బళ్లారి అర్బన్: ద్వితీయ పీయూసీ పరీక్షల్లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభం కాగా మున్సిపల్ కళాశాల ముందు విద్యార్థులు హాల్‌టికెట్లతో తమకు కేటాయించిన గదులు, టేబుల్ నెంబర్లను పరిశీలించుకుని సందడి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ద్వితీయ పీయూసీ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి కన్నడ పరీక్షతో ప్రారంభమయ్యాయి. పీయూ విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ హళ్లదమని, ప్రిన్సిపాల్ సుంకప్ప పీయూసీ పరీక్షలకు ఉదయం 9 గంటల నుంచే విద్యార్థులను లోపలికి అనుమతించారు. ఈ పరీక్షలు ఈనెల 16 వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు విద్యా శాఖ బళ్లారి, విజయనగర జిల్లాల్లో సర్వం సిద్ధం చేసింది. ఈ రెండు జిల్లాలో మొత్తం విద్యార్థులు 25,645 మంది పరీక్షలు రాస్తుండగా వారిలో బాలికలు 15,155 మంది, బాలురు 10,490 మంది ఉన్నారు.
మొత్తం విద్యార్థులు 25,645 మంది
ఏర్పాట్లు సిద్ధం చేసిన కేంద్రాలు 43
బళ్లారి జిల్లాలో 20, విజయనగరలో 23


