బనశంకరి: ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ తదితర దేశాల్లో చిక్కుకున్న కన్నడిగులను స్వరాష్ట్రానికి రప్పించే ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 510 మందికి పైగా సురక్షితంగా చేరుకున్నారు. అబుదాబి నుంచి బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి రెండు విమానాలు వచ్చాయి. కన్నడిగులే కాక ఇతర రాష్ట్రాలవారు ఇందులో ఉన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధు కూడా బెంగళూరుకు వచ్చారు. ఎమ్మెల్యేలు బోజేగౌడ, ఏటీ.శ్రీనివాస్ మాట్లాడుతూ దుబాయ్‌లో తాము బసచేసిన హోటల్ పక్కనే బాంబులు పడ్డాయన్నారు. యుద్ధం ఉండగా, ఇంత తొందరగా వస్తామని అనుకోలేదన్నారు.


