పంచ గ్యారెంటీలతో విద్యుత్‌ శాఖకు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

పంచ గ్యారెంటీలతో విద్యుత్‌ శాఖకు షాక్‌

Mar 3 2026 8:22 AM | Updated on Mar 3 2026 8:22 AM

రాయచూరు రూరల్‌: నగర, గ్రామీణ ప్రాంతాల్లో పంచ గ్యారెంటీల్లో భాగంగా విద్యుత్‌ శాఖ పరిధిలోని నాలుగు ఎస్కాం సంస్థలకు షాక్‌ తగిలింది. సర్కార్‌ అమలు పరిచిన శక్తి పఽథకం తరువాత విద్యుత్‌ శాఖ నిర్వీర్యం అవుతోంది. మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం పేరుతో ఆర్టీసీ నష్టాల బాటలోకి వెళ్లింది. అదే బాటలో ఎస్కాం సంస్థలు పయనిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కి మొదట్లో వ్యతిరేకత చెప్పిన నిపుణుల అభిప్రాయాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించలేదు. బస్సు టికెట్‌ ధరలు ఒకటిన్నర శాతం పెంచిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్కాంలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగులకు పీఎఫ్‌, జీపీఎఫ్‌, ఇంధన వ్యయం, గ్రాచ్యుటీ, వేతన బకాయిలు, ఇతరత్ర కలిపి రూ.2,850 కోట్ల మేర నష్టాల బాటలో సంస్థలున్నాయి. కర్ణాటక విద్యుత్‌ రెగ్యులేటరీ కమిటీ(కేఈఆర్‌సీ) నివేదిక ఆధారంగా మూడేళ్ల పాటు వరుసగా 2026లో 67, 2027లో 75, 2028లో 91 పైసల చొప్పున పెంచాలని నిర్ణయం తీసుకుంది. 2025లో కేఈఆర్‌సీ నివేదిక సంస్థ మెస్కాం, బెస్కాం, హెస్కాం, జెస్కాంలలో 20 శాతం విద్యుత్‌ చార్జీలు పెంచడానికి అనుమతి కోరారు. 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని కేఈఆర్‌సీ నివేదికను జారీ చేయాలని సిద్ధమైనట్లు సమాచారం.

నష్టాల ఊబిలో కూరుకున్న ఎస్కాంలు

చార్జీలు పెంచినా తగ్గని నష్టం

రెండో గ్యారంటీకి విద్యుత్‌ శాఖ

విద్యుత్‌ చార్జీల మోతకు సిద్ధం

మూడేళ్లు వరుసగా 67, 75, 91 పైసల పెంపుదల

కేఈఆర్‌సీ నివేదిక కోసం ఎదురు చూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement