భక్తిశ్రద్ధలతో నారేయణ గురు జయంతి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో నారేయణ గురు జయంతి

Mar 4 2026 8:18 AM | Updated on Mar 4 2026 8:18 AM

బళ్లారి అర్బన్‌: యోగి నారేయణ యతీంద్ర కై వార తాతయ్య జయంతిని మంగళవారం భక్తిశ్రద్ధలతో ఆచరించారు. చిత్రపటాన్ని రథంలో ఉంచి వడ్డరబండ బలిజ భవనం నుంచి శోభాయాత్రను సంగం సర్కిల్‌ మీదుగా రాయల్‌ సర్కిల్‌, మీనాక్షి సర్కిల్‌ గుండా తిరిగి బలిజ భవనం వరకు ఊరేగించారు. శోభాయాత్రలో నందికోలు, బ్యాండ్‌ వాయిద్యాలు, కలశాలతో కన్నుల పండువగా ఊరేగింపు జరిపారు.

రాయచూరులో..

రాయచూరు రూరల్‌: నగరంలో యోగి నారేయణ యతీంద్ర జయంతిని మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో ఆచరించారు. ఽయోగి నారాయణ యతీంద్ర చిత్రపటానికి తహసీల్దార్‌ పరశురామ పూలమాల వేశారు. అనంతరం జ్యోతి వెలిగించి మాట్లాడుతూ గురువులు, శరణుల మార్గదర్శనంలో సమాజం అభివృద్ధి దిశలో సాగాలన్నారు. కార్యక్రమంలో అనిల్‌ కుమార్‌, వినోద్‌ కుమార్‌, సురేష్‌, శైలజాలున్నారు.

దుర్గమ్మకు గ్రహణ పూజలు

బళ్లారి అర్బన్‌: బళ్లారి నగర ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా వెండి ఆభరణాల పూలతో అలంకరణ పూజలను అర్చకులు నిర్వహించారు. మంగళవారం గ్రహణం కలిసి రావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. మధ్యాహ్నం గ్రహణం ఉన్నప్పటికీ ఆలయం తెరిచి ఉంచినట్లు ధర్మకర్త పూజారి గాదెప్ప తెలిపారు. పాక్షికంగా చంద్రగ్రహణం సంభవించింది. గ్రహణ సందర్భంగా పూజలు, దానధర్మాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగింది.

హంపీలో ఆలయం మూసివేత

హొసపేటె: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి ఆలయం మూసివేశారు. ఆలయంలో ధార్మిక కార్యక్రమాలను కూడా నిలిపి వేశారు. చంద్రగ్రహణం తర్వాత ఆలయాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆలయాన్ని మూసివేశారు. భక్తులు లేనందున ఆలయ ఆవరణ నిర్మానుషంగా మారింది.

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ దుర్మరణం

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ గుండెపోటుతో దుర్మరణం పాలైన ఘటన కలబుర్గి జిల్లాలో వెలుగు చూసింది. యథాప్రకారం సేడం తాలూకాలో నాగనాథరెడ్డి(56) అనే ఆర్టీసీ డ్రైవర్‌ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సేడం బస్టాండ్‌ నుంచి వాడి మీదుగా హళ్లిఖేడకు బస్సు తీసుకెళ్లాడు. అక్కడ విధుల్లో ఉండగా స్వల్పంగా ఛాతీలో నొప్పిగా ఉందని కండక్టర్‌కు తెలిపాడు. వెంటనే అతనిని అంబులెన్సులో కలబుర్గి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

వినూత్నంగా హాజరు సేకరణ

హొసపేటె: టీపీ కార్యాలయ సభాంగణంలో మంగళవారం ఎన్‌ఎంఎంఎస్‌ ఫేస్‌ ప్రామాణీకరణ శిక్షణ సదస్సు జరిగింది. నరేగ పథకం కింద నిర్వహించిన ఈ సదస్సుకు జెడ్పీ డిప్యూటీ కార్యదర్శి కే.తిమ్మప్ప అధ్యక్షత వహించి మాట్లాడారు. నరేగ పథకం కింద కమ్యూనిటీ పనుల్లో పని చేసే వ్యక్తుల రోజు వారీ హాజరు, పని స్థలం ఛాయాచిత్రాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం వినూత్న మొబైల్‌ టెక్నాలజీని అమలు చేసిందన్నారు. జిల్లాలోని అన్ని తాలూకాలు, గ్రామ పంచాయతీల్లో ఈ టెక్నాలజీతో రియల్‌ టైమ్‌ హాజరును సేకరిస్తారన్నారు. అందువల్ల నరేగ పథకం కింద తాలూకా స్థాయి అధికారులు, కో–ఆర్డినేటర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, పారదర్శకంగా తమ విధులను నిర్వహించాలన్నారు. మేనేజర్‌ లోకేష్‌ బాబు, టీపీ ఈఓ ఆలం బాషా, హడగలి టీపీ అధికారి పరమేశ్వరప్ప, బసవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement