బళ్లారి అర్బన్: బళ్లారి జిల్లాలోని కురుగోడు పట్టణంలో వెలసిన దొడ్డబసవేశ్వరస్వామి మహారథోత్సవాన్ని గ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 1 గంటకు భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహించారు. దొడ్డబసవేశ్వరస్వామి మహారథాన్ని ఆలయం ముందు ఉన్న ప్రధాన రహదారిలో భక్తుల సమక్షంలో ఎమ్మెల్యే గణేష్ తదితర ప్రజాప్రతినిదులు, ప్రముఖులు, అర్చకులు, భక్తులు లాగి యథాస్థానానికి చేర్చారు. రథోత్సవంతో పాటు స్వామివారిని దర్శించుకునేందుకు బళ్లారితో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జాతర సందర్భంగా భక్తులకు ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
భక్తిశ్రద్ధలతో దొడ్డబసవేశ్వరస్వామి
రథోత్సవం
కురుగోడుకు వేలాదిగా
తరలి వచ్చిన భక్తులు


