విద్య, విజ్ఞాన, పరిశోధన, ఉపాధి రంగాలకు కేంద్రమైన బెంగళూరు నగరంలో కోటీ 50 లక్షలకుపైగా జనాభా ఉంది. వీరిలో అత్యధికులు విద్యావంతులే. అయితే ఈ నగరంలోనే ఎక్కువగా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. | - | Sakshi
Sakshi News home page

విద్య, విజ్ఞాన, పరిశోధన, ఉపాధి రంగాలకు కేంద్రమైన బెంగళూరు నగరంలో కోటీ 50 లక్షలకుపైగా జనాభా ఉంది. వీరిలో అత్యధికులు విద్యావంతులే. అయితే ఈ నగరంలోనే ఎక్కువగా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి.

Mar 8 2026 7:32 AM | Updated on Mar 8 2026 7:32 AM

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంచన

మొదటి స్థానానికి చేరుకున్న బెంగళూరు

బనశంకరి: దేశంలోని మహానగరాల్లో సైబర్‌ నేరాలు గణనీయంగా పెరిగాయి. 19 మెట్రో నగరాలకు గాను మొత్తం సైబర్‌ నేరాల్లో సగానికి పైగా బెంగళూరు నగరంలో నమోదు కావడంతో సిలికాన్‌ సిటీ దేశంలోనే డిజిటల్‌ క్రైం రాజధానిగా మారుతోంది. ఇతర నగరాలతో పోలిస్తే సిలికాన్‌సిటీ సైబర్‌నేరాల్లో మొదటి స్థానంలోకి చేరుకుంది.

సైబర్‌ కేటుగాళ్ల నయా మోసకార పంథా

నేరగాళ్లు సైతం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని వంచనలకు తెగబడుతున్నారు. ప్రజల డిజిటల్‌ పర్సులోకి చేతులుపెట్టి నగదు దోచేస్తున్నారు. దేశంలో రోజూ సరాసరి 7 వేల సైబర్‌ నేరాలు నమోదవుతున్నాయి. ఇందులో 85 శాతం కేసులు ఆన్‌లైన్‌ ఆర్థిక వంచనకు సంబంధించినవే.

ఉద్యాన నగరే టార్గెట్‌

విద్యావంతులు, ఐటీ, బీటీ ఉద్యోగులకు కేంద్రంగా మారిన బెంగళూరును సైబర్‌ వంచకులు టార్గెట్‌గా ఎంచుకున్నారు. బెంగళూరు నగరంలో నమోదైన మొత్తం నేరాలకుగాను 30 శాతం సైబర్‌ నేరాలు ఉండటం విశేషం. వైట్‌ఫీల్డ్‌ విభాగంలో నమోదవుతున్న మొత్తం నేరాల్లో 40 శాతం సైబర్‌ నేరాలు ఉన్నాయి. పెట్టుబడి వంచనలు, గేమింగ్‌ అప్లికేషన్లు, రుణాలు అందించే అప్లికేషన్లు, ఓటీపీ వంచనలు ఇందులోకి చేరుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ లాభం, అధిక ఆదాయం తీసుకువచ్చే పెట్టుబడులు, వర్క్‌ఫ్రం హోం లాంటి ప్రలోభాలతో వంచనకు తెగబడుతున్నారు.

కోవిడ్‌ నుంచి పెరిగిన సైబర్‌ క్రైం రేట్‌

సైబర్‌ నేరాలు పెరగడానికి ప్రధాన కారణం కోవిడ్‌ మహమ్మారి నియంత్రణకు అమల్లోకి తీసుకువచ్చిన లాక్‌డౌన్‌ చర్యలేనని సైబర్‌నిపుణులు అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ సమయంలో సామాజిక అంతరం కోసం కరెన్సీ నోట్ల వినియోగం తగ్గించాలని, డిజిటల్‌ చెల్లింపులు పెంచాలని, అందుకు యూపీఐ అప్లికేషన్లు వాడాలని ప్రభుత్వం సూచించింది. దీంతో చిన్నపాటి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ప్రస్తుతం డిజిటల్‌ చెల్లింపులు ద్వారా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ పెరగడంతో సైబర్‌ నేరాల వంచకుల ముఠా కూడా విస్తరించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన, సాధారణ బీమా వంచనలు సైబర్‌ వంచకులకు అధిక లాభదాయకంగా మారాయి.

డిజిటల్‌ అరెస్ట్‌

డెబిట్‌, క్రెడిట్‌ వంచన

పార్ట్‌టైమ్‌ ఉద్యోగుల పేరుతో వంచన

వైవాహిక వంచన

ఎగుమతుల వ్యవహారాల్లో ఈ–మెయిల్‌ వంచన

లాటరీ వంచన

ముందస్తు ఫీజు చెల్లింపు పేరుతో వంచన

సిమ్‌క్లోనింగ్‌

ఫిషింగ్‌

సోషల్‌ మీడియా నేరాలు

బహుమతుల ఆశ చూపించే మెసేజ్‌లు

నకిలీ ఉత్పత్తుల సమాచారం

నగదు రెట్టింపు పేరుతో ప్రలోభాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement