లవ్‌ జిహాద్‌ అడ్డుకట్టకు కఠిన చట్టం తేవాలి | - | Sakshi
Sakshi News home page

లవ్‌ జిహాద్‌ అడ్డుకట్టకు కఠిన చట్టం తేవాలి

Mar 6 2026 8:20 AM | Updated on Mar 6 2026 8:20 AM

హుబ్లీ: రాష్ట్రంలో లవ్‌ జిహాద్‌ నివారణకు కఠిన చట్టం అమలు చేయాలని శ్రీరామ సేనా చీఫ్‌ ప్రమోద్‌ ముతాలిక్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన నగరంలో లవ్‌ జిహాద్‌ బాధితులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా ఎందరో యువతులు అదృశ్యం అయ్యారన్నారు. ఇప్పటి వరకు కొందరి ఆచూకీ లభించలేదన్నారు. దేశంలో లవ్‌ జిహద్‌ కేసులు పెరుగుతున్నాయి. కనిపించకుండా పోయిన యువతులు లవ్‌ జిహాద్‌ ఉచ్చులో చిక్కుకున్నారన్నారు. ఇలాంటివి అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెండేళ్ల క్రితం నగరంలోని బీవీబీ కళాశాలలో హత్యకు గురైన నేహా హిరేమఠ తండ్రి నిరంజనయ్య హిరేమఠ మీడియాతో మాట్లాడుతూ లవ్‌ జిహాద్‌ పథకం ప్రకారం జరుగుతోందన్నారు. తన కుమార్తె హంతకుడికి జైలులో రాజభోగాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన కుమార్తె హత్య జరిగి రెండేళ్లు గడిచినా తమ కుటుంబానికి న్యాయం దొరకలేదన్నారు. నిందితుడికే పలువురు కుమ్మక్కును ఇస్తున్నారన్నారు. అందుకే తమ కుమార్తె హత్య కేసును ఎన్‌ఐఏ లేదా సీబీఐకు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement