● రాష్ట్ర ఆదాయం, ఖర్చుల
కేటాయింపుల సమాచారం
దొడ్డబళ్లాపురం: రూ.4.48 లక్షల కోట్లతో 2026–27 వార్షిక బడ్జెట్ ను ముఖ్యమంత్రి స్ధిరామయ్య ప్రవేశపెట్టారు. ప్రజలపై వేసే పన్నుల ద్వారానే సర్కారుకు అధిక ఆదాయ చేకూరుతోందని తేలింది. ఆదాయ, వ్యయ మార్గాలు ఎలా ఉన్నాయంటే...
ఆదాయం ఎలా వస్తుంది (పైసల్లో)...
● రాష్ట్ర పన్నేతర ఆదాయం– 4 పైసలు
● రాష్ట్ర పన్నుల ఆదాయం– 49
● పెట్టుబడులు జమ, అప్పులు– 29
● కేంద్ర పన్నుల ఆదాయం– 14
● కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు– 4
ఇలా ఖర్చవుతుంది..
● రుణాల చెల్లింపులు– 20 పైసలు
● సంక్షేమ కార్యక్రమాలు – 15
● ఇతర ఆర్థిక సేవలు– 14
● వ్యవసాయం,నీటి పారుదల,
గ్రామీణాభివృద్ధి– 13
● విద్యారంగం – 10
● ఆరోగ్యం– 4
● నీటి సరఫరా, పారిశుధ్యం– 3
● ఇతర సామాజిక సేవలకు–21
3:40 గంటలు సీఎం ప్రసంగం
శివాజీనగర: 3 గంటల 40 నిమిషాల పాటు సీఎం సిద్దరామయ్య బడ్జెట్ ప్రసంగం సాగింది. వచనకారిణి అక్కమ్మ ప్రవచనంతో ఆరంభించారు. డా.అంబేడ్కర్ సహా పలువురు ప్రముఖ కవుల వ్యాఖ్యలను కూడా ప్రసంగంలో ప్రస్తావించారు.
గ్యారంటీ స్కీములకు..
దొడ్డబళ్లాపురం: పంచ గ్యారంటీ సంక్షేమ పథకాలకు బడ్జెట్లో సాధారణంగానే నిధులను ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధి, జన సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చానని సీఎం చెప్పారు. గృహలక్ష్మి పథకానికి రూ.28,608 కోట్లు, అన్నభాగ్యకు రూ.6,200 కోట్లు, గృహజ్యోతికి రూ.10,578 కోట్లు, మహిళల ఉచిత బస్సు పథకానికి రూ.5,300 కోట్లు కేటాయించారు. అయితే యువనిధి పథకానికి ఏమీ మంజూరు చేయలేదు.


