హొసపేటె/రాయచూరు రూరల్: హోలీ పండుగ సందర్భంగా నదిలో స్నానం చేయడానికి వెళ్లిన ముగ్గురు యువకులు బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు తుంగభద్ర నదిలో మునిగిపోయారు. వారిలో ఒకరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన కొప్పళ జిల్లా గంగావతి తాలూకా సణాపురలోని వైట్ సాండ్ గెస్ట్ హౌస్ వెనుక ఉన్న తుంగభద్ర నదిలో జరిగింది. మరణించిన యువకులను గంగావతిలోని గాంధీనగర్ నివాసితులైన సూర్య(17), అభిషేక్ (17)గా గుర్తించారు. హోలీ పండుగ తర్వాత గంగావతి తాలూకాలోని సణాపురలోని వైట్ సాండ్ హోటల్ వెనుక ఉన్న తుంగభద్ర నదిలో కాలు జారిపడి మరణించిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. భోజనం చేసిన తర్వాత స్నానానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. స్థానిక ఈతగాళ్లు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, యువకులు నాటు పడవను ఉపయోగించి మూడు గంటలకు పైగా నిరంతర గాలింపు తర్వాత మృతదేహాలను వెలికి తీశారు. ఈ విషయంపై గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


