హొసపేటె: ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాలని గరగ నాగలపురలోని శ్రీగురు ఒప్పటేశ్వర స్వామి మఠం అధిపతి నిరంజన ప్రభు మహాస్వామి సూచించారు. శనివారం హొసపేటె తాలూకా హరువనహళ్లిలో గ్రామ దేవత ఊరమ్మ దేవి ఆలయ కొత్త భవనం, గోపుర కలశస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నిరంజన ప్రభు మహాస్వామి మాట్లాడుతూ.. గ్రామస్తులు కుల, పార్టీ బేధాలు మరచిపోయి ఐక్యమత్యంతో ఊరమ్మ దేవి ఆలయాన్ని నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. మీ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. మరియమ్మనహళ్లి గురుపాద దేవర మఠం మల్లికార్జున శివాచార్య స్వామిజీ ద్వి సన్నిధి నిర్వహించారు. గణపతి వాస్తు, రక్తోపన, నవగ్రహ దుర్గా, కలశ ప్రతిష్ఠాప నేగాలు, శాంతి వాస, జలధి వాస, ధ్యానదివాస, తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రతిష్ఠాపన హోమం, దుర్గా హోమం, దిగ్గలి గోపుర సంరక్షణ, శుద్ధ బలి పూర్ణహుతి, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో పి.ఓబప్ప, తమ్మజ్జ, బోసప్ప, శరణప్ప, వీరేశ్వర స్వామి, కృష్ణమూర్తి, హోసూరు వెంకటేష్, రామప్ప, మరగడప్ప, బొమ్మప్ప, శరణప్ప, గొల్లర చంద్రప్ప, నాగరాజ్, సోమన్న, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


