దేవేరులతో అమర నారాయణస్వాములు
తేరు వేడుక
చింతామణి: హోలీ పౌర్ణమి సందర్భంగా తాలూకాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కైవార యోగి నారాయణ మఠం పక్కన ఉన్న అమర నారాయణస్వామి దేవస్థానంలో బ్రహ్మరథోత్సవం మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను తేరులో ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. భక్తజనం గోవిందా గోవిందా అని కీర్తిస్తూ తేరును లాగారు. కై వార ధర్మాధికారి జయరాం దంపతులు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కై వార తాతయ్య జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.


