గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపుపై కాంగ్రెస్‌ ధర్నా | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపుపై కాంగ్రెస్‌ ధర్నా

Mar 8 2026 7:32 AM | Updated on Mar 8 2026 7:32 AM

శివాజీనగర: ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.60 పెంచిన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ధోరణిని ఖండిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు వినూత్న రీతిలో ధర్నా చేపట్టారు. ఇటీవల దేశంలో చమురు మార్కెట్‌ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను మరోసారి పెంచి, గృహోపయోగ 14.2 కేజీల సిలిండర్‌ ధరను రూ.60, వాణిజ్య వినియోగపు 19 కేజీల సిలిండర్‌ ధరను రూ.115 చొప్పున పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపిందని ఆందోళనకారులు అన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సామాన్య ప్రజలకు ఈ నిర్ణయం భారంగా పరిణమించింది. ఎన్నికలకు ముందు వంటగ్యాస్‌, పెట్రోల్‌ నిత్యవసర వస్తువులను తగ్గించి ఆ తరువాత ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా నడుచుకొంటోందన్నారు. 2014 నుంచి 2025 మధ్య అవధిలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో నిరంతర పెరుగుదలతో సామాన్య కుటుంబాల జీవితం కష్టకరంగా మారిందన్నారు. సబ్సిడీ సదుపాయాన్ని క్రమేణ తగ్గించడం ద్వారా పేద, మధ్య తరగతి వర్గాలపై ప్రభుత్వం ఆర్థిక భారం మోపడం ఖండనీయం అన్నారు. ధర్నాలో కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.మనోహర్‌, మీడియా అధికార ప్రతినిధి ఆనంద్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement