కోలారు: పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి కుటుంబ సమస్యలతో ఘోరానికి పాల్పడింది. కవల పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయగా పిల్లలు మరణించారు. ఈ దుర్ఘటన కోలారు జిల్లా బంగారుపేట తాలూకా బూదికోట గ్రామంలోని హైదరాలి కోట జరిగింది. సోమవారం సాయంత్రం బంగారుపేట తాలూకా కోడగుర్కి గ్రామానికి చెందిన ఉషా (28), కవల పిల్లలు హర్షిత్, హితేష్ (2)తో కొండపైకి చేరుకుంది. అక్కడే ఉన్న పర్యాటక మిత్ర సిబ్బంది అనుమానంతో ఆమె దగ్గరికి వస్తుండగా, పిల్లలను బావిలోకి విసిరి వేసి, తానూ దూకింది. పర్యాటక మిత్ర సిబ్బంది బావిలోకి దూకి మహిళను రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఇంతలోపల పిల్లలు మరణించారు.
కుటుంబ కలహాలే..
ఉషాకు 8 సంవత్సరాల క్రితం మురళి అనే వ్యక్తితో వివామైంది. తరచూ గొడవపడేవారని, దీంతో విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు అనుమానాలున్నాయి. కేజీఎఫ్ ఎస్పీ, డీఎస్పీ, బూదికోట పోలీసులు ఘటనా స్థలాని పరిశీలించారు. బాధితురాలు ఆస్పత్రిలో ఉండగా, ఆమెను విచారించనున్నారు.
తల్లి కూడా ఆత్మహత్యాయత్నం
పిల్లలు మృత్యువాత
కోలారు జిల్లాలో ఘోరం


