రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు సర్కార్ సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం యాదగిరి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నర్సింగ్‌హోంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం 21 ప్రభుత్వ వైద్య కళాశాలలు నడుస్తున్నాయన్నారు. భవిష్యత్తులో నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి రూ.985 లక్షలు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చెన్నారెడ్డి పాటిల్, అధికారులు సందీప్‌లున్నారు.


