అవినీతిపరులపై లోకాయుక్త పిడుగు | - | Sakshi
Sakshi News home page

అవినీతిపరులపై లోకాయుక్త పిడుగు

Mar 6 2026 8:20 AM | Updated on Mar 6 2026 8:20 AM

ఎవరెవరి ఇళ్లపై దాడులు?

● ఎంసీ.సత్యనారాయణ–ఏఈఈ, హాసన్‌ మహానగర పాలికె

● వసంత వీ.నాయక్‌– కేఆర్‌ఐడీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌

● వీరేశ హిరేమఠ, ఉప విద్యుత్‌ బెస్కాం

ఉన్నతాధికారి, యాదగిరి

● సతీశ్‌ –ఏఈఈ, పీడబ్ల్యుడీ గదగ్‌

● ఎంకే.సురకోడ్‌– బీసీ సంక్షేమ

అధికారి–గదగ్‌

● అసిఫ్‌ ఇక్బాల్‌ హుసేన్‌ – ఏఈఈ, నగర నీటి సరఫరా మండలి, మైసూరు

● శశిధర్‌– సీఈఓ , రైతుసేవాసహకార

సంఘం యలహంక, బెంగళూరు,

● హెచ్‌సీ. ఇంద్రేశ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,

మెడికల్‌ కాలేజీ, హెబ్బాళ, బెంగళూరు

● డాలేశ్‌–బీడీఏలో ఆర్‌ఎఫ్‌ఓ అధికారి,

బెంగళూరు,

● ప్రకాష్‌ –జలమండలి జూనియర్‌ ఇంజనీర్‌, బెంగళూరు

బనశంకరి: ఆదాయానికి మించి ఆస్తులను అక్రమంగా కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ఇళ్లు, ఆఫీసులపై లోకాయుక్త అధికారులు గురువారం ఉదయం నుంచి మెరుపు దాడులు ప్రారంభించారు. బెంగళూరు, మైసూరు, హాసన్‌, మండ్య, గదగ్‌, యాదగిరి, హుబ్లీ, విజయపుర, బాగల్‌కోటే తదితర ప్రాంతాలలో సోదాలు జరిగాయి. దాడుల్లో కోట్లాది రూపాయల డబ్బులు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, ఇళ్లు, పొలాలు, వాహనాలను గుర్తించారు.

రాత్రి వరకూ సోదాలు

● మండ్యలో ఏఈఈ సతీశ్‌ ఆఫీసు, ఇళ్లతో పాటు మొత్తం నాలుగు చోట్ల లోకాయుక్త అధికారులు దాడులు చేశారు. భారీఎత్తున బంగారు నగలు, నగదు, అక్రమాస్తులను కనిపెట్టారు.

● కర్ణాటక రోడ్ల అభివృద్ధి మండలి (కేఆర్‌డీసీఎల్‌) చీఫ్‌ ఇంజనీర్‌ వసంత వాలప్ప నాయక్‌ బాగల్‌కోటే, పరిసర గ్రామాల్లో నివాసం, తల్లి, సోదరుల ఇళ్లపై దాడిచేశారు. లోకాయుక్త అధికారులు వెళ్తే కుటుంబ సభ్యులు గేట్లు మూసివేశారు. కొంతసేపటికి గేట్లు తీశారు. బాగల్‌కోటే పోస్టల్‌ కాలనీలో నాయక్‌ సోదరుడు, ఏఎస్‌ఐ భీమసేన్‌నాయక్‌ ఇంటిలో సోదాలు చేస్తుండగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పాము కనబడింది. లోకాయుక్త అధికారులు పాములు పట్టే వారిని పిలిపించి పామును పట్టించి, రాత్రయ్యేవరకూ సోదాలు కొనసాగించారు.

● బెంగళూరులో సింగనాయకనహళ్లి రైతుసేవా సహకారసం ఘం యలహంక సీఈఓ ఆర్‌.శశిధర్‌ నివాసం, హెబ్బాళ పశువైద్యకాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హెచ్‌సీ ఇంద్రేశ్‌ కార్యాలయం, ఇంటి పై దాడులు నిర్వహించారు.

కొనసాగుతున్న తనిఖీలు

● విజయపుర జిల్లా ఇండి తాలూకా కే.బీ.జే.ఎన్‌.ఎల్‌ జూనియర్‌ ఇంజనీర్‌ పీజీ ప్రకాశ్‌ బెంగళూరు మహాదేవపుర, బీదర్‌ జిల్లా హుమనాబాద్‌లోని ఇళ్లలో తనిఖీలు చేశారు. ఇతని భార్య పేరుతో ఉన్న స్కూల్‌లోనూ సోదాలు జరిగాయి. బెంగళూరులో పలువురు అధికారుల ఇళ్లలో తనిఖీలలో లెక్కలు లేని డబ్బు, ఆస్తులు, బంగారు నగలు లభించాయి. బ్యాంకు ఖాతాలు, లాకర్లను ఇంకా తనిఖీ చేయాల్సి ఉందని, అక్రమ ఆస్తుల విలువ కోట్లలోనే ఉండవచ్చని లోకాయుక్త వర్గాలు తెలిపాయి.

బెంగళూరు సహా రాష్ట్రంలో 10 మంది అధికారుల ఇళ్లలో ఆకస్మిక సోదాలు

తలుపులు తీయకుండా అధికారుల

ఆటంకం

పెద్దమొత్తంలో డబ్బు, బంగారం,

ఆస్తుల గుర్తింపు

గోడలెక్కి ఇంట్లోకి వెళ్లారు

హాసన్‌ రవీంద్రనగరలో కార్పొరేషన్‌ ఏఈఈ సత్యనారాయణ నివాసానికి తెల్లవారుజామున 5:30కు లోకాయుక్త అధికారులు వెళ్లగా, లోపలున్నవారు గేట్లు మూసివేశారు. లైట్లు కూడా ఆఫ్‌ చేశారు. సుమారు అర్ధగంట పాటు తలుపు తట్టినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో అధికారులే తమ జీపును ఇంటి గోడ పక్కన నిలిపి దానిపైకెక్కి మొదటి అంతస్తు ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ సోదాలు చేయగా పెద్దమొత్తంలో నగదు, బంగారుఆభరణాలు, ఆస్తిపత్రాలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement