రాయచూరు రూరల్: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో వరి బస్తాలు దగ్ధం కాగా.. గొర్రెలు మృతి చెందాయి. వివరాలు.. సింధనూరు తాలుకా ముక్కుంద గ్రామంలో శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గొర్రెల షెడ్డుకు నిప్పు అంటుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షెడ్డులో ఉన్న 700 గొర్రెలు మృతి చెందాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు గొర్రెలు పూర్తిగా కాలిపోయి బూడిద అయ్యాయి. 700 గొర్రెలు మృత్యువాత పడటంతో కాపరులు బోరున విలపించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో పట్టణంలోని సుక్కాల పేటలోని వరి బస్తాలు నిల్వ చేసిన గోదాముకు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో 700 వరి బస్తాల ధాన్యం కాలిపోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ వెల్లడించారు.


