అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు

Mar 8 2026 7:54 AM | Updated on Mar 8 2026 7:54 AM

బళ్లారి అర్బన్‌: దేశంలో 1500లకు పైగా మానవ హక్కుల సంస్థలు ఉన్నప్పటికీ వాటిలో దక్షిణ ఆసియా మానవ హక్కుల వేదిక ప్రజా సమస్యలకు స్పందిస్తూ పని చేసే ప్రజాపర సంస్థగా నిలుస్తోందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు ఎల్‌సార్‌ బాబు తెలిపారు. శుక్రవారం బళ్లారి నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంస్థ భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలో నమోదు చేయబడిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా సుమారు 80 వేల మందికి పైగా సభ్యులతో ఈ వేదిక పెద్ద స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. సమాజంలోని బలహీన వర్గాలు, అన్యాయానికి గురైన ప్రజలకు న్యాయం అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యలకు స్పందిస్తూ బాధితుల తరఫున చట్టబద్ధంగా పోరాడుతామన్నారు. సంస్థ పేరును దుర్వినియోగం చేయడం లేదా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే సభ్యులపై ఫిర్యాదు అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుని సంస్థ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వలిపీర్‌, నాగప్ప, దూద్‌బాషా, నవీన్‌, మహమ్మద్‌బాషా, మడివాల హుస్సేనప్ప, నవాజ్‌, అమీనా, సుజాత, పద్మావతి, హులిగెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement