నాసిరకం పనులు.. గట్లకు బీటలు | - | Sakshi
Sakshi News home page

నాసిరకం పనులు.. గట్లకు బీటలు

Mar 6 2026 8:20 AM | Updated on Mar 6 2026 8:20 AM

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువ మరమ్మతు పనులు నాసిరకంగా చేపట్టడంతో కాలువ గట్లకు వేసిన సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌పై పగుళ్లు ఏర్పడ్డాయి. కొప్పళ జిల్లా కారటిగి తాలూకాలోని మైలాపుర వద్ద చేపట్టిన పనుల్లో పూర్తి స్థాయిలో నాణ్యత కొరవడింది. కాలువ మరమ్మతు పనుల్లో కింది భాగంలో కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో తుంగభద్ర ఎడమ కాలువ గట్లకు పగుళ్లు ఏర్పడినట్లు కర్ణాటక ప్రాంత రైతు సంఘం నేత సుందర్‌రాజ్‌ తెలిపారు. ఆయన పగుళ్లు ఏర్పడిన కాలువ గట్ల పనులను పరిశీలించి మాట్లాడారు. రూ.2.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 4.6 కి.మీ.పనులను నాసిరకంగా చేశారని ఆరోపించారు. ఈ నేపఽథ్యంలో రైతులు కాలువ కింది భాగంలో చేతులతో పెకలించగానే సిమెంట్‌ కాంక్రీట్‌ పెచ్చులూడి పైకి వచ్చిందన్నారు. సంబంధిత శాఖ ఇంజనీర్లను పిలిచి పనుల తీరుపై ఆరా తీశామన్నారు. నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకోవడం, కాంట్రాక్టర్లు తప్పించుకోవడం తగదన్నారు. బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

ఎడమ కాలువకు పగుళ్లు

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement