బనశంకరి: నేడు (మంగళవారం) చంద్ర గ్రహణం నేపథ్యంలో బెంగళూరులోని ప్రముఖ ఆలయాలలో పూజలు, దర్శన సమయంలో మార్పులు చేశారు. గ్రహణం సమయంలో ఆలయాన్ని మూసివేసి, గ్రహణం వీడిన తరువాత శుద్ధీకరణ, విశేష పూజలు చేస్తామని బనశంకరీ దేవస్థానం అర్చకులు తెలిపారు.
ఏ ఆలయంలో ఎలా..
● సోమేశ్వర ఆలయంలో ఉదయం 11 గంటలకు మూసివేసి బుధవారం ఉదయం 7 గంటలకు తెరుస్తారు.
● కాడు మల్లేశ్వరస్వామి మందిరంలో మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత మూసివేసి సాయంత్రం 7 గంటలకు తెరుస్తారు. వివిధ పూజలు, హోమాలకు ఏర్పాట్లు చేశారు.
● గవి గంగాధరేశ్వర దేవస్థానం మధ్యాహ్నం 12.30 గంటలకు మూసివేసి సాయంత్రం 7.30 గంటలకు మళ్లీ తెరుస్తారు. శుద్ధీకరణ చేసి మూల విరాట్టుకు క్షీరాభిషేకం చేసి, రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.
● నగరంలో రక్త చంద్ర గ్రహణం ఏర్పడుతుందని చూడటానికి అనేకమంది ఏర్పాట్లు చేసుకున్నారు. టెలిస్కోపులు, పెద్ద తెరలను కూడళ్లలో ఏర్పాటు చేయనున్నారు.


