మండ్య: మండ్య తాలూకాలోని హలగూరు వద్ద చెన్నిపురలో ఉమేష్ అనే వ్యక్తి ఇంట్లో గురువారం ఉదయం వంట గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. మొదట పేలుడు జరిగి ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి, బట్టలు, ఆహార పదార్థాలు తదితర వస్తు సామగ్రి కాలిపోయింది. స్థానికులు వెళ్లి నీళ్లు పోసి మంటలను ఆర్పివేసేందుకు యత్నించారు. తరువాత ఫైర్ సిబ్బంది శ్రమించి ఆర్పివేశారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడకపోయినా ఇంట్లో ఉన్న ఓ పిల్లి చనిపోయింది. ఇనుప పెట్టెలో ఉంచిన పత్రాలు, రూ 25 వేల డబ్బులు ఆహుతైనట్లు బాధితుడు విలపించాడు.


