతి చెందారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలాన్ని గరగ పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కేటరింగ్ పని కోసం ఎనిమిదేళ్ల నుంచి ధార్వాడలో నివాసం ఉండేవారు. 20 రోజులుగా సొంతూళ్లో బస ఆషాఢ మాసంలో కేటరింగ్ ఆర్డర్లు లేకపోవడంతో దావణగెరె జిల్లాలోని తమ సొంత ఊర్లకు వెళ్లి 20 రోజుల పాటు అక్కడే ఉన్నారు. తిరిగి ధార్వాడకు సోమవారం రాత్రి బయలుదేరి డాబాలో భోజనం చేసి తిరిగి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం వారి బంధువులు ధార్వాడకు వచ్చి మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరయ్యారు. బంధువు షణ్ముఖ మాట్లాడుతూ వినాయక తన అన్న కుమారుడు, బసవరాజ్ మా అల్లుడు, ఆషాడంలో కేటరింగ్ ఆర్డర్లు లేకపోవడంతో ఇటీవల ఊరికి వచ్చారు. బసవరాజ్, వినాయక ఇద్దరు కూడా ఆ ఇంటి ఆధార స్తంభాలు. పని చేసి ఇంటిని పోషించేవారు. బసవరాజ్‌కు తండ్రి లేరు. తల్లి కూలీ నాలీ చేసుకుంటుంది. మరో మృతుడి బంధువు అన్వేష్ మాట్లాడుతూ 7, 8 ఏళ్లుగా ధార్వాడలో కేటరింగ్ పని కోసం వెళ్లి అక్కడే ఉండేవారు. అప్పుడప్పుడు కెరె యాగళహళ్లికి వచ్చి వెళ్లేవారు. గత 20 రోజులుగా ఊరిలోనే ఉన్నారని, మృతులెవరికీ ఇంకా వివాహం కాలేదన్నారు. గత రాత్రి డాబాలో భోజనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మృతులంతా దావణగెరె జిల్లా వాసులు ధార్వాడ తాలూకా వెంకటాపుర వద్ద జాతీయ రహదారిలో ఘటన -
కరువుపై చర్చకు నైతిక హక్కు లేదు
సాక్షి, బళ్లారి/హుబ్లీ: అసెంబ్లీ సమావేశాల్లో కరువుపై చర్చకు అవకాశం ఇవ్వని బీజేపీకి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అవసరం లేదు. నాగేంద్ర నైతిక బాధ్యత వహించి ఏ తప్పు చేయక పోయినా రాజీనామా చేశారని సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. హుబ్లీ విమానాశ్రయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ వారి ఆటలన్నింటికీ తాను ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ చెబుతానన్నారు. ఆ సమాధానం ఎలా చెబుతానో త్వరలోనే తెలియజేస్తానన్నారు. బీజేపీలో ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని కప్పి పుచ్చడానికి ఈ పాదయాత్ర చేపట్టారు. కరువుపై చర్చకు బీజేపీకి ఎటువంటి నైతికత లేదు. బీజేపీ పాదయాత్ర చేయడం లేదు. రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కూడా గతంలో బళ్లారికి, మేకెదాటు పథకం కోసం, కృష్ణా నీటి వాటాలపై పాదయాత్రలు చేశామని గుర్తు చేశారు. బీజేపీ 100 పాదయాత్రలు చేయనివ్వండి. వారిపై ఎదురు దాడికి వారే దారి కల్పించారన్నారు. కరువు పీడిత ప్రాంతాలను ఉన్న ఫళంగా తీర్మానించడం కుదరదు. దీనికి ఎన్నో నియమాలు ఉన్నాయి. అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాలి. దాని ఆధారంగా కరువు ప్రాంతాలను ప్రకటిస్తాం. కనకపురలోను కరువు ఉంది. అయినా ఇప్పటికీ ఆ ప్రకటన చేయలేదు. నేను సీఎం అయిన తక్షణమే అధికార దుర్వినియోగం చేయడం కుదరదు. బీజేపీ వారికి నేను సీఎం కావడం జీర్ణం కావడం లేదు. రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేయడమే వారి గొప్పతనం. అయితే రాహుల్ గాంధీ ఏ అవినీతికి పాల్పడ్డారు. కేపీఎస్సీ అక్రమాల్లో పాలు పంచుకున్నారా? ఎన్ఈటీ పరీక్ష అక్రమాల్లో పాలు పంచుకున్నారా? అని నిలదీశారు. మంత్రి బసవరాజ రాయరెడ్డి ఏం మాట్లాడారో తనకు తెలియదని, ఆయనతో కలిసి చర్చించాక దానిపై మాట్లాడతానన్నారు. రాజకీయాల కోసమే పాదయాత్ర ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ -
రాహుల్‌పై అట్రాసిటీ కేసు నిరసిస్తూ ధర్నా
రాయచూరు రూరల్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అనవసరంగా అట్రాసిటి కేసు పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా సంఘం ఖండించింది. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్సీ వసంత కుమార్ మాట్లాడారు. దేశంలో కన్యాకుమారి నుంచి జమ్ము కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిపై కేంద్ర సర్కార్ తప్పుడు కేసులు బనాయించడం తగదన్నారు. ఆందోళనలో జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, నగర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జయన్న, శాంతప్ప, శివమూర్తి, పామయ్య మురారి, అమరేగౌడ, శ్రీదేవి నాయక్, మంజులున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించండి రాయచూరు రూరల్: రాష్ట్ర సర్కార్ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఏఐడీవైఓ డిమాండ్ చేిసింది. మంగళవారం టిప్పు సుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహేష్ మాట్లాడారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న సర్కార్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. త్వరితగతిన ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. యడ్డి, విజయేంద్రలకు సన్మానంరాయచూరు రూరల్: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠంలో 355వ ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి రాఘవేంద్ర స్వాముల మఠంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. రాఘవేంద్ర స్వామి మూల విరాట్‌కు ఊంజల్ సేవలు చేశారు. అనంతరం మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ఇద్దరిని శాలువా కప్పి సన్మానించారు. హెస్కాం సిబ్బందిపై దాడి హుబ్లీ: విద్యుత్ తీగల మరమ్మత్తు కోసం కరెంట్ సరఫరా నిలిపి వేసిన హెస్కాం సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కుందగోళ తాలూకా సిరియూరు గ్రామంలో చోటు చేసుకుంది. సంశి హెస్కాం కార్యాలయ ఉద్యోగి అకర్ ఉల్లాజి దాడికి గురైన వ్యక్తి. ఇతడు సిరియూరులో తెగి పడిన విద్యుత్ తీగలను సరి చేయడానికి కరెంట్ సరఫరాను ఆపాడు. కోపోద్రిక్తుడైన స్థానికుడు డ్యూటీలో ఉన్న సిబ్బందిపై చెంపదెబ్బ కొట్టాడు. వస్త్ర దుకాణంలో చోరీ మరో ఘటనలో వస్త్ర దుకాణంలో మంగళసూత్రం చోరీ చేసిన ఘటన స్థానిక దాజిబాని పేటలో జరిగింది. బట్టల దుకాణంలో చీరలు కొనేటప్పుడు రూ.4.50 లక్షల విలువ చేసే 35 గ్రాముల మంగళసూత్రం, రూ.1200 నగదు ఉన్న వ్యానిటీ బ్యాగ్‌ను చోరీ చేశారు. కూబిహాళ నాగరత్నకు చెందిన ఆభరణాలు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది. నాగరత్న తన చెల్లెలు జ్యోతికి బ్యాగ్ ఇవ్వగా దాన్ని ఎవరో చోరీ చేశారని హుబ్లీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు రాయచూరు రూరల్: జిల్లాలో విధి నిర్వహణలో అలసత్వం చేసే అధికారులపై చర్యలు చేపడతామని సంచార గిరిజన మండలి కమిషన్ అద్యక్షుడు ఎన్.మూర్తి అధికారులపై మండిపడ్డారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి జెడ్పీ భవనంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళల్లో సమస్యలపై స్పందించిన ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. అక్రమ మద్యం, హత్యలు, అత్యాచారాల కేసులు అధికం కావడం సిగ్గుచేటన్నారు. జిల్లాధికారిణి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర పాలక కమిషనర్ జుబీన్ మహాపాత్రోలున్నారు. -
హత్య కేసులను సీఐడీకి అప్పగించాలి
రాయచూరు రూరల్: జిల్లాలో జరిగిన దళితుల హత్య కేసుల దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని దమనిత సేనా సమితి సంచాలకుడు భరత్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. పాత కక్షల నేపథ్యంలో దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హద్దినాళలో బీఎస్పీ, దళిత కార్యకర్త భూమానందపై గొడ్డలితో హత్య, కరడకల్‌లో రేణుక హత్య, సిరవార తాలూకా హొక్రాణిలో అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ జిల్లాధికారి పూవితకు వినతిపత్రం సమర్పించారు. అర్హులకే గ్యారెంటీల లబ్ధి చేకూర్చండిరాయచూరు రూరల్: పంచ గ్యారెంటీ పథకాలను అర్హులైన లబ్ధిదారులకే అందించాలని జిల్లా పంచ గ్యారెంటీ కమిటీ అధ్యక్షుడు పామయ్య మురారి పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ భవనంలో జరిగిన సమావేశంలో అధికారులతో మాట్లాడారు. మృతుల ఖాతాల్లో పడిన డబ్బుల వసూళ్లలో తర్జన భర్జనలు జరుగుతున్నట్లు తెలిపారు. అన్న భాగ్య పథకంలో నియమాలను ఉల్లంఘించిన 8 మంది డీలర్లు, 1847 కార్డులను రద్దు చేశామని, 1631 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అన్న భాగ్య పథకంలో డీబీటీ ద్వారా రూ.58.72 కోట్లు, శక్తి పథకంలో రూ.18 కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పంచ గ్యారెంటీలను కొనసాగిస్తామన్నారు. శాఖలు, అధికారుల మధ్య సహకారం లేకపోవడంతో పథకాలు దారి మళ్లుతున్నాయన్నారు. సమావేశంలో అధికారులు ఈశ్వర్ కుమార్, పావన్ పటేల్, పరశురామ్, మంజునాథ్‌లున్నారు. పరమశివా.. పాహిమాం.. రాయచూరు రూరల్: సమాజంలో మానవుడికి సంస్కారంతో జీవన విధానం మారాలని బీదర్ దక్షిణ విధానసభ సభ్యుడు డాక్టర్ శైలేంద్ర బేల్దాళ్ అభిప్రాయపడ్డారు. సోమవారం బీదర్ తాలూకా పాపనాశినిలో భార్య నీతాతో పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. చిన్నతనంలో పిల్లలకు పాండిత్యం, సంస్కృతి, సంప్రదాయం, ఆచార, విచారాలను బోధించాలన్నారు. పత్రికల ఏజెంటు మృతిసాక్షి,బళ్లారి: గత 30 ఏళ్లుగా తెలుగు, కన్నడ, ఇంగ్లిష్, హిందీ తదితర పత్రికలకు ఏజెంటుగా పని చేస్తున్న ఎం.ఖమరుద్దీన్ సాబ్ (59) మృతి చెందారు. మంగళవారం బండిమోట్లోని తన నివాస గృహంలో ఆయన మృతి చెందడంతో పలువురు పత్రికల ఏజెంట్లు దివాకర్, రవి, రంగస్వామి, సర్క్యులేషన్ విభాగం ఎస్ఆర్ ఎర్రిస్వామి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెట్టుబడిదారులకు సొమ్ము చెల్లించాలి రాయచూరు రూరల్: నగరంలోని దర్వేశి కంపెనీలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులకు డబ్బులు చెల్లించాలని పెట్టుబడిదార్లు డిమాండ్ చేిశారు. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అంబాజీ మైదునకర్ మాట్లాడుతూ మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న దర్వేశి కంపెనీ రూ.800 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపి ప్రజలకు టోపీ వేసిన కంపెనీ నుంచి నిధులు వాపస్ ఇవ్వాలని కోరారు. ప్రజల నుంచి డబ్బులు డిపాజిట్ తీసుకున్న దర్వేశి కంపెనీ యాజమాన్యం చేతులెత్తేయడాన్ని ఖండించారు. చంద్రమౌళేశ్వర సర్కిల్ నుంచి పాదయాత్రను చేపట్టిన ఆందోళనస్థలానికి చేరారు. రాయరెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు హొసపేటె: ముస్లిం మతంలో నాలుగు లేదా ఐదు వివాహాలు చేసుకునే అవకాశం ఉంది. నాలుగు లేదా ఐదు వివాహాలు చేసుకోవాలనే కోరిక వల్లే ముస్లిం మతం శ్రేష్ఠమైనదని అన్నందుకు మంత్రి బసవరాజ రాయరెడ్డిపై శాసన మండలి సభ్యుడు సీటీ రవి విమర్శలు గుప్పించారు. విజయనగర జిల్లా హొసపేటెలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాయరెడ్డి ప్రపంచంలో ఇస్లాం గొప్ప మతం అని అన్నారు. మరణానికి ముందు ఇక్కడ లభించని అత్యాశను మరణానంతరం పొందాలని రాయరెడ్డి కోరుకుని ఉండవచ్చు. ఉగ్రవాదుల భయంతోనే ఇస్లాం ఉత్తమ మతం అన్ని చెప్పారని ఎద్దేవా చేశారు. -
ఘనంగా ద్రౌపతమ్మ జాతర
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో తళి రోడ్డులో ఉన్న భజన మందిరంలో వహ్నికుల సేవా సంఘం ఆధ్వర్యంలో ద్రౌపతమ్మ దేవి జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రధాన వీధుల్లో పల్లకీ ఊరేగింపు సాగింది. ద్రౌపదీ దేవి, ధర్మరాయస్వామి, కృష్ణ, భీమ, అర్జున విగ్రహాలను అలంకరించి ఊరేగించారు. భక్తులు ఇళ్ల ముందు స్వాగతం పలికి పూజలు చేశారు. మాయసంద్ర సహా పలుచోట్ల ద్రౌపతమ్మ దేవి ఆలయాల్లో వేడుకలు జరిగాయి. బస్సు ఢీకొని మున్సిపల్ ఉద్యోగి మృతిబాగేపల్లి: బాగేపల్లి పట్టణంలోని గూళూరు రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే ఎస్.ఎన్. సుబ్బారెడ్డి ఇంటి ముందు సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగి మున్సిపల్ ఉద్యోగి నరసింహమూర్తి చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడే మృత్యువాత పడ్డాడు. ఆయన స్కూటర్లో వస్తుండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొనింది, దీంతో తీవ్రగాయాలతో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా చేరుకుని విచారించి ఆర్టీసీ బస్సును సీజ్ చేసి డ్రైవర్ మీద కేసు నమోదు చేశారు. ఘటనాస్థలిలో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. కుటుంబీకులు, బంధువులు చేరుకుని బోరున విలపించారు. ద్రౌపతమ్మకు గాజుల సింగారం బొమ్మనహళ్లి: బెంగళూరు రూరల్‌లో హొసకోటె దగ్గర శివనపురలోని ఆదిశక్తి మహా సంస్థాన మఠంలోని ఆదిశక్తి ద్రౌపదిదేవి జయంతిలో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని 20 వేల గాజులతో అలంకరించారు. మహాభారతంలో ద్రుపద మహారాజు నిర్వహించిన పవిత్ర యాగకుండం అగ్ని నుంచి ద్రౌపది జన్మించిన జ్ఞాపకార్థం ఈ జయంతిని జరుపుకుంటున్నారు, ధైర్యం, సహనం వంటి ద్రౌపది గుణాలను నేటి యువత, ముఖ్యంగా మహిళలు అలవర్చుకోవాలి అని పీఠాధిపతి ప్రణవానందపురి స్వామి తెలిపారు. పోట్లాటలో ఎలుగుబంటికి గాయాలు తుమకూరు: జిల్లాలోని మధుగిరిలో జరిగిన రెండు ఎలుగుబంట్ల పోట్లాటలో ఓ ఎలుగుబంటి తీవ్రంగా గాయపడింది. మిడిగేసి హోబ్లీ, బిద్రేకెరె గ్రామంలోని ఒక పొలంలో రెండు ఎలుగుబంట్లు పోట్లాడాయి. మూడేళ్ల ఆడ ఎలుగుబంటి గాయాలతో పడిపోయి ఆర్తనాదాలు చేసింది. గ్రామస్తులు అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా సురేష్, శాలిని తదితరులు చేరుకుని ఆ భల్లూకాన్ని చికిత్స కోసం వాహనంలో బెంగళూరు బన్నేరుఘట్ట జూపార్క్ కు తరలించారు. నేత్రపర్వంగా రాయర ఊరేగింపు మైసూరు: ఎంబీ హళ్లి రోడ్డులోని నిర్మాణనగర జంత గల్లిలోని కల్పవృక్ష శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో 355వ రాయర ఉత్తరారాధన మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. రాఘవేంద్రస్వామి వారికి పంచామృతాభిషేకం, పూల అలంకరణ, మహా మంగళ హారతి నెరవేర్చారు. కల్పవృక్ష వాహనం ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
వేతన బకాయిలు చెల్లించరూ
హొసపేటె: హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, అతిథి ఉపన్యాసకులకు గత 15 నెలలుగా వేతనాలు అందక పోవడంతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే వేతన బకాయిలు అందజేయాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే గవియప్పకు వినతిపత్రాన్ని సమర్పించారు. కాంట్రాక్టు, అతిథి ఉద్యోగులు నాగవేణి, శ్రీనివాస్ కలాల్, బసవరాజ్ తదితరులు మాట్లాడుతూ కన్నడిగులకు గర్వకారణమైన, కన్నడ భాష, సంస్కృతి, వారసత్వ అధ్యయనానికి అంకితమైన ఏకై క విశ్వవిద్యాలయంగా ఖ్యాతి గడించిన, కన్నడ భూమి, భాష, నీటిని పరిరక్షించేందుకు 35 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ప్రారంభమైన కన్నడ విశ్వవిద్యాలయం నాటి నుంచి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఏకరువు పెట్టారు. వేతనాలు లేక అతిథి అధ్యాపకులు, బోధన సహాయకులు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారన్నారు. -
దక్షిణ కర్ణాటకకు ఆల్మట్టి నీటి మళ్లింపు?
రాయచూరు రూరల్: ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల ప్రజలు తాగు, సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఉత్తర కర్ణాటక నీటిని దక్షిణ కర్ణాటకకు మళ్లించడంతో పాటు ఆల్మట్టి డ్యాం నుంచి నీటిని తీసుకెళ్లడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. దక్షిణ కర్ణాటకలోని బయలుసీమ ప్రాంతాలైన కోలారు, చిక్కబళ్లాపూర్లకు నీటిని ఇవ్వాలని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించారు. గతంలో మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు కూడా ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లోని ప్రజా ప్రతినిధులు మౌనం వహించారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు(యూకేపీ) మూడో విడతలో నీటి పంపకాల విషయంలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సర్కార్ ఐదేళ్లలోపు యూకేపీతో పాటు నీటిపారుదల రంగానికి రూ.2 లక్షల కోట్ల నిధులు వ్యయం చేస్తామన్న సర్కార్ నేటికీ చిల్లిగవ్వ కూడా నిధులు విడుదల చేయలేదు. బాగల్కోటెలో ఆల్మట్టి డ్యాం కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించలేదు. -
విద్యా వ్యవస్థ దిద్దుబాటు ఎలా?
● కేబినెట్ ఉపసంఘం భేటీ శివాజీనగర: విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆరు ప్రధాన సమస్యలు, విద్యా వ్యవస్థలో అమలు చేయాల్సిన సంస్కరణల గురించి ఆరోగ్య శాఖ మంత్రి యూ.టీ.ఖాదర్ అధ్యక్షతన ఏర్పాటైన విద్యార్థి సమస్యలు– విద్యా సంస్కరణల కేబినెట్ ఉపసంఘం మొదటి సమావేశంలో చర్చించారు. గురువారం విధానసౌధలో ఈ భేటీ జరిగింది. మంత్రులు మధు బంగారప్ప, బసవరాజ్ రాయరెడ్డి, ప్రియాంక్ ఖర్గే, శరణప్రకాష్ పాటిల్, ఐఏఎస్‌లు హాజరయ్యారు. పరీక్షలు, చదువుల ఫీజుల భారం, కోచింగ్ సెంటర్ల నియంత్రణ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యల గురించి చర్చించారు. విద్యారంగంలో మార్పులపై నిపుణుల అభిప్రాయాలను సేకరించాలని, వారితో సమావేశం జరపాలని తీర్మానించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా నిపుణులు, ప్రజల నుంచి విద్యా సంస్కరణలపై సూచనలు స్వీకరించడానికి ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని సూచించారు. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ)లో అక్రమాలను అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని మంత్రులు పేర్కొన్నారు. -
ఫిబ్రవరి 8 నుంచి ఏరో ఇండియా
● బెంగళూరు యలహంకలో 5 రోజులు.. ● లోహ విహంగాల కనువిందు ● కేంద్ర రక్షణ శాఖ ప్రకటన శివాజీనగర: ప్రతి రెండేళ్లకు ఓసారి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే బెంగళూరు లోహ విహంగాల ప్రదర్శనకు ముహూర్తం కుదిరింది. ప్రపంచస్థాయి వైమానిక ప్రదర్శనగా పేరుపొందిన ఏరో ఇండియా– 2027 తేదీలను కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 8 నుంచి 12వ తేదీ సాయంత్రం వరకు 5 రోజుల పాటు బెంగళూరు యలహంకలోని వైమానిక దళ స్థావరంలో జరుగుతుందని తెలిపారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఏరో ఇండియాను నిర్వహిస్తారన్నది తెలిసిందే. సాంకేతిక ప్రగతికి అద్దం దేశ విదేశాల నుంచి వైమానిక, రక్షణ రంగ సంస్థలు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తాయి. వైవిధ్యభరితమైన విమానాలు, హెలికాప్టర్లు, కొత్తగా డ్రోన్ల గగనతల విన్యాసాలు ఆకట్టుకోబోతున్నాయి. వాటి విన్యాసాలు చూపరులను విస్మయానికి గురిచేస్తాయి. అలాగే వైమానిక, విజ్ఞాన సంస్థల మధ్య ఒప్పందాలు, పెట్టుబడులు, నూతన ఆవిష్కారాలకు ఈ ప్రదర్శన వేదికగా నిలుస్తుంది. ఏరో ఇండియాలో పాల్గొనడానికి ఆన్లైన్ నమోదు, స్టాల్ ఏర్పాటుకు స్థల నమోదు గురువారం నుంచి ఆరంభమైనట్లు రక్షణ శాఖ తెలిపింది. -
వృక్షో రక్షతి రక్షితః
బళ్లారి రూరల్: వృక్షో రక్షతి రక్షితః అన్న నానుడి అందరికీ తెలిసిందే. చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. బళ్లారి వైద్య కళాశాల పరిశోధన కేంద్రం(బీఎంసీఆర్‌సీ)లో అత్యధికంగా చెట్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ చెట్ల నీడనే రోగుల సహాయకులు సేద తీరుతుంటారు. గత రెండు రోజులుగా బళ్లారిలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఈ నేపథ్యంలో ఓటీ కాంప్లెక్స్, ఓబీజీ విభాగం ముందున్న ఓ వేపచెట్టు రోగులకు చల్లని నీడనిచ్చి సేద తీరడానికి దోహదపడింది. బీఎంసీఆర్‌సీ ప్రాంగణంలో నీడనిచ్చి ఆశ్రయం కల్పిస్తున్న పచ్చని చెట్లు -
కూడ్లిగిలో తొలి ప్రజా సేవకు నాంది
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా సేవా విభాగం తొలి కార్యక్రమం సెప్టెంబర్ 5న విజయనగర జిల్లాలోని కూడ్లిగిలో ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ తెలిపారు. ఆ రోజు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సమస్యలపై వినతిపత్రాలను స్వీకరిస్తారని తెలిపారు. ప్రజల కోసం 2 క్యూలు ఉంటాయి, పరిష్కారం కాని లేదా అసంతృప్తికరంగా పరిష్కరించిన ఫిర్యాదుల కోసం ఓ క్యూ ఉంటుందని తెలిపారు. ముందే వినతిపత్రం ఇచ్చినా 21 రోజుల తరువాత కూడా పరిష్కారం కాని ఫిర్యాదులను ఈ క్యూలో స్వీకరిస్తారని చెప్పారు. పలు మార్గాల్లో అవకాశం ప్రజలు తమ దరఖాస్తులను, ఫిర్యాదులను గ్రామ వన్ కేంద్రాలలో ముందుగానే సమర్పించవచ్చు. సమావేశ వేదిక వద్ద గ్రామ్ వన్ కియోస్క్‌లను కూడా ఏర్పాటు చేసి, వాటికి కంప్యూటర్లు, ప్రింటర్లు , ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పిస్తారు. దీనివల్ల దరఖాస్తులను, ఫిర్యాదులను అక్కడికక్కడే ఆన్లైన్లో అందజేయడానికి వీలుంటుంది. ప్రజలు తమ సమస్యలను 1902 హెల్ప్‌లైన్ ద్వారా లేదా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార వెబ్సైట్ ద్వారా కూడా సమస్యలను తెలియజేయవచ్చు. ప్రతి ఒక్కరి వినతిపత్రం, పరిష్కార వివరాలు, ఫోటోలు, వీడియోలను ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేస్తారు. 5న ప్రజల సమస్యలపై వినతుల స్వీకారం సీఎస్ శాలినీ రజనీష్ -
నదులు వెలవెల.. రైతులు విలవిల
సాక్షి,బళ్లారి: ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేక వెలవెలపోతూ ఎడారిని తలపిస్తున్నాయి. ఒకప్పుడు వర్షం నీటితో కళకళలాడిన వేదవతి నది బీటలు వారింది. పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే నీటితో పరవళ్లు తొక్కిన నదులు ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో అడుగంటి దర్శనమిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు రాకపోవడంతో మానవాళికే కాదు, పశుపక్షాదులకు కూడా రోజురోజుకు నీటి సమస్య జటిలం అవుతోంది. ముఖ్యంగా జిల్లాలో ప్రధానంగా ప్రవహించే తుంగభద్ర, వేదవతి నదుల్లో కూడా నీటి సవ్వడులు లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జనం తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. ప్రజలకు తాగునీటి సమస్యే కాకుండా పశుపక్షాదులకు కూడా నీటి కొరత ఏర్పడింది. ఈ ప్రాంతంలో కరువు ఛాయలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సిరుగుప్పను కరువు తాలూకాగా ప్రకటించకపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. చెరువుల, నదుల పరిశీలన గురువారం కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రైతు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పలు గ్రామాలను సందర్శించి రైతులను వెంటబెట్టుకుని తుంగభద్ర, వేదవతి నదులతో పాటు స్థానికంగా ఉన్న చెరువులను పరిశీలించారు. అన్ని చెరువుల్లో చుక్క నీరు లేక బీటలు వారడంతో ఎటు చూసినా బీడు భూములు, బీటలు వారిన చెరువులు కనిపించడంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు తుంగభద్ర డ్యాంలో నీరు తగినంత చేరడంతో డ్యాం నుంచి వేదవతి, తుంగభద్ర నదులకు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చెరువుల్లో కూడా నీరు లేక వెలవెలపోతున్న నేపథ్యంలో తాలూకాలోని అన్ని చెరువులను నీటిని నింపాలని ఒత్తిడి చేశారు. నేడు సిరుగుప్పలో భారీ నిరసన తాలూకాలో చెరువులు పూర్తిగా ఎండిపోగా, నదుల్లో చుక్క నీరు లేవని, పెట్టిన పంటలు పూర్తిగా వాడుముఖం పట్టాయని రైతు సంఘం నాయకులు అన్నారు. ఆయకట్టులో పంటలు సాగు చేయడానికి వీలు కావడం లేదన్నారు. కాలువలకు నీరు వదిలినా రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఇలాంటి దుస్థితిలో సిరుగుప్పను కరువు తాలూకాగా ప్రకటించకపోవడం బాధాకరం అన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టేందుకు సిద్ధం అయ్యారన్నారు. ప్రభుత్వం సిరుగుప్పను కరువు తాలూకాగా ప్రకటించాలని, తుంగభద్ర, వేదవతి నదులకు నీరు విడుదల చేయాలన్నారు. లేకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం సాగు, తాగునీటి కోసం రైతులు సిరుగుప్పలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారన్నారు. తుంగభద్ర, వేదవతి నదులకు నీరు వదలాలి కర్ణాటక ప్రాంత రైతు సంఘం నేతల డిమాండ్ -
ఇందిరా క్యాంటీన్ ప్రారంభం
హొసపేటె: జిల్లా స్టేడియం సమీపంలో నూతన ఇందిరా క్యాంటీన్‌ను బళ్లారి ఎంపీ తుకారాం గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా క్యాంటీన్ పథకం వల్ల పేదలు ఎంతో లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన ప్రజా సేవా కార్యక్రమాన్ని ఈనెల 5న జిల్లాలోని కూడ్లిగిలో ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అఖండ జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. జిల్లాధికారిణి కవిత మన్నికేరి, జిల్లా అభివృద్ధి అధికారి మనోహర్, నగరసభ అధ్యక్షుడు రూపేష్ కుమార్, తహసీల్దార్ శృతి తదితరులు పాల్గొన్నారు. మంత్రి హజ్ యాత్రకు విరాళాల సేకరణ హుబ్లీ: ఇస్లాం శ్రేష్ట మతం అని, హజ్‌యాత్రకు వెళ్లాలని కోరిక ఉన్నట్లు ప్రకటించిన మంత్రి బసవరాజ రాయరెడ్డికి ఇవ్వడానికి బీజేపీ కార్యకర్తలు నగరంలో విరాళం సేకరించారు. మఠం, మందిరాలకు వెళ్లనని పేర్కొన్న రాయరెడ్డి వ్యాఖ్యలను ఖండిసూత బీజేపీ హుబ్లీ ధార్వాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం యువ మోర్ఛా ఆధ్వర్యంలో నగర మార్కెట్లో విరాళాల సేకరణతో నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులు, ప్రజల నుంచి కార్యకర్తలు మొత్తం రూ.1,060 సేకరించి రాయరెడ్డికి పంపడానికి ఏర్పాట్లు చేశారు. సంజయ్, ప్రమోద్, అమిత్, నాగరాజు, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర నుంచి నీరు విడుదల చేయించండి రాయచూరు రూరల్: మహారాష్ట్ర పైభాగంలో అధికంగా వానలు కురుస్తుండడంతో ఉజ్జయిని డ్యాం నుంచి కలబుర్గి నగరానికి తాగునీటిని విడుదల చేయించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే అధికారులకు సూచించారు. కలబుర్గి జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో భీమా నదిలో నీటి ప్రవాహం కరువైందన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రతిపాదనలను రూపొందించి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి నీటి విడుదలకు ప్రయత్నించాలన్నారు. సమావేశంలో శాసన సభ్యులు తిప్పణ్ణప్ప కమకనూరు, ఎంవై పాటిల్, భీమా నది కమిటీ సభ్యులున్నారు. పుష్కరిణి తవ్వాలని డిమాండ్ ● పురావస్తు శాఖకు శెట్టర్ లేఖ హుబ్లీ: ఆచార్ వీధిలోని శ్రీభవాని శంకర్ నారాయణ దేవస్థానం ఎదుట పుష్కరణి ఉనికిపై బాంబే ప్రెసిడెన్సీ గిరిథియార్ ఉల్లేఖించారు. ఈ నేపథ్యంలో తవ్వడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం, ఎంపీ జగదీశ్ శెట్టర్ పురావస్తు సంగ్రహాలయ, పరంపర శాఖకు లేఖ రాశారు. సదరు దేవస్థానం చారిత్రాత్మక ప్రాధాన్యత గల ప్రాచీన దేవాలయం శతాబ్దాలుగా పురాతనమైనది. కేంద్ర ప్రభుత్వ పురావస్తు సంగ్రహాలయ పరంపర శాఖ సురక్షిత స్మారకమని ప్రకటించింది. అయినా ఆలయానికి 57 మీటర్ల అంతరంలో పుష్కరిణి ఉన్న స్థలంలో రోడ్డును నిర్మించారు. సురక్షిత స్మారకం అయినా కూడా నిరభ్యంతర పత్రం తీసుకోకుండా రోడ్డు నిర్మాణం చేపట్టడం ఖండనీయం అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే నిజాల వెలికితీతకు తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నేత్రదానంపై అవగాహన ర్యాలీహుబ్లీ: డాక్టర్ అగర్వాల్ ఆస్పత్రి, సెయింట్‌మేరీ స్కూల్, విఘ్నేశ్వర, మార్టిన్ లూథర్ నర్సింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ కృష్ణ నాడగౌడ, రైల్వే ఆస్పత్రి సీఎండీ డాక్టర్ కృష్ణారెడ్డి, ఏసీపీ వీరేష్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో 175 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాగా త్వరలో వృద్ధులకు డాక్టర్ అగర్వాల్ ఆస్పత్రిలో ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. ఆసక్తి గలవారు సంప్రదించాలని ఆస్పత్రి వీఆర్ఓ కోరారు. గంజాయి విక్రేత అరెస్ట్ కోలారు: గంజాయి విక్రేతను అరెస్టు చేసిన పోలీసులు.. రూ.50 వేలు విలువ చేసే 573 గ్రాముల గంజాయి, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు .. బంగారుపేటె పోలీస్ స్టేషన్ పరిధిలోని బెమెల్లోని విజయనగర 9వ క్రాస్ వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో దాడి చేసి ఉరిగాంపేటెకు చెందిన రాజ్ కిరణ్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు పారిపోయాడు. చెరువు పనులు ప్రారంభం కోలారు: బంగారుపేటె తాలూకాలోని కారమంగల గుట్టహళ్లి, యళేసంద్ర, మాగొంది గ్రామాలలో చెరువుల పునశ్చేతన పనులను సెహగల్ ఫౌండేషన్ ద్వారా గురువారం ప్రారంభించారు. ఫౌండేషన్ సిబ్బంది మాట్లాడుతూ జిల్లాలోని చెరువులలో నీటి నిల్వను పెంచడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలలో అంతర్జలాల స్థాయి కూడా పెరుగుతుందన్నారు. చెరువులలో పూడిక తీసిన మట్టిని రైతుల పొలాలకు అందజేస్తామని, దీనివల్ల భూమి సారవంతమవుతుందన్నారు. రైతులు, చెరువు వాడకందారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. శ్రద్ధగా చదువుకోవాలి కోలారు: తల్లిదండ్రులు బాధపడేలా పిల్లలు ప్రవర్తించరాదని, తల్లిదండ్రులు కూడా పిల్లలను గొప్ప ఆస్తిగా చేయాలని భైరేగౌడ విద్యా సంస్థ కార్యదర్శి వి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం నగర సమీపంలోని కృష్ణా కళ్యాణ మంటపంలో భైరేగౌడ విద్యాసంస్థ నూతన తరగతుల ప్రారంభోత్సవం నిర్వహించారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎన్.మంజుల, డాక్టర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
శ్వేతపత్రం విడుదల చేయండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో నెలకొన్న కరువు, వర్షాభావం, పంట నష్టం, రైతుల ఆత్మహత్యలు తదితర అన్ని అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర డిమాండ్ చేశారు. ఆయన గురువారం మూడో రోజు బీజేపీ నేతలు లింగసూగూరు నుంచి బళ్లారికి చేపట్టిన పాదయాత్రలో భాగంగా సింధనూరు తాలూకా గుడదూరు కరిబసవేశ్వర ఆలయం వద్ద నుంచి ఎద్దులబండిలో పాదయాత్రకు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నవలి సమాంతర జలాశయ నిర్మాణం మరుగున పడిందని ఎద్దేవా చేశారు. తుంగభద్ర డ్యాంలో 33 టీఎంసీల మేర పూడిక పేరుకు పోవడంతో ప్రత్యామ్నాయంగా సమాంతర జలాశయాన్ని నవలి వద్ద నిర్మించడానికి భూమిపూజ చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. నందవాడిగి ఎత్తిపోతల పథకాన్ని కూడా నీరుగార్చారని ధ్వజమెత్తారు. అధికార యావే తప్ప స్పందన ఏదీ? రైతులు తగిన వర్షాలు కురవక కరువుతో సతమతమవుతూ అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా అధికార పార్టీ నాయకులు సమస్యలపై స్పందించకుండా అధికారం కోసం పాకులాడుతున్నారన్నారు. దళితుల పేరు చెప్పుకుని అధికారం చేపట్టిన నేతలు వాల్మీకి అభివృద్ధి మండలిలో అవినీతికి పాల్పడ్డారన్నారు. దళితులకు కేటాయించిన నిధులను వారి సంక్షేమానికి వ్యయం చేయకుండా స్వాహా చేశారన్నారు. పేరుకు మాత్రమే రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రులు కరువు పరిశీలన పర్యటనలు చేపట్టారన్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారం చేపడుతుందన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రులు శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డి, శివనగౌడ నాయక్, రాజు గౌడ, శాసన సభ్యులు మానప్ప వజ్జల్, శివరాజ్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్ తదితరులున్నారు. -
టీబీ డ్యాంలోకి చేప పిల్లల విడుదల
హొసపేటె: తుంగభద్ర డ్యాంలోకి గురువారం తుంగభద్ర మండలి కార్యదర్శి శ్రీనివాస బైరి, ఎస్ఈ రమేష్‌నాయక్ చేతుల మీదుగా చేప పిల్లలను విడుదల చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడా జలాశయంలోకి చేప పిల్లలను వదిలారు. మండలి కార్యదర్శి మాట్లాడుతూ ఈ సారి డ్యాంలోకి సుమారు 14 లక్షల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. చేపల పెంపకం అభివృద్ధి అధికారి అశ్వత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయకట్టుకు నీరందించండి రాయచూరు రూరల్: జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ నుంచి ఆయకట్టు చివరి భూములకు నీరు అందించాలని కలబుర్గి ప్రాంతీయ కమిషనర్ జహీరా నసీం అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచూరు జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర ఎడమ కాలువలో నీటి సామర్థ్యాన్ని తెలిపే గేజ్ నిర్వహణకు కొప్పళ జిల్లాధికారి పక్కా ఆదేశాలు జారీ చేయాలన్నారు. తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో పశువులకు గ్రాసం కొరత నివారించాలని సూచించారు. జిల్లాధికారిణి పూవిత, సురేష్ హిట్నాల్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర పాలక కమిషనర్ జుబీన్ మహాపాత్రోలున్నారు. పరిశుభ్రతకు పెద్దపీట వేయాలిరాయచూరు రూరల్: నగరంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించాలని సిటీ కార్పొరేషన్న్కమిషనర్ మల్లికార్జున సూచించారు. గురువారం జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశ స్థాయిలో ప్రథమ స్థానం అలంకరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో రాయచూరు సిటీ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని స్వచ్ఛత, ముడి వస్తువుల సేకరణ, ఇతర పనుల నిర్వహణపై తర్ఫీదు ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. సమావేశంలో అధికారులు రాఘవేంద్ర, సంపత్, జయపాల్ రెడ్డి తదితరులున్నారు. అశ్వినికి న్యాయం చేయాలని ధర్నా రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి, కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని దళిత పర సేన సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు సణ్ణబాబు మాట్లాడారు. అశ్విని మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. ఇటీవల జిల్లాలో దళిత యువతులు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. 6న ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ రాత పరీక్షహొసపేటె: కర్ణాటక పరీక్ష ప్రాధికార సంస్థ ఈనెల 6న సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం రాత పరీక్షను నిర్వహిస్తోంది. అత్యంత పారదర్శకంగా ఈ పరీక్షను నిర్వహించాలని జిల్లాధికారిణి కవిత మన్నికేరి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ హొసపేటెలో మొత్తం 9 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఉదయం పరీక్షకు 4,406 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పరీక్షకు 4,500 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్ష సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని ఆమె కట్టుదిట్టమైన ఆదేశాలు ఇచ్చారు. -
3 రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
బనశంకరి: గత నెలాఖరులో మూడు రోజులు ఉండగానే అసెంబ్లీ సమావేశాలను ముగించిన ప్రభుత్వం.. ఈ నెలలో 3 రోజుల పాటు ప్రత్యేక శాసనసభ సమావేశాలను జరపాలని తీర్మానించింది. గురువారం విధానసౌధలో సీఎం డీకే శివకుమార్ నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. డిప్యూటీ సీఎం జీ.పరమేశ్వర్ సమావేశ వివరాలను మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర కరువు, పశ్చిమ ఘాట్లపై కస్తూరి రంగన్ నివేదిక మీద గురించి చర్చించడానికి ఈ నెల 21, 23, 24 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరువు తీవ్రరూపం దాల్చింది, ఆహార ఉత్పత్తుల దిగుబడి క్షీణించేలా ఉంది, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుల సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని డీసీఎం తెలిపారు. పశువుల మేత కొనుగోలుకు తక్షణం రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. భారీగా ఈ–బస్సులు.. ● నైస్ కారిడార్ పథకానికి భూములు అందించిన రైతులకు నిబంధనల ప్రకారం స్థలాలు, పరిహారం ఇవ్వాలని భేటీలో తీర్మానించారు. ● రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు, సత్వర అనుమతులకు ఎన్ఆర్ఐ విధానాన్ని ఆమోదించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 20 నుంచి 23 వరకు బెంగళూరులో ఇన్వెస్ట్ కర్ణాటక సమావేశం జరుపుతారు. ● కేంద్ర ప్రభుత్వ పీఎం ఇ–డ్రైవ్ పథకం కింద ఒక్కోటి రూ.1.2 కోటి నుంచి 1.5 కోట్ల విలువచేసే 4,500 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ఆమోదం. బస్సుల సరఫరాకు 6 కంపెనీలకు టెండర్ ఇచ్చారు. ● బళ్లారిలో వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు ఆమోదం. పార్కు స్థలాల నిర్ణయం రద్దు ● ఉద్యానవనాల్లో 5 శాతం స్థలాలను తీసుకునే సవరణ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. స్థల నిర్ణయంపై ఇటీవల బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరపడం తెలిసిందే. ● ప్రభుత్వంలో వివిధ అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రుల ఆధ్వర్యంలో 2 ఉన్నతస్థాయి కమిటీల ఏర్పాటు. ఈ నెల 21 నుంచి ఆరంభం కరువు, కస్తూరి రంగన్ నివేదికపై చర్చలు కేబినెట్ భేటీలో తీర్మానం పలు ముఖ్య నిర్ణయాలు ఏమిటీ కస్తూరి రంగన్ నివేదిక? రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వ్యాపించిన పశ్చిమ కనుమల అరణ్యాల సంరక్షణ గురించి గతంలో కస్తూరిరంగన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. దానిని అమలు చేయలేక సర్కారు తిరస్కరించింది. అందులోని సిఫార్సుల ప్రకారం వేలాది జనావాసాలు అడవుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించాలి, అడవుల విస్తీర్ణంలోకి వచ్చే గ్రామాలను కూడా దూరంగా తరలించాల్సి వస్తుంది. దీనిని ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభన నెలకొంది. -
స్థావరాలు మారుస్తూ ప్రయాణాలు
బనశంకరి: సంచలన కేపీఎస్సీ పశువైద్యాధికారుల ఉద్యోగాల కుంభకోణంలో ముఖ్య నిందితుడు, ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్ వారంరోజుల కాల్‌డేటా, ప్రయాణ చరిత్రను సీఐడీ అధికారులు పరిశీలించారు. కొందరు ప్రముఖ వ్యక్తుల సలహా మేరకు జ్ఞానేంద్రకుమార్ అదృశ్యమైనట్లు తెలిసింది. శివశంకరప్ప సాహుకార్ ఇంటిపై ఈడీ దాడిచేయగానే జ్ఞానేంద్రకుమార్ పారిపోవడం తెలిసిందే. ఢిల్లీ నుంచి దగ్గరిలోని నోయిడాకు వెళ్లి ఓ హోటల్లో దిగారు. ఓ చానెల్లో పనిచేసే స్నేహితురాలిని పిలిపించుకున్నారని సీఐడీ వర్గాలు గురువారం తెలిపాయి. అప్పుడు ఆయనకు ఓ ప్రముఖుడు ఫోన్ చేసి, ఈడీ మీకోసం వెతుకుతోంది, సురక్షితమైన ప్రదేశానికి పారిపోండి అని సూచించాడు. ఇది తెలిసి అతని స్నేహితురాలు కోపోద్రిక్తురాలై జ్ఞానేంద్రకుమార్ చెంపపై కొట్టి, నీ వల్ల నేను చిక్కుల్లో పడతాననంటూ ఆమె వెళ్లిపోయింది. ప్రముఖ నేతల సూచన మేరకు ఓ విశ్రాంత ఐఏఎస్.. ఢిల్లీకి వెళ్లి జ్ఞానేంద్రకుమార్కు పలు సూచనలు చేశారని తెలిసింది. తరువాత జ్ఞానేంద్ర శ్రీలంకలో కొలంబోకు వెళ్లి రెండు రోజులు ఉన్నాడు, ఈడీ లుకౌట్ తరువాత బెంగళూరుకు వచ్చి ఓ రిసార్టులో బస చేశాడని గుర్తించారు. సాహుకార్‌కు హైకోర్టులో మందలింపు అవినీతిపరులను నియమిస్తే సత్పరిపాలన అందించడం సాధ్యమా? అని కేపీఎస్సీ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్‌కు హైకోర్టు అక్షింతలు వేసింది. కేపీఎస్సీ ఉద్యోగాల కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలని ఆయన పిటిషన్ వేశారు. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్శెట్టి విచారించారు. ఆయన వకీలు వాదిస్తూ పశువైద్యాధికారుల పోస్టుల స్కాంలో సాహుకార్ పాత్రలేదని, అన్నింటినీ పరీక్షల కంట్రోలర్ చేశారని పలు కారణాలను వివరించారు. దీనికి జడ్జి స్పందిస్తూ, మీ పాత్ర లేకపోతే ప్రశ్నాపత్రం లీకేజీ ఎలా జరిగింది, ఉన్నత పదవిలో ఉంటూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు, అవినీతి అధికారులను నియమించి సత్పరిపాలన అందించడం సాధ్యమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాదనలకు ప్రభుత్వ న్యాయవాది వ్యవధి కోరడంతో 7వ తేదీకి విచారణను వాయిదా వేశారు. సాహుకార్‌కు మళ్లీ నోటీస్ కేపీఎస్సీ ఉద్యోగాల స్కాంలో శివశంకరప్ప సాహుకార్‌కు సీఐడీ నోటీస్ జారీచేసింది. గురు, శుక్రవారం విచారణకు రావాలని తెలిపింది. ఆయనను ఇదివరకే సీఐడీ విచారించింది. అయితే గురువారం విచారణకు వెళ్లలేదని తెలిసింది. ఐఏఎస్ జ్ఞానేంద్రకు వీఐపీల సలహాలు సీఐడీ విచారణలో వెల్లడి? -
ఇంటి ముంగిటకే వైద్య సేవలు భేష్
సాక్షి,బళ్లారి: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందించడం హర్షణీయమని సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ తుకారాం పేర్కొన్నారు. ఆమె గురువారం జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026–27వ సంవత్సరానికి సంబంఽధించి మొబైల్ హెల్త్ యూనిట్లను ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా ప్రాథమిక వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తుండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న వరం అన్నారు. క్యాలెండర్‌ను, మొబైల్ హెల్త్ యూనిట్ల సేవలను ప్రారంభించారు. ఇంటి వద్దకే మొబైల్ వాహనాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీపీ, షుగర్, జ్వరం, దగ్గు, జలుబు తదితరాలకు అక్కడికక్కడే వైద్యం చేసి మందులు అందజేస్తారన్నారు. జేఎస్‌డబ్ల్యూ దక్షిణ భారత ప్రముఖుడు పెద్దన్న బీదల మాట్లాడుతూ సండూరు ప్రాంతంలో మొబైల్ హెల్త్ యూనిట్ల కోసం దాదాపు రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. హెల్త్ యూనిట్లో వైద్యుడు, ఫార్మసిస్టు, పేషెంట్ అసిస్టెంట్‌తో పాటు అన్ని విధాలుగా చూసుకునేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. వృద్ధులు, చిన్నారులు, పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని గుర్తు చేశారు. నిరంతరంగా ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందించే చర్యలను జిందాల్ సంస్థ తీసుకుందన్నారు. జిందాల్ సంస్థ ప్రముఖులు మయూరేష్, కిరణ్ గోవింద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ తుకారాం -
మురిపాల కృష్ణా.. ముద్దుల గోవిందా
యశవంతపుర: రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందడి గురువారం నుంచి ఆరంభమైంది. దేవాలయాలు, పాఠశాలల్లో కృష్ణ, గోపికల వేషాల్లో బాల బాలికలు మురిపించారు. ఇక నల్లనయ్య కొలువైన ప్రఖ్యాత ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో 2 రోజుల పాటు నయనానందకరంగా వేడుకలు జరుగుతాయి. శుక్రవారం, శనివారం విట్లపిండి ఉత్సవంతో పాటు పలు సంబరాలు నిర్వహిస్తారు. గర్భగుడిలో శ్రీకృష్ణునికి విశేష పూజలు చేయనున్నారు. ఈసారి పులివేషాల ప్రదర్శన, మల్ల యుద్ధం పోటీలు జరుపుతారు. రాష్ట్రం నుంచే కాక కేరళ, గోవా తదితర ప్రాంతాల నుంచి భారీగా భక్తజనం వస్తున్నారు. బెంగళూరు రాజాజీనగర ఇస్కాన్ దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్ఠమి వేడుకలు మొదలయ్యాయి. ఆరంభమైన జన్మాష్టమి సందడి ఉడుపిలో నేటి నుంచి ఉత్సవాలు -
విఘ్నాధిపతికి నవనీత సేవ
శ్రీనివాసపురం: జిల్లాలోని ముళబాగిలు తాలూకాలో ఉన్న పురాణ ప్రసిద్ధ కురుడుమలై వినాయక దేవస్థానంలో విఘ్ననాయకున్ని వెన్నతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా గురువారం ఉదయం నుంచి పార్వతీ తనయునికి పంచామృత అభిషేకం నిర్వహించి, ఆపై నవనీతంతో చక్కగా అలంకరించారు. ఏకదంతున్ని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉపాధి పనుల్లో స్వాహా.. లోకాయుక్త దాడులు తుమకూరు: ఉపాధి హామీ (వీబీజీ రామ్ జీ) పనుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై, లోకాయుక్త పోలీసులు తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలోని హగల్వాడి గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు రమేష్ ఇల్లు, గ్రామ పంచాయతీ, తాలూకా పంచాయతీ ఆఫీసుల్లో 6 చోట్ల దాడులు నిర్వహించారు. పీడీఓ శివకుమార్ ఇల్లు, మాజీ టెక్నికల్ అసిస్టెంట్ గోవిందరాజు ఇల్లు, గురు ఎంటర్ప్రైజెస్ అనే దుకాణం యజమాని ఇంటిలో తనిఖీలు చేసి ముఖ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. డ్రైనేజీ పనుల్లో రూ.2 కోట్లకు పైగా నిధులను స్వాహా చేశారని ఆరోపణలున్నాయి. పీడీఓ శివకుమార్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. లోకాయుక్త డీఎస్పీలు సంతోష్ కుమార్, మంజునాథ గౌడ, ఇన్స్పెక్టర్లు రాఘవేంద్ర, ఎన్. నిర్మల, రాజు, శాంతినాథ్ పాల్గొన్నారు. 2 రోజులు తనిఖీలు కొనసాగవచ్చని తెలిపారు. తలుపు ఎందుకు తట్టానంటే..: మంత్రి శివాజీనగర: 2006లో హెచ్డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రోజుల పాటు అదృశ్యమయ్యారు, ఆయన ఎక్కడికి వెళ్లారో కనుగొనే బాధ్యతను దేవేగౌడ నాకే అప్పగించారు అని మంత్రి చెలువరాయస్వామి చెప్పారు. గురువారం విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామిపై విమర్శలు గుప్పించారు. ఉదయం 9 గంటలకు చెలువరాయస్వామి నా తలుపు తట్టారన్న కుమారస్వామి ఆరోపణలపై స్పందిస్తూ, నేను తలుపు తట్టడం గురించి మాట్లాడడం మొదలుపెడితే వాళ్లు నన్ను ఆపలేరన్నారు. కుమారస్వామి కనబడలేదని దేవేగౌడ నాకు చెబితే, నేను ఉదయం 5 గంటలకు తలుపు తట్టాను. నేను ఎవరి తలుపు తట్టానో వినాలనుకుంటే చెబుతాను అని హేళన చేశారు. గత కొన్నిరోజులుగా కాంగ్రెస్ సర్కారుపై కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. వాగులో దాక్కున్న రౌడీషీటర్ ● చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులు శివమొగ్గ: పరారీలో ఉన్న ఓ రౌడీషీటర్ వాగులో దాక్కొని ఉండగా పోలీసులు చాకచక్యంగా బంధించారు. భద్రావతికి చెందిన రౌడీషీటర్ దిలీప్ అలియాస్ కరియాపై చోరీ, హత్యాయత్నంతో సహా 16 కేసులున్నాయి. ఒక కేసులో అతనిపై కోర్టు మూడుసార్లు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయినా అతను కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్నాడు. భండారహళ్లి వాగు వద్ద నిందితుడు దిలీప్ తలదాచుకున్నట్లు తెలుసుకొని పోలీసులు అక్కడకు వెళ్లారు. అయితే దిలీప్ జాడ కనిపించలేదు. కానీ నీటిలో నుంచి గాలి బుడగలు పైకి వస్తుండటాన్ని ఎస్ఐ రమేష్ గమనించారు. దీంతో అతను కానిస్టేబుల్ ప్రసన్నతో కలిసి వాగులోకి దిగి గాలించి దినేష్‌ను బంధించారు. -
రాముడు, సీతా దేవి పాత్రలపై సీఎం శివ కుమార్ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: మహిళల శక్తి, త్యాగాలను ప్రస్తావిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం రామాయణంలోని సీత పాత్రను ఉదహరించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించగలరని, గ్రామ పంచాయతీల నుంచి పార్లమెంట్ వరకు నాయకత్వ స్థానాల్లోకి మహిళలు రావాలని అన్నారు.ఉబుంటు కన్సార్టియం ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘టుగెదర్ వి గ్రో-ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డే’ 5వ సంచికను ప్రారంభించిన అనంతరం శివకుమార్ మాట్లాడారు. సవాళ్లను అధిగమిస్తూ వ్యాపారాలను నిర్మించిన మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.“రామాయణంలో సీత పాత్ర శ్రీరాముడి పాత్ర కంటే ఎంతో గొప్పది. ఆమె చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న కష్టాలు ఆదర్శప్రాయమైనవి. మహిళలు సృష్టికర్తలు. సవాళ్లను అధిగమిస్తూ వ్యాపార సంస్థలను నిర్మించిన మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు” అని శివకుమార్ అన్నారు.ప్రభుత్వ పాలనలో ప్రతి స్థాయిలో మహిళల నాయకత్వం అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలను సాధికారత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మహిళలు చాలా కాలంగా సృష్టికర్తలు, సమస్యల పరిష్కర్తలు, నిర్ణయాలు తీసుకునేవారిగా ఉన్నారని అన్నారు. “వారి సృజనాత్మకత, సామర్థ్యం, పట్టుదలకు మూలధనం, సాంకేతికత, మార్కెట్లకు ప్రాప్యత లభిస్తే వారు నిర్మించగల దానికి పరిమితి ఉండదు. వారి సామర్థ్యం వికసించేలా ఒక వ్యవస్థను సృష్టించడం ప్రభుత్వ బాధ్యత” అని అన్నారు.మా పథకాలను మోదీ వ్యతిరేకించారు యువత, మహిళలపై తనకు విశ్వాసం ఉందని చెబుతూ శివకుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 5 హామీ పథకాలైన శక్తి, గృహ లక్ష్మి, గృహ జ్యోతి, అన్న భాగ్య, యువ నిధి గురించి ప్రస్తావించారు.“శక్తి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసం, స్వావలంబనను పెంచింది. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ పథకాలను వ్యతిరేకించారు. గృహ లక్ష్మి కింద రాష్ట్రంలో 1.22 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.2,000 అందుతోంది. ఇది కుటుంబాలను నిర్వహించుకోవడంలో వారికి సహాయపడింది” అని అన్నారు.మహిళలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లో 4% వడ్డీ రుణాలు, సబ్సిడీలు, స్త్రీ శక్తి పథకం ఉన్నాయని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం వైద్య విద్య పూర్తి చేస్తున్న వారిలో 40% మంది మహిళలు ఉంటున్నారని తెలిపారు. “భారతీయ సమాజంలో ఇప్పటికీ మొదటి సంతానం అబ్బాయి కావాలనే ఆలోచన ఉంది. మనం దీనికి దూరంగా జరగాలి. తల్లిదండ్రులుగా మన పిల్లలకు విలువలు, క్రమశిక్షణ నేర్పాలి. నా కుమార్తె సాధికారత పొందిన మహిళ. ఆమె కుటుంబం, వ్యాపారాన్ని విజయవంతంగా సమతుల్యం చేసింది” అని అన్నారు. -
3, 4 తేదీల్లో చికెన్ దుకాణాలు బంద్?
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (బీఎస్డబ్ల్యూఎమ్ఎల్) వారు చికెన్ వ్యర్థాలపై విధిస్తున్న పన్నును వ్యతిరేకిస్తూ కర్ణాటక ఫౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈనెల 3, 4 తేదీల్లో బెంగళూరులో చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. సుమారు 7 వేల చికెన్ దుకాణదారులు రెండు రోజుల పాటు ఫ్రీడం పార్క్‌లో ఆందోళన చేపట్టనున్నారు. బెంగళూరులో రోజుకి 7 లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతుండగా.. ఒక్కో దుకాణం నుంచి సుమారు రోజుకు 30 కేజీల వ్యర్థాలు వెలువడుతున్నాయి. బీఎస్డబ్ల్యూఎమ్ఎల్ వారు కేజీ వ్యర్థానికి రూ.5 పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.5 వేల వరకూ పన్ను చెల్లించాల్సి రావడంతో దుకాణదారులకు ఇబ్బందిగా మారిందని కర్ణాటక ఫౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఈ పన్ను తక్షణం రద్దు చేయాలని డిమాండు చేస్తూ రెండు రోజుల పాటు చికెన్ దుకాణాలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. -
రైతు బిడ్డకు రూ.46 లక్షల జీతం
పల్లెటూరిలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి ప్రతిభావంతురాలిగా ఎదిగింది, ఐటీ కంపెనీలో కళ్లు చెదిరే వేతనంతో ఉద్యోగం సంపాదించింది. హావేరి జిల్లాకు చెందిన రైతు మంజునాథ్ కూతురు సృష్టి దక్షిణ కన్నడ జిల్లాలో బీటెక్ కోర్సు పూర్తి చేసింది. ప్రముఖ సంస్థ వీసా లో రూ.46.33 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని పొందింది. ఆమె అదే సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తూ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేవు. -బెంగళూరుపేపర్ లీక్.. రిసార్టుల్లో పరీక్షబెంగళూరు: కేపీఎస్సీలో ఉద్యోగాల అక్రమాలలో కొత్త కొత్త సంగతుల బయటపడుతున్నాయి. డబ్బులిచ్చిన అభ్యర్థులు రిసార్టుల్లో జల్సాగా పరీక్షలు రాశారని బయటపడింది. ఈ కేసుల్లో ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్‌ను ఏ1గా, కేపీఎస్సీ సభ్యులను ఏ2గా, అధికారులను ఏ3గా, ఎంపికైన 29 మంది అభ్యర్థులను ఏ4గా, ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్‌ను ఏ5గా ఎఫ్ఐఆర్లో సీఐడీ అధికారులు చేర్చారు. జ్ఞానేంద్రకుమార్, బ్రోకరు బసవరాజ్ కన్నాళెలను 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న లావాదేవీలు, అభ్యర్థులతో లింకులు తదితరాలపై విచారణ చేపట్టారు. వీరితో పాటు అభ్యర్థుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేస్తారు. బసవరాజ్ మొబైల్‌ఫోన్ కాల్ డేటాతో పాటు సాక్ష్యాధారాలను బట్టి దర్యాప్తు సాగిస్తున్నారు. చక్రం తిప్పిన బసవరాజు బసవరాజ్ కన్నాళె 29 పశువైద్యుల పోస్టులను ఒక్కొక్కటి రూ.80 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో కాకుండా రిసార్టుకు ప్రశ్నాపత్రాన్ని తెప్పించుకుని భర్తీచేశారు. జ్ఞానేంద్రకుమార్ బీదర్‌లో పనిచేసిన సమయంలో బసవరాజ్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. తాను ఎమ్మెల్యేని అవుతానని బసవరాజ్ ప్రచారం చేసుకునేవాడు. 29 మంది అభ్యర్థుల నుంచి ముందే డబ్బులు వసూలు చేసి పేపర్‌ను లీక్ చేసి ఇచ్చాడని విచారణలో బయట పడింది. బెంగళూరు రాజాజీనగర కార్యాలయంలో డీల్ కుదుర్చుకున్నారు. బెంగళూరు, తుమకూరు జిల్లా దేవరాయనదుర్గ, ఆంధ్రప్రదేశ్‌లోని రిసార్టుల్లో అభ్యర్థులను కూర్చోపెట్టి పరీక్ష రాయించారని సమాచారం. 10 మంది అభ్యర్థులు తప్పు ఒప్పుకుని అంతా చెప్పేస్తామని సీఐడీకి తెలిపారు. చదవండి: గణేశ్ ఉత్సవాలకు కళ్లు చెదిరే ఏర్పాట్లు -
జైలు ఖైదీ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా..
కర్ణాటక: విచారణ ఖైదీ అయిన శ్రీరంగపట్న ప్రభుత్వ అధికారి మహమ్మద్ హుస్సేన్‌కు సహాయం చేశారని, జైలులో డబ్బు చెల్లిస్తే రాజమర్యాదలు అందిస్తారని ఆరోపణలు రావడంతో జిల్లా జైలు ప్రధానాధికారి ఎం.శతమ్మను జైళ్ల చీఫ్ అలోక్ కుమార్ బళ్లారి సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. జైలులో అక్రమాలపై ఖైదీలు రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ వైరల్ అయిన తర్వాత ఈ ఉత్తర్వు వెలువడింది. ఫోర్జరీ విచారణ ఖైదీగా ఉన్న మహమ్మద్ హుస్సేన్.. అనారోగ్యం లేకున్నా జబ్బు సాకుతో మిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా కొందరు గుట్టురట్టు చేశారు. జిల్లా సెషన్స్ జడ్జి బృందం ఆసుపత్రిని తనిఖీ చేసి విచారించారు. ఈ కేసులో శతమ్మ నిర్లక్ష్యం స్పష్టం కావడంతో బళ్లారి జైలుకు బదిలీ చేసి ఆమె స్థానంలో ఫక్కీరప్ప బరకర్‌ను నియమించారు. చదవండి: రసోడా గ్యాంగ్ కి'లేడీ'ల కార్ఖానా -
కన్నడ పొలిటికల్ హీట్.. కుమారస్వామికి ప్రియాంక్ ఖర్గే సవాల్
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఉద్యోగ నియామకాల వివాదం ఒక్కసారిగా వేడెక్కింది. 24 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రతిపక్షానికి సూటిగా సవాల్ విసిరారు. ‘ఈ వ్యవహారంలో నా ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అంటూ కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణలు కాదు.. ఆధారాలు బయటపెట్టండి, దర్యాప్తులో నిజం తేల్చండి అంటూ రాజకీయ దాడిని మరింత పదును పెట్టారు. ఆధారాలతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు.కాగా, సిద్ధరామయ్య ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 24 మంది AEEల నియామకాల్లో అక్రమాలు జరిగాయని కుమారస్వామి ఆరోపిస్తూ.. ప్రియాంక్ ఖర్గే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఖర్గే.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ‘హిట్ అండ్ రన్ పాలిటిక్స్’ అంటూ కుమారస్వామిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ‘నా మీద ఆరోపణలు చేసేవారు పత్రాలతో రావాలి. ఆధారాలు ఉంటే దర్యాప్తు జరగాలి.. నిజాలు బయటకు రావాలి. KPSCకి సంబంధించిన ఏ కేసులోనైనా నా ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. మరి తమ పాత్ర రుజువైతే బీజేపీ, జేడీఎస్ నేతలు కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’ అని ఖర్గే ప్రశ్నించారు.సీసీటీవీ ఫుటేజీపై అనుమానాలుAEE నియామక ప్రక్రియలో ఓఎంఆర్ షీట్లలో అవకతవకలు, సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం, నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలు వచ్చినట్లు ఖర్గే తెలిపారు. తుది ఎంపిక ప్రక్రియ పూర్తికాకముందే KPSCలోనే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ నియామకాలను ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. KPSCలో పరీక్షల నిర్వహణ, ఎంపిక జాబితాల విడుదల, తుది జాబితాను సంబంధిత శాఖకు పంపడం వంటి ప్రక్రియలను వేర్వేరు అధికారులు, సంస్థలు నిర్వహిస్తారని ఖర్గే వివరించారు. అలాంటప్పుడు మొత్తం వ్యవహారానికి మంత్రినే నేరుగా బాధ్యుడిగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. కొంతమంది అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాలు రావడంతో KPSC సమీక్ష కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు రాజకీయ ఆరోపణలు చేయడం కాకుండా.. ఎక్కడ, ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? అక్రమాలకు పాల్పడింది ఎవరు? అన్నది తేల్చాలని కోరారు.చర్యలు తప్పవు..నియామకాల్లో అక్రమాలు జరిగితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని ఖర్గే స్పష్టం చేశారు. యువత ఉద్యోగాలు, భవిష్యత్తును దెబ్బతీసే ఏ అక్రమాన్నైనా వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే, గత బీజేపీ ప్రభుత్వ హయాంలో వెలుగుచూసిన PSI నియామక కుంభకోణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అప్పట్లో బీజేపీ నేతల పేర్లు కూడా ఆరోపణల్లో వినిపించాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న నేతలు గతంలో ఇలాంటి వ్యవహారాలపై ఎలా స్పందించారో ప్రజలు మర్చిపోలేదని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: అన్నాహజారేకు తీవ్ర అస్వస్థత -
సకల జనుల కోసం ప్రార్థనలు
బళ్లారి రూరల్: నేపాల్ వరదల్లో ఆప్తులను కోల్పోయిన అభాగ్యులను కరుణామయుడు ఏసయ్య ఆదుకోవాలని బెంగుళూరు ధర్మాధ్యక్షుడు డాక్టర్ ఆరోగ్యరాజ్ సతీష్ కుమార్ ప్రార్థనలు చేశారు. మేరీమాత ఉత్సవాల్లో భాగంగా సభాంగణంలో ఏర్పాటు చేసిన పార్థనా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సకల మానవులందరూ ఆరోగ్యం, సుఖసంతోషాలతో జీవించేలా ఆ దేవదేవుడి ఆశీర్వాదం ఉండాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో ఫాదర్ ఆరోగ్యనాథన్, ఫాదర్ ఐవన్పింటో, కర్ణాటక క్రైస్తవ అభివృద్ధి మండలి అధ్యక్షుడు జి.జె రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సాయంసాక్షి, బళ్లారి: ప్రతిభ గల పేద విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదని మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి, ఆయన సతీమణి నారా శైలజారెడ్డి తెలిపారు. హడగలి తాలూకా హోళథు గ్రామానికి చెందిన ఈరప్ప కనవి కుమారుడు భరత్ కనివి ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కొప్పళ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. ఫీజు చెల్లించేందుకు విద్యార్థి పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న శ్రీసాయి సర్వీస్ ట్రస్టు బాసటగా నిలిచింది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భరత్ కనివికి ట్రస్టు తరఫున నారా ప్రతాప్‌రెడ్డి దంపతులు రూ.75 వేల చెక్కు అందజేశారు. రాబోయే రోజుల్లో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను గుర్తించి ఆర్థిక సాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో రెడ్డి జన సంఘం కార్యదర్శి తిమ్మారెడ్డి, ట్రెజరర్ హేమచంద్రారెడ్డి, డైరెక్టర్ మరిస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శాంతల సేవలు అమూల్యం బళ్లారి రూరల్: బీఎంసీఆర్‌సీలో డాక్టర్ శాంతల అందించిన సేవలు మరువరానివని ఆ సంస్థ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ మరిరాజ్ కొనియాడారు. సోమవారం వైద్య భవన్లో వైద్య కళాశాల బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శాంతల, నాన్–టీచింగ్ ఉద్యోగి రాజశేఖర్ ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మరిరాజ్ మాట్లాడుతూ.. తాను హౌస్‌సర్జన్ చేస్తున్న సమయంలోనే డాక్టర్ శాంతల విమ్స్‌లో వైద్యురాలిగా వృత్తిని ఆరంభించారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె అంచలంచెలుగా మూడు వైద్య కోర్సులు పూర్తి చేసి, ప్రతిభావంతురాలైన వైద్యురాలిగా ఎదిగారని పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో నాన్–టీచింగ్ ఉద్యోగిగా పని చేసిన రాజశేఖర్ బాధ్యతగా విధులు నిర్వర్తించారన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన డాక్టర్ శాంతల, రాజశేఖర్‌ను కళాశాల వైద్యులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కాలువలో దూకి యువతి ఆత్మహత్య హొసపేటె: నగరంలో రైల్వే స్టేషన్ రహదారిలో ఉన్న పవర్ కెనాల్లోకి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. బళ్లారి జిల్లా కౌలుబజార్కు చెందిన లుబ్న తబుసమ్ (22) పవర్ కెనాల్ వద్దకు వచ్చింది. అందరూ చూస్తుండగా ఒక్కసారిగా కాలువలోకి దూకేసింది. గమనించిన స్థానికులు.. వెంటనే కాలువలోకి దూకి యువతిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే నీటి ప్రవాహ వేగానికి తబుసమ్ కొట్టుకుని పోయి మృతి చెందింది. స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది నీటిలో తేలుతున్న యువతి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. చిత్తవాడిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లుబ్న తబుసమ్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. డాక్టర్ శాంతలను సన్మానిస్తున్న వైద్యులు -
ఆ భూమిని లీజుకు ఇవ్వొద్దు
హొసపేటె: బళ్లారి రహదారి సమీపంలోని కారిగనూరు వద్ద ఉన్న రెవెన్యూ భూమిని కంపెనీలకు లీజుకు ఇవ్వకూడదని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కారిగనూర్ సమీపంలోని ఆర్బీఎస్ఎస్ఎన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రాథమిక సౌకర్యాల కల్పనకు కేటాయించిన భూమిని ఏ కారణం చేత కూడా ఆర్బీఎస్ఎస్ఎన్ కంపెనీకి ఇవ్వకూడదన్నారు. మాజీ మంత్రి ఆనంద్‌సింగ్ ఆందోళనకారులకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది రూ.ఐదు వేల కోట్ల రూపాయల కుంభకోణం అని ఆరోపించారు. సదరు భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ లీజుకు ఇవ్వకూడదని ముఖ్యమంత్రి డీకే. శివకుమార్‌కి లేఖ రాయడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తానని పేర్కొన్నారు. హొసపేటె జిల్లా కేంద్రంగా మారినందున ప్రాథమిక సౌకర్యాల కల్పనకు భూమిని కేటాయించాలని సూచించారు. లీజు గడువు ముగిసినందున కంపెనీ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదని డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు రూపేష్ కుమార్, ఉపాధ్యక్షుడు బి.జీవరత్నం, స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు శరవణ్ మున్సిపల్ సభ్యులు జీ.ఎస్.మనుమంతప్ప, తరిహళ్లి జంబునాథ్, వివిధ సంస్థల నాయకులు సీఆర్.భరత్, ద్వారకీష్ తదితరులు పాల్గొన్నారు. -
పోస్టింగ్‌కు లంచాలు ఇచ్చాం..
● ముగ్గురు ఎస్ఐల ఆడియో లీక్.. వెంటనే సస్పెండ్ యశవంతపుర: మేము ఫలానా చోటుకు బదిలీ కావడానికి పోలీసు ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చుకున్నాం, ఏం చేయాలి మరి.. తప్పదు అని ఫోన్లో ముగ్గురు ఎస్ఐ మిత్రులు మాట్లాడుకున్న ఆడియోలు వైరల్ కావడంతో పోలీసుశాఖకు తలనొప్పిగా మారింది. ఇంటి గుట్టును రట్టు చేస్తారా? అని ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తరకన్నడ జిల్లాలో ముగ్గురు ఎస్ఐలను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ అదేశించారు. హళియాళ ఠాణా ఎస్ఐ కిరణ్ పాటిల్, క్రైమ్ ఎస్ఐ కృష్ణ, హలియాళలో ఎస్ఐగా పని చేసి బదిలీ అయిన వినోద్‌రెడ్డిలు బదిలీలు, పోస్టింగ్‌ల కోసం ముడుపులు ముట్టజెప్పామని ఫోన్ సంభాషణల్లో మాట్లాడుకున్నారు. ఈ ఆడియో ఎలా ప్రచారంలోకి వచ్చింది. దీంతో పోలీసు అధికారులు ఆగ్రహం పట్టలేక ముగ్గురినీ సస్పెండ్ చేశారు. ఆడియో లీకేజీ, ముడుపుల తదితరాలపై ఓ డీఎస్పీతో విచారణకు ఆదేశించారు. రామనగరలో దొంగనోట్ల ముద్రణ ● భారీగా పట్టివేత దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకాలో దొంగనోట్ల దందా గుట్టురట్టయింది. నిర్మాణదశలో ఉన్న భవనంలో రహస్యంగా దొంగనోట్లు ముద్రిస్తున్నట్టు సమాచారం అందడంతో ఐజూరు పోలీసులు దాడి చేశారు. భారీ మొత్తంలో దొంగనోట్లు దొరికాయి. శాంతిలాల్ లేఔట్లో కొత్తగా నిర్మిస్తున్న సంతోష్ అనే వ్యక్తికి చెందిన భవనంలో ఈ బాగోతం సాగుతోంది. కొందరు ముఠాగా ఏర్పడి ప్రత్యేకమైన పేపర్ షీట్లు తీసుకువచ్చి వాటికి కొన్ని రసాయనాలు పూసి రూ.200, రూ.500 విలువ గల నకిలీ నోట్లు ముద్రిస్తున్నారు. వాటిని బయట చలామణి చేసేవారు. పోలీసులు ముద్రణా సామగ్రి, పెద్ద మొత్తంలో దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. అరెస్టుల గురించి పోలీసులు నోరుమెదపడం లేదు. పూర్తి ముఠాను పట్టుకున్న తరువాత వివరాలను ప్రకటించే అవకాశముంది. నేత్రపర్వంగా ఉత్తరారాధనకోలారు: నగరంలోని బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో రాయర 355వ ఆరాధనా మహోత్సవంలో భాగంగా రాయర బృందావనానికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సోమవారం ఉత్తరారాధన సాగించారు. బృందావనానికి పంచామృత అభిషేకం, గంధ పుష్ప అలంకరణ, గురు పాదపూజ, కనకాభిషేకం, మహా మంగళారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం భక్తీ గీతాల ఆలాపన, మండపోత్సవం, తొట్టెలు పూజ, మహా మంగళారతి, తదితర పూజా వేడుకలు భక్తులను తన్మయుల్ని గావించాయి. -
కూడ్లిగి బంద్ ప్రశాంతం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగిని కరువు పీడిత తాలూకాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు.పలు ప్రజా సంఘాలు, పట్టణ ప్రజల నుంచి బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు లభించింది. ఉదయం నుంచి వాహనాల రాకపోకలు ఆగిపోగా.. దుకాణాలు మూసివేశారు. గాంధీ అస్తికలను భద్రపరిచిన అమరవీరుల స్మారక చిహ్నం నుంచి నిరసన ప్రదర్శన ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పర్యటించి, మదకరి సర్కిల్ వద్ద బహిరంగ సమ్మె చేపట్టారు. నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు, విజయనగర్ ఎస్పీ ఎస్.జాహ్నవి నేతృత్వంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అఖిల కర్ణాటక రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవర మహేష్ మాట్లాడుతూ.. తాలూకాలో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం తాలూకాను కరువు జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధిలో నిర్లక్ష్యం తగదు రాయచూరు రూరల్: రాయచూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి విషయంలో అదికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం నగరంలోని రైల్వే స్టేషన్లో గతి శక్తి పథకంలో భాగంగా కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. ఇప్పటికే కేంద్రం నుంచి రూ.29 కోట్ల నిధులు విడుదలైనప్పటికీ పనులు ప్రారంభించక పోవడంతో ఇంజినీర్లపై మండిపడ్డారు. స్టేషన్లో తాగునీటి సమస్య, శౌచాలయాలు, ఫ్లాట్ పాంల శుభ్రతలపై దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు సమర్థ, శ్రీద్యాన ప్రకాష్, అశోక్, జయణ్ణ, జయంతి పతంగి, సాజిద్ పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాంరాయచూరు రూరల్: జిల్లాలో మృతి చెందిన దళిత కుటుంబాలకు పరిహారం అందించి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి అజయ్ ధరమ్ సింగ్ తెలిపారు. సోమవారం ఇటీవల మృతి చెందిన లింగసూగూరు తాలూకా కరకడకల్‌లో రాణెమ్మ, హద్దనాళలో భూమానంద, హోక్రాణి గ్రామంలో అశ్విని కుటుంబాలను పరామర్శించారు. హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా అధికారి, పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శౌచాలయాలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు బోసురాజ్, ఎమ్మెల్యే హంపయ్య నాయక్, అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ, అదనపు ఎస్పీ హరీష్, సిరవార తహసీల్దార్ చంద్రశేఖర్, అధికారి రోణ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ పాదయాత్ర హాస్యాస్పదం
రాయచూరు రూరల్: భారతీయ జనతా పార్టీ నాయకులు లింగసూగురు నుంచి బళ్లారి వరకు చేపట్టనున్న పాదయాత్ర హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి అజయ్ ధరమ్ సింగ్ తెలిపారు. సోమవారం సిరవార తాలూకా హోక్రాణి గ్రామంలో అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రిగా పని చేసిన నాగేంద్ర రాజీనామా చేసిన తర్వాత కూడా బీజేపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. విధానసభ సమావేశాల్లో కరువు పరిస్థితులు, రైతుల ఇబ్బందులు, కస్తూరి రంగన్ నివేదిక తదితర ముఖ్యమైన అంశాలపై బీజేపీ నేతలు నోరు విప్పలేదన్నారు. కేవలం మాజీ మంత్రి నాగేంద్ర రాజీనామా అంశాన్ని పట్టుకుని విధానసభ సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు బోసురాజ్, ఎమ్మెల్యే హంపయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. హత్య కేసులను సీఐడీకి అప్పగించాలి రాయచూరు రూరల్: జిల్లాలో జరిగిన దళితుల హత్య కేసులను సీఐడీకి అప్పగించాలని చలవాది మహాసభ సమితి సంచాలకుడు విశ్వనాథ్ పట్టి డిమాండ్ చేశారు. సోమవారం ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి అజయ్ ధరమ్ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. వసంత్, తమ్మణ్ణ, విజయ్ ప్రసాద్, బాబుజీ, పుష్పరాజ్, శరణప్ప, వీరేష్, భీమేష్ పాల్గొన్నారు. -
ఐఏఎస్‌కు, బ్రోకరుకు 10రోజుల సీఐడీ కస్టడీ
బనశంకరి: కేపీఎస్సీ ఉద్యోగాల కుంభకోణంలో ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్, బ్రోకరు బసవరాజ్ కన్నాళేకు సెప్టెంబరు 10వ తేదీ వరకు సీఐడీ కస్టడీకి బెంగళూరు ఒకటో అదనపు కోర్టు ఆదేశించింది. కేసులో ప్రముఖ వ్యక్తులు, ఉన్నతస్థాయి అధికారుల పాత్రపై అనుమానాలున్నాయి. కుంభకోణం మూలాన్ని ఛేదించడానికి సీఐడీ సిద్ధమైంది. ఏకంగా 10 రోజుల పాటు ఇద్దరినీ విచారిస్తే లోతైన అంశాలు బయటపడవచ్చని భావిస్తున్నారు. బసవరాజ్ ఎవరు? బసవరాజ్ కన్నాళె బీదర్ జిల్లా బాల్కి వాసి కాగా, ఓ జాతీయ పార్టీ జిల్లా నేత అని, తుమకూరు వర్సిటీ పాలకమండలి సభ్యుడని తెలిసింది. అతనికి ట్రావెల్స్తో పాటు పలు రకాల వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం.ఐఏఎస్ జ్ఞానేంద్ర దళారీ బసవరాజ్ -
ఆలయ భూములు పరిరక్షించండి
బళ్లారి అర్బన్: రూపనగుడి హోబళిలో యెట్టిన బుడిహాళు గ్రామంలో కల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్–55లోని 17.01 ఎకరాల భూమిని పూజారి కుటుంబం రూ.48 లక్షలకు విక్రయించింది. దీనిపై సీఆర్పీసీ సెక్షన్ 145 కింద చర్యలు తీసుకోవాలి’ అని న్యాయవాది రామన్న డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని ప్రతికా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమిపై ఓఎస్ నంబర్ 233/2015 కింద కేసు ఉండగానే విక్రయం జరిగిందన్నారు. విచారణలో భూమి ఆలయానికి చెందినదని.. పూజారి లేదా ఆయన బంధువులు విక్రయించరాదని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ పూజారి కుటుంబ సభ్యులు భూమిని విక్రయించారని ఆరోపించారు. ఈ వివాదంపై గ్రామస్తులు, భక్తులు ఓఎస్ నంబర్ 348/ 2021 కింద కేసు దాఖలు చేశారన్నారు. వివాదాస్పద భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా ప్రతివాదులను నిరోధించాలని కోరారు. సమావేశంలో కట్టె బసప్ప, మారెన్న, శ్రీదేవి పాల్గొన్నారు. -
కేపీఎస్సీ చిట్టా విప్పుతా
● కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి తుమకూరు: కేపీఎస్సీ కుంభకోణాన్ని బయటపెట్టకుండా వదిలిపెట్టబోమని, పారిపోబోమని, చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి హెచ్.డి.కుమారస్వామి.. రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేకు సవాలు విసిరారు. తుమకూరులోను, ఢిల్లీలోను కుమారస్వామి విలేకరులతో మాట్లాడారు. ‘నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరంతా కేవలం ఎక్స్‌లో ఎందుకు మాట్లాడుతున్నారు? మీడియాను ఎదుర్కొనే ధైర్యం మీకు లేదా?’ అని కాంగ్రెస్ మంత్రులను ఆయన ప్రశ్నించారు. గత వారం రోజులుగా కేపీఎస్సీ పరీక్షలు, నియామకాల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతోందని, ప్రియాంక్ ఖర్గే ట్వీట్లు చేస్తూ మంచి పరిపాలనను తానొక్కడే అందిస్తున్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత సిద్దరామయ్య ప్రభుత్వంలో ప్రియాంక్ ఖర్గే పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన శాఖలో 24 మంది అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని కుమార ఆరోపించారు. ఓఎంఆర్ షీట్లను మళ్లీ మళ్లీ దిద్దారు, హడావుడిగా తుది జాబితాను విడుదల చేశారన్నారు. వివరాలన్నీ సేకరించి భద్రపరిచానని ఆయన తెలిపారు. వెటర్నరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పరీక్షలో కూడా భారీ కుంభకోణం జరిగిందని అన్నారు. రాహుల్ మాట్లాడాలి కేపీఎస్సీ స్కాంకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమమని, దీనిపై రాహుల్‌గాంధీ మాట్లాడాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ బెంగళూరుకు వచ్చి కేపీఎస్సీ బాధితులతో చర్చించాలన్నారు. -
గుడికి తీసుకెళ్లలేదని.. బాలిక ఆత్మహత్య
శివమొగ్గ: తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని తన తల్లిదండ్రులపై డెత్‌నోటు రాసి ఉరి వేసుకుంది. పిల్లలలో ఇద్దరిని మాత్రమే గుడికి తీసుకెళ్లగా అలిగి ప్రాణాలు తీసుకుంది. వివరాలు.. బాలిక సృష్టి.. 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఉండగా, ఆదివారంనాడు సృష్టిని వదిలేసి మిగతా ఇద్దరిని తీసుకుని గుడికి వెళ్లారు. దీంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. కొంతసేపటికే బాలిక తల్లిదండ్రులు తనపై ప్రేమ చూపడం లేదని లేఖ రాసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. తుంగానగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
మంత్రముగ్ధం.. ఛాయాచిత్ర లోకం
బనశంకరి: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా యూత్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో ‘వెటోరమ–బియాండ్ ద ఫ్రేమ్’ పేరుతో ఉద్యాననగరిలో చిత్రకళా పరిషత్‌లో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శన అట్టహాసంగా ముగిసింది. ఆదివారం సెలవు కావడంతో పెద్దసంఖ్య సందర్శకులు, ఛాయాచిత్ర కళా ఔత్సాహికులు తరలివచ్చారు. దేశవిదేశాలకు చెందిన ఉద్ధండ ఛాయాచిత్రగ్రాహకులు తీసిన చిత్రాలను వీక్షించారు. కెమెరా, మొబైల్స్‌తో ఫోటోలు, సెల్పీలు దిగుతూ సందడిచేశారు. ఏడీజీపీ దయానంద్, సీసీబీ డీసీపీ రాజా ఇమామ్ఖాసీం తదితరులు కూడా వీక్షించారు. అబ్బురపరిచే ఛాయాచిత్రాలను చూసి ఫోటోగ్రాఫర్ల ప్రతిభను మెచ్చుకున్నారు. విశ్వం, అడవులు, జంతువులు, మానవ జీవితం, నగరాలు వంటి అన్ని అంశాల ఛాయాచిత్రాలు ఇక్కడ పెద్దసంఖ్యలో కొలువుదీరాయి. కెమెరా పనితనం ఉట్టిపడింది. వైపీఎస్ అధ్యక్షుడు వీ.మంజు వికాస్శాస్త్రి, కార్యదర్శి ప్రేమకాకడే, సభ్యులు పాల్గొన్నారు. సందర్శకులకు అబ్బురం -
రమణీయం.. తేరు ఉత్సవం
రాయచూరు రూరల్: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో గురు రాఘవేంద్రుల 355వ ఆరాధన మహోత్సవాలు (సప్తరాత్రోత్సవాలు) వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉత్తర ఆరాధనోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామి బంగారు రథోత్సవం (మహారథోత్సవం) వైభవంగా సాగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ పాదంగళ్ ఆధ్వర్యంలో రాయలవారి పవిత్ర బృందావనానికి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, తులసీ అర్చనలు శాస్త్రోక్తంగా చేపట్టారు. రథోత్సవ సమయంలో హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. భజనలు, మేళతాళాలు, భక్తుల రాయల నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి రాయల వారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మఠం అధికారులు ఉచిత అన్నదానం, తాగునీరు, వైద్య సౌకర్యాలు కల్పించారు. భక్తిశ్రద్ధలతో రథోత్సవం సాక్షి, బళ్లారి: నగరంలోని సత్యనారాయణ పేటలో వెలసిన గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ఆరాధనోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. సోమవారం భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో తేరు లాగారు. రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాయల నామస్మరణతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి ఆలయ పూజారులు, గురువులు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్ దివాకర్, స్థానిక కార్పొరేటర్ ఆర్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా రాఘవేంద్రుడి ఉత్తర ఆరాధన మార్మోగిన రాయల నామస్మరణ భక్తులతో పోటెత్తిన మంత్రాలయం -
బోనులో పెద్దపులి
మైసూరు: జిల్లాలోని హెచ్డి కోట తాలూకాలోని హోసహోళలు గ్రామంలో పెద్ద పులి చిక్కింది. సమీప అడవిలో నుంచి తరచూ పులి గ్రామం చుట్టుపక్కల తిరుగాడడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. అటవీ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేయగా, దానిని పట్టుకోవడానికి పలుచోట్ల బోనులు పెట్టారు. ఆదివారం రాత్రి ఓ బోనులో పులి పట్టుబడింది. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. దానిని అటవీ శాఖ సిబ్బంది తరలించారు. గోవా టూర్‌కు ప్లాన్.. రూ.3.60 లక్షల టోపీ మైసూరు: గోవా టూర్‌కి వెళ్లాలని ఆన్లైన్లో హోటల్ గది, క్యాసినో బుక్ చేసుకున్న ఆరుగురు వ్యక్తులు రూ. 3.60 లక్షలు పోగొట్టుకున్న ఘటన నగరంలో జరిగింది. మైసూరులోని గిరియబోవి పాల్యకు చెందిన నాగరాజ్, అతని ఐదుగురు స్నేహితులు గోవా వెళ్లి మజా చేయాలనుకున్నారు. ఫేస్బుక్లో గాలించగా బిగ్ డాడీ క్యాసినో వెబ్సైట్లోకి వెళ్లారు. కొంతసేపటికి వారి మొబైల్‌కు సుహాస్ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. మీరు క్యాసినో, గది బుక్ చేసి, విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తానని, దీనికి రూ. 3 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. అతని మాటలు నమ్మి రూ.3 లక్షల బదిలీ చేశారు. కొంతసేపటికి మళ్ళీ ఫోన్ చేశాడు. మీ ప్యాకేజీ ఖరీదు రూ. 5 లక్షలు, మీరు రూ. 60 వేలు డిపాజిట్ చేయాలనగా, ఆ డబ్బులు పంపించారు. తర్వాత నాగరాజ్ సుహాస్‌కు ఫోన్ చేయగా అతని మొబైల్ స్విచాఫ్ వచ్చింది. దీంతో నజరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊపిరి తీసిన పొగబండి ● అవ్వ, ఇద్దరు మనవరాళ్ల మృతి ● దొడ్డబళ్లాపురం వద్ద దుర్ఘటన దొడ్డబళ్లాపురం: రైలు పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని అవ్వ, ఇద్దరు మనవరాళ్లు చనిపోయిన విషాద సంఘటన దొడ్డబళ్లాపురం రైల్వేస్టేషన్ వద్ద జరిగింది. మృతులను హిందూపురం వాసులు ఇర్ఫానా (52), రుకియా (13), రాకియా (8)లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం పిల్లలు హిందూపురం నుంచి ముత్తూరులోని అవ్వ ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం తిరిగి హిందూపురం వెళ్లడానికి అవ్వతోపాటు రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నారు. పట్టాలపై నడుచుకుంటూ వస్తుండగా వేగంగా వచ్చిన ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. దీంతో ముగ్గురూ దూరంగా ఎగిరిపడి మరణించారు. కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యశవంతపుర రైల్వే పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రొట్టెలే గతి.. కావేరి నీటికై రైతుల ధర్నామండ్య: కేఆర్ఎస్ డ్యామ్ నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేస్తున్నారని, తమకు నీళ్లు లేకుండా చేస్తున్నారని కన్నడసేన, కన్నడాంబె రక్షణ వేదిక కార్యకర్తలు బెంగళూరు–మైసూరు హైవేలో జొన్నరొట్టెలు పట్టుకుని ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు రొట్టె భాగ్యం ఇస్తోందన్నట్లుగా రొట్టెలు తింటూ వ్యంగ్య ప్రదర్శన చేశారు. తమిళనాడుకు నీటిని విడుదల చేయబోమని చెప్పిన ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి వారి అధికారాన్ని నిలుపుకోవడానికి రైతులను బాధితులుగా చేస్తున్నారని ఆరోపించారు. కబిని జలాశయాన్ని ఖాళీ చేశారు, కేఆర్ఎస్ డ్యాంలో నీళ్లు తక్కువగా ఉన్నా తమిళనాడుకు వదిలేస్తున్నారు అని దుయ్యబట్టారు. జలాశయంలోకి వచ్చే నీటి కంటే బయటకు వదిలే నీరే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. కేఆర్‌ఎస్‌లోకి 5,426 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే, తమిళనాడు కోసం 7,170 క్యూసెక్కులు వదులుతున్నారని ఆరోపించారు. మండ్యలో పంటలు వేయరాదని చెబుతూ, తమిళనాడులో వ్యవసాయానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తున్నారని విమర్శించారు. -
భూమినిచ్చే రైతులను కాపాడుతాం
బనశంకరి: ‘నేను ఒక రైతు కుమారున్ని, భూమి కోల్పోతే ఏమిటో నాకు బాగా తెలుసు. బాధిత రైతులు రుణం తీర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. సోమవారం డాక్టర్ కే.శివరామ కారంత్ లేఔట్ కోసం భూములు ఇచ్చిన యజమానులకు పరిహారం అందజేత కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. భూమి ఇచ్చిన రైతులు సేవ ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని, వారి త్యాగం చాలా పెద్దది, వారి హక్కులను కాపాడటం తమ బాధ్యత అన్నారు. కారంత్ లేఔట్ ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతోందన్నారు. అర్హులైన భూ యజమానుల హక్కులను కాపాడే పని తమ ప్రభుత్వం చేసిందన్నారు. కారంత్ లేఔట్లో 24,714 స్థలాల్లో 18,399 స్థలాలను రైతులు, భూయజమానులకు అందించామన్నారు. 3,500 రెవెన్యూ సైట్లు, 2,815 సైట్లను ప్రజలకు కేటాయిస్తామని తెలిపారు. కెంగల్ హనుమంతయ్య కాలంలో 60 లక్షలు ఉన్న బెంగళూరు జనాభా నేడు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి స్థిరపడటంతో కోటికి పైగా చేరిందని చెప్పారు. సీఎం డీకే శివకుమార్ కారంత్ లేఔట్ భూయజమానులకు పరిహారం -
సబ్ రిజిస్ట్రార్‌ను అరెస్ట్ చేయాలి
బళ్లారి అర్బన్: దళిత రైతు హెచ్.గలెప్పపై దాడి చేసి, కులం పేరుతో అవమానించిన సిరుగుప్ప సబ్ రిజిస్ట్రార్ యల్లారెడ్డెప్ప వెంటనే అరెస్టు చేయాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం జిల్లా కమిటీ, వివిధ సంస్థల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పత్రికా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మారుతీ, శివశంకర్ మాట్లాడారు. ఆగస్టు 13న తన పొలంలో పని చేసుకుంటున్న గలెప్పపై యల్లా రెడ్డెప్పతో పాటు మరో ఐదుగురు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై టెక్కల్కోట పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదైనా నిందితులను ఇప్పటికీ అరెస్టు చేయలేదని తెలిపారు. యల్లా రెడ్డెప్ప ఆగస్టు 17న దార్వాడ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తిరస్కరించిందన్నారు. వెంటనే అతడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సర్వే నంబర్–64లో హలేకోట దేవలాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 143 ఎకరాల 32 సెంట్ల భూమిని కర్ణాటక ప్రభుత్వం పేరుతో రిజిస్టర్ చేసినట్లు ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. ఈ భూమిని సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం వెంటనే టైటిల్ డీడ్స్ జారీ చేయాలని కోరారు. సమావేశంలో మునియప్ప, మల్లయ్య, ఓబ్లేశ్వరప్ప, మారుతీ గలెప్ప, నాగరాజ్, బసప్ప పాల్గొన్నారు. -
బీజేపీ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు
● 9 నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు సాగనున్న పాదయాత్ర సాక్షి, బళ్లారి: వాల్మీకి అభివృద్ధి మండలిలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణం, మాజీ మంత్రి నాగేంద్రకు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ పాదయాత్రకు సిద్ధమైంది. నేటి నుంచి (సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు) రాయచూరు జిల్లా లింగసూగూరు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుండటంతో రోడ్లన్నీ కషాయమయం చేశారు. 10 రోజుల పాటు రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాల్లోని 9 నియోజకవర్గాల్లో 190 కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుంది. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, బళ్లారి నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితర నేతలతో పాటు, మూడు జిల్లాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు, కార్యకర్తలు, నేతలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య వివాదం.. అరెస్ట్‌తో రాజకీయ కలకలం!
బెంగళూరు/మైదుకూరు: కర్ణాటకలో చోటుచేసుకున్న భూ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, బెంగళూరు బీజేపీ నేత రవిప్రకాష్ మధ్య కొనసాగుతున్న భూ వివాదం కేసులో మైదుకూరు పోలీసులు రవిప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, అరెస్ట్ ఘటన కలకలం రేపుతోంది.అయితే, బీజేపీ నేత రవిప్రకాష్‌ను కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య సబీనా బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు కార్లలో వచ్చి తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తనను కూడా కొట్టి, ఫోన్లను తీసుకున్నారని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్‌లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. తనపై రవిప్రకాష్ దాడి చేశారని పుట్టా సుధాకర్ యాదవ్ వర్గీయుడు మురళీమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: వెలిగొండలోనూ క్రెడిట్ చోరీ ఈ ఘటనపై గత జూలైలోనే కేసు నమోదైనట్లు సమాచారం. ఆ కేసులో భాగంగానే మైదుకూరు పోలీసులు ఇప్పుడు బీజేపీ నేత రవిప్రకాష్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు కిడ్నాప్ కేసు.. మరోవైపు దాడి కేసు.. మధ్యలో భూ వివాదం! టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేతల చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. -
అన్ని మతాల సారాంశం ఒక్కటే
సాక్షి, బళ్లారి: ‘ఇస్లాం ధర్మం గురించి ఎంతో అధ్యయనం చేశాను. ఇస్లాం ధర్మంలో కూడా గొప్ప సందేశం ఉంది’. అని మంత్రి బసవరాజు రాయరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కొప్పళ నగరంలో జరిగిన ముస్లింల సామూహిక వివాహాల్లో పాల్గొని మాట్లాడారు. మతాల విషయంతో చిన్నది, పెద్దది అనే భావన ఉండకూడదని తెలిపారు. అన్ని మతాలు, ధర్మాల్లో ఉన్న సారంశం ఒక్కటే.. దేవుడు కూడా ఒక్కడే అని పేర్కొన్నారు. ఇస్లాం ధర్మం గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తనకు హజ్ యాత్రకు వెళ్లాలని ఉందని.. అయితే మతం అడ్డువస్తున్నందున ఏమి చేయలేకపోతున్నట్లు తెలిపారు. ఖురాన్‌ను ఇంకా పూర్తిగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఖురాన్ ముస్లింలకు మాత్రమే కాదు.. యావత్ ప్రపంచానికి సందేశం ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య హయాంలో ముస్లింల సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించారని గుర్తు చేశారు. మంత్రి యతీంత్ర సిద్దరామయ్య మాట్లాడుతూ.. సృష్టికర్త ఒక్కరే అని.. ధర్మాలు, మతాల గురించి గొడవ పెట్టుకోకూడదని సూచించారు. -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
శ్రీనివాసపురం: శ్రీనివాసన్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని అంబేడ్కర్ ఉద్యానవనంలో ప్రతిభావంత విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఎం.శ్రీనివాసన్ గెళెయర బళగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సాహితి కోటిగానహళ్లి రామయ్య మాట్లాడారు. శ్రీనివాసన్ హత్యను రాజకీయ హత్యగా పరిగణించకపోవడం విషాదకరమన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తే జ్ఞాన సంపాదన చేయాలని సూచించారు. విద్య వ్యాపారంగా మారడంతో జ్ఞానార్జన కూడా పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. ఆర్పీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకట స్వామి మాట్లాడుతూ.. ఎం.శ్రీనివాసన్ అన్ని సముదాయాల వారికి అత్యంత ప్రీతి పాత్రుడు అయ్యారని కొనియాడారు. ప్రతిభావంత విద్యార్థులను గుర్తించి ప్రతిభా పురస్కారాలను అందించడం సంతోషించదగిన విషయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శశికళ, తూపల్లి ఆర్.నారాయణ స్వామి, దింబాల అశోక్, కె.కె.మంజునాథ రెడ్డి, మ్యాకల నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
డ్యాంలో నీళ్లున్నా.. రైతులకు కన్నీళ్లు
ట్రాక్టర్లో వరినారు తరలిస్తున్న దృశ్యంవర్షాభావంతో బీడుగా మారిన ఆయకట్టు అక్కడక్కడ వేసిన వరినాట్లు సాక్షి, బళ్లారి: ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణుడు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సీజన్లో ముందుగా సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. రైతులు పూర్తిగా నష్టపోయి, కరువు కొరల్లో చిక్కుకున్నారు. పంటల సాగుకు చేసిన అప్పులతో విలవిల్లాడిపోతున్నారు. తుంగభద్ర డ్యాంలోకి ఎట్టకేలకు ఆలస్యంగా నీరు చేరింది. ఆగస్టు 11 నుంచి కాలువలకు నీరు వదిలారు. రైతులు సంతోషంగా వరినాట్లు వేయడానికి సిద్ధమయ్యారు. ముందుగా వరినారు పోసుకుని దుక్కులు చేసుకున్న రైతుల వరినాట్లు వేయడంపై దృష్టి పెట్టారు. అయితే వర్షాల జాడ లేకపోవడం, ఎల్నీనో తీవ్ర ప్రభావం చూపడంతో వరినాట్లు మందకొడిగా సాగుతున్నాయి. సాధారణంగా వరినాట్లు వేసే సమయంలో వర్షాలు కురిస్తే వేగవంతంగా మడులు సిద్ధం చేసేందుకు వీలవుతుంది. కాలువల ద్వారా వచ్చిన నీటితో వరినాట్లు జోరుగా సాగవని రైతులు చెబుతున్నారు. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో బళ్లారి, విజయనగర, రాయచూరు, కొప్పళ జిల్లాలో 15 లక్షల ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఇందులో సగానికి పైగా వరి పంట సాగవుతుంది. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నేపథ్యంలో వరి పంటపై ఆశలు వదులుకునే పరిస్థితి ఉందని అన్నదాతులు ఆవేదన చెందుతున్నారు. డ్యాంలో 96 టీఎంసీల నీరు డ్యాంలో 96 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఖరీఫ్‌లో పంటల సాగుకు 80 టీఎంసీలు ఉంటే సరిపోతాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. అయితే రైతులు పంటలు సాగు చేసుకునేందుకు తగినంత నీరు సరఫరా చేస్తారా లేదా అనే సందేహం నెలకొంది. వరినాట్లు వేసినా ప్రయోజనం శూన్యంవరినారు పోసుకుని రెండు నెలలు గడుస్తున్నా.. నాట్లు వేసేందుకు సాధ్యం కావడం లేదు. ఈసారి 40 శాతం కూడా వరినాట్లు వేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో తుంగభద్ర ఆయకట్టు కింద హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువ కింద పంటలు వేయడానికి నీరు విడుదల చేయలేదని అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో పంటలకు నీరు వదలకపోతే కర్ణాటక పరిధిలోని రైతులకు కూడా నీరు సక్రమంగా చేరే పరిస్థితి ఉండదు. కాలువల్లో నీరు తక్కువగా వస్తే అన్ని డిస్టిబ్యూటరీలకు నీరు చేరే అవకాశం ఉండదు. వరినాట్లు వేసినా పంట చేతికి అందే పరిస్థితి ఉండదు. కొన్ని చోట్ల రైతులు ఇబ్బందులు పడి వరినాట్లు వేశారు. మిగిలిన ఆయకట్టు బీడుగా దర్శనమిస్తోంది. – మాధవ రెడ్డి, రైతు సంఘం నేత మందకొడిగా సాగుతున్న వరినాట్లు డోలాయమానంలో ఆయకట్టు రైతులు నీటి విడుదలపై సందేహాలు -
మేరీమాత ఉత్సవాలకు శ్రీకారం
బళ్లారి రూరల్: మనందరం దేవుని కృపకు పాత్రులు కావాలి. ప్రజలందరినీ దేవుడు సదా కాపాడాలని బళ్లారి పీఠం బిషప్ హెండ్రీ డిసోజా తెలిపారు. ఆదివారం సాయంత్రం బళ్లారి ఆరోగ్య మాత పుణ్యక్షేత్రంలో మేరీ మాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఏటా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు జెండా ఆవిష్కరించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మేరీమాతను పల్లకీలో కొలువుదీర్చి చర్చి ప్రాంగణంలో ఊరేగించారు. మేరీమాత ఊరేగింపుకు వందలాది మంది క్రైస్తవులు, భక్తులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బెంగుళూరు ధర్మాధ్యక్షుడు డాక్టర్ ఆరోగ్యరాజ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలందరూ దేవుని కృపతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. కన్నడ నాడులో వర్షాలు కురిసి నదులు, జలాశయాలు నిండి పాడిపంటలతో సుభిక్షింగా ఉండాలని దేవుడిని కోరుకున్నారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర క్రిస్టియన్ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు జి.జే.రవి కుమార్, ఫాదర్ ఆరోగ్యనాథన్, ఫాదర్ ఐవన్ఫింటో తదితరులు పాల్గొన్నారు. -
యథావిధిగా బళ్లారికి పాదయాత్ర
సాక్షి, బళ్లారి: వాల్మీకి అభివృద్ధి నిగమ మండలిలో జరిగిన అవినీతికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వాల్మీకి అబివృద్ధి నిగమ మండలిలో అవినీతికి ఒక్క నాగేంద్ర బాధ్యుడు కాదని.. ప్రభుత్వం పాత్ర కూడా ఉందని ఆరోపించారు. లింగసూగూరు నుంచి బళ్లారికి యథావిధిగా పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. ఆదివారం మోకా రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి, మాజీ మంత్రి బి.శ్రీరాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు సన్న పక్కీరప్ప తదితరుల నేతృత్వంలో పాదయాత్రకు సంబంధించిన లోగో విడుదల చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన రాయచూరు జిల్లా లింగసూగూరు నుంచి ప్రారంభమయ్యే బీజేపీ పాదయాత్ర.. సెప్టెంబర్ 10వ తేదీ వరకూ కొనసాగుతుందన్నారు. రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని లింగసూగూరు, మస్కీ, కారటగి, గంగావతి, కంప్లి తదితర పలు గ్రామాల మీదుగా పాదయాత్ర బళ్లారికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా బీజేపీ ప్రముఖులు మాట్లాడుతూ.. వాల్మీకి నిగమ మండళిలో జరిగిన అవినీతిలో నాగేంద్ర రాజీనామా చేసినా పాపం పరిహారం కాలేదన్నారు. ఇందులో భాగస్వాములైన వారందరూ కూడా నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వాల్మీకి నిగమ మండలిలో జరిగిన అవినీతితో బళ్లారి లోక్‌సభ సభ్యుడు తుకారం గెలిచారన్నారు. ఆయన కూడా రాజీనామా చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే సురేష్ బాబు, బీజేపీ ప్రముఖులు హనుమంతప్ప, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు. -
మానవీయ విలువలు పెంపొందించాలి
రాయచూరు రూరల్: సమాజంలో విద్యార్థులకు ఉత్తమ బోధనను అందించడంతో పాటు, వారిలో మానవీయ విలువలను పెంపొందించేలా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేలు బసనగౌడ దద్దల్, బోసురాజు పిలుపునిచ్చారు. స్థానిక పండిత సిద్ధరామ జంబలదిన్ని రంగమందిరంలో కురుబ సమాజం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న విలక్షణమైన ప్రతిభను గుర్తించి, వారి ఉన్నతికి విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందించాలన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యులు వసంత కుమార్, శివరాజ్ పాటిల్, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, ప్రముఖులు వినయ్ కుమార్, గుండప్ప, హన్మంతప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
మహానగర పాలికె కమిషనర్ బదిలీ
రాయచూరు రూరల్: రాయచూరు మహానగర పాలికె కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జుబీన్ మోహ పాత్రోను యాదగిరి జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దావణగెరె జిల్లా పంచాయతీ సీఈఓగా ఉన్న గిట్టి మాధవ్ విఠల్‌ను బీదర్ జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించారు. కలబుర్గి డివిజన్లో అసిస్టెంట్ కమిషనర్‌గా సేవలందిస్తున్న సాహిత్య అలదకట్టిని దావణగెరె జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బదిలీ చేస్తూ సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖ అధీన కార్యదర్శి మహంతేష్ ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరి జిల్లా పంచాయతీ సీఈఓగా పని చేస్తున్న రాహుల్ తుకారం పాండ్వే, అలాగే బీదర్ జిల్లా పంచాయతీ సీఈఓగా ఉన్న గిరీష్ దిలీప్ బదోలెను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే వీరికి ప్రస్తుతం ఎలాంటి కొత్త పోస్టింగ్‌లు కేటాయించకుండా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేచి ఉండాలని ఆదేశించింది. -
లవర్ కోసం సెల్ టవర్‌పై హల్చల్
రాయచూరు రూరల్: ప్రేమించిన అమ్మాయి దూరం అవుతోందనే కారణంతో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటా అని హల్చల్ చేశాడు. ఈ ఘటన దేవదుర్గ పట్టణంలో కలకలం సృష్టించింది. వివరాలు ఇలా.. కొప్పళ జిల్లా దేవగుర్గకు రాజు, మల్లమ్మ గతంలో బెంగళూరులో ఉన్న సమయంలో ప్రేమించుకున్నారు. ఇటీవల మల్లమ్మ.. రాజును దూరం పెట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం సెల్ టవర్ ఎక్కి దూకేస్తానంటూ హంగామా చేశాడు. ‘నా మరణానికి మల్లమ్మే కారణం అంటూ డెత్ నోట్ రాశాడు. కిందకు దిగాలని స్థానికులు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న దేవదుర్గ తహసీల్దార్ నాగమ్మ, సీఐ మంజునాథ్ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడిని కిందకు దించేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. చాకచక్యంగా వ్యహరించిన అధికారులు మల్లమ్మను పిలిపించారు. మల్లమ్మ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో రాజు కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. బాధిత కుటుంబాలకు పరామర్శ రాయచూరు రూరల్: గడిచిన 11 రోజుల్లోనే జిల్లాలో వరుసగా నాలుగు అనుమానాస్పద మరణాలు చోటుచేసుకున్నాయి. లింగసూగూరు తాలూకా కరకడకల్‌లో రాణెమ్మ, హద్దనాళలో భూమానంద, హోక్రాణి గ్రామంలో అశ్విని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆదివారం అలెమారి బుడకట్టు సమాజం మండళి అధ్యక్షుడు ఎన్.మూర్తి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పరిహారం, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. బాధిత కుటంబాల్లోని విద్యార్థులకు హాస్టల్లో సౌలభ్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. హావేరివాసి దుర్మరణంహిందూపురం టౌన్: సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపురం–పెనుకొండ రైల్వే స్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడి ఒకరు చనిపోయారు. హిందూపూరం రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు పరిశీలించారు. సుమారు 25–30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో అక్కడే చనిపోయాడని తెలిపారు. తలకు తీవ్ర గాయం కావడంతో పాటు శరీరంపై పలు గాయాలు ఉన్నాయి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడు కర్ణాటక రాష్ట్రం హావేరి తాలుకా బసాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ చావడిగా గుర్తించి, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హాస్య నటుడు చిక్కన్న పెళ్లివేడుక మైసూరు: కన్నడ కామెడీ కింగ్‌గా పేరుగాంచిన శాండల్‌వుడ్ హాస్య నటుడు చిక్కన్న, ఆదివారం వ్యాపారవేత్త పావనిగౌడ పెళ్లి ఘనంగా జరిగింది. సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో చిక్కన్న అచ్చమైన మైసూరు అల్లునిలా మెరిసిపోయారు. శ్రీరంగపట్నంలోని మహాదేవపుర పావని గౌడ స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక జరిగింది. మైసూరులోని స్పెక్ట్రమ్ హాల్లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఉపేంద్ర, గోల్డెన్ స్టార్ గణేశ్ సహా శాండల్‌వుడ్ సెలబ్రిటీలు విచ్చేశారు. నాకు పైళ్లె ఎన్నో ఏళ్లు అయ్యింది, కానీ నాకేమీ తెలియదు, కాబట్టి మీకేమీ సలహా ఇవ్వలేను అని గణేశ్ జోక్ చేయడంతో అందరూ నవ్వారు. సహనం సంసారానికి చాలా ముఖ్యమని నటి సుధారాణి సూచించారు. నాగేంద్ర రాజీనామా ఆమోదం యశవంతపుర: వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి నిధుల కుంభకోణం కేసులో మంత్రి నాగేంద్ర రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించారు. సీఎం డీకే శివకుమార్, సీఎస్ శాలిని రజనీష్‌కి ఈ మేరకు సమాచారం పంపారు. ఈ స్కాం వల్ల ఆయన రెండవసారి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు నాగేంద్రకు వ్యతిరేకంగా పాదయాత్ర చేయడంలో జేడీఎస్‌తో ఎలాంటి అపోహలు లేవని బీజేపీ నేత విజయేంద్ర తెలిపారు. 1వ తేదీ నుంచి రాయచూరు నుంచి పాదయాత్ర చేపడతామని బీజేపీ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ బనశంకరి: యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం నగరంలో మల్లేశ్వరంలోని బీజేపీ ప్రదాన కార్యాలయం ముట్టడికి యత్నించారు. కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వివాదం జరిగింది. పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకోవడంతో పోలీసులు కార్యకర్తలపై లాఠీచార్జ్చేసి చెదరగొట్టారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. -
నేపాల్ ప్రజలను ఆదుకుంటాం
హుబ్లీ–ధార్వాడ పోలీస్ కమిషనర్‌గా భూషన్ హుబ్లీ: హుబ్లీ–ధార్వాడ నూతన పోలీస్ కమిషనర్‌గా భూషన్ గులాబ్ రావ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ పోలీస్ కమిషనర్‌గా ఉన్న శశికుమార్ బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో భూషన్ గులాబ్ రావ్ నియమితులయ్యారు. కర్ణాటక కేడర్ 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి భూషన్.. బెళగావి నగర పోలీస్ కమిషనర్‌గా పని చేస్తూ ఇక్కడకి బదిలీ అయ్యారు. పల్లకీలో ఊరేగిన హయ్యాళ లింగేశ్వరుడురాయచూరు రూరల్: యాదగిరి జిల్లా వడిగేర తాలూకా హయ్యాళలో ఆదివారం హయ్యాళ లింగేశ్వర స్వామి పల్లకీ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వందలాది మంది భక్తులు హయ్యాళ లింగేశ్వరడుని పూలతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. అనంతరం కృష్ణా నదికి ఊరేగింపుగా తీసుకెళ్లి గంగా జలంతో అభిషేకం చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొప్పళ ఎస్పీగా సాహిల్ బాగ్లా రాయచూరు రూరల్: బెంగళూరు ఈస్ట్ ట్రాఫిక్ విభాగం డీసీపీగా పని చేస్తున్న సాహిల్ బాగ్లాను కొప్పళ జిల్లా నూతన పోలీస్ సూపరింటెండెంట్‌గా (ఎస్పీ) నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండేళ్లుగా కొప్పళ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన డా.రామ్ లక్ష్మణ్ అరసిద్దిని బదిలీ చేశారు. ఈయన్ను బెంగళూరులోని ప్రధాన కార్యాలయానికి పంపించారు. రాఘవేంద్ర స్వామి అనుగ్రహ అవార్డుల ప్రదానంరాయచూరు రూరల్: మంత్రాలయంలో శనివారం రాత్రి రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు, సప్తరథోత్సవాలు జరిగాయి. మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్ మఠంలో పూర్వారాధన చేపట్టారు. సంస్కృతి విద్యా పీఠం ప్రిన్సిపాల్ విద్వాన్ వాదిరా రాజాచార్, తంజావూర్ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ వైద్య సుబ్రమణ్యంకు రాఘవేంద్ర స్వామి అనుగ్రహ అవార్డులు ప్రదానం చేశారు. ఉత్సవాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేష్, తెలంగాణ, గోవా, కేరళ, పాండిచ్చేరి నుంచి భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు మంచాలమ్మ దేవిని ఊరేగించారు. ఐఏఎస్‌కు కస్టడీ బనశంకరి:కేపీఎస్సీ పశువైద్యాధికారుల పోస్టుల భర్తీ కుంభకోణంలో ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్‌కు బెంగళూరు 1వ ఏసీజేఎం కోర్టు జుడిషియల్ కస్టడీకి ఆదేశించింది. శనివారం 11 గంటల నుంచి సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నట్లు తెలిపి కోరమంగలలో జడ్జి ఇంట్లో హాజరు పరిచారు. వాదనలు ఆలకించి జుడిషియల్ కస్టడీకి ఆదేశించడంతో జైలుకు తరలించారు. సోమవారం మళ్లీ కోర్టులో హాజరుపరుస్తారు. -
అనుమానాస్పదంగా యువకుడు మృతి
రాయచూరు రూరల్: మాన్వి తాలూకా హుసేనపుర క్రాస్ వద్ద శనివారం సాయంత్రం రమేష్ నక్కుంది (28) అనే దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. ఇది హత్యనా లేక మరేదైనా కారణంతో యువకుడు మృతి చెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అరుణాంగ్షు గిరి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గడిచిన 11 రోజుల్లోనే జిల్లాలో వరుసగా నాలుగు అనుమానాస్పద మరణాలు సంభవించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. లింగసూగూరు తాలూకా కరకడకల్‌లో రాణెమ్మ, హద్దనాళలో భూమానంద, హోక్రాణి గ్రామంలో అశ్విని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్, సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) కెంచరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రమేష్ మృతికి పూర్తి కారణాలు విచారణలో తెలిసే అవకాశం ఉంది. -
ఈ సర్కారును చూస్తే ఏడుపు వస్తోంది
మండ్య: ఖజానాను ఖాళీ చేసి, రాష్ట్ర అభివృద్ధిని నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎప్పటికీ పురోగతి సాధ్యం కాదని బీజేపీ ఎంపీ, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి దారి పట్టాలంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన అన్నారు. ఆదివారం మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం వద్ద సంతేకసాలగెరెలో బీజేపీ నేత ఆధ్వర్యంలో మహిళలకు వాయన సమర్పణంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు అడుగంటాయి, ప్రగతిశీల ప్రాజెక్టులకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదు అని విమర్శించారు. కావేరీ జలాలపై హక్కును కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, పొరుగు రాష్ట్రంలోని రైతుల పంటలకు నీళ్లు పోస్తూ, మన రైతులను పంటలు వేయవద్దని చెబుతున్న ప్రభుత్వాన్ని చూస్తే నాకు ఏడుపు వస్తోందని ఆయన వాపోయారు. దోపిడీలు, అవినీతి విపరీతంగా పెరిగిపోయాయి, అభివృద్ధి పక్కన పడిపోయిందని విమర్శించారు. రాష్ట్ర రాజకీయాలను మండ్య ఫలితాలే శాసిస్తాయన్నారు. బీజేపీ నేతలు అశోక్, ఎం.నాగరాజు, యదువీర్, తారా అనురాధ సతీష్ రెడ్డి, సచ్చిదానంద పాల్గొన్నారు. మాజీ సీఎం బొమ్మై -
రాఘవ సన్నిధి.. భక్తుల పెన్నిధి
మండ్య: శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌమ 355వ ఆరాధన మహోత్సవాలు ఆదివారం అంతటా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండ్య నగరంలోని శ్రీ వ్యాసరాజ మఠం ఆవరణలో గల శ్రీరాఘవేంద్ర స్వామి ఆలయంలో విశేష పూజా వేడుకలు జరిగాయి. మధ్యాహ్న ఆరాధన, పాదపూజ, అష్టోత్తర సహిత పంచామృత అభిషేకం, ఆపై గురుసార్వభౌమర్ల పాలక్కి ఉత్సవం, మహారథోత్సవం కనులపండువగా జరిపించారు. నేత్రపర్వంగా కనకాభిషేకం సాగింది. భక్తి గానసుధ, భజనలు వీనులవిందు చేశాయి. భక్తిశ్రద్ధలతో మధ్యారాధన కోలారు: నగరంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో మధ్యారాధన ఘనంగా జరిగింది. ఉదయం రాయర బృందావనానికి పంచామృత అభిషేకం జరిపి వివిధ పూలహారాలతో ముస్తాబు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు బృందావనం దర్శనం చేసుకున్నారు. బెంగళూరు మఠంలో బనశంకరి: ఉద్యాననగరిలో జయనగర ఐదో బ్లాక్‌లోని శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠంలో ఆరాధన ఉత్సవాల్లో ఆదివారం రాయల గురు రాఘవేంద్రులకు వాదీంద్ర ఆచార్య నేతృత్వంలో పాదపూజ, కనకాభిషేకం నిర్వహించారు. బంగారు, నవరత్నాలతో కూడిన రాఘవేంద్రస్వామి విగ్రహాన్ని బృందావనంలో ప్రతిష్టించి పూజించారు. అనేకమంది ప్రముఖులతో పాటు వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఘనంగా ఆరాధన వేడుకలు -
హాస్టల్‌పై నుంచి దూకిన టెక్కీ జంట
● యువతి దుర్మరణం కృష్ణరాజపురం: బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఒక కో–లివింగ్ పీజీ హాస్టల్ భవనం 7వ అంతస్తు నుంచి ప్రేమికుల జంట దూకడంతో, యువతి అక్కడికక్కడే మరణించగా, యువకుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఈసీసీ రోడ్డులోని మౌంటెన్ కో–లివింగ్ పీజీలో జరిగింది. మృతురాలు పుదుచ్చేరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జనని (23), ఆమె ప్రియుడు మాణిక్య వేలు (30). అతడు తమిళనాడువాసిగా సమాచారం. ఇద్దరూ ఓ ప్రైవేటు కంపెనీలో టెక్కీలుగా ఉద్యోగం చేస్తున్నారు. ప్రేమించుకుంటూ కో లివింగ్ హాస్టల్లో ఒకే గదిలో జీవిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరనే భయమో, లేదా ఏం గొడవలు వచ్చాయో గానీ ఆదివారం హాస్టల్ భవనంలోని 7వ అంతస్తు నుంచి దూకడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. యువతి క్షణాల్లో చనిపోగా, అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.వీధిలైట్ల దుస్థితిపై మంత్రి ఆవేదన బనశంకరి: గ్రేటర్ బెంగళూరులో వీధి దీపాల నిర్వహణ గురించి రెండుసార్లు సమావేశం నిర్వహించినప్పటికీ ఫలితం లేదు, ప్రముఖ రోడ్లలో విద్యుత్ దీపాలు పనిచేయడం లేదు, అలసత్వం చూపే సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మంత్రి కృష్ణబైరేగౌడ సూచించారు. ఆదివారం ఆయన ట్వీట్ చేవారు. 28 సాయంత్రం హడ్సన్ సర్కిల్ నుంచి చాళుక్య సర్కిల్ వరకు తాను పరిశీలించగా 140 విద్యుత్ స్థంభాల్లో లైట్లు పనిచేయడం లేదన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పీడీఓ దంపతుల ఇంట్లో రూ.1.43 కోట్ల చోరీ ● శివమొగ్గలో ఘటన శివమొగ్గ: నగరంలోని విద్యానగర 4వ క్రాస్ రోడ్డులో ఒక పీడీఓ కుటుంబం నివసిస్తున్న అద్దె ఇంట్లో భారీ చోరీ జరిగింది. 943 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి, రూ.86 వేల నగదు, 15 వాచీలు, ఒక దేవుని విగ్రహం, మొత్తం రూ 1.43 కోట్ల సొత్తును ఎత్తుకెళ్లారు. పీడీఓ నటరాజ్ కె.ఎన్. (55), ఆయన భార్య ఇద్దరూ పీడీఓలుగా పని చేస్తున్నారు. ఆగస్టు 28న ఉయదం 11:15 గంటలకు ఇద్దరూ ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లారు. కొంతసేపటికే దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి చొరబడ్డారు. బంగారు నగలు, వెండి సొత్తు, డబ్బులు, విలువైన వాచ్‌లు తదితరాలను మూటగట్టుకెళ్లారు. ఇంటి చుట్టూ అమర్చిన సీసీ కెమెరాలలో దొంగలు నమోదయ్యారు. కోటే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాణిక్య వేలు టెక్కీ జనని (ఫైల్) సీసీ కెమెరాలో దొంగలు -
ప్రమోషన్ పేరుతో మోసం.. బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: పై అధికారులు ప్రమోషన్ ఇస్తానని నమ్మించి రూ.50 వేలు లంచం తీసుకుని మోసం చేయడంతో ఆవేదనకు గురైన బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా మాదనబావి గ్రామంలో జరిగింది. వివరాలు.. ఐడీఎఫ్సీ బ్యాంకులో మోహన్‌కుమార్ చిన్న ఉద్యోగి. నీకు ప్రమోషన్ ఇప్పిస్తామని, ఇందుకు నకిలీ మార్కుల కార్డును తయారు చేయించాలని రూ.50 వేలు లంచం అడిగారు. మోహన్‌కుమార్ అప్పులు చేసి అధికారులకు ఆ డబ్బు ఇచ్చాడు. కానీ ఎన్నిరోజులైనా ప్రమోషన్ రాలేదు, అడిగినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని బాధపడ్డాడు. బ్యాంకులో పని చేసే తిప్పేస్వామి, బోగస్ మార్కుల లిస్టు చేసిచ్చిన కోట్రేశ్ కారణమని పేర్కొంటూ సెల్ఫీ వీడియో తీసి బైక్‌తో పాటు తుంగానది కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యామతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కరెంటు తీగ మీద పడి.. మైసూరు: మైసూరు జిల్లాలోని తి.నరసిపుర తాలూకాలోని బొమ్మనాయకనహళ్లి గ్రామంలో కరెంటు షాక్ తగిలి మంజు (43) అనే రైతు మరణించాడు. అతను తన ఇంటి దగ్గర ఉన్న చెరకు పొలానికి వెళ్తుండగా, ఒక విద్యుత్ తీగ తెగి అతనిపై పడటంతో తలకు తీవ్ర గాయాలై పడిపోయాడు. చాలాసేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా మంజు మృతదేహం కనిపించింది. బన్నూర్ సీఈఎస్సీ ఇంజనీర్, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఘోరానికి కారణమని గ్రామస్తులు ఆరోపించారు. డేటింగ్ అంటూ కిడ్నాప్ ● రూ.3.7 లక్షల దోపిడీ ● కిలాడీ ముఠా అకృత్యం బొమ్మనహళ్లి: యువతితో సంతోషంగా గడపాలని అనుకున్న వ్యక్తికి నరకం చూపించారు. బెంగళూరు హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి ఒక వ్యక్తిని అపహరించి, రూ. 3.7 లక్షలను దోచుకుంది. వివరాలు.. ఆనేకల్ తాలూకాలోని చందాపుర ప్రైవేట్ ఉద్యోగి (33), కొన్ని నెలలుగా డేటింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడు. ఇటీవల పూనమ్ అనే యువతిని కలిశాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ, చాటింగ్ చేసేవారు. ఆగస్టు 19వ తేదీ రాత్రి, ఎలక్ట్రానిక్స్ సిటీలోని హులిమంగళ మెయిన్ రోడ్డులో ఉన్న ఒక పబ్ దగ్గరకు రావాలని యువతి ఆహ్వానించింది. రాత్రి 9:45 గంటలకు అతడు వెళ్లగా, కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. ఆ సమయంలో, నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వ్యక్తిని బెదిరించి, అదే కారులో బలవంతంగా తీసుకుపోయారు. తర్వాత అతడిని మరో బూడిద రంగు కారులోకి మార్చి, నగరంలో తిప్పుతూ చంపేస్తామని బెదిరించి జేబులోని నగదు, డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి రూ.3.7 లక్షలను దోచుకున్నారు. వారి నుంచి ఎలాగో బయటపడి ఆగస్టు 25న హెబ్బగోడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఎం వేధించారు: హొరట్టిదొడ్డబళ్లాపురం: తనను వేధించి, హింసించి మరీ రాజీనామా తీసుకున్నారని విధాన పరిషత్ మాజీ స్పీకర్ బసవరాజు హొరట్టి ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఆరోపణలు చేశారు. గదగ్ జిల్లా శిరహట్టి తాలూకా బెళ్లట్టి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీకే శివకుమార్ తనను చాలా వేధించి రాజీనామా చేయించారన్నారు. సీఎం సుమారు గంటన్నరపాటు తన కార్యాలయంలో కూర్చొని ఒత్తిడి తీసుకువచ్చారని, అప్పుడు తాను చాలా బాధపడ్డానని అన్నారు. సర్వీసింగ్ తరువాత కారు దగ్ధంబొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకా అత్తిబెలెలో జాతీయ రహదారి–44పై నెరలూరు వద్ద కారు మంటల్లో కాలిపోయింది. కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం అత్తిబెలెవాసి మోహన్, కారుకు సర్వీసింగ్ చేయించిన తర్వాత దానిని ట్రయల్ చూడటానికి వెళ్తుండగా తెల్లని పొగలు, మంటలు లేచి నిమిషాల్లోనే దగ్ధమైంది. దీంతో యజమాని షాక్‌కు గురయ్యాడు. గంటకు పైగా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తింది. అత్తిబెలె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
మేలుకోటెకు భక్తుల బాట
మండ్య: జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం మేలుకోటె దేవస్థానంలో శ్రావణమాసం ముగుస్తోండగా భక్తజనం తరలివస్తున్నారు. శని, ఆదివారాల్లో, 50 వేల మందికి పైగా భక్తులు చెలువనారాయణస్వామి, యోగ నరసింహస్వామి ఆలయాలను సందర్శించారు. తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయేవరకూ దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తుల వాహనాలతో పార్కింగ్ స్థలాలన్నీ నిండిపోయాయి. చాలా దూరంలోనే కార్లను నిలిపి నడుచుకుంటూ వచ్చారు. అన్నదాన భవన్లో భక్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. వివిధ గ్రామాల నుంచి దాతలు ట్రాక్టర్లలో ఆహారాన్ని తీసుకువచ్చి భక్తులకు వితరణ చేశారు. ఈఓ శీలా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పూలహారాలు కరువాయె శ్రావణమాసం సందడి ఆలయంలో కనబడడం లేదని భక్తులు వాపోయారు. ఆలయంలో విగ్రహాలకు, ద్వారాలకు కనీస పూలమాలలు, పందిర్లు కూడా కట్టలేదు. మూలవిరాట్లకు కూడా పూలదండలు, తోమలే సేవలు లేవని భక్తులు నిట్టూర్చారు. గోపురం, ద్వారాలకు పూలమాలలు కట్టాలని ఈఓకి సూచించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తనకెవరూ చెప్పనందున పూలహారాల అలంకరణ చేయలేదని ఈఓ శీలా పేర్కొన్నారు. శ్రావణం, వీకెండ్ రద్దీ


