జనాభా లెక్కలు పక్కాగా సేకరించాలి | - | Sakshi
Sakshi News home page

జనాభా లెక్కలు పక్కాగా సేకరించాలి

Mar 6 2026 8:20 AM | Updated on Mar 6 2026 8:20 AM

రాయచూరు రూరల్‌ : కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ–2027కు అధికారులు సిద్ధం కావాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌ పేర్కొన్నారు. జెడ్పీ సభా భవనంలో అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా పేర్కొన్న అంశాలను ఆధారంగా చేసుకొని వివిధ గ్రామాల్లో సంచరించి ఇంటింటికెళ్లి సర్వే చేయాలని సూచించారు. రెండు విడతల్లో జనాభా లెక్కల సేకరణ, సమీక్షలు ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళలో సమీక్షించాలని కోరారు. సమావేశంలో ఏఎస్పీ శివానంద, ఏసీ బసవణ్ణప్ప, హంపణ్ణ, రోణ, బసవరాజ్‌, బడిగేర్‌, గురురాజ్‌ సోలంకి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement