రాయచూరు రూరల్: మానసిక అస్వస్థతకు గురై పిచ్చివాడిలా రోడ్ల వెంట తిరుగుతూ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా వ్యవహరించిన మానసిక అస్వస్థుడిని పట్టుకొని అతనికి క్షౌ రం చేయించి కొత్త దుస్తులు ధరింప చేసి కారుణ్యాశ్రమంలో చేర్పించి మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా తుర్విహాళ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ సుజాత నాయక్‌కు తిడిగోళలో మానసికంగా అస్వస్థతగా ఉన్న వ్యక్తి గ్రామంలో సంచరిస్తుండగా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె తోటి పోలీసు సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి ప్రత్యేక చొరవ తీసుకుని అతనికి సపర్యలు చేయించి సింధనూరులోని కారుణ్యాశ్రమంలో చేర్పించారు.
మానసిక అస్వస్థుడికి
ఆశ్రయం కల్పించిన మహిళా ఎస్‌ఐ


