సాక్షి,బళ్లారి: దుబాయ్‌లో వివిధ పర్యాటక స్థలాలను వీక్షించేందుకు బళ్లారి నుంచి వెళ్లిన పర్యాటకులు అక్కడే చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడి ఎట్టకేలకు సురక్షితంగా బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. దాదాపు 50 మంది బళ్లారి వాసులు ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలోని ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా భీకర దాడులు, ఆ దేశాధినేత హత్య నేపథ్యంలో అంతర్జాతీయ విమానయానాలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో దుబాయ్‌లో ఉండేందుకు అన్ని విధాలుగా ఇబ్బందులు నెలకొన్నాయి. లాడ్జీలు, హోటళ్లలో అధిక ధరలు పెంచడంతో పాటు యుద్ధం తీవ్రం కావడంతో వారం రోజుల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన బళ్లారితో పాటు చిత్రదుర్గ తదితర జిల్లాకు చెందిన పర్యాటకులను సురక్షితంగా బెంగళూరు విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. విమానంలో నుంచి దిగిన బళ్లారితో పాటు చుట్టుపక్కల జిల్లా వాసులకు మాజీ మంత్రి బీ.నాగేంద్ర స్వాగతం పలికారు. తమ కష్టాలను, బాధలను తెలియజేసిన వెంటనే ప్రభుత్వం స్పందించి తమను భారత్‌కు తీసుకు రావడం సంతోషంగా ఉందన్నారు.ఈ ఘటనతో విదేశీ ప్రయాణాలు ఒక్కోసారి ఎంత క్లిష్టతరం అవుతాయో మరోసారి రుజువైంది.
బెంగళూరు విమానాశ్రయంలో దిగిన కర్ణాటక వాసులు
అందరికీ స్వాగతం పలికిన మాజీ మంత్రి బీ.నాగేంద్ర


