లబ్ధిదారులకు పట్టాల మంజూరు | - | Sakshi
Sakshi News home page

లబ్ధిదారులకు పట్టాల మంజూరు

Mar 4 2026 8:18 AM | Updated on Mar 4 2026 8:18 AM

హొసపేటె: సీఎం గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద భూమి లేని 74 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గవియప్ప తెలిపారు. మంగళవారం పాపినాయకనహళ్లిలోని నాగప్ప సంక్షేమ మందిరంలో లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం భూమి లేని వారికి పట్టాలు అందించడంతో పాటు ఇళ్లు కట్టించేందుకు వ్యవస్థను రూపొందించామన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని ఆయన సూచించారు. గ్రామ సభలో 95 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా వారిలో 74 మందికి ప్లాట్లను జారీ చేశామన్నారు. రాబోయే రోజుల్లో పెండింగ్‌లో ఉన్న వారికి స్థలాలను అందిస్తామన్నారు. టీపీ ఈఓ ఆలం బాషా, పీడీఓ బీరప్ప, గృహ నిర్మాణ శాఖ అధికారి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement