వెంకన్న జాతర వేడుక | - | Sakshi
Sakshi News home page

వెంకన్న జాతర వేడుక

Mar 3 2026 7:31 AM | Updated on Mar 3 2026 7:31 AM

బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళి నియోజకవర్గంలోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ అగరలో శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలసిన వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మ రథోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి స్వామివారు సింహ వాహనంపై ఊరేగారు. కళాకారుల నృత్యాలు అలరించాయి.

రైలు పట్టాలపై సిటీ బస్‌ మకాం

ఆనేకల్‌ వద్ద ఆందోళన

బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో ఆనేకల్‌ తాలూకాలోని అత్తిబెలె– ఆనేకల్‌ ప్రధాన రహదారిలోని హల్లెనహళ్లి రైల్వే గేట్‌ వద్ద పట్టాలపై బీఎంటీసీ బస్సు చెడిపోవడంతో ఆందోళన నెలకొంది. సోమవారం అత్తిబెలె నుంచి ఆనేకల్‌కు వెళ్తున్న సిటీ బస్సు సరిగ్గా రైలు పట్టాలపైకి వచ్చి నిలిచిపోయింది. డ్రైవరు ఎంత ప్రయత్నించినా బస్సు స్టార్ట్‌ కాలేదు. దీంతో ప్రయాణికులు భయంతో దిగిపోయారు. ఆ రోడ్డులో ముందు, వెనుక అత్తిబెలె నుంచి కర్పూర్‌ వరకు 2 కి.మీ.లకు పైగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సుమారు 40 నిమిషాల పాటు వాహనదారులు విసుగుతో రోడ్డుపై చిక్కుబడిపోయారు. చివరకు ప్రజలు బస్సును పట్టాల పై నుంచి రోడ్డు మీదకు తోసుకుంటూ వెళ్లడంతో సమస్య పరిష్కారమైంది.

ప్రత్యామ్నాయ మార్గం ఏదీ?

ఇక్కడ వాహన రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఓవర్‌పాస్‌ లేదా అండర్‌పాస్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గం కల్పించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అంబులెన్సులు, అత్యవసర పనిమీద వెళ్లేవారు రైలు వస్తే కనీసం అర్ధగంట నిలిచిపోవాలని తెలిపారు. ఇప్పటికై నా ప్రత్యామ్నాయ రోడ్డు సౌకర్యం నిర్మించాలని స్థానికుడు సునీల్‌ కుమార్‌ తెలిపారు.

సోమేశ్వరాయ నమోస్తుతే

తుమకూరు: తుమకూరు తాలూకాలోని బెల్లావిలో సోమవారం సోమేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం రమణీయంగా జరిగింది. ఎత్తైన అలంకరించిన తేరులో మంగళ వాయిద్యాలతో దేవీ దేవతల విగ్రహాలను ప్రతిష్టించి తేరును లాగారు. ఎమ్మెల్యే బి.సురేష్‌గౌడ, భక్తజనం పాల్గొన్నారు.

షియా ముస్లింల నిరసన

దొడ్డబళ్లాపురం: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతొల్లా ఖమేనీ హత్యకు నిరసనగా షియా ముస్లింలు నిరసన ర్యాలీలు కొనసాగిస్తున్నారు. దొడ్డ పట్టణంలో పాత బస్టాండులో వందలాది మంది ఖమేనీ చిత్రాలను పట్టుకుని పాల్గొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement